Sep 11, 2018

బ్లాగు పాఠశాల - రెండవభాగం





"ఏరా పిల్లలూ! అంతా సెట్టయ్యారా?"
"ఏం సెట్టో ఏమో సార్! ఎక్కడేసిన గొంగళక్కడే ఉంది."
"ఏవైందయ్యా?"
"చూడండి సార్! ఎలా కొట్టుకుంటున్నారో!"
"ఆ(! చూస్తున్నా!"
"మేషారూ! వచ్చేసా!!"
"ఎవరయ్యా నువ్వు? ఎప్పుడూ చూళ్ళేదూ?"
"నాపేరు వరుణ్ సార్. 2010 నించీ ఉన్నా, కానీ క్లేసు బయట ఉండి పాఠాలు నేర్చుకున్నా!"
"అబ్బో! ఏకలవ్య శిష్యుడివన్నమాట. సరే, కూర్చో!"
"సార్! నాకో సందేహం!"
"ఏంటి జిలేబీ?"
"అసలు ఏకలవ్యుడంటే ఎవరు సార్? ఒక్కరికే 'లవ్యూ' చెప్పేవాడా?"
"అబ్బా! అసలు ..."
"మీరుండండి సార్. ఈ జిలేబీ పని నేను పడతా!"
"నువ్వెవరు బాబూ?"
"నా పేరు చిరంజీవి సార్!"
"ఓహో! తమ్ముడూ, లెట్స్ డూ కుమ్ముడూ అని ఇందాక 150 సార్లు పాడి 150 బ్లాగుల్లో కామెంట్లు పెట్టింది నువ్వేనా?"
"మరే!"
"అబ్బో, ఎంత సిగ్గో, చాల్ చాల్లేగానీ కూర్చో!"
"సార్! సార్!"
"ఏంటయ్యా అనామకం?"
"గ గా గి గీ గు గూ"
"ఆపేయ్! ఆ తరవాత అక్షరం పలకద్దు!"
"అబ్బా మేష్టారూ! అదేనండీ అసలు రహస్యం. మన మేగాస్టారుకి జిలేబీ మీద ఉన్న లవ్వు ఈ విధంగా తిట్లరూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడని నాకో పెద్ద డౌటానుమానమండీ!"
"నీ మొహం. ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటూంటే లవ్వేంటీ? అయినా దీనికీ ఆ 'గ' గుణింతానికీ సంబంధమేంటీ?"
"మరేమో .. ఆ రౌడీగాడు జీలేబీని 'జీలేబీ సార్!' అంటాడండీ. ఆ శాల్తీ ఏమో సారో మేడమో తెలియకుండా మొహం మీద ముసుగేసుకుందండీ. ఒక వేళ ఆడలేడీ కాకుండా మగజెంట్ అయితే మనం చదవాల్సింది గ గుణింతం సెక్షన్ 377 కదండీ?"
"ఏడిసినట్టుంది నువ్వూ నీ తొక్కలో లాజిక్కూనూ! ఏమయ్యా రౌడీ, ఏమిటీ గోల?"
"నాకేం తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండీ సార్!"
"సార్! ఈ క్లాస్ రూముకి పట్టిన చీడ ఈ అపర లిబరల్ రౌడీగాడూ, ఆ అపర కన్సర్వేటివ్ హరిబాబూనూ! వీళ్ళవల్ల ఎంతమంది క్లేసు విడిచి పారిపోయారో!"
"ఎవరయ్యా మాట్లాడుతోందీ?"
"తెలియదు సార్! ఎవడో వెనక బెంచీ పోరగాడు!"
"ఫట్ ఫట్ ఫట్"
"ఏంటయ్యా ఆ శబ్దం?"
"సార్! రౌడీగాడు చొక్కా చింపుకుంటున్నాడండీ!"
"ఏమయ్యా రౌడీ నీకిదేం వెఱ్ఱి?"
"వెఱ్ఱికాదు సార్! జనాలని  ఇక్కడనుండి వెళ్ళగొట్టగలిగే శక్తీ, సత్తా, సీనూ, దృశ్యం నాకున్నాయని తెలియగానే  నా ఛాతీ మోదీగారి 56 అంగుళాల ఛాతీలాగా పొంగిపోయి చొక్కా చిరిగిపోయిందండీ!"
"అఘోరించావులే!"
"ఇంతకీ ఆ జనాలు పారిపోలేదండీ. ఈ క్లేసంటే బోర్ కొట్టీ ఫేస్‌బుక్ లోకెళ్ళిపోయారంతే!"
"నా క్లేసుని బోరంటావా? ఛంపేస్తా! బస్తీమే సవాల్!"
"ఎవరదీ? సవాల్ అన్నది? నేను కూడా విసరనా ఒక ఛాలెంజ్?"
"హమ్మయా! హరిబాబూ!  సవాల్ అనగానే నిద్ర లేచినట్టున్నావుగా?" 
"సార్! మీరేమనుకోకపోతే నాదో చిన్న సలహా. ఈ క్లేసులో ఇలాంటి చర్చలు మంచివి కావు సార్. అనవసరమైన బూతులు దొర్లుతాయి!"
"సరేనయ్యా శ్యామలరావ్! కాసేపట్లో ఆపేద్దాంలే!" 
"ఒరేయ్! నీ యెంకమ్మా!!"
"పోరా! నీ సుబ్బమ్మా!"
"ఏంటర్రా? ఏం జరుగుతోందిక్కడా?"
"ఏమీ లేదు సార్! ఆ వరుణ్ కుమారూ, చిరంజీవీ ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటున్నారంతే"
"ఎవరక్కడ? ఆ వరుణ్ కుమార్ పుస్తకాలు క్లేస్ బయటకు విసెరెయ్యండ్రా!"
"అలాగే సార్!"
"హమ్మయ్యా!"
"సార్! సార్!! సార్!!!
"ఇప్పుడేమయిందయ్యా చౌదరీ?"
"సార్! ఆ రౌడీగాడు  వరుణ్ పుస్తకాల్తో పాటు నా పుస్తకం కూడా విసిరేశాడు సార్!"
"ఏమయ్యా రౌడీ! ఏం పోయేకాలం నీకు?"
"అది టెంపరరీగానే సార్. ఒక సారి నాతో మాట్లాడితే వాటిని మళ్ళీ తీసుకొస్తా. ఇంకా మాట్లాడలేదు మరి! అన్నట్టు ఇక్కడ విసిరేసే బాధ్యత నా ఒక్కడిదే కాదు సార్. నేను టీములోని ఒక మెంబర్ని మాత్రమే"
"ఇదేం తలనెప్పిరా బాబోయ్! సరేగానీ జనాల గుంపులు పెద్దగా కనబడట్లేదేం?"
"పద్మార్పిత ఈ మధ్య తన రసరమ్య శృంగారభరిత ప్రేమకవితలు తగ్గించింది సార్!"
"ఓహొ!"
"సార్! నా బెంచిలో జనాలిలా కొట్టుకోవడం నాకిష్టం లేదు. ఈ బెంచి మీదకి ఇంకెవర్నీ రానివ్వదల్చుకోలేదు!"
"సరే కొండలరావ్! నీ ఇష్టం!"
"సార్ ఇదన్యాయం!"
"మళ్ళీ ఏమిటయ్యా హరిబాబూ?"
"బెంచి  క్లీన్ చేస్తే మొత్తం క్లీన్ చెయ్యాలి గానీ సగం సగం క్లీన్ చేస్తే ఎలా సార్? దానివల్ల ఆ చౌద్రీ భాయ్ హీరో, నేను విలనూ అయిపోయాం!'
"ఖర్మ! బాబూ కొండలరావ్! ఆ సంగతేంటో కాస్త చూడు!"
"అసలే దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. తెలంగాణా చిత్రం చాలా అస్పష్ట స్పష్టంగా ఉంది!"
"ఎవరదీ? ఓహో భండారు శ్రీనివాసరావా? నీ చుట్టూ కూడా చిన్నపాటి సమూహముందిగా?"
"సార్! నాదో సలహా!"
"చెప్పవయ్యా విన్నకోట నరసింహారావ్!"
"ఏమీ లేదుసార్! మన క్లేసురూముల్లో బెంచీలమీదా ఫేనుల మీదా ఆ రాజకీయనాయకుల పేర్లు తీసేస్తే ఇక్కడ జరుగుతున్న తమాషాకి ఫుల్-స్టాప్ పడుతుంది!"
"అవునా? సరే, ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం!"
"సార్! ఇది నమ్మడానికి జనాలు చెవిలో పువ్వులు పెట్టుకున్నారనుకుంటున్నారా?"
"ఎవరయ్యా అదీ? ఓ! జై గొట్టిముక్కలా? ఏమిటయ్యా నీ బాధ?"
"గత సంవత్సరం మీ మద్దతు లేకుండా ఈ బెంచీల మీద ఫేన్ల మీద ఆ పేర్లుపడెవే కావు. ఇవన్నీ ఎందుకని జనాలు మిమ్మల్ని నిలదీస్తుంటే మీరు నేరాన్ని ప్రిన్సిపాల్‌గారిమీదకు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు!"
"అది కాదయ్యా! అసలు నేను చెప్పేదేమిటంటే ..."

"సొమ్ములు ఉండెడి క్లాసుల
దుమ్మును దులిపేటి సారు దూసుకురాగా
కొమ్ములు తిరిగిన కుంకలు
గమ్మున పడిచచ్చె నేడు గదనె జిలేబీ!" 

"అయ్యబాబోయ్! జిలేబీ పద్యవిహారం. లగెత్తండ్రోయ్!"
"సరే పారిపోదాంగానీ, క్లేసులో ఉండే సొమ్ములేంటీ?"
"నీ బొంద. విశాఖ మాండలికంలో పశువుల్ని సొమ్ములంటారు!"
"ఆ(!!"


(సశేషం!)

Jul 10, 2018

అయితే, ఇప్పుడేంటి? - 2


.
Previously ... 
.
సరిగ్గా వారిద్దరూ ఒకరినొకరు చేరే సమయంలో.... 
.
[లో-ఎలివేషన్ నించి కేమెరా వైపుకు నడుస్తూ అతడు ... సూర్యుడి కిందనుండి సూర్యుడి మధ్యకు వచ్చిన అతని తల]
.
అతన్ని చూసిన వాళ్ళిద్దరూ ..... 
.....
ప్రస్తుతం  
.....
.
[సీన్ పాజ్ లో .. నిలిచిపోయిన సముద్రం, స్థంభించిన వాయువు, ఆగిపోయిన పక్షులు, అతనిమీద చూపు ఫోకస్ చేసిన వీళ్ళిద్దరూ]
.
బేక్ గ్రౌండ్లో .. "వీడు ఆరడుగుల బుల్లెట్టూ!" ట్యూను .. 
.
'ప్ ... ప్... ప్..." ఇద్దరికీ నోళ్ళు పెగలట్లేదు "ప్..ప్..ప్..." 
.
ఆనందమో, ఆశ్చర్యమో, అసహనమో తెలియని ఇద్దరి పరిస్థితీ .. 
.
"వీడు ఆరడుగుల బుల్లెట్టూ!"
.
'ప్ ... ప్... ప్..." 
.
అనితరసాధ్యమైన స్టైల్లో ఫోన్ బయటకి తీశాడతడు, బటన్ నొక్కగానే ఆరడుగుల బుల్లెట్ రింగ్ టోన్ ఆగిపోయింది.. 
.
[కేమరా ఔట్ ఆఫ్ ఫోకస్ నుండీ, ఫోకస్ అతని మొహం మీదకి] 
.
మొదటగా నోరు విప్పిన కత్తి .. 
.
"ప్ .. ప్.. పెసరట్టబ్బాయ్!" (గమనిక: "ప" తో మొదలయ్యే పదం "పవన్" ఒకటే కాదు) 
.
"అలో! ఏటీ? నాను ఇసాపట్నం ఒగ్గీసి సిత్తూరొచ్చీసినాను కదేటి ... ఆ .. అలగలగే ..ఇంకా పది పెసరట్లు ఉండిపోనాయ్.. ఫోన్ పెట్టియ్యైస్!" అంటూ మారుమ్రోగిన పెసరట్టబ్బాయ్ కంచు కంఠం .. 
.
(పెసరట్టుకి ఇంత సీనేమిటని చొప్పదంటు ప్రశ్నలడగద్దు .. ప్రధాన మంత్రిగారినడగండి .. చాయ్ అమ్మేవాడు మాత్రమే మహా యోగి, పకోడిలూ, పెసరట్లూ అమ్మేవాడు మాత్రమే మహా భోగి .. అదీగాక పెసరట్టు అనేది టాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎఱుగని ఫ్లో కేం మహాద్భుతం) 
.
"పెసరట్టూ .. ట్టూట్టూట్టూట్టూట్టూట్టూ!" అంటూ స్లో మోషన్లో అతనివైపు పరిగెడుతున్న కత్తీ, కన్నా! 
.
[కేమెరా టర్న్ వారిమీదనుండి అతని మొహం మీదకి]
.
అతని మొహంలో మారుతున్న కవళికలు .. 
.
"అయ్ బాబోయ్! దోస్తానా సూసీసినాగానీ ఇది మరీ గ్రూపు దోస్తానాలా ఉందేటీ? వోరి గొల్లిగా! లగెత్తరోయ్!!" అంటూ పరిగెత్తబోయిన అతడు .. 
.
"అబ్బాయ్! ఆగు. మేము పెసరట్లు కొనడానికి వస్తున్నాం. పెసరట్టు సినిమా చూపించడానికి కాదు!!" అన్న అరుపుతో శాంతించాడు .. 
.
[సీను కట్]
.
[తరువాయి సీన్లో పెసరట్లు తింటున్న కత్తి, కన్నా ... పక్కనే పెసరట్టబ్బాయ్!]
.
"నీ పెసరట్లు సూపరుండాయబ్బా! నీ పేరేంటీ?"
.
"పవనండే! పవన్ కల్యాణ్ ఫేన్సుని. ఆయనే నా దేవుడు" 
. 
"అవునా? ఆ రింగుటోన్ బట్టే గెస్ చెయ్యాల్సింది. సరే నీకు కూడా ముగ్గురు పెళ్ళాలా?" 
.
"ఊరుకోండి సామే. అదేదో పెద్ద తప్పయినట్టు మాట్లాడతారు. మూడు పెళ్ళిళ్ళేగా చేస్కున్నా, ముగ్గుర్ని ఉంచుకోలేదుగా? ఆ మాటకొస్తే పెద్దాయన పెళ్ళయినరోజే పెళ్ళాన్ని ట్రిపుల్ తలాక్ కూడా ఇవ్వకుండా వదిలెయ్యలేదా? అన్నగారు రెండోపెళ్ళి చేస్కోలేదా? ఆయనకీ కృష్ణకుమారికీ మధ్య ఏదో ఉందని పుకార్లు లేవలేదా? ఇక లోటస్ పాండుగారిమీదున్న అభియోగాలు ఒకటా రెండా? అందరూ ఒకగూటి పక్షులేగా? పచ్చాళ్ళూ, పుష్పాలూ, పుల్కాలూ, జఫ్ఫాలూ .. మచ్చలందరికీ ఉన్నాయ్, కానీ అవి మంచివే!" అంటూ లెక్చరిచ్చాడు పెసరట్ల పవన్! 
.
"అబ్బో! నీకు శానా ఉందే! అన్నట్టూ, నీ విశాఖపట్నం యాస ఏమైపోయిందీ?"  
.
"తూచ్. అలా ఫ్లోలో మామూలు బాస ఒచ్చీసినాదండే. అల్లదిగో ఆ బేపి సూడండే, ఇజిలేస్తే ఎల్లిపొచ్చీస్తాది" 
.
"క్లేరిటీ లేకుండా, మాటిమాటికీ మాట మార్చడానికి ఇవి మీ నాయకుడి రాజకీయాలు కావు పవన్!" అని గద్దించారు మనవాళ్ళిద్దరూ .. 
.
[లెఫ్టు సైడు టర్న్ ఇచ్చుకున్న పవన్ ఎడమవైపు కేమెరా - ఎదురుగుండా ఫోకస్ లో కన్నా]
.
"ఆగాగు! నిన్నెక్కడో చూసినట్టుంది. నువ్వు విశాఖ జిల్లా కాంగ్రెస్ నాయకుడివి కడూ?"
.
"ఏమంటున్నావ్ కన్నా?" గొంతులో అల్లం ఇరుక్కున్న కత్తి
.
"అవును కత్తీ, వీడు వాడే, మనమీద స్పై చెయ్యడానికొచ్చిన కాంగ్రేస్ వాడు!" 
.
(సశేషం)

Jul 9, 2018

అయితే, ఇప్పుడేంటి?




అటుచేసీ, ఇటుచేసీ మన కత్తిగారు బీజేపీలో చేరాలీ... అప్పుడుంటుంది ... వాళ్ళు లాక్కోలేరూ, వీళ్ళు పీక్కోలేరూ... ఇప్పటిదాకా తిట్టినవాడు పొగడలేడూ, ఇన్నాళ్ళూ పొగిడినవాడు తిట్టనూలేడు! 

అలా జరిగితే ఎలాఉంటుందోనన్నదానీమీద ఒక ఊహాజనిత సీరీస్: 


కొన్నాళ్ళకి.. ఇద్దరు వ్యక్తులు.. ఒకరివైపొకరు... చిత్తూరు బీచ్ లో! 

చిత్తూర్లో బీచేంటంటారా? అయితే ఆర్. సంధ్యాదేవిగారి నవలలు మీరు చదవలేదన్నమాట.. చదివిరండి.. వైర్లెస్ తీగలపై పక్షుల కిలకిలారావాలు కూడా వినచ్చు.. 

సరే, మన బీచ్ సీను.. ఒకరి వైపొకరు ... స్లో మోషన్లో.. 

................................... [కన్నా వెనకాల కేమెరా]

“కత్తీ... త్తీత్తీత్తీత్తీ!”
“కన్నా...న్నాన్నాన్నాన్నా” 

....................................[కత్తి వెనకాల కేమెరా] 

“కత్తీ... త్తీత్తీత్తీత్తీ!”
“కన్నా...న్నాన్నాన్నాన్నా” 

................................[పైనుండి ఏరియల్ డ్రోన్ షాట్] 

“కత్తీ... త్తీత్తీత్తీత్తీ!”
“కన్నా...న్నాన్నాన్నాన్నా” 

.......................[ఇద్దర్నీ పేన్ చేసే కేమెరా షాట్, పడమటినుండి .. ఇద్దరిమధ్యా ఉదయిస్తున్న సూర్యుడు]  


సరిగ్గా వారిద్దరూ ఒకరినొకరు చేరే సమయంలో....

[లో-ఎలివేషన్ నించి కేమెరా వైపుకు నడుస్తూ అతడు ... సూర్యుడి కిందనుండి సూర్యుడి మధ్యకు వచ్చిన అతని తల]

అతన్ని చూసిన వాళ్ళిద్దరూ .....

(To be continued... Bahubali style)

Jun 18, 2018

కొత్త సామెతలు




1. మంతెనకెక్కువ, వీరమాచనేనికి తక్కువా!

2. పోస్టు జగనుమీదా, కామెంటు కొండలరావుమీదా!

3. జిలేబీనే పద్యాలతో విసిగించినట్టు

4. పద్మార్పిత బ్లాగులో రాజకీయ గొడవలు

5.  అన్న హరిబాబు బ్లాగులో తమ్ముడు చౌదరిబ్లాగులో 

6. అటు జ్ఞానామృతం, ఇటు FLR 

ఇక మీరే కొససాగించచ్చు .. 

Jan 7, 2018

ఆటవెలది 😂



గజలు బాబుకు పడెను గట్టిగానే రంగు
ఆకసమునకు పడెను ఆంధ్రలోన
కత్తిబాబుకింక కల్యాణమవ్వునా?
వేచిచూచు వార్కి వేడుకింక!