Jul 10, 2018

అయితే, ఇప్పుడేంటి? - 2


.
Previously ... 
.
సరిగ్గా వారిద్దరూ ఒకరినొకరు చేరే సమయంలో.... 
.
[లో-ఎలివేషన్ నించి కేమెరా వైపుకు నడుస్తూ అతడు ... సూర్యుడి కిందనుండి సూర్యుడి మధ్యకు వచ్చిన అతని తల]
.
అతన్ని చూసిన వాళ్ళిద్దరూ ..... 
.....
ప్రస్తుతం  
.....
.
[సీన్ పాజ్ లో .. నిలిచిపోయిన సముద్రం, స్థంభించిన వాయువు, ఆగిపోయిన పక్షులు, అతనిమీద చూపు ఫోకస్ చేసిన వీళ్ళిద్దరూ]
.
బేక్ గ్రౌండ్లో .. "వీడు ఆరడుగుల బుల్లెట్టూ!" ట్యూను .. 
.
'ప్ ... ప్... ప్..." ఇద్దరికీ నోళ్ళు పెగలట్లేదు "ప్..ప్..ప్..." 
.
ఆనందమో, ఆశ్చర్యమో, అసహనమో తెలియని ఇద్దరి పరిస్థితీ .. 
.
"వీడు ఆరడుగుల బుల్లెట్టూ!"
.
'ప్ ... ప్... ప్..." 
.
అనితరసాధ్యమైన స్టైల్లో ఫోన్ బయటకి తీశాడతడు, బటన్ నొక్కగానే ఆరడుగుల బుల్లెట్ రింగ్ టోన్ ఆగిపోయింది.. 
.
[కేమరా ఔట్ ఆఫ్ ఫోకస్ నుండీ, ఫోకస్ అతని మొహం మీదకి] 
.
మొదటగా నోరు విప్పిన కత్తి .. 
.
"ప్ .. ప్.. పెసరట్టబ్బాయ్!" (గమనిక: "ప" తో మొదలయ్యే పదం "పవన్" ఒకటే కాదు) 
.
"అలో! ఏటీ? నాను ఇసాపట్నం ఒగ్గీసి సిత్తూరొచ్చీసినాను కదేటి ... ఆ .. అలగలగే ..ఇంకా పది పెసరట్లు ఉండిపోనాయ్.. ఫోన్ పెట్టియ్యైస్!" అంటూ మారుమ్రోగిన పెసరట్టబ్బాయ్ కంచు కంఠం .. 
.
(పెసరట్టుకి ఇంత సీనేమిటని చొప్పదంటు ప్రశ్నలడగద్దు .. ప్రధాన మంత్రిగారినడగండి .. చాయ్ అమ్మేవాడు మాత్రమే మహా యోగి, పకోడిలూ, పెసరట్లూ అమ్మేవాడు మాత్రమే మహా భోగి .. అదీగాక పెసరట్టు అనేది టాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎఱుగని ఫ్లో కేం మహాద్భుతం) 
.
"పెసరట్టూ .. ట్టూట్టూట్టూట్టూట్టూట్టూ!" అంటూ స్లో మోషన్లో అతనివైపు పరిగెడుతున్న కత్తీ, కన్నా! 
.
[కేమెరా టర్న్ వారిమీదనుండి అతని మొహం మీదకి]
.
అతని మొహంలో మారుతున్న కవళికలు .. 
.
"అయ్ బాబోయ్! దోస్తానా సూసీసినాగానీ ఇది మరీ గ్రూపు దోస్తానాలా ఉందేటీ? వోరి గొల్లిగా! లగెత్తరోయ్!!" అంటూ పరిగెత్తబోయిన అతడు .. 
.
"అబ్బాయ్! ఆగు. మేము పెసరట్లు కొనడానికి వస్తున్నాం. పెసరట్టు సినిమా చూపించడానికి కాదు!!" అన్న అరుపుతో శాంతించాడు .. 
.
[సీను కట్]
.
[తరువాయి సీన్లో పెసరట్లు తింటున్న కత్తి, కన్నా ... పక్కనే పెసరట్టబ్బాయ్!]
.
"నీ పెసరట్లు సూపరుండాయబ్బా! నీ పేరేంటీ?"
.
"పవనండే! పవన్ కల్యాణ్ ఫేన్సుని. ఆయనే నా దేవుడు" 
. 
"అవునా? ఆ రింగుటోన్ బట్టే గెస్ చెయ్యాల్సింది. సరే నీకు కూడా ముగ్గురు పెళ్ళాలా?" 
.
"ఊరుకోండి సామే. అదేదో పెద్ద తప్పయినట్టు మాట్లాడతారు. మూడు పెళ్ళిళ్ళేగా చేస్కున్నా, ముగ్గుర్ని ఉంచుకోలేదుగా? ఆ మాటకొస్తే పెద్దాయన పెళ్ళయినరోజే పెళ్ళాన్ని ట్రిపుల్ తలాక్ కూడా ఇవ్వకుండా వదిలెయ్యలేదా? అన్నగారు రెండోపెళ్ళి చేస్కోలేదా? ఆయనకీ కృష్ణకుమారికీ మధ్య ఏదో ఉందని పుకార్లు లేవలేదా? ఇక లోటస్ పాండుగారిమీదున్న అభియోగాలు ఒకటా రెండా? అందరూ ఒకగూటి పక్షులేగా? పచ్చాళ్ళూ, పుష్పాలూ, పుల్కాలూ, జఫ్ఫాలూ .. మచ్చలందరికీ ఉన్నాయ్, కానీ అవి మంచివే!" అంటూ లెక్చరిచ్చాడు పెసరట్ల పవన్! 
.
"అబ్బో! నీకు శానా ఉందే! అన్నట్టూ, నీ విశాఖపట్నం యాస ఏమైపోయిందీ?"  
.
"తూచ్. అలా ఫ్లోలో మామూలు బాస ఒచ్చీసినాదండే. అల్లదిగో ఆ బేపి సూడండే, ఇజిలేస్తే ఎల్లిపొచ్చీస్తాది" 
.
"క్లేరిటీ లేకుండా, మాటిమాటికీ మాట మార్చడానికి ఇవి మీ నాయకుడి రాజకీయాలు కావు పవన్!" అని గద్దించారు మనవాళ్ళిద్దరూ .. 
.
[లెఫ్టు సైడు టర్న్ ఇచ్చుకున్న పవన్ ఎడమవైపు కేమెరా - ఎదురుగుండా ఫోకస్ లో కన్నా]
.
"ఆగాగు! నిన్నెక్కడో చూసినట్టుంది. నువ్వు విశాఖ జిల్లా కాంగ్రెస్ నాయకుడివి కడూ?"
.
"ఏమంటున్నావ్ కన్నా?" గొంతులో అల్లం ఇరుక్కున్న కత్తి
.
"అవును కత్తీ, వీడు వాడే, మనమీద స్పై చెయ్యడానికొచ్చిన కాంగ్రేస్ వాడు!" 
.
(సశేషం)

Jul 9, 2018

అయితే, ఇప్పుడేంటి?




అటుచేసీ, ఇటుచేసీ మన కత్తిగారు బీజేపీలో చేరాలీ... అప్పుడుంటుంది ... వాళ్ళు లాక్కోలేరూ, వీళ్ళు పీక్కోలేరూ... ఇప్పటిదాకా తిట్టినవాడు పొగడలేడూ, ఇన్నాళ్ళూ పొగిడినవాడు తిట్టనూలేడు! 

అలా జరిగితే ఎలాఉంటుందోనన్నదానీమీద ఒక ఊహాజనిత సీరీస్: 


కొన్నాళ్ళకి.. ఇద్దరు వ్యక్తులు.. ఒకరివైపొకరు... చిత్తూరు బీచ్ లో! 

చిత్తూర్లో బీచేంటంటారా? అయితే ఆర్. సంధ్యాదేవిగారి నవలలు మీరు చదవలేదన్నమాట.. చదివిరండి.. వైర్లెస్ తీగలపై పక్షుల కిలకిలారావాలు కూడా వినచ్చు.. 

సరే, మన బీచ్ సీను.. ఒకరి వైపొకరు ... స్లో మోషన్లో.. 

................................... [కన్నా వెనకాల కేమెరా]

“కత్తీ... త్తీత్తీత్తీత్తీ!”
“కన్నా...న్నాన్నాన్నాన్నా” 

....................................[కత్తి వెనకాల కేమెరా] 

“కత్తీ... త్తీత్తీత్తీత్తీ!”
“కన్నా...న్నాన్నాన్నాన్నా” 

................................[పైనుండి ఏరియల్ డ్రోన్ షాట్] 

“కత్తీ... త్తీత్తీత్తీత్తీ!”
“కన్నా...న్నాన్నాన్నాన్నా” 

.......................[ఇద్దర్నీ పేన్ చేసే కేమెరా షాట్, పడమటినుండి .. ఇద్దరిమధ్యా ఉదయిస్తున్న సూర్యుడు]  


సరిగ్గా వారిద్దరూ ఒకరినొకరు చేరే సమయంలో....

[లో-ఎలివేషన్ నించి కేమెరా వైపుకు నడుస్తూ అతడు ... సూర్యుడి కిందనుండి సూర్యుడి మధ్యకు వచ్చిన అతని తల]

అతన్ని చూసిన వాళ్ళిద్దరూ .....

(To be continued... Bahubali style)