Jan 11, 2013

మూర్తీభవించిన ఛాందసవాదం - మదర్ థెరిస్సా



20వ శతాబ్దపు క్రిస్టియన్ ఆధ్యాత్మిక ప్రపంచంలో సాక్ష్యాత్తు దేవదూతగా అభిమానించబడ్డ కొందరిలో మదర్ థెరిస్సా ఒకరు. పలు 'అధికారిక' జీవితచరిత్రల ప్రకారం ఆవిడ "ప్రార్ధించే చేతులు కన్నా సేవ చేసే చేతులు మిన్న" అంటూ తన జీవితాన్ని కలకత్తా మురికివాడలకు అంకితం చేసిన మహోన్నతవ్యక్తి. కేవలం దేవుడి సంకల్పాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశ్యం తప్ప వేరే ఏ ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధంగా పేదలకు, రోగులకు సేవలు చేస్తూండేది. ఎన్నో కోట్ల మంది ప్రజలకు అభిమానపాత్రురాలు, ఆరాధ్యదైవంఎంతోమంది పవర్ఫుల్ నాయకులకి, సెలబ్రిటీస్‌కి స్నేహితురాలిగా, ఆధ్యాత్మక సలహాదారుగా వ్యవహరిస్తూవుండేది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సంఘసేవకులకి, సేవాతత్పరులకి స్పూర్తిని కలిగించిన నాయకురాలు. పేదల అభ్యున్నతికి చేసిన అంతులేని కృషికి గాను నోబెల్ శాంతి బహుమతితో పాటు  ఎన్నో గొప్పగొప్ప అవార్డులు, గౌరవాలు పొందిన వ్యక్తి. ఇది మనందరికి తెలిసిన స్టొరీ. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్ మీడియా అంతగా అందుబాటులో లేని ఆరోజుల్లో ఒక వర్గం కనుసన్నల్లో నడిచే మీడియా " 'తెల్ల'నివన్నీ పాలే" మనకి చెప్పిన చరిత్ర. 

అదే ప్రఖ్యాత జర్నలిస్ట్ మరియు రచయత క్రిస్టోఫర్ హిచ్చేన్స్ మాటల్లో చెప్పాలంటే  Mother Teresa, or Agnes Gonxha Bojaxhui as was her birth name, “was a fraud, fanatic and fundamentalist

ఇదేంటి ఈయనకేమోచ్చింది పాపం అంతటి మహోన్నతవ్యక్తి మీద ఇలా నోరు పారేసుకోవడానికి అని అవాక్కయ్యారా.. మరి ఇలా మాట్లాడే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చాలామందే ఉన్నారు. మదర్ థెరిస్సా చివరి రోజుల్లో కొందరు ధైర్యవంతులయిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్లుసోషల్ వర్కర్లుమదర్ థెరిస్సా వింతపోకడలకు విసుగుచెందిన ఆవిడ అసిస్టెంట్లు అనేక చీకటి నిజాలు వెలికి తీసినా అవి పంచుకోవడానికి ఇంటర్నెట్ లాంటి స్వేఛ్చావేదిక లేకపోవడం , ఆ నిజాలేవి మిగతా ప్రపంచంకి  తెలిసే అవకాశం దొరకలేదు. యూ ట్యూబ్, బ్లాగులు లాంటి వేదికలు అందుబాటులోకి వచ్చాక ఈవిడ భజనపరులు తెలివిగా నొక్కిపెట్టిన అనేక దుర్మార్గాలు ఒక్కోటి బయటకు వచ్చాయి, వస్తున్నాయి.  

డబ్బులిస్తే క్రిమినల్స్ అయినా స్నేహితులులే - తన మతం వారయితే టెర్రరిస్టులు అయినా హితులే: 

ప్రజాస్వామ్యహక్కులు కాలరాసి గద్దెనెక్కిన అనేకమంది నియంతలకి, క్రిమినల్స్‌కి, సంఘవ్యతిరేక శక్తులకి మదర్ థెరిస్సా మంచి స్నేహితురాలు. హైతీ అనే దేశాన్ని అనేక సంవత్సరాల పాటు అడ్డంగా దోచుకుతిని ఆఖరికి ప్రజల తిరుగుబాటుతో  దేశం విడిచి పారిపోయిన Duvalier దంపతులు ఈవిడకు దోస్తులు. వీరిని పేదల పెన్నిధిగా ఆకాశానికి ఎత్తుతూ మదర్ థెరిస్సా ఇచ్చిన స్టేట్మెంట్లు అనేక నెలల పాటు హైతీ టీవీలను మారు మోగించాయి.  కమ్యూనిస్టు నియంత ఎన్వేర్ నుండి లక్షల మందిని ఊచకోత కోసిన నికరాగువా క్రిస్టియన్ టెర్రరిస్ట్ గ్రూప్ వరకు అనేక మందితో ఈవిడ క్రిమినల్ స్నేహితుల లిస్టు చాలా పెద్దదే. వీళ్ళందరూ ఎలా ఉన్నా ఈవిడ బెస్ట్ ఫ్రెండ్ ఒకరి గురించి మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అమెరికాలో చార్లెస్ కీటింగ్ అని  ఒక క్రిస్టియన్ ఫండమెంటలిస్టు ఒకడుండేవాడు. వీడు మొదట్లో పోర్నోగ్రఫికి వ్యతిరేకంగా ప్రచారం చేసే సంఘసంస్కర్తగా పాపులర్ అయినా.. తరువాత అనేకమంది అమాయక ప్రజలు జీవితాంతం కూడబెట్టుకున్న లైఫ్ సేవింగ్స్ సొమ్మును అనేక స్కాముల ద్వారా దోచుకున్న వీడి అసలు భండారం నెమ్మదిగా బయటపడింది. అయితే వీడు ఇలా దోచుకున్న దొంగసొమ్ములొ 1.25 మిలియన్ డాలర్లు మదర్ థెరిస్సాకి విరాళంగా ఇచ్చాడు. వీడి చీటింగ్ కేసు కోర్టులో విచారణ జరుగుతుండగా మదర్ థెరిస్సా ఆ జడ్జికి "మీ స్థానంలో జీసస్ ఉంటే  అతన్ని ఖచ్చితంగా క్షమించేవాడు మీరు అలానే క్షమించండి " అని ఒక ఉత్తరం రాసిందట. దానికి ఆ కేసు వాదిస్తున్న ప్రాసిక్యూటింగ్ లాయర్ ఆవిడకు విరాళం ఇచ్చిన డబ్బు ఎంతమంది కడుపు కొట్టి దోచుకుందో వివరిస్తూ , ఏ చర్చి ఇటువంటి చర్యలను ప్రోత్సహించరాదని, ఆవిడ తీసుకున్న విరాళం తిరిగి ఇస్తే బాధితులకు కొంతయినా న్యాయం చేకూరుతుంది అని తిరుగు టపా రాసాడట. మళ్ళీ మాట్లాడితే ఆ డబ్బు ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుందో అని  ఆవిడ మళ్ళీ ఎక్కడా నోరేత్తలేదట (డబ్బు తిరిగి ఇవ్వలేదు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా !).

క్షమించేద్దాం రండి (నాకేం పోయింది)
డిసెంబర్ 3, 1984 ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటయిన భోపాల్ గ్యాస్ లీక్ ఉదంతంతో దేశం మొత్తం అంతులేని విషాదంలో మునిగిపోయింది. దాదాపు పదివేలమంది ప్రాణాలు హరించి, ఆరు లక్షల మందిని శాశ్వత వికలాంగులను చేసిన ఈ సంఘటన కేవలం ప్రమాదం కాదని యాజమాన్య నిర్లక్ష్యం కూడా ఒక ప్రధాన కారణం అని తరువాత దర్యాప్తులో తేలింది. ఇంతమంది అమాయక ప్రాణాలు రాత్రికిరాత్రి గాల్లో కలిసిపోవడానికి కారణమయిన దోషులను సింపిల్‌గా "క్షమించమని" స్టేట్మెంట్ ఇచ్చేసింది మన మదర్-టి. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది విన్న టీవి విలేఖరి తను విన్నది నమ్మలేక మళ్ళీ మళ్ళీ అడిగాడట.  ఇక ఎటువంటి తప్పు చేసినవారినయిన ఆవిడ నమ్మిన ప్రభువులా క్షమించడం ఈవిడ దాయాగుణంకి, గొప్పతనానికి ప్రతీక అని కొన్ని మీడియా వర్గాలు బాగానే బాకా ఉదాయి. ప్రపంచంలో అందరూ ఈవిడలా అతి మంచి వాళ్ళయిపోయి ఎవర్ని పడితే వాళ్ళని  క్షమించే గుణం వచ్చేస్తే అసలు ఈ కోర్టులు, కేసులు, పోలీసులు, మిలటరీ అంటూ ఈ దండగ ఖర్చులు అనవసరం కదా .. ఇక్కడ గమనించాల్సిన ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.... ప్రమాదానానికి కారణమయిన కంపెని అమెరికన్ కంపెనీ కాబట్టి  చొక్కాలు చించుకుని పరిగెత్తిన  కమ్యూనిస్టు కుక్కా ఆ నేరస్తులని బహిరంగంగా వెనకేసుకొచ్చిన ఈవిడ మీద మాత్రం మొరగలేదు. ఇక వీళ్ళ దేశభక్తీ గురించి మళ్ళీ మళ్ళీ ఎందుకులెండి. 

ఆడవాళ్ళు - పిల్లల్ని కనే యంత్రాలు: 

ఇక మదర్ థెరిస్సా కి ఆడవాళ్ళు అంటే ఇలాంటి అభిప్రాయాలు ఉండేవంటే... ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని  దేవుని సేవలో తరించాలి, ఆడవాళ్ళు అంటే పిలల్ని కనే యంత్రాలు. ప్రాణం పోయే పరిస్తితి ఉన్నాసరే అబార్షన్ లాంటి పాపాల జోలికి పోకూడదు. గర్భనిరోధక పద్దతులు అంటే దేవునికి ద్రోహం చెయ్యడమే. ఒకానొక ఇంటర్వ్యులో ఒక విలేఖరి "మీరు చాలా రోజులనుండి కలకత్తా మురికివాడతో సహా భారతదేశంలో అనేక ప్రాంతాలు పరిశీలించి ఉన్నారు.. అక్కడెక్కడా పేదరికానికి అధిక సంతానానికి మద్య ఉన్న రిలేషన్ మీకు కనిపించలేదా " అని అడిగినప్పుడు ఈవిడ "లేదు.. అధిక సంతానానికి, పేదరికానికి సంభందం లేదు.. పిల్లల్ని పుట్టించిన దేవుడు వాళ్లకి తిండి కూడా పెడతాడు, వాళ్ళ బాగోగులు ఆయనే చూసుకుంటాడు.. మనం దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు" అని చెప్పిందట. ఎంతమంది పేదప్రజలు అంటే అంతమందిని మతం మార్చొచ్చు కదా!. ఇలాంటి కరుడుకట్టిన ఛాందసవాదభావాలు అనేకం అనేకం ఆవిడ దగ్గర పుష్కలంగా ఉండేవి. నోబెల్ శాంతి ప్రైజ్ అందుకోనేటపుడు ఇచ్చిన ప్రసంగంలో కూడా ప్రపంచ శాంతికి ఎకైక ముప్పు అబార్షన్ వల్ల మాత్రమే అని, అందువల్ల అన్ని దేశాలు అబార్శన్లను నిషేదించాలని కోరింది. ఈవిడ ప్రచార ప్రభావంతో అబార్షన్ బ్యాన్ చేసిన ఐర్లాండ్ మొన్న అక్టోబర్లో జరిగిన  సవిత సంఘటనతో నిభందనలు మార్చడానికి ఉపక్రమించింది. ఎయిడ్స్ వ్యాధి ప్రభలంగా ఉన్న ఆఫ్రికన్ దేశాల్లో దేవుడి పేరుతొ కండోంలకు వ్యతిరేకంగా ప్రచారంచేసి ఎంతమంది ఎయిడ్స్ బారినపడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యిందో ఆ ప్రభువుకే ఎరుక.

హౌస్ ఆఫ్ హర్రర్స్ : 

హోం ఫర్ డైయింగ్ అని పిలుచుకునే ఈవిడ డెత్ క్యాంపుల్లో ఉన్న పరిస్తితులు చూసి షాక్ తిన్న Louden లాంటి వాలంటీర్లు, రాబిన్ ఫాక్స్ లాంటి వెస్టర్న్ డాక్టర్ల మాటల్లో చెప్పాలంటే... "మహా ఘోరం, పచ్చి మోసం". అక్కడ చేరిన కాదు కాదు ..... చేర్చబడ్డ వాళ్ళ రోగం ఏమిటో, ఉన్నవ్యాధి ఏ స్టేజిలో ఉందో, రోగికి ఉన్న వ్యాధి తగ్గించగలిగేదో , తగ్గించలేనిదో తెలుసుకునే నాలెడ్జి ఆ క్లీనిక్లలో పనిచేసేవారికి లేదు, తెలుసుకోవడానికి ఏవిధమయిన ఆధునిక మెడికల్ పరికరాలు ఉండవుడయాగ్నోజ్ చెయ్యడానికి ఏవిధమయిన టెస్టులు చెయ్యబడవు. శేషజీవితం అక్కడే గడపడానికి వచ్చిన రోగులకు పేరే ఉండదు. అందరిని జైల్లో ఖైదీలలా నెంబర్లతోనే రిఫర్ చేస్తారు. కాన్సర్ తో చనిపోతున్నా, భరించలేని బాధ పడుతున్నా ఆస్పిరిన్ తప్ప వేరే ఏవిధమయిన పెయిన్ కిల్లర్స్ ఇవ్వబడవు. ఎందుకంటే నొప్పిని ఓర్చుకోవడం అంటే ప్రభువుకి దగ్గరవ్వడం అని ఆవిడ నమ్మకం. ఒకసారి Louden అనే వాలంటీరు ఈ డెత్ క్యాంపు విజిట్ చేసినప్పుడు, అక్కడ వాడిన ఇంజక్షన్ సిరంజీలు స్టెరిలైజ్ చెయ్యకుండా కుళాయి నీళ్ళతొ కడిగేసి మళ్ళీ వేరేవాళ్ళకి ఉపయోగించడం చూసి అదేంటని అడిగితే .. "వాళ్ళు ఎలాగూ చనిపోతున్నవారు .. స్టెరిలైజ్  చెయ్యడానికి చెయ్యకపోవడానికి ఏంటి తేడా " అని సమాధానం వచ్చిందట. హౌస్ అఫ్ హర్రర్ అనిపించేలా రోగులను జంతువులలా గొలుసులతో కట్టివేయ్యడంకరెంట్ షాక్లు ఇవ్వడం , జ్వరంతో ఉన్నా చన్నీళ్ళ స్నానం అక్కడ సర్వసాధారణం. ఎంత బాధ అనుభవిస్తే అంత దేవుడికి దగ్గరయినట్టు అన్న మూఢనమ్మకం బలంగా మనసులో నాటుకుపోవడం వల్ల ఇంత క్రూరంగా ప్రవర్తించి ఉండొచ్చు అని కొందరి అభిప్రాయం.  

హిపోక్రసీ కాదు పచ్చి మోసం :

ఇక్కడో గమ్మత్తయిన ట్విస్టు ఉంది.  తన డెత్ క్యాంపుల్లో ఉన్న రోగులకి మందులు నిరాకరించి , సఫర్ అవ్వడం అంటే దేవుడికి ఇష్టం అని, అందువల్ల నొప్పి ఓర్చుకోవాలి అని, అన్ని దేవుడే చూసుకుంటాడు, పుట్టించినవాడికి బ్రతికించడం తెలుసు అని .... ఇలాంటి అనేకనేక మూర్ఖత్వచర్యలతో అనేకమంది పేదలని హింసించి చంపిన ఈవిడ .... తనకి వచ్చిన గుండెజబ్బు నయం చేయించుకోవడానికి న్యూయార్క్ లోని ప్రపంచంలోనే అత్యుత్తమ హాస్పిటల్‌కి పరిగెత్తింది. అది కూడా అదే పేదలను చూపించి అడుక్కున్న విరాళాలతో. ఎంత హిపోక్రసి? ఎంత దగా ..  మనం ఒక విషయం సరిగ్గా గమనిస్తే ఈ హిపోక్రసి ఆవిడకి ఎక్కడినుండి వచ్చిందో తెలుస్తుంది చూడండి... ప్రస్తుత పొపాయిన మొన్నమధ్య ' సంతానలేమితో బాధపడుతున్నవారికి ఆశాదీపమయిన ఐవిఎఫ్, ఇస్కి లాంటి కృత్రిమ గర్భదారణ పద్దతుల' మీద ఇదే విధంగా నోరు పారేసుకున్నాడు. సంతానం అనేది దేవుడి అనుగ్రహంతో సహజంగా  పొందాలి తప్పించి ఇలాంటి కృతిమ పద్దతులలో పిల్లల కోసం ప్రయత్నించడం తప్పు అట. ఇక్కడ వరకూ మాత్రమే అని ఉంటే అది అతని పర్సనల్ అభిప్రాయం అని వదిలేయోచ్చు. ఈ కృత్రిమపద్దతుల మీద రిసెర్చ్లు చేపట్టకూడదని, అలాంటి ఆపరేషన్స్ చెయ్యకూడదని శాస్త్రజ్ఞులకి,డాక్టర్లకి దేవుడి తరపున పిలుపు నిచ్చాడు. ఓహో అంతా సహజంగానే పొందాలి కదా అయితే మరి దేవుడితో డైరెక్ట్‌గా మాట్లాడే ఈ మహానుబావుడికి బుల్లెట్ ప్రూఫు వాహనం ఎందుకుట. భయమా? అతన్ని కాపాడతాడని అతని దేవుడి మీదే నమ్మకం లేదా? అన్ని దేవుడు ఇచ్చిందే తీసుకోమనే ఈయనకి కృతిమంగా గుండెలో వాల్వులు ట్యూబ్ లు ఎందుకు? పవిత్రమయిన గుండెనిచ్చిన ప్రభువు ఆ గుండెను కాపాడడా? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా... 




అంతా పేదలకోసమే .. పెద్ద జోకు: 

ఇక అసలు పాయింటు కి వద్దాం. ఈ క్లీనిక్, హౌస్ అఫ్ డెత్, మురికివాడల్లో తిరగడాలు ఇవన్నీ పేదలకు సహాయం చెయ్యడానికా, వారికి దైర్యాన్ని ఓదార్పుని అందించడానికా, వారికి అండదండగా ఉంటూ మెరుగైన వైద్య సహాయమో, విద్య అందించడానికా.. దేనికి? ఇన్నాళ్ళు మనకి ఊదరకోట్టింది అయితే పైవన్నిటికూను. ఓకే ఇప్పుడు కొంచెం వివరాలులోకి వెళితే .. ఈ సేవా కార్యక్రమాలు, క్లినిక్లు వగైరా చూపించి మథర్ థెరిస్సా రమారమి 50 మిలియన్ డాలర్లు (ద్రవ్యోల్భణం లెక్కలు చూసుకుంటే ఈ రోజు వాల్యూ కొన్ని వందల కోట్ల రూపాయలు) విరాళాలుగా సేకరించింది అని అంచనా. అంత డబ్బు ఉంటే నాలుగైదు మల్టీ స్పెషాలిటి ఆసుపత్రులు కట్టేయొచ్చు కదా మరి ఇలా కనీస సౌకర్యాలు లేని క్లీనిక్ లు ఏంటి,  నిపుణులు, అత్యాధునిక వైద్య పరికరాలు ఎందుకు లేవు , డబ్బు అంతా ఏమయింది ? ఆశ్చర్యం కదా... ఆ డబ్బు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వందకు పైగా కాన్వెంట్లు నెలకొల్పడానికి వాడబడింది అన్నమాట. ఓహో పర్లేదులే కనీసం అవి మంచి విద్య అందించడానికి అయినా ఉపయోగపడ్డాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇక్కడ కాన్వెంట్లు అంటే విద్య అందించే స్కూళ్ళు కాదు అమాయక ఆడపిల్లలను నన్‌లగా మార్చే కన్వేర్షన్ పరిశ్రమలు. పేదల అవసరాలను అదనుగా తీసుకుని డబ్బో ఇంకోటో అశ పెట్టి మతం మార్చే దౌర్భాగ్యపు చర్యలు ఈవిడతోనే మొదలయ్యాయి అని చెప్పలేం కానీ ఈవిడది  మాత్రం అందవేసిన చేయి అని చెప్పవచ్చు. ఈవిడ దగ్గర పనిచేసిన మాజీ వాలంటీర్లు చెప్పినదాని ప్రకారం అవి క్లీనిక్లు కాదు మిషనరీ ఫ్యాక్టరీలు. చావు బ్రతుకుల మద్య ఉన్నవారికి, వాళ్లకి ఎం జరుగుతుందో తెలీని స్తితిలో ఉన్నవారికి, తెలిసినా రెసిస్ట్ చేసే స్తితిలో లేని వారికి వాళ్ళ అనుమతితో పని లేకుండా .. చావు అంచున ఉన్నవాళ్ళు అందరూ తన ఆస్తి అన్నట్టు వాళ్లకి సీక్రేట్ గా బాప్టైజ్  చేయించడం ఈవిడ దిన చర్య. ఒక మాజీ వాలంటీరు సుజాస్ షీల్డ్స్ మాటల్లో అయితే "ఈ సీక్రసీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మదర్ థెరిస్సా  సిస్టర్లు అనేకమంది హిందూ ముస్లిం ప్రజల్ని కన్వర్ట్ చేస్తున్నారు అని బయట ప్రపంచానికి తెలీకూడదు అని థెరిస్సా మరీ మరీ చెప్పేదట". ఇదంతా ఎంత పెద్ద ప్లాన్ ప్రకారం నడిచేదంటే .. ఒక ప్రఖ్యాతిగాంచిన హిందూ దేవుడి గుడి పక్కన ఉన్న ఇంకో పాత హిందూ దేవుడి గుడిని నిర్మల్ హృదయ్ అనే మిషనరీ క్లినిక్ గా మార్చింది. ఇంత బరితెగించిన  చర్యలు మన దేశంలో తప్ప ఇంకెక్కడా జరగవేమో. 

నరకం అంటూ ఉంటే ...  

సెయింట్ హుడ్ సాధించడమే పరమావధిగా భావించి అందుకోసం వాటికన్ పెద్దలని ప్రసన్నం చేసుకోవడానికి క్రిస్టియన్ చాంధసవాద ఎజెండాని ప్రపంచం మీద రుద్దిన పరమమూర్ఖురాలు. ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు చనిపోతున్నా కండోంలు వాడకూడదని, తల్లి ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా అబార్షన్లు చెయ్యకూడదు అని , రోగాలోచ్చినా రోచ్చులోచ్చినా తను తప్ప మిగతావారు అందరు నవ్వుతూ  ఓర్చుకొవాలి అని ఇలా ఇన్ని దరిద్రగొట్టు భావాలు ప్రపంచం మీద రుద్దడానికి తన జీవితం అంకితం చేసిన ఈవిడలో అసలు ఏమి చూసి నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఎవరికీ ఎప్పటికి అర్ధం కాని ప్రశ్న. “I think the world is being much helped by the suffering of the poor people” అన్న మదర్ థెరిస్సా పబ్లిక్  స్టేట్మెంట్‌ని చర్చి సమర్ధిస్తుందా.  కొన్ని ఇంగ్లీష్ బ్లాగుల్లో ఈవిడ చీకటి ఎజెండాను ఎండగడుతూ చీల్చి చెండాడినప్పుడు కింద కొన్ని కామెంట్లు చూసాను.. ఆవిడ ఎంత బొక్కినా కనీసం పేదలకు ఎంతో  కొంత చేసింది కదా అని. అమాయక అమ్మాయిలను ఏదోరకంగా బ్రెయిన్ వాష్ చేసి నన్‌లుగా మార్చే  కాన్వెంట్లు ఒక వంద స్తాపించడం, ఎంత పెద్ద నేరస్తులయినా క్షమించేయమని చెప్పడం, సఫరింగ్ నే స్వర్గానికి మొదటిమెట్టు అనుకోమని భోధించడమే ఆవిడ సమాజానికి చేసిన సేవ అనుకుంటే తప్ప ఈవిడ ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి చేసింది ఏమీ లేదు.

ఈవిడ చేసింది అనిచేప్పే సేవ బోగస్, పేదలను వాళ్ళ కష్టాలను చూపించి కోట్లకు కోట్లు విరాళాలుగా సేకరించి వాటికన్‌కి దోచిపెట్టిన పెద్ద ఫ్రాడ్. అడుగుపెట్టిన దేశాన్నల్లా క్రిస్టియానిటికి కన్వర్ట్ చెయ్యడమే ఆవిడకి ఆశయం. నొప్పి, వేదనలతో బాధపడుతూ చనిపోతున్నవాళ్ళను చూడటానికి అడిక్ట్ అయిన ఇలాంటి రిలీజియస్ సాడిస్ట్ ఏ విధమయిన గౌరవానికి అర్హురాలు కాదు. 

She has the pain, suffering and blood of countless people on her hands. If there is a hell, I would hope she was enjoying its luxuries well. 


కొసమెరుపు : 
'దేవుడి పేరుతో విరాళాలు కలెక్ట్ చేసి వాటిని పేదలకి హాస్పిటళ్ళు, స్కూళ్ళు కట్టడానికి ఉపయోగించిన' సత్య సాయిబాబా మీద విమర్శలతో విరుచుకుపడ్డ వాళ్ళలో ఎందరు 'పేదలకి హాస్పిటళ్ళు , స్కూళ్ళు కట్టిస్తా అని కలెక్ట్ చేసిన విరాళాలతో చర్చిలు, కాన్వెంట్లు కట్టించివాళ్ళ' గురించి మాట్లాడతారు ? మనవన్నీ సిగ్గులేని సూడో సెక్యులర్ బ్రతుకులు కదా అంటారా .. ఓకే :-) 


42 comments:

  1. సెహభాష్..!!
    ఇప్పుడొస్తారు చూడండి మీమీదకి ;ఇవన్నీ ఒట్టిమాటలంటారు, సాక్ష్యాలు చెల్లవంటారు, అబధ్ధపు ప్రచారాలంటారు ఇంకా ఇంకా..
    అమ్మ అమ్మే అంటారు, చూడాలి కామిడీ గాళ్ళెంతమంది చిందులు తొక్కుతారో...!!

    ReplyDelete
  2. 'దేవుడి పేరుతో విరాళాలు కలెక్ట్ చేసి వాటిని పేదలకి హాస్పిటళ్ళు, స్కూళ్ళు కట్టడానికి ఉపయోగించిన' సత్య సాయిబాబా మీద విమర్శలతో విరుచుకుపడ్డ వాళ్ళలో ఎందరు 'పేదలకి హాస్పిటళ్ళు , స్కూళ్ళు కట్టిస్తా అని కలెక్ట్ చేసిన విరాళాలతో చర్చిలు, కాన్వెంట్లు కట్టించివాళ్ళ' గురించి మాట్లాడతారు ? మనవన్నీ సిగ్గులేని సూడో సెక్యులర్ బ్రతుకులు కదా అంటారా .. ఓకే :-) -----very well very well said....!!!

    ReplyDelete
  3. అన్యాయం జరిగినప్పుడు మదర్ థెరీసా అయినా సత్య సాయిబాబా అయినా ఒక్కటే.. ఎవరికీ మినహాయింపు లేదు.

    ReplyDelete
    Replies
    1. You are right. కానీ కొన్ని అన్యాయాలుగా కనిపించి మరి కొన్ని సూపర్ న్యాయాలుగా కనిపించి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం కూడా న్యాయంగా అనిపిస్తే అదే పెద్ద అన్యాయం కదూ.

      Delete
    2. Noble prize is more political particularly in non-scientific fields. It is well known.

      Delete
    3. How does it matter? End of the day, a noble prize is a noble prize. The next generation will read it as Mother Teresa, a noble prize winner for her noble deeds. How do they get to know the political agenda?, the facts?

      Delete
  4. good information ,which was not known to us.

    ReplyDelete
  5. what to say, you are targeting a saint(?). She is the only person to become sainthood with in five years of her death. All this is to convert countries. తిన్నా జనాలకి చేసింది అనేవాళ్ళు ఆ విషయం సత్యసాయి విషయంలో ఒప్పుకోరు. రాయలసీమలో అధికభాగానికి నీటి సప్లై వారి పుణ్యమా అనే జరుగుతోంది.

    చూద్దాం, ఎలాంటి కామెంట్లు వస్తాయో?

    ReplyDelete
  6. నువ్వు కుమ్మన్న ఎవ్వడొస్తాడు ఊర పందుల వలే,పట్టించుకోనవసరం లేదు వచ్చే ఎదవల్ని....(నీ అనుమతి వచ్చింది అనుకుని ముఖ పుస్తకం లో వేస్తా....ప్లీజ్ ఏమనుకోకే....బ్లాగ్ లింక్ కూడా పొస్ట్ చేస్తా...)Thanks!

    ReplyDelete
  7. నువ్వు కుమ్మన్న ఎవ్వడొస్తాడు ఊర పందుల వలే,పట్టించుకోనవసరం లేదు వచ్చే ఎదవల్ని....నీ అనుమతి వచ్చింది అనుకుని ముఖ పుస్తకం లో వేస్తా....ప్లీజ్ ఏమనుకోకే....బ్లాగ్ లింక్ కూడా పొస్ట్ చేస్తా...Thnks!

    ReplyDelete
  8. some links: http://www.deeshaa.org/category/people/mother-teresa/

    ReplyDelete
  9. "ఎంత బాధ అనుభవిస్తే అంత దేవుడికి దగ్గరయినట్టు అన్న మూఢనమ్మకం బలంగా మనసులో నాటుకుపోవడం వల్ల ఇంత క్రూరంగా ప్రవర్తించి ఉండొచ్చు అని కొందరి అభిప్రాయం. " -- its not మూఢనమ్మకం. Its Christian Theology. They call it Atonement. There is even an extreme Roman catholic cult called Opus Die that believes in harming self in order to enter His Kingdom :)

    ReplyDelete
  10. BJP and RSS are always ready to fight with Muslims, i am not getting they are clam this kind of Christian activities. by the way i agree with you. well said.

    ReplyDelete
    Replies
    1. Dude where did you find the prof of RSS or BJP fighting with Muslims ? they are not fighting with any religion but the false-patriotism ... they are against the people who love pakisthaan while they are native of Hindusthaan .. dont read crapy books published by pseudo-secular bastards and comment like this . They always tell "be patriotic to your own country" .. say Jai Hind .. say Jai Bharath .. say Vande Maaatharam ....that is the only call of RSS or BJP et al ....

      So correct your mind set .. BJP , RSS are not opposing ISLAM .. they are Opposing the intent of Damaging the image of Hindusthan ...If a Hindu does damages to Hindusthaan .. BJP will Oppose to the core as they always to to protect the Image of Vishaala Bhaarath .

      Delete
  11. జెనరల్‌గానే నాకు కలియుగ దేవతలూ, బాబాలూ అంటే బోలెడంత ఇరిటేషన్. మనకు కొన్ని పీఠాలున్నాయి వాటిలో ఉన్న కొంత మంది తాము దేవుళ్ళము అని చెప్పుకోకుండా కేవలం ధర్మ ప్రచారకులం అని చెప్పుకొని ఆధ్యాత్మికతను భోదిస్తూ ఉంటారు. వారు తాము దేవుల్లము అని కాకుండా మన ధర్మం ప్రకారం ఏది మంచిదో చెబుతూ ఉంటారు. వారు చాలు మనకు. ఈ బాబాలూ, వారి మహిమలూ నాక్కొంచెం అతి అనిపిస్తాయి. అందుకే వారి బంఢారం ఎవరు బయట పెట్టినా స్వాగతిస్తా.

    కాకపోతే ఆబంఢారం బయట పెట్టే వారి ప్రవర్తనే చిరాకు తెప్పించేది. వారు మోసాలు జరిగితే దాన్ని బయటపెట్టడం లక్షంగా ఉన్నవారు కాదు. వారి ఎజెండా వేరు. వారికి కొన్ని గోల్సు ఉన్నాయి. వారికి మిగిలిన మతాలంటే వల్లమాలిన ప్రేమ. వాటిలో జరిగే మోసాలనూ, సువార్తల పేరుతో కళ్ళూ, కాళ్ళూ తెప్పించేసే వారి గురించి చిన్న ముక్క మాట్లాడరు. విఙ్ఞానాన్ని పంచడమే తమ లక్షం అని చ్ప్పేవారు, చేప మందు ఎందుకు మంచిది కాదో గొప్పగా ప్రచారం చేస్తారు, కానీ కళ్ళూ కాళ్ళూ వచ్చాయని చెప్పేవాటిలోని నిజా నిజాల గురించి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించరు.

    రెండు అన్యాయాలు జరుగుతున్నప్పుడు, నీ లక్ష్యం అన్యాయాన్ని ఎదిరించడం అయినప్పుడు, కేవలం ఒకదాని గురంచి మాత్రమే మాట్లాడుతూ, ఒక దాన్నే విమర్శిస్తూ పోవడం వివక్షే అవుతుంది. మనకున్న సోకాల్డు ఆదర్శవాదులు ప్ర్జలు ఈవిషయాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదని గ్రహిస్తే వారికే మంచిది.

    ReplyDelete
  12. మంచి సమాచారం. అభినందనలు.

    ReplyDelete
  13. theerigga chadavaalsina post..
    hmm..friday night manchi maththekkinche post.

    ReplyDelete
  14. ఈ విషయం మీకు తెలుసా?

    Peace TV Banned in India
    http://agniveer.com/peace-tv-banned/
    http://agniveer.com/naikexposed/

    ReplyDelete
  15. ఇవన్నీ కూడ మన ఘనత వహించిన మీడియా వారు ఎందుకు చూపించి హోరెత్తెంచటంలేదో మరి. దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటో మరి.

    ReplyDelete
  16. Well said Bhardwaja.

    Every electronic media in India is behind Hinduism. They always pose secular by 'exposing' Hindu babas & self styled gods, albeit, with some truth. What about the other religions? Are we so blind, dumb and deaf to believe that 'all is well' in the other camps?

    Hell with this country leadership and pseudo-secular traits.

    ReplyDelete
    Replies
    1. Have you observed the dress code "imposed" on Female Anchors and News Readers by one Telgu 24 hour news channel

      Delete
  17. Its not me, its Nippu who wrote this, althpugh I totally agree with it :$

    ReplyDelete
  18. "చొక్కాలు చించుకుని పరిగెత్తిన ఏ కమ్యూనిస్టు కుక్కా ఆ నేరస్తులని బహిరంగంగా వెనకేసుకొచ్చిన ఈవిడ మీద మాత్రం మొరగలేదు"

    అమెరికా అని కాకున్నా మతానికి మార్కిస్టులు వ్యతిరేకం కదా, ఎందుకు మొరగలేదు? కమ్యూనిస్టులను కుక్కలతో పోల్చారు, అంటే విశ్వాసపాత్రమైనవారని అర్థమా?

    ReplyDelete
    Replies
    1. Well, you are correct. కుక్కలు విశ్వాసపాత్రమైనవే. నిప్పు రవ్వ ఉద్దేశం పిచ్చి కుక్కలు అయ్యుంటుంది. టైప్ చెయ్యటం మర్చిపోయుంటారు. పిచ్చికుక్కలకి విశ్వాసం ఎక్కడుంటుంది? సొంత యజమానులనే కరుస్తాయి.

      Delete
    2. అమెరికా అని కాకున్నా మతానికి మార్కిస్టులు వ్యతిరేకం కదా, ఎందుకు మొరగలేదు?
      ----------------------------------------------------
      అమెరికా అని కాకున్నా?????? I am sure you are kidding. :)

      మతానికి మార్కిస్టులు వ్యతిరేకం కదా
      --------------------------
      హిందూ మతానికే చాలా వ్యతిరేకులు. కాకుంటే మొరిగేవారే కదా. :)

      Delete
    3. అజ్ఞాత గారు కమ్యూనిస్టులని కుక్కలతొ పొల్చినందుకు చింతిస్తున్నాను. ఖచ్చితంగా అలా వ్రాయకుండా ఉండాల్సింది. ఇప్పుడు సింపుల్ గా సారీ చెప్తే సరిపొతుందా అంటే కాదనుకొండి అయినాసరే తప్పు రాసినప్పుడు దాన్ని ఒప్పుకుని దిద్దుకొవడం నా బాధ్యతగా భావిస్తూ...

      "అఖిలాండ కుక్కకొటికి , నాలాంటి మిగతా జంతు ప్రేమికులకి ఇదే నా అభ్యర్ధన.. క్షమించండి.. ఇంకెప్పుడూ అలా పొల్చను"

      Delete
  19. "ఒక ప్రఖ్యాతిగాంచిన హిందూ దేవుడి గుడి పక్కన ఉన్న ఇంకో పాత హిందూ దేవుడి గుడిని నిర్మల్ హృదయ్ అనే మిషనరీ క్లినిక్ గా మార్చింది."

    ఓ ప్రఖ్యాతిగాంచిన హిందూ దేవుడి గుడి అంటూ పేరు దాచవలసిన అవసరమేమిటి? దుష్ప్రచారం, నీలి వార్తలు కావుగదా.మీ కొసమెరుపు రీజనబుల్.

    ReplyDelete
    Replies
    1. దుష్ప్రచారమూ, నీలి వార్తలా? అంత పెద్ద ఆర్టికల్, అందులో నిజాలు కనిపించలేదు కానీ గుడి పేరు చెప్పకపోవటంతో మీకు వార్త అంతా దుష్ప్రచారంగా కనిపిస్తోందా? :)))

      ఇంతకీ మీ పేరు చెప్తారా? మీ పేరుతో అవసరం ఏం లేదు కానీ ఒకానొక దుష్ప్రచారకుడి మాటలతో సరిపోలుతుంటేనూ, కాంఫర్మేషన్ కోసం. అంతే. :)

      Delete
    2. గుడి పేరు దాచడంలో స్ట్రాటజీ అర్థం కాలేదు. ఆక్రమణకు గురైన మధుర, సోమనాథ, కాశీ కన్నా గొప్పదైన గుడి కాదేమోఎంత పెద్ద ఆర్టికల్ అని కాదు, చిన్నదైనా నిజం ఉప్పు (రాయి) లాంటిది. ఎంతటి అపద్ధపు పాలనైనా పుటుక్కున విరిచేయగలదు. అపద్ధానికి నోరు పెద్దది :)

      నా పేరంటారా? - జ్ఞాత, అజ్ఞాత (నటశేఖర అన్నట్టు -'అగ్ని, జమదగ్ని')

      Delete
    3. నాకు బాండ్, జేమ్స్ బాండ్ అన్నట్టనిపించింది. :))))

      ఆక్రమణకు గురైన మధుర, సోమనాథ, కాశీ కన్నా గొప్పదైన గుడి కాదేమో
      ----------------------------------------------------------------
      మీరన్న మాటల్లోనే, గుడి చిన్నా పెద్దా అని కాదుగా. గుడి గుడే. :)

      చిన్నదైనా నిజం ఉప్పు (రాయి) లాంటిది. ఎంతటి అపద్ధపు పాలనైనా పుటుక్కున విరిచేయగలదు. అపద్ధానికి నోరు పెద్దది :)
      ---------------------------------------------------------------------------------------------------------
      ఇది బాగా చెప్పారు. :) మీ ఉపమానం బావుంది. నిజం నిప్పులాంటిది లాంటి సినిమా సామెత వినీ వినీ విసుగొచ్చింది. ఈ కొత్త సామెతేదో బావుంది. కాల్చే నిప్పు కన్నా విరిచే ఉప్పు నయం. బావుంది. :)

      Delete
  20. అజ్ఞాత, ఇందులొ స్ట్రాటజి కంఫ్యూజన్ ఏం లేవు. సింపుల్‌గా గూగుల్ చేసి ఉంటే మీకే అర్ధం అయ్యేది.. అది కాళీ టెంపుల్ అని.

    ReplyDelete
  21. తెరెసా గురించి చిన్నమాట అన్నా... ఆ వ్యక్తి మొత్తం మానవ జాతికే కళంకం అన్నంత రేంజ్ లో ప్రచారం జరిగింది. ఆవిడ విశ్వరూపం తెలిసినా కళ్ళు మూసుకు కూచున్న లౌకికవాదం మనది. you nailed it in a nutshell.

    ReplyDelete
  22. ప్రజల్ని ఏది చెబితే అది నమ్మే వ్యాసన పరుల్ని చేసి ఆడుకున్నారు ., ఈరోజు అదే జరుగుతోంది , అందరికి తెలుసు కనీ ఎవరూ సాహసం చెయ్యరు , కారణం .... సాయంత్రానికి ఇంటికి వెళ్ళాలి, మన కుటుంబం , మన పిల్లలు , భవిష్యత్తు ......కనీ నేను మాత్రం ఏదో ఒకటి చేస్తాను.. ఇప్పటికే చేశాను...చేస్తాను కూడా..
    www.apappf.org....Giri Prasad Sarma...

    ReplyDelete
  23. What's up, all is going perfectly here and ofcourse every one is sharing information, that's actually
    excellent, keeр up writing.

    mу web blog - Chemietoilette

    ReplyDelete
  24. voka kotta koonam chustunnamu.

    ReplyDelete
  25. good information.

    good writing.
    keep it up!

    ReplyDelete
  26. I got shocked.....! by seeing other side of mother theresa

    ReplyDelete
  27. Teresa Teresaa Teresaaa :)

    ReplyDelete