May 17, 2009

ప్రమాదవనానికి వంద రోజులు

ఏమిటో ఈ మధ్య బ్లాగుల్లో చాలా అసహ్యకరమైన ప్రశాంతత నెలకొని ఉంది - పెద్దగా గొడవలు లేవు, అరుపులు తిట్లు శాపనార్ధాలు కనబడటమే లేదు. ఇలా అయితే ఎలా? మన తెలుగు బ్లాగులు ఏమైపోవాలి? దీనిని మా కె.బ్లా.స (కెలుకుడు బ్లాగర్ల సంఘం) తీవ్రంగా ఆక్షేపిస్తొంది. కనుక గొడవలు యధాతధంగా సాగించవలెననియూ, బ్లాగులకు పూర్వ వైభవమును తీసుకురావలెననియూ ఈ బ్లాగు ముఖంగా యావద్బ్లాగర్లనూ మేము కోరుకుంటున్నాం.

శరత్ అన్నట్టు ఎవరి బ్లాగుల్లో వాళ్ళు బుధ్ధిగా వ్రాసుకుంటూ పోతే మజా ఏముంటుంది చెప్పండి? అందుకే మా మహాకవయిత్రి నెరజాణ అప్పలమ్మగారు అన్నారు "స్వంత బ్లాగును కొంత మానుక, పొరుగు బ్లాగును కెలికిపెట్టోయ్" అని


సరే, అసలు విషయానికి వస్తే ప్రమాదవనానికి 100 రోజులు పూర్తవుతున్నాయి. మొదటి యాభైరోజులు చాలా హుషారుగా గడిచినా తర్వాత బ్లాగుల్లో గొడవలు లేక ఈ వనం వెలవెలబోతోంది.

* ధూము తన ఇంజన్లో స్టీము తగ్గించి కందాబచ్చలి వెంటపడ్డారు

* కాగడాలో తైలం నిండుకుని బ్లాగు మూతపడింది

* రవిగారేమో "విటుడి పడక" అను "బూతులు" మానేసి ఆయన నడక "అనుభూతులు" పంచుకుంటున్నారు

* శరత్ శృంగార బ్లాగుల్లో పాలు పంచుకోవడం మానేసి సైన్యం బ్లాగులో ఆవుపాలు పంచుతున్నారు

* పెళ్ళికాని శ్రీనివాస్ తీరికూర్చుని పెళ్లి చేసుకుని ఉన్న స్వేచ్చ కాస్తా పోగొట్టుకుని బ్లాగుల్లో కనబడడం మానేశాడు

* జ్యోతిగారు, మిగతా ప్రమాదావనం బేచ్ అయితే "చాలు, మీరు ఆపండి. మేము మొదలెడతాం" అని సంఘసేవ మీద పడ్డారు

* సుజాతగారేమో నోట్లకి వోట్లకి మధ్య చిక్కుకుని 'సత్తా' చాటుకోడానికి విలవిల్లాడుతున్నారు

* "అమ్మఒడే" గాని "ఓడే అమ్మ కాదం" టూ కుట్రలని పూర్తిచేసి ఏనాలసిస్లోకి వచ్చారు ఆదిలక్ష్మి గారు

* శీతాకాలంలో హాటుగా ఘాటుగా ఉన్న మార్తాండ వేసవిలో కూల్ అయ్యాడు

* "ఆ నాలుగురేర" న్నవారు ప్రస్తుతమెందుకో అజ్ఞాతవాసం చేస్తున్నారు

* కాస్త అంతర్యానం పర్ణశాలల మధ్య జరుగుతున్నపోరాటమే కొంచం బ్లాగులకి జీవంపోస్తోంది - మధ్య మధ్యలో రానారే గారి అద్వైత సిధ్ధాంతాలతో

ఈ పరిస్థితిలో నేను కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నా - నా స్థితికి ప్రతిబింబమే ఈ పేరడీ:

------------------------------------------

దోమనైనా కాకపోతిని మనిషి రక్తము( బీల్చగా
ధూమునైనా కాకపోతిని ఈ-తెలుగును చీల్చగా

జ్యోతినైనా కాకపోతిని పొద్దు స్లిప్పులు పెట్టగా
కాగడానే కాకపోతిని విమర్శించగ గట్టిగా

అమ్మఒడినే కాకపోతిని కుట్రలను దులిపెయ్యగా
శిరీష మార్తాండ కాకపోతిని గంటకో పోస్టెయ్యగా

నిడదవోలుని కాకపోతిని ఇంటర్వ్యూలో తిట్టగా
ముప్పాళ్ళని కాకపోతిని ఎదురుతిరిగీ మొట్టగా

_________________________________________

నేను మహేష్ కత్తినయితే "కోకు"నుదహరించనా
"ఆవకాయ" లో సాయినయితే పర్ణశాలను చించనా

ఏ2జీ డ్రీంస్ నేనే అయితే "చిరు"త పలుకులు పలకనా
జీడిపప్పుని నేనయితే చిలకమర్తిని కెలకనా?

__________________________________________


తోటరాముని కాకపోతిని అందరినీ నవ్వించగా
(రవి) గారినైనా కాకపోతిని చిలిపిగా కవ్వించగా



.