అటుచేసీ, ఇటుచేసీ మన కత్తిగారు బీజేపీలో చేరాలీ... అప్పుడుంటుంది ... వాళ్ళు లాక్కోలేరూ, వీళ్ళు పీక్కోలేరూ... ఇప్పటిదాకా తిట్టినవాడు పొగడలేడూ, ఇన్నాళ్ళూ పొగిడినవాడు తిట్టనూలేడు!
అలా జరిగితే ఎలాఉంటుందోనన్నదానీమీద ఒక ఊహాజనిత సీరీస్:
కొన్నాళ్ళకి.. ఇద్దరు వ్యక్తులు.. ఒకరివైపొకరు... చిత్తూరు బీచ్ లో!
చిత్తూర్లో బీచేంటంటారా? అయితే ఆర్. సంధ్యాదేవిగారి నవలలు మీరు చదవలేదన్నమాట.. చదివిరండి.. వైర్లెస్ తీగలపై పక్షుల కిలకిలారావాలు కూడా వినచ్చు..
సరే, మన బీచ్ సీను.. ఒకరి వైపొకరు ... స్లో మోషన్లో..
................................... [కన్నా వెనకాల కేమెరా]
“కత్తీ... త్తీత్తీత్తీత్తీ!”
“కన్నా...న్నాన్నాన్నాన్నా”
....................................[కత్తి వెనకాల కేమెరా]
“కత్తీ... త్తీత్తీత్తీత్తీ!”
“కన్నా...న్నాన్నాన్నాన్నా”
................................[పైనుండి ఏరియల్ డ్రోన్ షాట్]
“కత్తీ... త్తీత్తీత్తీత్తీ!”
“కన్నా...న్నాన్నాన్నాన్నా”
.......................[ఇద్దర్నీ పేన్ చేసే కేమెరా షాట్, పడమటినుండి .. ఇద్దరిమధ్యా ఉదయిస్తున్న సూర్యుడు]
సరిగ్గా వారిద్దరూ ఒకరినొకరు చేరే సమయంలో....
[లో-ఎలివేషన్ నించి కేమెరా వైపుకు నడుస్తూ అతడు ... సూర్యుడి కిందనుండి సూర్యుడి మధ్యకు వచ్చిన అతని తల]
అతన్ని చూసిన వాళ్ళిద్దరూ .....
(To be continued... Bahubali style)
Wonderful
ReplyDeleteThx
Deleteఉదయిస్తున్న సూర్యుడు - 'సన్' టీ వీ యా :)
ReplyDeleteతరువాయిభాగంలో details ;)
Delete