Mar 13, 2009

అయిదవ నంబరు ప్రమాద సూచిక - 'పొద్దు' గడి కెలుకుడు, పూరణ!

ప్రమాదవనంలోకి తొంగి చూస్తున్న వీక్షకులకు మళ్ళీ నమస్కారం, వసుదేవుడి పాదాభివందనాలు.

ఈ సారి మన గెస్టు హోస్ట్ వాషింగ్టన్ వామనరావు గారు, ముఖ్య అతిధి సియాటిల్ సీతమ్మ గారు ... ఇద్దరికీ నమస్కారం. జంప్ అయిపోదాం కార్యక్రమంలోకి

వామనరావు: నమస్తే రౌడీగారూ ఈ వారం ఎవరిని కెలకాలి?

సీతమ్మ: సియాటిల్ నించి కష్టపడి వచ్చాను ఎవరైనా పెద్దవారిని కెలకాల్సిందే!

మలక్పేట్ రౌడీ: పెద్ద వారినా? లేక ' పొద్దు ' వారినా?

వామనరావు: అమ్మో! తిడతారేమో?

సీతమ్మ: మరేమి ఫరవాలేదు. వారి హ్రస్వ దృష్టి పదిబ్లాగులని మించి పోదులెండి. ఆ పది బ్లాగులూ లేకపొతే బ్లాగ్లోకమే లేదని వారి ఉవాచ.

వామనరావు: సరే! ఏం చేస్తాం? కానివ్వండి. అసలే చత్వారం, పైగా కళ్ళు మూసుకున్నారు. సాహితీ బ్లాగులకేసే కన్నెత్తి చూసే సీను వారికి లేదు, ఇక మన బ్లాగు కూడానా? ఇంతకీ ఎలా కెలుకుదాం?

సీతమ్మ: పొద్దులో అన్నిటికన్నా పాపులర్ ఏమిటి?

వామనరావు: గడి

సీతమ్మ: దానినే కెలికితే పోలా?

వామనరావు: అయితే ఓకే!!

సీతమ్మ: సరే! ఈ డైలాగు తరవాత డైలాగునుండీ ప్రతీ డైలాగులో ఒక పొద్దు గడీ సమాధానం దాగి ఉంటుంది. కనుక్కోండీ. ఒక 35 నిలువు, దానికి సంబంధించి అటు ఇటు ఉన్నవి తప్పా మిగాతావి సరియయినవే అని మా "అనుమానం" :)) రావుగారూ! కాస్త ఇన్వాల్వు అవ్వం'ఢీ'

------------------------

వామనరావు: అబ్బా ఉండండీ! అసలే ఈ తుంటర్వ్యూ కాస్త 'టూకీ' గా ఉండాలి అని జనాల కోరిక!

సీతమ్మ: నేనేమన్నా పారిజాతాపహరణము అనే కావ్యం వ్రాయమన్నానా?

వామనరావు: లేదనుకోండి. కానీ నేను కనీసం వేటూరిసుందరరామమూర్తి అంతటి కవిని కూడా కానే

సీతమ్మ: మీరు కవీ కాదు, రచయితా కాదు, మూడోరకం అని నాకు తెలుసులెండి.

వామనరావు: కానీ కెలుకుడంటే దోరమావి పండు తిన్నంత సులువు కాదు - చంపేస్తున్నారు కదా!

సీతమ్మ: మీరు అసురులు కారు, నేను దితి పుత్రికను కానులెండి. భయపడద్దు.


వామనరావు: మీకేం పోయింది? అసలే మా ఇంట్లో గెస్టులు. మా బావమరుదులు మల్లికా షేరావత్ కోసం సుందోపసుందులు అయిపోయారు.


సీతమ్మ: అయ్యో! మీరు మాత్రం జర భద్రం


వామనరావు: అసలే ఈ నెపము మీద మా మామగారు మా ఇంట్లో తిష్ట వేశారు.


సీతమ్మ: "తగునా యిది మామా" అని పాట అందుకోండి. పారిపోతారు.


వామనరావు: ట్రై చేశా. కాని గదిలోకెళ్ళి తలుపేసుకున్నారు.


సీతమ్మ: హమ్మా! ఎంత రాతి మనిషో కదా!


వామనరావు: "త్యాగరాజనుత" అనుకుంటూ ఒక కీర్తన కూడా మొదలెట్టా!


సీతమ్మ: గది రుసుం చెల్లించి పారిపోయారా?


వామనరావు: లేదు. కాని మా ఇంటి పులుదునా! అదే, పునాదులు కదిలిపోయాయి.


సీతమ్మ: హా హా! మీకు భలే తలంటి అయ్యిందన్నమాట


వామనరావు: ఏమిటో! పంచదార ఎక్కువ పంచక!


సీతమ్మ: పంచదారెక్కడుంది? పానకంలోనా?


వామనరావు: అబ్బా మీరుండండీ! లేకపొతే ఇదేదో పుక్కిటిపురాణము అనుకుని జనాలు వెళ్ళిపోతారు.



సీతమ్మ: అంతెగా? సరే, గొడవలతో చిరాకెత్తిన జనాలకి ఇది కాస్త ఆటవిడుపు


వామనరావు: నిజమే. కానీ ఇలాంటివాటికి కూడా మోకాలు అడ్డేవారు ఉన్నారని కొంతమంది ఉవాచ.


సీతమ్మ: అవునండోఇ. అంతర్జాలమయిపోయింది గానీ లేకుంటే ఇక్కడ కూడా గాజా స్టిప్పు లా గోడవలయ్యుండేవి.


వామనరావు: ఎప్పుడు ఏవి పేలతాయో తెలియదు. అసలే ఇక్కడ అందరికీ తల్లో పేలు


సీతమ్మ: అమ్మో. మరి తలకి కర్పూరం అదేనండీ కపురం రాస్తారా?


వామనరావు: లేదు. మా ఆవిడ మోహన రాగంలో పాట ఎత్తుకుంటే అవే చచ్చిపోతాయి.


సీతమ్మ: ఆవిడ ముసలమ్మ కదా?


వామనరావు: ఎంతమాటన్నారూ? ఇక మీ బుర్రమీద వేస్తుంది ఆదితాళము.


సీతమ్మ: బాబోయ్. వద్దులెండి. నేను ఆడ మనీషి ని.


వామనరావు: అందుకే ఇది. మగవాడయితే ధోనీ ఉతుకుడు ఉతుకుతుంది.


సీతమ్మ: వామ్మో. ఆవిడపేరు రమా దేవి కదూ?


వామనరావు: అవును. రావిచెట్టు కింద పుట్టిందిట.


సీతమ్మ: యది యేమి చిత్రము? వైద్యశాలలు లేవా?


వామనరావు: ఎందుకు లేవు? కానీ అక్కడ ఆడ నర్సులు లేక విరహజ్వాలలు చిమ్ముతున్న డాక్టర్లను చూసి భయమేసి మా మావగారు అత్తగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు అని చెప్పారు.


మలక్పేట్ రౌడీ: సరే రావుగారూ, సీతమ్మగారూ, కెలుకుడు ఇంత సమర్ధవంతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు.

సీతమ్మ, వామనరావు: ధన్యవాదాలు రౌడీగారూ!


మలక్పేట్ రౌడీ: వీక్షకులకు కూడా ధన్యవాదాలు. ఇక వెళ్ళి గడి మీద పడండి. ఇప్పటికే వచ్చేసి ఉంటె లైట్ తీసుకొండి. గడి పూరణలో ఉన్న రెండు మూడు తప్పులని మన్నిస్తారని ఆశిస్తున్నాం. నమస్తే! మళ్ళీ కలుద్దాం!!

9 comments:

  1. నువ్వో పొద్దు కెలుకుడు పువ్వు

    ReplyDelete
  2. రౌడిగారూ 33 + 37 చెప్పరూ ప్లీజ్

    ReplyDelete
  3. చెప్పారు కదా - మనిషి + ధోని అని

    ReplyDelete
  4. పోద్దేంటి గడేంటి నాకేం అర్ధం కలేదన్నయ్య కాస్త వివరం చెప్పెదవా

    ReplyDelete
  5. EMTO! naku ardham kaaledu, idantaa exams lo copy kotti paasaina vaalla golaa?

    ReplyDelete
  6. మ.రౌడీ గారూ, నిన్ననే మీ బ్లాగుటపాలన్నీ చదివా. తుంటర్వ్యూలు బాగున్నాయి. వ్యంగ్యం బాగుంది.
    ఈటపాపై ఓ విన్నపం. ఈనెల గడి చేయడం మొదలెట్టా. చాలా మటుకు వచ్చాయి. కొన్నిటికోసం ఆనందంగా కుస్తీ పడుతున్నా. మీరు గడి సమాధానాలన్నీ ఓపెన్ గా ఇచ్చేయడం వల్ల ఆ కుస్తీలో ఆనందం మాయమయిపోయింది. క్లూలిస్తే ఓకే. మా ఇంట్లో ఇలాంటి గడులు ఇంట్లో వాళ్ళందరం కలిసి కుస్తీ పట్టేవాళ్ళం. క్లూలద్వారా ఇలాంటి ఎఫెక్టు వచ్చే అవకాశం ఉంది. కానీ సమాధానాలిచ్చేయడం వల్ల కాదు. నేను ఇప్పుడు గడి పూర్తిగా నింపేసా. కానీ పంపించను. పంపించలేను, గడిపూరించడంలో ఆనందం కోసం కానీ నింపడం నింపడం కోసమే కాదు కాబట్టి. ఆనందం మీరు సులువుగా సమాధానాలిచ్చేయడం వల్ల పోయింది కాబట్టీ. ఆలోచించండి. దయచేసి ఎవరూ కూడా 'ఆయన రాస్తేమటుక్కు మిమ్మల్ని ఎవరు చూడమన్నారు' లాంటి లాజిక్కులు లాగి నావిన్నపాన్ని డైల్యూట్ (పొలిటికల్) చేయద్దని మనవి.

    ReplyDelete
  7. సత్యసాయి గారూ,

    ఇదేదో నేను క్షణికావేశంలో చేసింది. It was just an angry reaction to a few things. ఇంకెప్పుడూ చెయ్యను లేండి. Have my apologies for this. May be I dragged it too far.

    ReplyDelete
  8. apologies చెప్పాల్సినంత సీనేం లేదు. పాజిటివ్ గా తీసుకున్నందుకు మీకే అభినందనలు చెప్పాలి.

    ReplyDelete