May 21, 2010

పదమూడవ నెంబరు ప్రమాద సూచిక: బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!

మామూలు తిట్లు బోరుకొడుతున్నాయని పేరడీలలో కొట్టుకుందామని డిసైడ్ అయ్యా. మొదటగా నా పేరడి ఇది.

Urvasi .. Urvasi (Premikudu) style:


బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
బ్లాగులోన, రంగుపడితే టేకీటిసీ బ్లాగరీ
కెలుకుడూ తిన్నగా నేర్చుకోరా బ్లాగరీ
బుర్రలో గుజ్జు కాస్త పెంచుకోరా బ్లాగరీ

బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!



చరణం:

నీకసలు తెలుసా తెలుసా
కెలుకుడులో కష్టమేంటో

కోపమే రావాలంటే
యూసు చేసే కిటుకేంటో

మెదడు నీకు చెప్పుల్లోకీ
జారిపోయెరా బ్లాగరూ
బుర్రలేని పనులు చేస్తే
కోపం రాదురా బ్లాగరూ

బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!


కామెంటు పెట్టి క్లౌనువయితే టేకీటీసీ బ్లాగరీ
చిరూని అనుకుని సునిల్ వి అయితే టేకీటీసీ బ్లాగరీ
వెశిన ఎత్తులు ఫ్లాపే అయితే టేకీటీసీ బ్లాగరీ
నీ ప్లేనంతా వేస్టే అయితే టేకీటీసీ బ్లాగరీ

బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!

తిట్లతో పనులే జరగవులే
బూతులతో సహనం చావదులే
చివరికీ జోకరు అయ్యేది
నవ్వులు తెప్పించే నువ్వేలే


కోపమే తెప్పించబోతే
అదేదో నీకే వచ్చేలే
నువ్ పెట్టే ఒకొక్క కామెంటు
బ్లాగుకీ హిట్లను పెంచేలే!

May 19, 2010

తుఫాన్ లో మీరు ప్రశాంతంగా ఉండాలంటే

తుఫాన్ లో మీరు ప్రశాంతంగా ఉండాలంటే .....ముందు న్యూస్ చానళ్ళు చూడడం మానేయండి చాలు ఇంకేం అవసరం లేదు . నా చిన్నతనం నుండి ఎన్నో తుఫాన్లు చూశాను .. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం తీరప్రాంతాలు అల్లకల్లోలం అవడం సహాయక చర్యలు అన్నీ మామూలే కానీ ఈసారి ఈ న్యూస్ చానళ్ళు కాస్త ఎక్కువ చేస్తున్నాయి అనిపిస్తుంది.. సముద్రం ముందుకి వచ్చింది ... రెండు మీటర్ల ఎత్తుకి ఎగిసింది ... అక్కడ ఇళ్లల్లోకి నీళ్ళు ఇక్కడా వీధుల్లోకి నీళ్ళు అని భయపెట్టేస్తున్నారు. అందుకే న్యూస్ చానళ్ళు బంద్ చేసేద్దాం.

May 14, 2010

ఆంధ్రప్రభలో ఈ వార్త చదివిన వెంటనే నవ్వొచ్చింది, ఎందుకంటారు?

ఆంధ్రప్రభలో ఈ వార్త చదివిన వెంటనే నవ్వొచ్చింది, ఎందుకంటారు?



బాబును నేనెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు
apr - Fri, 14 May 2010, IST



తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తానెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించిందని సీఎం ధ్వజమెత్తారు. కానీ ఆయన పరిస్థితి చూస్తే చాలా జాలేస్తోందని రోశయ్య చెప్పారు.

May 12, 2010

వార్తా మాలిక ..!!

ఈ రోజునుండి మాలిక లో తెలుగు వార్తాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

ప్రస్తుతానికి Testing phase లో ఉన్న ఈ పేజీలో (http://maalika.org/maalika_telugu_news.php) మీరు తెలుగు వార్తాలు కూడా తెలుసుకోవచ్చు. ముందుముందు మరిన్ని పత్రికల నుండి వార్తలు అందించడానికి ప్రయత్నిస్తాము.