Apr 30, 2013

సరి'హద్దు ' మీరుతున్న చైనా - నెటిజన్లు జర భద్రం

సరిహద్దు లో చైనా  మరొకసారి దుస్సాహసానికి ఒడిగట్టి అత్యాధునిక ఆయుధాలతో  మన భూభాగం లోకి చొచ్చుకు వస్తున్నట్టు వార్తలు వింటున్నాం.  అందుకే  నెటిజన్లు కాస్త  జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు . "ఎందుకలాగా ?"   అని మీరు  తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాయ శర్మ లా   ఎక్స్ప్రెషన్ ఇచ్చి  అడుగుతారని  నాకు తెల్సు.

అదే మన జనాలు  చైనా  భూభాగం లోకి వెళ్తే చైనీయులు పిట్టల్స్ని కాల్చినట్టు  కలుస్తారని మనకి తెల్సు కానీ వాళ్ళు  పది కిలోమీటర్లు మన  భూభాగం లోకి చొచ్చుకు వచ్చి  గుడారాలు వేసుకుని కూసుంటే చర్చలకి పిలిచాం , ఖండిస్తాం  , నిరశన వ్యక్తం చేస్తాం అనే మాటలు,   దయచేసి  వెనక్కి  వెళ్ళండి  అనే  సందేశాలు  జెండాల  ద్వారా  వారికీ ఇవ్వడం తప్ప  చేసిందేం లేదు .

ఇక మన ప్రభుత్వ పెద్దల  వైఖరికి  వొళ్ళు మండి   ఎవరైనా  ఫేస్బుక్,  ట్విట్టర్ లలో వ్యంగంగా పోస్ట్ వేస్తే ముందర్జన్టుగా  వాళ్ళని అరస్ట్ చేసి కేసులు పెట్టి   ఆగమాగం చేసిందాకా ఊరుకోరు  కాబట్టి నెటిజన్లు  భద్రం :D

9 comments:

  1. మన చైనా దేశ భక్తుల ప్రకారం ముందు మనమే తప్పు చేసాం , అందుకే చైనా అల ప్రవర్తిస్తుంది .
    మనం క్షమాపణ చెప్పి , కాశ్మీర్ ఆపిల్స్ ఇస్తే వెనక్కి వేల్లిపోతారంట .

    ReplyDelete
  2. కానే కాదు చైనా క్యాలెండరు ప్రకారం ఈ నెలలో చైనా వాళ్ళు పక్కింటిని పది అడుగులు ఆక్రమించుకుంటే డ్రాగన్ వారికి మంచి చేస్తుంది అని నమ్ముతారు. ఆ ఫణంగా బోర్డరు లో ఇల్లు ఉండవు కనుక పక్క దేశం లోకి పది కిలోమీటర్లు వచ్చారు. ఆ డ్రాగన్ లూయా వారికీ మంచి చేయుగాక

    ReplyDelete
  3. కమ్యునిస్ట్ కొండయ్యగారు ఇది చదివితే బాధపడతాడు. చైనా వాళ్ళు తిదులు,వారాలు,నక్షత్రాలు అని చైనా క్యాలెండరు నమ్ముతారా? వాళ్లు కమ్యునిజం లో చెప్పినట్లుగా శాస్రీయ పద్దతి లో పనిచేస్తారు. మొదట కొంచెం కొంచెం ఆక్రమించి తరువాత పూర్తి స్థాయి యుద్దానికి దిగుతారు.

    ReplyDelete
  4. కమ్యునిస్ట్ లు కాశ్మీర్ యాపిల్స్ తింటారా ? ఈ యుద్ధం అంతా యాపిల్స్ కోసమేనా ?

    ReplyDelete
  5. ఏరోజునైనా ఒక్క చైనాయే కాదు, ఏ ఇతర దేశమైనా మన మీద ఒంటి కాలి మీద లేచేవే అయినాయి. చివరికి మాల్దీవ్స్ కూడ మన దేశానికి చెందిన ఒక కంపనీ కాంట్రాక్టుని నిర్ధాక్షణ్యంగా తీసి వేసింది.

    కాబట్టి, గొప్పతనమో లేక మరేదైనా ఆ దేశాలలో లేదు. మన దేశ అసమర్ధ విధానంలోనే ఉన్నది. అతిథి దేవోభవా అని ఏనాడైతే ఓ దిక్కుమాలిన పద్ధతి మన దేశంలో ప్రవేశించిందో, ఆనాడే మన దేశ పాలకులు తమ అసమర్ధతని కప్పెట్టుకోవటానికి వాడుకోవటం మొదలెట్టారు. అదే మన దేశ పౌరుల దౌర్భాగ్యం. మరో ప్రక్కన మన దేశాన్ని వ్యతిరేకించే విదేశాలని వెనుకేసుకొచ్చే విపరీత స్వాతంత్రం ఉండటం వలన శక్తి ఉండి కూడా దేశం బలహీన పడటానికి కారణమయింది.

    ReplyDelete
  6. Request you to read article written by Brahma Chellaney

    India sings peace to an occupier
    Posted on April 29, 2013 by Chellaney
    Brahma Chellaney, Mint, April 30, 2013

    http://chellaney.net/

    Brahma Chellaney is presently a professor of strategic studies at the Center for Policy Research in New Delhi; a fellow of the Nobel Institute in Oslo; a trustee of the National Book Trust;

    ReplyDelete
  7. ఏంటి మలక్ మీ మార్తాండ ఏదో ఏడుస్తున్నాడూ?

    ReplyDelete
  8. ఏమీ లేదులే. Looks like once a fool would always be a fool :)) I responded in kind but it has not been published yet :)

    ReplyDelete
  9. Just read that comment. What a joke about marxism and social responsibility. Marxists are the most irresponsible people on the planet.

    ReplyDelete