Showing posts with label ఇంటర్వ్యూ. Show all posts
Showing posts with label ఇంటర్వ్యూ. Show all posts

Sep 27, 2011

పదహారవ నెంబరు ప్రమాద సూచిక: ప్రముఖ "శోష"లిష్టు భోగారావుగారి తుంటర్వ్యూ! - Special Audio at the end of the post!!

మలక్పేట్ రౌడీ: చాలాకాలం తరవాతా మళ్ళీ ప్రమాదవనం తుంటర్వ్యూ విభాగంలోకి తొంగిచూస్తున్న ప్రేక్షకులకు మళ్ళీ కెలికస్కరం. ప్రతీసారీ ఆడవాళ్ళేనా, పక్షపాతం లేకుండా కాస్త మగహోస్టులని పెట్టమని మన ఉలికిపిట్ట భీకరకాంత్ గారు కోరటంతో ఈ సారి మన ఘోస్టుగా రంగ ప్రవేశం చేస్తోంది బాల్టమోర్ బాబూరావ్ ఎన్. గారు.

రౌడీ: నమస్తే బాబూరావ్.

బాబూరావ్ ఎన్: చంపేస్తా బాబూరావ్ అని సింపుల్గా పిలిస్తే! పక్కన "ఎన్" చాలా ముఖ్యం. బాబురావ్ లేకపోయినా ఫరవాలేదుగానీ "ఎన్" మాత్రం ఉండాలి ఏమనుకుంటున్నావో!

రౌడీ: సరే బాబూరావ్ ఎన్, ఇక మొదలుపెట్టు!

బాబూరావ్ ఎన్: వీక్షకులారా ఈ సారి మన ప్రత్యేక అతిథి భోగారావు గారు. ఈయనో ప్రముఖ సోషలిష్టు - టెగ్ లైన్ "అమేరికా పై ఏడుపు" , భోగారావు గారూ స్వగతం

భోగారావ్: నాది ఏడుపు కాదు, మంట, పెట్టుబడిదారీ విధానాలపై కడుపు మంట.

బాబూరావ్ ఎన్: సరే సరే ఏదో ఒకటి. మీ గురించి కాస్త చెప్పండి.

భోగారావ్: పెద్దగా ఏమీ లేదండి. నేనొక వికార్ ని

బాబూరావ్ ఎన్: వికార్ అంటే, వికారం పుట్టిచ్చేవారా?

భోగారావ్: కాదు. వికార్ అంటే "విప్లవ కార్మిక రచయిత".

రౌడీ: విప్లవ కార్మిక రచయితా? అంటే??

భోగారావ్: మీలాంటి రౌడీలకీ పెట్టుబడిదార్లకి అర్థంకదు వ్కార్మిక విప్లవం అంటే ఏమిటో

రౌడీ: నేనడిగింది "విప్లవ కార్మిక రచయిత" గురించి

భోగారావ్: మీరడిగింది ఎవడికి కావాలి. నాకు తెలిసింది నేను చెప్తున్నా. అదే నా రీతి, నా శ్వాస, నా ఊపిరి.

రౌడీ: ఓహో, పక్కవాడు అడిగినదానికి కాక తమకు తోచింది చెప్పటమనేనా శోషలిజం అంటే, సరే సరే.

బాబూరావ్ ఎన్: నువ్వుండెహే రౌడీ. భోగారావ్ ఎలియాస్ వికార్ గారూ, మీరు కానివ్వండి.

భోగారావ్: నేను రాస్తూ ఉంటాను, వేసేస్తూ ఉంటాను.

బాబూరావ్ ఎన్: ఏమిటి రాసేది, వేసేది?

రౌడీ: కట్టు కథలూ, వాటికి ఎఱ్ఱ రంగూనూ

బాబూరావ్ ఎన్: నువ్వుండెహే, ఇక్కడ హోస్టుని నేను. అనవసరంగా మధ్యలో దూరక.

రౌడీ: సరే, నువ్వు కానీ మరి

బాబూరావ్ ఎన్: మీరు చెప్పండి భోగారావు గారూ!

భోగారావ్: నేను కథలు, కవితలు, విశ్లేషణలు రాసేస్తూ ఉంటాను. వాటిని బ్లాగులో అచ్చు వేసేస్తూ ఉంటాను.

బాబూరావ్ ఎన్: అబ్బో, చాలా ఉద్ధరిస్తున్నారన్నమాట

భోగారావ్: మరే. అసలు ఈ రౌడీలాంటి అప్రజాస్వామికి బ్లాగర్లని వ్యతిరేకిస్తూ ఉంటాను.

బాబూరావ్ ఎన్: ఆహా! ఎందుకో?

భోగారావ్: నన్ను వ్యతితేకిస్తూ రాస్తున్నందుకు

బాబూరావ్ ఎన్: అలా రాయకూడదా? మరి మీరు రాసేవి అలాంటి రాతలే కదా?

భోగారావ్: నేను రాసేది వేరు.

బాబూరావ్ ఎన్: మరి వీళ్ళూ రాసేదేంటి? మొక్కా?

భోగారావ్: జోకులొద్దు. ఇక్కడ సీరియస్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇండియాలలో ఉన్న సామాజిక వ్యవస్ధలకు ప్రజాస్వాంకి లక్షణాలు ఉన్నాయా?

రౌడీ: అబ్బే లేవు, క్యూబా, ఉత్తరకొరియా, చైనాల్లో మాత్రమే ఉన్నాయి కదా :))

(ఇంతలో ఒక అజ్ఞాత ప్రవేశం)

బాబూరావ్ ఎన్: అజ్ఞాత నువ్వెవరివి బాబూ?

అజ్ఞాత: నా పేరు రైట్ వింగ్ రాంబాబు. ఆమెజాన్ అబ్దుల్లా అని కూడ అంటారు.

బాబూరావ్ ఎన్: అదేంటి రెండు పేర్లు?

రైట్ వింగ్ రాంబాబు: ఎందుకుండకూడదూ?

భోగారావు: ఫేకు పేర్లతో తిరిగే ఇలాంటి వాళ్ళంటే నాకు మంట

అబ్దుల్లా రాంబాబు: అబ్బో, మరి, భోగారావు అనే పేరు పెట్టుకుని వికార్ అనే తప్పు పేరు చెప్పుకోవటమేమిటో?

భోగారావ్: కన్నతల్లి లాంటి జన్మభూమిని వదిలి డాలర్ల కోసం అమెరికాకు వెళతారు మీరు.

అబ్దుల్లా రాంబబు: కన్నతల్లి పాలుతాగి రొమ్ముగుద్దే నీ లాంటి నీచబుద్ధి దేశద్రోహులకన్నా మేము చాలా నయం. ఇండియా మా మీద పెట్టిన ఖర్చుకు రెట్టింపు మేము చెల్లించిన పన్నులు. నా ఇండియా జీతమంతా ప్రైవేటు సంస్థలే ఇచ్చాయి. వాటికి ఆదాయం అమేరికన్ల దగ్గరనుండీ వచ్చింది. మరి తమరు వెలగబెడుతోంది ఏంఇటి? పక్క వాడి సొమ్ముతింటూ సిగ్గులేకుండా బ్రతకడమేగా? తమకొస్తున్న జీతంలో నేను కట్టిన పన్ను కూడ ఉంది కాని నాకొచ్చేదానిలో తమరు చేసింది ఏమీ లేదు. కట్టుకథలొద్దు.

భోగారావ్: ఒక మతాన్ని నమ్ముతున్న కోట్లాదిమంది ప్రజానికాన్ని కేవలం ముస్లింలు అయినందుకు అకారణంగా ద్వేషించే వారు సోషలిజంపైనా ప్రజాస్వామ్యంపైన చర్చ చేయగల అర్హతను కలిగి ఉంటారా?

అబ్దుల్లా రాంబాబు: నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అంతకన్నా ఎక్కువ ఉన్న జనాభాని కేవలం హిందువులన్న నెపంతో ద్వేషించటం హిందువులన్న నెపంతో ద్వేషించే మీలాంటి పనికిమాలిన వాళ్ళ సంగతేంటి?


బాబూరావ్ ఎన్: అబ్దుల్లా రాంబాబు గరూ, మీ ఘాటు మరీ ఎక్కువయ్యింది గానీ, కాస్త తగ్గించండి.

అబ్దుల్లా రాంబాబు: అది నావల్ల కాదు

బాబూరావ్ ఎన్: అయితే మరో తుంటర్వ్యూలో కలుద్దాం. ఇది మీకు నప్పదు.

అబ్దుల్లా రాంబాబు: సరే వెడుతున్నా. ఈ సారి ఏకంగా బ్రహ్మాస్త్రంతోనే వాస్తా, ఈయన గారి బేంకు వివరాలతో సహా.


బాబూరావ్ ఎన్: ఒక్క నిముషం, ఎవరో ఫోను.

రౌడీ: ఎవరూ?

బాబూరావ్ ఎన్: చీకట్లో పుట్టి చీకట్లో పెరిగి, చీకటి బ్రతుకు బ్రతుకుతూ చీకటి పనులు చేసే చీకటి చిన్నయ్యత

రౌడీ: ఏంటి ఆయన బాధ?

బాబూరావ్ ఎన్: ఏమీ లేదు. వీళ్ళు చేసే పనులన్నీ బయటపెట్టేసరికీ తట్టుకోలేకపోతున్నారు. పాపం వళ్ళేదో మన ద్వందనీతిని బయట పెట్టేశారుట

రౌడీ: అవునా. మరి తిన్నగా మాట్లాడకుండా తప్పించుకుని తిరగడమెందుకో?

బాబూరావ్ ఎన్: తిన్నగా వాదనలోకి దిగితే వారి డొల్లతనం బయటపడుతుందని.

రౌడీ: ఇదివరకూ మీడీయాని హైజాక్ చేసి వారికి తోచింది రాయటం అలవాటయిపోయింది. బ్లాగుల్లో కూడా అలాగే చెయ్యచ్చనుకున్నారు. పాపం ఇక్కడ దెబ్బకి దెబ్బ పడేసరికీ తట్టుకోవటం చేతకాక విలవిల్లాడుతున్నారు.

భోగారావ్: ముస్లింలపై మారణ కాండ సాగించిన మోడీ చేసిన పనులు సరైనవేనని వాదిస్తున్నారు మీరు.

బాబూరావ్ ఎన్: మోదీ చేసిన పనులు సరయినవే అని అన్నది ఎవరు? అన్నట్టు మావో స్టేలిన్లు సాగించిన మాఱణకాండ సంగతి ఏమిటి?

భోగారావ్: దానికి ఆధారం ఏమిటి?

బాబూరావ్ ఎన్: మరి మోదీ పై మీ ఆరోపణలకు ఆధారం ఏమిటి? బాబా రాందేవ్ మందుల్లో ఎముకలపొడి కలుపుతాడు అనేదానికి నిరూపణ ఏది? మందులు మార్కెట్లోనే ఉన్నాయి కదా? ఏ కమ్యూనిష్టు మేధావిచేతో పరీక్షచేయించవచ్చు కదా?

భోగారావ్: టీవీల్లో న్యూసు

బాబూరావ్ ఎన్: అందులో మోదీ చేయించాడని ఉందా?

భోగారావు: అది మనం అర్థం చేసుకోవాలి అంతే

బాబూరావ్ ఎన్: మావో, స్టేలిన్లు చేసిన హత్యాకాండ కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి. అలాంటి హంతకుల అడుగుజడల్లో నడిచే మీకు, మోదీ ఎంత వెధవయినా సరే, విమర్శించే హక్కుందా?


భోగారావ్: మీరు ఏకాకులు

బాబూరావ్ ఎన్: తమ బొంద. కమ్యూనిష్టంటే  చాలు జనాలు చెప్పులేస్తున్నారు, మీ నీచత్వానికి తగిన బహుమతిగా. ఏకాకులెవరో జనాలకి బాగా తెలుసు.


ఫోను లైనులో: ఏ బోన్సాయ్ మొక్క కూడా, తాను బోన్సాయ్ మొక్కనని ఒప్పుకోదు. అడ్డగోలు వాదనలు చేస్తారు.

బాబూరావ్ ఎన్: సరే, మేము బోన్స్సయిలమే కావచ్చు. కానీ మీలాంటి పనికిరాని గడ్డికన్నా పొడుగ్గానే ఉంటాము. మరి పనికిమాలిన వాదనలు బ్లాగుల్లో పెట్టేవాళ్ళకి అడ్డగోలు వాదనలే సరయిన సమాధానం. తిన్నగా చర్చిద్దామంటే మీరు చేసే చీకటిపనులు బయటపడతాయని భయం, అందుకే రాళ్ళేసి పరిపోతూ ఉంతారు.

(ఫోన్ లైన్ కట్)

బాబూరావ్ ఎన్: నేను చెప్పానా లేదా? చర్చ చర్చ అని గగ్గోలు పెడతారేగానీ భారత దేశంలో ఒక్క కమ్యూనిష్టుకి కూడా ఆ ధైర్యంలేదు.

రౌడీ: ఏంటెహే తుంటర్వూ చప్పగా సాగుతోంది? జనాలకి విసుగొస్తోంది.

బాబూరావ్ ఎన్: సరే రూటు మారుద్దాం.

రౌడీ: ఏంటి మార్చేది? ఇప్పటికి ఇది సాగి సాగి కొండవీటీ చేంతాడంతయ్యింది.

బాబురావ్ ఎన్: అయితే దీనికో ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఒక పాటేసుకో మన హీరో మీద.

రౌడీ: హీరో అంటే?

బాబురావ్ ఎన్: బ్లాగుల్లో ఉన్న ఒకే ఒక్కడు

రౌడీ: జనాలకి విసుగొస్తుందేమో?

బాబురావ్ ఎన్: ఏమీ కాదు. ఎన్ని సార్లు ఎన్ని పాటలు పాడినా జనాలకి విసుగురాదు. నువ్వేస్కో ఇంక.

రౌడీ: తప్పదంటావా? సరే, ఇదిగో ఆడియో: దీనిలో ముగ్గురి భాగస్వామ్యం ఉంది - ఒంగోలు శ్రీనుది, షంకర్ది (Snkr కాని శంకర్), నాది. By the way it is from Michael Vadina Kamaraju Part 2 (Under Production) and here is the killer: ఆడియోలో నాగొంతు కాకుండా మరొక గొంతు ఉంది - అదెవరిదో చెప్పుకోండి చూద్దాం :))







The lyrics - Sung to the tune of "అమ్మాయే సన్నగా" from "ఖుషీ"


మార్తాండం తిక్కగా కామెంట్లే పెట్టగా
మతిపోయీ బ్లాగర్లే మెంటల్ కేసులయ్యారే


మన హీరో పెద్దగా రాగాలే తీయగా
పక్కనున్న గబ్బిలానికీ గర్భస్రావమయ్యేలే (Thanks Ongole for this punch line)

ఇది చూసిన ..
పక్కింటావిడ ..
ఇది చూసిన పక్కింటావిడ పొలికేకలు పెట్టెలే


మార్తాండం పెద్దగా రాగాలే తీయగా
పక్కనున్న గబ్బిలానికీ గర్భస్రావమయ్యేలే

చరణం:

ఐశ్వర్యా రాయయినా మార్తాండకి వద్దయ్యోయ్
అరవై ఏళ్ళ వదినే మనవాడికి ముద్దయ్యోయ్

ఐశ్వర్యా రాయయినా మార్తాండకి వద్దయ్యోయ్
అరవై ఏళ్ళ వదినే మనవాడికి ముద్దయ్యోయ్

ఆమె విధవయితే ఇక లేనిది హద్దేలే
వందకి రెండదొందలు మన హీరో పద్దేలే

గాలుల్లో జడివానల్లో మలక్ ప్రయాణం చేసేలే
అది చూసి మన మార్తాండం ఒక పాటే పాడేలే

ఆ పాటకి .. ఓ .. ఓ..
ఒక గాడిద .. ఆ .. ఆ..

ఆ పాటకి ఒక గాడిద తన గొంతే కలిపేలే

మార్తాండం తిక్కగా కామెంట్లే పెట్టగా
మతిపోయీ బ్లాగర్లే మెంటల్ కేసులయ్యారే


చరణం:


కాష్మోరాకి కజినే భేతాళుడికీ బ్రదరే (Thanks Shankar for the next few lines)
గుడ్లగూబకు తోడే చీక్కోలుకు ఇక చీడే

బ్లాగే కాకయితే దానరుపూ వీడేలే
పోస్టే కప్పయితే దాని బెకబెక విడేలే


నిలువెత్తు ని"కృష్ణుని" రూపం వీడి సొంతమేలే
పలికితే గందరగోళం అర్థం గార్ధభాండమేలే

వీడి స్పీచులు విన్నవారిక
తెగ మూర్ఛలు పోయేలే ...

Feb 14, 2010

పదవ నెంబరు ప్రమాద సూచిక: అలాస్కా అచ్చమ్మ కబుర్లు

.
.
.
.

మలక్పేట్ రౌడీ: ప్రమాదవనంలోకి కొంత ఉత్సుకతతో, మరికొంత అనుమానంతో భయం భయంగా తొంగి చూస్తున్న వీక్షకమహాశయులకు కెలికాస్కారం. ఈసారి ముందుగా మనం స్వాగతం చెబుతోంది అలాస్కా అచ్చమ్మ గారికి, అచ్చమ్మ గారూ నమస్తే!

అచ్చమ్మ: నమస్తే రౌడీ అన్నా! ఏంటి ఇవాళ నన్ను ముందు పిలిచావు? నీ ఘోస్టు ఎక్కడ?

రౌడీ: అదే ట్విస్టు ఇక్కడ. నిన్ను పిలిచింది ఇది హోస్టు చెయ్యడానికి

అచ్చమ్మ: ఓర్నీ, నన్ను ఇంటర్వ్యూ చేస్తావనుకుని పట్టు చీర, రే బేన్ గ్లేసులు, వంటినిండా నగలూ దిగేసుకునొచ్చాకదయ్యా? ఇప్పుడూ నా మీద ఫోకస్ లేకపోతే ఏలా?

రౌడీ: ఫోకస్ నీమీద ఉంచుకోగల కేపేసిటీ నీకుందని తెలుసులే. ఇక మొదలెడదామా?

అచ్చమ్మ: ఏమిటి మొదలెట్టేది? గెస్టెవరు ఇవాళ?

రౌడీ: ఇవాళ మనకి గెస్టులు అంచెలంచెలుగా వస్తూంటారు - ఇవిగో స్క్రిప్టు పేపర్లు - ఇక మొదలెట్టు . ఈసారి తుంటర్వ్యూ కాస్త సీరియస్. హాస్యం పాలు తక్కువ. సమయాభావం వల్ల కాస్త అతుకుల బొంతలా తయారయ్యింది.



అచ్చమ్మ: సరే సరే. మన మొదటి గెస్టు - కనేటికట్ కాగడా మొగుడక్కయ్య. మొగుడక్కయ్యగారూ నమస్తే

మొగుడక్కయ్య: నమస్తే నమస్తే.

అచ్చమ్మ: ముందుగా, మీ పేరు వెనక రహస్యం చెప్తారా?

మొగుడక్కయ్య: నాకీపేరు పెట్టిన రౌడీనే అడుగు

అచ్చమ్మ: రౌడీ?

రౌడీ: అబ్బే అదేమీ లేదు. బ్లాగుల్లో అక్క, కాగడాకి మొగుడు కదా, అందుకే రెండూ కలిపా. ఏలా ఉంది మన క్రియేటివిటీ?

అచ్చమ్మ: ఏడ్చినట్టుంది. నువ్వూ నీ కుళ్ళుజోకూను. సరే మొగుడక్కా, ఒక మూడూ రోజులపాటు హడావిడి చేశావ్ కదా, నువ్వు సాధించినదేమిటి?

మొగుడక్కయ్య: కాగడా హారం తెంపేశానుగా! అంతకన్నా విజయం ఏమికావాలి

అచ్చమ్మ: ఓహో, మరి పవన్ని బక్రా చేసిందెందుకు?

మొగుడక్కయ్య: పవనే కాగడా, కాగడానే పవన్. ఇద్దరి టైం జోను ఒకటే, ఇద్దరూ ఒకేరోజు బ్లాగులు తెరిచారు

రౌడీ: అమ్మా, తల్లీ, కాగడ ఏడాది క్రితమే బ్లాగుల్లోకొచ్చాడు. కొంతకాలం బ్లాగ్ మూసేసి మళ్ళీ రీఓపెన్ చెశాదు.

మొగుడక్కయ్య: అంత లేదు. నీకేమి తెలియదు గానీ కాస్త తగ్గు

అచ్చమ్మ: మరి మంచుపల్లకిని ఇరికించిందెందుకూ?

రౌడీ: వీళ్ళిద్దరూ మహిళామండలికి వ్యతిరేకంగా ఏదో గోల చేశారు అదీ కచ్చ ..

(బేక్ గ్రౌండ్ లో ఇత్తడి కంఠం - ఇనుముకెక్కువ, కంచుకు తక్కువ)

స్టేలిన్ మావో జిందాబాద్. స్త్రీలందరికీ విరోచనం .. సోరీ .. విమోచనం కావాలి ... స్టేలిన్ మావో జిందాబాద్ .. జిందాబాద్ .. జిందాబాద్ ..

అచ్చమ్మ: వీక్షకులారా, ఈయనే మన రెండో గెస్టు - రాజాధి రాజ, రాజ మార్తాండ, ప్రవతార బిరుదాంకిత, స్త్రీ విమోచన సాధక, వదినవాంఛక డాక్టర్ ప్రనా! ప్రనా గారూ, నమస్తే.

ప్రనా: నమస్తే అన్నది సంస్కృతపదం, హిందువులకి గౌరవ సూచకం - నేను నాస్తికుడిని అందుకే మీకు తిరిగి చెప్పను

అచ్చమ్మ: సరే ప్రనా గారూ, మీరు మీ కధల వల్ల బ్లాగుల్లో చాలా పాప్యులర్ అయ్యారని వినికిడి - ఏవీ మచ్చుకి రెండు కాన్సెప్ట్లు చెప్తారా?

ప్రనా: తప్పకుండా! నా కధల్లో రెండు తప్పనిసరిగా ఉండాలి. ఒకటి - విలన్ పేరు భరద్వాజ, రెండు - వదినా మరుదుల మధ్య ప్రేమ సందేశం

మొగుడక్కయ్య: తల్లిలాంటి వదినతో ప్రేమకలాపాలేమిట్రా త్రాష్టుడా? ఎక్కువ మాట్లాడితే తిట్ల డండకం చదువుతా జాగ్రత్త. లేకపోతే అచ్చమ్మ బ్లాగులో వంటలన్నీ తినిపిస్తా. చచ్చూరుకుంటావ్

అచ్చమ్మ: మొగుడక్కా, శాంతించు. అసలే వంటల జ్యోతిని మెంటల్ జ్యోతి చేశాడు. ఇక నిన్నేం చేస్తాడో.

మొగుడక్కయ్య: నా స్ట్రేటజీముందు వీడెంత?

అచ్చమ్మ: సరేగానీ మొగుడక్కా, ఒక విషయం చెప్పు - నీ వెనకాల ఉన్న లేడీస్ గేంగ్ ఎవరు?

మొగుడక్కయ్య: నా వెనకాలెవ్వరూ లేరు నేను నేనే. నువ్వు నీ జంధ్యాల తిట్ల డండకం వినిపించినా సరే, నా సమాధానం ఇదే.

అచ్చమ్మ: మరి వంటలు మానేసి పెంటల మీద పడ్డావెందుకు?

మొగుడక్కయ్య: వంటల స్పెషలిష్టువి నీకు తెలియదా?

ప్రనా: ఆగండాగండి. ఇంతకీ మీ ఇద్దరిలో బ్లాగక్క ఎవరు? నాకిద్దరూ ఒకేలా కనిపిస్తున్నారు

అచ్చమ్మ: అసలు కనిపిస్తున్నందుకు సంతోషించండి. మొగుడక్క బూతుల బ్లాగుకి కారణాలు ఇవీ అని జనాలు చెవులూ ముక్కులూ కొరుక్కుంటున్నారు

1. కాగడ మీద కచ్చ .. కాగడా ఎవరో తెలియక - తెలిసినవారిమీద దాడి - ఎదురుదాడి చేశామన్న తుత్తి కోసం
2. కాగడానే కాగడా మొగుడి అవతారం ఎత్తడం - తన టీ ఆర్ పీ రేటింగులు పెంచుకోవడం కోసం
3. ఎవరెవరో తెలియని కంఫ్యూషన్
4. మిగతావారి మీద ఉన్న వేరే కచ్చని ఈ విధంగా తీర్చుకోవడం
5. పైవన్నీ
6. శ్రీనివాస్ చెప్పిన కారణాలు

Viewers, మీకు తోచిన సమధానాన్ని కామెంటండి. ప్రైజ్ - మొగుడక్క బ్లాగులోకి ఉచిత ప్రవేశం.

అరే మన తరువాయి గెస్ట్ వచ్చేశారు, టెన్నెసీ తాతారావు గారూ, నమస్తే.

టెన్నెసీ తాతారావు: నమస్తే

అచ్చమ్మ: వీరి బధ్ధ విరోధి కొలంబస్ కోదండం గారికి కూడ స్వాగతం

కొలంబస్ కోదండం: నమస్తే.

అచ్చమ్మ: తాతారావుగరొక సమైక్యవాది, కోదండంగారేమో ఒక వేర్పాటువాది. ఇప్పుడు వీరిద్దరూ కొట్టుకుంటారు - తూచ్ - చర్చించుకుంటారు. అన్నట్టు వీరిద్దరికీ చిన్నపేర్లంటే ఇష్టమండోఇ - అందుకే తాతారవు గారిని "తా", కోదండం గారిని "కొ" అని పిలుద్దాం.

తా: ఏమిటండీ అసలు? అతి తక్కువ శాతమున్న ఆంధ్రులు తెలంగాణావారిని దోచేస్తున్నారంటే నమ్మకంగా ఉందా? దోపిడీ నెపంతో ఆంధ్రులపై ద్వేషం వెళ్ళగక్కుతున్నారు. నేనడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా?

కో: ఏమీ కాదు. కావాలంటే మీప్రశ్నలన్నిటీకీ సమాధానం ఈ లింకుల్లో ఉంది చూడండి

తా: అరే! నేను ప్రశ్నలడగకుండానే సమాధానం ఉందంటారేమిటి?

కో: మీరడిగే ప్రశ్నలు నాకు ముందే తెలుసుగా

తా: మీ తెలంగాణావారందరూ తాగుబోతులు. బధ్ధకస్తులు. దగుల్బాజీలు.

అచ్చమ్మ: తా గారూ, మీ ఆరోపణలకి ఆధారం ఏమిటి? లెక్కలేమన్నా ఉన్నాయా?

తా: నా లెక్కలు నావి నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు

కో: చూసారా? ఇదీ ఆయన వరస. Hyd లో తెలంగాణేతరులు ఎక్కువున్నారు. వారే తాగుతున్నారు. తెలంగాణవారు పాలు తప్ప ఇంకేమీ తాగరు.

తా: అబ్బా, ఛా?

కో: మరే, కావాలంటే లెక్కలు చూడండి. స్థానికులెంతమందో స్థానికేతరులంతమందో తెలుసుకుని మాట్లాడండి

రౌడీ: అంటే స్థానికులకంటే స్థానికేతరులే ఎక్కువంటున్నారా?

కో: (స్వగతం) అమ్మో, పెద్ద చిక్కొచ్చిపడింది. స్థానికేతరులెక్కువ అంటే, ఒక ఇబ్బంది లెకపోతే తా గారి లెక్కల్ని ఒప్పుకోవాల్సి వస్తుంది - ఇప్పుడెలా? )

అబ్బే నేనలా అనలేదు. స్థానికుల స్థానికేతరుల లెక్కలని పరిగణలోకి తీసుకోమన్నాను అంతే.

రౌడీ: సరే, తా గారూ, కో గారూ, మీ పోరాటం కేవలం హైదరాబాదు కోసమని ఆరోపణ. ఏమమటారు

తా: అబధ్ధం. నాకు కావాల్సింది సమైక్యాంధ్ర.

కో: ముమ్మాటికి తప్పు. మాకు కావాల్సింది మొత్తం తెలంగాణా.

రౌడీ: సరే, తా గారూ తెలంగాణానుండి హైదరాబాద్ ని విడగొడితే, మీరు తెలంగాణా కి మధ్ధతిస్తారా?

తా: కష్టమే గానీ సర్దుకుపోతాం

రౌడీ: కో గారూ, హైదరాబాద్ లేకపోతే తెలంగాణా కి వారొప్పుకుంటున్నారు, మీరేమంటారు?

కో: హైదరాబద్ లేని తెలంగాణ మాకొద్దు.

రౌడీ: అదేమిటండీ? హైదరాబాద్ అంటే ఒకటో రెండో జిల్లాలేగా? ఈ గొడవ తేలేదాకా దానిని పక్కన పెట్టి మిగతా తెలంగాణా తీసుకోవచ్చుగా? మిగిలిన జిల్లాలు జిల్లలు కావా? మిగిలిన వారు మనుషులు కారా?

కో: హైదరాబాద్ తెలంగాణా లో అంతర్భాగం. అది లేని తెలంగణా మాకొద్దు

రౌడీ: మరి కర్నాటకకి, మహరాష్ట్రకి జిల్లాలని వదులుకున్నారుగా?

తా: విడిపోయిన రాష్ట్రాలకెప్పుడూ రాజధాని దక్కలేదు

రౌడీ: అంటే మీ ఇద్దరికీ సమైక్యాంధ్ర, తెలంగాణాల మీద ప్రేమ కన్నా హైదరాబాద్ భూములమీద మమకారం ఎక్కువ. తమ ఆస్థులు ఎక్కడపోతాయో అని తా గారు, రియల్ ఎస్టేట్ చీప్ గా కొట్టెయ్యచ్చని కో గారు .. అంతేగా?

నిజంగా సమైక్యాంధ్ర మీద ప్రేముంటే తా గారు హైదరబాద్ ని విడగొట్టడానికి ఒప్పుకునేవారు కాదు. అలగే కో గారికి తెలంగాణా మీద ప్రేముంటే ముందు హైదరాబాద్ ని పక్కన పెట్టి మిగిలిన జిల్లాలని సాధించుకునేవారు. తరవాత హైదరబాద్ గురించి పోరాడేవారు. తొమ్మిది జిల్లాల పోరాటం ఒకటిన్నర జిల్లాలకి పరిమితమయ్యేది.

తా గారికి హైదరాబాద్ తప్ప తెలంగాణా అక్కరలేదు, కో గారికి హైదరాబాద్ తప్ప తెలంగాణాలో మిగిలిన జిల్లాలు అక్కరలేదు. ఇంతా చేసి వెర్రి వెధవలయ్యింది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మెహ్బూబ్నగర్ ప్రజలేగా?

వేర్పాటువాదులు సమైక్యవాదులు కలిపి కోస్తోంది "కో" "తా" - కోతలే!

తమిళనాడు నుండి విడిపోవడానికి "ఊ" కొట్టిన వారు తెలంగాణా విడిపోడానికి "ఊహూ"!

తెలంగాణా విడిపోవడానికి "ఊ" కొడుతున్న తెలగాణ్యులు హైదరాబాద్ విడిపోడానికి "ఊహూ"!!



అచ్చమ్మ: నాయనా రౌడీ, నీ సుత్తాపెహే. ఛాన్సు దొరికింది కదా అని స్పీచ్లిస్తున్నావ్.

(ఇంతలో ఏదో పైనుండీ "ధబేల్" మంటూ క్రింద పడ్డ శబ్దం)

అచ్చమ్మ: ఇతనెవరు? పక్క ద్వారాల్లోంచి రాకుండా పైనుండి కప్పు చీల్చుకుని మరీ వచ్చాడు?

రౌడీ: ఇతనే మన బ్లాగుల్లోనున్న ఏకైక డిఫెక్టివ్... సోరీ... డిటెక్టివ్ వికటకవి రాజేష్.

అచ్చమ్మ: అబ్బో, ఏమేమి అపరాధ పరిశొధనలు చేశాడేమిటి?

రౌడీ: చాలా ఉన్నాయ్:

* తాడేపల్లి గారే ధూము, దుర్గేశ్వర గారే కాగడా అని, సెన్సేషన్ క్రియేట్ చేసి పాదరక్షాఘాతాలు, అదే చెప్పు దెబ్బలు తిన్నాడు

* మలక్ ఏకలింగం ఒకరే అని తేల్చేశాడు

* పైత్యావలోకనం బ్లాగును హేక్ చేసింది పెట్టుబడి దారు జార్జ్ బుష్ అని కనిపెట్టాడు

* ప్ర నా కి వ్యతిరేకంగా ఒబామా, సీ ఐ యే, బ్రిటిష్ ప్రభుత్వం పన్నిన కుట్రని విఫలం చేశాదు.

* ఇప్పుడు కొత్తగా వచ్చిన బోడిలింగం బ్లాగును పట్టుకోబోతున్నాడు


అచ్చమ్మ: అలాగా! స్వాగతం డిటెక్టివ్ రాజేష్ గారూ! ఈ బోడిలింగ రహస్యాన్ని ఎలా ఛేదించబోతున్నారు?

రాజేష్: ఇది నా ఎడమ చేతి పని. కాగడా మొగుడి లిస్టులో ఏకలింగం పేరు లేదు అన్న వాదనని పట్టుకుని ముందు జాగ్రత్త గా ఈ సారి పకడ్బందీ ప్రణాళిక తొ ఈ బ్లాగు పెట్టారు.

అచ్చమ్మ: కొంపదీసి కోడిహళ్ళి మురళీమోహన్ గారో, ఆచార్య ఫణీంద్రగారో ఈ పని చేశారని తేల్చరుకదా?

రాజేష్: అరే! నేను అదే రూట్లో ఆలోచిస్తున్నా. మీరెలా కనిపెట్టేశారు.

అచ్చమ్మ: తమ ఘన చరిత్ర చూసి.

రాజేష్: థేంక్యూ, థేంక్యూ.

అచ్చమ్మ: (స్వగతం: ఒరేయ్ వెధవాయ్, నేను నిన్ను పొగడలేదు, తిట్టాన్రా) దీని తరవాత ఏం పరిశొధన చెయ్యబోతున్నారు?

ప్రనా: ఏహే, ఇదంతా ఎందుకు? బోడిలింగం వదిన పేరు చెప్పు, బోడిలింగమేవరో నేను క్షణాలలో చెప్తా

అచ్చమ్మ: అబ్బా ప్రనా! మీరుండండి. రాజేష్, మీరు చెప్పండి

రాజేష్: చాలా ఉన్నాయండీ, ముఖ్యమైనది మార్తాండ జన్మ రహస్యం

అచ్చమ్మ: అలాగా? దాని గురించి కాస్త విశదీకరిస్తారా?

రాజేష్: తప్పకుండా. మార్తాండుడు పుట్టే సమయంలో బ్రహ్మ దేవుడు స్టేలిన్ మావోల సినిమాలు చూస్తున్నాడా, లేక రంగనాయకమ్మ, చలం నవలలు చదువుతున్నాడా అన్న దిశలో పరిశొధన సాగిస్తాను. దానిని బట్టీ మనకి చాలా విషయాలు తెలుస్తాయ్.

ప్రనా: నేనొప్పుకోను. వారిద్దరూ నాకే స్వంతం.

అచ్చమ్మ: ఏమిటది? ఇద్దరు హీరోయిన్లున్న హీరో డైలాగులా?

ప్రనా: సారీ సారీ, వారిద్దరి పరిజ్ఞానం నాకే స్వంతం. బ్రహ్మదేవుడు చదవడానికి వీల్లేదు. లేక పోతే బ్రహ్మదేవుడి వదిన మీద కొత్త జిగురు - అంటుకుంటే వదలదు - అనే కధ వ్రాసి బ్రహ్మదేవుడిని ఓడిస్తా.

అచ్చమ్మ: కధ వ్రాసి బ్రహ్మదేవుడిని ఓడిస్తారా? మీరు నాస్తికులేమో కదా?

ప్రనా: ఉబుంటూ తెలిసినవారికి ఇది చాలా తేలిక. సహాయం కావాల్సిన వారు నాకు ఫోన్ చేస్తే నేను సహాయం చెయ్యగలను

అచ్చమ్మ: ఉబుంటూకి బ్రహ్మదేవుడికి ఏమిటి సంబంధం?

ప్రనా: విలన్ భరద్వాజ్ కాబట్టీ!

అచ్చమ్మ: ఒక విషయానికి, తరవాత దానికి సంబంధంలేకుండా మాట్లాడుతున్నారేంటి?

ప్రనా: కావాలంటే నా లింకులు చూడండి. లండన్ లో "జూనియర్ డాక్టర్" మాటలు మీరు వినాలి

అచ్చమ్మ: లండన్ లో జూనియర్ డాక్టర్లు ఉంటారా?

ప్రనా: లియో టాల్స్టాయ్ కధలు చదివిన హేతువాదులు ఇలాంటి ప్రశ్నలడగరు

అచ్చమ్మ: రౌడీ, నాకు పిచ్చెక్కుతోంది. టాపిక్ మారుస్తున్నా - ఇప్పుడు సమస్యాపూరణం

రౌడీ: చచ్చితిని. రవిగారు, జ్యోతి అని కాకుండా కాస్త మంచిది ఇవ్వు

అచ్చమ్మ: సరే, సరే .. ఈ సారి సమస్య .. "కాగడాకు పవను మిత్రుడగును" - పద్యం ఛందోబధ్ధంగా ఉండక్కరలేదు - కాస్త పద్యంలా వినబడితే చాలు.

రౌడీ: మళ్ళీ నన్ను ఈ వివాదంలోకి లాగాలని చూస్తున్నావా?

సరే, వివాదంతో సంబంధంలేకుండా చెప్తా ...






శాస్త్రవేత్తలు చెప్పె నగ్నిదేవునకెపుడు
ఆక్సిజన్ను ప్రాణప్రదము గాన
ప్రాణవాయువుతోడ కణకణా మండేటి
కాగడాకు పవను మిత్రుడగును


(శాస్త్రవేత్తలు చెప్పినట్టు మంటకి ఆక్సిజన్ ప్రాణప్రదం కాబట్టీ, దానితో మండే కాగడాకి పవనుడు, అంటే వాయుదేవుడు, మిత్రుడు అని భావము)


అచ్చమ్మ: సరే, ఇక పేరడీ టైం - రౌడీ, పేరడీ వదులు:

రౌడీ: ( పాతాళ భైరవి - కలవరమాయే మదిలో ట్యూనులో)


కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో
హారంలో ఇది సంచలనమాయే
బ్లాగర్లంతా సతమతమాయే

కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో


చరణం:

కాగడాకే మొగుడిని అంటూ
కొత్తవతారం వచ్చింది
కాగడాకే మొగుడిని అంటూ
కొత్తవతారం వచ్చింది
ఉరిమి ఉరిమి మంగళమైన
పవను మీద పడెనయ్యయ్యో

కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో


చరణం:

ఎంకికి పెళ్ళే సుబ్బి చావని
బ్లాగ్లోకం కోడై కూసింది
ఎంకికి పెళ్ళే సుబ్బి చావని
బ్లాగ్లోకం కోడై కూసింది
కాగడానే పవనుడంటూ
సడేమియా సందడిలో


కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో
హారంలో ఇది సంచలనమాయే
బ్లాగర్లంతా సతమతమాయే

కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో


అచ్చమ్మ, రౌడీ: గెస్టులకి ధన్యవాదాలు. ఇంతసేపూ ఈ సుత్తిని ఓపికతో వీక్షించిన వీక్షకులకి కూడా. సమయాభావంవల్ల దీనిని పూర్తిగా వ్రాయలేకపోయాం. వచ్చే తుంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకూ కెలవ్.

.
.
.
.

Oct 1, 2009

తొమ్మిదవ నెంబరు ప్రమాదసూచిక: దిక్కుమాలిన బ్లాగరి స్పెషల్ :)) - Post updated with new conversation










SOME PEOPLE MAY NOT UNDERSTAND WHAT THIS IS ALL ABOUT, BUT I AM SURE, VERY SOON YOU WILL! (DEPENDING ON HOW MUCH TIME VEEVEN TAKES TO INCLUDE A BLOG IN KOODALI)



ఫ్రమాదవనం లోకి మళ్ళీ తొంగిచూస్తున్న వీక్షక మహాశయులందరికీ తిరిగి కెలికాస్కారం. ఈ సారి మన ఘోస్టు సియాటిల్ సీతక్క గారు

మలక్‌పేట్ రౌడీ: నమస్తే సీతక్కా

సియాటిల్ సీతక్క: నమస్తే రౌడీ అన్నా, అంతా బాగేనా?

మలక్‌పేట్ రౌడీ: అంతా బాగే సీతక్కా, ఇక మొదలు పెట్టు

సియాటిల్ సీతక్క: అందరికీ నమస్తే. ఈ సరి మన గెస్టు వాషింగ్టన్ వానమరావు గారు. ఏత్తు ఆరడుగుల ఏడంగుళాలు

మలక్‌పేట్ రౌడీ: అక్కో, నువ్వు మనుషులనే కాకుండా తాడీచెట్లనుకూడా తుంటర్వ్యూ చేస్తావా?

సియాటిల్ సీతక్క: కుళ్ళుజోకులాపకపోతే తాటకినౌతా జాగ్రత్త

మలక్‌పేట్ రౌడీ: వద్దులే - నువ్వు కానివ్వు

సియాటిల్ సీతక్క: వామనరావు గారూ, మీ పరిచయం?

వాషింగ్టన్ వామనరావ్: నేనొక సైకో ఎనలిస్టునండీ. మనుషులు వ్రాసేదానిని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని అంచనా వెయ్యడం నా వృత్తి, ప్రవృత్తి కూడాను

సీతక్క: అలాగా. అయితే మేము మీకు కొన్ని వాక్యాలని చూపిస్తే, అవి వ్రాసినవారి మనసులో ఏముందో చెప్పగలరన్నమాట

వామనరావ్: భేషుగ్గా!

సీతక్క: అయితే రౌడీ వ్రాతలతోనే మొదలు పెడదాం

రౌడీ: హతోస్మి!

ఇదిగోండీ మీ మొదటి పరీక్ష: We came, We saw, We Kelikified. దీని అర్ధం అందరికీ తెలుసు – కానీ ఇది వ్రాసేడప్పుడు రౌడీ మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పాలి

వామనరావ్: ఓస్ ఇంతేనా? ఏముందీ? – “నాకు సీరియస్ విషయాలు వ్రాసేంత సత్తా లేదు, అందుకే ఏదేదో బరికి నలుగురి నోళ్ళలో నానుదామని” – అంతేనా రౌడీ గారూ?

రౌడీ: అమోఘం ( స్వగతం: ఓరి వామనరావోయ్! ఇక్కడ అసలే నా పరువు జీరో, దానిని నెగెటివ్ లోకి నెడుతున్నావురోయ్)

సీతక్క: రౌడీ రాజ్యం కేప్షన్: ఏదో మీ బుర్రలు కాస్త తిందామని

వామనరావ్: ఇది కూడ సులువే. మిమ్మల్ని ఎలాగూ మెప్పించేటంత సీను నాకు లేదు. ఏదో బుర్రలైనా తిందామని. If I cant be famous, I should at least be infamous!

రౌడీ: (స్వగతం: వామ్మో, రూటు మార్చకపోతే మన బండారం బయట పెట్టేశేలా ఉన్నాడు) సీతక్కా, నా సంగతెందుకులే గానీ, ఎదైన “దిక్కుమాలిన బ్లాగు” మీద చేయించు ఈ సైకో ఏనలసిస్.

సితక్క: సరే సరే! నా కళ్ళూ కూడా ఇప్పుడే తెరుచుకున్నాయి .. Its an "Eye OOOpener" .. వామనరావ్ గారు, ఇప్పుడూ మీకు నేను కొన్ని వాక్యాలు ఇస్తాను, వాటి అర్ధాలు మీరు చెప్పాలి సరేనా?

వామనరావ్: నేను రెడీ!

సీతక్క: సరే మొదలుపెడదాం – ముందుగా “దిక్కుమాలిన చరిత్ర”

వామనరావ్: బ్లాగుల్లో నా బ్రతుకు

సీతక్క: ???

వామనరావ్: ‘నా” అంటే ఆ బ్లాగరిది అని అర్ధం

సీతక్క: ఓహో! సరే! “The other end of me”

వామనరావ్: "Thats what I speak with"

సీతక్క: చాలా రోజులనుండి బ్లాగులను గమనిస్తున్న ఎక్స్పీరియన్స్తో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా.ఈ బ్లాగులకు పట్టిన శనిగాళ్ళగురించి చెప్పాలి. బ్లాగులెంత ప్రశాంతంగా ఉండేవో ఒకప్పుడు.

వామనరావ్: అంటే దానర్ధం “నేను బ్లాగుల్లో ఎప్పటినించో ఉన్నా, వ్రాస్తున్నా, నన్నేవడు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఇప్పుడైనా ఎవడైన నా గోల వింటాడన్న ఆశ”. These guys stole the attention I deserved!

సీతక్క: ఏదో పరవాలేదు అనిపించేలా కొట్టుకున్నారు. జనాల్లో శాడిజాన్ని చూసే అదృష్టం దక్కింది అందరికీ.

వామనరావ్: కానీ ఏం లభం. నేనెంతా Sadist నో జానాలకి తెలియదుగా?

సీతక్క: అది ఇద్దరికే సంబంధించిన మేటర్ అని కనీసం జ్ఞానం లేకపోవటమేంటో.

వామనరవ్: వాళ్ళ మధ్యలో దూరితే నాలాంటీ తెలివితక్కువ మొహాన్ని ఇద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటారని తెలుసు అందుకే దూరలేదు.

సీతక్క: ఈ రవిగారు అని ఒకాయన ఉన్నాడు. రోడ్డు మీద కారు వెళ్ళినా కూడా, అందులో ఒక బూతు కనిపించేస్తది ఇతనికి.
వామనరావ్: నేనెన్ని బూతు వ్రాతలు వ్రాసినా ఒక్కడుకూడ చూడట్లేదు. ఆ రవిగారి బ్లాగు మాత్రం అందరూ చూసేస్తున్నరు.

సీతక్క: ఏదో చిన్న గొడవ అయితే, అది మనసులో పెట్టుకొని అతని టెంప్లేట్కి ఏదో చేసేసారని అపోహపడిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు.

వామనరావ్: ఆ గొడవలో నేను దూరబోతే నాకే చీవాట్లుపడ్డాయ్

సీతక్క: ఈలోగా ఈ కాగడాగాడొకడు. వీడిని తిట్టడానికి కూడా మాటల్లేవు. అత్యంత నీచమైన మనస్తత్వం గలవాడు. వీడికి హిపోక్రసీ లేదని చెప్పుకుంటాడు. అందుకని నోటికొచ్చిన బూతులన్నీ రాస్తాడు

వామనరావ్: ఇండైరెక్టుగా నేనెన్ని బూతులు వ్రాసినా ఎవ్వరూ చదవలేదు. ఖాని కాగడాగాడి బ్లాగుకి హిట్లే హిట్లు

సీతక్క: వీడికీ ఆ ఎదవ భరద్వాజ్గాడి సపోర్టు. ఈ భరద్వాజ్గాడు కొంచెం చదువుకున్నోడు. వీడికి ఈ దిక్కుమాలిన కాగడా గాడితో ఫ్రెండ్షిప్ ఏంటో అర్ధంకాదు

వామనరావ్: ఈ భరద్వాజ్ గాడు నన్నొక్కసరి కూడా సపోర్టు చెయ్యలేదు. నేనేదో అంటే తిరిగి నన్నే పది మాటలన్నాడు, అంట్లవెధవ. ఈడి జిమ్మడ, ఈడి సేతులడిపోను, ఈడి తద్దినమెట్ట, ఈడు సచ్చిపోనూ!!!

సీతక్క: అయినా ఈ భరద్వాజ్గాడితో అందరూ ఎలా చర్చిస్తారో నాకర్ధం కాదు. ఆడో పెద్ద గాసిప్మాంగర్

వామనరవ్: నేనెంత గాసిప్ రాసినా ఒక్కడు కూడా కన్నెత్తి చూడడంలేదు. వాడు గాసిప్ రాసినా జనాలు కామెంటుతున్నరెందుకో. వాడి ఫ్రెండ్ బ్లాగులకి వాడీ బ్లాగు కన్న హిట్లు ఎక్కవ వస్తున్నాయ్. నాతో ఒక్కడూ కూడా మాట్లాడడు.

సీతక్క: వీడో పెద్ద పుడింగిలా ప్రతి చర్చలో దూరి వీడి అతితెలివితేటలు ప్రదర్శిస్తుంటాడు.

వామనరావ్: అతి తెలివి మాట దేవుడెరుగు. మనకి మినిమం తెలివి కూడ లేదు

సీతక్క: ఇంక ధూం. ఇతను మంచోడో, చెడ్డోడో అర్ధంకాదు నాకు.

వామనరావ్: ఈ ధూముకి మరో చాన్స్ ఇచ్చి చూస్తా. ణన్ను సపోర్టు చేస్తే మంచోడూ, లేకుంటే చెడ్డోడు.

సీతక్క: ఆ పోరాడేదేదో కొత్తపాళితో గొడవ వచ్చినప్పుడు డైరెక్ట్గానే చెయ్యొచ్చు. అలా చేయ్యలేదు. కుళ్ళిపోయి, కుళ్ళిపోయి అతను కూడలిని వదిలి వెళ్ళిపోయినంతవరకూ ఊరుకోలేదు

వామనరావ్: కనీసం ఆ పోట్లాటలో నన్ను ఇన్వాల్వ్ చేసున్నా, నకు కొంచం పేరొచ్చేది. ధూము, కొత్తపాళీ పుణ్యమా అని. కానీ అంత అదృష్టం నాకేదీ?

సీతక్క: ఎవ్వరు మాట్లాడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే ప్రవీన్శర్మ.

వామనరావ్: వీడికి మూర్ఖత్వం ఉన్నా ఎక్కడో ఒక మూల కొంచం నిజాయితీ ఉన్నట్టూ కనిపిస్తోంది. కానీ అలాంటిదేమీ లేని నాకు వాడికున్నంత పేరు కూడా లేదు.

సీతక్క: రెండు సంబంధం లేని విషయాలను ఒకటి తరువాత ఒకటి ఎంతో బాగా అమర్చి చెప్పటంలో నిష్ణాతుడు.

వామనరావ్: నాకు ఒక్క విషయమే సరిగ్గ చెప్పడం చేతకాదు. వీడు రెండు విషయాలు ఎలా చెప్తున్నడబ్బా?

సీతక్క: ఈ కల్నల్ ఏకలింగం కూడా పర్వాలేదు. చుట్టూ అంత దరిద్రపు గ్యాంగ ఉన్నా కొంచం నీటుగానే నెట్టుకొస్తున్నాడు.

వామనరావ్: అందరినీ తిడితే మరి నాకు సపోర్ట్ ఎవరూ? చూద్దాం నా ఉచ్చులో ఏకలింగం చిక్కుకుంటాడేమో. ఊన్న వాళ్ళలో కాస్త సాఫ్ట్ కదా!

సీతక్క: ఈ భరద్వాజ్గాడు వీడికి తీరిక దొరికినప్పుడల్లా వేరే బ్లాగుల్లో వీడి అతితెలివి ప్రదర్శిస్తుంటాడు. ఊరికే కెలుకుతానని వాడే చెప్పుకున్నా జనాలు ఆడితో సీరియస్గా చర్చిస్తుంటారు

వామనరావ్: నేను చాలా సీరియస్ అని చెప్పినా సరే నన్నెవడూ పట్టించుకోడు. వాడు సీరియస్ కాదని చెప్పినా వాడితో చర్చిస్తూ ఉంటారు. ఇదెక్కడీ న్యాయం?

సీతక్క: కాని భరద్వాజ్ స్పూన్గాడి కామెంట్లు ఎలవ్ చెయ్యనన్నాడు. అదీ ఇప్పుడీ గోలకు కారణం.

వామనరావ్: ఇదే నా అసలు బాధ. నాకొక్కడంటే ఒక్కడు కూడా స్పూను లేడు. కనీసం ప్రవీణ్ ఖర్మ ని భరద్వాజ్ గాడీ స్పూను అంటే ఆ కొపంతో అయినా గొడవపెట్టుకుంటాడేంఓ నా తెలివైనా ఆశ.

సీతక్క: ఏమయ్యా ఏకలింగం! ఎవరితోనైనా గొడవవ్వగానే నువ్వూ, భరద్వాజూ, ఈ మద్యనే వచ్చిన మంచుపల్లకి, నాగప్రసాదు, శరత్తూ, జీడిపప్పు, మీరందరూ అసలు బాధితులమీద సానుభూతితోనే వాళ్ళ తరుపున వకాల్తా పుచ్చుకోవటం లేదన్న విషయం అందరికీ తెలుసు.

వామనరావ్: నేనెవరితోనైనా గొడవ పెట్టుకుంటే ఒక్కడంటే ఒక్కడు రాడు. పైగా బుర్ర తక్కువ నెగేటివ్ ఐ క్యూ వాదన అని నన్నే తిడతారు. వాళ్ళకి మాత్రం సపోర్టు. కడుపు మండదూ మరి?

సీతక్క: అది తెలిసీ ఈ మర్యాదస్థుల ముసుగులో ఉండి మిమ్మల్నేమీ అనకపోతే మీకు మీరే గొప్పోళ్ళు అనేసుకుంటున్నారు.

వామనరావ్: డైరెక్టుగా మిమ్మల్ని అనే సత్తా గానీ లాజిక్కు గానీ నాకు లేవు కదా మరి. అందుకే

సీతక్క: అందరూ నోరుమూసుకుంటున్నది మిమ్మల్ని చూసి భయపడి కాదు. మిమ్మల్ని కెలికి వేల్యుబుల్ టైంని వేస్టు చేసుకోవడం ఎందుకని

వామనరావ్: నాకు ఒక లైన్ రాయడానికే రెండు రోజులు పడుతుంది. నీముషానికి పది కామెంట్లు పడే బ్లాగుల్లో గొడవపెట్టుకోవాలంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది కావాలి మరి?

సీతక్క: అంచేత ఈ బరితెగించిన గ్రూపిజం మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోండి. అందరికీ మంచిది.

వామనరావ్: అంటే “మీరందరూ వచ్చి నాకు మస్కా కొడుతూ, నాకు చెంచాగిరీ చెయ్యండి. గొడవ ఉండదు. లేదో దొంగపేర్లతో రాసేస్తా ఖబడ్దార్. భయపడతారా లేదా?
ఆ (??
బాబ్బాబు, కాస్త భయపడీ జనజీవన స్రవంతిలో కలిసిపోండి. ప్లీస్, ప్లీస్, ప్లీస్!”


***************** Updated Part ***********************


సీతక్క: ఈ గ్రూపులో హిపోక్రసీ, నిజాయితీ అన్న పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

వామనరావ్: నా దిక్కుమాలిన బ్రతుక్కి హీపోక్రిసీ కి కావాల్సిన తెలివి లేదు, అలా అని నిజాయితీకి కావాల్సిన కనీసపు విలువలు కూడా లేవు. ఎలా బ్రతుకుతానో ఏమిటో, అయ్యో పాపం నేను.



సీతక్క: అదేంటండీ?

వామనరావ్: సెల్ఫ్ పిటీ :))



సీతక్క: హ హా! సరే సరే! తరవాతది - వీళ్ళలా పిచ్చిపిచ్చిగా రియాక్ట్ అయితే హిపోక్రసీ లేనట్లన్నమాట

వామనరావ్: నాకు రియాక్టయ్యే బుర్ర ఉంటేగా? ఏదో ఏడుపుగొట్టు బ్లాగులు రాసుకునే కేసుని కదా. కనీసం సింపథీ అయినా ఉండాలి కదా.


సీతక్క: వీళ్ళలా ఎవరైనా చెండాలంగా మాట్లాడకపోతే వాళ్ళు హిపోక్రిట్లు.

వామనరావ్: అవును మరి, నా చండాలపు బ్రతుకుని, బుధ్ధిని, నోటిని కప్పి పెట్టుకోవాలంటే అవతలవాడూ ఏమి మాట్లాడినా చండాలం అనాలి కదా! ష్! ట్రేడ్ సీక్రెట్ - ఎవరికీ చెప్పకండేం!


సీతక్క: ఎవరిదగ్గర ఎలాంటి పేరుంటే వీళ్ళకెందుకు? వీళ్ళకు కావాల్సింది శాడిస్టానందం.

వామనరావ్: పేరు లేని నాకన్నా ఏదో ఒక పేరున్న వీళ్ళ బ్రతుకే బెటర్. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దూకి చద్దామంటే నా నా వల్ల సముద్రంకూడా కలుషితమైపోతుందని వాళ్ళూ ఒప్పుకోలేదు.


సీతక్క: వాళ్ళని వాళ్ళు వెధవలనుకుంటే

వామనరావ్: వాళ్లని వాళ్ళే వెధవలనుకుంటున్నారు. కానీ నా టైపు వాళ్ళని మిగిలిన జనాలందరూ వెధవలంటున్నారే, వా!


సీతక్క: స్పూన్‌లాగ ఉండడానికి, శాడిస్టులా ఉండడానికీ మద్య మామూలు మనుషులు ఉంటారు.

వామనరావ్: నేను మామూలు మనిషిని కాదుగా. నా లాంటీ శేడిస్టు కమేడియన్లకి మంచిరోజులెప్పుడూ వస్తాయో! అప్పట్లో కొంతమంది బ్లాగర్ల అండ చూసుకుని కొత్తగా వచ్చిన వారిని సతాయించే నన్ను చావగొట్టి చెవులు మూసిన గేంగ్ ఇది. వీళ్ళని అడ్డంగా నరికెయ్యాలి.


సీతక్క: ఇలాంటి పనులు సరదాకే చేస్తున్నామని చెప్పుకోడం వీళ్ళకే చెల్లింది.

వామనరావ్: జీవితంలో ఏ ఒక్కపనీ తప్పుల్లేకుండా చెయ్యడం రాని నాకు కడుపు మండదూ మరి?


**********************************************************


సీతక్క: వామనరావ్ గారూ. భేష్! అడిగిన వాటన్నిటికి టకా టకా చెప్పేశారు

వాషింగ్టన్ వామనరావ్: ఇలాంటీ దిక్కుమాలిన బ్లాగర్ల గోల రోజు వినేదే సీతక్క గారు. ఆ ఎక్స్పీరియన్స్ అన్నమాట

రౌడీ (స్వగతం: హమ్మయ్యా! ఈ దిక్కుమాలిన ఓపెనర్ ఎవరో గానీ, నా బండారం బయటపడకుండా బ్రతికిపోయాను) ఎక్స్‌లెంట్ వామనరావ్ గారూ.

సియాటిల్ సీతక్క: రౌడీ, ఇంక పేరడీ టైం:

మలక్‌పేట్ రౌడీ: ( దేవదాసులో చెలియ లేదు, చెలిమి లేదు …. పాటకి ఒక “దిక్కుమాలిన” పేరడీ)

పల్లవి:

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ


చరణం 1:

బ్లాగులో నాకు కామెంట్ పేట్టే స్పూను కావాలీ

బ్లాగులో నాకు కామెంట్ పేట్టే స్పూను కావాలీ

దిక్కుమాలిన బ్లాగరినైనా పేరు కావాలీ

నాకూ పేరు రావాలీ .. ఈ .. ఈ ..

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో


చరణం 2:

పిచ్చి రాతలు ఎన్ని రాసిన హిట్లే కరువాయే

పిచ్చి రాతలు ఎన్ని రాసిన హిట్లే కరువాయే

భరద్వాజ్ ని కెలికి చూస్తా, ప్రవీణ్ తో గొడవాయే

వాడీకి ప్రవీణ్ తొ గొడవాయే

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో

Aug 19, 2009

ఎనిమిదవ నెంబరు ప్రమాద సూచిక: "ఆస్తి" కులూ, "హేట్" వాదులూ!

.
.
.
.



మలక్పేట్ రౌడీ: ప్రమాదవనంలోకి అనుమానంగా, భయం భయంగా తొంగిచూస్తున్న వీక్షకులందరికీ మళ్ళీ కెలికాస్కారం. ఈ సారి మన ఘోస్టు విస్కాన్సిన్ విశాలాక్షి గారు. నమస్తే విశాలాక్షి.

విశాలాక్షి: అందరికీ నమస్కారం. ఏయ్ రౌడీ! విశాలాక్షి కాదు, విష అని పిలు!

మలక్పేట్ రౌడీ: "విషా" నా? అదేదో విషంలా ఉంది. అదేంపేరు?

విశాలాక్షి: నన్నేమన్నా అను .. కానీ నా పేరుని వెక్కిరిస్తే మాత్రం చీరేస్తా ఎమనుకున్నవో!

మలక్పేట్ రౌడీ: అమ్మా, తల్లీ! నువ్వు చీరేసినా, షర్టేసినా, లంగా వోణీ వేసినా, జీన్స్ వేసినా నాకెందుకుగానీ విషా అనే పిలుస్తాలే. ఇక మొదలెట్టు

విష: అలారా దారికి. ఈ సారి మన తుంటర్వ్యూ కాస్తంత వెరైటీగా ఉంటుంది. రెండూ వేరే వేరే పార్టీలతో

మలక్పేట్ రౌడీ: ఓహో! ఏదో సంవాదమన్నమాట - బహుబాగు

విష: మన మొదటి అతిధి శ్రీ శ్రీ శ్రీ శునకానంద స్వామీజీ!

మలక్పేట్ రౌడీ: ఛీ ఛీ ! వినడానికే అదోలాఉంది. ఏమిటా పేరు.

విష: ఆవేశపడద్దు రౌడి! ఆ పేరెందుకొచ్చిందో ఆయన్నే అడుగుదాం. నమస్తే శునకానందా!

శునకానంద: నమస్తే. మీ సందేహానికి మూలం మాకు అర్ధం అయ్యింది. నా పేరు మీరనుకున్నంత అసహ్యకరమైనది కాదు. ఒక కుక్క ఒక చిన్న ముద్దతో తృప్తిపడి తన యజమానికి జీవితాంతం సేవ చేసినట్టే మనం భగవంతుడిచ్చినదానితో తృప్తిపడి ఆయనకు ఆనందంగా సేవ చెయ్యాలన్నదే నా సందేశం.

విష: ఇక మా రెండవ గెస్టు చికాగో చిదంబరం గారు. ఈయనో పెద్ద హేటువాది

మలక్పేట్ రౌడీ: హేటువాది కాదు, హేతువాది. నీ అమేరికన్ ఏక్సెంట్ తగలడా! "హేటు" వాది అంటే ద్వేషపూరితమైన వాదనలు చేసేవారేమో అని అనుమానం వస్తుంది.

విష: ఏడిశావులే. నీ బుర్రకి అర్ధం కాకపోయినా జనాలకి అర్ధం అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో ముందుగా ఇద్దరినీ చెరో మూడు ప్రశ్నలు అడుగుతాం, ఆ తరవాత వారిలో వారే అడుక్కుంటారు. ముందుగా శునకానందుల వారికి.

మలక్పేట్ రౌడీ: భగవంతుడి పేరు చెప్పి జనాలని మోసం చేసి, ఆస్తులు కాజేస్తున్నారన్నది మీ పై అభియోగం. ఆస్తి తప్ప మరేమీ పట్టని ఆస్తికులా మీరు?

శునకానంద: పచ్చి అబధ్ధం. మేము దైవాంశ సంభూతులం. మాకు తెలియని విద్య లేదు. మా ఆశ్రమానికి రండి చూపిస్తాం. మేమే భగవంతులమని కొలిచేవారు వేలల్లో ఉన్నారు తెలుసా?

విష: రెండవ ప్రశ్న. మీరు జాతకాలు చెప్పి జనాలని మోసం చెయ్యటంలేదా? మీరు చెప్పినవేవీ నిజం కాలేదని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

శునకానంద: అసంభవం. నేను చెప్పినవి నిజమై తీరతాయి. కావాలంటే నా శిష్యులని అడగండి. జాతకాలనేవి తరతరాలుగా వస్తున్నాయి. పెద్దల మాటలు మనం విని తీరాలి. అంతా దైవ నిర్ణయం. మనం ఏమి చేసినా భవదానుగ్రహం లేనిదే ఏమి జరగదు. అలగే మనం ఏమీ చెయ్యకపోయినా శివుని దేవుడి దయ ఉంటే పనులు అవే జరిగిపోతాయ్. మనం నిమిత్త మాత్రులం. అంతా భగవంతుడే చేస్తాడు.

మలక్పేట్ రౌడీ: మూడవ ఫ్రశ్న. మీ ఆశ్రమంలో దొంగ వ్యాపారాలు సాగుతున్నాయని అభియోగం


శునకానంద: మామీద బురదజల్లే నాస్తికులకు ఇది మామూలే. ఇవన్నీ అర్ధంలేని ఆరోపణలు.

సరే, ఇప్పుడు చికాగో చిదంబరంగారికి:

విష: నాస్తిక వాద ముసుగులో కులాల మధ్య ద్వేషం రగిల్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మీ మీద అభియోగం.

చిదంబరం: అబద్ధం. నో మోర్ కామెంట్స్.

మలక్పేట్ రౌడీ: సైన్సు గురించి ఏమి తెలియకపోయినా ఎవడొ చెప్పింది విని గోల చేస్తరని మరో అభియోగం

చిదంబరం: నో మోర్ కామెంట్స్.

విష: మూడవ ప్రశ్న. మీరు చాలా త్యాగాలు చేసి ఈ పని చేస్తున్నారని పేపర్లో వ్రాశారు. దీనికి కూడ నో కామెంటా?

చిదంబరం: ఆగండాగండి. నేను చెప్పాల్సింది చాలా ఉంది

విష (స్వగతం): అమ్మ చిదంబరం! నిన్ను పొగిడితే తప్ప నువ్వు సమాధానం చెప్పవన్నమాట

చిదంబరం: ఇదంతా ప్రజల కోసం చేస్తున్నాం. పేపరు వారికి కృతజ్ఞతలు. మతం అనేది బూటకం. జాతకాలో నాటకం. అవి చాలా కీడూ చేస్తాయి. అందుకే వాటిని వ్యతిరేకిస్తున్నాం. అసలు మతం పేరుతో అందరూ విజ్ఞాన శాస్త్రం పై దాడి చేస్తున్నారు. మన దేశ సంపదలో అత్యధిక శాతం మత సంస్థల అధీనంలో ఉంది. ఈ అజ్ఞానాన్ని పొరద్రోలడానికే మేము "జన అజ్ఞాన నివేదిక" ని స్థాపించి జనాల అజ్ఞానాన్ని ప్రద్రోలుతున్నాం. ఇంకా ...

విష (మలక్పేట్ రౌడీ చెవిలో): బుధ్ధిలేక పొగిడాను. ఇప్పుడు ఈయన ఆపట్లేదు. ఏం చెద్దాం?

మలక్పేట్ రౌడీ: ఫరవాలేదులే. ఒక బ్రేక్ ఏనౌన్స్ చెయ్యి

విష: చిదంబరంగారు. మీతో సంభాషణని కొనసాగిస్తాం కానీ ఇప్పుడో చిన్న బ్రేక్.

____________________________________________________________________________________________

వాణిజ్య ప్రకటన:

"పంకజం పిన్నీ! నీ వయసుకన్నా ఇంత చిన్నగా ఎలా కనిపిస్తున్నావ్?"

"ఏముందిలే వనజా! నా వయస్సు ఇంకా ముప్పయ్యే. ఈ గుంటూర్ శేండల్ సోప్ వాడాక "మీరే కాలేజ్?" అని అడుగుతున్నారు"

"నేను కూడ అదే సబ్బు వాడతా పిన్నీ. నువ్వే స్కూలు? అని అడుగుతారు. అరే మన మోహిని ఇటే వస్తోంది. రా రా మోహినీ, నీ సౌందర్య రహస్యం ఏమిటీ?"

"నేను వాడేది గుంటూర్ శేండల్ సబ్బు. నన్ను చూసినవాళ్ళంతా, నువ్వెప్పుడు పుడతావ్? అని అడుగుతున్నారంటే నమ్ము"


గుంటూర్ సబ్బు వాడండి. మీ వయస్సు దాయండి .. టింగ్ టింగ్ టి టింగ్

____________________________________________________________________________________________


విష: బ్రేకు దెబ్బకి తట్టుకుని ఇంకా ప్రమాదవనంలోకి చూస్తున్న వీక్షకాగ్రేసులకు పున:స్వాగతం. ఈ రౌండులో శునకానంద, చిదంబరులు ఒకరితో ఒకరు కొట్టుకుంటారు ... తప్పు తప్పు .. సంభాషించుకుంటారు.

చిదంబరం: అయ్యా! మీ జాతకాలలో రాహు కేతువుల గురించి చెప్తారు కదా. అవెక్కడ ఉన్నాయో సెలవిస్తారా?

శునకానంద: అవి పెద్దలు చెప్పిన మాటలు. గ్రహాలు కాకపోతే అవి గ్రహ స్థానాలు. అవి జీవితం పై ప్రభావం చూపుతాయన్నది మాత్రం నిజం.

చిదంబరం: ఏం ప్రభావం చూపుతాయ్?

శునకానంద: ఆశ్రమానికి రండి చెప్తాను. ఇలాంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్పడం కుదరదు.

చిదంబరం: సరే. అసలు దేవుడున్నాడు అనడానికి శాస్త్రీయపరమైన ఆధారమేమిటి?

శునకానంద: నమ్మకం. మన పెద్దవారి మాట మీద నమ్మకం. మన జగత్తు మీద నమ్మకం.

చిదంబరం: అంటే మీరు ప్రత్యక్షంగా చూడకపోయినా వారెవరో చెప్పారు కాబట్టి నమ్ముతారా? నమ్మిస్తారా? ఇది మోసం కాదా?

శునకానంద: మీరు నాకు కోపం తెప్పిస్తున్నారు. భగవదాగ్రహానికి గురవకండి.

చిదంబరం: నేణు గ్రహణం సమయంలో భోజనం చేశాను. నాకేమీ కాలేదే?

శునకానంద: ఎందుకు కాలేదు? ఆ సమయంలో భోజనం చెయ్యబట్టే మతి భ్రమించి ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. గ్రహణ సమయంలో భోజనం చెయ్యడం మతి భ్రమింపచేస్తుందనడానికి మీరే పెద్ద సాక్ష్యం. ఇక ఈ చర్చ నుండి నేణు నిష్క్రమిస్తున్నా. అందరికీ సెలవు

చిదంబరం: అంటే నేను అడిగిన ప్రశ్న ఒకదానికీ సమాధానం లేదనేగా దీనర్ధం. ఈ వ్యవహారమంతా ఎంత మోసమో ఇక్కడె తెలుస్త్గోంది.

మలక్పేట్ రౌడీ: సరే చిదంబరం గారూ! శునకానందులవారు లేరు కనక మేమే మితో సంభాషితాం. బ్రెఖ్ తరవాత

____________________________________________________________________________________________

వాణిజ్య ప్రకటన:

"అమ్మా! ఇది కంచి చీర కాదు - కేల్‌క్యులస్ చీర"

"కేల్‌క్యులస్ చీర?"

"అవును. డిఫరెన్షియేట్ చేసి చించేశాను. మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి అతికించాను"

"ఓరినీ! ఇరవైవేల రూపాయల చీర నాశనం చేశావు కదరా వెధవా!"

ఎక్సెస్ ఫీడ్ కి పిల్లలని పంపించండి - వారి అతి తెలివిని అదె ఎక్సెస్ తెలివిని పెంచండి

టింగ్ టింగ్ టి టింగ్

____________________________________________________________________________________________

మలక్పేట్ రౌడీ: రెండవ బ్రేకు దెబ్బ కూడ తట్టుకుని నిలబడ్డ ప్రజానీకానికి ఈ వసుదేవుడి పాదాభివందనం. ఇప్పుడు చిదంబరంగారికి ప్రశ్నలు.

విష: మీకు జ్యోతిషమంటే ఎందుకంత కోపం?

చిదంబరం: కోపమేమి లేదు. మూఢనమ్మకాలని, హాని చేసేవాటినీ ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతోనే ఈ పోరటం.

మలక్పేట్ రౌడీ: మరి మీ కుటుంబ సభ్యులే జాతకాలు చెబుతున్నారుగా. వారి గురించి ఒక్క విమర్శ కూడా లేదెందుకు?

చిదంబరం: ................

మలక్పేట్ రౌడీ: చిదంబరం గారూ! మిమ్మల్నే!!

చిదంబరం: ................

విష: (రౌడీ చెవిలో) పొగుడు, పొగుడూ!

మలక్పేట్ రౌడీ: చిదంబరం గారూ, మీకు అభినందనలు.

చిదంబరం: చాలా సంతోషం. కృతజ్ఞతలు.

విష: (రౌడీ చెవిలో) ఈయనేమిటీ? దేనికి అభినందనలో చెప్పకుండానే కృతజ్ఞతలు అంటున్నారు?

మలక్పేట్ రౌడీ: ష్! ఏదో ఒకటి మాట్లాడడం మొదలయ్యింది కదా. కానివ్వు


చిదంబరం: మతం ఒక బూటకం. జాతకం ఒక నాటకం. నమ్మకం కాదు, సైన్సు ముఖ్యం. చంద్రుడీ మీద దిగిన మానవజాతి మనది. చూడకుండా దేనినీ నమ్మకూడదు.

విష: చంద్రుడి మీద దిగడం మీరు చూశారా?

చిదంబరం: నాసా వారు చెప్పారు

మలక్పేట్ రౌడీ: అయితే నమ్మెయ్యడమేనా? ఇది మాత్రం మీరన్న నమ్మకం కాదా? మీ గుడ్డి నమ్మకానికి ఆస్తికుల గుడ్డి నమ్మకాలకీ తేడా ఏముంది? నాసా వారు చెప్పారు కాబట్టీ మీరు నమ్మారు, పెద్దలు చెప్పారు కాబట్టీ వారు నమ్మారు. వాళ్ళ నమ్మకం తప్పు అనడానికీ, అదంతా మోసం అనడానికీ చాలా తేడా ఉంది. అంతెందుకూ, రేపు నాసా వారు చెప్పింది తప్పు అని రుజువయితే మీ నమ్మకమే మారుతుంది కదా?

చిదంబరం: ......

మలక్పేట్ రౌడీ: చిదంబరం గారూ, మిమ్మల్నే! ఆయనెవరో సమాధానం చెప్పలేదని మీరు ఆనంద పడ్డారు, ఇప్పుడూ మీరు చేస్తున్నడేమిటీ? చూస్తూంటే వారి కన్నా మీతే పెద్ద మోసగాడిలా ఉన్నారు.

విష: రౌడీ! నోరు జారద్దు. ఈయన ఇంద్రుడి లాంటి చంద్రుడు.

చిదంబరం: కృతజ్ఞతలు. మేము పోరాడేది హానికారక సముదాయం మీద.

మలక్పేట్ రౌడీ: అయితే హానికరమైనవాటినన్నిటినీ నిషేధించాలా?

చిదంబరం: తప్పకుండా!

విష: మరి మీ నాస్తిక సంఘాల వారు బీడీలపై పుర్రె గుర్తుని ఎందుకు వ్యతిరేకించారు?

చిదంబరం: ఎక్కడ?

మలక్పేట్ రౌడీ: ఇదిగో లంకె http://living.oneindia.in/insync/soft-drinks-damage-liver-140507.html

ఆఖరి రెండు పేరాలూ చదవండి.

విష: పైగా వివక్షాపూరితమన్న కవర్ అప్ ఒకటి. వీరికి నిజాయితీ ఉంటే సిగరెట్లకి, బీడీలకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసేవారు. ఇక్కడ బిడీ కార్మికుల మద్దతు కావాలి కాబట్టీ అది హానికరమైనాసరే మద్దతిస్తారన్నమాట. ఇది మరి కుల/మత/వర్గ గజ్జి కాదా? బీడీ, సిగరెట్ల కన్నా జాతకాలు హానికరమా?

చిదంబరం: ........

మలక్పేట్ రౌడీ: చిదంబరం గారూ, మీరు చేస్తున్న పనులకి మీకు భారత రత్న ఇవ్వాలి.

చిదంబరం: కృతజ్ఞతలు.

విష: (రౌడీ చెవిలో) లాభంలేదు. మనం రూటు మార్చాలి

మలక్పేట్ రౌడీ: సరే ఆ సత్యవాగ్రసాయనం తీసుకురా

విష: (రౌడీ చెవిలో) ఏమిటది?

మలక్పేట్ రౌడీ: ష్! అది తాగినవాళ్ళు ఏకధాటిగా ముప్పై సెకన్ల పాటు నిజాలు చెప్పేస్తారు. ఏప్రిల్ ఒకటి రాజేంద్రప్రసాదులా.

విష: చిదంబరంగారూ, దాహం మీద ఉన్నట్టున్నారు. ఈ జ్యూస్ తీసుకోండి.

చిదంబరం: జ్యూస్ బాగుంది. కృతజ్ఞతలు.


విష: చేపమందు విషయంలో మీ అభిప్రాయమేమిటి?

చిదంబరం: ఆ! ఏముంది. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. అది బూటకమనేస్తేపోలా? వాళ్ళకి జనాలు తగ్గుతారు. మా మిత్ర బృందంలోని డాక్టర్లకు గిరాకీ పెరుగుతుంది. మా సంఘానికి ఫండింగ్ వస్తుంది. Everything is fair in business.

మలక్పేట్ రౌడీ (విష చెవిలో): ఇంకా 10 సెకన్లే ఉన్నయి.

విష: అంటే స్వామికార్యం కన్నా స్వకార్యం ముఖ్యమన్నమాట!

చిదంబరం: లేకపోతే పనిలేకుండా గోడవ చెయ్యడానికి మేమేమన్నా వెర్రివాళ్ళమా? హేతువాదులం.

మలక్పేట్ రౌడీ (విష చెవిలో): టైం అప్. ఈయన మళ్ళీ మామూలు మనిషయిపోతారు.

చిదంబరం: ఇచ్చిన అవకాశానికి సంతోషం. ఇక సెలవు.

మలక్పేట్ రౌడీ: ఈయన కూడ ఔట్!

విష: ఇందాక తెలియక అన్నా, "హేట్" వాది అన్నమాట ఈయనకి సరిగ్గా సరిపోతుంది. సరే, నీ పేరడీతో దీనిని ముగిద్దాం. అందరికీ కెలవ్!


___________________________________________________________________________________________


తెలిసిందిలే, తెలిసిందిలే కన్నయ్య నీరంగు తెలిసిందిలే.
తెలిసిందిలే, తెలిసిందిలే కన్నయ్య నీరూపు తెలిసిందిలే

హేతువాదమనే ఒక ముసుగుందిలే
ప్లేటుఫిరాయింపుడు లొసుగుందిలే
హేతువాదమనే ఒక ముసుగుందిలే
ప్లేటుఫిరాయింపుడు లొసుగుందిలే

ఏముందిలే, ఇక ఏముందిలే
ద్వేషాగ్ని జ్వాలల గతముందిలే,
చాలా కధ ఉందిలే!

తెలిసిందిలే, తెలిసిందిలే కన్నయ్య నీరంగు తెలిసిందిలే.
తెలిసిందిలే, తెలిసిందిలే కన్నయ్య నీరూపు తెలిసిందిలే
.
.
.
.

Jul 12, 2009

ఏడవ నెంబరు ప్రమాదసూచిక - ప్రమాదవనం లో జ్యోతక్క!!!

(THIS WAS A REAL INTERVIEW AND ALL THE QUESTIONS WERE ANSWERED BY JYOTI HERSELF)

మలక్‌పేట్ రౌడీ: ప్రమాదవనంలోకి మళ్ళీ తొంగి చూస్తున్న వీక్షక మహాశయులకి మళ్ళీ కెలికాస్కారములు (ఇది మా కొరివి దయ్యం ట్రేడ్‌మార్కు - నేను కొట్టేశా)

ఈసారి మన ఘోస్టు ఆస్టిన్ ఆండాళ్ళమ్మ గారు. నమస్తే ఆండాళ్ళూ! ఓవర్ టు యూ!

ఆస్టిన్ ఆండాళ్ళు: నమస్తే. ఈ సారి మన గెస్టు ఒక ప్రముఖ బ్లాగర్. బ్లాగ్లోకంలో ఒక బ్రాండు, ఒక సంచలనం. చాలా వివాదాలకు కేంద్రబిందువు. మగ పురుషుల వలయంలోకి అభిమన్యురాలిలా (అభిమన్యుడికి స్త్రీలింగం లేండి) చొచ్చుకుని వచ్చిన ఒక వనిత. ప్రమాదవనంలోకి వచ్చిన ఒక ప్రమద.

మలక్‌పేట్ రౌడీ: (సణుగుతూ) గోకులంలో సీతేమి కాదూ?

ఆస్టిన్ ఆండాళ్ళు: ఏమిటా వెధవ పోలిక? ఇలాంటి తింగరి మాటలు మాట్ళాడితే నేను ఈ తుంటర్వ్యూని హోస్టుచెయ్యనంతే!


మలక్‌పేట్ రౌడీ: అమ్మా తల్లీ వద్దులే. అసలే ఆ విస్కాన్‌సిన్ విశాలాక్షి కూడ బిసీ బిసీ. నువ్వు లేక మాకిప్పుడు వేరే దిక్కు లేదు. నువ్వు కానీ ఇక!

ఆస్టిన్ ఆండాళ్ళు: సరే ఈ సారి మన గెస్టు ప్రమదావనం జ్యోతక్క. ఎంట్రీ గ్రేండ్ గా ఉండాలన్న ఉద్దేశం తో ఒక తీన్‌మార్ స్తైల్ ఇంట్రో పాటని వదుల్తున్నాం కాచుకోండి.

మలకూ, ఇహ వేస్కో!

మలక్‌పేట్ రౌడీ:

మాయదారి జ్యోతక్కో జ్యోతక్కా .. ఎన్నెన్ని బ్లాగులు రాస్తవే జ్యోతక్కా
మాయదారి జ్యోతక్కో జ్యోతక్కా .. ఎన్నెన్ని బ్లాగులు రాస్తవే జ్యోతక్కా

జ్యోతక్కో జ్యోతక్కో జ్యోతక్కో జ్యోతక్కా

నువ్వు పోస్టు రాసి గాయబు కాకే జ్యోతక్కా
జరా కామెంట్లూ చదవవే జ్యోతక్కా

నువ్వు వంటలు చెప్పీ లాగవుట్ అవ్వకే జ్యోతక్కా
జరా చేసి చూపించవే జ్యోతక్కా

మాయదారి జ్యోతక్కో జ్యోతక్కా .. ఎన్నెన్ని బ్లాగులు రాస్తవే జ్యోతక్కా




ఆస్టిన్ ఆండాళ్ళు: నమస్తే మేడం జో! ఈ తుంటర్వ్యూ కి స్వాగతం.


జ్యోతక్క: నమస్తే ఆండాళ్ళూ! నమస్తె రౌడీ అన్నా! బాగున్నవా? వదినెమ్మ, పిల్ల ఎలా ఉన్నరు? ఏంది ఏదో మాట్లాడాలె అన్నవ్? అవునూ నువ్వు ఎప్పుడూ ఎవరినో ఒకరిని కెలుకుతుంటవంట.. చదువుకునేటప్పుడు గా సెంట్రల్ యూనివర్సిటీ రేడికల్ ఫెమినిస్టు పోరీలను ఊరికే సతాయించెటోడివి . పెళ్ళైనక్క వదినెమ్మ దగ్గర నీ ఆటలు నడుస్తలేవని ఇక్కడ జనాలను కెలుకుతున్నా??


మలక్‌పేట్ రౌడీ: జ్యోతక్కోయ్ - ఇది నీ ఇంటర్వ్యూ. మేము నిన్ను ప్రశ్నలడగాలే. నువ్వేంది గిట్లా ఉల్టా ఆడుగుతున్నవ్?

జ్యోతక్క: సరే ఐతే నేను చాయ్ తెచ్చుకుని కూర్చుంటా. అడూగుండ్రీ...


ఆస్టిన్ ఆండాళ్ళు: ఇంతకీ ఈ కొత్త టెంప్లేట్ ఏమిటి రౌడీ మహాశయా?


మలక్‌పేట్ రౌడీ: ఏమి చెయ్యమంటావ్ ఆండాళ్ళూ? (శంకరాభరణం దాసు మొహం వేసుకో ఒక సారి)

ఆవిడకి నా పాత టెంప్లేట్ నచ్చలేదు. టెంప్లేట్ నచ్చితే తప్ప ఇంటర్వ్యూ ఇవ్వనని భీష్మించుకుని కూర్చుంది. సరే మారుస్తానని చెప్పి ముద్దుగా పెద్ద తుపాకీ ఉన్న 'వైల్డ్ వెస్ట్' టెంప్లేట్ పెట్టుకుందామంటే ఆ టెంప్లేట్ రంగు ఆవిడ కట్టిన చీర రంగుకి, ఆవిడ వండిన కూర రంగుకి మేచ్ అవ్వలేదుట. సరే ఆవిడనే సెలెక్ట్ చేసుకోమంటే, ఇదిగో ఈ టెంప్లేట్ చేసి పెట్టారు నాకు.


ఆస్టిన్ ఆండాళ్ళు: సరే ఈ సారి మన e-స్టావధానంలో చాలా ప్రశ్నలే ఉన్నాఇ.

1. జ్యోతక్కా! మీ సెల్ఫ్ డబ్బా ప్లీస్!

జ్యోతక్క: అబ్బా!! నా గురించి ఎవరూ మొత్తం చెప్పరు అని అనుకునేదాన్ని. నన్నే చెప్పమన్నవ్ కదా. మొదటినుండి గారంగా పెరిగాను. మొండిదాన్ని. ఇంట్లో నేనే ఎక్కువ అరిచేది. ఎవ్వడైనా తప్పు చేస్తే మరి ఊరుకోను. వాడికి మూడినట్టే. ఇక ఈ బ్లాగులల్ల కొచ్చి మస్తు పెరు తెచ్చుకున్నలే. చాల మంది పెద్దోల్లు తెలుసు. గీ లింకు సూడూ జరా



దేనిమీదైనా ఈజీగా రాసేస్తాను. అందరూ నన్ను మెచ్చుకోవాలే అని పేరు లేకుండా రాసేటోళ్లని నా బ్లాగులో రానియ్యను తెలుసా. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి గాని వద్దు నజర్ కొడ్తది. అసలే జనాలు ఏడుస్తున్నరు నామీద.

ఆండాళ్ళు: 2. మీ బ్లాగు మూడింటికి ఫేమస్ - పోట్లాటలు, పాటలు,వంటలు. వీటివల్ల మీకొచ్చిన సెలెబ్రిటీ స్టేటస్ పై మీ అభిప్రాయం?


జ్యోతక్క: ఏందమ్మోవ్ ? .. నేను గా మూడే రాయనుగా. పాటల కోసం వేరే బ్లాగుంది,వంటలకు ఉంది. ఇక కొట్లాటలంటవా. నేను కావాలని పెట్టుకోలా. ఏదైనా ఉంటే నాతో మాట్లాడమంట. ఇనరు. ఇష్టమొచ్చినట్టు రాస్తుంటరు.


ఆండాళ్ళు: 3. ముందుగా పోట్లాటల గురించి - ఒక జ్యోతితో ఒక గదిని తగలపెట్టచ్చు - అదే
ఒక కాగడాతో అయితే ఒక ఇంటినే తగలపెట్టచ్చు - కామెంట్ ప్లీశ్!



జ్యోతక్క: ఈ తగలపెట్టుడు అవి మనకెందుకమ్మా? .. ఎవరిల్లు వారు అంటించుకుంటే నేనేమీ చేయలేను మరి.


ఆండాళ్ళు: 4. పాటల గురించి - జనాలంతా మీ అభిమాన గీతం "ధూం" సినేమాలో "ధూం మచారే"
పాట అని అంటూ ఉంటారు. మీ అభిప్రాయం? అసలాపాటంటే మీకెందుకంత ఇష్టం?


జ్యోతక్క: చాలు! ఇక ఆపండి!!

మలక్పేట్ రౌడీ: అమ్మా ఆండాళ్ళూ - ఇలాంటి ప్రశ్నలడిగి జనాలని ఇబ్బంది పెట్టద్దు. కాని ఒక్క విషయం - ఇన్నాళ్ళు పద్యాలకు మాత్రమె ప్రతిపదార్ధాలు చదువుకున్నా - మొదటిసారిగా సినిమా పాటలకీ ప్రతిపదార్ధాలు చూస్తున్నా బ్లాగుల పుణ్యమా అని :))


ఆండాళ్ళు: 5. సరే సరే - ఇక వంటలు - మీరు కూరలు పచ్చళ్ళ గురించి చాలా వ్రాస్తారు గానీ 'పప్పు' గురించి అస్సలు వ్రాయరు. ఎందుకు? పప్పంటే మీకు ఇష్టంలేదా?


చా. పప్పు సూడనీకి మస్తుగుంటది కాని తిననీకి సప్పగుంటది.అందుకే అవి ఎక్కువ చేయను, రాయను. ఐనా ఇప్పుడు పప్పు ధరలు మండిపోతున్నయ్. కొనేట్టు ఉందా?


మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుందామా. ఒకటి అడుగుత చెప్పు.. 3 చీమలు పోతున్నయ్. జర దూరం పోయాక ఒక చీమ సీద పోయింది, రెండు చీమలేమో ఎడమదిక్కు పోయినయ్.ఎందుకంటవ్??సొచాయించు...

మలక్‌పేట్ రౌడీ: ఊహూ(! నాకు వెలగట్లేదు. కానీ అప్పుడెప్పుడో రవిగారి బ్లాగులో చదివినదాని బట్టీ చూస్తే ముందు చీమ కైనెటిక్ హోండా మీద వెళ్ళే ఒక రిపోర్టరు, వెనకాల రెండు చీమలూ ఆవిడ ఆచూకీ కనిబెడదామనుకున్న బ్లాగర్లు.

వీళ్ళు వెంటపడడం చూసిన ముందు చీమ, లెఫ్టు ఇండికేటరు వేసి సీధా పోయింది, మిగిల రెండు చీమలూ లేఫ్టుకి తిరిగాయ్.

కొంచం ఎక్కువయ్యిందా?

ఆండాల్లు: చాలా ఎక్కువయ్యింది. జ్యోతక్కా! మీ సమాధానం?

జ్యోతక్క: ఏం లేదమ్మా! ... ఒక చీమ ఏమో నౌకరీకి హైటెక్ సిటీ పోతుంది. ఇంకో రెండు ప్రేమల పడ్డరు, పార్కుకు పోతున్నయ్.. అంతే.. గదిసరే సడెన్ గా ఏమిటీ కంపు?


ఆండాళ్ళు: హా హా జోకు పేలింది.

మలక్‌పేట్ రౌడీ: (మళ్ళీ సణుగుతూ) కుళ్ళింది. అందుకే కంపు.

ఆండాళ్ళు: ఏయ్!

మలక్‌పేట్ రౌడీ: అమ్మో సరే సరే, నేనేమి అనను - నువ్వు కానివ్వు

ఆండాళ్ళు: మీరు భలే జోకులేస్తారు మేడం జో! మిమ్మల్ని జోకుల జ్యోతక్క అని పిలవచ్చేమో?

జ్యోతక్క: తలకాయల్లేస్తాఇ !!!

ఆండాళ్ళు: అమ్మో! వద్దు ...

6. మీ వారు ఇంట్లో లేని టైం చూసి ముగ్గురు - ఒక ముసలావిడ, ఒక మధ్యవస్కురాలైన స్త్రీ, మరో పురుషుడు మీ ఇంటికొచ్చి ముగ్గురం మీ వారిని ప్రేమిస్తున్నామని, ఎవరు సరైన జోడీయో మీరే నిర్ణయించాలని అంటే దానికి మీ రియాక్షన్?

జ్యోతక్క: నిజం చెప్పొద్దు. మా ఆయన బంగారం అనుకో. నువ్వేంది బేకార్గాళ్ల గురించి చెప్తవ్.ఐష్వర్య లేదా ష్రేయా లంటి పోరీలైతే మంచిగుంటది గాని. వీళ్లందరిని కె.బ్లా.స కి పంపిస్తా ఆటో పైసలిచ్చి.. వాళ్లే చూసుకుంటరు.

ఆండాళ్ళు: 7. మిమ్మల్నింతకీ నువ్వు అని పిలవాలా లేక మీరు అని సంబోధించాలా? ( మరీ "ఒసే జ్యోతక్కా!" అంటే బాగుండదని)

జ్యోతక్క: ఒసే అని మా ఆయనే అనడు. ఐనా నాకు తెల్వకడుగుత. మీరు అంటే నెత్తిమీద కుచ్చుల తోపీ పెట్టినట్టా. పిలిచెటోళ్లకు, పిలిపించుకునేటోళ్లకి లేని పరేషానీ ఈళ్లకెందుకో నాకు సమజ్ ఐతలేదు. మనసుల ప్రేమ ఉండాలె ఈ పిలుపులల్ల ఏముందో ఏమో. నాకైతే గార్లు, బూర్లు అస్సలు పడవు.


ఆండాళ్ళు: 8. ప్రమాదవనానికి ఇంటర్వ్యూ ఇవ్వడం పై ఎలా ఫీలవుతున్నారు?


జ్యోతక్క: మస్తుగుంది. మీ అంత మజాక్ నేను చేయలేను .


ఆండాళ్ళు: 9. మీకు కెబ్లాస ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఏం చేస్తారు?


జ్యోతక్క: సంఘాన్నే మూసేస్తా.. సొచాయించుండి మరి. లేదంటే ఏకలింగానికి ఇస్త. అన్నీ నిజాలె మాట్లాడుతడు ఆ తమ్మి.

మలక్‌పేట్ రౌడీ (స్వగతం): హమ్మ ఏకలింగం! పదవికోసం ఈ రూట్లో వచ్చావా? నీ సంగతి తరవాత చెప్తా!

ఆండాళ్ళు: 10. మేడం జో! మిమ్మల్ని శరత్, కాగడా, ధూం, రవిగారు, యోగి, మలక్‌పేట్
రౌడీలతో కలిపి అంటార్కటికాలో వదిలేస్తే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటూంది?



జ్యోతక్క: నాతో మంచిగుంటె మంచిగ ఉంట,మాట్లాడతా, ఒండి పెడతా. లేదంటే ఏమీ అనను.. రోసయ్య, రేణుక చౌదరీని పిలిచి వాళ్లను చూసుకోమంటాను. నేను నా బ్లాగులు చూసుకుంటా పకోడీలు తింటూ.

మలక్‌పేట్ రౌడీ: నేను గాని ఆవిడ స్థానంలో ఉంటే వేరేగా ఉంటుంది.

ఆండాళ్ళు: ఏమిటో అది? కుళ్ళు మరి .. సారీ సారీ... చెప్పు మరి :))


మలక్‌పేట్ రౌడీ: ఏమీలేదు. ఆపదలో ఉన్న అబల అని మార్తాండకి ఫోన్ కొడతా.. దెబ్బకి శరత్ పారిపోతాడు. అలగే యనమండ్ర నెంబరు నొక్కుతా దెబ్బకి ధూం పారిపోతాడు. నా దగ్గర ఉన్న కిచెన్ "కత్తి" ని యోగి ముందు పెడతా ... దానిని కెలకడంలో బిసీ అయిపోతాడు. రౌడీ చేత తెలుగు పద్యం సమస్యా పూరణం ఇప్పిస్తా "మంచి బుధ్ధి కలిగె మారీచునకున్" అని .. దానిని పూరించడంలో కాగడా బిజీ. టెంప్లేట్ చెంగ చేసి పెట్టనా అని రవిగారిని అడుగుతా - దెబ్బకి ఆయన పరార్!

ఇక ఈలోగా ఆపదలో ఉన్న ఆడపిల్లని రక్షించడానికి మార్తాండ వచ్చి వాలిపోతాడు. అతని కాళ్ళూ, చేతులూ కట్టేసి "టక్కరి పంది" పాట వినిపించే పని రౌడీ కి అప్పచెబుతా - రౌడీ కూడా బిసీ. ఇక నేను పకోడీలు తింటూ బ్లాగులు రాస్కుంటా


ఆండాళ్ళు: అంటార్కటికాలో ఫోనులు, బ్లాగులు?

మలక్‌పేట్ రౌడీ: చిర్రెత్తించకు. చెప్పింది విను!!

ఆండాళ్ళు: 11. సరే సరే! జ్యోతక్క గారూ! ఇంతకీ మీరు స్త్రీవాదా? కానీ మీ బ్లాగులో ఎక్కడా "అదిగో ఆ మగ చీమ ఆడ చీమని కుట్టీంది - మగజాతి ఆడ జాతిని బ్రతకనివ్వట్లేదు - మగ జాతి నశించాలి" అనే నినాదాలెక్కడా నాకు కనపడలేదే? పురుషులని అడ్డమైన తిట్లూ తిట్టి, ద్వేషించని మిమ్మల్ని స్త్రీ వాదిగా వారు ఒప్పుకోరేమో?


జ్యోతక్క: అంటే నువ్వు చెప్పేది ఏమంటవ్? గట్టిగ మాట్లాడితే స్త్రీవాడి అనా. నేను ఎప్పుడు సచ్ ఏ చెప్తా మరి. ఆడోళ్లు మొగోళ్లను సతాయిస్తరు, మొగోళ్లు ఆడోల్లను సతాయిస్తరు. ఐనా కూడా ఇద్దరూ కలిసి ఉండక తప్పదు కదా. నీకు తెలీని వేదమా ఇది .. ఇన్ని రోజులు నమ్మలేదుగాని ఆడోళ్లకి ఆడోళ్లే దుష్మన్లని తెలిసింది.. అదే మరి టోకరాలు తగిల్తేనే ఏదైనా నెత్తికెక్కేది..

ఆండాళ్ళు: మలకూ - ఇక నీ రెగ్యులర్ పేరడీ టైం - ఈ సారీ పేరడీ ఎవరి మీద?

మలక్‌పేట్ రౌడీ: ఈ సారి జ్యోతక్కమీదే - ఆవిడ వంటల మీద.. జ్యోతక్క బ్లాగు చూసి వంట చేసిన ఒక మహిళామణి పడే ఆవేదన మీరే వినండి ( గులాబీ - ఈ వేళలో నీవు స్టైల్ లో)

----------------------------


ఈ వేళలో నీవూ, ఏం తింటూ ఉంటావో
అనుకుంటూ ఉన్నాను ఈ నిమిషమూ నేను

మేడం 'జో' బ్లాగు చూసీ పచ్చళ్ళు చేశానే
నీ లంచ్ పేక్ లోన అవి కూడా వేశానే
అవి గాని తింటేనూ నువ్వేమైపోతావో
భయపడుతూ ఉన్నాను ఈ నిమిషమూ నేను

ఈ వేళలో నీవూ, ఏం తింటూ ఉంటావో
అనుకుంటూ ఉన్నాను ఈ నిమిషమూ నేను


------------------

గోంగూర పచ్చడేమో ఆవుపేడ లా ఉంటే
నాదికాదు ఆ నేరమూ ఊ ఊ ఊ
నాదికాదు ఆ నేరమూ

వంకాయ పులుసేమో కాఫ్ సిరప్ అయిపోతే
అది బ్లాగరీ ఘోరమూ
నాదికాదు ఆ నేరమూ

కడుపులో తిప్పుతుంటే, గుడగుడలు ఆగకుంటే
మాత్ర మింగలేకుంటే, టానిక్ తాగలేకుంటే
ఏ డాక్టర్ ని చూస్తావో, భయపడుతూ ఉన్నాను

ఈ వేళలో నీవూ, ఏం తింటూ ఉంటావో
అనుకుంటూ ఉన్నాను ఈ నిమిషమూ నేను

-----------------------------------------


ఆండాళ్ళు : అడిగిన వెంటనే మా ప్రమాదవనానికి విచ్చేసిన జ్యోతక్కా, నీకు థేంక్స్.

జ్యోతక్క: థేంక్స్ ఆండాళ్ళు ,రౌడీ అన్న. ఇగ నేను పోతున్న. ఇంట్ల మస్తు పనుంది. పనిమనిషి రాలేదియాల. నీతో ఇంతసేపు ముచ్చట్లేసినందుకు ఓ వంద డాలర్లు నా బ్యాంకుల ఎసెయ్. ఫుకట్ ల పని చేస్తే మంచిగుంటదా చెప్పు.

మలక్‌పేట్ రౌడీ: ఇదంతా ఓపిగ్గా చదివిన వీక్షకులకి కృతజ్ఞతలు. వచ్చే ప్రమాదసూచికలో మళ్ళీ కలుద్దాం - కెలవ్! (యోగి ట్రేడ్ మార్కు)

(THIS WAS A REAL INTERVIEW AND ALL THE QUESTIONS WERE ANSWERED BY JYOTI HERSELF)

Mar 13, 2009

అయిదవ నంబరు ప్రమాద సూచిక - 'పొద్దు' గడి కెలుకుడు, పూరణ!

ప్రమాదవనంలోకి తొంగి చూస్తున్న వీక్షకులకు మళ్ళీ నమస్కారం, వసుదేవుడి పాదాభివందనాలు.

ఈ సారి మన గెస్టు హోస్ట్ వాషింగ్టన్ వామనరావు గారు, ముఖ్య అతిధి సియాటిల్ సీతమ్మ గారు ... ఇద్దరికీ నమస్కారం. జంప్ అయిపోదాం కార్యక్రమంలోకి

వామనరావు: నమస్తే రౌడీగారూ ఈ వారం ఎవరిని కెలకాలి?

సీతమ్మ: సియాటిల్ నించి కష్టపడి వచ్చాను ఎవరైనా పెద్దవారిని కెలకాల్సిందే!

మలక్పేట్ రౌడీ: పెద్ద వారినా? లేక ' పొద్దు ' వారినా?

వామనరావు: అమ్మో! తిడతారేమో?

సీతమ్మ: మరేమి ఫరవాలేదు. వారి హ్రస్వ దృష్టి పదిబ్లాగులని మించి పోదులెండి. ఆ పది బ్లాగులూ లేకపొతే బ్లాగ్లోకమే లేదని వారి ఉవాచ.

వామనరావు: సరే! ఏం చేస్తాం? కానివ్వండి. అసలే చత్వారం, పైగా కళ్ళు మూసుకున్నారు. సాహితీ బ్లాగులకేసే కన్నెత్తి చూసే సీను వారికి లేదు, ఇక మన బ్లాగు కూడానా? ఇంతకీ ఎలా కెలుకుదాం?

సీతమ్మ: పొద్దులో అన్నిటికన్నా పాపులర్ ఏమిటి?

వామనరావు: గడి

సీతమ్మ: దానినే కెలికితే పోలా?

వామనరావు: అయితే ఓకే!!

సీతమ్మ: సరే! ఈ డైలాగు తరవాత డైలాగునుండీ ప్రతీ డైలాగులో ఒక పొద్దు గడీ సమాధానం దాగి ఉంటుంది. కనుక్కోండీ. ఒక 35 నిలువు, దానికి సంబంధించి అటు ఇటు ఉన్నవి తప్పా మిగాతావి సరియయినవే అని మా "అనుమానం" :)) రావుగారూ! కాస్త ఇన్వాల్వు అవ్వం'ఢీ'

------------------------

వామనరావు: అబ్బా ఉండండీ! అసలే ఈ తుంటర్వ్యూ కాస్త 'టూకీ' గా ఉండాలి అని జనాల కోరిక!

సీతమ్మ: నేనేమన్నా పారిజాతాపహరణము అనే కావ్యం వ్రాయమన్నానా?

వామనరావు: లేదనుకోండి. కానీ నేను కనీసం వేటూరిసుందరరామమూర్తి అంతటి కవిని కూడా కానే

సీతమ్మ: మీరు కవీ కాదు, రచయితా కాదు, మూడోరకం అని నాకు తెలుసులెండి.

వామనరావు: కానీ కెలుకుడంటే దోరమావి పండు తిన్నంత సులువు కాదు - చంపేస్తున్నారు కదా!

సీతమ్మ: మీరు అసురులు కారు, నేను దితి పుత్రికను కానులెండి. భయపడద్దు.


వామనరావు: మీకేం పోయింది? అసలే మా ఇంట్లో గెస్టులు. మా బావమరుదులు మల్లికా షేరావత్ కోసం సుందోపసుందులు అయిపోయారు.


సీతమ్మ: అయ్యో! మీరు మాత్రం జర భద్రం


వామనరావు: అసలే ఈ నెపము మీద మా మామగారు మా ఇంట్లో తిష్ట వేశారు.


సీతమ్మ: "తగునా యిది మామా" అని పాట అందుకోండి. పారిపోతారు.


వామనరావు: ట్రై చేశా. కాని గదిలోకెళ్ళి తలుపేసుకున్నారు.


సీతమ్మ: హమ్మా! ఎంత రాతి మనిషో కదా!


వామనరావు: "త్యాగరాజనుత" అనుకుంటూ ఒక కీర్తన కూడా మొదలెట్టా!


సీతమ్మ: గది రుసుం చెల్లించి పారిపోయారా?


వామనరావు: లేదు. కాని మా ఇంటి పులుదునా! అదే, పునాదులు కదిలిపోయాయి.


సీతమ్మ: హా హా! మీకు భలే తలంటి అయ్యిందన్నమాట


వామనరావు: ఏమిటో! పంచదార ఎక్కువ పంచక!


సీతమ్మ: పంచదారెక్కడుంది? పానకంలోనా?


వామనరావు: అబ్బా మీరుండండీ! లేకపొతే ఇదేదో పుక్కిటిపురాణము అనుకుని జనాలు వెళ్ళిపోతారు.



సీతమ్మ: అంతెగా? సరే, గొడవలతో చిరాకెత్తిన జనాలకి ఇది కాస్త ఆటవిడుపు


వామనరావు: నిజమే. కానీ ఇలాంటివాటికి కూడా మోకాలు అడ్డేవారు ఉన్నారని కొంతమంది ఉవాచ.


సీతమ్మ: అవునండోఇ. అంతర్జాలమయిపోయింది గానీ లేకుంటే ఇక్కడ కూడా గాజా స్టిప్పు లా గోడవలయ్యుండేవి.


వామనరావు: ఎప్పుడు ఏవి పేలతాయో తెలియదు. అసలే ఇక్కడ అందరికీ తల్లో పేలు


సీతమ్మ: అమ్మో. మరి తలకి కర్పూరం అదేనండీ కపురం రాస్తారా?


వామనరావు: లేదు. మా ఆవిడ మోహన రాగంలో పాట ఎత్తుకుంటే అవే చచ్చిపోతాయి.


సీతమ్మ: ఆవిడ ముసలమ్మ కదా?


వామనరావు: ఎంతమాటన్నారూ? ఇక మీ బుర్రమీద వేస్తుంది ఆదితాళము.


సీతమ్మ: బాబోయ్. వద్దులెండి. నేను ఆడ మనీషి ని.


వామనరావు: అందుకే ఇది. మగవాడయితే ధోనీ ఉతుకుడు ఉతుకుతుంది.


సీతమ్మ: వామ్మో. ఆవిడపేరు రమా దేవి కదూ?


వామనరావు: అవును. రావిచెట్టు కింద పుట్టిందిట.


సీతమ్మ: యది యేమి చిత్రము? వైద్యశాలలు లేవా?


వామనరావు: ఎందుకు లేవు? కానీ అక్కడ ఆడ నర్సులు లేక విరహజ్వాలలు చిమ్ముతున్న డాక్టర్లను చూసి భయమేసి మా మావగారు అత్తగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు అని చెప్పారు.


మలక్పేట్ రౌడీ: సరే రావుగారూ, సీతమ్మగారూ, కెలుకుడు ఇంత సమర్ధవంతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు.

సీతమ్మ, వామనరావు: ధన్యవాదాలు రౌడీగారూ!


మలక్పేట్ రౌడీ: వీక్షకులకు కూడా ధన్యవాదాలు. ఇక వెళ్ళి గడి మీద పడండి. ఇప్పటికే వచ్చేసి ఉంటె లైట్ తీసుకొండి. గడి పూరణలో ఉన్న రెండు మూడు తప్పులని మన్నిస్తారని ఆశిస్తున్నాం. నమస్తే! మళ్ళీ కలుద్దాం!!

Feb 22, 2009

మూడవ నెంబరు ప్రమాద సూచిక - తుంటర్వ్యూ : రవిగారి రాగలీలలు

ప్రమాదవనానికి విచ్చేసిన వీక్షకులకు మళ్ళీ స్వాగతం. ఈ సారి మా గెస్ట్ హోస్టెస్ టెక్సస్ (పోని ఠెక్సస్ అనుకోండి) తింగరబుచ్చిగారు.

మలక్పేట్ రౌడీ: నమస్తే టెక్సస్ తింగరబుచ్చిగారూ! పాదాభివందనం! మీ పేరు వెనకాల కథ?

తింగరబుచ్చి: అబ్బే! పెద్ద కథేంలేదండీ! నాది ఠెక్సస్. ఏదో బుష్ మీద అభిమానం తో ఆడపిల్లనైనా సరే "టింగురంగా బుష్" అని పునర్నామకరణం చేశారు. అది కాస్తా ఇండియనైజ్ అయ్యి తింగరబుచ్చిగా రూపాంతరం చెందింది.

మలక్పేట్ రౌడీ: సరే! మన కార్యక్రమం లోకి దూకేద్దాం!!

తింగరబుచ్చి: ఈ నాటి మన ముఖ్య అతిధి రవిగారు !!!

నమస్తే రవిగాడూ, సారీ రవిగారూ, సారీ రవిగారుగాడూ, సారి రవిగాడుగారూ ... సర్లేండి ఏదో ఒకటి .. ! కుశలమా?

రవిగారు: ఏం కుశలమోనండీ! ఆ బ్లాగ్లోక కౌరవులతో ఈ పాండవుల బ్లాగ్యుద్ధం సాగినంతకాలం ఏమి చెప్పలేం!

తింగరబుచ్చి సరే, ఇక e-ష్టావధానం
1. మీ సెల్ఫ్ డబ్బా ప్లీస్?
రవిగారు: కవిత్వం లో భావుకుడిని, కోపం లో గంధకపుపొడిని, కుట్రలు బయటపెట్టడం లో అమ్మవడిని వెరసి రవిగారిని !

2: మీరు పుట్టినప్పుడు "అమ్మా అమ్మా" అని కాకుండా "అమ్మాయ్ అమ్మాయ్" అని ఏడ్చారని భోగట్టా. దానికి మీరేమంటారు?

రవిగారు: ఇదంతా నామీద జరిగిన విదేశీ కుట్ర. పుట్టక ముందు విదేసి పర్యటనకేళ్ళి, వచ్చేలోగా ఇలా ప్రచారం జరిగింది.
అసలు నేరం నాది కాదు. ఆ నర్సుది. పుట్టగానే నా బుగ్గ గిల్లితే "అమ్మోయ్ అమ్మోయ్" అని ఏడిస్తే గిట్టని వాళ్ళు "అమ్మాయ్ అమ్మాయ్" అన్నానని ప్రచారం చేశారు.

3: ఇప్పుడు జరుగుతున్న బ్లాగు గొడవలపై మీ వ్యూపాయింట్?
రవిగారు: వెనకటికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలొ కోరుకోరా భక్తా అంటే మా మేన మామ చెవిలో వెంట్రుకలు మొలిపించు తత్తిమాది నే చూసుకుంటాను అన్నట్టుంది ఇది. మనం ఏం రాసినా బూతులని ప్రచారం చేసి జనాలని ఉస్కోమనిపించి గాలి పోగుజేసుకుని గొడవ చెయ్యడం తప్పా ఇక్కడ గొడవలు జరిగే పెద్ద విషయమేమీ లేదు. ఇక్కడి బ్లాగర్లను బ్లాగించి బాధించడమే ఆ గేంగ్ ఉద్దేశ్యం.

4: మీరెక్కడికెడితే అక్కడ గొడవలని జనాలు ఉవాచ. మరి మీరో?
రవిగారు: ఏమిటోనండీ, చిన్నప్పటినుండీ నాకు మబ్బు రామయ్యలా ఉండటం అలవాటు లేదు. ఎక్కడికి వెళ్ళినా పార్టిసిపేట్ చెయ్యడం, తోచింది తప్పని మొహం మీదే చెప్పడం, భట్రాజు పొగడ్తలు పొఘడకపోవడం, చెంగ చెయ్యకపోవడం అలవాటు. హీ హలవాట్లే ఘొడవలకి హసలు కారణాలు. అయ్యో ఇదేంటి ఎన్. టీ. ఆర్. స్టైల్ దైలాగులొస్తున్నాయ్?

5: ఈ ప్రశ్న రౌడి గారికి: "రవిగారు" - ఫుల్ ఫార్మ్ ప్లీస్?

మలక్పేట్ రౌడీ:

' ర ' మ్యమైన ప్రదేశములో
' వి ' కసించే తామరలకు
' గా ' రముతో కాంతినిచ్చే
' రు ' ధిరవర్ణ సూర్యుడు

6: రవిగారూ, ఇంతకీ మీ వయస్సు ఎంతో చెప్పారు కాదు

రవిగారు: అంతర్జాలంలో వయస్సు ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. మగవాళ్ళందరికి - 27, న్యూయోర్క్, ఆడవాళ్ళకి 25 శేన్ ఫ్రేన్సిస్కో - అంతేగా?

7: ఇంతకీ మీకేదిష్టం? సున్నుండలా? రవ్వలడ్లా?

రవిగారు: అమ్మో దీనిగురించి మాట్లాడి ఇంకో వివాదం సృష్టించదలచుకోలేదు. నన్నొదిలేయ్ తింగరితల్లోయ్!!

8: సరే - ఆఖరి ప్రశ్న: మిమ్మల్ని బ్లాగు జడ్జిగా పెడితే ఏ బ్లాగులకి బహుమతులిస్తారు?

* అత్యుత్తమ చెంగ బ్లాగు:
* అత్యుత్తమ చెత్త బ్లాగు:
* అత్యుత్తమ బూతు బ్లాగు:
* అత్త్యుత్తమ కెలుకుడు బ్లాగు:
* అత్యుత్తమ వివాదాస్పద బ్లాగు:
* అత్యుత్తమ వినోదాత్మక బ్లాగు:
* అత్యుత్తమ అర్ధరహిత బ్లాగు:
* అత్యుత్తమ గోల బ్లాగు:
* అత్యుత్తమ అమ్మలక్కల బ్లాగు:
* అత్యుత్తమ నాన్నలన్నల బ్లాగు:

రవిగారు: ???????????

తింగరబుచ్చి: మీకు కష్టమయితే ఒక లైఫ్ లైన్ వాడుకోవచ్చు - ఫోన్ ఎ ఫ్రెండ్...

రవిగారు: సరే! వాడుకుంటా..

తింగరబుచ్చి: ఎవరికి ఫోన్ చెయ్యమంటారు?

రవిగారు: ఆ నలుగురికీ :))

తింగరబుచ్చి: ఆ నలుగురూ లైన్లోకి వచ్చారు.

రవిగారు: అయినా ఎందుకు లేండి, ఏదో గొడవయ్యేలాఉంది. నేను సమాధానం చెప్పను. నిర్ణయాన్ని మన వీక్షకులకే వదిలేద్దాం. చూద్దాం వాళ్ళేమంటారొ కామెంట్లలో.

తింగరబుచ్చి: సరే - ఇప్పుడు ఉత్తమ బ్లాగ్ డైలాగ్ పోటీ కి వచ్చేద్దాం. వీక్షకులు మాకు ఫోన్లు చేసి చెప్పిన వాటిత్లో ఉత్తమమైనదానిని ఉత్తమ డైలాగ్ / మొనొలాగ్ గా ప్రకటిస్తాం.

ముందుగా ఫోన్ చేస్తోంది - ఒమేగా స్టార్ సిరంజిగారు: "థాంక్స్ చెప్పద్దు - నీకెవడయినా కామెంట్ వ్రాస్తే నువ్వు మరో ముగ్గురికి వ్రాయి"

తరువాత ఫోన్: బోల్డ్ స్టార్ గోలయ్య గారు: "నేను బ్లాగు తెరిస్తే ఆ బ్రౌజర్ లోంచి వచ్చే క్లిక్కు శబ్దానికే చచ్చిపోతావ్రా నువ్వు!"

తర్వాత: జూనియర్ MTR గారు:

మలక్పేట్ రౌడి: జూనియర్ ఎం. టీ. ఆరా? అంటే ఉప్పు ఫేక్టరీ యజమాని కుమారుడా?

తింగరబుచ్చి: అబ్బా! ఈయన పెద్ద నటుడండీ. ముందు చెప్పేది వినండి.

జూనియర్ MTR: నువ్వు లాగూలు కట్టిన వయస్సులోనే నాకు బ్లాగులు రాయడం నేర్పాడ్రా మా తాత!

తింగరబుచ్చి: తర్వాత ఫోన్: ఇదేమిటండి? కంట్రీ కోడ్ "-1" అని వస్తోంది?

మలక్పేట్ రౌడి: అది పైలోకాన్నించి అయ్యుండచ్చు. ఎవరో చూద్దాం . అహో! సీనియర్ ఎం. టీ. ఆర్. గారు.

సీనియర్ MTR: (నేరెళ్ళ వేణుమాధవన్ స్టైల్ లో) "ఔరా! ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సిద్ధమునధక్కరించుచూ కురుసార్వభౌముడనైన నా మానసమును సైతమాకర్షింపజేయుచున్నదే! హూ! ఇవి బ్లాగు భంజికలు. నేనెంత భ్రమపడితినీ! ఈ వి 'గ్నా' నాంధకారమున అ 'గ్నా' నాంధకారమెచటినుండి వచ్చుచున్నది? ఇది మయుని రచనా విశేషము కాదు చెంగబ్లాగునాయుని కుట్రయని అవగతమగుచున్నది!"

తింగరబుచ్చి: ఆహా! ఓహో!! గుక్క తిప్పుకోకుండా చెప్పేసారు. తరువాతి కాలర్ పోలిస్ స్టోరీ బోయ్ కుమార్ గారు

బోయ్ కుమార్: "కూడలిలోకి రావద్దన్నావుగా! అందుకే కూడలినే హేక్ చేశా"!

చివరగా శ్రవణ్ కల్యాణం గారు: "నువ్వు గుడుంబా సత్తివో బ్లాగుల్లో కత్తివో నాకనవసరం. నేను మాత్రం సిద్ధూ సిద్ధార్ధ్ రాయ్"

తింగరబుచ్చి: రౌడీ గారూ! జడ్జ్మెంట్ టైం.

మలక్పేట్ రౌడీ: మళ్ళీ నిర్ణయాన్ని మన వీక్షకులకే వదిలేద్దాం. చూద్దాం వాళ్ళేమంటారొ కామెంట్లలో.

తింగరబుచ్చి: ఉండండుండండి. మరో కాల్. ఎదో ఆల్ ఇండియా కుక్కల సంఘం అంటున్నారు.

మలక్పేట్ రౌడీ: కుక్కలు ఫోన్ ఏమిటండీ? అక్కసున్న అక్కలయ్యుంటారు. సరిగా వినిపించి ఉండదు - సరిగా వినిపించి ఉండదు - అసలే మీకు కాస్త చెముడు కూడానూ.

తింగరబుచ్చి: అక్కలు కాదండీ బాబూ. కుక్కలే - మొరిగిన / మొరుగుతున్న కుక్కలంటున్నారు.

మలక్పేట్ రౌడీ: ఇదెక్కడో విన్నట్టుందే - ఆయనెవరో బ్లాగులో అన్నమాటకదూ ఇది? సరే లైన్ కలపండి.

కుక్కలు: WHO LET THE BLOGS OUT .. WOOF WOOF ..
WHO LET THE BLOGS OUT .. WOOF WOOF ..

THIS IS OUR REVENGE ON HUMANS .. WOOF .. BOOOO BOOOOO
WHO WROTE THE SONGS ON US DOGS .. WOOF .. BOOOO BOOOOO
IF YOU CAN GETAWAY WITH THAT THING ...
WE CAN ALSO DO THE SAME AND BITE BACK ...

WHO LET THE BLOGS OUT .. WOOF WOOF ..
WHO LET THE BLOGS OUT .. WOOF WOOF ..


మలక్పేట్ రౌడీ: పాటలు సరేగాని .. విషయానికి రండి.

కుక్కలు: మేము ఈ తుంటర్వ్యూ ద్వారా ఆ నలుగురికి ఒక విన్నపం చేసుకుందామనుకుంటున్నామండీ!

తింగరబుచ్చి: సరైన సమయానికే చేశారు. ఆ నలుగురూ ఇంకా లైన్లోనే ఉన్నారు. చెప్పండి.

కుక్కలు: అయ్యా / అమ్మా! మమ్మల్ని మీతో పోల్చి వారెవరో మా గౌరవాన్ని పెంచారు. మీరు మాత్రం పొరపాటున కూడా వాళ్ళని మాతో పోల్చవద్దు. మేమందరం ఆత్మ హత్యలు చేసుకోవాల్సి వస్తుంది అవమానం భరించలేక. మమ్మల్ని కనీసం ఈ కుక్క బ్రతుకన్నా బ్రతకనివ్వండి. ఇక సెలవు.

తింగరబుచ్చి: ఆ నలుగురూ! విన్నారుగా? ఈ కుక్కల మీద దయచూపండి ప్లీస్. ఇంతసేపు లైన్లో ఉన్న మీకు మా ధన్యవాదాలు. రవిగారూ, అడిగిన వెంటనే తుంటర్వ్యూ ఇచ్చిన మీకు కూడా!

తింగరబుచ్చి: రౌడీ గారూ ఇక పేరడి టైం.. ఈ సారికొక విన్నపం. పేరడిల బదులు ఒక కొత్త పాట పాడండి.

మలక్పేట్ రౌడీ: సరే! ముందుగా తెలుగు పండితులకి, తెలుగు సాహితీ ప్రియులకి క్షమాపణలు. ఇది కేవలం సరదాకోసం మాత్రమే.

ఒక తెలుగు పండితుడు విధిలేక ఓ రవితేజ సినిమాకు వ్రాసే మసాలా పాట ఇలా ఉంటుందేమో?

పల్లవి:

నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల
నీ చెంపలపై రాసేస్తా చంపకమాల
మెడ చూసి అల్లుతా మత్తెభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ
నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !

నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల
నీ చెంపలపై రాసేస్తా చంపకమాల
మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ
నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !


చరణం 1:

నీ ఆటా పాటా నాకు ఆటవెలది
నీ తలపు వలపు నాకు తేటగీతి
సింగారించిన నడుము సీసపద్యమే
కందిపోయే నీ బుగ్గ కందమేలే

నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !

చరణం 2:

నువ్వే వయ్యారం వలకబోస్తే భట్టి విక్రమార్కులూ భ ర న భ భ ర వ
నువ్వే అందాన్ని ఆరబోస్తే నల చక్రవర్తి కూడ న జ భ జ జ జ ర
నీ కాలి అందెల చప్పుళ్ళకి మారు మూల పల్లె కూడ మ స జ స త త గ
నీ వాలు కళ్ళ చూపులకేమో శతవయో వృధ్ధులూ స భ ర న మ య వ

నువ్వే గురువయితే నేనే లఘువవుతా
నువ్వే గురువయితే నేనే లఘువవుతా

నువ్వే నా తోడయితే య మా తా రా జ భా న సా ...
నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !

పల్లవి:

నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల
నీ చెంపలపై రాసేస్తా చంపకమాల
మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ
నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !


రవిగారు: మలక్! వెళ్ళేముందు ఒక ప్రశ్న - ' రాగ లీలలు ' అని టైటిల్ పెట్టారు కదా - ఈ రాగ అంటే ఎవరండీ? ఎప్పుడూ కలవలేదే?

మలక్పేట్ రౌడీ: అయ్యో! అమ్మాయి కాదండి బాబూ. మీరు ఊరుకోండి. తింగరబుచ్చిగారూ మీకు ధన్యవాదాలు. వీక్షకులారా! వచ్చేవారమో, ఆ పైవారమో లేక నాలుగయిదు వారాల తరవాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవు, ధన్యవాదాలు, రవిగారికీ, తింగరిబుచ్చి గారికీ, వీక్షకులకూ పాదాభివందనాలు.

తింగరబుచ్చి: చివరగా --- రౌడీగారూ, మీ పేరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తారా?
మలక్పేట్ రౌడీ: అబ్బే ఎందుకు లెండీ!
తింగరబుచ్చి: చెప్పండి ఫరవాలేదు
మలక్పేట్ రౌడీ: వసుదేవుడండీ :))
తింగరబుచ్చి, రవిగారు: ఆ (((((( !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Feb 16, 2009

రెండవ నంబరు ప్రమాద సూచిక - చెంఘీజ్ ఖాన్ చెంగాయిజం

మలక్పేట్ రౌడీ: మా ప్రమాదవనం లోకి మళ్ళీ తొంగి చూస్తున్న వీక్షకులందరికీ నమస్సులు. పోయిన వారం ఇంటర్వ్యూ సందర్భంగా పూలూ, రాళ్ళూ జల్లిన, జల్లుతున్న, జల్లబోతున్న, జల్లే ఉద్దేశ్యం లేని వాళ్ళందరికీ కృతజ్ఞతలు.

ఈ వారం మన గెస్ట్ హోస్ట్ - ఆరిజోనా అక్కుపక్షి గారు. నమస్తే అక్కుపక్షి గారూ! అలవాట్లో పొరపాటుగా అడిగే ప్రశ్న - మీకీపేరు ఎలా వచ్చిందో కాస్త చెప్తారా? మీ వాళ్ళు పెట్టిందా లేక మీరు పుట్టించుకున్నదా?

అక్కుపక్షి: నమస్తే రౌడి గారూ! మా నాన్నగారు అక్కినేని అభిమాని లేండి. ఆయనో బర్డ్ వాచర్ కూడా. సో అదీ ఇదీ కలిపి అక్కుపక్షి అని పేరు పెట్టారు.

మలక్పేట్ రౌడీ: ఏమిటండీ కొంచం కోపంగా ఉన్నట్టునారు? ఎవరిమీద?

అక్కుపక్షి: మీమీదే!!

మలక్పేట్ రౌడీ: అయ్యో! ఎందుకండీ?

అక్కుపక్షి: నాకన్నా ముందు ఆ పిట్సుబర్గు పిచ్చమ్మని పిలుస్తారా!

మలక్పేట్ రౌడీ: మీరిద్దరూ మాంచి ఫ్రెండ్సే కదా?

అక్కుపక్షి: అది ఒకప్పుడు. మొన్న సూపర్ బౌల్ జరిగినప్పటినించీ విడిపోయాం. అదికూడా ఆ పిట్స్ బర్గ్ స్టీలర్స్ కేవలం ముప్పై అయిదు సెకండ్లు మిగిలి ఉండగా టచ్ డవున్ చెయ్యడం చాలా బాధగా ఉంది.

మలక్పేట్ రౌడీ: ఓటమి గెలుపులు మన బ్లాగు గొడవల్లానే దైవాధీనములండీ! కాస్త కోపం తగ్గించుకుని ప్రోగ్రేం మొదలుపెడతారా?

అక్కుపక్షి: సరే! సరే!! ఇవాళ నాతోపాటు వచ్చిన రెండవ ఘోస్టు - అదేనండీ గెస్ట్ హోస్ట్, మన రెండో అతిధి "దయ్యాల ప్లీడరు" గారు

మలక్పేట్ రౌడీ: దయ్యాల ప్లీడరా?

అక్కుపక్షి: అంటే డెవిల్స్ ఎడ్వోకేట్. మన ప్రోగ్రేంలో అంశాలకి రంధ్రాన్వేషణ చేస్తారన్నమాట! నమస్తే దయ్యాల ప్లీడరుగారూ!

దయ్యాలప్లీడరు: నమస్తే!

అక్కుపక్షి: ఇక మన ముఖ్య అతిధి చెంగోద్దండుడు శ్రీ శ్రీ శ్రీ చెంగల్పట్టు చెంఘిజ్ ఖాన్ గారు. నమస్కారమండీ! ఇదిగో మీ హాట్ సీట్!

చెంఘిజ్ ఖాన్: నమస్కారం. ఏంటీ? హాట్ సీట్ అంటే కుంపటా?

అక్కుపక్షి: పోయినసారి కుర్చీ క్రింద కుంపటి పెడితే బొగ్గులు చల్లబడిపోయాయని ఈసారి తిన్నగా కుంపటిమీదే కూర్చోబెట్టే ఏర్పాటుచేశాం. కష్టమా?

చెంఘిజ్ ఖాన్: (స్వగతం: అబ్బే! హంసతూలికాతల్పమంత సుఖంగా ఉంటుందేం? బుద్ధుండాలి అడగడానికి!) ఫరవాలేదు లేండి. నేను 'చెంగయోగ' సాధకుడిని. కూర్చోగలను.

అక్కుపక్షి: మీ గురించి ఇక్కడెవ్వరికీ తెలియదు - కాస్త సెల్ఫ్ డబ్బా కొట్టుకోండీ ప్లీస్!

చెంఘిజ్ ఖాన్: నా గురించి క్లుప్తంగా చెప్పాలంటే - చెంగల్పట్టు ఆశ్రమ ప్రతినిధిని, రెవరెండ్ జాన్ చెంగలరావు, చెంగేశ్వర స్వామీజీ, చెంగాయ్ ల్లామా, ఈమాం చెంగుల్లా ల శిష్యుడిని. మా చెంగలసంఘం వారు మూడేళ్ళక్రితం నా చెంగలకి మెచ్చి "చెంగ్ కమేండ్.మెంట్స్" ఉపదేశించి "చెంగోద్దండ" బిరుదు ప్రదానం చేశారు.

అక్కుపక్షి: భేష్! ఇక మీ ఉపన్యాసం మొదలెడతారా?

చెంఘిజ్ ఖాన్: తప్పకుండా! అందరికీ మళ్ళీ నమస్కారం. ఈ ఉపన్యాసంలో ముందుగా మనం "చెంగ" అంటే ఏమిటో నేర్చుకుందాం. తరవాత చెంగలలో రకాలను, వాటి విశిష్టతలను తెలుసుకుందాం!

తమ పనులు మానుకుని ప్రక్కవారి పనులు చేసిపెట్టడాన్ని "చెంగ" అని నిర్వచిస్తాం. ఈ చెంగ చేసిన వాడికి లాభమేమి ఉండదు - చేయించుకున్నవాడికి కూడా పెద్దగా లాభం ఉండదు.

ఉదాహరణకి - మీరు ఆవురావురుమంటూ కాలేజిలో కేంటీన్ కి వెళ్తుంటారు. ఈ లోగా ఎవరో అమ్మయి ఎదురుపడి "నాకు అర్జెంటు పనుంది. ఈ పుస్తకాలు లైబ్రరీలో ఇచ్చెయ్యరూ, ప్లీస్?" అంటుంది. వెంటనే మీరు అక్కడికి వెళ్ళి అరగంట క్యూ లో నిలబడి, మీ డబ్బులతో ఫైన్ కూడా కట్టి కేంటిన్ కి తిరిగొచ్చేటప్పటికి, ఆమె తన బాయ్ ఫ్రెండ్ తొ కాఫీ తాగుతూ "థేంక్యూ అన్నయ్యా!" అంటుంది. దీనివల్ల మీకొరిగినదేమీ లేదు, ఆ అమ్మాయికి పెద్దగా లాభమేమీ లేదు, మీ సమయం మాత్రం వృధా. ఇది చెంగలలో అతి సాధారణ చెంగ.

మరొక ఉదాహరణ - ఆయనెవరో రవిగారని ఏమీ తోచక బ్లాగులకొచ్చి, ఎవరినో కెలికి గొడవపెట్టుకుంటే, ఆ గొడవ గురించి యాహూ లో విని ఈ రౌడీ గారు పరిగెత్తుకొచ్చి బ్లాగులు తెరిచి చెంగ చేశారే - సైబర్ చెంగ అనబడే ఇది ఇంటర్నెట్ లో చాలా కామన్.

మలక్పేట్ రౌడీ: నేను రవిగారికోసమే వచ్చానని ఎవరన్నారు? నేనొచ్చింది జనాలని కెలికిపోడానికి. లాంగ్ టెర్మ్ ఆబ్జెక్టివ్స్ ఏమి నాకు లేవిక్కడ. (స్వగతం: ఇక్కడ కాబట్టి బ్రతికిపోయావ్. ఈ దుష్ప్రచారం బయట చేసుంటే నీ సంగతి అక్కడే తేల్చేవాడిని)

చెంఘిజ్ ఖాన్: ఏమో! జనాలు చెవులు కొరుక్కుంటూ పొరపాటున నాది కూడా కొరికేశారు. ఇప్పుడే రేబీస్ ఇంజెక్షన్ చేయించుకుని వస్తున్నా!

దయ్యాలప్లీడరు: అయ్యా! నాదొక సందేహం - ఈ అన్నదానాలు, రక్తదానాలు చేసేవాళ్ళు కూడా చెంగలే అంటారా?

చెంఘిజ్ ఖాన్: అయ్యో! తప్పు తప్పు. అన్నదానం వల్ల నలుగురికి తిండి, రక్తదానం వల్ల నలుగురికి జీవితం లభిస్తాయి. అది చెంగ కాదు. కానీ హైదరాబాద్ లో ఇరవైమంది నిలోఫర్ లో రక్తదానం చేస్తే ఆ రోజు చెన్నై లో ఉన్న రౌడీ గారు "ఇది మా ('నా' అని చదువుకోవాలి) గ్రూప్ ఘనతే" అని వెబ్ సైట్ లో పెట్టుకున్నారు చూడండీ - అదీ చెంగ అంటే!

మలక్పేట్ రౌడీ: హ హ హా హా హా హా (హిపోక్రిటికల్ స్వగతం: మళ్ళీ నామీద జోకా? ఖానూ! నీకు మూడింది రోయ్!)

చెంఘిజ్ ఖాన్: ఇలాంటిదే మన పుస్తక దాన చెంగ కూడా!

అక్కుపక్షి: హి హీ హీ హీ హీ హీ హీ హీ!!!!!!!!!!!!

చెంఘిజ్ ఖాన్: ఏమిటా వెకిలినవ్వు? పార్టీలలో, సభలలో సమయం సందర్భం లేని తెలుగు సినీమా హీరోయిన్ నవ్వులా?

మలక్పేట్ రౌడీ: అయ్యా! ఆమెనేమీ అనద్దు. అలిగి బ్లాగ్ మూసేస్తుంది. చెంగరాయుళ్ళందరూ మనమీద యుద్ధానికొస్తారు. పైగా ఈమె "చెంగ్ ఫూ" చాంపియన్.

అక్కుపక్షి (మలక్పేట్ రౌడీ చెవిలో): టూ లేట్. ఈ ఖాన్ నీమీద, నామీద కూడా రాళ్ళేస్తున్నాడు. ఈ షో అయ్యాక వీడి పని పడతా!

చెంఘిజ్ ఖాన్: సరే! ఇంక చెంగలలో రకాల గురించి తెలుసుకుందాం!


చెంగలు ముఖ్యంగా రెండు రకాలు - సంకల్పిత చెంగ, అసంకల్పిత చెంగ అని. సంకల్పిత చెంగ అంటే తెలిసి చేసేది ... ఉదాహరణకి మన బ్లాగ్లోకం లో ఇద్దరు ముగ్గురి మీద జరిగిన దాడిని ఇంటర్నేషనల్ ప్రాబ్లం చేశారే, పైగా ఎక్కడో ఒక మూల ఉన్న బూతుల బ్లాగుని అందరికీ చూపించి "కుట్రో కుట్ర - ఆడవాళ్ళని బ్లాగుల్లోంచి వెలివెయ్యడానికి ఒసామా బిన్ లాడెన్ నియమించిన వ్యక్తుల కుట్ర" అని తక్కిన ఆడవాళ్ళే నవ్వుకునేలా రోజుకోసారి అరుస్తున్నారే, అది సంకల్పిత చెంగ.

ఈ అరుపుల వల్ల ఆ స్త్రీలకేమన్నా మేలు జరిగిందా? దేవుడికే ఎరుక. ఎక్కువ లాభం ఎవరికి? ఆ బూతు బ్లాగ్ వ్రాసినవాడికి పిచ్చ పబ్లిసిటీ. ఒకప్పుడు అనామకుడు - ఇప్పుడు బ్లాగరందరికీ తెలుసు. చివరికి వీళ్ళంతా చెంగ చేసిందెవరికి? ఆ బూతులరాయుడికి. ఇది అసంకల్పిత చెంగ.

చాలా సంకల్పిత చెంగలకీ సాధారణంగా అసంకల్పిత చెంగలుంటాయ్. ఇదాంతా మేక్రో స్కేలులో.

ఇక మైక్రో స్కేలుకొస్తే - చెంగలు నానావిధాలు:

* పాకిస్తాన్ కోసం ఎవడొ ఆఫ్రికా వాడు కాష్మీరంటే ఏమిటో తెలియకపోయినా వచ్చి చస్తున్నాడు చూడు - దాని వల్ల వాడికి గాని వాడి కుటుంబానికి గాని ఏమి లాభం లేదు. ఎందుకూ చాలని కొంత డబ్బు తప్ప! దీనిని జిహాదీ చెంగ అంటాం!

* మందుకొట్టి పిచ్చిగంతులేస్తున్న ఆడపిల్లల్ని చావగొట్టిన వాళ్లది - సాంస్కృతిక చెంగ - దీనివల్ల ఆ పిల్లలు మారలేదు సరికదా .. వాళ్ళ లోదుస్తులు వీళ్ళకి పంపిస్తున్నారు. "ఉన్నిబట్టలేసుకోవే తల్లీ!" అంటే ఉన్న బట్టలు కూడా ఊడబీక్కున్న బాపతు!

* ఇక ప్రతీదానికీ ప్రభువు కాపాడును అని చెప్పి డబ్బులిచ్చి మరీ మతం మార్పిస్తారే - అది మతమార్పిడి చెంగ. వీళ్ళ డబ్బులయిపోయిన వెంటనే వేరే మతం వాళ్ళూ డబ్బులిచ్చి 'రీ కన్వర్ట్' చెయ్యరూ?

* నీకు నువ్వే చేసుకునే చెంగ (నీ గురించి నువ్వే గొప్పగా బ్లాగుల్లో వ్రాసుకోవటమన్నమాట) స్వచెంగ - ఇందులో "ఇంటర్వ్యూలు చేసే స్థితిలో ఉన్నా!" అనే రవిగారిది ప్రత్యక్ష స్వచెంగ, డబ్బా కొడుతున్నట్టు తెలియకుండా డబ్బాలు కొట్టుకునే రౌడీ గారిది పరోక్ష స్వచెంగ.

* పక్కవాడికి చేసే చెంగ - పరచెంగ ("ఆహా! ఓహో! ఎక్కడికో వెళ్ళిపొయారు సార్ మీరు! మీరు " అంటూ)

* వాడు నీకు నువ్వు వాడికీ చేసేది - పరస్పర చెంగ (ఒకళ్లకొకళ్ళు పొగడ్త కామెంట్లు వ్రాసుకోవటమన్నమాట)

* సూడో చెంగ: అమేరికా వాడు పాకిస్తాన్ కి చెంగ చేస్తున్నట్టు కనిపించినా ఎక్కడ నొక్కెయ్యాలో అక్కడ తొక్కేస్తాడు. ఇది సూడో చెంగ!

* సాముహిక చెంగ: ఇది ఒక సమూహం కలిసి ఒకరికో ఇద్దరికో చేసే చెంగ. మన ఆలిబాబా .. కాదు కాదు ఖాళీ బ్లాగర్ నలభై చెంగలు. ఆయనెవరో అన్నాడు చూడండి - నేను స్లం డాగ్ చూడలేదు - అయినా దాన్ని విమర్శిస్తాను అని, అలాగే ఈ చెంగలు కూడా - స్లం బ్లాగు నేను చదవలేదు, అయినా సరే ఆయన ఎవరో చెప్పారు కాబట్టి ఖండిస్తున్నా అని.

* రాజకీయ చెంగ: అమ్మో! దీని రేంజ్ చాలా ఎక్కువ - మచ్చుకో రెండు ఉదాహరణలు:

******** ఎవడో పెద్ద లీడర్ వచ్చి స్పీచ్ ఇస్తుంటే ఫోటో కోసమ్ పక్క నిలబడి, ఆయనకి సేవలు చేసి, స్టేజ్ ఎక్కి చేతులు ఊపి చేసే చెంగ - తీరా టికెట్ వచ్చేది నీ విరోధికి!
******** భూఆక్రమణ అంటూ పేదలని ఆకట్టుకోడానికి చేసే చెంగ - ఇంతా చేసి ఓట్లు పడేది పొత్తు పెట్టుకున్న చెంగబాబునాయుడికో లేక చెంగశేఖరరావుకో!

*ఇలాంటివే ఫలానా హీరో అభిమాన 'చెంగాలు' కూడా!

* ఎవడో నీకు చెంగ చేస్తే నువ్వు ముగ్గురికి చెంగ చెయ్యటం - "పే ఇట్ ఫోర్వర్డ్" లేక "స్టాలిన్" చెంగ

* ఎవడో నీకు చెంగ చెయ్యటానికొస్తే నువ్వే వాడికి చెంగ చెయ్యటం - రివర్స్ చెంగ

* పొద్దస్తమానం పక్కవాళ్ళమీద పడి ఏడిచే చెంగ్ 'క్రై బేబీ చెంగ' - దీనిని "సీ బీ సీ" అని కూడా అంటాం

* తమ సొంత బ్లాగులకన్నా ప్రక్కనున్న ఆడవాళ్ళ బ్లాగుల్లో ఉన్న తడి తువాళ్ళ మీద ఎక్కువ ఇంటరెస్ట్ చూపించే మగవాళ్ళ చెంగని "స్త్రీవాద పురుష బ్లాగు చెంగ" లేదా "ఎస్ పీ బీ సీ " అంటాం.

* అవసరమున్నా లేకపోయినా పక్కవాళ్ళని కెలకడం - రౌడీ చెంగ!

* ఈ రవిగారు చూడండి: ఈ - తెలుగు మీటింగ్ అంటూ వెళ్ళి అక్కడేమీ చెయ్యకపోయినా ఏవో రవ్వలడ్లు తిని వచ్చారు. దీనిని "షొ-ఆఫ్" చెంగ అంటాం. పాపం ఈ - తెలుగు కోసం కష్టపడేది ఒకళ్ళు - బజ్జీలు తినేది వేరోకళ్ళు!

* అలాగీ అడిగినవాళ్ళకి అడగనివాళ్ళకి టెంప్లేట్లు చేస్తే - దాని పేరు టెంప్లేట్ చెంగ - చేసిన వాళ్ళకి ఒరిగేది ఏమి ఉండదు - చేయించుకున్నవాళ్ళకి కూడా అయ్యో పాపం వీళ్ళు తమ పనులు మానుకుని మనకేదో చేసిచ్చారే అన్న ఫీలింగ్ ఉండదు, పైగా టెంప్లేట్ పోతే చేసిచ్చిన వాళ్ల మీద అనుమానాలు!

* వీటన్నిటికన్నా వెరైటీ చెంగ ఇంకొకటుండండోయ్ - ఇందాక చెప్పినట్టు కుట్ర చెంగ. కొంతమంది మీద జరిగిన దాడిని "తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద" జరిగే విదేశీ కుట్రగా వర్ణించటం. ఇంతా చేసి జరిగింది ఒకరిద్దరు మరొకరిద్దర్ని తిట్టడం. తిట్టబడిన వాళ్ళు తెలుగుకు ఎదో సేవ చేస్తున్నట్టు, వాళ్ళు బ్లాగులు వ్రాయకపొతే తెలుగు భాష బ్రతకనట్టు బిల్డప్పు. తెలుగు భాష మాట్లాడే పదిహేను కోట్లమందికి మనం మనం వ్రాసే పదిహేనువందల బ్లాగులే దిక్కా? లక్షవ వంతు కూడా లేవు ఈ బ్లాగులు తెలుగు ప్రపంచంలో! తెలుగు మనకన్నా ముందే ఉంది - మన తరవాత కూడా ఉంటుంది. మనమటుకు మనం చేయగలిగిన ఉడతాభక్తి సేవ చేస్తే చాలు - బ్లాగుల ద్వారా తెలుగు భాషని బ్రతికించేస్తున్నామని బిల్డప్పులివ్వకుండా. ఆదికవి నన్నయే ఇలాంటి గాలి కబుర్లేనాడూ చెప్పలేదు. తన గురించి గొప్పలు చెప్పుకునేవాడిగా పేరుబడ్డ శ్రీనాధ కవిసార్వభౌముడు కూడా ఈ రేంజ్ లో ప్రగల్భాలు పలకలేదు. ఇక మనమెంత?

దయ్యాల ప్లీడర్: అసలు తెలుగు భాష ఎలా నష్టపోతోంది?

చెంఘిజ్ ఖాన్: ప్రస్తుత పరిస్థితులలో ప్రముఖ పుస్తకాలన్నీ ఆంగ్లభాషలోనే ఉన్నాయి. దానివల్ల తెలుగు మాధ్యమం లో పెద్ద చదువులు కష్టమవుతోంది. తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న బ్లాగర్లలో కనీసం పది మంది ఆ పుస్తకాలని తెలుగులోకి అనువదిస్తే - ముఖ్యంగా సైన్సు పుస్తకాలని - భాషకి అంతో ఇంతో మేలు జరుగుతుంది.

మలక్పేట్ రౌడీ: నిజమే! శామ్ పిట్రోడా నాయకత్వంలో నడుస్తున్న నేషనల్ నాలెడ్జి కమీషన్ తన వంతు సహాయాన్నందిస్తుంది. ఆ విషయం ఆయనే ఆ మధ్య చికాగో లో చెప్పారు. అలా అని ఎవరూ చెయ్యట్లేదు అని కూడా అనకూడదు. వివేన్ గారు, శ్రీధర్ గారు, మహీ గ్రాఫిక్స్ వారు వ్రాస్తోంది తెలుగులోనే కదా!

దయ్యాల ప్లీడర్: మిగతా వాళ్ళకి సలహాలిచ్చేబదులు ఆ పని మీరే ఎందుకు చెయ్యకూడదు చెంఘిజ్ ఖాన్ గారూ?

చెంఘిజ్ ఖాన్: (రాజేంద్రప్రసాద్ స్టైల్ లో): ఎక్స్పెక్ట్ చేసా .. ఇలాంటిదేదో అడుగుతారని ఎక్స్పెక్ట్ చేసా. నా మటుకూ నేను అజైల్, స్క్రమ్, సిక్స్ సిగ్మా మీద పుస్తకాలు వ్రాస్తున్నా - ప్రస్తుతానికి పబ్లిషర్ వేటలో ఉన్నా!

అక్కుపక్షి: సుత్తాపండెహే! ఈ చెంగాయణం లో పబ్లిషర్ల వేటేమిటి?

మలక్పేట్ రౌడీ: సరే, చెంఘిజ్ ఖాన్ గారూ! మీరు కానివ్వండి.

చెంఘిజ్ ఖాన్: ఇకపొతే మిగిలినది ఇంటలెక్ట్యువల్ చెంగ. ఏదైనా జరిగితే చాలు దాని కూపీ లాగడమన్నమాట. ఎవడో బ్లాగులో ఏదో రాస్తే దాని జాగ్రఫీ, హిస్టరీ, సివిక్సు కలిపి డిసెక్టు చేసే అతిమేధావి వర్గం దానిగురించి అరా తీసి, రాసిన వాడెక్కడివాడు, ఎందుకొచ్చాడు, దీనివల్ల వాడికేమి లాభం అంటూ ఒక ఉచిత ఎనాలిసిస్ పడేస్తూ ఉంటారుగా - ఇంతచేసినా అది ఎవ్వడికి పనికొచ్చి చావదు. అదీ మన ఇంటలెక్ట్యువల్ చెంగ.

అక్కుపక్షి: అయితే ఈ చెంగాయిజం ఎక్కడపడితే అక్కడే ఉంటుందంటారు.

చెంఘిజ్ ఖాన్: నిస్సందేహంగా! చెంగ మహాకవి శ్రీచెంగం శ్రీనివాసరావుగారు అనలేదా - "చెంగాయిజం లేని చోటు భూస్థలమంతా వెదికిన దొరకదు" అని?

చివరగా ఒక ముఖ్యమైన విషయం. చెంగ్ కమాండ్.మెంట్స్ కేవలం కాబొయే చెంగోద్దండులకే చెవిలో ఉపదేశిస్తారు. కానీ చెంగలలో కాస్త ఆధునిక భావాలు కల విప్లవ చెంగనైన నేను వీటిని మీతో పంచుకుంటున్నా!

* Thou Shalt have no Gurus before “SarvaCHENGAchaalak”
* Thou Shalt not make unto thee any Chengraven image
* Thou shalt not take the name of the Chengoddamdas in vain
* Remember the World Chenga Day, and Keep it Chengly
* Honor thy Chengas
* Thou shalt not remain a non-Chenga
* Thou shalt not expect any benefit from your Chengaistic Activities "
* Thou shalt not leave an opportunity to do Chenga service"
* Thou shalt not bear false witness against thy fellow Changa"
* Thou shalt not covet thy Chenga’s house, nor anything that is thy Chenga's."

చెప్పాలంటే ఇంకా చాలా ఉంది గాని, సమయాభారం వల్ల ముగిస్తున్నా! ధన్యవాదాలు అందరికీ - ఓపిగ్గా విన్నందుకు !

అక్కుపక్షి: ఇంత "చెంగాలమైన" ఉపన్యాసం ఇచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు చెంఘిజ్ ఖాన్ గారూ. దయ్యాల ప్లీడర్ గారూ, మీకు కూడా ధన్యవాదాలు. రౌడీ గారూ! ఇప్పుడు పేరడీ టైమ్!!

మలక్పేట్ రౌడీ: "బొంబాయి" సినీమాలో "హమ్మ హమ్మ" పాట ట్యూన్ లో:


Audio File:
-----------


http://www.esnips.com/doc/10bfe0b7-1373-40d4-922e-351594da14db/tbc2


Get this widget | Track details | eSnips Social DNA




ఈ బ్లాగ్లోకంలోకీ, నేనిపుడే వచ్చానే
వస్తూనే
బ్లాగులు కొత్తవి తెరిచీ .. చెంగే చేశానే ..
చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ... హే చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...

ఈ
సీనియర్ బ్లాగర్ల, వీపంతా గోకానే ప్రమాదవనంలో అందరి పైన రాళ్ళే వేశానే
చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ... హే చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...

చరణం
:
రవిగారి బ్లాగ్ లోన టెంప్లేట్లు అన్నీ మాయమయ్యేనేందుకో...
సున్నుండలనబడే రవ్వలడ్లు తిన్నా తిరిగిరాలేదెందుకో...
కాగడావి
బ్లాగులేవి కూడలిలో లేవెందుకో
బూతు పురాణం, చెత్త భారతం, రాసి పెట్టినందుకో ...
చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...హే చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...

చరణం:
ఇద్దరిముగ్గురిమీద జరిగినa దాడి బ్లోఅప్ అయ్యేనమ్మడూ,
ఆడవాళ్ళపై
అహేతుకమంటూ పబ్లిసిటీ తమ్ముడూ
తక్కిన స్త్రీలకు ఈ సీనులన్నీ వెగటు పుట్టించేనిప్పుడూ
మహిళలే
మహిళా గేంగులనింత ఛీకొట్టలేదెన్నడూ!!!!!
చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ... హే చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...

చెంఘిజ్ ఖాన్: రౌడీ గారూ! మీతో పోట్లాడాలనుకునేవాళ్ళకి ఒక సూచన - మీరేమి అనుకోనంటే ..

మలక్పేట్ రౌడీ: తప్పకుండా! చెప్పండి!!

చెంగిజ్ ఖాన్: ఎవరో చెప్పిన్నట్టు - ఒక పందితో బురదలో పోట్లాడేవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం: కొత్త వాళ్ళకి మొదట్లో బాగానే ఉంటుంది. కాని తర్వాత అర్ధమయ్యేదేమిటంటే ఆ గొడవలో బురద మీకంటుకుటుంది - కానీ పంది మాత్రం ఎంజాయ్ చేస్తుంది - బురదలో పొర్లడం దానికలవాటే కదా! :))

మలక్పేట్
రౌడీ: హా హా హ్హ

చెంఘిజ్ ఖాన్: మీ మనసును కష్టపెట్టుంటే క్షమించండి

మలక్పేట్ రౌడీ: అబ్బే అదేం లేదండీ. మిగతా వాళ్ళ మీద రాళ్ళేస్తున్నప్పుడు నా మీద వచ్చే జోకుల్ని కూడా ఎంజాయ్ చెయ్యాలి కదా?

చెంఘిజ్ ఖాన్: మీరనవసరంగా ఆవేశపడుతున్నారు రౌడీ గారూ! నేను క్షమాపణ చెప్పింది ఆ పందులకి, మీతో పోల్చినందుకు

మలక్పేట్ రౌడీ: హా హా హా హా హా హా హా! (స్వగతం: ఖానూ! ఇంక నిన్ను ఉపేక్షించి లాభంలేదు - నీ సంగతి తేలుస్తా) ధన్యవాదాలండీ. మా అక్కుపక్షి మిమ్మల్ని తలుపు బయటదాకా దింపుతుంది.

(అక్కుపక్షి చెవిలో): బయటకెళ్ళినవెంటనే నీ "చెంగ్ ఫూ" ప్రతాపం వాడిమీద చూపించు. వెధవ! వాడి పాడె వాడే కట్టుకోవాలి. మనల్ని విమర్శించినవాడెవ్వడూ ఈ బ్లాగ్లోకంలో మిగలడానికి వీల్లేదు. ప్లీడర్ వెళ్ళిపోయాడుగా, నువ్వెళ్ళేడప్పుడు తలుపెయ్యి.

******* క్లిక్ క్లిక్ *********

మలక్పేట్ రౌడీ: వేశావా? సరే ...

ఇందుమూలముగా యావద్బ్లాగర్లకూ .... ఈ చెంఘిజ్ ఖాన్ గారి కాలో చెయ్యో విరిగిన ఎడల, లేక తల పగిలిన ఎడల, లేక ఆయన పాడె ఆయనే ఇక ముందు కట్టుకున్న ఎడల, లేక 2007 లోనే తన శ్రేయోభిలాషులతో కట్టించుకున్న ఎడల బాధ్యత మాది కాదనియు, మమ్ములను బాధ్యులను చేసిన ఎడల మా బ్లాగ్ పర్మిషనులు మార్చివేయుదమనియు, లేదా బ్లాగులు మూసివేయుదమనియూ, పిదప మా మూడువందల భజన భట్రాజు చెంగల బ్లాగ్ధాటితో విషయమును పాకిస్తానీ కుట్రగా మార్చి ప్రక్కదోవ పట్టించెదమనియూ తెలియజేయడమైనది.

అందరికీ ధన్యవాదాలు. మీలో ఇంకా ఓపిక మిగిలుంటే మళ్ళీ వచ్చే వారం కలుద్దాం - రవిగారి చెంగ .. సారీ ... ఇంటర్వ్యూ లో !


Feb 8, 2009

ఒకటవ నెంబరు ప్రమాద సూచిక - పిచ్చమ్మ పరాచికాలు - ఇంటర్వ్యూ !!

మలక్పేట్ రౌడీ:

'ప్రమాద'వనం లొకి తొంగి చూసే వీక్షకులందరికి నమస్కారం, మరీ అమేరికనైజ్డ్ అయిన వాళ్ళందరికి హెల్లోలు, 'యో' 'యో' లు. బ్లాగర్లలో మహా బ్లాగర్లు వేరయా (మహిళా బ్లాగర్లు కూడా వేరయా) అని ఎవరొ వెబ్బర్ అంటేను అలాంటి మహా బ్లాగర్లని , మహా వెబ్బర్లని గుర్తించదలచి మా 'ప్రమాద'వనం లొకి ఆహ్వానించి పిచ్చ'పార్టీ' జరిపించాలని నిర్ణయించాం.అందరికీ ఇక్కడ పెద్ద పీఠం వేస్తూ మా ఈ కుంపటి తొ వేడి చేసిన కుర్చీ పై కూర్చోబెట్టి నిప్పుల వేడి కన్నా వాడిగా ఉండే ప్రశ్నలతో విసిగిద్దామని డిసైడ్ చేసాం!

మన ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని హోస్టు చేసేది (అంటే "గెస్ట్ హోస్టెస్" అన్నమాట) కేరోలైనా కేకాక్షి గారు.

కేకాక్షి గారూ! నమస్కారం!! మీ పేరుకి అర్థం? మీ కళ్ళని చూసి జనాలు కేకలు పెట్టి పారిపోతారా? లేక, మీ కళ్ళే "కేకా"? లేక మీవి కేకి(నెమలి) కళ్ళా?

కేకాక్షి: నమస్తే రౌడీ గారూ. అది మీరే కనుక్కోండి.

మలక్పేట్ రౌడీ: హా! హా!! హా!!! సరే వదిలెయ్యండి. ఓవర్ టు యూ!"

కేకాక్షి: అందరికీ నమస్కారం. హాట్ సీట్ కోసం కరెంటుతొ కుర్చీని వేడి చేద్దామని నేనంటే ఈ రౌడీ గారే షాకు కొడుతుందని వద్దన్నారు. ఈ సారికి బొగ్గుల కుంపటి తొ కానిద్దాం మా హాట్ సీట్ ని...

మా ఈ కార్యక్రమం పేరు e-ష్టావధానం. 8 ప్రశ్నలు ఉంటాయి...

మా మొట్టమొదటి కాల్చే కార్యక్రమంలోకి 'పిట్స్ బర్గ్ పిచ్చమ్మ' గారిని ఆహ్వానిస్తున్నాం. ఈవిడ గురించి పరిచయం చేయటానికి ఏదైనా చెప్పాలనే ఉంది...కాని నాకు ఈవిడ ఒక ముదురు వెబ్బర్ అని మాత్రమే తెలుసు. మిగితావి ఆవిడనే అడుగుదాం!

కేకాక్షి: పిచ్చమ్మ గారూ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీరు ఏం పని చేస్తూంటారు?

పిచ్చమ్మ: మాది చాల పెద్ద కుటుంబంఅండీ. ఒక అమ్మ నాన్న మరి నేను. పెళ్ళయ్యాక మా ఆయన. ఎవరూ పెద్దగా అయినా చిన్నగా అయినా ఏమీ పని చెయరు. తిని కోర్చుని బోర్ గా అనిపిస్తే టీవీ సీరియల్స్ లాంటివి చూస్తూంటాము.

కేకాక్షి: మీకు చాటింగ్ బ్లాగింగ్ ఎప్పటినుంది అలవాటు? అసలు బ్లాగింగ్ చెయ్యాలని ఎందుకు అనిపించింది?

పిచ్చమ్మ: మా వారు పేకాటకెళ్ళాక అలవాటుగా టీవీ చూద్దాం అని పెడితే తెలుగు ఏంకర్లు అందరూ ఇంగ్లీషులో మాట్లాడేవారే - కొన్నాళ్ళు డిక్షనరీ వాడాను గానీ కష్టంగా అనిపించి టైంపాస్ కోసం నెట్లో చాటింగ్ మొదలుపెట్టా. అక్కడ నా 'మనోభావాలు' మొహమాటం లేకుండా చెప్పటం వల్ల, కుళ్ళుతో యూజర్లు ఇగ్నోర్ చేసేవారు. ఎంత చెత్త వ్రాసినా ఒపిగ్గా చదివి శభాష్ అనేవాళ్ళు బ్లాగుల్లో ఉంటారని తెలిసి పరిగెత్తుకొచ్చేసా!

కేకాక్షి: యువతరానికి ఒక అనుభవమున్న అంతర్జాల సంచారిణిగా మీరిచ్చే సలహా?

పిచ్చమ్మ: నేను సలహాలు ఇచ్చేంత గొప్పదానిని కాను లెండి. కాని అనుభవం తో చెప్తున్నా - ప్రొపైల్ లో ఐశ్వర్యా రాయ్ ఫొటో పెట్టుకోండి - మీకు హిట్లే హిట్లు. అశ్లీలమైన ఫొటో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎవరన్నా ఏమన్నా అంటే ఎం ఎఫ్ హుస్సేన్ కళ్ళజోడు పెట్టుకుని చూడమని చెప్పండి.

మలక్పేట్ రౌడీ (కల్పించుకుంటూ)..... కాని ఆయన్ని విమర్శిస్తే కమ్యూనిష్టులు ఇతర ఉదారవాదులు గొడవ చెయ్యరూ? ఆయన వాళ్ళ దేముడు కదా?

పిచ్చమ్మ: నిజమేనండోయ్. సరే ఆయన విషయం వద్దు గాని ఈ పని చెయ్యండి. ఎవడో ఒక అనామక బూతులరాయుడితో గొడవ పెట్టుకోండి. వాడు కాస్తా మిమ్మల్ని తిట్టిపోస్తాడు. నేరం ఘోరం అంటూ గొడవ చెయ్యండి. స్నేహితులకి చూపించండి. అవసరమయితే బ్లాగు తీసెయ్యండి. మీ అభిమానులు నానా గొడవా చేసాక మళ్ళీ తెరవండి. మీకు హిట్లే హిట్లు. ఉచిత పబ్లిసిటీ. మీరు ఆడ బ్లాగర్ అయితే ఇంకా మంచిది. "అబలలపై అమానుషం" అని ఒక హెడ్ లైన్ కూడా పెట్టుకోవచ్చు!

మలక్పేట్ రౌడీ (మళ్ళీ కల్పించుకుంటూ)..... కాని బ్లాగ్ డిలీట్ చేస్తే మళ్ళీ అన్నీ వ్రాయాలి కదా?

పిచ్చమ్మ: బుఱ్ఱతక్కువ రౌడీ గారూ - డిలీట్ ఎవరు చెయ్యమన్నారు? పర్మిషన్ "సెలక్టెడ్ యూజర్స్" కి మాత్రమే ఇచ్చి ఆ లిస్టు ఖాళీగా ఉంచితే సరి. డేటా పోదు, బ్లాగు ఓపెన్ అవ్వదు. మీరు డిలీట్ చేశారని అందరూ అనుకుంటారు. ఇక సానుభూతే సానుభూతి !

మలక్పేట్ రౌడీ: ..... అమ్మో - పిచ్చమ్మ రాజకీయం !!!!! ఎప్పటిదో బాల్ ఠాకరే గారి రాజీనామా డ్రామా గుర్తొస్తోంది.

పిచ్చమ్మ: నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా! తెలుగుపీపుల్ డాట్ కాం సైట్ లో ఎడ్మిన్ తో మీరు గొడవపడి "నేనింక ఇక్కడికి రాను" అని ప్రతిజ్ణ చేసినప్పుడు మీ స్నేహితులందరూ గొడవచేసి పంతం నెగ్గిచ్చుకోలేదా? అది రాజకీయమని మీరే ఒప్పుకున్నారుగా?

మలక్పేట్ రౌడీ: ష్ ష్ ష్

పిచ్చమ్మ: అదే మరి! చివరికి ఆ ఎడ్మిన్ మీ క్లోస్ ఫ్రెండ్ అని తెలిశాక మింగలేక కక్కలేక మిరు పడ్డ అవస్త చూస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. తెలియక చేసింది కాబట్టి వ్యక్తిగతంగా గొడవ జరగలేదు - అది వేరే సంగతి!

కేకాక్షి: సరే సరే! ... మీకు నచ్చిన బ్లాగు

పిచ్చమ్మ: నాదే. ఏది పడితే అది బరుక్కోవచ్చు. ఏవరైనా విమర్శిస్తే ఆ కామెంటు తీసెయ్యచ్చు. నా భజనపరుల చేత వారిని తిట్టించచ్చు. లేకపోతే నా పోస్టు నేనే తీసేసుకుని ఎవరో కుళ్ళుమోతు కొండముచ్చు నా పోస్టులు టెంప్లేటులు తీసేసాడని గొడవ చెయ్యచ్చు - ఇంకా చాలా చాలా ..

కేకాక్షి: ఎవరయినా మీ బ్లాగ్ కి వచ్చి మీ రచనలు చెత్త, కాపీ అంటే ఎలా రియాక్టౌతారు?

పిచ్చమ్మ: నేనేమీ రియాక్ట్ అవ్వనండీ. కానీ ఆ మాట అన్నవాడు బ్లాగ్లోకం లో మిగలడు

కేకాక్షి: మీ ఆయన మరో మగవాడిని ఇంటికి తీసుకొచ్చి ప్రేమిస్తున్నాను అంటే మీరేమంటారు?

పిచ్చమ్మ: ఏమంటాను? ఏమీ అనను - పాత మనోజ్ కుమార్ పాట ఒకటి ప్లే చేస్తాను -

"బస్ యహీ అప్రాధ్ మై( హర్ బార్ కర్తా హూ (
ఆద్మీ హు ( ఆద్మీ సే ప్యార్ కర్తా హూ ("


కేకాక్షి: ఇప్పుడు ఇంటర్వ్యూ లో ట్విస్ట్. మిగతా రెండు ప్రశ్నలూ రౌడీ గారికి!

మలక్పేట్ రౌడీ: ఇది అన్యాయం అక్రమం. నా బ్లాగు మూసేస్తా. నా టెంప్లేట్ మీరే మార్చారని గొడవ చేస్తా!

కేకాక్షి: ఆ పప్పులేం ఉడకవుగానీ ... శ్రద్ధగా వినండి

మలక్పేట్ రౌడీ: హతోస్మి!

కేకాక్షి: ఇదొక సమస్యాపూరణం

మలక్పేట్ రౌడీ: అమ్మో నా వల్ల కాదు!

కేకాక్షి: మరి మీ అమ్మగారు భోజరాజీయం లో పీ హెచ్ డీ, గోల్డ్ మెడల్ అని తెలుగుపీపుల్ డాట్ కాం లో మీరే గొప్పగా చెప్పుకున్నారుగా?

మలక్పేట్ రౌడీ: "పండితపుత్ర" సామెత వినలేదా? ఇప్పటికీ మా అమ్మ అంటుంది "ఒరేయ్! నువ్వు నన్ను పండితురాలిని చేశావురా!" అని ..

కేకాక్షి: (స్వగతం): కుళ్ళిందిలే - జోకు!

మలక్పేట్ రౌడీ: ఏమిటీ సణుక్కొంటున్నారు?

కేకాక్షి: అబ్బే ఏమీ లేదు - జోకు పేలింది అనుకుంటున్నా - అంతే! అంతే!!

సరే సమస్యకొద్దాం - మీకు నాలుగవ పాదం ఇస్తున్నా. పద్యం ఛందోబధ్ధంగా ఉండనక్కరలేదు - వినండి ..

"రవిగారి కరమున జ్యోతి భగభగ మండెన్"


మలక్పేట్ రౌడీ: ఏంటండోయ్ - ఈ బ్లాగులసీమ ఫేక్షన్ / ముఠా తగాదాల్లో నన్ను ఇరికిస్తున్నారా? నేనొప్పుకోను!

కేకాక్షి: అబ్బే! లేదు లేదు ... తెలుగు బ్లాగులతో సంబంధం లేకుండా చెప్పాలి!

మలక్పేట్ రౌడీ: అయితే ఓకే!! వినండి!!!

"అరవిందుడు వెలిగించిన దీపంబును
వచ్చి గాలి కదిలింపంగా
పడిపోయెను వత్తి భా
రవిగారి కరమున జ్యోతి భగభగ మండెన్"


(అల్లు అరవింద్ ఏదో సభలో దీపం వెలిగిస్తే అది గాలివాటుకు ప్రక్కనే ఉన్న భాస్కరభట్ల రవికుమార్ (భారవి) గారి చేతిలో పడింది అని భావము)

కేకాక్షి: ఈ బ్లాగవతం మీద ఒక పేరడీ ప్లీజ్!

మలక్పేట్ రౌడీ: (టక్కరి దొంగ - "నలుగురికి నచ్చినది" పాటకి అనుగుణం గా)

నలుగురికి నచ్చిన బ్లాగ్ నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ చూడని బ్లాగ్ - ఆ బ్లాగ్నే నే వ్రాసెదరో

చదవవా దాన్నోరన్నో - అది నీ దురద్రుష్టం
చెత్తని నువ్వనుకున్నా - నా బ్లాగది నా ఇష్టం!!

బ్లాగర్లందరూ ఒకవైపూ రౌడీ ఒకవైపూ
మీరు అందరూ ఒక టైపూ - నేనింకొక టైపు!!

--------------------

నీ బ్లాగులో నువ్వు వ్రాయటం నథింగ్ స్పెషల్
అందరి బ్లాగులూ కెలికి రావడం సంథింగ్ స్పెషల్ ...

నువ్వు ఎవరికో మెయిలు ఇవ్వడం నథింగ్ స్పెషల్
అందరి మెయిల్సూ నువ్వు చదవడం సంథింగ్ స్పెషల్ ...

కాగడాని చూసి బ్లాగు ముయ్యటం నథింగ్ స్పెషల్
కాగడాని చూసి బ్లాగు ముయ్యటం నథింగ్ స్పెషల్
నిన్ను చూసి తను డోక్కోవడం సంథింగ్ స్పెషల్!!!!!!!!! ...

నలుగురికి నచ్చిన బ్లాగ్ నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ చూడని బ్లాగ్ - ఆ బ్లాగ్నే నే వ్రాసెదరో


మలక్పేట్ రౌడీ మరియు కేకాక్షి: పిచ్చమ్మ గారూ - ఇంక మీ కుర్చీ కింద పెట్టిన కుంపట్లో బొగ్గులు చల్లబడ్డాయి. ఈ హాట్ సీట్ కూల్ గా మారకముందే మనమీ కార్యక్రమం ముగిద్దాం. మీ అమూల్యమైన బ్లాగ్ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు!

పిచ్చమ్మ: నాకిలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలండీ!

మలక్పేట్ రౌడీ మరియు కేకాక్షి:

శ్రోతల్లారా, పాఠకులారా, దిగాలు పడ్డ బ్లాగరులారా
పదండి ముందుకు పదండి త్రోసుకు
పోదాం పోదాం తరువాయి ఇంటర్వ్యూకి
కానీ ఆగాలి అందరం వచ్చేవారం దాకా!