Showing posts with label హాస్యం. Show all posts
Showing posts with label హాస్యం. Show all posts

Nov 16, 2017

బ్లాగు పాఠశాల - మొదటిభాగం

ఉపోద్ఘాతం:


"గుడ్ మాణింగ్ సర్!"
"గుడ్ మాణింగ్రా బ్లాగుపిల్లలూ, ఏమిటీ విశేషాలూ?"
"ఏమీ లేవండీ, అంతా మామూలే, రాసుకునేవాళ్ళు రాసుకుంటున్నారు, కొట్టుకునేవాళ్ళు కొట్టుకుంటున్నారూ!"
"సరే, సరే! పుస్తకాలు తియ్యండి, పాఠం మొదలెడదాం"
"పుస్తకాలేంటీ సార్? ఫేసుబుక్కా?"
"అదే, అదే! మీ బ్లాగులు తెఱవండి"
"ఏమిటయ్యా బాబీ నానీ, మొదటిబెంచిలో కూర్చుని నిద్రపోతున్నావ్?"
"వారికంతా తెలుసు సారూ! నా అక్షరారణ్యంతో వారికి పనిలేదు"
"నేనడిగిన ప్రశ్నేమిటీ, నువ్వు ఇచ్చిన సమాధానమేమిటీ? సర్లే కూర్చో. ఏమయ్యా కదిరి సురేషూ. లేవండీ! మేల్కొనండీ!! ఏనుగు సన్నివేశాన్ని చూడండీ!!! అంటూ అలా గోల చెయ్యకపోతే, కాస్త ఆ పడుకునేవాళ్ళని లేపచ్చుగా?"
"అయ్యా! నాదొక ధర్మసందేహం"
"ఎవరూ? శ్యామలరావే? అడుగు అడుగు"
"లంకపైన పడిన తోకనిస్తే ఎవరికైనా చాకిరేవు పెట్టచ్చా?"
"అబ్బే ఆ తోక తెలుగుదేశానికి చెందిన తోకైతే అస్సలు కుదరదు. ఈ విషయంలో మన శోధిని శ్రీనివాస్ ఇచ్చిన షోకాస్ నోటీసు కూడా ఏమీ పనిచెయ్యలేదు"
"మేస్టారూ, మీ దినఫలం అస్సలు బాలేదు"
"ఎవరూ? మేధా దక్షిణామూర్తా? నీ వారఫలాలు క్లేసయ్యాక చూస్కుందాం గానీ ముందు నిశ్శబ్దంగా ఉండవయ్యా!"
"బాబూ కంది శంకరయ్యా! ఏంచేస్తున్నావ్ తలొంచుకుని?"
"అదీ .. అదీ ... దొర అప్పిచ్చిన డబ్బుకు వడ్డీ లెక్కలు కడుతున్నా సారూ!"
"ఆ చేసేదేదో గద్యరూపంలో చెయ్యచ్చుగా! ఇప్పుడు చూడూ - నీ అలవాటు జిలేబీకి అబ్బి ఎక్కడ పడితే అక్కడ పద్యాలు వెదజల్లుతోంది. ఆ అలవాటిప్పుడు హరిబాబుకు కూడా అంటుకుంది"
"దొరబాబచటన్ వెడలిరి పరుగుల అప్పులకొరకట వడ్డీ లేకన్"
"అమ్మా! తల్లీ! జిలేబీ!! శాంతించు. నీ పద్యఘాయిత్యాన్ని తట్టుకోలేక అమేరికాలో జనాలు కాల్పులకు పాల్బడుతున్నారు. ఇరాన్లో భూకంపం వచ్చింది. బంగాళాఖాతంలో తుఫానొచ్చింది"
"చెల్లియో .. అక్కయో .... చెల్లకో ... పిల్లకో!"
"ఏమయ్యా హరిబాబూ, ఇది కూడా పద్యమేనా?"
"ఇది పద్యం కాదనడానికి మీదగ్గర ఆధారాలున్నాయా మేస్టారూ?"
 "నా దగ్గర వంద ఉన్నాయి మేస్టారూ!"
"ఎవరయ్యా నువ్వు? ఊరూ పేరూ లేకుండా ఊడిపడ్డావ్?"
"నేను అసలు సిసలు భారతీయుణ్ణి సార్! ఐ యాం ఏ రియల్ ఇండియన్"
"సరే అవేవో ఆ హరిబాబుకు చూపించు మరి"
"కుదరదు సార్. ఆ హరిబాబు తన బెంచి మీదున్న అంక్షలని ఎత్తేసి నన్ను తన పక్కన కూర్చోబెట్టుకుంటేనే ఇస్తా. లెకపోతే నేనివ్వ!"
"ఇదెక్కడిగోలరా బాబూ? సరే కూర్చో. నాయనా శ్రీరాం నువ్వేంచేస్తున్నావక్కడ?"
"మన భారతీయతత్వం గురించిన హైపర్ లింకులు జనాలకి సప్లై చేస్తున్న సారూ!"
"సార్! ఈ హరిబాబూ, శ్రీరాంలు ఇలాగే ప్రవర్తిస్తే నాలాంటి రియల్ ఇండియన్ కి ఎక్కడో మండుతుంది. వీళ్ళని సెక్షన్ 007 కింద బొక్కలోకి తోయిస్తా ఖబడ్దార్!"
"ఏమిటయ్యా హరిబాబూ ఈ గోల?"
"మీరుండండి సార్. దీనికి మూల కారణం అదిగో అక్కడున్న అహ్మద్ చౌదరే. తన పుస్తకంలో మన మతం గురించి బూతులు వ్రాస్తున్నాడు. దాని గురించి తిడితే ఇదిగో ఈ ఇండియన్ ని రెచ్చగొడుతున్నాడు"
"ఏమయ్యా చౌదరీ నిజమేనా?"
"అయ్యో అంతా అబద్ధం సార్!  నాకు ఈ వ్యవసాయంతోనూ, బంకుతోనూ, ఫేక్టరీతోనూ సమయం గడిచిపోయి ఈ క్లాసులకి రావడానికి టైమే ఉండదు. ఇక ఇలాంటి పనులు కూడా ఎందుకు చేయిస్తా? కానీ ఎక్కువ మాట్లాడితే ఈ హరిబాబు మక్కెలిరగదన్నిస్తా!"
"చౌదరీ! ఈ హరిబాబు సంగతి నీకు తెలియదు. నాదసలే చెన్నై ఫీడు. నువ్వు నన్నేం పీకలేవ్. నేను రాజకీయల్లోకొచ్చి నీకు చిప్పకూడు తినిపిస్తా. నీ పుస్తకం కాపీ అల్రెడీ ఒకటి సంపాదించా.. ఏమనుకుంటున్నావ్ నాగురించి?"
"ఆపండేహే మీ సుత్తి గోలలు! వీధికూళాయి పోట్లాటల్ని ఇంటర్నేషనల్ ప్రాబ్లంస్ చేస్తున్నారు"
"హమ్మయ్య. ఆపమని ఒక్కడన్నాడు ఇప్పటికి. ఎవరు బాబూ నువ్వు? ఎప్పుడూ చూడలేదు నిన్ను?"
"నా పేరు కేతన్ సార్. అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటా. అసలు ఈ స్థితికి కారణం అదిగో ఆ లాస్ట్ బెంచిలో కూర్చుని అందరికేసీ సైలెంటుగా చూస్తున్న ఆ మలక్పేట రౌడీగాడే. వాడొక పక్కా అవకాశవాది!"
"రౌడీనా? ఎక్కడా?"
"ఇక్కడ సర్!"
"వార్నీ! ఏళ్ళ తరబడి ఆ ఫేసుబుక్కు మోజులో పడి క్లాసులెగ్గొట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చావా?"
"నా అంతట నేను రాలేదు సార్! ఎవరో పిలిస్తే చూసిపోదామనొచ్చా!"
"మా నాయనే! అఘోరించావ్. ఇంతకీ మన రమ్యమైన కుటీరమేదీ?"
"ఆ రౌడీగాడు దాన్ని పీకి పందిరేశాడు సార్!"
"అబ్బా! సరే! అక్కడేంటి జనాలు గుమికూడారూ?"
"పద్మార్పిత వ్రాసిన లేటెస్టు శృంగారభరిత ప్రేమకవితను ఒక డజన్ మంది ఆస్వాదిస్తునారు సార్!"
"అయ్యో అయ్యో! ఇంతకీ ఆలోచనా తరంగాలు ఎలా ఉన్నాయ్?"
"అప్సరసల కోసం పరితపిస్తున్నాయండీ"
"అయ్యబాబోయ్, వద్దులే!"
"సార్! ఈ హరిబాబు మళ్ళీ మొదలెట్టాడండీ"
"లేదు సార్! తప్పంతా ఈ అహ్మద్ దే!"
"ఆపండిరా నాయనలారా! ఆపండి మీ గోల! ఏమయ్యా కొండల్రావ్! నీ ప్రశ్నలూ జవాబులూ ఎక్కడిదాకా వచ్చాయ్?"
"సార్! పల్లెప్రపంచం ముక్కల పులుసులో బెల్లం వెయ్యాలా? పంచదార వెయ్యాలా?"
"ఖర్మరా బాబూ! ఖర్మ!"
"పిలిచారా మేష్టారూ?"
"ఎవరూ?"
"నేనండీ కష్టే ఫలిని"
"హతోస్మీ!!"

(సశేషం) 
  

Jun 24, 2011

ప్రపీసస సూపర్ తిట్లు - సూపర్ హిట్లు

ప్రపీసస లో మన మార్తాండాన్ని తిట్టిన తిట్లు ఎంత పాప్యులర్ అయ్యాయంటే - బ్లాగుల గురించి తెలియనివాళ్ళు కూడా వీటిని తమ స్నేహితులకు ఈ మెయిల్ లో పంపుకునేటంత :)

మచ్చుకి కొన్ని (Copy pasted them as they are)



కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా …

ATM లో PAN card పెట్టే తింగరి సన్నాసి….

AC కోసం ATM కి వెళ్లి బాలన్స్ enquire చేసే కక్కుర్తి ఎదవ…

108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ

రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.

తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా

బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల

కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల

నల్ల cooling glass వేసుకుని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన మసాలాదోసను అమావాస్య రోజు current పోయిన Time లో తినే కక్కుర్తి యెదవ.

విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ

Sunday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.

కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి

శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా..

అక్షయపాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతినే వెదవ

అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్….

Aquarium లో చేపలు పట్టే ఫేసూ..

ఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..

నువ్వు బీడు బడిన బ్లేడ్*రా.

సగం కంపైల్ అయిన కోడ్* గాడివి

రాబందు రెట్టవి, బొద్దింక క్లేసానివి

ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.

లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.

మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం

చీపురు కూడా చీప్*ది కొనే చప్రాసెదవ.

ఆకలికి పురుగుల మందులో చెక్కర వేసుకొని తాగే మొహం

మంచు కరిగించి మంచి నీళ్ళని అమ్మే వెధవ మొహం

ఐ-మాక్స్ సినిమాకు బైనోకులర్స్ పట్టుకెళ్ళే బేఖూఫ్ ఎదవ.

కట్టింగ్ షాప్*లో కత్తెర దొంగిలించే ఫేసు.

పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.

రాగి సంగటి అంటే రాగి తీగలతో చేస్తారని అనుకునే మొహం

పుచ్చిపోయిన వంకాయలతో గుత్తొంకాయ కూర చేసుకుని తినే మొహం

అరోగ్య శ్రీ యాడ్*ను పైరసీ చేసి అమ్మే అరమైండ్ ఎదవ.

youtubeలో నంది పైపులు, tubeలు వెతికే మొహం.

తుఫానులో తువాలు పొయిందని ఫీల్ అయ్యే తుప్రాసెదవ.

కలలో కలాంను కలవరించే కలర్ బ్లైండ్*నెస్ ఫెలొ.

TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.

బొచ్చు పీకిన ఎలుగు బంటి లా వున్నావ్.

వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.

సత్తు సామానోడికి సాఫ్ట్*వేర్ అమ్మాలనుకునే మొహం.

తేనెపట్టుని చుట్టబెట్టుకుని తట్టబుట్ట పట్టుకుని పెట్టతో చట్టాపట్టాలేసుని చుట్టుపక్కలా తిరిగే బెట్టుయెదవ

పప్పు లొ ఉప్పేసుకుని కప్పు లో తాగే కంపునాయాల

పిల్లల ఎదురుగా పీచుమిటాయి తింటూ చంకలు గుద్దుకునే

ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి గోచీ కట్టుకువచ్చే

నిత్యని చూస్తూ నిర్మలమ్మ ని కలగనే దౌర్భాగ్యుడు

శవాలకి మేకప్పేసే వాడి మొహం

శవం పాత్రలకి డబ్బింగ్ చెబుదామనుకునే చచ్చు సన్నాసి

చీమలు చీమిడి వేసిన మొహం

Feb 2, 2011

కన్ఫ్యూషన్ అంటే ఇదీ! :))

ఒక Chinese restaurantకి ఫోన్ చేసి order ఇవ్వండి.

వెంటనే ఒక ఇండియన్ restaurant కి ఫోన్ చేసి వాళ్ళకి తెలియకుండా ముందు call చేసిన చైనీస్ కి కలిపి వాళ్ళని ఓర్డర్ రిపీట్ చెయ్యమనండి (మీరు సైలెంట్ గా ఉమండి) - పరిస్థితి ఎలా ఉంటుంది? ఇద్దరు మార్తాండలు ఒకడితో ఒకడు మాట్లాడుకుంటునట్టుండదూ?


ఇది వినండి మీకే అర్థమవుతుంది.



Sep 21, 2010

పధ్నాలుగవ నెంబరు ప్రమాద సూచిక: ఇందుకూ! ఈమిటీ!! ఇలా!!!

.
.
.
.


ప్రమాదవనంలోకి మళ్ళీ తొంగిచూస్తున్న వీక్షకులకి కెలికాస్కారం.

ఈసారి మన ఘోస్టు ఆర్కేన్సా అలివేలు గారు.

రౌడీ: అలివేలుగారూ నమస్కారం

అలివేలు: నమస్తే రౌడీ! వీక్షకులారా ఈసారి మన గెస్టు వియన్నా వీక్షణ్ గారు. నమస్తే వీక్షణ్ గారూ

వీక్షణ్: వా! వా!! వా!!

రౌడీ: ఈయనెవడు, నమస్తే చెప్తే ఏడుస్తున్నాడు?

అలివేలు: ఈయనంతేలే, కాస్త బ్లాగుల్లో పెద్దరికం పోయినదగ్గరనుండీ, ఈ ఏడుపు.

వీక్షణ్: అదేమీ కాదు, ఇప్పటికీ నేను పెద్దనే. చాకులాంటి వాడిని. ఈ ఏడుపంతా నువ్వు మాట్లాడీన బూతు గురించి.

అలివేలు: బూతా?

వీక్షణ్: అవును బూతే

అలివేలు: నేను నమస్తే అనే కదా అంది?

వీక్షణ్: అది బుతే

రౌడీ: నమస్తే అంటే బూతా? ఇంతకీ మీ దృష్టిలో బూతంటే ఏమిటో చెప్తారా?

వీక్షణ్: తెలియదా?

రౌడీ: తెలియదు - మీరే చెప్పండి!

వీక్షణ్: ఉప్పంటే ఏమిటో తెలుసు, కుక్కంటే ఏమిటో తెలుసు, బూతంటే ఏంఈటో తెలియదా?

రౌడీ (అలివేలు చెవిలో): ఈయన పేరు వీక్షణేనా లేకపొటే మార్తాండా?

అలివేలు (రౌడీ చెవిలో): వీక్షణే, కాకపోతే కాస్త సహవాస దోషం అంటే

రౌడీ: సరే వీక్షణ్ గారూ, ఉప్పుకి, కుక్కకి, బూతుకి లింకేమిటో చెప్తారా?

వీక్షణ్: ఎవడైనా ఉప్పు, కుక్క అంటే డెఫినిషన్ అడుగుతారా?

రౌడీ: సైన్స్ తెలిసిన ఎవడైనా అడుగుతాడు, మరి సినిమా వాళ్ళు అడగరేమో

వీక్షణ్: మీ అభిజాత్యం చాలు. ఉప్పంటే తెలియదు అనడం బ్రాహ్మినికల్ ఏటిట్యూడ్. ఇది మాత్రం డిఫైన్ చెయ్యమని అడగద్దు నాకే తెలీదు

అలివేలు: సరే సరే డిస్కషన్ లోకి వద్దాం. మీకు ఏడుపు వీక్షణం అని పేరెందుకొచ్చింది?

విఖ్షణ్: అదంతా ప్రతిపక్షాల కుట్ర.

అలివేలు: సరే, సరే తరువాయి ప్రశ్న

ట్రింగ్ ట్రింగ్

వీక్షణ్: ఒక్క నిముషం, ఫోన్ వస్తోంది, ఏదైనా ప్రైవేట్ రూముందా?

రౌడీ: అదిగో అక్కడ

వీక్షణ్: (లోపలి కెళ్ళి ఫోను తీసి) వా వా వా

అలివేలు: రౌడీ, రూములో మైకులేమన్నా పెట్టావేంటి? అంతా వినిపిస్తోంది ఏడుపుతో సహా?

రౌడీ: మైకులేమీ లేవు - గ్లేస్ డోర్లు కదా, మనవాడు తలుపేసుకోవడం మర్చిపోయాడు

అలివేలు: అరే అవతలవాడి వాయిస్ కూడా వినిపిస్తోందే?

రౌడీ: అదే మరి, హెడ్ సెట్ పెట్టుకుని రెండొవైపు ఫోనుకి తగిలించడం మర్చిపోయాడు.

అలివేలు: మరి మకనెలా వినిపిస్తోంది?

రౌడీ: ఆ ఏముంది, మనవాడు ఖంగారులో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఉంటాడు

అలివేలు: అంటే, స్పీకర్ ఆన్ చేసి, హెడ్ ఫోన్లు చెవిలో పెట్టుకుని, వాటిని కనెక్ట్ చెయ్యకపోగా, తలుపు కూడ వేసుకోలేదంటావా. ఓరి దేవుడోయ్, వీడు మామూలు మనిషి కాదురోయ్

రౌడీ: మామూలు మనిషి కాదు, మార్తాండకి గురువు

అలివేలు: ములిగన్ కి అరువు, మార్తాండకి గురువు!

రౌడీ: ష్! అవతల ఏదో తెలిసిన గొంతులా ఉంది. విను

ఫోనులో గొంతు: గురువా, మనమే కొత్త కాగడ బ్లాగు తెరిచామన్న సంగతి లోలూ కి తెలిసిపోయిందన్నా

వీక్షణ్: అదెలా? చాలా పకడ్బందీగా చేసామే?

ఫోనులో: రెస్టొర్ చేసేడప్పుడు ఏదో క్లూ వదిలేసావన్నా.

వీక్షణ్: సరే సరే. ఇప్పుడేం చెద్దాం? ఆ కాగడ బ్లాగు ఝలక్ స్టైల్ లో రాసి ఝలకిద్దామనుకున్నానే,

అలసు "ఎందుకు" అలా జరిగింది?
ఇప్పుడు "ఏమిటి" గత్యంతరం
మనం "ఎలా" తప్పుకోవాలి?

ఫోనులో: నీ జిమ్మడ, నువ్వేదో ఐడీయా ఇస్తావనుకుంటే, మొత్తం విషయాన్ని కంపు చేసింది కాక నన్నే సలహా అడుగుతున్నావా?

అలివేలు: రౌడీ, తుట్రవ్యూ కన్నా, ఇదే కాస్త ఇంటరెస్టింగ్ గా ఉంది. మన వీక్షకుల లైన్ కి కలిపెయ్యమంటావా?

రౌడీ: కెలకడమే మన పని కలిపెయ్యి :))

ఫోనులో: సరే ఒక మంచి న్యూసు మనకి. భరత్ కి ఝలక్ కీ గొడవయ్యింది

వీక్షణ్: అవునా భలే భలే. మనకి చాన్స్ దొరికింది. గొడవ దేనిమీద?

ఫోనులో: మన డుపు కాగడా బ్లాగు మీదే.

వీక్షణ్: అవునా, ఏమిటి?

ఫోనులో: కాగడాది ఎందుకు కలిపావ్, నాది ఎందుకు కలపేల్దు అని భరత్ గొడవ. దానికి ఏ సెర్టిఫికేట్ లేదు, దీనికి ఉంది అని ఝలక్ సమాధానం.

వీక్షణ్: మరి ఏ లేకుండా బూతులు రాస్తేనో?

ఫోనులో: దానికేమి అభ్యంతరం లేదు. బూతుని నిర్వచించడం మా వల్ల కాదు, బ్లాగర్ పాలసీనే పెట్టుకున్నాం. మీకు నచ్చకపోతే మీరే చెప్పండి, మారుస్తాం అంటున్నాడు

వీక్షణ్: అబ్బా, గోల్డెన్ చాన్సు. కాగడాది బూతు అని చెప్పెయ్యి. దెబ్బకి ఝలక్ కి రంగు పడుతుంది.

ఫోనులో: కానీ అన్నాయ్, ఈ కొత్త కాగడ మన బ్లాగే కదా

వీక్షణ్: ఏమీ ఫరవాలేదు, అది పెట్టిందే ఝలక్ కోసం. కాగడా ది బూతు అని డిక్లేర్ చెశెయ్యి

ఫోనులో: ఎందుకైనా మంచిది, భరత్ ని లైనులోకి లాగుదాం. కలుపుతా ఉండు. హలో భరత్?

భరత్: యెస్. దిస్ ఈస్ భరత్.

వీక్షణ్: మేము నీకు హెల్ప్ చెయ్యాలనుకుంటున్నాం

భరత్: తప్పకుండా

వీక్షణ్: డూపు కాగడ మాదే. కానీ ఇంకా పోస్టులు లేవు ఎక్కువ. కాగడా ఉన్నప్పుడు నీదెందుకు ఉండకూడదుఇ అని గొడవ చేస్తా

భరత్: బాగానే ఉంది గానీ, "మేము బ్లాగర్ పాలసీ ఫాలో అవుతున్నాం, అది ఇష్టం లేకపోతే బూతుని డిఫైన్ చెయ్యండి" అంటున్నడే?

వీక్షణ్: అదేముంది? కాగడా వాడిన పదాలు బూతు అని క్లేసిఫై చేసేద్దాం. దెబ్బకి ఝలక్ ఔట్!

భరత్: నీ బొందలా ఉంది సలహా. కాగడా బూతు అని డిసైడ్ చేస్తే వాళ్ళకేమీ నష్టం లేదు. రెండు నిముషాల్లో కాగడా బ్లాగు పీకుతారు. కాని దానితో పాటు నా భరత్ కాలం బ్లాగుకూడా పీకాలి అప్పుడు.

వీక్షణ్: ఎందుకు?

భరత్: మరదే, కాగడ డబల్ మీనింగులకి నా డైరెక్ట్ మీనింగులకీ పెద్దగా తేడా లేదు కదా. సినీమాల్లో డబల్ మీనింగ్ సినీమాని తిట్టుకోవడం తప్పా ఏమి చెయ్యలేం, అదే ఏ సర్టిఫికేట్ అయితే కొన్ని నిబంధనలు పెట్టచ్చు. అలగే ఇదీను.

ఇప్పుడు నేణు బూతుని డిఫైన్ చేస్తే నాకే తిరిగి తగుల్తుంది. అందుకే చెయ్యను. బై!



ఫోనులో: అన్నా, ఇది కూడ వర్కవుట్ అవ్వలేదే.

వీక్షణ్: మార్తాండ బ్లాగు, కాగడా బ్లాగూ, అమ్మ ఒడి బ్లాగు కూడా తీసెయ్యాలని గోల చేసినప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్చ గుర్తు రాదు మనవాడికి. తీరా అది రివర్సు తగులుకునేసరికి కుయ్యో మొఱ్ఱోమని గోల. అయినా మన అవసరం కదా, ఏమీ అనద్దులే

సరే ఈ ఫోనుని మన ఫ్రెండు గుంపుకి కలుపు

ఫోనులో: సరే కలిపా

వీక్షణ్: వా వా -- సారీ సారీ ప్రజలారా. మాలికలో ప్రజాస్వామ్యం లేదు. బ్లాగు బాబ్జీ బ్లాగును పీకేశారు, భరత్ బ్లాగుని కూడా పీకేశారు.

ఏంటీ? అటువైపునుండి ఏమీ వినబడటం లేదు?

ఫోనులో: నేనే కట్ చేసా

వీక్షణ్: ఎందుకు?

ఫోనులో: నీకసలు బుద్దుందా? బాబ్జీ బ్లాగు ఆపలేదు. బాబ్జీని ఎవడో బూతులు తిడితే కామెంట్లు ఆపారరు. అలగే భరత్ బ్లాగుని పీకలేదు. ముందసలు చేర్చుకుంటే కదా పీకడానికి? మొత్తం కంపు చేశావ్

వీక్షణ్: ఎందుకు,ఏమిటి, ఎలా?

ఫోనులో: ఆపెహే, ఏం మాత్లాడలో తెలియనప్పుడు, ఎవరికైనా అడ్డంగా దొరికినప్పుడు, ఇలా "ఎందుకు,ఏమిటి, ఎలా?" అని వాగడం అలవాటైపోయింది నీకు

వీక్షణం: ఐడీయా, ఒక పోస్టు పెట్టేద్దాం. టాపిక్ దారి మళ్ళుతుంది.

ఫోనులో: సరే, ఏదో ఒకటేడు, కానీ ఝలక్ ది కేటు బుర్ర. వాడు మళ్ళీ టాపిక్ లోకి పోతాడు.

వీక్షణం: అది నేను చూసుకుంటాగా, బై!

(బయటకొచ్చి)


నాకు కొంచం పని ఉంది, ఈ తుంటర్వ్యూ తరవాతెప్పుడైనా కొనసాగిదాం. టాటా

అలివేలు: సరె! వెళ్ళీ రండి

(వీక్షణం వెళ్ళిపోయాక)

వీక్షకులారా, విన్నారు కదా. ఆయన మళ్ళీ వహ్చాక తుంటర్వ్యూ కోసాగిద్దాం. ఒక పేరడితో దీనిని ముగిద్దాం, ఇక కెలవ్.


రౌడీ: Sung to the tune of బంగారు కోడిపెట్ట



సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా

బ్లా బ్లా బ్లాగు, పె పె పెట్టి తి తి తిట్టేయ్యవే
దొ దొ దొరికి పొ పొ పోతే దుకాణం కట్టేయ్యవే


సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా


చరణం:

ఓంటమ్మా, ఓంటమ్మా సుబ్బులూ, కనిపిస్తున్నాయ బూతులూ బోలో బోలో
కాగడా డూపెట్టేశానయ్యో, చెప్పేస్తానింక నీతులూ ఛలో ఛలో

బూతు అంటే ఏంటో చెప్పు ముందు, ముసుగులోన గుద్దులెందుకూ
నేను చెప్తే నాకే పడును రంగు , పోస్టు వేసి తప్పుకుందుకూ

హే హే బ్లా బ్లా బ్లాగు, పె పె పెట్టి తి తి తిట్టేయ్యవే
దొ దొ దొరికి పొ పొ పోతే దుకాణం కట్టేయ్యవే

సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా


చరణం 2:

ఎంటమ్మా, ఎంటమ్మా చాకులూ, ప్రనాల స్నేహం ఏమైందీ బోలో బోలో
నా ప్లేను ఫెయిలైంది బాబయ్యో, ఇప్పుడు నా బుఱ్ఱ తినకయ్యో ఛలో ఛలో

బొద్దింక బుఱ్ఱ కూడ లేదే, ఎన్నిసార్లు దొరికిపోతావే
కత్తిలాంటి ఎఱ్ఱ స్నేహముంది, ఆస్ట్రిచ్చి ఆల్గరిథమే


హే హే బ్లా బ్లా బ్లాగు, పె పె పెట్టి తి తి తిట్టేయ్యవే
దొ దొ దొరికి పొ పొ పోతే దుకాణం కట్టేయ్యవే

సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా


PS: In computer science, the ostrich algorithm is a strategy of ignoring potential problems on the basis that they may be exceedingly rare - "to stick your head in the sand and pretend that there is no problem". This assumes that it is more cost-effective to allow the problem to occur than to attempt its prevention.




.
.
.
.

Sep 16, 2010

మైఖెల్ వదిన కామరాజు - వీడియో: మొదటి భాగం

.
.
.
.


నా వీడియో చూడడానికి ముందుగా ఈ వీడియో చూడండి. అప్పుడు నా వీడియో context అర్థమవుతుంది.



Here is my video:



Aug 16, 2010

నేష్‌విల్ నాయకమ్మగారు దేశ ఆర్థిక మంత్రి ఐతే







ప్రగతి నిరోధక ఆర్థిక పాలసీలు అని కమ్యూనిస్ట్‌లు విమర్శిస్తుంటే, వారివి ప్రగతి శీల, మిగతావారివి ప్రగతి నిరోధకాలు ఎలా అయ్యాయబ్బా అని ఎంత ఆలోచించినా భోధపడలే, అప్పుడు అసలు ఒక కమ్యూనిస్ట్ దేశ ఆర్దిక మంత్రి ఐతే ఏమి చేస్తాడు అని అలోచించాను..
కమ్యూనిస్ట్ అనగానే నాకు నేష్‌విల్ నాయకమ్మగారు గారు (అచ్చుతప్పు కాదు - మరీ ఏకవచనం బాగుండదని రెండు బహువచనాలు పెడితే బాగుంటుందని మలక్ సలహా) Das Kapital తెలుగు అనువాదం చేతిలో పట్టుకొని, చుట్టు ఆమె శిష్యులు వారిని పూజిస్తున దృశ్యం నాకు నా కళ్ళ ముందు కదలాడుతుంది..కాబట్టి వారు దేశ ఆర్దిక మంత్రి, వారి శిష్య రత్నం ప్రధాని అన్నమాట. వారు ఇప్పుడు మన దేశ సమస్యలని ఎలా తీరుస్తారో ఒక్కోటిగా చూద్దాం.

వారు పదవిలోకి వచ్చీ రాగానే తలుపులు అన్నీ మూసేసి కుర్చుంటారాయె, అమెరికా వలస రాజ్యం ఐపోతున్నది అని.. ఇంకేముంది..(నో కేపిటల్ ఇన్‌ఫ్లోస్, నో బిజినెస్ బై అమెరికన్, & వెస్ట్రన్)

30% ఉద్యోగాలు హాంఫట్, ఒకే ఒక్క కలం పోటుతో (మరి 30% ఉద్యోగాలే విదేశీ వాణిజ్యం మీద ఆధారపడ్డాయి), ఎమ్మటే ఈ 30% ఉద్యోగుల ఖర్చు మీద ఆధారపడ్డ ఇంకో 10%, కాస్ట్ కటింగ్ అని ఇంకో 10% ఉద్యోగాలు, సగం ఉద్యోగులు, నిరుద్యోగులు ఐపోతారు, తీసి పారెయ్యకండి, ఈ నిరుద్యోగులతో చాలా ఉపయోగం ఉన్నది మరి.

మొదటగా, నేష్‌విల్ నాయకమ్మగారు గారు గొప్ప స్త్రీ వాది కదా, ఇంకేమి, దేశంలో ఉద్యోగాలు స్త్రీలకే అని డిక్లేర్ చేసి పారేస్తారు, బయట నిరుద్యోగ సమస్యని చూసి మగోళ్ళు ఊరుకోక చస్తారా, కుయ్, కయ్ అంటానికి లేదు, బయటకి వెళ్తే టీ కప్పులు కడిగే ఉద్యోగం కుడా ఉండదు మరి. - సుశీల విరక్తి నవలలో చెప్పింది ఇదే మార్క్స్ సిద్దాంతాలే స్త్రీ సమస్యలకి పరిష్కారం అని.

పెట్రోలు, టెలీఫోన్లు పని చెయ్యవు కాబట్టి చక్కగా రిక్షాలకి, యడ్ల బళ్ళకీ, పావురాలకీ భలే డిమాండ్ వస్తుంది 100కి 200 తీసుకోవచ్చు - కుల వృత్తులు నాశనం ఐపోతున్నాయి అని కమ్యూనిష్ట్‌ల గొడవ కదా

నిరుద్యోగులు, అంతేసి అద్దెలు ఇచ్చి, ఖర్చులు పెట్టుకొని పట్టాణాలలో ఎక్కడ ఉంటారు, పల్లెలకే తిరిగి ప్రయాణం తప్పదు - దెబ్బకి పట్టణీకరణ సమస్యలన్నిటికీ పరిష్కారం.

పల్లెలకి వెళ్ళిన నిరుద్యోగులు ఏమి చేస్తారు, తప్పదు, ఎవడి పొలం వాడే దున్నుకోవాలి, ఎవడి పంటలు వాడే పండించుకోవాలి - దున్నే వాడిదే భూమి.

మరి పొలం లేనోల్లు అంటారా అక్కడికే వస్తున్నా, పొలాలు లేకపొతే ఉన్నోడి దగ్గిర పని చేస్తారు ఏముంది, ఒక్కో రైతు దగ్గిర పది మంది ఇంజనీర్లు - 30% చదువుకున్నోళ్ళు 70% చదువుకోని వాళ్ళ మీద పెత్తనం చలాయించటం ఏమి నీతి అని అన్నారు కధా, ఇప్పుడు రివర్స్, సరైన నీతి.

ఇంతమందికి జీతాలు ఇవ్వగలరా రైతులు, మహా ఐతే తిండి పెడతారు, మరి పేద రైతులు ఇళ్ళల్లో అంతమందికి వండి వడ్డించే సదుపాయాలు ఉంటాయా? - ఇదిగో నాష్‌విల్లే నాయకమ్మగారు చెప్పిన సామూహిక వంట, భోజనాలు గట్రా..అన్నీ సామూహికమే..

నిరుద్యోగులు మరి జీతాలు అడిగారు అనుకోండి, సరే జీతం ఇస్తాను కానీ కేజీ బియ్యం పదివేలు అంటారు - కాబట్టి రైతులు తమ పంట విలువ తామే కట్టుకోవచ్చు

ఇంత చేసిన దాదాపు 60 కోట్ల జనాభాని పోషించగలమా? అందరికీ పొలాలు, రైతులు ఉద్యోగాలు ఇవ్వగలరా? కాబట్టి హింస ప్రజ్వరిల్లుతుంది - కమ్యూనిస్ట్‌లకి కావలసింది అదే కదా, ఫ్రీ ఎంటర్‌టైన్మెంట్ వాళ్ళకి

ఆకలితో కొట్టుకునేవాడు, అన్నం కోసం చంపేవాడు కులం, మతం, తెలివిగలోడా, చదుకున్నోడా అని చూస్తాడా? - ఫో సమసమాజం ఎవడు ఎవడ్ని ఐనా తన్నొచ్చు, చంపొచ్చు.

ఈ హింసతో దేశం మొత్తం రుధిరాభిషేకం - వాడ వాడలా, మూల మూలలా అరుణ పతాక రెప రెపలు.

కార్మికుల సంఖ్య ఎక్కువ, యజమానుల సంఖ్య తక్కువ కానీ, యజమానుల ఆస్థి ఎక్కువ కదా, మరి ఆ సంపద కోసం అల్ప సంఖ్యాకుల యజమానులపై కార్మికుల దాడులు - ఇంకేమి కార్మిక పాలన

మరి ఒకే సారి తలుపులు ముసేస్తే, అమెరికా వాడు ఏమైపోవాలి? వాడికీ చాలా నష్టం - కమ్యూనిష్ట్‌ల శత్రువుకి తగిన శాస్తి.

అమెరికా వాడు ఇంకే చేస్తాడు, ఏ చైనా వాడ్నో, ఏ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాడినో బ్రతిమిలాడి, వాడు అడిగినంత ఇచ్చి పని చేయించుకోవాలి - ఒకే దెబ్బకి రెండు పిట్టలు, కాదు కాదు మూడు పిట్టలు, అమెరికాకి నష్టం, చైనా కి లాభం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా లాభం కాబట్టి వీరి సెక్యులర్ భావాలు కుడా నెరవేరుతాయి మరి.

మన హింసకి వస్తే, జనాలు తన్నుకోనీ, తన్నుకోనీ, చంపుకోనీ, చంపుకోనీ - మంచు యుగం నాటి సంస్కృతికి వెళ్ళి పోతారు కాబట్టి, ఇప్పుడు వీరికి నచ్చినట్టు సొసైటీని డెవలప్ చేసుకోవచ్చు - మాకు ఇప్పటి వ్యవస్థ నచ్చలేదూ నచ్చలేదు అని అంటుంటారుగా.

ఇప్పుడు వీరు చక్కగా వస్తువు విలువని కొలవటానికి ప్రామాణికత శ్రమా?, మార్క్స్ చిటికెనవేలి పొడవా? మావో బట్టతల వైశాల్యమా? లెనిన్ మద్యవేలి గోరు పొడవా? ప్ర.నా. వెంట్రుకలలో పోడవైనదా? అన్ని వారిలో వారు తన్నుకోగా కోగా,.. మిగిలిన వారికి నేష్‌విల్ నాయకమ్మగారు గారు రాజీ చేసి, తన దగ్గిర ఉన్న విరిగిపోయిన స్కేల్ ని ప్రామాణికంగా నిర్ణయిస్తారు..

ఈలోపు అవసరం ఐనవి దిగిమతి కోసం ఉన్న బంగారాన్ని మొత్తం మిగతా దేశాలకి ఇచ్చేస్తాం కదా మరి - మన రూపాయి ఎవడికి కావాలి? తలుపులు మూసుకున్నాక.

బంగారం లేకపొతే డబ్బులేదు అని నాష్‌విల్లే నాయకమ్మ గారు చెప్పారు కధా, మరి డబ్బు లేకపొతే ఎవడైనా శ్రమ చేస్తాడా?

శ్రమ లేకపొతే మూడు రోజుల్లో జనాలు అందరూ చచ్చిపోతారు అని నాష్‌విల్లే నాయకమ్మ గారు చెప్పారు కదా, సో మన దేశం మూడు రోజుల్లో చరిత్రలో కలిసిపోతుంది.

అప్పుడు చక్కగా చైనా, రష్యా మన దేశాన్ని ఆక్రమించుకుంటాయి - మన దేశంలో మావో, స్టాలిన్ పాలన
అప్పుడు కమ్యూనిష్ట్‌లు కుడా చైనా ఆర్ధిక విధానాలా, రష్యా ఆర్ధిక విధానాలా అని కొట్టుకోకుండా రెండూ ఉంటాయి మన దేశంలో చక్కగా.

కొంతలో కొంత ఐనా పాకిస్తాన్, తాలిబాన్లు ఆక్రమించుకోకుండా ఉంటారా? - సెక్యులర్ భావనలు, కార్గిల్ అప్పుడు వెరే దేశం పై దాడి మంచిది కాదు అని ఖండించారుగా దానికి సరిపోతుంది.

తరువాత, భారత దేశ సమస్యలన్నిటికీ ఒకే దెబ్బకి పరిష్కరం చూపించినందుకు నాయకమ్మ గారికి నోబెల్ శాంతి (స్మశాన శాంతి, మనుషులందరూ చచ్చాక శాంతి కాక మరేటి?) నోబెల్ ఆర్ధిక శాస్త్ర బహుమతి రెండూ ఒకే ఏడాది ఇస్తారు, కానీ వారు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుస్తుంది??

చూశారా మరి, గ్లోబలైజేషన్ నిషేదించటం వలన ఎన్ని లాభాలో, ఒకే దెబ్బకి ఏ సమస్యా లేకుండా పోతుంది, దానికి తోడు, చక్కగా చైనా, రష్యా పాలనా, వారి సిద్దాంతాలు నెరవేరుతాయి..

కాబట్టి వారి విమర్శలో నిజం ఉన్నది, వారివి వారికి ప్రగతి శీల పాలసీలు, మిగతావారికి ప్రగతి నిరోధకాలు.

May 21, 2010

పదమూడవ నెంబరు ప్రమాద సూచిక: బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!

మామూలు తిట్లు బోరుకొడుతున్నాయని పేరడీలలో కొట్టుకుందామని డిసైడ్ అయ్యా. మొదటగా నా పేరడి ఇది.

Urvasi .. Urvasi (Premikudu) style:


బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
బ్లాగులోన, రంగుపడితే టేకీటిసీ బ్లాగరీ
కెలుకుడూ తిన్నగా నేర్చుకోరా బ్లాగరీ
బుర్రలో గుజ్జు కాస్త పెంచుకోరా బ్లాగరీ

బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!



చరణం:

నీకసలు తెలుసా తెలుసా
కెలుకుడులో కష్టమేంటో

కోపమే రావాలంటే
యూసు చేసే కిటుకేంటో

మెదడు నీకు చెప్పుల్లోకీ
జారిపోయెరా బ్లాగరూ
బుర్రలేని పనులు చేస్తే
కోపం రాదురా బ్లాగరూ

బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!


కామెంటు పెట్టి క్లౌనువయితే టేకీటీసీ బ్లాగరీ
చిరూని అనుకుని సునిల్ వి అయితే టేకీటీసీ బ్లాగరీ
వెశిన ఎత్తులు ఫ్లాపే అయితే టేకీటీసీ బ్లాగరీ
నీ ప్లేనంతా వేస్టే అయితే టేకీటీసీ బ్లాగరీ

బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!

తిట్లతో పనులే జరగవులే
బూతులతో సహనం చావదులే
చివరికీ జోకరు అయ్యేది
నవ్వులు తెప్పించే నువ్వేలే


కోపమే తెప్పించబోతే
అదేదో నీకే వచ్చేలే
నువ్ పెట్టే ఒకొక్క కామెంటు
బ్లాగుకీ హిట్లను పెంచేలే!

May 14, 2010

ఆంధ్రప్రభలో ఈ వార్త చదివిన వెంటనే నవ్వొచ్చింది, ఎందుకంటారు?

ఆంధ్రప్రభలో ఈ వార్త చదివిన వెంటనే నవ్వొచ్చింది, ఎందుకంటారు?



బాబును నేనెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు
apr - Fri, 14 May 2010, IST



తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తానెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించిందని సీఎం ధ్వజమెత్తారు. కానీ ఆయన పరిస్థితి చూస్తే చాలా జాలేస్తోందని రోశయ్య చెప్పారు.

Apr 27, 2010

స్వామీ శరతానంద

మన శరత్ గానీ స్వాముల వారి అవతారం ఎత్తితే సీను ఎలా ఉంటుంది?





తన పేరు శరతానంద తన వెంట ఉంది మంద
తన పేరు శరతానంద తన వెంట ఉంది మంద
గుడ్డిగా నమ్మిన వారు కొట్టారు గోవిందా

జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా

చేతిలోన డబ్బు పండే గ్లోబంతా భక్తులుండే
చేతిలోన డబ్బు పండే గ్లోబంతా భక్తులుండే
మన స్వాములోరి లైఫు నల్లేరు మీద బండే

జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా

గాల్ ఫ్రెండు పేరు ఆరు, ఒక మాజీ ఫిల్ముస్టారు
గాల్ ఫ్రెండు పేరు ఆరు, ఒక మాజీ ఫిల్ముస్టారు
ఒకరోజు ఆశ్రమంలో రొమేన్స్ చేశారు


జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా

జీవితాన్ని గెల్చినవారు కేమరాకి దొరికినారు
జీవితాన్ని గెల్చినవారు కేమరాకి దొరికినారు
వెధవ పనులుగాని చేస్తే లైట్లాపుకోండి సారూ (కేమరా కి దొరకకుండా)

జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా

Mar 15, 2010

ఇద్దరు భర్తల మధ్య సంభాషణ

5 minutes back ఓ స్నేహితురాలి ఐడీ యాహూలో ఆన్లైన్ కనిపిస్తే హాయ్ చెప్పా. ఆమె భర్త లైన్లోకొచ్చారు. ఆ సంభాషణ మీరే చూడండి :))


Self: hi
Self: happy new year

SR: Thank you same to you.. she is cooking and wanted me to relay the msg.. in btw I am her hub..I have become a glorified stenographer to her

Self: Oh Hi, Nice meeting you

SR: like wise..

Self: LOL ,. glorified stenographer, tell me something new!

Self: for you are talking sto another!

SR: I guess you get that title when you marry

Self: u bet n it reamins forever

SR: in btw.. you transition into many roles

SR: and they stick for ever

SR: dang and you dont get paid either

Self: well it depends .. they stick as long as none of those roles is a "Master"

SR: I am secretary of labor.. She is secretary of state.. (Hillary Clinton) so
obviously you are never the "master".. you can dream though

Self: by chance if u become the master for an hour or two, it will be taken off!

SR: thats a luxury for me and I dream .. it may be real for you

Self: Secretary of t the (E)state indeed!

SR: but I need to get there .. thats like 20000 leagues under the sea

Self: lolz

Self: we r in the same boat!

SR: Thanks for making me the partner there but I dont want more work..

Self: the only thing is .. I'm virtually free for 5 days a week!

SR: so you deal with your work and I will deal with mine

Self: well, I am slightly better off that way .. so I stand to be the loser if we combine the work

Self: The irony is .. I have a "Master" in my job title

BUZZ!!! (NOW THE LADY IS BACK)

SR: watzzzz goin on??

Self: ohh u r back?

Self: no nothing

Self: he has been telli ng me nice things about u

SR: nice things aa??

Self: how nice you are, how wonderful you are .. how lucky he is .. etc

SR: we just had a fight...how cud he say nice things??

Self: lolz

SR: all I asked him was to say thank you and wish you the same

SR: you end up gossiping..

SR: lemme scroll up , read the messages and decide

SR: he had that stupid smack on his face..

SR: which always means one thing

Self: lolz

SR: was cookin sonthi rasam for him and tomato rasam for BB for the same reason

Self: hmmm

SR: he hates sonthi...

Self: LOLZ

Self: did u read the messages?

SR: not yet wait...gimme a min

SR: hammooo...

SR: what was all that about??

SR: evaraina e messages chadivite...bhaarya baadhitula sanghaaniki ...mimmalni president ni...eeyanni depyuty President ( as in Dep CM) chesestaaru

Self: hehehehehe

Self: I plan to post it on blog with your permission

Self: a conversation between twoh husbands ani\

Self: i will change the names

SR: hehehee....go on

Mar 12, 2010

పదకొండవ నెంబరు ప్రమాదసూచిక: చివరికి పగిలేది - ఓరెగన్ ఓబులేసుగారి తుంటర్వ్యూ!

మలక్పేట్ రౌడీ: ప్రమాదవనంలోకి ఈ సారి కాస్తంత అసహనంతో తొంగిచూస్తున్న వీక్షకులకి మళ్ళీ కెలికాస్కారం. ప్రతీసారీ ఆడవాళ్ళనే హోస్టుల కింద ఉపయోగించుకుంటున్నానని మహిళాసంఘాలు, మగవాళ్ళకి చాన్స్ ఇవ్వట్లేదని పురుష సంఘాలు గోల చెయ్యడంతో ఈ సారి మన ఘోస్టు, అదే, గెస్టు హోస్టు గా ఉండవలసినదిగా యోసిమిటీ యోగి గారిని కోరాం. అదిగో ఆయన వచ్చేశారు.

నమస్తే యోసెమిటీ యోగీ!

యోసెమిటీ యోగి: నమస్తే మలకూ, ఏమిటి కబుర్లు?

మలక్పేట్ రౌడీ: నావేమున్నాయ్, నువ్వే చెప్పాలి, కాదు కాదు . చెప్పించాలి మన గెస్టుల చేత

యోగి: ఇంతకీ ఎవరేమిటి మన గెస్టులు?

రౌడీ: చాలామందే ఉన్నారుగానీ ముందుగా వచ్చేది ఓరెగన్ ఓబులేసు,MF

యోగి: ఏమిటా తిట్లు రౌడీ?

రౌడీ: MF అంటే తిట్టు కాదు, ఈయన ఒక ప్రఖ్యాత చిత్త కారుడు, మరో ప్రఖ్యాత చిత్తకారుడి అభిమాని అందుకే ఆయన పేరులో కొంత భాగాన్ని అలా తగిలించుకున్నాడు.

యోగి: ఈ అభిమానమేమిటో, MF ఏంఇటో అస్సలు అర్ధం కావట్లేదు. ఇంతకీ ఈయన చిత్ర కారుడా, చిత్తకారుడా?

రౌడీ: అదే, "చిత్తకార్తె" చిత్రకారుడు

యోగి: ఓహో ఆ టైపా, అరే మాటల్లోనే వచ్చేశారు. నమస్తే ఓబులేసు గారూ

ఓరెగన్ ఓబులేసు: ఓబులేసు కాదు, ఒబులేసు MF

యోగి: క్షమించాలి, ఓబులేసు MF గారు, మా వీక్షకుల కోసం, మరొకసరి ఈ MF వెనకనున్న అంతరార్ధం చెప్తారా?

ఓబులేసు:MF అనేవి మా గురువుగారి ఇనీషియల్సండీ. అందుకే ఆయన గౌరవార్ధం అలా తగిలించుకున్నా.

యోగి: మరి MF అనేది తిట్టు కదా

ఓబులేసు: నేను దానిని తిట్టుగా అనుకోను. అదొక జీవన విధానం. నా మటుకూ నేనొక సెక్యూలరిష్టుని. తల్లినీ, చెల్లినీ, భార్యనీ, ప్రేయసినీ, పక్కింటి పిన్నిగారినీ, వారి రెండేళ్ళ మనవరాలినీ ఒకే దృష్టితో చూస్తాను. నాకు ఆడవాళ్ళందరూ సమానమే.


యోగి: వార్నీ!

ఓబులేసు: ఏమంటున్నారు?

యోగి: అబ్బే, ఏమిలేదు, మీ సమానత్వానికి వాహ్ వాహ్ అంటున్నా. సరే, మీ గురించి మరికాస్త మా వీక్షకులకి

ఓబులేసు: ఏముంది, నేనో చిత్రకారుడిని, రచయితని. గీసేస్తుంటాను, రాసేస్తుంటాను.

యోగి: మీ గీతల గురించి వ్రాతల గురించి చాలానే విన్నాం లేండి.

ఓబులేసు: జనాలందరితోనూ వాదించి, వారిని బాధించి బోధిస్తూంటాను.

యోగి: ఓహో, వాదన, బోధన చేసినవే సరైన వ్రాతలని మీ ఉద్దేశ్యమన్నమాట.

ఓబులేసు: అవును. లోకంలో ప్రతీదానినీ ఖండిస్తూంటాను.

యోగి: అంటే చేతిలో కత్తి పట్టుకునితిరుగుతారా?

ఓబులేసు: Yes. కానీ నాకు కూడా పట్టూ విడూపూ ఉన్నాయ్. ఈ రోజు సనాతన మతస్తుడిని, రేపు ఏ వాదినీ కాను, ఎల్లుండి నాస్తికుడిగా మారిన వాడిని.

అలాగే, ఈ రోజు సచ్ కా సామ్నా నా దృష్టిలో నేరం, కానీ రేపు నా వాదన - "ఒక మగవాడికి ఒక ఆడది చాలదు"


యోగి: ఇదే వాక్యం ఏదో బ్లగులో కామెంటుగా పెడితే రౌడీ తగులుకున్నాడుగా, ఏం రౌడీ?

రౌడీ: హీ హీ హీ


యోగి: ఆపెహే, మళ్ళీ వెకిలి నవ్వు, నవ్వంటే "హా హా హా" అని ఉండాలి. సరే ఓబులేసుగారూ, మీవన్నీ ద్వంద్వ ప్రమాణాలన్నవి జనాల ఆరోపణ, దీనికి మీరేమంటారు?


ఓబులేసు: అంతా అబధ్ధం. ఇదంతా బ్రాహ్మణ &్%$%& ల అభిజాత్యం. అసలు మా గురువుగారి అడుగుజాడల్లో నడిచేవారిదే నిజమైన జీవితం.


యోగి: కానీ మీ గురువుగారు కూడా వివాదాస్పదులేకదా?


ఓబులేసు: ఆ వివాదం హిందుత్వ వాదులు సృష్టీంచింది


యోగి: అంటే ఆయన్ని విమర్శిస్తే, హిందుత్వవాదమేనా?


ఓబులేసు: ముమ్మాటికీ. ఆయన నా దేవుడు.


యోగి: మీరు నాస్తికులేమో?


ఓబులేసు: ఈ క్షణంలో కాదు. నిమిష నిమిషానికీ నన్ను నేను మార్చుకుంటాను. మా గురువు గారు ఒక శృంగార రస సామ్రాట్టు.


రౌడీ: ఒక్క నిముషం. మన రెండవ గెస్టు వెర్మాంట్ వెంకటేశు. ఈయనో పెద్ద ఆస్తిక వాది. వెంకటేశు గారూ, రండి, నమస్తే.


వెర్మాంట్ వెంకటేశు: నమస్తే


యోగి: వెంకటేశు గారూ, ఓబులేసుగారి పై మీ అభిప్రాయం? ఓబులేసు గారూ, మీరు కూడా ఆయన గురించి కాస్త


ఓబులేసు: ఆ మతతత్వ మూర్ఖుడా నా గురించి మాట్లాడేది?


వెంకటేశు: ఒక్క మాటలో చెప్పాలంటే వాడొక త్రాష్టుడు


ఓబులేసు: నువ్వే త్రాష్టుడివి. చరిత్ర తెలుసుకుని మాట్లాడు.

వెంకటేశు: చరిత్ర? ఎవరి చరిత్ర? నీ తొక్కలో ఝా, థాపర్ల చరిత్రా? వాళ్ళు చెప్పిన అబధ్ధాలు ఒకొక్కటీ బయటపడుతున్నాయిగా? అయినా అందరి చరిత్ర జ్ఞానాన్నీ ప్రశ్నిస్తావ్ నీకు తెలిసిన చరిత ఏమిటొ చెప్పకూడదూ? ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పే తెలివిగానీ, దమ్ముగానీ లేని పిరికి సన్నాసివి, చరిత్రలో "చ" కూడా తెలియని వాడివి, ప్రశ్న అడిగితే అదేదొ చదవమని సమాధానం దాటవేసి పారిపోయేవాడివి, నువ్వా నాకు చరిత్ర గురించి చెప్పేది?


ఓబులేసు: నన్ను సన్నాసి అంటావా? ఇప్పుడే నీ మీద ఎట్రాసిటీ కేసు వేస్తున్నా


వెంకటేశు: బీ మై గెస్ట్. నీ లాంటి ద్రోహులకి భయపడేవాడిని కాను. ఏం పీక్కుంటావో పీక్కో పో.


యోగి: అయ్యా, బాబూ, కొట్టుకుంది చాలు గానీ విషయానికొద్దాం. వెంకటేశు గారూ, మీరు వచ్చే సమయానికి ఓబులేసు గారి గురువుగారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఓబులేసుగారూ, మిరు కానివ్వండి.


ఓబులేసు: ఆయనకి తన భావాల్ని వ్యక్త పరిచే స్వేచ్ఛ ఉంది. కానీ నగ్న చిత్రాలు గీశాడని ఆయన్ని కుక్కని తరిమినట్టు తరమడం అన్యాయం.


వెంకటేశు: ఏయ్. కుక్క గిక్క అనద్దు. కుక్కలకి విశ్వాసం అనేది ఉంటుంది. అలాంటిదేమి లేని దరిద్రపుగొట్టు వెధవ మీ గురువు. వావీ వరసలూ లేని కామాంధుడు. హిందూ సంస్కృతి మీద దాడి చేశాడు. అందుకే తరిమి తరిమి కొట్టారు దేశం నించి.


యోగి: అయితే ఇది హిందువులపై దాడి అంటారా?


వెంకటేశు: ఖచ్చితంగా. హిందువులు ప్రమాదంలో ఉన్నారు.


రౌడీ: అంత సీను లేదు. హిందూ సంస్కృతి వీటన్నిటి కన్నా పెద్దది. ఓబులేసుగ్గారి గురువుగారూ ఆయన భజన బృందాలూ సముద్రంలో కాకిరెట్టలు. ఇలాంటు ద్వేషులని, జాతి విద్రోహులని చాలామందిని తట్టుకుంది మన సంస్కృతి. దీనివల్ల మన సంస్కృతికొచ్చిన నష్టమేమీ లేదు. ఏదో Sexually Perverted Womanizer గుంపులు ఇవి. Gynophilics


యోగి: అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం రౌడీ. పారిపోయిన ముసలాడు Sexually Perverted Womanizer? LOL “Gynophilics”


రౌడీ: సరే. మన కార్నల్ సైకో ఏనలిస్ట్ డాక్టర్ క్షవరం గారినే అడుగుదాం. లైనులోనే ఉన్నారు. క్షవరంగారూ, దీనిపై మీ విశ్లేషణ ఏమిటి?


క్షవరం: కొంతమంది పెర్వర్టులకి కి భార్యతో కాక పక్కింటావిడతో శృంగారం ఒక ఫేంటసీ. మరి కొంతమందికి సినీ తారలతో, కాస్త ముందుకెడితే తల్లి దండ్రులతో, అక్కా చెల్లెళ్ళతో, వదినా మరదళ్ళతో .. ఇలా, ఉంటుంది. ఇక అల్ట్రా మాడర్న్ గుంపులయితే, పౌరాణిక కేరెక్టర్లతో, అంటే మన ద్రౌపది, కుంతి లాంటివారితో, ఎక్స్ ట్రీం మాడ్రన్ కేసులయితే, దేవుళ్ళతో, దేవతలతో శృంగారం ఊహించుకోవడం కద్దు.


యోగి: అంటే, మన ద్రౌపది మీద రచనలూ, దేవతల చిత్రాలూ వీటన్నిటికీ కారణం వీరి పెర్వెర్షనేనా? మన ఎవార్డు పొందిన రచయితలు కూడా Sexual Perverts అంటారా?


క్షవరం: అయ్యుండవచ్చు. సాధారణంగా మనుషులు తమలో ఉండే ఇలాంటి మృగ తృష్ణలను కళల రూపంలో బయటకి తెస్తారు. అవే భావాలుండి, అంతటి కళాకారులు కానివారు వాటిని ఆస్వాదిస్తారు.


యోగి: అయితే ఈ విషయంలో జరిగిన గొడవ వల్ల వీరీ వీపరీత్గ ధోరణులకి బ్రేకు పడిందన్న కోపంతో శివసేన వారిని ఆడిపోసుకుంటున్నారన్న మాట.


క్షవరం: అది మీరూ మీరూ తేల్చుకోండి. నేను రాజకీయవేత్తని కాను.

యోగి: సరే ధన్యవాదాలు క్షవరంగారు. అయితే ఇది మన వెంకటేశుగారన్నట్టు హిందూవులపై దాడి కాదు. తమ జంతువుల టైపు కోరికలు తీర్చుకోవాలన్న సరదా, అవి తీరలేదన్న అక్రోశమూనూ. అంతేనా?


వెంకటేశు: నేనొప్పుకోను ఇది ముమ్మాటికీ హిందువులపై దాడే. అసలు శృంగారం గురించి ఇంత పచ్చిగా ఈ బ్లాగులో ఎప్పుడూ రాలేదు.


రౌడీ: నిజమేనండీ. దానికి మీతో సహా వీక్షకులందరికీ క్షమాపణలు. కానీ ఈ రోజు తప్పడంలేదు మరి. Sexual Perverts అయిన చిత్తకార్తె కుక్కబుధ్ధిగల Qatar చిత్రకారుల మీద సంభాషణ కదా.


ఓబులేసు: ఏమిటండీ మీ వరస? ఇందాకటినుండి చూస్తున్నాను. ఎవరితోనైనా శృంగారం ఊహించుకునే హక్కు మాకుంది.


రౌడీ: ఉంది నిజమే, మీరు అలా ఊహించుకునే రకాలు అని చెప్పే హక్కు కూడా మాకుంది.


ఓబులేసు: మాకు భావ ప్రకటన స్వేచ్చ ఉంది. మేము ఎవరినైనా ఏమన్నా అనవచ్చు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ దానికి ఆయన మీద కేసులు పెట్టడం దారుణం.


రౌడీ: మరి మీకు మెరిట్ లేదు, దొడ్డిదారిలో వచ్చారు అని రామరాజ్యంలో భీమరాజు యధాలాపంగా అన్న మాట - ఆ మాట ముమ్మాటికీ తప్పే - పట్టుకుని మీరు గలాభా చెయ్యలేదా మరి? కేసు పెట్టలేదా? మీ విషయానికి వచ్చేసరికి నియమాలు మారిపోతాయా? ఇవే మరి ద్వంద్వ ప్రమాణాలంటే. మీరు మాత్రం మనోభావాల్ని గాయపరిచేసుకోవచ్చుగానీ మిగతావారు చేస్తే తప్పు కదా. ఎవడో అన్నట్టూ మీరు చేస్తే శృంగారం, పక్కవాడు చేస్తే మాత్రం వ్యభిచారం.


ఓబులేసు: ఏ పెన్సిల్ తో వ్రాయాలి?


వెంకటేశు: ఏమిటీ అసందర్భ ప్రేలాపన?


యోగి: ఆయన టాపిక్ మార్చే పధ్ధతి లేండి. ఇక్కడ ఆ పప్పులుడకవ్. ఇదే టాపిక్ కొనసాగిస్తాం ఇక్కడ.


ఓబులేసు: నేనేమీ టాపిక్ మార్చలేదు. ఇక్కడ ఉన్న వెంకటేశులాంటి దొంగ స్వాముల గురించి మాట్లాడుతున్నాను. వీరంతా పూజలు చేస్తామంటూ అంటూ జనాలని మోసం చేసి డబ్బులు గుంజుకుంటున్నారు.


రౌడీ: వెంకటేశుగారు ఎప్పుడూ ఎవరినీ బలవంతపెట్టి ఒక నయా పైసా కూడ అడగలేదు. పూజలు చేస్తున్నామని చెప్పారు. ఇష్టమయిన వాళ్ళు పంపించారు, లేని వాళ్ళు లేదు. ప్రతీచోటా మీకు రంగుపడుతుంటే తట్టుకోలేక ఈయనమీద పడడం మీ మూర్ఖత్వమే.


యోగి: ఒక్క నిముషం. ఢిల్లీనుండి దరియాగంజ్ దమయంతిగారి ఫోన్. ఏదో మాట్లాడాలిట


వెంకటేశు: ఏముందీ మన ఓబులేసుకు చెంచా కదా, support కి పిలుచుకుని ఉంటాడు.


రౌడీ: అబ్బా, వెంకటేశుగారూ, కాస్త ఉండండీ, దమయంతిగారూ మీరు చెప్పండి


దరియాగంజ్ దమయంతి: థూ, నీ నోరుబడ


యోగి: వామ్మో, ఎవరిని ఆ తిట్లు?


దమయంతి: ఇంకెవరినీ, ఓబులేసునే. ఏదో అప్పుడప్పుడు మంచి విషయాలు వ్రాస్తుంటే మేధావేమో అనుకుని అపోహపడ్డాను. ఇప్పుడు తనకి పడాల్సిన తిట్లన్నీ నాకు పడుతున్నాయ్. నేనూ, గుల్బర్గ గులాబీ బలిపశువులమయ్యాం, మన సారేమో టింగురంగా అంటూ మమ్మల్ని అడ్డం పెట్టుకుని బ్రతికేస్తున్నాడు.


ఒక విధంగా నాకు ఆనందంగా ఉంది. సాధారణంగా పురుషుడు స్త్రీలకి రక్షణ కల్పించే సమాజం మనది. అలాంటిది ఒకరు కాదు ఇద్దరు స్త్రీల వెనకాల మన సారుని దాక్కునేలా చెయ్యగలిగానంటే, నిజంగానే "భారత నారీ అభ్యుదయానికి, నాయకురాలిని నేనే!"


కానీ, కానీ, కానీ, ఈ పాట మాత్రం ఈరోజు నేను పాడాల్సిందే:

*********************************************************************

ఎరక్కపోయి వచ్చానూ, ఇరుక్కుపోయానూ
నేనెరక్కపోయి వచ్చానూ ఇరుక్కుపోయాను
కెలుకుదు బ్లాగుల మధ్యన ఉక్కిరిబిక్కి రి ఔతున్నాన్నూ
అబ్బా అమ్మా అహా అయ్యో
ఎరక్కపోయి వచ్చానూ, ఇరుక్కుపోయానూ
నేనెరక్కపోయి వచ్చానూ ఇరుక్కుపోయాను

చరణం:

ఒక్కరి బ్లాగునే నే కెలికాను
నా ఒక్క బ్లాగునే మీరు కెలికేశారు

ఎoదరో కెలుకుడూ గాళ్ళూ
అందరికీ కెలికాస్కారాలు

ఎoదరో కెలుకుడూ గాళ్ళూ
అందరికీ కెలికాస్కారాలు

పానశాల కామెంట్ నాదేనా?

కాదంటే కాదూ బసవన్నా
తాన తందనా తన తందనా
అక్కడ ఉన్నది ఫేక్ ఐడీ మరి
తాన తందనా తన తందనా
ఈ గోల నాకొద్దు తప్పుకుంటే సరి
తాన తందనా తన తందనా
తాన తందనా తన తందనా


ఎరక్కపోయి వచ్చానూ, ఇరుక్కుపోయానూ
నేనెరక్కపోయి వచ్చానూ ఇరుక్కుపోయాను

**************************************************************

చెప్పాల్సింది చెప్పేశాను. ఇక ఉంటా టా టా


యోగి: హూ, సుడిగాలి పర్యటన అంటే ఇదేనేమో? సరేగానీ ఓబులేసుగారూ, మీ అభిమాన పుస్తకం చివరికి మిగిలేది రివ్యూ విషయంలో చివరికి పగిలేది ఎవరి గుండు?


ఓబులేసు: అంటే మీ ఉద్దేశ్యం?


యోగి: భావ ప్రకటన, స్వేచ్ఛ అంటూ కాకమ్మ కబుర్లు చెప్తారు కదా, మరి మీకిష్టమైన పుస్తకాన్ని ఎవరో విమర్శించేసరికి ఎందుకు అంత ఉడుక్కున్నారు?


ఓబులేసు: విమర్శించడం తప్పుకాదు. దానికీ ఒక పధ్ధతునంది


రౌడీ: అదే మటమీదుండడి. ఇడే మాట మీకు ఇదివరకు చెప్తే మీరన్న మాట ఏమిటి? నాఇష్టం, నా స్టైల్ లో నేను వ్రాస్తాను అనేగా. మరి మిగతా వాళ్ళ విషయానికొస్తేమాత్రం వాళ్ళకి పధ్ధతులుండాలా?


ఓబులేసు: ఒక మనిషి కేరెక్టర్ గురించి ఇలా మాట్లాడడం దారుణం


రౌడీ: మరి ఏదో బ్లాగులో పింగళి దశరధరాం కూతురి గురించి కారుకూతలు కూసినప్పుడో?


యోగి: మీ నోటికొచ్చిన కారుకూతలు మీరు కూయచ్చుగానీ పక్కవాడు అదే పని చేస్తే మాత్రం అభ్యంతరాలా?


ఓబులేసు: నేను మీకు సమాధానం చెప్పను. చరిత్ర చదువుకోండి. నేపోతున్నా.


వెంకటేశు: అయ్యా రౌడీగారూ, ఇంతకీ చివరికి పగిలింది ఎవరికి?


రౌడీ: అది మన వీక్షకులే చెప్పాలి


యోగి: LOL


రౌడీ: వీక్షకులారా, ఇది ముగించేముందు మా కెలుకుడు సూత్రాలు:


నేటి కెలుకుడు సామెత: "కెలకకురా కెలకబడేవు" - మన ఓబులేసుగారికి అంకితం

నేటి కెలుకుడు కోట్: Sent by a regular blogger: "కత్తి కెలుకుడు, శరత్ నసుగుడే కాదమ్మా, మిగాతా బ్లాగులుకూడా అప్పుడప్పుడు చూస్తూండాలి"

THE THREE LAWS OF KELUKUDU:

FIRST LAW:

EVERY BLOG REMAINS IN A STATE OF PEACE AND TRANQULITY UNLESS KELIKIFIED BY A KELUKUDU BLOGGER

SECOND LAW:

THE FORCE OF KELUKUDU ON A POST IS DIRECTLY PROPORTIONAL TO THE LENGTH OF THE POST AND THE SPEED AT WHICH THE KELIKIFYING COMMENTS ARE POSTED

THIRD LAW:
EVERY KELUKUDU ACTIVITY PROMPTS AN EQUAL (OR EVEN MORE) AND OPPOSITE KELIKIFICATION

THE KEINSTEIN KELUKUDU CONSERVATION THEOREM:
THE ENERGY REQUIRED TO KELIKIFY A BLOG ( E ) IS EQUAL TO THE PRODUCT OF THE MASS FOLLOWING OF A BLOG ( M ) AND SQUARE OF THE NUMBER OF THE COMMENTS ( C-SQUARED)

వచ్చే ప్రమాద సూచికలో మళ్ళీ కలుద్దాం, అంతవరకూ కెలవ్!

Feb 24, 2010

అక్కయ్య గారు రూటు మార్చారోచ్!

పాపం పవన్ తో పప్పులుడకడం లేదని అక్కయ్యగారు లేటుగా లేటెస్టుగా రూటు మార్చేశారు. కావాలంటే ఈ స్క్రీన్ షాట్ మీరే చూడండి ...







*************************************************************





ఇది చూస్తూంటే నా సెంట్రల్ యూనివర్సిటీ రోజులు గుర్తొస్తున్నాయి. నేను జాయిన్ అయిన కొత్తల్లో ఒక అమ్మాయి ఆత్మ హత్య చేసుకుంది - కారణం - తన బాయ్ ఫ్రెండు మోసం చేసాడని - దానికి కారణం? అతను అగ్రవర్ణం, ఆమె దళితురాలు. సంబంధం పెట్టుకునేదాకా ఓకే గానీ పెళ్ళిమాత్రం కదరదన్నాడు. దానితో ఆ అవమానం భరించలేక తన రూములోనే ఉరేసుకుంది. యూనివర్సిటీలో చాలా పెద్ద గొడవే జరిగింది. దళిత సంఘాల వాళ్ళొక రేలీ నిర్వహించారు. కులం కారణంగా మొదలై, కులమే మూలంగా ఉన్న గొడవ రేడీకల్ ఫెమిష్టుల చేతుల్లో పడింది. ఇంకనేం? మగవాళ్ళంతా భూతాలు, ఆడవాళ్ళు దేవతలు అని గొడవ మొదలు పెట్టారు. పోస్టర్లు అంటించడం మొదలు పెట్టారు - ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఒక అలవాటు ఉండేది లేండి - శుభ్రంగా ఉన్న గోడల్ని చూస్తే కుళ్ళు, అందుకే పోస్టర్లంటించుకునే వాళ్ళు ... కత్తితో కాదురా ... పోస్టర్ తో చంపేస్తా" అనే సీనన్నమాట

ఇదంతా చూస్తున్న ఒక గుంపుకి చిరాకేసింది. అసలు గొడవేమిటి, వీళ్ళు వేస్తున్న తింగరబుచ్చి వేషాలేమిటి అని. వెంటనే వాళ్ళోక పోస్టర్ వేసారు .. దాని సారాంశం:


ఆ అమ్మాయి - ఆత్మ హత్య చేవ్సుకుందంటే తప్పెవరిది?

... మోసం చేసిన ప్రియుడిదా?
... గుడ్డిగా నమ్మిన తనదా?
... తన బాధని చెప్పుకోడానికి అవకాశం ఇవ్వని తల్లిదండ్రులదా?
... గర్భవతి అనగానే చీదరింపుగా చూసిన ఆమె స్నేహితులదా?
... కులాల మధ్య తారతమ్యం సృష్టించిన మన సమాజానిదా?
... అసలు విషయం మర్చిపోయి పోస్టర్లతో కొట్టుకుంటున్న నీదీ, నాదీనా? అని

ఆ పోస్టరు సూపర్ హిట్టయి కూర్చుంది ... ఆ పోస్టరుతోనే ఒక క్లబ్బు పుట్టింది ... బెర్మ్యూడా క్లబ్! - HCU Bermuda Club!

కట్ చేస్తే ...

E అంటే ఈ వీ ఆర్ సీ మోహనరెడ్డి
R అంటే రాజశేఖర్
M అంటే మూసత్ సుబ్రహ్మణ్యం
U అంటే యూ వీ రమణయ్య
D అంటే డేవిడ్, దత్తు, దాసు
A అంటే అరుణ్ కుమార్

వీరందరూ ఒకే రూములో కూర్చునే రీసెర్చి స్కాలర్లన్నమాట. పాపం వాళ్ళ ప్రమేయం లేకుండానే లాగబడ్డారు .. అదే గ్రూపుకి చెందిన 'బీ' అనే వాడి వల్ల. ఆ "B" ఎవరో మీకు చెప్పక్కరలేదనుకుంటా.. అదీ సంగతి :))

మళ్ళీ కట్ చేస్తే ...

యూనివర్సిటీ కల్చరల్ ఫెస్టివల్ సుకూన్ ... కొత్తగా వచ్చిన ఈ క్లబ్బు స్టేజ్ షో ఒకటీ చేసింది - దానిలో ప్రత్యేకత, జనాలకి కుళ్ళీన టోమేటోలు ఇవ్వడం. కామేడీషో కి ఎవడికీ నవ్వురాకపోయినా, కామేడీ చేసిన వాడిని ఎవడైనా టొమేటో తో కొడితే జనాలు నవ్వుతారు కదా .. అదన్నమాట ... ఆ షో కూడా సూపర్ హిట్. ఇంతకీ దాని పేరు తెలుసా? Ace Whole Show!
దానిలో ప్రత్యేక ఆకర్షణా పేరడీలూ .. ప్రమాదవనంలో అక్కయ్యా అక్కయ్యా పేరడి అలాంటి షో నుండీ వచ్చిందే.

ఈలోగా రేడీకల్ ఫెమినిష్టుల పోస్టర్లు ఎక్కువయ్యాయి .. మన వాళ్ళు కూడా పోటీగా వెయ్యడం మొదలు పెట్టారు ( పెట్టాడు అనాలి .. హీ హీ హీ) .. వాళ్ళు పెట్టీన ప్రతీ పోస్టర్కీ కామెడీగా రెస్పాన్స్ వచ్చేది .. దీని వల్ల క్లబ్బరులు చేసిన పనేమిటంటే, వారికి తెలియకుండానే ఫెమినిష్టులని నీరుగార్చడం. వారి ప్రతీ పోస్టర్నీ కామేడి చేసి ...

వారికి చైర్రెత్తుకొచ్చి .. నాటు పోస్టర్లు వయ్యడం మొదలు పెట్టారు .. మచ్చుకి ...

What if the man starts menstruating?

Govt is Male Chauvinist .. those three days will be holidays
Males will be males only for 3 days
3 days a mont will be spent on religious undertakings

etc


మనవాళ్ళు కూడా దేశముదుర్లేగా .. దానికి కూడా రెస్పాన్స్ ఇచ్చారు ...

Our INDECENT answer to your INDECENT question

What if the male starts menstruating?

A: Even the Sanitary Napkin says "GIVE ME REDDDDDDDDDDDDDDDDD" ... Eveready!!!


పాపం రేడికల్ ఫెమిష్టు పని కుడితిలో పడ్డ ఎలకలా తయారయ్యింది. ఒక గుంపుని పోగేసుకుని ఈ క్లబ్బుకి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు, అంతా అగ్రవర్ణాల సాంస్కృతిక వాదులని. The more they talked about the club, the more famous it became. అప్పటికే పాప్యులర్ అయిన క్లబ్బు ఒకేసారి 175 మంది మద్దతుదార్లని సమకూర్చుకుంది. దానితో Bermuda క్లబ్బర్లకి కొత్త సమస్య వచ్చింది - ఎలక్షన్లలో పోటీచేసే వాళ్ళు మద్దతు అడగడం. అసలు క్లబ్బుకి పేరు రావడానికి కారణం, రాజకీయాలకి, కులమతాలకి అతీతంగా పని చెయ్యడం. వాళ్ళని వదిలించుకునే సరికి తల ప్రాణం తోకకొచ్చింది. అలగే రాత్రి పూడా క్రికెట్ కప్ పోటీని మొదలు పెట్టిన ఘనత కూడా క్లబ్బుదే .. ఆ తరవాత నా వింగ్ మేట్, దురదృష్టవశాత్తూ గుండేపోటుతో మరణీంచిన నారాయణరెడ్డి పేరు పెట్టారు దానికి.

ఈలోగా మరో గడవ - 1995 ఆగస్టు పదిహేనో తారీకు నాడు కేంపస్ లో ఒక విద్యార్ధిని అత్యాచారానికి గురైంది. దానికి పాల్పడ్డవారు కేంపస్ బయనుండి గేదెల్ని తోలుకొచ్చి మేపుకునే వారు. కాని ఈ రేడికల్ ఫెమినిష్టులు ఆ నేరాన్ని మగ విద్యార్ధుల మీదకి తోసేశారు. దానితో అబ్బాయిలకీ మిగతా అమ్మాయిలకీ కూడా చిరాకేసింది. ఎవడో బయటవాడు చేసిన దానికి కేంపస్ లో అబ్బాయిలని ఎందుకు నిందిస్తున్నారని సణగడం మొదలు పెట్టారు.( అసలు అర్ధరాత్రి 12 గంటలకి ఆడపిల్లలు ఆరోజుల్లో వంటరిగా తిరగగలిగినది రాష్ట్రం మొత్తం మీడ ఒక సెంట్రల్ యూనివర్సిటీలోనే. )

ఈలోగా ఒక గ్రూపు వాళ్ళు ఆ అమ్మాయికి నష్ట పరిహారం ఇవ్వాలని డెమేండ్ చేశారు. దానితో కొంతమంది అమ్మాయిలు రెచ్చిపోయి "అయితే మామీద కూడ అత్యాచారాలు చెయ్యండి, మాకు కూడా నష్టపరిహారం ఇవ్వండి" అని కేక్లెయ్యడం మొదలు పెట్టారు. దానితో కోపగించుకున్న ఒక వ్యక్తి "మీకంత సీను లేదు. మీమొహాలని చూసినవాడెవ్వడూ మీదగ్గరికి కూడా రాడు" అని ఒక కుళ్ళు జోకేశాడు. ఏమి జరుగుతోందో అర్ధమయ్యేలోగానే విషయం పక్కదారి పట్టి, నానా గొడవా అయ్యింది. ఒక మగ ఫెమినిష్టు ప్రొఫెసర్ ALL MALES ARE BAS***** అనే స్థాయి దాకా వెళ్ళాడు. ఇక మగవాళ్ళు రంగంలోకి దిగారు. క్లబ్బు పాప్యులారిటీ విస్తరించింది. ఆ క్లబ్బులో ఈ ఫెమిష్టులతో చిర్రెత్తిన అమ్మయిలు చేరడం మొదలు పెట్టారు. ఇక పండగే పండగ. ఇంతాచేసి ఆ నేరం చేసిన వాడిని పట్టూకుని ఒరేయ్ నీకంత ధైర్యం ఎలా వచ్చిందిరా అంటే, "పీకాక్ లేక్ దగ్గర పట్టపగలు ఫలానా వారిద్దరి కేళీ విలాసం చూసాను" అన్నాడూ. ఇంతకీ వారిద్దరూ ఎవరు? స్త్రీ వాదం పేరుతో విశృంఖల శృంగారాన్నికి పాల్బడ్డ ఒక మగ, ఒక ఆడ ఫెమిసిష్టులు .. గతుక్కుమన్నారు ..

కేంపస్ లో ఇలాంటివేమిటా అనుకుంటున్నారా? అప్పట్లో ఇవన్నీ మమూలే లెండి. నేచర్ క్లబ్, ఎడ్వంచర్ క్లబ్ మెంబర్లుగా ఉండే మేము కేంపస్ లో చాల Trekking చేసేవాళ్ళం. ఒకసారయితే దాదాపు 25 కిలోమీటర్ల పొడవున్న ప్రహరీగోడ మొత్తం నడిచొచాం కూడా. వెన్నెల రాత్రుల్లో Mushroom రాక్ అనే చోటికి వెళ్ళడం చాలా ఇష్టం మాకు. ఒక అయిదారుగురికి తకువ కాకుండా వెళ్ళేవాళ్ళం.

అమ్మయిలతో కలిసి వెళ్ళినప్పుదు ఫరవాలేదు గానీ, అబ్బాయిల గుంపుతో వెళ్ళినప్పుడు మాత్రం భయపడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఒకొక్కరోజు దారిపొడుగునా 'వస్త్రాపహరణం' సీనులే .. అసలే అబ్బాయిల గుంపు .. కొంపదీసి ఆ అమ్మాయి అబ్బాయి, మేమేదో సామూహికంగా చెయ్యబోయామని గొడవ చేస్తే? అరిటాకు ముల్లుమీద పడ్డా, ముల్లు అరిటాకుమీద పడ్డా, జనాలు తిట్టేది ముల్లునే కదా?

ఈ పిడకలవేట సరే గానీ, తరవాత వాళ్ళంతా కలిసి స్ట్యూడెంట్ యూనియన్ ఎలక్షన్లలో అమ్మయిలకి రిజర్వేషన్ కావాలి అని గొడవ పెట్టారు. క్లబ్బు రాయుళ్ళకి తిక్కరేగింది .. బుధ్ధుందా లేదా? యూనివర్సిటీ పక్క పల్లేటూళ్ళో అయిటే మద్దతిస్తాం, మన కేంపస్ లో ఎందుకు దండగ అని వ్యతిరేకించారు. అప్పట్లో ఆ పని జరగలేదు. ఇప్పటి పరిస్థితి ఏమిటో తెలియదు. "అమ్మాయిలు గెలిచే సీను లేదో" అని చెప్పి గోల చెశారు. Bermuda క్లబ్బు రాయుళ్ళు వాళ్ళలో ఒక అమ్మాయిని నిలబెట్టారు - ఆ అమ్మాయి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది, as a cultural secretary. పాపం ఫెమినిష్టుల నోళ్ళు మళ్ళీ మూతపడ్డాయి.

ఇలా చెప్పాలంటే చాలా చాలా ఉంది లేంది. కానీ మేమంతా కేంపస్ వదిలేసిన తరవాత, "రేడీకల్ ఫెమినిష్టు వ్యతిరేక" గుంపు నుండి క్లబ్ "స్త్రీ ద్వేష సంఘం" గా మారిందని విన్నా. అలా మారిన ఏ గుంపైనా పతనమవ్వడం ఖాయం - ఆ క్లబ్బుకి కుడా అదే గతి పట్టిందని లేటెస్ట్ న్యూసు. ఇక వారికీ, పురష ద్వేషులైన రేడీకల్ ఫెమినిష్టులకి తేడా ఏముంది?

ఎందుకో మన అక్కయగారి స్క్రీన్ షాట్ట్ చూసాక ఈ ఫ్లేష్ బేక్ అంతా బుర్రలో తిరింగింది. క్లుప్తంగా వ్రాసి పారేశా :)) Shall write about this in detail later.

Feb 20, 2010

"కేరడీ" - మరో మరో కెలుకుడు పేరడీ - "బ్లాగుల్లో కొచ్చి చూడరో"

.
.
.
.
.
.

"ప్రేమంటే ఇదేరా" - "బొంబాయి బొమ్మ సూడరో" పాటకి నా "కేరడీ"





బ్లాగుల్లో కొచ్చి చూడరో నీ సిగతరగా నీ మెదడు కుళ్ళిపోవురో
ఒక్క పోస్టు చదివి చూడరో నీ సిగతరగా ఎర్రగడ్డకి పారిపోనురో


చరణం:

వస్తునే వెల్కం చెబుతా
నీకు టెంప్లేట్ చేసిపెడతా
వందకి పైగా కామంట్లే పెట్టిస్తా
కాగడా పేరడీ వ్రాయించేస్తా

కెబ్లాసలో వచ్చి చేరవోయ్ నీ సిగతరగా కెలుకుడంతా నేర్పుతామురోయ్
నీకన్న తోపు ఎవ్వడొయ్, నీసిగతరగా ఎదుతొస్తే కాలులాగవోయ్


చరణం:

అక్కల వంటలు తినిపిస్తా
కడుపులో మొత్తం దేవిస్తా
మార్తండం బ్లాగు కధలన్నీ చదివిస్తా
పొద్దున తిన్నది కక్కించేస్తా

కూడలిలో వెతికి చూడకోయ్ నీ సిగతరగ ప్రపీసస కానరాదురోయ్
ఇంకానీ కోపికుందటొయ్ నీ సిగతరగా పరమవీర చక్ర నువ్వేనోయ్

ఈ పేరడీ ఆడియో వినే గుండెధైర్యం ఉన్నవాళ్ళు క్రింది బొమ్మలోని లింకును క్లిక్కండి


BLOGULLO
BLOGULLO.wav
Hosted by eSnips



If you have problems accessing the wav file then you may play a relatively low quality MP3 file here

Get this widget | Track details | eSnips Social DNA

.
.
.
.

Feb 14, 2010

వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి General Knowledge in Telugu on current Events: కాగడా (Kagada)

(సీ సీ కే రావు గారికి క్షమాపణలతో)


కాగడా వార్తల్లోకి రావడానికి కారణం -- కాగడా మీద ఎదురుదాడి జరిగింది

కాగడా బ్లాగు ఏ సంవత్సరములో మొదలయ్యింది - 2009

కాగడా ప్రవృత్తి - "పరిశుధ్ధమైన" భాషలో పేరడీలు వ్రాయడం

కాగడా కేసులో అనుమానితులు - మలక్, రవిగారు, పవన్

కాగడా కేసులో ప్రధాన నిందితుడు - పవన్

కాగడా బ్లాగంత వివాదాస్పదమైన మరో బ్లాగు - ధూం

కాగడాకి, ధూం కి సారూప్యములు- బ్లాగక్క తో శతృత్వం

కాగడా బ్లాగుని ఇటీవల తొలగించిన ఎగ్రిగేటర్ - హారం

ఇతరవివరాలకి హారమో కూడలో చూడండి

పదవ నెంబరు ప్రమాద సూచిక: అలాస్కా అచ్చమ్మ కబుర్లు

.
.
.
.

మలక్పేట్ రౌడీ: ప్రమాదవనంలోకి కొంత ఉత్సుకతతో, మరికొంత అనుమానంతో భయం భయంగా తొంగి చూస్తున్న వీక్షకమహాశయులకు కెలికాస్కారం. ఈసారి ముందుగా మనం స్వాగతం చెబుతోంది అలాస్కా అచ్చమ్మ గారికి, అచ్చమ్మ గారూ నమస్తే!

అచ్చమ్మ: నమస్తే రౌడీ అన్నా! ఏంటి ఇవాళ నన్ను ముందు పిలిచావు? నీ ఘోస్టు ఎక్కడ?

రౌడీ: అదే ట్విస్టు ఇక్కడ. నిన్ను పిలిచింది ఇది హోస్టు చెయ్యడానికి

అచ్చమ్మ: ఓర్నీ, నన్ను ఇంటర్వ్యూ చేస్తావనుకుని పట్టు చీర, రే బేన్ గ్లేసులు, వంటినిండా నగలూ దిగేసుకునొచ్చాకదయ్యా? ఇప్పుడూ నా మీద ఫోకస్ లేకపోతే ఏలా?

రౌడీ: ఫోకస్ నీమీద ఉంచుకోగల కేపేసిటీ నీకుందని తెలుసులే. ఇక మొదలెడదామా?

అచ్చమ్మ: ఏమిటి మొదలెట్టేది? గెస్టెవరు ఇవాళ?

రౌడీ: ఇవాళ మనకి గెస్టులు అంచెలంచెలుగా వస్తూంటారు - ఇవిగో స్క్రిప్టు పేపర్లు - ఇక మొదలెట్టు . ఈసారి తుంటర్వ్యూ కాస్త సీరియస్. హాస్యం పాలు తక్కువ. సమయాభావం వల్ల కాస్త అతుకుల బొంతలా తయారయ్యింది.



అచ్చమ్మ: సరే సరే. మన మొదటి గెస్టు - కనేటికట్ కాగడా మొగుడక్కయ్య. మొగుడక్కయ్యగారూ నమస్తే

మొగుడక్కయ్య: నమస్తే నమస్తే.

అచ్చమ్మ: ముందుగా, మీ పేరు వెనక రహస్యం చెప్తారా?

మొగుడక్కయ్య: నాకీపేరు పెట్టిన రౌడీనే అడుగు

అచ్చమ్మ: రౌడీ?

రౌడీ: అబ్బే అదేమీ లేదు. బ్లాగుల్లో అక్క, కాగడాకి మొగుడు కదా, అందుకే రెండూ కలిపా. ఏలా ఉంది మన క్రియేటివిటీ?

అచ్చమ్మ: ఏడ్చినట్టుంది. నువ్వూ నీ కుళ్ళుజోకూను. సరే మొగుడక్కా, ఒక మూడూ రోజులపాటు హడావిడి చేశావ్ కదా, నువ్వు సాధించినదేమిటి?

మొగుడక్కయ్య: కాగడా హారం తెంపేశానుగా! అంతకన్నా విజయం ఏమికావాలి

అచ్చమ్మ: ఓహో, మరి పవన్ని బక్రా చేసిందెందుకు?

మొగుడక్కయ్య: పవనే కాగడా, కాగడానే పవన్. ఇద్దరి టైం జోను ఒకటే, ఇద్దరూ ఒకేరోజు బ్లాగులు తెరిచారు

రౌడీ: అమ్మా, తల్లీ, కాగడ ఏడాది క్రితమే బ్లాగుల్లోకొచ్చాడు. కొంతకాలం బ్లాగ్ మూసేసి మళ్ళీ రీఓపెన్ చెశాదు.

మొగుడక్కయ్య: అంత లేదు. నీకేమి తెలియదు గానీ కాస్త తగ్గు

అచ్చమ్మ: మరి మంచుపల్లకిని ఇరికించిందెందుకూ?

రౌడీ: వీళ్ళిద్దరూ మహిళామండలికి వ్యతిరేకంగా ఏదో గోల చేశారు అదీ కచ్చ ..

(బేక్ గ్రౌండ్ లో ఇత్తడి కంఠం - ఇనుముకెక్కువ, కంచుకు తక్కువ)

స్టేలిన్ మావో జిందాబాద్. స్త్రీలందరికీ విరోచనం .. సోరీ .. విమోచనం కావాలి ... స్టేలిన్ మావో జిందాబాద్ .. జిందాబాద్ .. జిందాబాద్ ..

అచ్చమ్మ: వీక్షకులారా, ఈయనే మన రెండో గెస్టు - రాజాధి రాజ, రాజ మార్తాండ, ప్రవతార బిరుదాంకిత, స్త్రీ విమోచన సాధక, వదినవాంఛక డాక్టర్ ప్రనా! ప్రనా గారూ, నమస్తే.

ప్రనా: నమస్తే అన్నది సంస్కృతపదం, హిందువులకి గౌరవ సూచకం - నేను నాస్తికుడిని అందుకే మీకు తిరిగి చెప్పను

అచ్చమ్మ: సరే ప్రనా గారూ, మీరు మీ కధల వల్ల బ్లాగుల్లో చాలా పాప్యులర్ అయ్యారని వినికిడి - ఏవీ మచ్చుకి రెండు కాన్సెప్ట్లు చెప్తారా?

ప్రనా: తప్పకుండా! నా కధల్లో రెండు తప్పనిసరిగా ఉండాలి. ఒకటి - విలన్ పేరు భరద్వాజ, రెండు - వదినా మరుదుల మధ్య ప్రేమ సందేశం

మొగుడక్కయ్య: తల్లిలాంటి వదినతో ప్రేమకలాపాలేమిట్రా త్రాష్టుడా? ఎక్కువ మాట్లాడితే తిట్ల డండకం చదువుతా జాగ్రత్త. లేకపోతే అచ్చమ్మ బ్లాగులో వంటలన్నీ తినిపిస్తా. చచ్చూరుకుంటావ్

అచ్చమ్మ: మొగుడక్కా, శాంతించు. అసలే వంటల జ్యోతిని మెంటల్ జ్యోతి చేశాడు. ఇక నిన్నేం చేస్తాడో.

మొగుడక్కయ్య: నా స్ట్రేటజీముందు వీడెంత?

అచ్చమ్మ: సరేగానీ మొగుడక్కా, ఒక విషయం చెప్పు - నీ వెనకాల ఉన్న లేడీస్ గేంగ్ ఎవరు?

మొగుడక్కయ్య: నా వెనకాలెవ్వరూ లేరు నేను నేనే. నువ్వు నీ జంధ్యాల తిట్ల డండకం వినిపించినా సరే, నా సమాధానం ఇదే.

అచ్చమ్మ: మరి వంటలు మానేసి పెంటల మీద పడ్డావెందుకు?

మొగుడక్కయ్య: వంటల స్పెషలిష్టువి నీకు తెలియదా?

ప్రనా: ఆగండాగండి. ఇంతకీ మీ ఇద్దరిలో బ్లాగక్క ఎవరు? నాకిద్దరూ ఒకేలా కనిపిస్తున్నారు

అచ్చమ్మ: అసలు కనిపిస్తున్నందుకు సంతోషించండి. మొగుడక్క బూతుల బ్లాగుకి కారణాలు ఇవీ అని జనాలు చెవులూ ముక్కులూ కొరుక్కుంటున్నారు

1. కాగడ మీద కచ్చ .. కాగడా ఎవరో తెలియక - తెలిసినవారిమీద దాడి - ఎదురుదాడి చేశామన్న తుత్తి కోసం
2. కాగడానే కాగడా మొగుడి అవతారం ఎత్తడం - తన టీ ఆర్ పీ రేటింగులు పెంచుకోవడం కోసం
3. ఎవరెవరో తెలియని కంఫ్యూషన్
4. మిగతావారి మీద ఉన్న వేరే కచ్చని ఈ విధంగా తీర్చుకోవడం
5. పైవన్నీ
6. శ్రీనివాస్ చెప్పిన కారణాలు

Viewers, మీకు తోచిన సమధానాన్ని కామెంటండి. ప్రైజ్ - మొగుడక్క బ్లాగులోకి ఉచిత ప్రవేశం.

అరే మన తరువాయి గెస్ట్ వచ్చేశారు, టెన్నెసీ తాతారావు గారూ, నమస్తే.

టెన్నెసీ తాతారావు: నమస్తే

అచ్చమ్మ: వీరి బధ్ధ విరోధి కొలంబస్ కోదండం గారికి కూడ స్వాగతం

కొలంబస్ కోదండం: నమస్తే.

అచ్చమ్మ: తాతారావుగరొక సమైక్యవాది, కోదండంగారేమో ఒక వేర్పాటువాది. ఇప్పుడు వీరిద్దరూ కొట్టుకుంటారు - తూచ్ - చర్చించుకుంటారు. అన్నట్టు వీరిద్దరికీ చిన్నపేర్లంటే ఇష్టమండోఇ - అందుకే తాతారవు గారిని "తా", కోదండం గారిని "కొ" అని పిలుద్దాం.

తా: ఏమిటండీ అసలు? అతి తక్కువ శాతమున్న ఆంధ్రులు తెలంగాణావారిని దోచేస్తున్నారంటే నమ్మకంగా ఉందా? దోపిడీ నెపంతో ఆంధ్రులపై ద్వేషం వెళ్ళగక్కుతున్నారు. నేనడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా?

కో: ఏమీ కాదు. కావాలంటే మీప్రశ్నలన్నిటీకీ సమాధానం ఈ లింకుల్లో ఉంది చూడండి

తా: అరే! నేను ప్రశ్నలడగకుండానే సమాధానం ఉందంటారేమిటి?

కో: మీరడిగే ప్రశ్నలు నాకు ముందే తెలుసుగా

తా: మీ తెలంగాణావారందరూ తాగుబోతులు. బధ్ధకస్తులు. దగుల్బాజీలు.

అచ్చమ్మ: తా గారూ, మీ ఆరోపణలకి ఆధారం ఏమిటి? లెక్కలేమన్నా ఉన్నాయా?

తా: నా లెక్కలు నావి నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు

కో: చూసారా? ఇదీ ఆయన వరస. Hyd లో తెలంగాణేతరులు ఎక్కువున్నారు. వారే తాగుతున్నారు. తెలంగాణవారు పాలు తప్ప ఇంకేమీ తాగరు.

తా: అబ్బా, ఛా?

కో: మరే, కావాలంటే లెక్కలు చూడండి. స్థానికులెంతమందో స్థానికేతరులంతమందో తెలుసుకుని మాట్లాడండి

రౌడీ: అంటే స్థానికులకంటే స్థానికేతరులే ఎక్కువంటున్నారా?

కో: (స్వగతం) అమ్మో, పెద్ద చిక్కొచ్చిపడింది. స్థానికేతరులెక్కువ అంటే, ఒక ఇబ్బంది లెకపోతే తా గారి లెక్కల్ని ఒప్పుకోవాల్సి వస్తుంది - ఇప్పుడెలా? )

అబ్బే నేనలా అనలేదు. స్థానికుల స్థానికేతరుల లెక్కలని పరిగణలోకి తీసుకోమన్నాను అంతే.

రౌడీ: సరే, తా గారూ, కో గారూ, మీ పోరాటం కేవలం హైదరాబాదు కోసమని ఆరోపణ. ఏమమటారు

తా: అబధ్ధం. నాకు కావాల్సింది సమైక్యాంధ్ర.

కో: ముమ్మాటికి తప్పు. మాకు కావాల్సింది మొత్తం తెలంగాణా.

రౌడీ: సరే, తా గారూ తెలంగాణానుండి హైదరాబాద్ ని విడగొడితే, మీరు తెలంగాణా కి మధ్ధతిస్తారా?

తా: కష్టమే గానీ సర్దుకుపోతాం

రౌడీ: కో గారూ, హైదరాబాద్ లేకపోతే తెలంగాణా కి వారొప్పుకుంటున్నారు, మీరేమంటారు?

కో: హైదరాబద్ లేని తెలంగాణ మాకొద్దు.

రౌడీ: అదేమిటండీ? హైదరాబాద్ అంటే ఒకటో రెండో జిల్లాలేగా? ఈ గొడవ తేలేదాకా దానిని పక్కన పెట్టి మిగతా తెలంగాణా తీసుకోవచ్చుగా? మిగిలిన జిల్లాలు జిల్లలు కావా? మిగిలిన వారు మనుషులు కారా?

కో: హైదరాబాద్ తెలంగాణా లో అంతర్భాగం. అది లేని తెలంగణా మాకొద్దు

రౌడీ: మరి కర్నాటకకి, మహరాష్ట్రకి జిల్లాలని వదులుకున్నారుగా?

తా: విడిపోయిన రాష్ట్రాలకెప్పుడూ రాజధాని దక్కలేదు

రౌడీ: అంటే మీ ఇద్దరికీ సమైక్యాంధ్ర, తెలంగాణాల మీద ప్రేమ కన్నా హైదరాబాద్ భూములమీద మమకారం ఎక్కువ. తమ ఆస్థులు ఎక్కడపోతాయో అని తా గారు, రియల్ ఎస్టేట్ చీప్ గా కొట్టెయ్యచ్చని కో గారు .. అంతేగా?

నిజంగా సమైక్యాంధ్ర మీద ప్రేముంటే తా గారు హైదరబాద్ ని విడగొట్టడానికి ఒప్పుకునేవారు కాదు. అలగే కో గారికి తెలంగాణా మీద ప్రేముంటే ముందు హైదరాబాద్ ని పక్కన పెట్టి మిగిలిన జిల్లాలని సాధించుకునేవారు. తరవాత హైదరబాద్ గురించి పోరాడేవారు. తొమ్మిది జిల్లాల పోరాటం ఒకటిన్నర జిల్లాలకి పరిమితమయ్యేది.

తా గారికి హైదరాబాద్ తప్ప తెలంగాణా అక్కరలేదు, కో గారికి హైదరాబాద్ తప్ప తెలంగాణాలో మిగిలిన జిల్లాలు అక్కరలేదు. ఇంతా చేసి వెర్రి వెధవలయ్యింది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మెహ్బూబ్నగర్ ప్రజలేగా?

వేర్పాటువాదులు సమైక్యవాదులు కలిపి కోస్తోంది "కో" "తా" - కోతలే!

తమిళనాడు నుండి విడిపోవడానికి "ఊ" కొట్టిన వారు తెలంగాణా విడిపోడానికి "ఊహూ"!

తెలంగాణా విడిపోవడానికి "ఊ" కొడుతున్న తెలగాణ్యులు హైదరాబాద్ విడిపోడానికి "ఊహూ"!!



అచ్చమ్మ: నాయనా రౌడీ, నీ సుత్తాపెహే. ఛాన్సు దొరికింది కదా అని స్పీచ్లిస్తున్నావ్.

(ఇంతలో ఏదో పైనుండీ "ధబేల్" మంటూ క్రింద పడ్డ శబ్దం)

అచ్చమ్మ: ఇతనెవరు? పక్క ద్వారాల్లోంచి రాకుండా పైనుండి కప్పు చీల్చుకుని మరీ వచ్చాడు?

రౌడీ: ఇతనే మన బ్లాగుల్లోనున్న ఏకైక డిఫెక్టివ్... సోరీ... డిటెక్టివ్ వికటకవి రాజేష్.

అచ్చమ్మ: అబ్బో, ఏమేమి అపరాధ పరిశొధనలు చేశాడేమిటి?

రౌడీ: చాలా ఉన్నాయ్:

* తాడేపల్లి గారే ధూము, దుర్గేశ్వర గారే కాగడా అని, సెన్సేషన్ క్రియేట్ చేసి పాదరక్షాఘాతాలు, అదే చెప్పు దెబ్బలు తిన్నాడు

* మలక్ ఏకలింగం ఒకరే అని తేల్చేశాడు

* పైత్యావలోకనం బ్లాగును హేక్ చేసింది పెట్టుబడి దారు జార్జ్ బుష్ అని కనిపెట్టాడు

* ప్ర నా కి వ్యతిరేకంగా ఒబామా, సీ ఐ యే, బ్రిటిష్ ప్రభుత్వం పన్నిన కుట్రని విఫలం చేశాదు.

* ఇప్పుడు కొత్తగా వచ్చిన బోడిలింగం బ్లాగును పట్టుకోబోతున్నాడు


అచ్చమ్మ: అలాగా! స్వాగతం డిటెక్టివ్ రాజేష్ గారూ! ఈ బోడిలింగ రహస్యాన్ని ఎలా ఛేదించబోతున్నారు?

రాజేష్: ఇది నా ఎడమ చేతి పని. కాగడా మొగుడి లిస్టులో ఏకలింగం పేరు లేదు అన్న వాదనని పట్టుకుని ముందు జాగ్రత్త గా ఈ సారి పకడ్బందీ ప్రణాళిక తొ ఈ బ్లాగు పెట్టారు.

అచ్చమ్మ: కొంపదీసి కోడిహళ్ళి మురళీమోహన్ గారో, ఆచార్య ఫణీంద్రగారో ఈ పని చేశారని తేల్చరుకదా?

రాజేష్: అరే! నేను అదే రూట్లో ఆలోచిస్తున్నా. మీరెలా కనిపెట్టేశారు.

అచ్చమ్మ: తమ ఘన చరిత్ర చూసి.

రాజేష్: థేంక్యూ, థేంక్యూ.

అచ్చమ్మ: (స్వగతం: ఒరేయ్ వెధవాయ్, నేను నిన్ను పొగడలేదు, తిట్టాన్రా) దీని తరవాత ఏం పరిశొధన చెయ్యబోతున్నారు?

ప్రనా: ఏహే, ఇదంతా ఎందుకు? బోడిలింగం వదిన పేరు చెప్పు, బోడిలింగమేవరో నేను క్షణాలలో చెప్తా

అచ్చమ్మ: అబ్బా ప్రనా! మీరుండండి. రాజేష్, మీరు చెప్పండి

రాజేష్: చాలా ఉన్నాయండీ, ముఖ్యమైనది మార్తాండ జన్మ రహస్యం

అచ్చమ్మ: అలాగా? దాని గురించి కాస్త విశదీకరిస్తారా?

రాజేష్: తప్పకుండా. మార్తాండుడు పుట్టే సమయంలో బ్రహ్మ దేవుడు స్టేలిన్ మావోల సినిమాలు చూస్తున్నాడా, లేక రంగనాయకమ్మ, చలం నవలలు చదువుతున్నాడా అన్న దిశలో పరిశొధన సాగిస్తాను. దానిని బట్టీ మనకి చాలా విషయాలు తెలుస్తాయ్.

ప్రనా: నేనొప్పుకోను. వారిద్దరూ నాకే స్వంతం.

అచ్చమ్మ: ఏమిటది? ఇద్దరు హీరోయిన్లున్న హీరో డైలాగులా?

ప్రనా: సారీ సారీ, వారిద్దరి పరిజ్ఞానం నాకే స్వంతం. బ్రహ్మదేవుడు చదవడానికి వీల్లేదు. లేక పోతే బ్రహ్మదేవుడి వదిన మీద కొత్త జిగురు - అంటుకుంటే వదలదు - అనే కధ వ్రాసి బ్రహ్మదేవుడిని ఓడిస్తా.

అచ్చమ్మ: కధ వ్రాసి బ్రహ్మదేవుడిని ఓడిస్తారా? మీరు నాస్తికులేమో కదా?

ప్రనా: ఉబుంటూ తెలిసినవారికి ఇది చాలా తేలిక. సహాయం కావాల్సిన వారు నాకు ఫోన్ చేస్తే నేను సహాయం చెయ్యగలను

అచ్చమ్మ: ఉబుంటూకి బ్రహ్మదేవుడికి ఏమిటి సంబంధం?

ప్రనా: విలన్ భరద్వాజ్ కాబట్టీ!

అచ్చమ్మ: ఒక విషయానికి, తరవాత దానికి సంబంధంలేకుండా మాట్లాడుతున్నారేంటి?

ప్రనా: కావాలంటే నా లింకులు చూడండి. లండన్ లో "జూనియర్ డాక్టర్" మాటలు మీరు వినాలి

అచ్చమ్మ: లండన్ లో జూనియర్ డాక్టర్లు ఉంటారా?

ప్రనా: లియో టాల్స్టాయ్ కధలు చదివిన హేతువాదులు ఇలాంటి ప్రశ్నలడగరు

అచ్చమ్మ: రౌడీ, నాకు పిచ్చెక్కుతోంది. టాపిక్ మారుస్తున్నా - ఇప్పుడు సమస్యాపూరణం

రౌడీ: చచ్చితిని. రవిగారు, జ్యోతి అని కాకుండా కాస్త మంచిది ఇవ్వు

అచ్చమ్మ: సరే, సరే .. ఈ సారి సమస్య .. "కాగడాకు పవను మిత్రుడగును" - పద్యం ఛందోబధ్ధంగా ఉండక్కరలేదు - కాస్త పద్యంలా వినబడితే చాలు.

రౌడీ: మళ్ళీ నన్ను ఈ వివాదంలోకి లాగాలని చూస్తున్నావా?

సరే, వివాదంతో సంబంధంలేకుండా చెప్తా ...






శాస్త్రవేత్తలు చెప్పె నగ్నిదేవునకెపుడు
ఆక్సిజన్ను ప్రాణప్రదము గాన
ప్రాణవాయువుతోడ కణకణా మండేటి
కాగడాకు పవను మిత్రుడగును


(శాస్త్రవేత్తలు చెప్పినట్టు మంటకి ఆక్సిజన్ ప్రాణప్రదం కాబట్టీ, దానితో మండే కాగడాకి పవనుడు, అంటే వాయుదేవుడు, మిత్రుడు అని భావము)


అచ్చమ్మ: సరే, ఇక పేరడీ టైం - రౌడీ, పేరడీ వదులు:

రౌడీ: ( పాతాళ భైరవి - కలవరమాయే మదిలో ట్యూనులో)


కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో
హారంలో ఇది సంచలనమాయే
బ్లాగర్లంతా సతమతమాయే

కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో


చరణం:

కాగడాకే మొగుడిని అంటూ
కొత్తవతారం వచ్చింది
కాగడాకే మొగుడిని అంటూ
కొత్తవతారం వచ్చింది
ఉరిమి ఉరిమి మంగళమైన
పవను మీద పడెనయ్యయ్యో

కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో


చరణం:

ఎంకికి పెళ్ళే సుబ్బి చావని
బ్లాగ్లోకం కోడై కూసింది
ఎంకికి పెళ్ళే సుబ్బి చావని
బ్లాగ్లోకం కోడై కూసింది
కాగడానే పవనుడంటూ
సడేమియా సందడిలో


కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో
హారంలో ఇది సంచలనమాయే
బ్లాగర్లంతా సతమతమాయే

కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో


అచ్చమ్మ, రౌడీ: గెస్టులకి ధన్యవాదాలు. ఇంతసేపూ ఈ సుత్తిని ఓపికతో వీక్షించిన వీక్షకులకి కూడా. సమయాభావంవల్ల దీనిని పూర్తిగా వ్రాయలేకపోయాం. వచ్చే తుంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకూ కెలవ్.

.
.
.
.

Feb 10, 2010

ఈ కెలుకుడు బ్లాగు పెట్టి ఏడాదయిన సందర్భంలో అలాస్కా అచ్చమ్మ గారి తుంటర్వ్యూ - త్వరలో ..

  




తరువాయి ప్రమాదసూచిక కోసం చూస్తునే ఉండండి :))


PS: ఈ మధ్య కాలంలో ( అంటే అక్టోబర్ 2009 ) నుండీ కెలకడానికి సరియైనవారులేక ఈ బ్లాగు మూతపడుతుందేమోననే భయంతో ఉన్న మాకు కెలికే అవకాశం కల్పించిన శ్రీమతి కాగడామొగుడక్కయ్యగారికి కృతజ్ఞతలు :))

.
.
.
.

Oct 12, 2009

నా అభిమాన డేన్సర్ - Sam Anderson - మూడు రీమిక్సులు

ప్రభుదేవా బదులు శేం ఏండర్‌సన్ చేత "ముక్కాలా ముకాబ్లా" డేన్స్ చేయిస్తే? - Don't miss the end






శేం ఏండర్‌సన్ "గివ్స్ యూ హెల్"





శేం ఏండర్‌సన్ హిమేష్ రేషమియా - Dont miss the end!



Oct 1, 2009

తొమ్మిదవ నెంబరు ప్రమాదసూచిక: దిక్కుమాలిన బ్లాగరి స్పెషల్ :)) - Post updated with new conversation










SOME PEOPLE MAY NOT UNDERSTAND WHAT THIS IS ALL ABOUT, BUT I AM SURE, VERY SOON YOU WILL! (DEPENDING ON HOW MUCH TIME VEEVEN TAKES TO INCLUDE A BLOG IN KOODALI)



ఫ్రమాదవనం లోకి మళ్ళీ తొంగిచూస్తున్న వీక్షక మహాశయులందరికీ తిరిగి కెలికాస్కారం. ఈ సారి మన ఘోస్టు సియాటిల్ సీతక్క గారు

మలక్‌పేట్ రౌడీ: నమస్తే సీతక్కా

సియాటిల్ సీతక్క: నమస్తే రౌడీ అన్నా, అంతా బాగేనా?

మలక్‌పేట్ రౌడీ: అంతా బాగే సీతక్కా, ఇక మొదలు పెట్టు

సియాటిల్ సీతక్క: అందరికీ నమస్తే. ఈ సరి మన గెస్టు వాషింగ్టన్ వానమరావు గారు. ఏత్తు ఆరడుగుల ఏడంగుళాలు

మలక్‌పేట్ రౌడీ: అక్కో, నువ్వు మనుషులనే కాకుండా తాడీచెట్లనుకూడా తుంటర్వ్యూ చేస్తావా?

సియాటిల్ సీతక్క: కుళ్ళుజోకులాపకపోతే తాటకినౌతా జాగ్రత్త

మలక్‌పేట్ రౌడీ: వద్దులే - నువ్వు కానివ్వు

సియాటిల్ సీతక్క: వామనరావు గారూ, మీ పరిచయం?

వాషింగ్టన్ వామనరావ్: నేనొక సైకో ఎనలిస్టునండీ. మనుషులు వ్రాసేదానిని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని అంచనా వెయ్యడం నా వృత్తి, ప్రవృత్తి కూడాను

సీతక్క: అలాగా. అయితే మేము మీకు కొన్ని వాక్యాలని చూపిస్తే, అవి వ్రాసినవారి మనసులో ఏముందో చెప్పగలరన్నమాట

వామనరావ్: భేషుగ్గా!

సీతక్క: అయితే రౌడీ వ్రాతలతోనే మొదలు పెడదాం

రౌడీ: హతోస్మి!

ఇదిగోండీ మీ మొదటి పరీక్ష: We came, We saw, We Kelikified. దీని అర్ధం అందరికీ తెలుసు – కానీ ఇది వ్రాసేడప్పుడు రౌడీ మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పాలి

వామనరావ్: ఓస్ ఇంతేనా? ఏముందీ? – “నాకు సీరియస్ విషయాలు వ్రాసేంత సత్తా లేదు, అందుకే ఏదేదో బరికి నలుగురి నోళ్ళలో నానుదామని” – అంతేనా రౌడీ గారూ?

రౌడీ: అమోఘం ( స్వగతం: ఓరి వామనరావోయ్! ఇక్కడ అసలే నా పరువు జీరో, దానిని నెగెటివ్ లోకి నెడుతున్నావురోయ్)

సీతక్క: రౌడీ రాజ్యం కేప్షన్: ఏదో మీ బుర్రలు కాస్త తిందామని

వామనరావ్: ఇది కూడ సులువే. మిమ్మల్ని ఎలాగూ మెప్పించేటంత సీను నాకు లేదు. ఏదో బుర్రలైనా తిందామని. If I cant be famous, I should at least be infamous!

రౌడీ: (స్వగతం: వామ్మో, రూటు మార్చకపోతే మన బండారం బయట పెట్టేశేలా ఉన్నాడు) సీతక్కా, నా సంగతెందుకులే గానీ, ఎదైన “దిక్కుమాలిన బ్లాగు” మీద చేయించు ఈ సైకో ఏనలసిస్.

సితక్క: సరే సరే! నా కళ్ళూ కూడా ఇప్పుడే తెరుచుకున్నాయి .. Its an "Eye OOOpener" .. వామనరావ్ గారు, ఇప్పుడూ మీకు నేను కొన్ని వాక్యాలు ఇస్తాను, వాటి అర్ధాలు మీరు చెప్పాలి సరేనా?

వామనరావ్: నేను రెడీ!

సీతక్క: సరే మొదలుపెడదాం – ముందుగా “దిక్కుమాలిన చరిత్ర”

వామనరావ్: బ్లాగుల్లో నా బ్రతుకు

సీతక్క: ???

వామనరావ్: ‘నా” అంటే ఆ బ్లాగరిది అని అర్ధం

సీతక్క: ఓహో! సరే! “The other end of me”

వామనరావ్: "Thats what I speak with"

సీతక్క: చాలా రోజులనుండి బ్లాగులను గమనిస్తున్న ఎక్స్పీరియన్స్తో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా.ఈ బ్లాగులకు పట్టిన శనిగాళ్ళగురించి చెప్పాలి. బ్లాగులెంత ప్రశాంతంగా ఉండేవో ఒకప్పుడు.

వామనరావ్: అంటే దానర్ధం “నేను బ్లాగుల్లో ఎప్పటినించో ఉన్నా, వ్రాస్తున్నా, నన్నేవడు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఇప్పుడైనా ఎవడైన నా గోల వింటాడన్న ఆశ”. These guys stole the attention I deserved!

సీతక్క: ఏదో పరవాలేదు అనిపించేలా కొట్టుకున్నారు. జనాల్లో శాడిజాన్ని చూసే అదృష్టం దక్కింది అందరికీ.

వామనరావ్: కానీ ఏం లభం. నేనెంతా Sadist నో జానాలకి తెలియదుగా?

సీతక్క: అది ఇద్దరికే సంబంధించిన మేటర్ అని కనీసం జ్ఞానం లేకపోవటమేంటో.

వామనరవ్: వాళ్ళ మధ్యలో దూరితే నాలాంటీ తెలివితక్కువ మొహాన్ని ఇద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటారని తెలుసు అందుకే దూరలేదు.

సీతక్క: ఈ రవిగారు అని ఒకాయన ఉన్నాడు. రోడ్డు మీద కారు వెళ్ళినా కూడా, అందులో ఒక బూతు కనిపించేస్తది ఇతనికి.
వామనరావ్: నేనెన్ని బూతు వ్రాతలు వ్రాసినా ఒక్కడుకూడ చూడట్లేదు. ఆ రవిగారి బ్లాగు మాత్రం అందరూ చూసేస్తున్నరు.

సీతక్క: ఏదో చిన్న గొడవ అయితే, అది మనసులో పెట్టుకొని అతని టెంప్లేట్కి ఏదో చేసేసారని అపోహపడిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు.

వామనరావ్: ఆ గొడవలో నేను దూరబోతే నాకే చీవాట్లుపడ్డాయ్

సీతక్క: ఈలోగా ఈ కాగడాగాడొకడు. వీడిని తిట్టడానికి కూడా మాటల్లేవు. అత్యంత నీచమైన మనస్తత్వం గలవాడు. వీడికి హిపోక్రసీ లేదని చెప్పుకుంటాడు. అందుకని నోటికొచ్చిన బూతులన్నీ రాస్తాడు

వామనరావ్: ఇండైరెక్టుగా నేనెన్ని బూతులు వ్రాసినా ఎవ్వరూ చదవలేదు. ఖాని కాగడాగాడి బ్లాగుకి హిట్లే హిట్లు

సీతక్క: వీడికీ ఆ ఎదవ భరద్వాజ్గాడి సపోర్టు. ఈ భరద్వాజ్గాడు కొంచెం చదువుకున్నోడు. వీడికి ఈ దిక్కుమాలిన కాగడా గాడితో ఫ్రెండ్షిప్ ఏంటో అర్ధంకాదు

వామనరావ్: ఈ భరద్వాజ్ గాడు నన్నొక్కసరి కూడా సపోర్టు చెయ్యలేదు. నేనేదో అంటే తిరిగి నన్నే పది మాటలన్నాడు, అంట్లవెధవ. ఈడి జిమ్మడ, ఈడి సేతులడిపోను, ఈడి తద్దినమెట్ట, ఈడు సచ్చిపోనూ!!!

సీతక్క: అయినా ఈ భరద్వాజ్గాడితో అందరూ ఎలా చర్చిస్తారో నాకర్ధం కాదు. ఆడో పెద్ద గాసిప్మాంగర్

వామనరవ్: నేనెంత గాసిప్ రాసినా ఒక్కడు కూడా కన్నెత్తి చూడడంలేదు. వాడు గాసిప్ రాసినా జనాలు కామెంటుతున్నరెందుకో. వాడి ఫ్రెండ్ బ్లాగులకి వాడీ బ్లాగు కన్న హిట్లు ఎక్కవ వస్తున్నాయ్. నాతో ఒక్కడూ కూడా మాట్లాడడు.

సీతక్క: వీడో పెద్ద పుడింగిలా ప్రతి చర్చలో దూరి వీడి అతితెలివితేటలు ప్రదర్శిస్తుంటాడు.

వామనరావ్: అతి తెలివి మాట దేవుడెరుగు. మనకి మినిమం తెలివి కూడ లేదు

సీతక్క: ఇంక ధూం. ఇతను మంచోడో, చెడ్డోడో అర్ధంకాదు నాకు.

వామనరావ్: ఈ ధూముకి మరో చాన్స్ ఇచ్చి చూస్తా. ణన్ను సపోర్టు చేస్తే మంచోడూ, లేకుంటే చెడ్డోడు.

సీతక్క: ఆ పోరాడేదేదో కొత్తపాళితో గొడవ వచ్చినప్పుడు డైరెక్ట్గానే చెయ్యొచ్చు. అలా చేయ్యలేదు. కుళ్ళిపోయి, కుళ్ళిపోయి అతను కూడలిని వదిలి వెళ్ళిపోయినంతవరకూ ఊరుకోలేదు

వామనరావ్: కనీసం ఆ పోట్లాటలో నన్ను ఇన్వాల్వ్ చేసున్నా, నకు కొంచం పేరొచ్చేది. ధూము, కొత్తపాళీ పుణ్యమా అని. కానీ అంత అదృష్టం నాకేదీ?

సీతక్క: ఎవ్వరు మాట్లాడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే ప్రవీన్శర్మ.

వామనరావ్: వీడికి మూర్ఖత్వం ఉన్నా ఎక్కడో ఒక మూల కొంచం నిజాయితీ ఉన్నట్టూ కనిపిస్తోంది. కానీ అలాంటిదేమీ లేని నాకు వాడికున్నంత పేరు కూడా లేదు.

సీతక్క: రెండు సంబంధం లేని విషయాలను ఒకటి తరువాత ఒకటి ఎంతో బాగా అమర్చి చెప్పటంలో నిష్ణాతుడు.

వామనరావ్: నాకు ఒక్క విషయమే సరిగ్గ చెప్పడం చేతకాదు. వీడు రెండు విషయాలు ఎలా చెప్తున్నడబ్బా?

సీతక్క: ఈ కల్నల్ ఏకలింగం కూడా పర్వాలేదు. చుట్టూ అంత దరిద్రపు గ్యాంగ ఉన్నా కొంచం నీటుగానే నెట్టుకొస్తున్నాడు.

వామనరావ్: అందరినీ తిడితే మరి నాకు సపోర్ట్ ఎవరూ? చూద్దాం నా ఉచ్చులో ఏకలింగం చిక్కుకుంటాడేమో. ఊన్న వాళ్ళలో కాస్త సాఫ్ట్ కదా!

సీతక్క: ఈ భరద్వాజ్గాడు వీడికి తీరిక దొరికినప్పుడల్లా వేరే బ్లాగుల్లో వీడి అతితెలివి ప్రదర్శిస్తుంటాడు. ఊరికే కెలుకుతానని వాడే చెప్పుకున్నా జనాలు ఆడితో సీరియస్గా చర్చిస్తుంటారు

వామనరావ్: నేను చాలా సీరియస్ అని చెప్పినా సరే నన్నెవడూ పట్టించుకోడు. వాడు సీరియస్ కాదని చెప్పినా వాడితో చర్చిస్తూ ఉంటారు. ఇదెక్కడీ న్యాయం?

సీతక్క: కాని భరద్వాజ్ స్పూన్గాడి కామెంట్లు ఎలవ్ చెయ్యనన్నాడు. అదీ ఇప్పుడీ గోలకు కారణం.

వామనరావ్: ఇదే నా అసలు బాధ. నాకొక్కడంటే ఒక్కడు కూడా స్పూను లేడు. కనీసం ప్రవీణ్ ఖర్మ ని భరద్వాజ్ గాడీ స్పూను అంటే ఆ కొపంతో అయినా గొడవపెట్టుకుంటాడేంఓ నా తెలివైనా ఆశ.

సీతక్క: ఏమయ్యా ఏకలింగం! ఎవరితోనైనా గొడవవ్వగానే నువ్వూ, భరద్వాజూ, ఈ మద్యనే వచ్చిన మంచుపల్లకి, నాగప్రసాదు, శరత్తూ, జీడిపప్పు, మీరందరూ అసలు బాధితులమీద సానుభూతితోనే వాళ్ళ తరుపున వకాల్తా పుచ్చుకోవటం లేదన్న విషయం అందరికీ తెలుసు.

వామనరావ్: నేనెవరితోనైనా గొడవ పెట్టుకుంటే ఒక్కడంటే ఒక్కడు రాడు. పైగా బుర్ర తక్కువ నెగేటివ్ ఐ క్యూ వాదన అని నన్నే తిడతారు. వాళ్ళకి మాత్రం సపోర్టు. కడుపు మండదూ మరి?

సీతక్క: అది తెలిసీ ఈ మర్యాదస్థుల ముసుగులో ఉండి మిమ్మల్నేమీ అనకపోతే మీకు మీరే గొప్పోళ్ళు అనేసుకుంటున్నారు.

వామనరావ్: డైరెక్టుగా మిమ్మల్ని అనే సత్తా గానీ లాజిక్కు గానీ నాకు లేవు కదా మరి. అందుకే

సీతక్క: అందరూ నోరుమూసుకుంటున్నది మిమ్మల్ని చూసి భయపడి కాదు. మిమ్మల్ని కెలికి వేల్యుబుల్ టైంని వేస్టు చేసుకోవడం ఎందుకని

వామనరావ్: నాకు ఒక లైన్ రాయడానికే రెండు రోజులు పడుతుంది. నీముషానికి పది కామెంట్లు పడే బ్లాగుల్లో గొడవపెట్టుకోవాలంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది కావాలి మరి?

సీతక్క: అంచేత ఈ బరితెగించిన గ్రూపిజం మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోండి. అందరికీ మంచిది.

వామనరావ్: అంటే “మీరందరూ వచ్చి నాకు మస్కా కొడుతూ, నాకు చెంచాగిరీ చెయ్యండి. గొడవ ఉండదు. లేదో దొంగపేర్లతో రాసేస్తా ఖబడ్దార్. భయపడతారా లేదా?
ఆ (??
బాబ్బాబు, కాస్త భయపడీ జనజీవన స్రవంతిలో కలిసిపోండి. ప్లీస్, ప్లీస్, ప్లీస్!”


***************** Updated Part ***********************


సీతక్క: ఈ గ్రూపులో హిపోక్రసీ, నిజాయితీ అన్న పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

వామనరావ్: నా దిక్కుమాలిన బ్రతుక్కి హీపోక్రిసీ కి కావాల్సిన తెలివి లేదు, అలా అని నిజాయితీకి కావాల్సిన కనీసపు విలువలు కూడా లేవు. ఎలా బ్రతుకుతానో ఏమిటో, అయ్యో పాపం నేను.



సీతక్క: అదేంటండీ?

వామనరావ్: సెల్ఫ్ పిటీ :))



సీతక్క: హ హా! సరే సరే! తరవాతది - వీళ్ళలా పిచ్చిపిచ్చిగా రియాక్ట్ అయితే హిపోక్రసీ లేనట్లన్నమాట

వామనరావ్: నాకు రియాక్టయ్యే బుర్ర ఉంటేగా? ఏదో ఏడుపుగొట్టు బ్లాగులు రాసుకునే కేసుని కదా. కనీసం సింపథీ అయినా ఉండాలి కదా.


సీతక్క: వీళ్ళలా ఎవరైనా చెండాలంగా మాట్లాడకపోతే వాళ్ళు హిపోక్రిట్లు.

వామనరావ్: అవును మరి, నా చండాలపు బ్రతుకుని, బుధ్ధిని, నోటిని కప్పి పెట్టుకోవాలంటే అవతలవాడూ ఏమి మాట్లాడినా చండాలం అనాలి కదా! ష్! ట్రేడ్ సీక్రెట్ - ఎవరికీ చెప్పకండేం!


సీతక్క: ఎవరిదగ్గర ఎలాంటి పేరుంటే వీళ్ళకెందుకు? వీళ్ళకు కావాల్సింది శాడిస్టానందం.

వామనరావ్: పేరు లేని నాకన్నా ఏదో ఒక పేరున్న వీళ్ళ బ్రతుకే బెటర్. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దూకి చద్దామంటే నా నా వల్ల సముద్రంకూడా కలుషితమైపోతుందని వాళ్ళూ ఒప్పుకోలేదు.


సీతక్క: వాళ్ళని వాళ్ళు వెధవలనుకుంటే

వామనరావ్: వాళ్లని వాళ్ళే వెధవలనుకుంటున్నారు. కానీ నా టైపు వాళ్ళని మిగిలిన జనాలందరూ వెధవలంటున్నారే, వా!


సీతక్క: స్పూన్‌లాగ ఉండడానికి, శాడిస్టులా ఉండడానికీ మద్య మామూలు మనుషులు ఉంటారు.

వామనరావ్: నేను మామూలు మనిషిని కాదుగా. నా లాంటీ శేడిస్టు కమేడియన్లకి మంచిరోజులెప్పుడూ వస్తాయో! అప్పట్లో కొంతమంది బ్లాగర్ల అండ చూసుకుని కొత్తగా వచ్చిన వారిని సతాయించే నన్ను చావగొట్టి చెవులు మూసిన గేంగ్ ఇది. వీళ్ళని అడ్డంగా నరికెయ్యాలి.


సీతక్క: ఇలాంటి పనులు సరదాకే చేస్తున్నామని చెప్పుకోడం వీళ్ళకే చెల్లింది.

వామనరావ్: జీవితంలో ఏ ఒక్కపనీ తప్పుల్లేకుండా చెయ్యడం రాని నాకు కడుపు మండదూ మరి?


**********************************************************


సీతక్క: వామనరావ్ గారూ. భేష్! అడిగిన వాటన్నిటికి టకా టకా చెప్పేశారు

వాషింగ్టన్ వామనరావ్: ఇలాంటీ దిక్కుమాలిన బ్లాగర్ల గోల రోజు వినేదే సీతక్క గారు. ఆ ఎక్స్పీరియన్స్ అన్నమాట

రౌడీ (స్వగతం: హమ్మయ్యా! ఈ దిక్కుమాలిన ఓపెనర్ ఎవరో గానీ, నా బండారం బయటపడకుండా బ్రతికిపోయాను) ఎక్స్‌లెంట్ వామనరావ్ గారూ.

సియాటిల్ సీతక్క: రౌడీ, ఇంక పేరడీ టైం:

మలక్‌పేట్ రౌడీ: ( దేవదాసులో చెలియ లేదు, చెలిమి లేదు …. పాటకి ఒక “దిక్కుమాలిన” పేరడీ)

పల్లవి:

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ


చరణం 1:

బ్లాగులో నాకు కామెంట్ పేట్టే స్పూను కావాలీ

బ్లాగులో నాకు కామెంట్ పేట్టే స్పూను కావాలీ

దిక్కుమాలిన బ్లాగరినైనా పేరు కావాలీ

నాకూ పేరు రావాలీ .. ఈ .. ఈ ..

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో


చరణం 2:

పిచ్చి రాతలు ఎన్ని రాసిన హిట్లే కరువాయే

పిచ్చి రాతలు ఎన్ని రాసిన హిట్లే కరువాయే

భరద్వాజ్ ని కెలికి చూస్తా, ప్రవీణ్ తో గొడవాయే

వాడీకి ప్రవీణ్ తొ గొడవాయే

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో