Showing posts with label కుక్కకాటుకు చెప్పుదెబ్బ. Show all posts
Showing posts with label కుక్కకాటుకు చెప్పుదెబ్బ. Show all posts

Sep 13, 2013

రంగనాయకమ్మ కామెడీ: (Original by Ramadandu)

(Copy-Pasted from a post written by Ramadandu)

రంగనాయకమ్మ:





దశరథుడు కైక కోరిన వరాలకు అదిరిపడి "భర్త ముద్దుగా వరాలు కోరుకోమంటే మాత్రం చక్కగా భర్తకు సంతోషం కలిగించే వరాలు కోరుకోవాలి గానీ భర్తకు నష్టం కలిగించే వరాలు కోరుకోవచ్చునా?" అని విసుక్కున్నాడు. చక్కగా భార్యలు చీరలో, నగలో కోరుకుంటే దశరథ మహారాజు గారు వాటిని తక్షణం తెప్పించి ఇచ్చి తమ కీర్తికాంతులు నలుదిశలా వెదజల్లేవారే, అంత కీర్తి తప్పిపోయినందుకు మహరాజు భార్య మీద మండిపడ్డాడు "దుష్టురాలా! నీ వరాల్ల నేను రాముణ్ణి అడవికి పంపితే ఆ దు:ఖంతో నేను చచ్చిపోతాను. నా కోసం రాముడు చచ్చిపోతాడు, లక్ష్మణుడు చచ్చిపోతాడు. భరతుడు చచ్చిపోతాడు. శతృఘ్నుడు చచ్చిపోతాడు రాణులందరూ చచ్చిపోతారు" అంటూ తనతోపాటూ చచ్చిపోయే వాళ్ళ పట్టీ చదువుతాడు. కానీ తమాషా ఏమంటే దశరథుడు చచ్చిపొయిన తర్వాత ఒక్కరన్నా చచ్చిపోలేదు. పైగా అయోధ్యలో సందడి ఇంకా ఎక్కువ అయ్యింది. "ముసలి రాజు పోయాడు పెద్ద కొడుకు అడవుల్లో ఉన్నాడు. భరతుడింకా రాలేదు. ఇప్పుడేం జరుగుతుందో" అనే ఉత్సాహంతో జనం ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు.



తమపిల్లలు తమని ప్రేమిస్తారని ప్రతీ తండ్రీ అనుకుంటాడు. దశరథ మహారాజు కూడా అలానే అనుకున్నాడు.  అందుకు ఆయన మీద జోకులు!! ఏం చేస్తాం మన ప్రారబ్దం!! పైన వాక్యం లో కవి దశరథుడికి తన కుమారులతో  ఉన్న అనుబంధాన్ని వివరించడం సుస్పష్టం. దానిలోని ఒక వాక్యాన్ని బయటకు తీసి రంగనాయకమ్మ తమాషా అనడం అమె ప్రవృత్తికి నిదర్శనం. తండ్రిలేని జీవితం మనిషికి అంధకారం లాంటిదని పెద్దలు చెబుతారు. అంటే దాని అర్థం ప్రపంచంలోని తండ్రులందరూ తలపైన దీపాలు పెట్టుకుని తిరుగుతున్నారని కాదు.  ఇక జనం ఉత్సాహంతో ఎక్కడికక్కడ కబుర్లలో మునిగి ఉన్నారు అని చెప్పడం సత్యదూరం. భరతుడు రాజ్యంలోకి వచ్చేదారిలో దు:ఖమయమైన నగరాన్ని చూసి ఆందోళన చెందాడని వాల్మీకి మహర్షి రాశారు. తనకు అనుకూలంగా లేదని కాబోలు రంగనాయకమ్మ ఆ ఊసే ఎత్తలేదు. అనుబంధాలని పరిహసించే రంగనాయకమ్మ స్త్రీల గురించి అమ్మల గురించి పుంఖానుపుంఖాలుగా రాయడం తెలుగు జాతికి పట్టిన దౌర్భాగ్యం.


మరొకటి..

తనను, సారథిని, గుఱ్ఱాలనూ రక్షిస్తూ 11వేలమంది శతృవీరుల్తో వొక్కసారిగా యుద్ధంచేసి జయిస్తాడని రుషులు రాముడిని పొగుడుతారు. అలాంటి రాముడు గంగదాటి అడవిలోకాలు మోపగానే "లక్ష్మణా! నువ్వు రాకపోతే సీతని రక్షించడం చాలా కష్టమైపొయేది. మీరిద్దరూ ముందు నడవండి. నేను వెనుక నడుస్తాను. మిమ్మల్ని వెనుక నుంచీ రక్షిస్తాను" అంటాడు. అడవుల్లో రక్షించవలసినవాళ్ళు వెనుక నడవాలా, ముందు నడవాలా??



అడవిలో ముందు నుంచీ మాత్రమే ప్రమాదాలొస్తాయనే రంగనాయకమ్మ తెలివికి లాల్ సలాం! అసలు ఇలాంటి తింగర లాజిక్కులు ఇంకెవరూ చెప్పలేరేమో.. ఒకసారి రంగనాయకమ్మ చేత ఏ తలకోన అడవిలోనో పాదయాత్ర చేయిస్తే అప్పుడు తెలుస్తుంది ప్రమాదాలు ఏ వైపు నుంచీ వస్తాయో. ముందు టపాలో చెప్పినట్టు ఎలాగైన రాముణ్ణి కించపరచాలనే ఆకాంక్ష రంగనాయకమ్మలో బలంగా ఉంది. అందుకే ఇంత అర్థం పర్థం లేని వాదనలు చేయగలిగింది.


ఇంకొకటి..

రాముడు, సీతా, లక్ష్మణుడూ వనవాసంలో అత్రి మహాముని ఆశ్రమానికి వెళతారు. అత్రి భార్య అనసూయ మహ పతీవ్రత. వృద్ధురాలు. నెరసిన జుట్టు వొణికే శరీరం. ఆమె సీతకు పూలదండా, అంగరాగాలు ఇస్తుంది. "నా దగ్గర తపస్సు చాలా మిగిలి ఉంది. నా తపోశక్తితో నీకి బహుమానాలిస్తున్నాను. నిత్యం ఈ పూలదండ ధరిస్తే నువ్వు నిత్య యవ్వనవతిగా ఉంటావు. ఈ అంగరాగాలతో నీ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఇవి ధరిస్తే యవ్వనంతో నీ భర్తకి సంతోషం కలిగిస్తావు" అంటుంది. మరి తన మాట??తనెందుకు వాటిని ధరించి నిత్యయవ్వనవతిగా ఉండలేదు?అత్రి మహాముని గారికి ఆ ముగ్గుబుట్ట తలే ఇష్టం కావున్ను!!

తన తపోశక్తితో అనసూయ సీతకు బహుమతి ఇస్తే మధ్య రంగనాయకమ్మకు బాధ ఎందుకో?? అలాంటి బహుమతులు తనకు ఎవరూ ఇవ్వలేదనా?? లేక ఎలాగైన విమర్శించాలనే తపనా? మరొక విషయం- మనశక్తిని వేరేవాళ్ళకోసం ఉపయోగించడం మనకు వాళ్ళ మీద ఉన్న అనురాగాన్ని ఆప్యాయతని చెబుతుంది. ప్రతీ ఒక్కటి తనకు మాత్రమే కావాలనుకునే స్వార్థపు ఆలోచనలు అనసూయకు లేకపోవడం రంగనాయకమ్మకు కోపం తెప్పించాయి కాబోలు. ప్రపంచంలో అందరూ తనకు నచ్చినట్టే ఉండాలనుకునే వ్యక్తికి నిస్వార్థమైన ఆలోచనలు తమాషా అవడం అతి సహజం.

ఇవన్నీ పక్కన పెడితే ముగ్గుబుట్ట తల అని ముసలివాళ్ళను కించపరచడం - వార్థక్యం అనేది ప్రతీ మనిషికి సహజమైన దశ. దాని గురించి ఇంత నీచంగా మాట్లాడటం - మరి రంగనాయకమ్మకు రాలేదా ముసలితనం?? ఇలాంటి వ్యక్తిని ప్రజలు స్త్రీవాదిని అని, మరొకటని పొగుడుతుంటే వాళ్ళ అజ్ఞానానికి జాలిపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేను..

Sep 10, 2013

రాసేది రంగనాయకమ్మ అయితే చిడతలు వాయించేది చవటాయిలని ..







రంగనాయకమ్మ చెంచాలు విషవృక్షం గురించి ముఖ్యంగా చెప్పేది విషవృక్షంలో లాజిక్ చూడమని. అది కూడా చూద్దాం!

మన సోకాల్డ్ మహారచయిత్రి మాటల్లోనే క్రింది విషయంతో మొదలుపెడదాం.

1. "ఎందుకంటే దశరధుడు కైకని పెళ్ళి చేసుకునేటప్పుడు కైక బిడ్డకే రాజ్యం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు"

2. "రాముడు అడవుల్లో ఉన్నప్పుడు.. అప్పుడు బయటపడింది ఆ విషయం"

3. "ఆ విషయం తెలిసికూడా రాముడు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాడంటే అది రాముడి కపటత్వం అవ్వదూ?"


రామాయణంలోకి వస్తే ఆయోధ్యకాండ నాలుగవ సర్గ పదిహేనవ శ్లోకంలో దశరధుడు రాముడికి పట్టాభిషేకం విషయం చెప్తాడు. అదే సర్గలో రాముడు పట్టాభిషేకానికి సిద్ధమవుతాడు. మంథర పాత్ర ఏడవ సర్గ నుండీ మొదలవుతుంది. అంటే పట్టాభిషేకానికి సిద్ధపడేసమయానికి రాముడికి దశరధుడివరాల సంగతి తెలియదనే కదా? రంగనాయకమ్మ లాంటి మార్క్సిస్టులకి ఆపాటి కనీస జ్ఞానం ఉంటే ఇంకేం?

ఇక అడవుల్లో రాముడు భరతుడితో అన్న మాటలివీ:

(అయోధ్యకాండ నూట ఏడవ సర్గ నుండి)

పురా భ్రాత: పితా న: స మాతరం తె సముద్వహన్
మాతామహె సమాష్రౌశీద్ రాజ్య శుల్కం అనుత్తమం


భ్రాత:= ఓ సోదరా!
పురా= పూర్వము (చాలా రోజుల క్రితం)
సముద్వహన్= పెండ్లాడేటప్పుడు;
తె మాతరం= నీ తల్లికి;
స:= అని
న: పితా= మన తండ్రి
సమాష్రౌశీత్= ప్రమాణము చేసెను
అనుత్తమం= ప్రత్యేకమయిన
రాజ్యషుల్కం= రాజ్యశుల్కం;
మాతామహె= మీ తాతగారికి

అంటే...

"ఓ సోదరా, మన తండ్రి నీ తల్లిని పెండ్లాడేటప్పుడు మీ తాతగారికి రాజ్యశుల్కమిస్తానని ఒప్పుకున్నారు"

ఇచ్చేది ఎవరికి? కైకేయి తండ్రికి.
కైకేయి తండ్రి దానిని తీసుకున్నాడా? లేదు.
అంటే అది కైకేయి తండ్రి తీసుకునేవరకూ దశరధుడి వంశానికే చెదుతుంది. ఒకవేళ తీసుకుని ఉంటే కైకేయి సోదరుడికి చెందుతుంది తప్ప, భరతుడికి చెందదు.

దాని తరువాత రాముడు భరతుడికి దశరధుడి వరాల సంగతి చెప్తాడు.. దాని గురించి కూడా పైనే చెప్పుకున్నాం. కనుక ఇక్కడ భరతుడి హక్కు, అది రాముడికి తెలియడం అనే ప్రసక్తి రానే రాదు.

కానీ రాసేది రంగనాయకమ్మ అయితే చిడతలు వాయించేది ఆవిడ చెంచాలే కదా!

ఇక వాల్మీకి రాముడి భజన గురించి. ఒక మూల కవి ఇలా ఎందుకు రాయలేదు, అలా ఎందుకు రాశాడు అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే రామయణం అనేది వాల్మీకికంటే ముందునుండే ఉందన్న వాదన ఒకటి.

పనిమనిషికి కడుపు చేసి శిష్యుడి మీద వదిలేసిన మార్క్స్ గారికి మరి ఈవిడ చేసేదేమిటో? భజన కాదూ? చెంచాగిరీ కాదూ?


Jul 19, 2012

Continued here ..

It's almost the time Ladies and Gentlemen, Be the insecurities, Be the school teacher stories or Be the Ekalingam anecdotes .. we got them all covered for you - Stay tuned :)

Feb 10, 2012

కాకుల చింతచెట్టు - 3వ భాగం












"నిజం చెప్పు" గద్దించాడు కాపరి ...

"అయ్ బాబోయ్ నాకేం తెలియదు. ఆ చెట్టు మీద ఎవరికీ తెలియకుండా దాక్కున్న మరో ఎఱ్ఱ కాకి ఎం చెప్పమంటే అది చెప్పాను" అని జారుకుంది గుంటనక్క ...

కాపరి ఆ కాకి మీద ప్రశ్నల వర్షం కురిపించాడు.

"మొదటి ఎఱ్ఱ కాకి ఏమంది?"

 “కమ్యూనిజం ఆచరణ లో విఫలమైతే అయిందేమో గానీ, సిధ్ధాంతం మంచిదేనట”, అంది రెండవ ఎఱ్ఱ కాకి

నిజం చెప్పకపోతే ఆ గుంటనక్కకు పట్టిన గతే నీకు పడుతుంది, బెదిరించాడు కాపరి ...

"కమ్యూనిష్టులు కానివారిని బూతులు తిట్టింది" అసలు సంగతి చెప్పింది కాకి

"మరి దానికి ఇంత బిల్డప్పు ఎందులు?"

"అసలే కమ్యూనిష్టులంటే చాలు జనాలు కాండ్రించి ఉమ్మేస్తున్నారు మొహం మీద. ఏదో కాస్త ఇమేజ్ కాపాడూకోవటానికి చెప్పిన అబద్ధం" ఒప్పేసుకుంది కాకి

"అవునా మరి ఇంకేమంది?"

“మన వేదాలలో మంచీ చెడూ రెండూ ఉన్నాయట! వర్ణ వ్యవస్థ వేదాల వలనే వచ్చిందట! ఈ విషయాలని వీళ్ళ ముత్తాత నిరూపించాడట. ఇప్పుడు మళ్ళీ చర్చ అనవసరం అంటూ,  కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోమని వేదాల ఇంగ్లీషు తర్జుమా కి లింకులు కూడా ఇచ్చింది!”, హెడ్ కాకి అరిచింది.

"అవునా? అయితే కమ్యూనిజంలో మాత్రం మంచీ చెడూ లేవన్నమాట"

"ఇమేజ్ గురువుగారూ, ఇమేజ్. వేదాలంటే పాతుకుపోయి ఉన్నాయి. కమ్యూనిష్టులంటే తెలుగు బ్లాగుల్లో యువర్ గాడ్ కన్నా హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నారు. రెండిటికీ పోలిక పెట్తలేం కదా?" అంది కాకి

"ఆహా! లెస్స బలికితివి" ఇంకేమనాలో పాపం ఆ కాపరికి అర్థం కలేదు.

"వైమానిక శాస్త్రం ఫెయిల్ అని కూడ అంది"

"అసలు వైమానిక శాస్త్రం ఎక్కడ దొరికిందో తెలుసా?"

"తెలుసు ఎవరో సుబ్బరాయ శాస్త్రిగారి ద్వారా చెప్పబడింది"

"మరి ఏ త్రవ్వకాల్లో దొరికింది?"

"ఏమో!" నీళ్ళూ నమిలింది కాకి

"విమానాలు త్రవ్వకాల్లో బయటపడాలి, మరి వేదాలు కాకపోయినా  వేదాలకు సంబంధించిన ఆధారాలు?"

"ఆయన చెప్పాడుగా?"

"అంటే ఆ మోడల్ ఫెయిల్ అయ్యింది అని ఎవరో అన్నారు కాబట్టి అది వేదకాలం నాటి మోడల్ అని డీసైడ్ చేసేశారన్నమాట. ప్రతీదానికీ ప్రూఫులడిగేవారు మరి దీనికెందుకడగలేదో? మీ వాదనకి సరిపోయిందనేనా? సరే ఇంకేమందో ఏడు" అన్నడు కాపరి కాస్తంత అసహనంగా

వేరే కులాలవాళ్లని బూతులు తిట్టింది. “ఇది దళితులను అంటరాని వారి గా చూడటం అమానవీయం అంది అని కవర్ చేసా" ఒప్పేసుకుంది మళ్ళీ ఎఱ్ఱ కాకి.

"ఇంకా?"

"ఒక్ ముసుగేసుకుని ఆంధ్రా వాళ్ళనీ, మరొక ముసుగులో తెలంగాణా వాళ్ళనీ తిట్టింది"

"అసలిలాంటి కాకిని కవర్ చెయ్యాల్సిన అవసరమేమొచ్చింది?" గద్దించాడు కాపరి

"కమ్యూనిష్టు అనుబంధంతోటి" చెప్పుకొచ్చింది కాకి, "నాకు కమ్యూనిజమంటే ఎందుకిష్టమమే ... " అని మొదలెట్టింది

రాష్ట్రం లో తె దే పా, కాంగ్రెస్ ఉన్నాయి. వాటి సిధ్ధాంతాల గురించి ఎవరూ చర్చ చేయరు. ఎందుకంటే వాటికి అంత సీన్ లేదని కదా?

"అవునా? మరి అవే పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎమయ్యాయి దాని సిధ్ధాంతాలు?" చిరాగ్గా అడిగాడు గొఱ్ఱెల కాపరి


"సరే అది వదిలేద్దాం. సైధ్ధాంతిక నిబధ్ధత ఉండి వంశ పారంపర్యం గా నడవని పార్టీలు ఇవి" అంది కాకి.

"ఎక్కడ? క్యూబాలోనా లేక ఉత్తర కొరియాలోనా?" నవ్వాగలేదు కాపరికి


"సమిష్టి నిర్ణయాలు ఇంకా జరుగుతున్న పార్టీలు ఇవి (ఒక్క భా జ పా మినహ)" చెప్పుకుపోతోంది కాకి

"ఓహో అందుకేనా? మేంఉ ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుంటామంటే తెదెపాతో పెట్టుకోమని మా మా అధిష్టానం బలవంత పెట్టింది. మాకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్చలేకుండ చేసింది అని మీ కమ్యూనిష్టు రాష్ట్రనేతలు మొన్ననే వాపోయారు?" అన్నాడూ నవ్వుతూనే కాపరి

"నాయకులు నిరాడంబరం గా ఉండి, కొద్దో గొప్పో ఆశయాలను పాటిస్తున్న పార్టీలు కూడా ఇవే!"

"మమతా బెనర్జీ, లాలూ యాదవ్ కన్నా నిరాడంబరులా ఏం?"


"కుల మతాలకు మేము అతీతము అని కనీసం పైకి చెప్పే పార్టీలు కూడా ఇవి"

"అవునా. అందుకే మరి మదర్ తెరీసాని పల్లెత్తు మాట అనకుండా సత్య సాయిబాబా మీద పాటలు కట్టి పాడిన పార్టిలు మీవి. నిజంగా కులమతాలకు అతీతమే. మత తత్వ పార్టీలతో కూడా పొత్తు అబద్ధం కదా" రెట్టించాడు కాప్రి కాస్త వెటకారంగా

"రాఘవులు తన కూతురిని ముస్లిం కిచ్చి పెళ్ళి చేశాడు"

"అబ్బా ఛా! మరి చిరంజీవి కూడ తన కొడుకుని వేరే కులం అమ్మాయికిచ్చి పెళ్ళి చెయ్యలేదా? తన బావమరిది విషయంలో కూడ అంటెగా? అయినా ఆ అమ్మాయి తన పెళ్ళి తను చేసుకుంది, ఈయన చేసేదేమిటి గాడిద గుడ్డు"

"అలా అనద్దు. తను అడ్డం చెబితే పెళ్ళి జరిగేదా?"

"ఆహా! ఇప్పుడు కమ్యూనిష్టువనిపించావ్. అంటే మీ కమ్యూనిష్టులు తమ పిల్లలకు తమ నిర్ణయాలు తాము తీసుకునే స్వేచ్చ ఇవ్వరనే సత్యాన్ని చెప్పకుండానే చెప్పేశావ్" అన్నాడు కాపరి

"సరే అవన్నీ వదిలేద్దాం. అసలు ఇప్పుడు జరిగేవన్నీ మార్క్సు ఎప్పుడో మేనిఫెస్టోలో చెప్పాడు"

"ఏమని చెప్పాడేమిటి?"

"అన్నీను. రోజుకి 16 గంటలు పని చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సహా"

"16 గంటలు పని చేస్తారా?"

"అవును 16 గంటలు ఆఫీసులో ఉంటారు"

"అందులో ఎన్ని గంటలు గ్రేట్ ఆంధ్రా చూస్తారు. ఎన్ని సార్లు క్రిక్ ఇంఫో సైటు రెఫ్రెష్ చేస్తారు? ఏసీ కోసం ఎంత సేపు గడుపుతారు. రెండు గంటల్లో అయే పనికి పది గంటల ఎస్టీమేట్ ఎన్ని సర్లు ఇస్తారు?" ప్రశ్నలు సంధించాడు చిరాకు తారస్థాయికి చేరిన కాపరి

"ఇలా అయితే నేను మాట్లాడనంతే!" మౌన వ్రతం మొదలెట్టిందా ఎఱ్ఱ కాకి.

Feb 5, 2012

కాకుల చింత చెట్టు - తరువాయి భాగం :)



గొర్రెల బుడ్డోడు రాయి గురి తప్పకుండా విసిరాడు. అప్పటికే కాకులన్నీ జారుకున్నాయి.

“కుహూ, కుహూ”, అంటూ ఓ నల్లటి పక్షి బయట పడింది చింత చెట్టులోంచీ!

"అరెరే, అనవసరంగా కోకిలని కొట్టానే"  అనుకుంటూ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సన్నటి పక్షి ఉండాల్సినదానికన్నా పొడుగ్గా ఉంది.

అనుమానం వచ్చి చెయ్యి వేసి చూశాదు, అది కప్పుకున తోలు మొత్తం చేతిలోకి వచ్చేసింది.

"వార్నీ! ఇది కోకిలరూపంలో ఉన్న ఎఱ్ఱటి గుంటనక్క రోయ్" అనుకుని మరొక రెందు తగిల్చాడు.

"ఆపరా బాబోయ్!" బ్రతిమాలుకుంది గుంటనక్క.

"నీకిదేం పోయేకాలం?" గద్దించాడు

"వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో దొంగచాటుగా విని ఆ మాటల్ని వేరేలా ప్రచారం చెయ్యమని మా గుంపు ఆన" అని అసలు రహస్యం చెప్పింది గుంటనక్క

"వివరాలు మొత్తం చెప్పు..  లేకపోతే ..."

"ఒద్దొద్దు, చెప్తాను. ఇలా ముసుగేసుకోవటం,కోకిలలా నటించటం, మా తరతరాల ఆచారం. మా ఊరి పేరు దొంగలతా..." చెప్పసాగింది ఆ ఎఱ్ఱ గుంటనక్క ..

(సశేషం)