Oct 28, 2011

చెగువేరా, ఇటు కాస్త రామ్మా! ఆ పీకేదేదో ఇక్కడ కాస్త పీకు :))









ఆచంగ గారి బ్లాగులో చెగువేరా గారు శెలవిచ్చారు:

"నాతో పెట్టుకుంటే బ్లాగుల్లో బ్రతకలేవు సోదరా" అని ...

నాకు నిజంగా ఈ బ్లాగులు పెద్ద ఎడిక్షన్ అయ్యాయి. ఎంత వదిలించుకుందామని చూసినా వదలట్లేదు. కనుక ఈ చెగువేరాతో పెట్టుకుందామని ఉంది. చూద్దాం మనవాడికి నన్ను బ్లాగుల్లోంచి వెళ్ళగొట్టగలిగే సీనుందో లేదో. వాదించటానికి పాపం తగిన మెటీరియల్ లేకపోతే కమ్యూనిష్టు జోకర్లు ఎలాంటి బెదిరింపులకి దిగుతారనేదానికి ఇదే పెద్ద ఉదాహరణ.


ఆ ప్రయత్నంలో భాగంగా ఆచంగ గారు వ్రాసిన పోస్టులో కొంతభాగాన్ని ఇక్కడ యథాతథంగా కాపీ కొడుతున్నా. పూర్తి పోస్టు చదవాలంటే లంకె ఇదిగో:

http://krishnaveniteeram.blogspot.com/2011/10/3.html


ఇక 25 సం అధికారములో ఉండటమంటే ఒక రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చెయ్యవచ్చో ఆలోచించండి. మతతత్వవాది అని తెగ ఆడిపోసుకునే మోడీ సాధించినదాంట్లో పావుశాతం కూడా నాకు కనబడలేదు. నేడు వీళ్ళు తెగ తిట్టిపోసే మోడీ అధికారములో ఉన్న గుజరాత్, నితీశ్ అధికారములో ఉన్న బీహార్ నేడు ఫలితాలు ఎలా చూపిస్తున్నాయో మనకు అర్థము అవుతుంది. వెంటనే వీళ్ళంటారు అదంతా మీడియా పెయిడ్ న్యూస్ అని. సరే అదేవార్తో పక్కన పడేద్దాం. భారత దేశములో కళ్ళు మూసుకుని ఉద్యోగాలకు ఎగబడుతున్న నగరాలు ఏవి అంటే ఢిల్లీ, హైదరాబాద్, చంఢీగడ్, ముంబాయి, సూరత్, అహ్మదాబాదు, చెన్నై, బెంగళూరు. ఇవి కొన్నే. పసిపిల్లాడి నోటి వెంటయినా పొరపాట్న కూడా కలకత్తా పేరు రాదు. దాన్ని బట్టే అర్థమవుతున్నది కదా బెంగాలుకు కమ్యూనిస్టుల గ్రహణం పట్టి ఏ గతి పట్టిందో! పైగా ఇరవైనాలుగ్గంటలూ బి.జె.పి మాత్రమే మతతత్వ పార్టీగా వీరికళ్ళకు కనబడుతుంది. మతాన్ని రాజకీయాలకు వాడుకునే మరేపార్టీ కనిపించదు దేశములో వీరికి! దీన్ని గ్రహించే కాబోలు మలయాళీలు, బెంగాలీలు తప్పించి దేశములో వీళ్ళని మరెక్కడా పీఠం ఎక్కించలేదు. పీఠం ఎక్కించినవారి పరిస్థితేమిటో కళ్ళముందే కనబడుతున్నది. ఇక వీటి గురించి ఇలా రాస్తూపోతే ఎన్ని బ్లాగులైనా చాలవు.

చెగువేరా, ఆ పీకేదేదో ఇక్కడ కాస్త పీకు :))

Oct 6, 2011

ఒక పాత "కేరడీ" - కెలుకుడు పేరడీ!

"ప్రేమంటే ఇదేరా" - "బొంబాయి బొమ్మ సూడరో" పాటకి నా "కేరడీ"


Audio: (Doesn't work on Buzz)







Lyrics:


బ్లాగుల్లో కొచ్చి చూడరో నీ సిగతరగా నీ మెదడు కుళ్ళిపోవురో
ఒక్క పోస్టు చదివి చూడరో నీ సిగతరగా ఎర్రగడ్డకి పారిపోనురో


చరణం:

వస్తునే వెల్కం చెబుతా
నీకు టెంప్లేట్ చేసిపెడతా
వందకి పైగా కామంట్లే పెట్టిస్తా
కాగడా పేరడీ వ్రాయించేస్తా

కెబ్లాసలో వచ్చి చేరవోయ్ నీ సిగతరగా కెలుకుడంతా నేర్పుతామురోయ్
నీకన్న తోపు ఎవ్వడొయ్, నీసిగతరగా ఎదుతొస్తే కాలులాగవోయ్


చరణం:

అక్కల వంటలు తినిపిస్తా
కడుపులో మొత్తం దేవిస్తా
మార్తండం బ్లాగు కధలన్నీ చదివిస్తా
పొద్దున తిన్నది కక్కించేస్తా

కూడలిలో వెతికి చూడకోయ్ నీ సిగతరగ ప్రపీసస కానరాదురోయ్
ఇంకానీ కోపికుందటొయ్ నీ సిగతరగా పరమవీర చక్ర నువ్వేనోయ్