Showing posts with label అతి తెలివి. Show all posts
Showing posts with label అతి తెలివి. Show all posts

Jan 7, 2018

ఆటవెలది 😂



గజలు బాబుకు పడెను గట్టిగానే రంగు
ఆకసమునకు పడెను ఆంధ్రలోన
కత్తిబాబుకింక కల్యాణమవ్వునా?
వేచిచూచు వార్కి వేడుకింక!    

May 13, 2011

అయ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్! మార్తాండ నా రహస్యం కనిపెట్టేశాడు బాబోయ్.

వామ్మోవ్, వాయ్యోవ్ .. నేనెవరన్నది మన మార్తాండం కనిపెట్టేశాడు బాబోయ్. నాకు బయమెసేత్తాంది. నేనిపూడొక క్రిస్టియన్ స్కూలు టీచర్ని బాబోయ్ ..

కనుక బ్లాగు పిల్లకాయలూ, నేను చెప్పినట్టు వినండి లేకపోతే బెత్తం తీస్తానంతే!


On a serious note ...

He proved himself, once again!

Apr 1, 2011

ఇక నుండీ కెబ్లాస కెలుకుడు బంద్!


అవునండీ, ఇంతకాలం జనాలని కెలికీ కెలికీ ఎంత బాధ పెట్టామో ఇప్పుడు మాకు అర్థమయ్యింది. అందుకే ఇక ఎవరినీ ఈ జన్మలో కెలకకూడదని నిర్ణయించుకున్నాము. ఇప్పటిదాకా చేసినదానికి క్షమించమని అడిగే అర్హత కూడా మకు లేదు. ఈ బ్లాగుని కూడా మూసేస్తున్నాము. ఇక మిగిలినదేమిటంటే
.....................................................................................................................................................................................................
.................................................................................................................................................................................................................................
.................................................................................................................................................................................................................................
.................................................................................................................................................................................................................................
.................................................................................................................................................................................................................................
.....................................................................................................................................................................


అంత సీను లేదు - డేటు చూసుకోండెహె!

Feb 28, 2011

కెలుకుడు - Process flow

ఇందాకే ఉలికిపిట్టగారిదో పోస్టు చూసాను. దానిలో కెలుకుడికి ఆయన స్వంత నిర్వచనం ఇచ్చేసుకున్నారు. అది కొంతవరకూ మా విషయంలో నిజమయినా ఎల్లవేళలా నిజం కాదు. అందుకే కెబ్లాస ప్రధాన కార్యాలయం నుండే నిర్వచనాలు గట్రా లేకుండా తిన్నగా ప్రాసెస్ ఫ్లో కే వచ్చేద్దామని నిర్ణయించుకున్నాం.అయితే ఇక్కడ ఇస్తోంది ఇంతకాలమూ మేము అనుసరించిన పధ్ధతి (కెబ్లాసలూ, మేము అని వాడేసాను. ఈ ఫ్లోలో అభ్యంతరాలేమన్నా ఉంటే చెప్పండి, సరిదిద్దుతా). ఇప్పుడు పధ్ధతులు మారాయి - అయితే మేము కొత్త పధ్ధతులు చెప్పకుండా పాత పధ్ధతి గురించే వ్రాస్తున్నాం.


ఇది రెండుభాగాల్లో -


(1) దేనిని కెలకాలి అనే నిర్ణయం:







(2) కెలుకుడు పధ్ధతి:





"ఈ మలక్ గాడికి నిజంగా మోకాలు పాడయ్యింది అనుకుంటున్నారా?" - ఏం చేస్తాం? సాహసం చేసి కొన్ని పోస్టులు చదివిన ఫలితం :)))))))

Feb 5, 2011

అతితెలివి టెక్నికాలు: మీ ఐపి ఎడ్రస్స్ ని దాచెయ్యడం ఎలా?

Pulling an old post up just for kelikification purposes - Originally posted in Feb 2009 :))




ఇటీవల ప్రతి ఒక్కరికీ ఐపీ ఎడ్రస్ గురించి మాట్లాడటం ఫేషన్ అయ్యింది - ముఖ్యంగా "నీ అంతు చూస్తాం, నీ పాడె కట్టేస్తాం" అంటూ బెదిరించే గ్యాంగులకి. కానీ మీ ఐపీ ఎడ్రస్ బయటివారికి కనపడకుండా దాచుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా? తెలిస్తే పక్క టపాకెళ్ళిపోండి. ఇది మీకోసం కాదు.

ఎక్కడొ అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి, ఐపీ ఎడ్రస్ నిర్వచనం తోనే మొదలుపెడదాం. ఐపీ ఎడ్రస్ ని అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామాగా నిర్వచిస్తాం. ఇదేమిటంటే అంతర్జాలంలో భౌతికంగా ఎక్కడో అనుసంధానించబడిన మీ గణకయంత్రం యొక్క తార్కిక చిరునామా అన్నమాట. ఇది సాధారణంగా నిశ్చల అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామా, పరిణామశీల అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామా అని రెండు రకాలుగా విభజింపబడుతుంది.


(ఒక దుడ్డుకర్ర పుచ్చుకొని నన్ను చావబాదాలని ఉందా? అమ్మో వద్దులెండి - మామూలు భాషకొచ్చేస్తా).

ఐ పీ ఎడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎడ్రస్. అంటే ఏమీ లేదండీ - ఇంటర్నేట్ కి కన్నెక్టయ్యున్న కోట్లాది కంప్యూటర్లలో మీ కంప్యూటర్ కి ఇవ్వబడిన ఒక ఐడి లాంటిది. ఇది సాధారణం గా స్టేటిక్ (మారకుండా ఉండే) లేక డైనమిక్ (మారుతూ ఉండే) లా ఉంటుంది. మీ ఐపీ ఎడ్రస్ గనక ఇంటర్నెట్ కి ఏంటీ వైరుస్ / స్పైవేర్ లేకుండ ఎక్స్పోస్ అయితే కొంచం తెలివయిన హేకర్లకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి ప్రమాదాల్ని నివారించేవాటిలో ముఖ్యమయినది - "ప్రాక్సీ సెర్వర్"

ఇదేం చేస్తుందంటే, మీకు వెబ్లో కావాల్సిన సమాచారాన్ని మీ బదులుగా గ్రహించి మీకు పంపిస్తుంది. దీనివల్ల మీ పనీ జరిగిపోతుంది, బయటి ప్రపంచానికి మీ ఎడ్రస్ తెలియదు కూడా.

"ఇదంతా మాకు తెలుసులేవోయ్ బడుద్ధాయ్! ఇదేలా వాడుకోవాలో చెప్పు" అంటరా? అక్కడికే వస్తున్నా. ఇది చాలా రకాలుగా చెయ్యచ్చు - ఒక పద్ధతిని ఇక్కడ వ్రాస్తున్నా ...

మనకి ముందుగా కావాల్సింది ఒక ప్రాక్సీ సెర్వర్. సాఫ్టువేర్ లో లేని వాళ్ళకి కొంచం కష్టం ఇది దొరకడం. మరెలా? నిరాశపడకండి. ఉచిత అజ్ఞాత ప్రాక్సీలు చాలానే ఉన్నయి ఈ ప్రపంచంలో. అంతర్జాల అంజనాన్ని అడగండి - అదే గూగుల్నండీ. కీ వర్డ్ "Anonymous Proxy List"

అని టైప్ చెయ్యండి. మీకు చాలా సైట్లే కనబడతాయి. For example,

http://www.proxy4free.com/page1.html లొ ఇచ్చిన కొన్ని ప్రాక్సీలు:

202.98.23.116 80 anonymous China
203.158.167.152 8080 anonymous Thailand
167.206.55.215 80 high anonymity United States
203.160.1.94 80 anonymous Vietnam
200.174.85.193 3128 transparent Brazil
213.180.131.135 80 anonymous Poland
89.207.240.235 3128 anonymous Latvia
203.160.1.103 80 anonymous Vietnam
200.174.85.195 3128 transparent Brazil
84.233.227.57 8080 anonymous Great Britain (UK)
67.69.254.245 80 anonymous Canada
67.69.254.252 80 anonymous Canada
60.218.99.18 8080 anonymous China
190.69.105.74 80 anonymous Colombia
219.132.142.10 8080 anonymous China
91.142.12.174 8080 anonymous Latvia
61.133.196.40 80 anonymous China
210.51.33.43 80 transparent China
118.98.169.66 3128 anonymous Indonesia
61.6.163.29 3128 anonymous Malaysia
119.146.73.114 8080 anonymous China
84.235.0.182 8080 high anonymity
91.74.59.98 3128 anonymous United Arab Emirates
221.130.193.14 8080 high anonymity China
121.22.29.182 80 anonymous China
194.176.176.82 8080 anonymous Romania
58.22.101.251 80 anonymous China
213.128.216.241 3128 anonymous Russian Federation
77.240.82.6 80 anonymous Saudi Arabia
125.40.47.112 3128 anonymous China
222.134.58.246 3128 anonymous China
203.160.1.121 80 anonymous Vietnam
203.160.1.85 80 anonymous Vietnam
203.110.240.22 80 high anonymity India
201.67.198.2 3128 anonymous Brazil
83.137.26.25 8080 anonymous Switzerland
114.30.47.10 80 anonymous Australia
203.162.183.222 80 transparent Vietnam
212.56.203.196 3128 anonymous Moldavia
218.62.91.211 8080 anonymous China
120.28.64.86 8080 anonymous
121.22.29.180 80 anonymous China
201.229.208.3 80 high anonymity Dominican Republic
121.22.29.181 80 anonymous China




ఇప్పుడు మీ బ్రౌజర్లోని ఇంటర్నెట్ ఆప్షన్లలో ఆ ప్రాక్సీ ఎడ్రస్ టైప్ చెయ్యండి. బొమ్మలో చూపిన విధంగా. ఫైర్ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ స్చ్రీనులు బొమ్మలో పొందుపరచబడ్డాయి. ఆ బొమ్మలో ఉన్న ఐపీ ఎడ్రస్ 203.158.167.152 థాయ్ లేండ్ దేశంలో ఉంది.ఎవరయినా వెతికేవారు మిమ్మల్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ థాయ్ లేండ్ వెళ్ళిపోతారన్నమాట. (ఇందులో కూడా కొన్ని లొసుగులున్నయండొయ్ - మీ జాగ్రత్తలో మీరు లేకపొతే కష్టమే). ఆ పక్కన్న ఉన్న 8080 పోర్ట్ నెంబరు. మరొక్కమాట - అన్ని సమయాల్లో అన్నీ ప్రాక్సీలు పని చెయ్యవు. కనుక మీరు వీలైనన్ని ప్రయత్నించి చూసుకోవాలి.

ఇక అసలు విషయం: ముసుగు ఉందికదా అని సైబర్ నేరాలకి, బ్యాంక్ హేకింగ్ / దోపిడిలకి, టెర్రరిష్టు కార్యకలాపాలకి, చంపుతాం, పాడె కట్టేస్తాం అంటూ బెదిరింపులకి మాత్రం పాల్పడద్దు. ప్రాక్సీని మెయింటైన్ చేసేవారికి అటువంటి సమయాల్లో పోలీసులతో సహకరించే బాధ్యత ఉంటుంది. అప్పుడు మీకు ఏ వి యస్ గారి భాషలో "రంగు పడుద్ది" :))


ఇదంతా వద్దు అనుకుంటే కింద కామెంటలో చెప్పిన విధంగా OperaTor ని వాడండి. ఇవి కాకుండా వేరే పధ్ధతులు కూడా ఉన్నాయి - ఆ సంగతులు తరవాత!  



సరే - ఎనానిమస్ ప్రాక్సీ వాడడం ఎలాగో తెలిసిందిగా - పండగ చేసుకోండి, మీ ఎడ్రస్ ఎవరికీ తెలియకుండా.


"ఓస్! ఇంతేనా - కొండని తవ్వి తొండని కూడ పట్టలేదు" అనుకుంటున్నారా? ముందే చెప్పా కదా - ఇది ఐపి గురించి తెలియనివారికని?








The following is my general disclaimer on the Technical Stuff I write.

Disclaimer: This is just for informational purposes and the readers are expected to use the information/data/advice given above at their own risk. The author is not responsible for any positive or negative results arising out of such actions.

Sep 20, 2010

ఆ కాగడా ఈ కాగడానేనా? - వీక్షణం గారి అతి తెలివి :))

రవిగారు has left a new comment on your post "ఆ కాగడా ఈ కాగడానేనా?":

మలక్ మీ వుహ కరెక్టే .అది దొంగ కాగడా నే కావాలంటే స్పెల్లింగ్ లో మతలబ్ చూడండి వొక ''ఏ ''ఎక్కువ.
అదికాక కాగడా ఎప్పుడు నీ చెల్లి తల్లి అంటూ కవితలు రాయడు .వ్యంగం తో కూడిన శృంగారమే కాని బూతు డెఫినిషన్
లో వచ్చేలా రాయలేదు .అతని సైట్ లోవి అవతలి వర్గం కొట్టేసి మీ శైలి లోనో , నా శైలి లోనో కొత్తవి రాసి ఆరిపోయిన నిప్పుని మండిన్చాదానికే వెలిగిస్తున్నారు యి కొత్త కాగడా .దమ్ముంటే మళ్లీ కాగడా స్టైల్లో వొక వ్యంగ పోస్టింగ్ రాసి జనాల మీదకి వదలమనండి . నిజం బయట పడుతుంది . నేను యి విషయం కాగడా తో మెయిల్ ద్వార నిర్దారించుకుని మరి రాస్తున్నా .


మన వీక్షణమే కొత్త కాగడా అనేదానిలో ఇంకా డౌట్ ఏమన్నా ఉందా?

*********************************************




Now look at this person's great analysis - Really worth reading!



Babji was wondering why his blog disappeared from Malika.
_________________________________________________________

Joke of 2010 - Blog Babji's blog never disappeared from Maalika. The issue was about a few comments that were abusing Babji ... LOL ... this is what happens when people with negative IQ like this person start writing blogs.


And, Sarath's porn is taken off Malika.
________________________________________

Once again, the brain of a skunk :)) The issue is about not adding Sarat's blog - his blog was not taken way ( it was not added in the first place) LOL


అబధ్ధం చెప్పినా అతికినట్టుండాలి and these guys think they are the greatest analysts around :P



ఇలాంటి కుక్కమూతిపిందెలు మాలిక మీద ఎంత ఏడిస్తే అంత మేలు మాలికకి :)) Thanks for free publicity - we need more :)




పాత కాగడా URL: http://kaagadaa.blogspot.com -
ఇది మూతబడింది



కొత్త కాగడా URL: http://kaagadaaa.blogspot.com - ఇది కొత్తగా మొదలయ్యింది. Even the comments are disabled.



అయితే ఆ కాగడా ఈ కాగడా ఒకరేనా? లేక కత్తి వీక్షణ గేంగు దానిని మొదలు పెట్టారా?

మొదటిది నిజమయితే సరే - మరి రెండొది నిజమయితే? మళ్ళీ పండగే

దానివల్ల వాళ్ళకేమి లాభం అంటారా? అక్కడికే వస్తున్నా.

ఆ బ్లాగులో నా స్టైల్ లో ఒక పోస్టు పెట్టి మళ్ళీ నేనే కాగడా అని గొడవ చేసే చావు తెలివితేటలేమో? :))



What if I say, I am convinced that Katti Veekshanam is the new Kaagadaa but I dont have any proof(following their own logic)? :))

అదీగాక పాత పోస్టులు పోయాయని, ఎవరో హేక్ చేసి తీసేశారని పాత కాగడా చెప్పాడు. మరి కొత్త కాగడా బ్లాగులోకి అవెలా వచ్చాయి?


నా అనుమానానికి మరో కారణం: అప్పట్లో కాగడా వాడిన రాబిన్ హుడ్ ఐడీ నుండి కాక మరో ఐడీ నుండి మాలికకు విజ్ఞప్తి మెయిల్ రావడం!



.
.
.
.

Sep 19, 2010

కత్తిలాంటి లాజిక్! - Post updated with Akasaramanna's & Saikiran's comments

.
.
.

మన ప్రఖ్యాత బ్లాగు మేధావి రాజ్యాంగం సాఫల్యం/వైఫల్యం గురించి తన బ్లాగులో సెప్టెంబరు 15 నాడు ఇలా వ్రాసుకున్నారు:

**********************************


@వీకెండ్ పొలిటీషియన్: గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. రాజ్యాంగం లోని ప్రతి పదం, దాని అర్థం, ప్రతి వాక్యం దాని ప్రతిపదార్థం constituent assembly లో చర్చించాకే, వాదప్రతివాదనలు జరిగాకే ఆమోదించారనే సృహలేకపోతే కొన్ని చర్చలు అలాగే సాగుతాయి.

సమస్య రాజ్యాంగంలో లేదు. దాన్ని అమలుపరిచే విధానాల్లో ఉంది. రాజకీయాల్లో ఉంది. ప్రజల్లో ఉంది.

రాజ్యాంగం ఒక framework దానికీ చట్టాలకీ తేడా తెలీకపోతే ఎవరుమాత్రం ఎవరితో చర్చించగలరు !

September 15, 2010 5:44 PM


************************************





అయితే ఇదే మేధావి ఆకాశరామన్న బ్లాగులో మే 24 నాడు ఇలా వ్రాశారు



తప్పు మనిషిదా మతానిదే అనే ప్రశ్నే తప్పు. మతం ఒక భావజాలం అది తప్పుచెయ్యదు. ఎందుకంటే అది స్వయంగా ఏమీ "చెయ్యలేదు"గనక. ఆ మతాన్ని సృష్టించిన మనుషులు తమ స్వార్థానికి అనుగుణంగా దాని రచన చేసి తరాలు, యుగాలు, కల్పాలు అన్యాయాలు చేస్తారు. అప్పుడు వ్యక్తుల్ని నిరసించాలా మతాన్ని తెగనాడాలా అంటే రెంటినీ...కానీ వ్యక్తులకు ఆ ఫ్రమె వొర్క్ ని విజయవంతంగా అందించిన మతాన్ని పాతెయ్యకపోతే మనుషుల మధ్య రక్తపాతమే తప్ప భావజాల విప్లవం రాదు. అందుకే చేతలు మనుషులు చేసినా చెదలు మతం మూలాల్లో ఉందికాబట్టి దాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అలాంటప్పుడు...ఏదో కొందరు చేసేదానికి మతాన్నంటే ఎలా అనే సిల్లీ వాదనలు చెల్లవు.

ఇంకా


అయ్యా మతాభిమానిగారూ,

మీ మనసు ఒప్పుకోలేనివాటికి ఉదాహరణలెందుకు?
మతం-సామాజిక కురీతులు
మతం- సామాజిక అసమానతలు
మతం- మానవహక్కులు
మతం-రాజకీయ ఉద్దేశాలు
మతం- టెర్రరిజం
మతం - మోసం


*****************************************************************


అంటే: మనుషులు దురుపయోగం చేసే ఫ్రేం వర్క్ ని అందించింది కాబట్టీ పక్కవాడి మతాన్ని పాతెయ్యాలి. అలాంటి ఫ్రేం వర్కునే అందించిన రాజ్యాంగాన్ని మాత్రం గౌరవించాలి ( ఎంతైనా తన మతం, తన దేవుడు కదా! )

తనకో రూలు, పక్కవాడికింకొటీ :))

"చేతలు మనుషులు చేసినా చెదలు మతం మూలాల్లో ఉంది" అన్నాయనే "చేతలు మనుషులు చేశారు గానీ చెద మాత్రం రాజ్యాంగం లో లేదు" అని చెప్పకనే చెప్తున్నారుగా :))

కత్తి లాంటి లాజిక్ కదా :))

ఈ లాజిక్ లో ఈయనకి కనబడనిది

రాజ్యాంగం- సామాజిక కురీతులు
రాజ్యాంగం- సామాజిక అసమానతలు
రాజ్యాంగం- మానవహక్కులు
రాజ్యాంగం- రాజకీయ ఉద్దేశాలు
రాజ్యాంగం- టెర్రరిజం
రాజ్యాంగం - మోసం



గురువే ఇలా ఉన్నప్పుడు "మార్తాండ శిష్యరికం" (ఏకలవ్య శిష్యరికం కాదులేండి) చేసిన శిష్యుడు అలా అవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా!


***************************************
Footnote:


కెలుకు-వికీ పదం of the week:

మార్తాండ శిష్యరికం: ఒక గురువు దగ్గర శిష్యరికం చేసి ఆ గురువుకున్నదానికన్నా ఇంకా చెడ్డ పేరు తీసుకురావడం అన్నమాట - "వీడిని కాదురా, వీడికి చదువు చెప్పిన వీడి గురువుని పట్టుకు తన్నాలి" అనిపించే శిష్యరికం.

.
.
.
ఇప్పుడే మన మేధావికి వెలిగింది .. తన రెండు నాల్కలు బయటపడేసరికీ మింగా కక్కాలేక పెట్టీన పోస్టు


______________________________________

"దేవుడిచ్చాడని నమ్మే మతగ్రంథాలకీ - మార్పు అవసరం లేదమే మతాలకీ. మనకు మనం ఇచ్చుకున్న రాజ్యాంగానికీ - నిరంతరం అవసరానికి అనుగుణంగా మార్చుకునే రాజ్యాంగానికీ పోలికా"

_______________________________________

పాపం అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ఎందుకన్నారో అని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చిన ఏడుపు అది - కానీ సమాధానం మాత్రం లేదు.

రాజ్యాంగాన్ని మార్చేసుకోవచ్చుట. అందులో ఏది మార్చచ్చో ఏది మార్చకూడదో తెలియని ఈయనగారో పెద్ద మేధావి.


ఇక ఆయన అడిగిన ప్రశ్న - ఎవడండీ వీడూ?

_________________________________________

నా సమాధానం: ఆయన ఝాడించిన తోకని ఒక్క వేటుతో కత్తిరించినవాడు :))




*********************************

UPDATE FROM AKASARAMANNA

*********************************


ఆకాశరామన్న said...
@Malakpet Rowdy,\


ఇలాంటివి చాలా ఉన్నాయి. ముస్లిములు దండయాత్రలు చేసి అనేక హిందూ దేవాలయాలను కూల్చేశారు. చాలా వరకు హిందూ సంస్కృతి మీద దాడి చేశారు. జిజియా పన్నులు వేశారు. ఎవరో ఒకరిద్దరు రాజుల హయాములో తప్ప హిందూ మతం మీద దాడి భారీగానే జరిగింది. చరిత్రను (మన కమ్యూనిస్టు చరిత్రను కాదులెండి) చదివితే ఎవ్వరికైనా ఈ విషయం బోధ పడుతుంది. కానీ, కమ్యూనిస్టులు చరిత్రకు చదలు పట్టించారు. కానీ మహేష్ గారు కమ్యూనిస్టు చరిత్రకారుల్ని వెనకేసుకొచ్చారు. అది ఒక చారిత్రాత్మిక అవసరమన్నారు. ఇలాంటి నిజాలన్నీ చెప్పి తరువాతి తరాలను కూడా ద్వేషభావమ్యులో ఉంచే బదులు వాటిని తీసివేసి దేశములో సమైఖ్యతకు పునాదులు వేయడం ముఖ్యం కాబట్టి, కాషాయ చరిత్రకన్నా ఈ కమ్యూనిష్టు చరిత్ర దేశానికి అవసరమని చెప్పారు. (అంటే As it isగా ఇదే పదాలతో వ్యాఖ్యలతో కాదనుకోణ్డి. నేను దాని అర్థాన్ని చెప్పాను అంతే). (to be continued..)

అతను చెప్పిన దాని మీద నాకెలాంటీ అభ్యంతరమూ లేదు. గతం గతః . దాన్ని తవ్వుకొని ఇప్పుడు హిందువులు ముస్లిములు కొట్టుకొని సాధించి చచ్చేదీ ఏమీ లేదు. కానీ, ఇదే Courtesy నీ ఆర్యులు -ద్రవిడులు, బ్రాహ్మనులు -దలితులకు ఎందుకు అన్వయించలేక పోయారో అన్నది నా ప్రశ్న. దళితుల మీద వివక్ష ఇంకా ఉందన్నది కాదనలేని నిజం. అయితే ఒక దళితుడు వివక్షకు గురి అయినప్పుడు, దాన్ని ఖండించడము అతని శిక్ష పడడములో సహకరించడమూ చేయొచ్చు (చేయాలి).ఇందుకు చట్టాలు కూడా సహకరిస్తాయి. కానీ, దానికి ముందు తరాల వారు ఏవిధంగా వివక్ష చూపారు, అది బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ ఎలా అయ్యింది అని పాతవి తవ్వుకుంటూ పోవడం దేనికి? తీవ్రవాద దాడులు జరిగినప్పుడు పురాతన రాజులు దగ్గారనుండి ముస్లిములు హిందువుల మీద దాడులు చేస్తున్నారు అని ఎవరైనా అన్నారా?

దీన్నే నేను Selective Liberalism అంటాను. భారతడేశములో ఇలాంటీ "selactive" విషయాలు చాలానే ఉన్నాయి. ఎంతోకొంత అందరిలోనూ ఈ Selectivity అందరిలోనూ ఉంటుంది. కాకపోతే అదే ఆదర్శమని నమ్మితేనే వస్తుంది అసలు చిక్కంతా.

చరిత్రను చరిత్రలా చదవనివ్వాలి, ఎలాంటీ సెన్సారింగు లేకుండా లెదా అన్నింటినీ సెన్సారు చేయాలి.

Say no to selective Censorship.
Say no to selective Liberalism.
Say no to selective Intellectualism.
Say no to selective Secularism.

**************************
Update from Saikiran
**************************


ఆకాశరామన్నగారు ఉటంకించిన "అయ్యవారి" కామెడీ రాతలు ఇవి :

"అప్పటికే మతం బలహీనపరిచిన దేహంగా మిగులున్న దేశానికి మతచరిత్ర అవసరమా"!

"దేశం మరో మతసంక్షోభంలో పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలోచన్మా దోరణిని ప్రాతిపదికగా చేసుకుని చరిత్ర నిర్మాణం మొదలయ్యింది."

లింకు ఇక్కడ :http://parnashaala.blogspot.com/2009/07/blog-post_06.html
====
దీనికి ప్రతిగా నేను వ్రాసిన వ్యాసం ఇక్కడ :

http://amtaryaanam.blogspot.com/2009/07/blog-post_06.html



.
.

Sep 16, 2010

మైఖెల్ వదిన కామరాజు - వీడియో: మొదటి భాగం

.
.
.
.


నా వీడియో చూడడానికి ముందుగా ఈ వీడియో చూడండి. అప్పుడు నా వీడియో context అర్థమవుతుంది.



Here is my video:



Aug 29, 2010

ఈ తెలుగు నడకలో శరత్ హిడెన్ ఎజెండా - ఇదిగో!

.
.

కొద్ది సేపటి క్రితం జరిగిన ఈ తెలుగు నడకలో మన శరత్ ప్రైవెట్ & హిడెన్ ఎజెండా మా డిటెక్టివ్ మలకలింగం ద్వారా బయటపడింది. .





.
.
.

PS: Just kiddin and not to hurt anyone

Aug 23, 2010

ఏ హేటర్స్ చేసిన నీచపు పనులు? - Post updated with Anon & Nippuravva's response

పాపం బ్లాగ్ వీకషణం గారు ఆవేశపడిపోయి త్రెగ వ్రాసేశారు. కానీ వీళ్ళు చేసిన నీచపు పనులో?

గ్రూపులు లేవంటూనే గుంపుగా మిత్గిలినవాళ్ళపడి కాల్చుకుతిన్నప్పుడు ఈయనగారికి గుర్తుకు రాలేదు ఇప్పుడు చెప్పే నీతులు. కాగడా లిమిట్స్ దాటినప్పుడు ఆ పోస్టులని అడ్డుకున్నది మేమే - కాగడా పోస్టుల్ని చదువుతూ ఈ బ్లాగ్ వీక్షణం తదితర బ్లాగర్లు ఆనందించారేగానీ ఒక్కళ్ళయినా మాట్క్లాడారా? లేదే?

కాగడా అతిగా వ్రాసింది ముఖ్యంగా జ్యోతి గురించి, ఈ బ్లాగ్ వీక్షణంగారు అప్పుడు అవి చదువుకుంటూ ఆనందించారుగానీ. ఒక్క కామెంటయినా పెట్టారా? ఎదుటివాడికి చెప్పడానికి బాగానే పనికొస్తాయి నీతులు. లేకపోతే తమ గ్రూపు రాజకీయాల తీరే ఇంతేనేమో :))


నేనే కాగడా అనడంలోనే తెలుస్తోంది ఈ గ్రూప్ ఎజెండా ఏమిటో! Let them prove it and I will close my blogs, but if they dont, will they do the same?


అసలు ఇప్పుడు అనుమానమొస్తోంది - ధూం, కాగడ బ్లాగులు అసలు వీళ్ళవేనేన్మో అని. వీళ్ళని వీళ్ళే తిట్టూకుని పాప్యులారిటీ పెంచుకోవడం అన్నమాటa?

In spite of yuour jealousy and attack on Maalika I do what I do. We are fully prepared for this. We have seen even worse characters on rediff.



________________________________________________


Update: Anonymous comment Ongolu Sreenu's blog:

నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి.

బ్లాగ్వీక్షణం బ్లాగుకి కత్తి మహేష్ కుమార్ కి ఉన్న లంకే ఏమిటి?

ప్రవీణ్ మాటి మాటికీ బిసినెస్ పనులు మానుకుని వీడియో చేయాల్సిన ఖర్మ పట్టలేదు అనాల్సిన అవసరం ఏమిటి?

బ్లాగ్వీక్షణం లో ప్రవీణ్ ని వాడుకుని తర్వాత సీనియర్ల మేటర్ బయటికి తీసి సివరాకరికి మాలిక మీద అక్కసు కక్కడం ఏమిటి ?

మహేష్ ఇక్కడకి వచ్చి మాలిక విషయం లో ఏదో పెద్ద సేవ అన్నట్టు డాంబికాలు పోతున్నారు అనడం వెనుక అంతరార్ధం ఏమిటి ?

ఎవరికీ అర్ధం కాలేదు అనుకున్నారా ?

కత్తి మహేష్ ప్రోద్భలంతోనే మార్తాండుడు వీడియో చేసాడు. ఆ వీడియో చూసి కెలుకుడుసంఘం గంగవెర్రులెత్తి వస్తే అప్పుడు వారిని జనం ముందు సైకోలుగా చూపేందుకు కుట్ర పన్నారు . అది పారలేదు ఎందుకంటే ప్రవీణ్ సహజంగా తన తలతిక్క పనులు బయటపెట్టుకున్నాడు. ఇక రెండవ అస్త్రంగా సీనియర్ల మీద దాడులు అన్నారు. వెంటనే బ్లాగు సోదరి రంగ ప్రవేశం చేసి కొన్ని నిజాలు చెప్పేటప్పటికి ఖంగారు పడ్డారు. గతం లో వచ్చిన కొన్ని కంట్ బ్లాగుల ని మాలిక కి అంటిచ్చేందుకు పూనుకున్నారు. కుక్కకాటు కి చెప్పు దెబ్బలా ఇప్పుడు వికటకవి పోస్ట్ పుణ్యమా అని అందరికీ నిజాలు తెలిసిపోయాయి.

మాలిక మీదనే వీళ్ళ ఏడుపు, మాలిక నిర్వాహకులపై కచ్చ. సీనియర్లం అని చెప్పుకుంటూ చినపిల్లల్లా వ్యవహరిస్తున్నారు. ఇక బ్లాగువీక్షణం ద్వారా ఇంకెంత దిగజారుతారో చూద్దాం

_______________________________________________________________________

సదరు బ్లాగ్ వీక్షణం దర్మ "ప్రభువు"లకి

>> ఎంత గొప్ప నిజాన్ని రాశారు!! అద్భుతమైన వాక్యాలు ఒంగోలు శ్రీను గారూ! కాగడా బూతులు రాసింది మీపైన కాదుగదా, అందుచేత అతడి సెన్సాఫ్ హ్యూమరుకు ఆనందించారు. అతగాణ్ని దారిలో పెడదామని ప్రోత్సహిస్తూ కామెంటు రాశారు.

@@ వీక్షణం గారు... మీరు ఎంత గొప్ప నిజాన్ని రాసారు. ప్రవీణ్ బూతులు తిట్టింది మిమ్మల్ని కాదు కదా , అందుకు మీకు నొప్పి కలగలేదు. పక్కనుండి బాగానే సోది చెబుతున్నారు. మీ మీదయితే మీకు బాద తెలిసేది .... మిమ్మల్నెకాకుండా మీ ఇంట్లొ అమ్మ, అక్కని కూడా తిడితే ఇంకా బాద తెలిసేది. అప్పుడు కూడా ఇలాగే సొల్లు కబుర్లు చెప్పేవారా ?? శ్రీను ని అడిగిన ప్రశ్నలన్ని మిమ్మల్ని మీరు అడుక్కొండి.

>> మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, బ్లాగు వీక్షణం గారూ?
@@ కత్తి బూతు బొమ్మలు పెట్టినప్పుడు, కాగడా బూతురాతలు రాసినప్పుడు , ప్రవీణ్ అమ్మనా బూతులు తిట్టినప్పుడు ఎక్కడ వున్నారు... ఇప్పుడే గుర్తొచ్చిందా... సిగ్గు లేదు మీరు హిపొక్రసి గురించి మాట్లాడుతున్నారు.

>> వాళ్లు కూడా మీలాగే అనుకుని ఉంటే, ఎంత రచ్చ జరిగి ఉండేది, బ్లాగు వీక్షణం గారూ
@@ అసలు కొతి , కత్తి అని మీకు మీరే రాసుకుని , జ్యొతిగారికి మాకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు అని నేను అంటాను ...

మొదట్లొ ఈ ప్రభువులు .. ప్రవీణ్ గురించి మాట్లాడుతుంటే కత్తి విషయం ఎందుకు అని సెలవిచ్చారు... ఈ రోజు మీ గ్రూప్ లీలల్లో ప్రవీణ్ ఎపిసోడ్ చాలా చిన్నది బాబూ అంటున్నారు... ఇప్పుడు అర్ధం అయినా మొదటనుండి వీరి ఏడుపు ఎవరిమీదొ... ప్రవీణ్ వీరికి ఒక బకరా అంతే...

బ్లాగ్ వీక్షణం గారు మీకొ మాట... తమ బొద్దింక బుర్రకే అన్ని తెలివితేటలు ఉంటే మా కెన్ని ఉండాలి .. ఎదొ అజ్ఞాత ముసుగులొ క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ మీరెవరొ , దీని వెనుక ఎవరు వున్నారొ అన్ని మాకు తెలుసు...

Oct 1, 2009

తొమ్మిదవ నెంబరు ప్రమాదసూచిక: దిక్కుమాలిన బ్లాగరి స్పెషల్ :)) - Post updated with new conversation










SOME PEOPLE MAY NOT UNDERSTAND WHAT THIS IS ALL ABOUT, BUT I AM SURE, VERY SOON YOU WILL! (DEPENDING ON HOW MUCH TIME VEEVEN TAKES TO INCLUDE A BLOG IN KOODALI)



ఫ్రమాదవనం లోకి మళ్ళీ తొంగిచూస్తున్న వీక్షక మహాశయులందరికీ తిరిగి కెలికాస్కారం. ఈ సారి మన ఘోస్టు సియాటిల్ సీతక్క గారు

మలక్‌పేట్ రౌడీ: నమస్తే సీతక్కా

సియాటిల్ సీతక్క: నమస్తే రౌడీ అన్నా, అంతా బాగేనా?

మలక్‌పేట్ రౌడీ: అంతా బాగే సీతక్కా, ఇక మొదలు పెట్టు

సియాటిల్ సీతక్క: అందరికీ నమస్తే. ఈ సరి మన గెస్టు వాషింగ్టన్ వానమరావు గారు. ఏత్తు ఆరడుగుల ఏడంగుళాలు

మలక్‌పేట్ రౌడీ: అక్కో, నువ్వు మనుషులనే కాకుండా తాడీచెట్లనుకూడా తుంటర్వ్యూ చేస్తావా?

సియాటిల్ సీతక్క: కుళ్ళుజోకులాపకపోతే తాటకినౌతా జాగ్రత్త

మలక్‌పేట్ రౌడీ: వద్దులే - నువ్వు కానివ్వు

సియాటిల్ సీతక్క: వామనరావు గారూ, మీ పరిచయం?

వాషింగ్టన్ వామనరావ్: నేనొక సైకో ఎనలిస్టునండీ. మనుషులు వ్రాసేదానిని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని అంచనా వెయ్యడం నా వృత్తి, ప్రవృత్తి కూడాను

సీతక్క: అలాగా. అయితే మేము మీకు కొన్ని వాక్యాలని చూపిస్తే, అవి వ్రాసినవారి మనసులో ఏముందో చెప్పగలరన్నమాట

వామనరావ్: భేషుగ్గా!

సీతక్క: అయితే రౌడీ వ్రాతలతోనే మొదలు పెడదాం

రౌడీ: హతోస్మి!

ఇదిగోండీ మీ మొదటి పరీక్ష: We came, We saw, We Kelikified. దీని అర్ధం అందరికీ తెలుసు – కానీ ఇది వ్రాసేడప్పుడు రౌడీ మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పాలి

వామనరావ్: ఓస్ ఇంతేనా? ఏముందీ? – “నాకు సీరియస్ విషయాలు వ్రాసేంత సత్తా లేదు, అందుకే ఏదేదో బరికి నలుగురి నోళ్ళలో నానుదామని” – అంతేనా రౌడీ గారూ?

రౌడీ: అమోఘం ( స్వగతం: ఓరి వామనరావోయ్! ఇక్కడ అసలే నా పరువు జీరో, దానిని నెగెటివ్ లోకి నెడుతున్నావురోయ్)

సీతక్క: రౌడీ రాజ్యం కేప్షన్: ఏదో మీ బుర్రలు కాస్త తిందామని

వామనరావ్: ఇది కూడ సులువే. మిమ్మల్ని ఎలాగూ మెప్పించేటంత సీను నాకు లేదు. ఏదో బుర్రలైనా తిందామని. If I cant be famous, I should at least be infamous!

రౌడీ: (స్వగతం: వామ్మో, రూటు మార్చకపోతే మన బండారం బయట పెట్టేశేలా ఉన్నాడు) సీతక్కా, నా సంగతెందుకులే గానీ, ఎదైన “దిక్కుమాలిన బ్లాగు” మీద చేయించు ఈ సైకో ఏనలసిస్.

సితక్క: సరే సరే! నా కళ్ళూ కూడా ఇప్పుడే తెరుచుకున్నాయి .. Its an "Eye OOOpener" .. వామనరావ్ గారు, ఇప్పుడూ మీకు నేను కొన్ని వాక్యాలు ఇస్తాను, వాటి అర్ధాలు మీరు చెప్పాలి సరేనా?

వామనరావ్: నేను రెడీ!

సీతక్క: సరే మొదలుపెడదాం – ముందుగా “దిక్కుమాలిన చరిత్ర”

వామనరావ్: బ్లాగుల్లో నా బ్రతుకు

సీతక్క: ???

వామనరావ్: ‘నా” అంటే ఆ బ్లాగరిది అని అర్ధం

సీతక్క: ఓహో! సరే! “The other end of me”

వామనరావ్: "Thats what I speak with"

సీతక్క: చాలా రోజులనుండి బ్లాగులను గమనిస్తున్న ఎక్స్పీరియన్స్తో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా.ఈ బ్లాగులకు పట్టిన శనిగాళ్ళగురించి చెప్పాలి. బ్లాగులెంత ప్రశాంతంగా ఉండేవో ఒకప్పుడు.

వామనరావ్: అంటే దానర్ధం “నేను బ్లాగుల్లో ఎప్పటినించో ఉన్నా, వ్రాస్తున్నా, నన్నేవడు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఇప్పుడైనా ఎవడైన నా గోల వింటాడన్న ఆశ”. These guys stole the attention I deserved!

సీతక్క: ఏదో పరవాలేదు అనిపించేలా కొట్టుకున్నారు. జనాల్లో శాడిజాన్ని చూసే అదృష్టం దక్కింది అందరికీ.

వామనరావ్: కానీ ఏం లభం. నేనెంతా Sadist నో జానాలకి తెలియదుగా?

సీతక్క: అది ఇద్దరికే సంబంధించిన మేటర్ అని కనీసం జ్ఞానం లేకపోవటమేంటో.

వామనరవ్: వాళ్ళ మధ్యలో దూరితే నాలాంటీ తెలివితక్కువ మొహాన్ని ఇద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటారని తెలుసు అందుకే దూరలేదు.

సీతక్క: ఈ రవిగారు అని ఒకాయన ఉన్నాడు. రోడ్డు మీద కారు వెళ్ళినా కూడా, అందులో ఒక బూతు కనిపించేస్తది ఇతనికి.
వామనరావ్: నేనెన్ని బూతు వ్రాతలు వ్రాసినా ఒక్కడుకూడ చూడట్లేదు. ఆ రవిగారి బ్లాగు మాత్రం అందరూ చూసేస్తున్నరు.

సీతక్క: ఏదో చిన్న గొడవ అయితే, అది మనసులో పెట్టుకొని అతని టెంప్లేట్కి ఏదో చేసేసారని అపోహపడిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు.

వామనరావ్: ఆ గొడవలో నేను దూరబోతే నాకే చీవాట్లుపడ్డాయ్

సీతక్క: ఈలోగా ఈ కాగడాగాడొకడు. వీడిని తిట్టడానికి కూడా మాటల్లేవు. అత్యంత నీచమైన మనస్తత్వం గలవాడు. వీడికి హిపోక్రసీ లేదని చెప్పుకుంటాడు. అందుకని నోటికొచ్చిన బూతులన్నీ రాస్తాడు

వామనరావ్: ఇండైరెక్టుగా నేనెన్ని బూతులు వ్రాసినా ఎవ్వరూ చదవలేదు. ఖాని కాగడాగాడి బ్లాగుకి హిట్లే హిట్లు

సీతక్క: వీడికీ ఆ ఎదవ భరద్వాజ్గాడి సపోర్టు. ఈ భరద్వాజ్గాడు కొంచెం చదువుకున్నోడు. వీడికి ఈ దిక్కుమాలిన కాగడా గాడితో ఫ్రెండ్షిప్ ఏంటో అర్ధంకాదు

వామనరావ్: ఈ భరద్వాజ్ గాడు నన్నొక్కసరి కూడా సపోర్టు చెయ్యలేదు. నేనేదో అంటే తిరిగి నన్నే పది మాటలన్నాడు, అంట్లవెధవ. ఈడి జిమ్మడ, ఈడి సేతులడిపోను, ఈడి తద్దినమెట్ట, ఈడు సచ్చిపోనూ!!!

సీతక్క: అయినా ఈ భరద్వాజ్గాడితో అందరూ ఎలా చర్చిస్తారో నాకర్ధం కాదు. ఆడో పెద్ద గాసిప్మాంగర్

వామనరవ్: నేనెంత గాసిప్ రాసినా ఒక్కడు కూడా కన్నెత్తి చూడడంలేదు. వాడు గాసిప్ రాసినా జనాలు కామెంటుతున్నరెందుకో. వాడి ఫ్రెండ్ బ్లాగులకి వాడీ బ్లాగు కన్న హిట్లు ఎక్కవ వస్తున్నాయ్. నాతో ఒక్కడూ కూడా మాట్లాడడు.

సీతక్క: వీడో పెద్ద పుడింగిలా ప్రతి చర్చలో దూరి వీడి అతితెలివితేటలు ప్రదర్శిస్తుంటాడు.

వామనరావ్: అతి తెలివి మాట దేవుడెరుగు. మనకి మినిమం తెలివి కూడ లేదు

సీతక్క: ఇంక ధూం. ఇతను మంచోడో, చెడ్డోడో అర్ధంకాదు నాకు.

వామనరావ్: ఈ ధూముకి మరో చాన్స్ ఇచ్చి చూస్తా. ణన్ను సపోర్టు చేస్తే మంచోడూ, లేకుంటే చెడ్డోడు.

సీతక్క: ఆ పోరాడేదేదో కొత్తపాళితో గొడవ వచ్చినప్పుడు డైరెక్ట్గానే చెయ్యొచ్చు. అలా చేయ్యలేదు. కుళ్ళిపోయి, కుళ్ళిపోయి అతను కూడలిని వదిలి వెళ్ళిపోయినంతవరకూ ఊరుకోలేదు

వామనరావ్: కనీసం ఆ పోట్లాటలో నన్ను ఇన్వాల్వ్ చేసున్నా, నకు కొంచం పేరొచ్చేది. ధూము, కొత్తపాళీ పుణ్యమా అని. కానీ అంత అదృష్టం నాకేదీ?

సీతక్క: ఎవ్వరు మాట్లాడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే ప్రవీన్శర్మ.

వామనరావ్: వీడికి మూర్ఖత్వం ఉన్నా ఎక్కడో ఒక మూల కొంచం నిజాయితీ ఉన్నట్టూ కనిపిస్తోంది. కానీ అలాంటిదేమీ లేని నాకు వాడికున్నంత పేరు కూడా లేదు.

సీతక్క: రెండు సంబంధం లేని విషయాలను ఒకటి తరువాత ఒకటి ఎంతో బాగా అమర్చి చెప్పటంలో నిష్ణాతుడు.

వామనరావ్: నాకు ఒక్క విషయమే సరిగ్గ చెప్పడం చేతకాదు. వీడు రెండు విషయాలు ఎలా చెప్తున్నడబ్బా?

సీతక్క: ఈ కల్నల్ ఏకలింగం కూడా పర్వాలేదు. చుట్టూ అంత దరిద్రపు గ్యాంగ ఉన్నా కొంచం నీటుగానే నెట్టుకొస్తున్నాడు.

వామనరావ్: అందరినీ తిడితే మరి నాకు సపోర్ట్ ఎవరూ? చూద్దాం నా ఉచ్చులో ఏకలింగం చిక్కుకుంటాడేమో. ఊన్న వాళ్ళలో కాస్త సాఫ్ట్ కదా!

సీతక్క: ఈ భరద్వాజ్గాడు వీడికి తీరిక దొరికినప్పుడల్లా వేరే బ్లాగుల్లో వీడి అతితెలివి ప్రదర్శిస్తుంటాడు. ఊరికే కెలుకుతానని వాడే చెప్పుకున్నా జనాలు ఆడితో సీరియస్గా చర్చిస్తుంటారు

వామనరావ్: నేను చాలా సీరియస్ అని చెప్పినా సరే నన్నెవడూ పట్టించుకోడు. వాడు సీరియస్ కాదని చెప్పినా వాడితో చర్చిస్తూ ఉంటారు. ఇదెక్కడీ న్యాయం?

సీతక్క: కాని భరద్వాజ్ స్పూన్గాడి కామెంట్లు ఎలవ్ చెయ్యనన్నాడు. అదీ ఇప్పుడీ గోలకు కారణం.

వామనరావ్: ఇదే నా అసలు బాధ. నాకొక్కడంటే ఒక్కడు కూడా స్పూను లేడు. కనీసం ప్రవీణ్ ఖర్మ ని భరద్వాజ్ గాడీ స్పూను అంటే ఆ కొపంతో అయినా గొడవపెట్టుకుంటాడేంఓ నా తెలివైనా ఆశ.

సీతక్క: ఏమయ్యా ఏకలింగం! ఎవరితోనైనా గొడవవ్వగానే నువ్వూ, భరద్వాజూ, ఈ మద్యనే వచ్చిన మంచుపల్లకి, నాగప్రసాదు, శరత్తూ, జీడిపప్పు, మీరందరూ అసలు బాధితులమీద సానుభూతితోనే వాళ్ళ తరుపున వకాల్తా పుచ్చుకోవటం లేదన్న విషయం అందరికీ తెలుసు.

వామనరావ్: నేనెవరితోనైనా గొడవ పెట్టుకుంటే ఒక్కడంటే ఒక్కడు రాడు. పైగా బుర్ర తక్కువ నెగేటివ్ ఐ క్యూ వాదన అని నన్నే తిడతారు. వాళ్ళకి మాత్రం సపోర్టు. కడుపు మండదూ మరి?

సీతక్క: అది తెలిసీ ఈ మర్యాదస్థుల ముసుగులో ఉండి మిమ్మల్నేమీ అనకపోతే మీకు మీరే గొప్పోళ్ళు అనేసుకుంటున్నారు.

వామనరావ్: డైరెక్టుగా మిమ్మల్ని అనే సత్తా గానీ లాజిక్కు గానీ నాకు లేవు కదా మరి. అందుకే

సీతక్క: అందరూ నోరుమూసుకుంటున్నది మిమ్మల్ని చూసి భయపడి కాదు. మిమ్మల్ని కెలికి వేల్యుబుల్ టైంని వేస్టు చేసుకోవడం ఎందుకని

వామనరావ్: నాకు ఒక లైన్ రాయడానికే రెండు రోజులు పడుతుంది. నీముషానికి పది కామెంట్లు పడే బ్లాగుల్లో గొడవపెట్టుకోవాలంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది కావాలి మరి?

సీతక్క: అంచేత ఈ బరితెగించిన గ్రూపిజం మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోండి. అందరికీ మంచిది.

వామనరావ్: అంటే “మీరందరూ వచ్చి నాకు మస్కా కొడుతూ, నాకు చెంచాగిరీ చెయ్యండి. గొడవ ఉండదు. లేదో దొంగపేర్లతో రాసేస్తా ఖబడ్దార్. భయపడతారా లేదా?
ఆ (??
బాబ్బాబు, కాస్త భయపడీ జనజీవన స్రవంతిలో కలిసిపోండి. ప్లీస్, ప్లీస్, ప్లీస్!”


***************** Updated Part ***********************


సీతక్క: ఈ గ్రూపులో హిపోక్రసీ, నిజాయితీ అన్న పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

వామనరావ్: నా దిక్కుమాలిన బ్రతుక్కి హీపోక్రిసీ కి కావాల్సిన తెలివి లేదు, అలా అని నిజాయితీకి కావాల్సిన కనీసపు విలువలు కూడా లేవు. ఎలా బ్రతుకుతానో ఏమిటో, అయ్యో పాపం నేను.



సీతక్క: అదేంటండీ?

వామనరావ్: సెల్ఫ్ పిటీ :))



సీతక్క: హ హా! సరే సరే! తరవాతది - వీళ్ళలా పిచ్చిపిచ్చిగా రియాక్ట్ అయితే హిపోక్రసీ లేనట్లన్నమాట

వామనరావ్: నాకు రియాక్టయ్యే బుర్ర ఉంటేగా? ఏదో ఏడుపుగొట్టు బ్లాగులు రాసుకునే కేసుని కదా. కనీసం సింపథీ అయినా ఉండాలి కదా.


సీతక్క: వీళ్ళలా ఎవరైనా చెండాలంగా మాట్లాడకపోతే వాళ్ళు హిపోక్రిట్లు.

వామనరావ్: అవును మరి, నా చండాలపు బ్రతుకుని, బుధ్ధిని, నోటిని కప్పి పెట్టుకోవాలంటే అవతలవాడూ ఏమి మాట్లాడినా చండాలం అనాలి కదా! ష్! ట్రేడ్ సీక్రెట్ - ఎవరికీ చెప్పకండేం!


సీతక్క: ఎవరిదగ్గర ఎలాంటి పేరుంటే వీళ్ళకెందుకు? వీళ్ళకు కావాల్సింది శాడిస్టానందం.

వామనరావ్: పేరు లేని నాకన్నా ఏదో ఒక పేరున్న వీళ్ళ బ్రతుకే బెటర్. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దూకి చద్దామంటే నా నా వల్ల సముద్రంకూడా కలుషితమైపోతుందని వాళ్ళూ ఒప్పుకోలేదు.


సీతక్క: వాళ్ళని వాళ్ళు వెధవలనుకుంటే

వామనరావ్: వాళ్లని వాళ్ళే వెధవలనుకుంటున్నారు. కానీ నా టైపు వాళ్ళని మిగిలిన జనాలందరూ వెధవలంటున్నారే, వా!


సీతక్క: స్పూన్‌లాగ ఉండడానికి, శాడిస్టులా ఉండడానికీ మద్య మామూలు మనుషులు ఉంటారు.

వామనరావ్: నేను మామూలు మనిషిని కాదుగా. నా లాంటీ శేడిస్టు కమేడియన్లకి మంచిరోజులెప్పుడూ వస్తాయో! అప్పట్లో కొంతమంది బ్లాగర్ల అండ చూసుకుని కొత్తగా వచ్చిన వారిని సతాయించే నన్ను చావగొట్టి చెవులు మూసిన గేంగ్ ఇది. వీళ్ళని అడ్డంగా నరికెయ్యాలి.


సీతక్క: ఇలాంటి పనులు సరదాకే చేస్తున్నామని చెప్పుకోడం వీళ్ళకే చెల్లింది.

వామనరావ్: జీవితంలో ఏ ఒక్కపనీ తప్పుల్లేకుండా చెయ్యడం రాని నాకు కడుపు మండదూ మరి?


**********************************************************


సీతక్క: వామనరావ్ గారూ. భేష్! అడిగిన వాటన్నిటికి టకా టకా చెప్పేశారు

వాషింగ్టన్ వామనరావ్: ఇలాంటీ దిక్కుమాలిన బ్లాగర్ల గోల రోజు వినేదే సీతక్క గారు. ఆ ఎక్స్పీరియన్స్ అన్నమాట

రౌడీ (స్వగతం: హమ్మయ్యా! ఈ దిక్కుమాలిన ఓపెనర్ ఎవరో గానీ, నా బండారం బయటపడకుండా బ్రతికిపోయాను) ఎక్స్‌లెంట్ వామనరావ్ గారూ.

సియాటిల్ సీతక్క: రౌడీ, ఇంక పేరడీ టైం:

మలక్‌పేట్ రౌడీ: ( దేవదాసులో చెలియ లేదు, చెలిమి లేదు …. పాటకి ఒక “దిక్కుమాలిన” పేరడీ)

పల్లవి:

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ


చరణం 1:

బ్లాగులో నాకు కామెంట్ పేట్టే స్పూను కావాలీ

బ్లాగులో నాకు కామెంట్ పేట్టే స్పూను కావాలీ

దిక్కుమాలిన బ్లాగరినైనా పేరు కావాలీ

నాకూ పేరు రావాలీ .. ఈ .. ఈ ..

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో


చరణం 2:

పిచ్చి రాతలు ఎన్ని రాసిన హిట్లే కరువాయే

పిచ్చి రాతలు ఎన్ని రాసిన హిట్లే కరువాయే

భరద్వాజ్ ని కెలికి చూస్తా, ప్రవీణ్ తో గొడవాయే

వాడీకి ప్రవీణ్ తొ గొడవాయే

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో

Mar 13, 2009

అయిదవ నంబరు ప్రమాద సూచిక - 'పొద్దు' గడి కెలుకుడు, పూరణ!

ప్రమాదవనంలోకి తొంగి చూస్తున్న వీక్షకులకు మళ్ళీ నమస్కారం, వసుదేవుడి పాదాభివందనాలు.

ఈ సారి మన గెస్టు హోస్ట్ వాషింగ్టన్ వామనరావు గారు, ముఖ్య అతిధి సియాటిల్ సీతమ్మ గారు ... ఇద్దరికీ నమస్కారం. జంప్ అయిపోదాం కార్యక్రమంలోకి

వామనరావు: నమస్తే రౌడీగారూ ఈ వారం ఎవరిని కెలకాలి?

సీతమ్మ: సియాటిల్ నించి కష్టపడి వచ్చాను ఎవరైనా పెద్దవారిని కెలకాల్సిందే!

మలక్పేట్ రౌడీ: పెద్ద వారినా? లేక ' పొద్దు ' వారినా?

వామనరావు: అమ్మో! తిడతారేమో?

సీతమ్మ: మరేమి ఫరవాలేదు. వారి హ్రస్వ దృష్టి పదిబ్లాగులని మించి పోదులెండి. ఆ పది బ్లాగులూ లేకపొతే బ్లాగ్లోకమే లేదని వారి ఉవాచ.

వామనరావు: సరే! ఏం చేస్తాం? కానివ్వండి. అసలే చత్వారం, పైగా కళ్ళు మూసుకున్నారు. సాహితీ బ్లాగులకేసే కన్నెత్తి చూసే సీను వారికి లేదు, ఇక మన బ్లాగు కూడానా? ఇంతకీ ఎలా కెలుకుదాం?

సీతమ్మ: పొద్దులో అన్నిటికన్నా పాపులర్ ఏమిటి?

వామనరావు: గడి

సీతమ్మ: దానినే కెలికితే పోలా?

వామనరావు: అయితే ఓకే!!

సీతమ్మ: సరే! ఈ డైలాగు తరవాత డైలాగునుండీ ప్రతీ డైలాగులో ఒక పొద్దు గడీ సమాధానం దాగి ఉంటుంది. కనుక్కోండీ. ఒక 35 నిలువు, దానికి సంబంధించి అటు ఇటు ఉన్నవి తప్పా మిగాతావి సరియయినవే అని మా "అనుమానం" :)) రావుగారూ! కాస్త ఇన్వాల్వు అవ్వం'ఢీ'

------------------------

వామనరావు: అబ్బా ఉండండీ! అసలే ఈ తుంటర్వ్యూ కాస్త 'టూకీ' గా ఉండాలి అని జనాల కోరిక!

సీతమ్మ: నేనేమన్నా పారిజాతాపహరణము అనే కావ్యం వ్రాయమన్నానా?

వామనరావు: లేదనుకోండి. కానీ నేను కనీసం వేటూరిసుందరరామమూర్తి అంతటి కవిని కూడా కానే

సీతమ్మ: మీరు కవీ కాదు, రచయితా కాదు, మూడోరకం అని నాకు తెలుసులెండి.

వామనరావు: కానీ కెలుకుడంటే దోరమావి పండు తిన్నంత సులువు కాదు - చంపేస్తున్నారు కదా!

సీతమ్మ: మీరు అసురులు కారు, నేను దితి పుత్రికను కానులెండి. భయపడద్దు.


వామనరావు: మీకేం పోయింది? అసలే మా ఇంట్లో గెస్టులు. మా బావమరుదులు మల్లికా షేరావత్ కోసం సుందోపసుందులు అయిపోయారు.


సీతమ్మ: అయ్యో! మీరు మాత్రం జర భద్రం


వామనరావు: అసలే ఈ నెపము మీద మా మామగారు మా ఇంట్లో తిష్ట వేశారు.


సీతమ్మ: "తగునా యిది మామా" అని పాట అందుకోండి. పారిపోతారు.


వామనరావు: ట్రై చేశా. కాని గదిలోకెళ్ళి తలుపేసుకున్నారు.


సీతమ్మ: హమ్మా! ఎంత రాతి మనిషో కదా!


వామనరావు: "త్యాగరాజనుత" అనుకుంటూ ఒక కీర్తన కూడా మొదలెట్టా!


సీతమ్మ: గది రుసుం చెల్లించి పారిపోయారా?


వామనరావు: లేదు. కాని మా ఇంటి పులుదునా! అదే, పునాదులు కదిలిపోయాయి.


సీతమ్మ: హా హా! మీకు భలే తలంటి అయ్యిందన్నమాట


వామనరావు: ఏమిటో! పంచదార ఎక్కువ పంచక!


సీతమ్మ: పంచదారెక్కడుంది? పానకంలోనా?


వామనరావు: అబ్బా మీరుండండీ! లేకపొతే ఇదేదో పుక్కిటిపురాణము అనుకుని జనాలు వెళ్ళిపోతారు.



సీతమ్మ: అంతెగా? సరే, గొడవలతో చిరాకెత్తిన జనాలకి ఇది కాస్త ఆటవిడుపు


వామనరావు: నిజమే. కానీ ఇలాంటివాటికి కూడా మోకాలు అడ్డేవారు ఉన్నారని కొంతమంది ఉవాచ.


సీతమ్మ: అవునండోఇ. అంతర్జాలమయిపోయింది గానీ లేకుంటే ఇక్కడ కూడా గాజా స్టిప్పు లా గోడవలయ్యుండేవి.


వామనరావు: ఎప్పుడు ఏవి పేలతాయో తెలియదు. అసలే ఇక్కడ అందరికీ తల్లో పేలు


సీతమ్మ: అమ్మో. మరి తలకి కర్పూరం అదేనండీ కపురం రాస్తారా?


వామనరావు: లేదు. మా ఆవిడ మోహన రాగంలో పాట ఎత్తుకుంటే అవే చచ్చిపోతాయి.


సీతమ్మ: ఆవిడ ముసలమ్మ కదా?


వామనరావు: ఎంతమాటన్నారూ? ఇక మీ బుర్రమీద వేస్తుంది ఆదితాళము.


సీతమ్మ: బాబోయ్. వద్దులెండి. నేను ఆడ మనీషి ని.


వామనరావు: అందుకే ఇది. మగవాడయితే ధోనీ ఉతుకుడు ఉతుకుతుంది.


సీతమ్మ: వామ్మో. ఆవిడపేరు రమా దేవి కదూ?


వామనరావు: అవును. రావిచెట్టు కింద పుట్టిందిట.


సీతమ్మ: యది యేమి చిత్రము? వైద్యశాలలు లేవా?


వామనరావు: ఎందుకు లేవు? కానీ అక్కడ ఆడ నర్సులు లేక విరహజ్వాలలు చిమ్ముతున్న డాక్టర్లను చూసి భయమేసి మా మావగారు అత్తగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు అని చెప్పారు.


మలక్పేట్ రౌడీ: సరే రావుగారూ, సీతమ్మగారూ, కెలుకుడు ఇంత సమర్ధవంతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు.

సీతమ్మ, వామనరావు: ధన్యవాదాలు రౌడీగారూ!


మలక్పేట్ రౌడీ: వీక్షకులకు కూడా ధన్యవాదాలు. ఇక వెళ్ళి గడి మీద పడండి. ఇప్పటికే వచ్చేసి ఉంటె లైట్ తీసుకొండి. గడి పూరణలో ఉన్న రెండు మూడు తప్పులని మన్నిస్తారని ఆశిస్తున్నాం. నమస్తే! మళ్ళీ కలుద్దాం!!