Jun 24, 2011

ప్రపీసస సూపర్ తిట్లు - సూపర్ హిట్లు

ప్రపీసస లో మన మార్తాండాన్ని తిట్టిన తిట్లు ఎంత పాప్యులర్ అయ్యాయంటే - బ్లాగుల గురించి తెలియనివాళ్ళు కూడా వీటిని తమ స్నేహితులకు ఈ మెయిల్ లో పంపుకునేటంత :)

మచ్చుకి కొన్ని (Copy pasted them as they are)



కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా …

ATM లో PAN card పెట్టే తింగరి సన్నాసి….

AC కోసం ATM కి వెళ్లి బాలన్స్ enquire చేసే కక్కుర్తి ఎదవ…

108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ

రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ.

తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా

బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల

కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల

నల్ల cooling glass వేసుకుని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన మసాలాదోసను అమావాస్య రోజు current పోయిన Time లో తినే కక్కుర్తి యెదవ.

విమానంలో kerchief వేసి seat book చేసుకోటానికి parachute వేసుకెళ్ళే పిచ్చి వెధవ

Sunday night PUB కి వెళ్ళి వేడిగా ఉప్మా ఉందా అని అడిగే ఏబ్రాసి.

కుక్క వెంటపడుతుంటే పరిగెత్తకుండా vodofone sim తీసి పడేసే అక్కుపక్షి

శవం మీద మరమరాలు ఏరుకొని bhel puri చేసుకొని తినే పెంట మొహమా..

అక్షయపాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతినే వెదవ

అష్ట దరిద్రమైన శని గ్రహానికి powder పూసి, బొట్టు పెట్టిన దయ్యంలా ఉన్నావ్….

Aquarium లో చేపలు పట్టే ఫేసూ..

ఎర్రసైన్యం R.narayana murthy దగ్గర break dance నేర్చుకొనే ఎదవా..

నువ్వు బీడు బడిన బ్లేడ్*రా.

సగం కంపైల్ అయిన కోడ్* గాడివి

రాబందు రెట్టవి, బొద్దింక క్లేసానివి

ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పీనుగా.

లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.

మంచుతో చేసేదే మంచురియ అనుకునే మొహం

చీపురు కూడా చీప్*ది కొనే చప్రాసెదవ.

ఆకలికి పురుగుల మందులో చెక్కర వేసుకొని తాగే మొహం

మంచు కరిగించి మంచి నీళ్ళని అమ్మే వెధవ మొహం

ఐ-మాక్స్ సినిమాకు బైనోకులర్స్ పట్టుకెళ్ళే బేఖూఫ్ ఎదవ.

కట్టింగ్ షాప్*లో కత్తెర దొంగిలించే ఫేసు.

పిచుకల గూట్లో పీసుమిఠాయి వెతికే పింజారెదవా.

రాగి సంగటి అంటే రాగి తీగలతో చేస్తారని అనుకునే మొహం

పుచ్చిపోయిన వంకాయలతో గుత్తొంకాయ కూర చేసుకుని తినే మొహం

అరోగ్య శ్రీ యాడ్*ను పైరసీ చేసి అమ్మే అరమైండ్ ఎదవ.

youtubeలో నంది పైపులు, tubeలు వెతికే మొహం.

తుఫానులో తువాలు పొయిందని ఫీల్ అయ్యే తుప్రాసెదవ.

కలలో కలాంను కలవరించే కలర్ బ్లైండ్*నెస్ ఫెలొ.

TVలో వచ్చే సినిమాను కూడా రివ్యూ చదివి చూసే మొహం.

బొచ్చు పీకిన ఎలుగు బంటి లా వున్నావ్.

వినాయక చవితి రోజు గణేష్ బీడిలమ్మే గలీజ్*గా.

సత్తు సామానోడికి సాఫ్ట్*వేర్ అమ్మాలనుకునే మొహం.

తేనెపట్టుని చుట్టబెట్టుకుని తట్టబుట్ట పట్టుకుని పెట్టతో చట్టాపట్టాలేసుని చుట్టుపక్కలా తిరిగే బెట్టుయెదవ

పప్పు లొ ఉప్పేసుకుని కప్పు లో తాగే కంపునాయాల

పిల్లల ఎదురుగా పీచుమిటాయి తింటూ చంకలు గుద్దుకునే

ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి గోచీ కట్టుకువచ్చే

నిత్యని చూస్తూ నిర్మలమ్మ ని కలగనే దౌర్భాగ్యుడు

శవాలకి మేకప్పేసే వాడి మొహం

శవం పాత్రలకి డబ్బింగ్ చెబుదామనుకునే చచ్చు సన్నాసి

చీమలు చీమిడి వేసిన మొహం

Jun 9, 2011

ఆయన తీసేసిన కామెంట్లు - ఇవిగో :)

అనుకున్నట్టుగానే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మీద లెక్చర్లిచ్చే కమ్యూనిష్టు రచయిత తన మీద విమర్శలు రాగానే వాటిని తీసేసి స్వహతాగా కమ్యూనిష్టు నైజమైన రెండు (సారీ, అప్పారావ్ థియరీ ప్రకారం నాలుగు) నాల్కల ధోరణిని బహిరంగంగానే చాటుకున్నారు.

ఇప్పుడర్థమయ్యుంటుంది ఈ పెద్దమనిషికి తన స్థాయికి మిగతావాళ్ళు దిగజారితే పరిస్థితి ఎలా ఉంటుందో.  పక్కవాళ్ళకి సభ్యత సంస్కారాలగురించి లెక్చర్లిచ్చే ఈ పెద్దమనుషులు ముందు తమ సభ్యతని ప్రశ్నించుకోరెందుకో?

అన్నట్టు, ఆయన కామెంట్లను తొలగించటానికి ముఖ్యకారణం, రాందేవ్ పై ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించమని బ్లాగర్లు నిలదీయటం కాదు కదా?  






ఆయన తీసేసిన కామెంట్లు ఇవీ:




voleti said...

రామ్ దేవ్ బాబా ఒక్కడే కాకుండా ఆధ్యాత్మిక గురువులు, బాబాలు కొన్ని కోట్లు అర్జిస్తున్నారు..(ఇతర మతస్థుల వారు కూడా) చానల్లలో హల్ చల్ చేస్తున్నారు.. మరి వాళ్ళందరి మీద కూడా విశ్లేషణలు, విమర్శలు ఎందుకు లేవు.. అవినీతి పై వుద్యమం చేస్తున్నందుకా ఇన్నాళ్లకి ఈయన చేసిన పన్లు గుర్తుకు వచ్చాయి? హైటెక్కో, గాడిద గుడ్డో చేసింది మంచిపని కాదా? ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు సపోర్టు చెయ్యకూడదా? అదేమన్నా నేరమా?

June 8, 2011 6:19 AM



Malakpet Rowdy said...

Voleti garu,

You are question the logic of a communist .. lolz :))

జ్యోతి బసు మీద ఆరోపణలు నిరూపించబడలేదని చేతులు దులిపేసుకున్న ఈ పెద్దమనిషి రాందేవ్ మీద ఏ ఆరోపణలు నిరూపించబడ్డాయో దనికి ఏ శిక్షపడిందో కూడ చెప్పచుకదా? ఊహూ( - చెప్పరు. అసలు సిసలు భారతీయ కమ్యూనిష్టు ఊసరవెల్లి ధోరణికి ఇదే పెద్ద ఉదాహరణ.

June 8, 2011 8:12 AM



Apparao Sastri said...

@తెర
@ ప్రవీణ్
బాబాకి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి
కానీ పదవ తరగతి చదివి 300 రూ /- ఉద్యోగం కోసం ప్రయత్నించి ని ఒక మహానుభావుడికి (వెర్రి వెంగలప్ప ఐ న్యూస్ ప్రకారం) విమానాలే ఉన్నాయి
ఇక్కడ మీరు అందరూ బాబాని వ్యతిరేకిస్తున్నారు అంటే మీకు కూడా స్విస్ బ్యాంకు లో నల్ల ధనం ఉందని జనాలు అనుకోవచ్చు :)
@ మలక్
చాలా కాలం తర్వాత తెలుగు బ్లాగుల్లో ఇంగ్లీష్ లో కామెంట్ రాయకుండా తెలుగు లో రాసారు :)

June 8, 2011 9:34 AM



Malakpet Rowdy said...

వీళ్ళు రాందేవ్ ని వ్యతిరేకిస్తోంది కాషాయ బట్టల వల్ల, ఎంతయినా హిందూ వ్యతిరేకులు కదా. ఇదే రాం దేవ్ రేప్పొద్దున్న ఎర్ర చొక్కా తొడుక్కుంటే నెత్తిమీద పెట్టుకుని పూజించేది ఈ రెండునాల్కల కమ్యూనిష్టులే.

ఈ కమ్యూనిష్టులు ఉద్యమం చేస్తామంటే ఈ రోజుల్లో ఎవ్వడూ పట్టించుకోడు, జనాల్లో రాజకీయపరమైన అవగాహన ఇదివరకటికంటే కొంచం పెరిగి, వీళ్ళేలాంటివాళ్ళో అందరికీ అర్థమయ్యింది. మిగతావాళ్ళు చేస్తామంటే వీళ్ళకి అసూయ :)

June 8, 2011 10:10 AM



Apparao Sastri said...

@మలక్ గారు
ఈ కమ్యునిస్తులకి నాలుగు నాల్కలు
రెండు సిపిఐ వి, రెండు సిపిఎం వి
తెలంగాణా కి మద్దతు ఇచ్చేది ఒకటి ఇవ్వనిది మరొకటి


ఇన్నేల్లగా ప్రధాన ప్రతి పక్షం లో కూర్చోకపోయినా , అధికార పక్షాన్ని విమర్శించే వారు "ఈనాడు రాందేవ్ మీద ఆరోపణలు చేసి అధికార పక్షానికి మద్దతు పల్కుతున్నారు"

June 8, 2011 10:23 AM



Malakpet Rowdy said...

ఈ కమ్యునిస్తులకి నాలుగు నాల్కలు
రెండు సిపిఐ వి, రెండు సిపిఎం వి
__________________________

LOL, well said!

June 8, 2011 10:38 AM



Malakpet Rowdy said...

Politics is all about taking credit. రాందేవ్ కి ఎక్కడ పేరొచ్చేస్తుందో అని వీళ్ళ బాధ.

ఒక వేళ రేపు రాందేవ్ పేదరికానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తే, వీళ్ళు "పేదరికం దేశానికి ఎంత అవసరం" అనేదానిమీద లెక్చర్లు దంచుతారు :))

June 8, 2011 10:42 AM



Apparao Sastri said...

@ మలక్ అన్నా
తుడిచి పెట్టుకు పోతున్న కమ్యూనిజాన్ని ప్రజలకి గుర్తు చేయడానికి , ప్రతి దానికి రాద్దాంతం చేసి జనాల్లో కనపడుతుంటారు

@ ప్రవీణ్
రాందేవ్ కి ఆస్తులున్నాయి అని అన్నవ్ కదా మరి మన పాల్ కి విమానాలు ఉన్నాయి కదా , అది మర్చి పోయావా ? లేక తెలియదా ?

June 8, 2011 11:13 AM



Apparao Sastri said...

ఇప్పుడు ఈ కమ్యునిస్టుల పని ముందు నుయ్యి వెనక గొయ్యి లాగా ఉంది

బాబాకి మద్దతు ఇస్తే , హిందువులకి మద్దతు ఇచ్చినట్లు
మద్దతు ఇవ్వక పొతే , కాంగీలకి ( అధికార పక్షానికి ) మద్దతు ఇచ్చినట్లు

కనుక వీళ్ళు " నోరు మెదపకుండా" ఉంటె బాగుండేది బాబా విషయం లో

అవినీతి మీద యుద్ధం చేస్తుంటే వీళ్ళకి ఎందుకు బాధ ???????????????

June 8, 2011 11:22 AM



Malakpet Rowdy said...

అప్పారావ్,

ఈయన లేని టైములో పాపం ఇలా చీల్చి చెండాడుతుంటే రెప్పొద్దున్న వచ్చి చూసుకుని లబోదిబోమంటారేమో? పాపం అసలే ఈయనకి మిగిలిన కమ్యూనిష్టులలాగే పక్కవాడిని విమర్శించటం తప్ప, తననపై వచ్చిన విమర్శలని తట్టుకునే శక్తి లేదు.

June 8, 2011 11:38 AM



శ్రీకర్ said...

*వాటిని అలావుంచి రామ్‌దేవ్‌ బాబా స్వయంగా అవినీతి అరోపణలకు అతీతంగా లేరు. ఆయన పదిహేను వేల కోట్ల రూపాయల ఆధ్యాత్మిక సామ్రాజ్యం అనేక అరోపణలకు నిలయమైంది.*
రాందేవ్ గారు చేసిన అవినితి ఎమీటీ? ఆయన మంత్రి కాడు, ప్రభుత్వ ఉద్యోగి కాడు. ఒక వ్యాపారి అని మీరు అనుకొంటె, అతను అవినితిని చేస్తూంటే ఇన్నిరోజులు ప్రభుత్వం ఎమీ చేస్తున్నాది? ఆయన ఆస్థి విలువ పదిహేను వేల కోట్ల రూపాయల ని మీకు ఖచిత్తం గా ఎలా తెలుసు? చాలా ఇంగ్లిష్ పేపర్లలో 1100 కోట్లు అని రాశారు. ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క విధంగా రాస్తున్నారు. మీరు ఇంత సీనియర్ పాత్రికేయులు కనుక పదిహేను వేల కోట్ల రూపాయలని ఎక్కడ నుంచి సమాచారం మీకు ఎక్కడ నుంచి లభించింది.

*ఆయన విక్రయించే ఆయుర్వేద ఔషధాలలో మానవ శరీర పదార్థాలను మిళితం చేయడం దేశమంతటా విమర్శలకు దారి తీసింది.*
దేశమంతటా అని మీరు అనుట్టున్నారు, బృందా కారత్ ఆrOపించింది, ఆమే ఆరోపణలను ప్రజలు తిప్పికొట్టారు. ప్రజల ఆగ్రహాన్ని చూసి ఆమే వెనుకకు తగ్గారు.

June 8, 2011 12:13 PM



శ్రీకర్ said...

@అప్పారావు శాస్త్రి,
ఇంకా భారతదేశం లో కమ్యునిస్టులు ఎక్కడ ఉన్నారు? మొన్నటి ఎన్నికలలో వీరి పని అయిపోయింది. ఇక చేయటానికి చేతిలో పనిలేదు గనుక రచనా వ్యాసంగం మొదలు పేడతారేమో. ముఖ్యం గా నేట్ లో (బ్లాగులు, వెబ్ సైట్లు ) వారి అసత్య ప్రచారాన్ని అడ్డువేయటానికి రానున్న రోజులలో అందరు సన్నదంగా ఉండాలి.

June 8, 2011 12:19 PM



Malakpet Rowdy said...

ఇక చేయటానికి చేతిలో పనిలేదు గనుక రచనా వ్యాసంగం మొదలు పేడతారేమో.
______________________________________________________

రానివ్వండి. వీళ్ళ వేషాలు ఎవరికి తెలియవు గనక? వాస్తవికత అంటూ చెత్త రాసే పచ్చి అబద్ధాల కోరులని కూడ బ్లాగ్లోకం చూసింది. చెప్పాల్సిన సమాధానాలు చెప్పింది.

June 8, 2011 12:38 PM



Malakpet Rowdy said...

దేశమంతటా అని మీరు అనుట్టున్నారు, బృందా కారత్ ఆrOపించింది
_______________________________________________

బృందా కారతే ఈయన దృష్టిలో దేశమేమో.

Jun 3, 2011

క్రికెట్ మేచ్ రెండవ ఓవర్ వీశేషాలు





మొదటి ఓవర్ అయ్యాక ప్రత్యేక ప్రతినిధి కార్తీక్ ఇలా తెలియజేస్తున్నారు.

మరుసటి ఓవర్ బౌలింగ్ తనకే ఇవ్వాలని కెప్టెన్ కేక్యూబ్ శర్మగారిని చీబోరిక డిమాండ్ చేశారు.. కానీ భోజ్ కుమార్ లాంటి ఫాస్ట్ బౌలర్ ఉండగా వేరే వాళ్ళకు ఇవ్వడానికి కేక్యూబ్ శర్మ కాస్త సంచయించారు. ఆయన చేసినదానికి అద్వానీ మళ్ళీ క్షమాపణ కోరాలని చీబోరిక గొడవ మొదలుపెట్టారు.

ఇక లాభం లేదని కేక్యూబ్ శర్మగారుతన అమ్ములపొదిలో ఉన్న అతి భయానకమైన మార్తాండస్త్రాన్ని ప్రయోగించారు..

మా: ఇండియా లాంటి సెమీ ఫ్యూడల్ దేశం లో స్త్రీలు బౌలింగ్ చెయ్యలేరనుకోవడం హాస్యాస్పదం అలాంటి వాళ్ళ నోరు మూయించడానికే నేను బౌలర్ అవతారమెత్తి ఒక స్త్రీకి 20 పరుగులు ఇచ్చాను.. నాకు ఇంకో ఓవర్ బౌలింగ్ వస్తే ఈసారి 20 కి మరో 20 ఇచ్చేస్తానని మాటిస్తున్నాను..

చీ: అద్వాని క్షమాపణ ఎందుకు కోరకూడదూ?

మా: మీరిలా డిమాండ్లు చేసి నాలోని ఎమోషనల్ దయ్యాన్ని నిద్ర లేపకండి..

చీ: అమెరికా వాళ్ళు లాడెన్ ను చంపేసినందుకు శ్రీరాముడు నాకు క్షమాపణ చెప్పాలి..

ఇదంతా చూస్తున్న బద్రికి చిరెత్తుకొచ్చింది..

బద్రి: ఇదో వదినా, రెండు నిమిషాలలో ఫీల్డింగ్ పొజిషన్ కి రాకపోతే నిన్ను చెట్టుకు కట్టేసి నవరంధ్రాలు కథ వినిపిస్తా

చీ: రాముడికి లాడెన్ కి తేడా లేదని తెలిసింది కాబట్టి నేను ఫీల్డింగ్ కి వస్తున్నా

ఇదంతా చూసిన భోజ్ కుమార్ గారు తీవ్ర మనస్తాపంతో బౌలింగ్ చెయ్యటానికి నిరాకరించారు. ఇక చేసేదేమీలేక కేక్యూబ్ శర్మ గారు చీబోరిక గారికి బౌలింగ్ ఇచ్చారు.

**************************


సత్యనారాయణ వర్మగారు బేటింగ్, చీబోరిక గారు బౌలింగ్.

చీబోరికగారు బౌల్ చెయ్యటానికి పరుగు మొదలుపెట్టారు. ఉన్నట్టుండి అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సత్యనారాయణవర్మగారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. కళ్ళు చింతనిప్పుల్లా మారాయి, ముఖము ఎర్రటి సూర్యుడిలా మారింది.

1.1 చీబోరికగారి బాల్ గుడ్ లెంగ్త్ లో పడింది అయితే ఆవేశం ఆపుకోలేని శర్మగారు దానిని బాదిన వీరబాదుడువల్ల అది లాంగ్ ఆఫ్ మీదనుండి స్టేడియం బయటకి పోయి పడింది. 6 పరుగులు

స్కోరు 26/0 1.1 ఓవర్లలో

ఉన్నట్టుండి వర్మగారికి అంతకోపం ఎందుకు వచ్చిందో తెలియక అందరూ బుఱ్ఱలు గోక్కుంటున్నారు.

1.2 రెండవబంతి ఫుల్లర్ లెంగ్త్ - ఈ సారి వర్మగారి బాదుడుకి బంతి లాంగ్ ఆన్ దాటి వెళ్ళి రౌమ్య తిందామనుకున్న కజ్జికాయలడబ్బాలో పడింది - 6 పరుగులు

స్కోరు 32/0 1.2 ఓవర్లలో

లిమిటెడ్ ఓవర్ మేచ్ లో టెస్ట్ మేచ్ ఫీల్డింగ్ పెట్టి బేటింగ్ టీమును కంఫ్యూస్ చేద్దామన్న పాచిక పారకపోవడంతో ఉత్తరాంధ్ర కేప్టెన్ డిఫెన్సివ్ ఫీల్డు మొహరించారు, వికెట్ కీపర్ తప్పా అంద్రీనీ బౌండరీ మీద నిలబెట్టి. పవర్ ప్లే లేకపోవటం ఆయనకి కలిసొచ్చింది.


స్కోరు 38/0 1.3 ఓవర్లలో

1.3 మూడవ బంతి షార్ట్ పిచ్ - ఏమాత్రం కోపం తగ్గని సర్మగారి హుక్ షాట్ కి బంతి వెళ్ళీ వెళ్ళీ ఫైన్లెగ్ బౌండరిలో ఉన్న పంచవటి గ్రూపు మీద పడింది. తమ అభిమాన బేట్స్మేన్ వీరవిహారానికి సంతోషిస్తూ అక్కడివారు పండగ చేసుకుంటున్నారు.

అయితే వర్మగారి కోపానికి కారణం వారికి కూడ అర్థం కావట్లెదు.

మేచ్ లో అంతరాయం. ఒవర్ మారినప్పుడు స్వీపర్ కవర్ స్పాటులోకి వచ్చిన మలక్ కేప్టేన్ కేక్యూబ్ శర్మ గారిదగ్గరికి వచ్చి చీబోరిక వెనకాల ఉన్న సైట్స్క్రీన్ కేసి చూపిస్తూ ఏదో చెప్తున్నారు.

ఇప్పుడు వారిద్దరూ అంపైర్లతో సంభాషిస్తున్నారు. సైట్స్క్రీన్ దగ్గరకు అంపైర్లు ఏదో సందేశం పంపించారు.

అసలక్కడ ఏమిటి జరుగుతోందనేది మరికాసేపట్లో మనకి మంచుగారిద్వారా తెలుస్తుంది.

1.4 చీబోరికగారు బౌలింగ్ మొదలుపెట్టారు, ఉన్నట్టుండి సత్యనారాయణవర్మ గారి ముఖం ప్రశాంతంగా మారిపోయింది, తరువాతి బంతిని చిరునవ్వుతో డిఫెన్స్ ఆడరు. దానిని చీబోరికగారే ఫీల్డ్ చేశారు.

1.5 ఈసారికూడ వర్మగారు చిరునవ్వుతో డిఫెన్స్. పరుగులేమీ లేవు.

1.6 ఓవర్లో ఆఖరి బంతి ఎడ్జికి తగిలి థర్డ్ మేన్ దిశగా వెళ్ళింది వికెట్కీపర్ వెళ్ళి దానిని తెచ్చేలోగా రెండు పరుగులు.

స్కోరు 40/0 రెండు ఓవర్లలో


*********************************

రెండవ ఓవర్ పై మంచుగారి ప్రత్యేక రిపోర్ట్:

రెండవ ఓవర్ లో వర్మగారి ధోరణి వెనక ఉన్న రహస్యం బహిర్గతమైంది. సైట్స్క్రీన్ దగ్గర ఉన్న ఒక నాస్తికగుంపు వారు చీబోరిక బౌలింగ్ వేసే సమయానికి సైట్స్క్రీన్ మీద ఎదో కనిపించేలా ఏర్పాట్లు చేసారని తెలుస్తోంది. వారి లక్ష్యం వర్మ గారి ఏకాగ్రతను దెబ్బతీసి ఔట్ చెయ్యటం. అయితే ఆ ఎత్తు పారక అది చివరికి మూడూ సిక్సులకు దారి తీసింది. అది గమనించిన మలక్ కేప్టెన్ కీ అంపైర్లకీ చెప్పటంతో అలాంటి పనులు నియామాలకి విరుధ్ధమని అంపైర్లు ఆ గుంపుకి సందేశం పంపటం జరిగింది. మూడు బంతుల తరవాత అది కనబడకపోయేసరికీ వర్మగారు ప్రశాంతంగా మారిపోయారు.

ఇంతకీ ఆ గుంపు వారు సైట్స్క్రీన్ మీద ఏమి చూపిస్తే సత్యనారాయణ వర్మ గారిలో ఆగ్రహం కట్టలు త్రెంచుకుందో తెలుసా? అది ఒంగోలు శ్రీను ఫోటో :))


**********************************

కామెంటరీ:

పులుసుగారు: ఈలోగా అక్కడ చీబోరిక తన కేప్టెన్ కి ఒక చాలెంజ్ విసిరారు. ఈ మేచ్ గుంటూరు టీము గెలుస్తుందని, గెలవకపోతే తనమీద విశ్వహిందూ పరిషత్ కి ఫిర్యాదు చెయ్యమనీ. గుంటూరు గెలవకపోతే చీబోరిక మీద విశ్వహిందూపరిషత్ కి ఫిర్యాదెందుకు చెయ్యాలో అర్థంకాక కేక్యూబ్ శర్మ గారు తలగోక్కుంటున్నారు. శంకర్ 1 గారూ, మీ అభిప్రాయమేమిటి?

శంకర్ 1: నాకు అర్థం కావట్లేదు పులుసుగారు అక్కడ ఏమి జరుగుతోందో. అయితే ఒక మగవాడు ఒక మహిళకి సమర్పించుకున్న 40 పరుగులనే ఒక మహిళగా మరొక పురుషుడికి సమర్పించానన్న విజయగర్వం ఆమెలో తొణికిసలాడుతోంది. మార్తాండ, చీబోరిక సమంగా 20, 20 పరుగులు గుంటూరుకి ఇచ్చారు. డిప్పారావు గారూ, మీ అభిప్రాయం ఏమిటి?

డిపారావు: శంకర్ 1 గారూ, నేను నా ప్రకటనలో కాస్త తీరికలేకుండా ఉన్నాను. తరవాత మాట్లాడతాను. శంకర్ 2 గారిని అభిప్రాయ చెప్పనివ్వండి. ఇద్దరిలో ఎవరు బాగా బౌలింగ్ చేశారు?

శంకర్ 2: ఇసక తక్కెడ పేడ తక్కెడ! ఏరాయయితేనేం?

డిప్పారావు: ఆహా శంకర్ 2 గోరో. మీరు మీ పధ్ధతిలో కొట్టినట్టుగా సమాధానం చెప్పారుగా. శంకర్ 1 గారూ, ఇక మీరు కొనసాగించండి.

శంకర్ 1: ఇప్పుడే అందిన వార్త. సత్యనారాయణ వర్మ గారు చెలరేగిఫొతున్నప్పుడు ప్రతీ షాటుకీ పెవిలియన్లో ఉన్న కవిగారు "అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంత కమ్మగా ఉందిరో యబ్బ" అని పాడటం మొదలు పెట్టారనీ, అయితే అది గమనించిన గాడేపల్లిగారు అలాంటి అసభ్యకర అభ్యంతరకరమైన పాటలు ఏ డిస్కోతెక్కులోనో లేక, జనాలడబ్బులతో రొడ్డుపక్కన వేసే వినాయక చవితి పందిళ్ళలోనో వినాలిగానీ ఇలాంటి క్రికెట్ స్టేడియాలలో పాడకూడదని మందలించినట్టుగా తెలుస్తోంది.

మిగతా విశేషాలు తరువాయి పోస్టులలో!

Jun 2, 2011

మైఖెల్ వదిన కామరాజు 2.0 షూటింగ్ ప్రారంభోత్సవం: క్రికెట్ మేచ్





మైఖేల్ వదిన కామరాజు 2.0 షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా బ్లాగ్ ప్రీమియర్ లీగ్ (బీ పీ ఎల్) జట్లయిన గుంటూరు గూండాలకి, ఉత్తరాంధ్ర ఊసరవెల్లులకీ మధ్య క్రికెట్ మేచ్ జరిగింది. దాని మొదటి ఓవర్ హైలైట్లు ఈ టపాలో:

గుంటూరు గూండాల టీం లో మహామహులున్నారు.

1. భీతాచార్య
2. సితార
3. సత్యనారాయణ వర్మ
4. కవిగారు
5. భాస్కర ద్రామారాజు
6. మోళీ
7. భుజాత
8. కాగడా
9. డబ్రకాబ్బర
10. కుమరన్
11. గాడేపల్లి (కేప్టెన్)

ఫిట్నెస్స్ కారణాలవల్ల భావ్య, గీకెండ్ బెంచ్ మీద ఉన్నారు

టిం మేనేజర్లు: బాటిల్య, నేనేమీకాంత్

కోచ్: పాతగోళీ



ఇక ఉత్తరాంధ్ర ఊసరవెల్లులు తక్కువ తిన్నార ఏంటి? వీళ్ళూ మహామహులే



1. మార్తాండ
2. బద్రీ
3. చీబోరిక
4. పాలమూరు రౌమ్య
5. ఫద్మ గండుపిల్లి
6. భోజెంద్రకుమర్ డెవరపల్లి
7. బూజుమల్లి
8. మలక్పేట్ రౌడీ
9. ఏండీ
10. భోజ్ కుమార్
11. కేక్యూబ్ శర్మ (కేఫ్టెన్)

టీం మేనేజర్లు: (మార్తాండనీ, చీబోరికనీ, మలక్కునీ ఒక టీములో మేనేజ్ చెయ్యడం కుదరదని పారిపోయారు)


టీం కోచ్: కరుణ తప్పు



అంపైర్లు: పకోడీహళ్ళి మురళీశోభన్, సంజీవని ప్రసాద్

కామెంటేటర్లు: పులుసు ఉప్పరమణ్యం, శంకర్ 1, శంకర్ 2, డిప్పారావు మేస్త్రి


************************************

ముందుగా టాస్ - పులుసుగారి వ్యాఖ్యానం, శంకర్ 1, శంకర్ 2, డిప్పారావు గార్ల సహకారంతో

కేక్యూబ్ శర్మగారికి కాస్త ఆలశ్యమవ్వడంతో గాడేపల్లిగారికి కోపం వచ్చింది. ఆయన టాస్ కి రానంటే రానని భీష్మించుక్కూర్చున్నారు.

ఏమిచెయ్యాలా అని ఆలోచించిన అంపైర్లు చివరికి కోచ్ లని టాస్ కి పిలిచారు. కరుణ తప్పు గారూ, పాతగోళీగారు టాస్ కి వచ్చారు.

పకోడీహళ్ళి: అయ్యా, అమ్మా, మీరు ఒకరివైపు ఒకరు తిరిగి టాస్ వేయ్యాలి - అలా ఎడ మొహం పెడమొహం గా ఉంటే కుదరదు. సరేనా? ఇక టాస్ వేసుకోండి.

సంజీవని: కరుణ తప్పుగారు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.

కామెంటరీ:

గుంటూరు గూండాల తరపున ఓపెనింగ్ కి భుజాత, సత్యనారాయణ వర్మ గార్లు వచ్చారు. ఉత్తరాంధ్ర తరపున బౌలర్ మార్తాండ.

భుజాతగారు మొదటి బంతి ఫేస్ చెయ్యబోతున్నారు, మార్తాండ బౌలింగులో ...

0.0 మొదటి బంతి మార్తాండగారు శ్రీకాకుళం నుండీ హైదరాబాద్ ఏసీ రైల్లో వెళ్ళినంత వేగంగా వచ్చి బౌలింగ్ చేశారు, అయితే ఆ బంతి భుజాతగారివైపు కాకుండా, కోపంగా థర్డ్ మేన్ దగ్గరున్న ఫలహారశాల దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పాలమూరు రౌమ్య గారి మీదకు విసిరారు - బంతి బౌండరీ దాటింది - గుంటూరు గూండాలకి నాలుగు వైడ్లు

స్కోరు 4/0 - 0 బంతుల్లో

మార్తాండగారు మళ్ళీ బౌలింగ్ చెయ్యటానికి రెడీ అయ్యారు, అయితే అంపైర్ పకోడీహళ్ళీగారు ఆటను నిలుపుచేశారు, ఎందుకో చూద్దాం - ఓవర్ టూ ద ఫీల్డ్

కేక్యూబ్ శర్మ: ఎమయ్యిందండీ?

వైస్ కేప్టెన్ మరియు వికెట్ కీపర్ భోజెంద్రకుమర్: ఇంకా ఏంకావాలండీ? సిల్లీ పాయింటులో ఉన్న చీబోరికా, ఫార్వార్డ్ షార్ట్ లెగ్ లో ఉన్న మలక్కు కొట్టుకుంటున్నారండీ. ఆవిడ ఒక రాయేస్తే ఈయన పదిరాళ్ళు విసిరాడు.

కేక్యూబ్ శర్మ: సరే ఫీల్డింగ్ పొసిషన్లు మారుద్దాం. చీబోరిక గారూ, మీరు ఆలా డీప్ థర్డ్ మేన్ కి పొండి, మలక్కుగారూ, మీరు డీప్ లాంగ్ ఆన్ కి

భోజెంద్రకుమార్: అయ్యా, , థర్డ్ మేన్ లో ఉన్న రౌమ్య పక్కన ఉన్న ఫలహారశాలని వదిలి పోనంటొంది. ఎలా?

కేక్యూబ్ శర్మ: సరే, చీబోరిక స్వీపర్ కవర్, మలక్ డీప్ మిడ్ వికెట్

చీబోరిక: కుదరదు. అద్వానీ వచ్చి క్షమాపణ అడిగేదాకా నేను ఇక్కడనుండి కదలను


కేక్యూబ్ శర్మ: ఖర్మ! ఇప్పుడెలా? అదుగో పెవిలియన్ నుండీ సితార వస్తున్నాడు, వీళ్లకి సర్ది చెప్పటానికి


భీతాచార్య (పెవిలియన్ నుండి అరుపు): సితారా? వాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో నీకేం బాధ? నువ్వు మావైపు ఆడూతున్నావ లేక వాళ్ల వైపా? వెనక్కి రా

సంజీవని: ఇలా అయితే ఆటని సస్పెండ్ చయ్యాలంతే.

కేక్యూబ్ శర్మ: అయ్యో అంతపని చెయ్యద్దు. చీబోరికా, మలక్- నా మట వినండీ ప్లీస్. హమ్మయ్యా, విన్నారు, ఇక ఆట మొదలెట్టండి

కామెంటరి:

0.1 మార్తాండ బాల్ వేశారు రైట్ ఆర్మ్, ఓవర్ ద వికెట్ పాస్ట్ అంపైర్ పకోడిహళ్ళి, గుడ్ లెంగ్త్ కన్న ముందు పిచ్ అయ్యి పైకి లేచింది ...దాని భుజాత గారు బేక్ ఫుట్ కి వెళ్ళి హుక్ చేశారు ..

ఆ బంతి, స్క్వేర్ లెగ్గులో నిలబడి బజ్జు చేసుకుంటున్న పద్మ గండుపిల్లి గారి నెత్తిమీదనుండి వెళ్ళి గేలరీలో ఉన్న చెంగనాయకమ్మగారిపై పడింది - 6 పరుగులు

స్కోర్ - 10/0 ఒక బంతి


ఇది తట్టుకోలేని మార్తాండ భుజాతగారిపై స్లెడ్జింగ్ మొదలుపెట్టారు, వీడియో పెడతానని కూడ బెదిరించారు. అయితే దిక్కున్న చీట చెప్పుకో ఫో అని సమాధానం రావటం వల్ల మళ్ళీ బౌలింగ్ కి ఉపక్రమించారు.

మళ్ళీ ఆటలో అంతరాయం. ఎందుకో చూద్దాం. అంపైర్ల కథనం ప్రకారం స్వీపర్ కవర్ గేలరీలో ఉన్న పుణ్యభూమి సభ్యులకి చీబోరికకీ ఒకవైపు యుధ్ధం జరుగుతోంది అలాగే మిడ్ వికెట్ బౌండరీ దగ్గరున్న ప్రమోదవనం సభ్యూ, మలక్కూ కూడ రాళ్ళు రువ్వుకుంటున్నారు. దీనికి పరిష్కరమేమిటో చూద్దాం.

ఈసారి కేక్యూబ్ శర్మ గారు ఒక తెలివయిన నిర్ణయం తీసుకున్నారు - పుణ్యభూమి సభ్యుడయిన మలక్కుని స్విపర్ కవర్ దగ్గర, ప్రమోదవనం సభ్యురాలయిన చీబోరికని మిడ్ వికెట్ కూ పంపించారు. గొడవ సద్దుమణిగింది.

మార్తాండ బౌలింగ్ మొదలు పెట్టారు

0.2 ఈ సారి ఫుల్ టాసు వేశారు దాన్ని భుజాత గారు అలవోకగా మళ్ళీ సిక్స్ కొట్టారు ఈసారి లాంగ్ ఆన్ మీదుగా.

మార్తాండ మళ్ళీ స్లెడింగ్ మొదలు పెట్టారు. మేచ్ ని కవర్ చేస్తున్న మంచుగారి రిపోర్ట్ ప్రకారం మార్తాండ అన్న మాటలు

"మీరు సిక్స్ కొట్టడం హాస్యాస్పదం ... మీ చరిత్ర ఇక్కడ చూడండి http://bhujaataasalurangu.info/"

పకోడీహళ్ళిగారు వార్నింగ్ ఇచ్చిన పిమ్మట మార్తాండ అన్నమాతలు: స్లెడ్జింగ్ ఈ కెలుకుడు గాళ్ళే చేసి, నా మీదకి తోస్తారని నేను సంతనూతలపాడు నుంచి రాజస్తాన్ వెళ్ళే ట్రెయిన్ లో ఒక కెనడా NRI, ఒక సామ్రాజ్యవాద అమెరికా NRI టిక్కెట్టు కొనకుండా ప్రయాణిస్తూ మాట్లాడుకోగా విన్నాను

ఇక లాభంలేదని అంపైర్ మార్తాండకి ఆట నియమాల ప్రకారం యెల్లో కార్డ్ ఇచ్చారు. అయితే దాన్ని నిరాకరించిన మార్తాండ తను కమ్యూనిష్టు కాబట్టీ ఎరుపు రంగు కల రెడ్ కార్డ్ మాత్రమే తీసుకుంతానని చెప్పారు. దానితో జుట్టు పీక్కున్న అంపైర్లు ఇంకేమీ చెయ్యలేక ఆట కొనసాగించారు.

స్కోరు - 16/0 రెండు బంతుల్లో

0.3 మూడోబంతి లెగ్ స్టంపు మీద పిచ్ అయ్యి, భుజాత గారి పేడ్ కి తగిలి స్క్వేర్ లెగ్ లోకి వెళ్ళింది. అక్కడ ఉన్న పద్మ గండుపిల్లి గారు బంతిని ఫీల్డ్ చేసే లోగా లెగ్ బై కి భుజాతగారు పరిగెత్తటం మొదలు పెట్టారు. అయితే అవతలి వైపు ఉన్న సత్యనారాయణ వర్మగారు వారిని వారించారు - "ఇప్పుడు రాహుకాలం నడుస్తోంది. బైలకి, లెగ్ బైలకీ సరయిన సమయం కాదు. ఒక పావుగంట ఆగండి"

స్కోరు - 16/0 మూడు బంతుల్లో

మళ్ళీ ఆటలో అంతరాయం - పెవిలియన్ లో కూర్చున్న కవిగారు అక్కడ ఉన్న ఛీర్ గర్ల్ మీద ఏదో చిలిపి కామెంటు వదిలారనే కబురు వినిపిస్తోంది. అయితే అది పెద్దగొడవ కాదు కాబట్టీ ఆటమళ్ళి త్వరలోనే మొదలవ్వవచ్చు.

ఈలోగా ఒక వ్యాపార ప్రకటన - స్కోరు బోర్డు మీద :

****************************

నమస్కారమండీ !

మాచ్ కి సంబందం లేని ఆడ్ చూపిస్తున్నందుకు మన్నించాలి.
మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా వంకలిని మీ ముందుకు తెచ్చాము.
ఈ వంకలినిలో ప్రత్యేకతలు
1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగులకి లేనటువంటి వేగం వంకలిని సొంతం
2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
ముందుమాట అనే పేజి లో వంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా వంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.

ఇట్లు
వంకలిని బృందం


*********************


ఆట మళ్ళీ మొదలయ్యింది.

0.4 మార్తాండ గారి నాలుగవ బంతి వేగంగా వచ్చి ఆఫ్ స్టంప్ బయట పిచ్ అయ్యి భుజాతగారి బేట్ ఎడ్జ్ కి తగిలి స్లిప్పుల్లోకి వెళ్ళింది, అయితే అక్కడ ఉన్న బూజుమల్లి గారు కేచ్ వదిలేశారు. భుజాతగారికి ఒక లైఫ్.

రిపోర్టర్ మంచుగారి కథనం ప్రకారం ఒక మగవాడి చేతిలో ఒక మహిళని అవుట్ చెయ్యటం ఇష్టంలేని స్త్రీవాదిగా ఆమే ఆ కేచ్ వదిలేశారని తెలుస్తోంది.

ఈసారి మార్తాండ ఫీల్డర్ పై విరుచుకుపడ్డారు "కెలుకుడుగాళ్ళు తిట్టినప్పుడు మాట్లాడని స్త్రీవాదులు వాళ్ళు ఇప్పుడు శ్రీరంగనీతులు చెప్తే నమ్మెయ్యటానికి నేను గడ్డం పెంచిన సన్నాసినా?" అంటూ

స్కోరు 16/0 నాలుగు బంతుల్లో

0.5 మార్తాండ గారి అయిదవబంతి మళ్ళీ ఆఫ్ స్టంప్ బయట, ఈ సారి భుజాతగారు బేక్ఫుట్ వెళ్ళి లాఘవంగా స్క్వేర్ కట్ చేసి పాయింట్ బౌండరీకీ బంతిని తరలించారు. నాలుగో స్లిప్పులో ఉన్న ఏండీ, పాయింటులో ఉన్న భోజ్ కుమార్ లు బంతి కోసం పరిగెత్తారు, అయితే దాన్ని ఎవరు ఫీల్డ్ చెయ్యాలన్న విషయం పై ఒక నిర్ణయానికి రాలేక తమ అక్క నేస్తం గారికి ఫోన్ చేశారు. ఈలోగా బంతి బౌండరీని దాటింది. నాలుగు పరుగులు.


స్కోరు 20/0 అయిదు బంతుల్లో

0.6 ఓవర్లో ఆఖరి బంతి మార్తాండ ఫుల్ లెంగ్త్ వేశారు దాన్ని భుజాత గారు ఫ్రంట్ ఫుట్ మీద అద్భుతంగా ఫ్లిక్ చేశారు, అయితే ఫార్వార్డ్ షార్ట్ లెగ్ లో ఉన్న బద్రీ అంతకన్నా అద్భుతంగా డైవ్ చేసి బంతిని ఫీల్డ్ చేశారు.

స్కోరు ఒక ఓవర్లో 20 పరుగులు. మొదటి ఓవర్ సమాప్తం.

ఇప్పుడు కాస్త విరామం, తరువాయి విషయాలు మిగతా టపాల్లో :)


Check the original post here: https://profiles.google.com/bharadwaj.velamakanni/posts/BtQQwi8EMyc



:)