Mar 28, 2009

ఒబామహాభారతం - సీరియల్ - మూడవ భాగం

ఒబామా: అందరూ బెల్టులు కట్టుకోండి, యుగం మారుతున్నాం . కాస్త కుదుపులుండవచ్చు

అందరూ: సరే సరే!!!!

అమర్: అరే! ఈ కుక్క ఎవరిది?

అక్బర్: నాదే! నా తిండి తిని, నా పొరుగురాజ్యం వాడిపట్ల విశ్వాసం గా ఉంటుంది. నామీదే మొరుగుడు పైగా! అందుకే మహాభారత కాలంలో ఏకలవ్యుడి దగ్గర వదిలేద్దామని వచ్చా.

అమర్: అయ్యా! ఇలాంటివాళ్ళు మా కాలంలో కూడా ఉన్నారు - మేము వాళ్ళని కమ్యూనిష్టులని పిలుస్తాం

అక్బర్: ఓహో!!!

ఒబామా: సరే - భారతం వచ్చేసింది .. దిగండి

(అందరూ దిగాక)

రెహ్మాన్: ఏదో తేడాగా ఉంది .. సంథింగ్ రాంగ్!

ఒబామా: యుగం మారింది కదా ... జెట్ లేగ్ అయ్యుంటుంది!

రెహ్మాన్: కాదు కాదు .. ఏదో తేడాగా ఉంది .. సరే సరే పదండి

ఆంథోనీ: (పక్కన పడుకున్న ఒకతన్ని చూసి) ఈయనెవరండీ బాబూ, మిట్ట మధ్యాహ్నం నిద్రపోతున్నాడు, కుంభకర్ణుడిలాగా?

దారిన పోయే దానయ్య: స్వామీ, ఆయన కుంభకర్ణుడే!!!

రెహ్మాన్: సంథింగ్ రాంగ్!

అమర్: భజరంగ్ దళ్ ! భజరంగ్ దళ్ !

ఆంథోనీ: భజరంగ్ దళ్ కాదు... అవి కోతులు! వానర సైన్యం లా ఉంది ...

రెహ్మాన్: ఇప్పుడు అర్ధం అయ్యింది ... ఒబామా గారూ, మనం పొరపాటూన త్రేతాయుగానికొచ్చేశాం. ఇది రామాయణ కాలం, భారతం కాదు.


ఒబామా: అవునా! అయ్యో .. సరే ఎలాగూ వచ్చాం కదా .. రాములవారిని చూసి పోదాం

ఆంథోనీ (అమర్ చెవిలో): ఏమండీ అమర్ కింగ్ గారూ! మీకో చిన్న మాట

అమర్: ఏంటీ? నువ్వు కూడా ఆ తెలుగు గంగాధర్ మిమిక్రీ విన్నావా? తిన్నగా విషయం చెప్పి చావు

ఆంథోనీ: అదేనండీ, ఇప్పుడు రాములవారున్నారని తేలితే మన యూ.పీ.ఏ పార్ట్ నర్ కరుణానిధి మొహం ఎక్కడ పెట్టుకోవాలి?

అమర్: నిజమే! వీళ్ళని అసలు రాములవారి వైపు వెళ్ళనివ్వకూడదు

(ఒబామా తొ)

ఒబామా గారూ, ఒక్క విషయం. మరి కొన్ని రోజుల్లో యుద్ధం జరగబోతోంది. రాముల వారిని కలిసే అవకాశం మనకి రాదు. దాని బదులు ఆయన స్నేహితుడు సుగ్రీవుడిని కలుద్దాం

ఒబామా: సుగ్రీవుడినెందుకబ్బా?

అమర్: (ఒబామ చెవిలో కిచ కిచ కిచ కిచ)

ఒబామా: వండర్ఫుల్ వండర్ఫుల్ .. హిల్లరీ చెబితే ఏమో అనుకున్నా గానీ, మీరు అసాధ్యులే

(అందరూ సుగ్రీవుడి దగ్గరకెడతారు)

సుగ్రీవుడు: రండి రండి కలియుగ వాసులారా - మీ అద్భుతమైన సమయ విమానము గూర్చి వింటిని. సీతమ్మతల్లిని రావణుడి చెరనుండి విడిపించిన పిదప దానిని చూడవలెనని మనసు ఉవ్విళ్ళూరుచున్నది

అమర్: సుగ్రీవులవారికి నమస్సులు. యుద్ధము ఎప్పుడు మొదలగునో చెప్పగలరా?

సుగ్రీవుడు: ఇంకా వారధి తయారగుచున్నది కదా

అమర్: మేము కూడా రామ భక్తులమే స్వామీ

అంథోని (అమర్ చెవిలో): ఆ మాట బీ జే పీ వాళ్ళూ వినారంటే చంపేస్తారు నిన్ను

అమర్: ఇష్ష్ ఇష్ష్

(సుగ్రీవునితో)

సుగ్రీవా! మేము కూడా రామ భక్తులమే. ఆ రామ సేతు వారధి కాంట్రాక్టు మాకు అప్పగిస్తే అయొధ్య బాబ్రీ మసీదు స్థానంలో గుడి బీ.జే.పీ వారికన్నా ముందు మేమే కట్టీస్తాం - కదండీ ఒబామా గారూ?

అక్బర్: ఏమిటీ? మా తాతగారి మసీదు స్థానంలోనా? నేనొప్పుకోను

అమర్: ఎక్కువ మాట్లాడకు, నీ కుక్కని మళ్ళీ వెనక్కి నీతోనే పంపిస్తా!

అక్బర్: ఒద్దొద్దు బాబోయ్!

సుగ్రీవుడు: మీ మాటలు నాకు అవగతమగుటలేదు

అమర్: ఏమీ లేదు రాజా. మీరు వారధి కట్టే పనిని (ఒబా)మాకు అప్పగించండి. మేము కలియుగ కార్మికులని తీసుకు వచ్చి పని పూర్తిచేసెదము.

ఆంథోని: మధ్యలో ఒబామా లింక్ ఏమిటి?

అమర్: మనమే డిరెక్టుగా తీసుకుంటే మొత్తం మింగేది రూలింగ్ పార్టీ వాళ్ళే. ఒబామా అయితే బ్రిడ్జ్ అమేరికన్ టెక్నాలజీ, అవుట్సోర్సింగ్ మనకి .. అర్థమయ్యిందా

సుగ్రీవుడు: మీకది సాధ్యమేనా?

అమర్: సాధ్యమే ప్రభూ


(బేక్ గ్రౌండ్ లో పాట - మన వాళ్ళ దేన్సు

అన్ హోనీ కో హోనీ కర్దే (
హోని కో అన్ హోని
ఏక్ జగహ్ జబ్ జమా హో తీనో (

అమర్ అక్బర్ ఏంథోనీ
అమర్ అక్బర్ ఏంథోనీ )


ఆంథోని: అమర్ గారూ, మరి అందులో ఇసక ఎంత కలపాలి?

అమర్: దాని గురించి గట్టిగా మాట్లాదద్దు

సుగ్రీవుడు: నాకు వినబడినది. పవిత్రమైన రామ సేతువును మట్టితో నిర్మించెదరా? ఎంత అపచారము! మర్యాదగా మీకాలానికి పోవుడు, లేనిచో కఠినంగా శిక్షించెదము

అమర్: ఆంథోనీ, మొత్తం చెడగొట్టావు కదా ... ఇంక పద ..

(అందరూ మళ్ళీ టైం మేషీన్ లో)

Mar 20, 2009

ఒబామహాభారతం - సీరియల్ - రెండవభాగం

ఒబామా: సరే అందరూ వచ్చారా?

ఏంథోనీ: అమర్ కింగ్ గారికి కొంచం లేట్ అవ్వచ్చండీ!

ఒబామా: ఏం? ఎందుకని??

ఏంథోనీ: పొద్దున్న అమితాబ్ బచ్చన్ గారు నిద్ర లేచినప్పుడు ఆయన పేంటు
చినిగిందిట - అది కుట్టించుకుని రావడానికెళ్ళారు ... అదిగో వచ్చేశారు

ఒబామా: సరే ఇంక బయల్దేరదాం ...

(అందరూ బయల్దేరతారు)

అమర్ కింగ్: అరే 1999 - బెంగళూరు ఎంత కళకళలాడుతోందో!

అంథోనీ: 1998 - న్యూక్లియర్ టెస్ట్! వా వా !!

ఒబామా: 1975 - మా తాత .. మా తాత!

అంథోనీ: (రెహ్మాన్ చెవిలో): ఈయనకి జూనియర్ ఎం టీ ఆర్ పూనలేదు కదా?

రెహ్మాన్: ఇష్ ఇష్!!!

(కాసేపయ్యాక)

రెహ్మాన్: అలసటగా ఉంది కాసేపు దిగుదామా?

అంథోనీ: ఏ కాలంలో ఉన్నాం?

ఒబామా: అక్బర్ కాలంలో

అమర్: సరే దిగి ఒకసారి ఆయన్ని చూసొద్దాం

(అందరూ అక్బర్ దర్బారుకెళతారు)

అంథోనీ: (రెహ్మాన్ చెవిలో) ఈయనెవడండీ బాబూ? అచ్చం ఆ తెలుగు ఏక్టర్
బ్రహ్మానందంలా ఉన్నాడు?

రెహ్మాన్: ఇష్ ఇష్ - ఆయనే బీర్బల్

అంథోనీ: అసలు బీర్బల్ అంటే అర్థం ఏమిటండీ? బీరుతో బలం పుంజుకున్నవాడా మన
విజయ్ మాల్యా లా??

రెహ్మాన్: ఎహే! సుత్తాపి సైలెంటుగా ఉండు కాసేపు!

"జహాపనా అక్బార్ బాద్షా విచ్చేయుచున్నారొహో - సబ్ ఖడే హోజాఓ"

అంథోనీ: ఏంటీ? ఈ కాలంలో ఉర్దూ ఉందా?

రెహ్మాన్: ఉర్దూ పుట్టిందే ఇప్పుడు. ఈ కాలంలో సామాన్య సైనికుడూ మాట్లాడే
భాషని ఉర్దూ అని పిలిచేవారు

అంథోనీ: ఓహో!

(బేక్ గ్రౌండ్లో పాట: జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా - 4 లైనులు)

అంథోనీ: ఓరినీ! ఇది నౌషాద్ గారి పాట అనుకునా!! ఆయన కాపీ కొట్టిందా?

అమర్: నీ బొంద. అది నా మొబైల్ ఫోన్ రింగ్ టోను. అభిషేఖ్ బేటా ఫోన్
చేస్తున్నాడు

ఫోనులో: బేటే - నేణు అక్బర్ టైంలో ఉన్నా ఢిల్లీ లో

....... అబ్బే అక్బర్ రోడ్ కాదు బేటా అక్బర్ కాలంలో !! నీకర్ధం కాదు గానీ
ఒక రెండూ రోజుల్లోగా నేనే ఫోన్ చేశ్తాలే. అప్పుడు వెళ్ళి కొందాం ఐష్వర్యా
బేటి చీరకి మేచింగ్ చెప్పులు!

(ఈలోగా అక్బర్ ప్రవేశం)

అక్బర్: అందరూ కూర్చోండి. (మన వాళ్ళ కేసి చూసి) ఎవరు వీరు? విచిత్ర
వేషధారణలో ఉన్నారు??

ఒబామా: మీ తరువాత కాలం వాళ్ళం. ఈ సమయ యంత్రాం ద్వారా మీదగ్గరకొచ్చాం

అక్బర్: భలే భలే! మా భవిష్యత్తు మీకు తెలుసన్నమాట .. కాస్త చెప్పండీ?

ఒబామా: చాలా ఘోరాలు జరిగాయి - అవన్నీ చెప్పకూడదు - చెప్పడానికి సమయం
కూడా లేదు. మిమ్మల్ని చూసి పోదామని వచ్చాం అంతే ..

(ఈలోగా గంట మోగుతుంది)

అక్బర్: ఎవరది? ఎవరో న్యాయం కోసం వచ్చినట్టున్నారే?

సేవకుడు: అవును జహాపనా. పిల్లలు పాఠాలు వినట్లేదని ఉపాధ్యాయ్లని
తీసేసార్ట. వాళ్ళు న్యాయం కోసం వచ్చారు.

అక్బర్: అలాగా? ప్రవేశ పెట్టండి!!

(లోపలికి వచ్చిన పంతుళ్ళతో)

ఏమిటయ్యా .. పిల్లలు పాఠాలు ఎందుకు వినట్లేదు

పంతుళ్ళు: వాళ్ళకి ఆవు అంబా అనును మేక మే మే అనును అంటే నచ్చట్లేదు జహాపనా!

రెహ్మాన్: అలాంటప్పుడు కొత్త పధ్ధతిలో చెప్పండి

పంతుళ్ళు: ఏ కొత్త పధ్ధతి?

రెహ్మాన్: నేనొక సంగీత విద్వాంసుడిని. అదే పాఠం నేను కూర్చిన ఒక గేయ రూపంలో
వినిపిస్తా ఉండండి

.... కావు కావని అరిచిందంటే కాకి అని దానర్ధం
.... మ్యావు మ్యావని కూసిందంటే పిల్లి అని దానర్ధం
.... రంకె పెద్దది వేసిందంటే ఎద్దు అని దానర్ధం
.... ఓండ్ర గట్టిగా పెట్టిందంటే గాడిదని దానర్ధం అర్ధం


.... కావు కావని అరిచిందంటే కాకి అని దానర్ధం
.... మ్యావు మ్యావని కూసిందంటే పిల్లి అని దానర్ధం
.... రంకె పెద్దది వేసిందంటే ఎద్దు అని దానర్ధం
.... ఓండ్ర గట్టిగా పెట్టిందంటే గాడిదని దానర్ధం అర్ధం


పంతుళ్ళు: ఇదేదో బాగనే ఉన్నది. ప్రయత్నిస్తాం. ఉంటామండీ

అక్బర్: ఆహా! మీ చాతుర్యం అపూర్వం. మా అతిధులుగా కొన్నాళ్ళుండమని ప్రార్ధిస్తున్నా

సలీం: అనార్కలి ఈ పాటకి నృత్యం బాగా చేస్తుంది

అక్బర్: అబ్బా ఉండరా సలీం. నీకెప్పుడూ ఆ అనార్కలి గోలే!

ఒబామా: జహాపనా .. మాకంత సమయం లేదు. మేంఉ బయల్దేరతాం ఇంక.

అక్బర్: ఎక్కడికెడుతున్నరో కనీసం అదయినా చెప్పండి

ఒబామా: మహాభారత కాలానికి

అక్బర్: ఆహా .. అలాగ? అయితే నేనుకూడ రావచ్చునా?

ఒబామా: మీరా? సరే రండి. మీరు కూడా నేర్చుకునేది చాలా ఉంటుంది

(అందరూ టైం మెషీన్ మళ్ళీ ఎక్కుతారు)


ఒబామా: అది సరే గానీ రెహ్మాన్ గారూ - మీ సౌత్ ఇండియన్ రాజకీయాలు ఎలా ఉన్నాయ్?

రెహ్మాన్: చప్పగా ఉన్నాయండి. కాని ఆంధ్రాలో మాత్రం విచిత్రంగా ఉన్నాయ్

ఒబామా: అవునా? ఏం జరుగుతోందక్కడ? నాకు తెలియాలి

అంథోనీ: అమ్మో ఇప్పుడు ఈయనకి జునియర్ ఎం టీ ఆర్ వాళ్ళ నాన్న పూనాడు

అమర్ : ఇష్ ఇష్

( మూడవ భాగం వచ్చేవారం )

Mar 19, 2009

ఒబామహాభారతం - సీరియల్ - మొదటి భాగం

లైట్స్ ఆన్!
కేమెరా!!
ఏక్షన్!!!

(వైట్ హౌస్)

ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్

ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్

ఫోనులో గొంతు: ఆఫ్గన్ నుండి రీపోర్ట్ ఇప్పుడే వచ్చింది సార్. విషయం బాడ్.
మనం స్ట్రేటజీ మార్చకపోతే మటాష్!

ఒబామా: అలాగా, సరే, థాంక్స్.

మళ్ళీ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్

ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్

ఫోనులో ఆడ గొంతు: హలో యా! హవ్ ఆర్ యూ యా! దిస్ ఇస్ హిల్లరీ యా!

ఒబామా: వాట్ హేపెండ్ టూ యో లేడీ? వై ఆం ఐ హియరింగన్ ఏక్సెంట్?

హిల్లరీ: ఐ "యాం" "యిన్" "యిండియా" యా. ఎండ్ ఐ లైక్ యిండియన్ యాక్సెంట్ యూ నో

ఒబామా: అమ్మా! తల్లీ! ఇండియన్ ఏక్సెంట్ మాట్లాడింది చాలు గానీ విషయం చెప్పు!

హిల్లరీ: ఇప్పుడే అఫ్ఘాన్ రిపోర్టు వచ్చింది. పరిస్థితి బాలేదు.

ఒబామా: తెలిసింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అసలు టెర్రరిస్టులకి
ఫండింగ్ ఎలా వస్తోందొ?

హిల్లరీ: లేమేన్ చేతో వామూ చేతో మనమే ఫండింగ్ చేయించాల్సింది.
ఈపాటికి చచ్చూరుకునేవాళ్ళు.

ఒబామా: నేరం నాది కాదు. జార్జ్ బుష్ ది!

హిల్లరీ: సరే! ఇప్పుడేం చేద్దాం?

ఒబామా: ఏముందీ? స్ట్రేటజీ మార్చాలి. కొత్త పధ్ధతులు ట్రై చెయ్యాలి.

హిల్లరీ: కొత్తవాటికన్నా పాతవే బెటర్ ఏమో?

ఒబామా: అంటే?

హిల్లరీ: ఇది వరకూ సక్సెస్ అయిన ఫార్మ్యూలాలు ఉపయోగించచ్చు కదా?

ఒబామా: అర్థం కాలేదు.

హిల్లరీ: నీకోపట్టాన అర్థం కాదని నాకు తెలుసు గానీ, నేనందేది పాత కాలం
నాటి యుధ్ధ నీతులు ఉపయోగించచ్చు కదా అని

ఒబామా: గుడ్ అయిడియా. సివిల్ వార్ నీతులు ఉపయోగిద్దామా?

హిల్లరీ: నీ యెంక్ .. వద్దులే తిట్లోలొస్తున్నాయి - నేను మాట్లాడేది వేలకు
వేల ఏళ్ళ క్రితం యుధ్ధాల గురించి

ఒబామా: సరే ఇండియాలోనే ఉన్నావు కద - రామాయణ మహాభారతాలు తీసుకురా

హిల్లరీ: నాయనా, బాబూ తండ్రీ - ఇది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు.

ఒబామా: మరి?

హిల్లరీ: డా|| బ్రౌన్ తో మాట్లాడి టైం మెషీన్ తెప్పించుకో. అది తీసుకుని
భారతం టైం కి వెళ్ళి త్రిక్కులన్నీ నేర్చుకుని రా!

ఒబామా: ఇదేదో బాగానే ఉందే? నేనొక్కడనే వెళ్తే మరి కల్చర్ గేప్ ఉంటూంది కదా?

హిల్లరీ: అదీ నిజమే. ఇక్కడ అమర్ కింగ్ అని ఒక పెద్ద నెగోషియేటర్ ఉన్నాడు.
నాకు మాంచి ఫ్రెండ్. తోడు తీసుకెళ్ళు

ఒబామా: మరి అతనికి యుద్ధం, డిఫెన్స్ గురించి తెలుసా?

హిల్లరీ: అసలు తెలియదు. కానీ పనులు చక్కబెట్టుకొస్తాడు. డిఫెన్స్ కోసం
అయితే కే కే ఏంథోనీ ని కూడా తీసుకెళ్ళు. అలగే
కాస్త వినోదం కోసం ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ ని కూడా తీసుకెళ్ళు

ఒబామా: అలాగే - థేంక్యూ!! ఇప్పుడే ఈ-మెయిల్ పంపిస్తున్నా

(కంప్యూటర్ బూట్ చెయ్యడానికి ప్రయత్నించి)

ఒబామా: వాట్ ద హెక్? సప్పోర్ట్ లైన్ కి కాల్ చేస్తా

(డయల్ చేస్తున్న చప్పుడు)

ఫోన్ లో కంఠం: "మీరు డయల్ చేసిన నెంబరు మరియొకసారి సరిచూసుకొండి! ప్లీస్
చెక్ ద నంబర్ యూ హావ్ డయల్డ్)

ఒబామా: ఓరినీ! నా టెక్ సపోర్ట్ కూడా అవుట్సోర్స్ అయ్యిందా? రామ రామ!
తప్పు తప్పు .. జీసస్ జీసస్!!

(మళ్ళీ డయల్ చేస్తున్న చప్పుడు)

ఫోన్ లో కంఠం: టెక్ సపోర్ట్ - మై నేం ఈస్ రాక్ మేన్ ! హౌ కెన్ ఐ హెల్ప్ యూ?

ఒబామా: (కాసంత చిరాగ్గా) ఏమిటి నీ పేరు రాక్ మేనా? క్రేక్ మేన్ ఏమి కాదూ?
నువ్వు ఇండీయాలో ఉన్నావని తెలుసుగాని అసలు పేరు చెప్పి చావు

ఫోన్ లో కంఠం: బండయ్యండి. అయ్యగారు టీ తాగడానికెళ్ళి నన్ను కూకోబెట్టారండి.

ఒబామా: ఖర్మ. ఈ స్లండాగ్ సినిమా తీసినవాడిని షూట్ చెయ్యాలి!!

బండయ్య: ఏటనీసినారేటి? ఏటేటో తెలీకుండా అనీసినారు. రేతిరసలే వన్నం
తినకుండా మందు కొట్టీసి సెట్టు కింద తొంగున్న - ఇప్పటికీ పిచ్చిపిచ్చిగా
ఉన్నాది

ఒబామా: ఏమి అనలేదు గాని - నా కంప్యూటర్ బూట్ అవ్వట్లేదు - ఏమి చెయ్యాలో చెప్తావా?

బండయ్య: ఏటవ్వట్లేదూ?

ఒబామా: బూట్ ! బూట్!! అదే ఆన్ అవ్వట్లేదు

బండయ్య: ఓస్ ఇంతేనా! ఆన్ ఆఫ్ ' సిచ్చి ' నొక్కీసి ఆన్ సెయ్యండీ!

(టిక్ క్లిక్ )

ఒబామా: వావ్ యూ ఆర్ ఎ జీనియస్. ఆన్ అయ్యింది. కానీ ఇప్పుడూ ప్రింటర్ పని
చెయ్యట్లేదే? అసలే విండోస్ విస్తా నాది

బండయ్య: మీరేటంటున్నారో నాకు మళ్ళీ అర్థం కాలేదు. ఇక్కడ ఏది పని
చెయ్యకపోయిన ఆఫ్ సేసి ఆన్ చేసీస్తారు కదేటి? పోయినవన్నీ బేగి
యెల్లిపొచ్చీస్తాయ్

(టిక్ క్లిక్ )

ఒబామా: వావ్ - పని చేస్తోంది - థేంక్యూ థేంక్యూ బాయ్ - హమ్మయా ఈ మెయిల్
వెళ్ళిపోయింది!

( రెండవ భాగం తొందరలోనే )

Mar 13, 2009

అయిదవ నంబరు ప్రమాద సూచిక - 'పొద్దు' గడి కెలుకుడు, పూరణ!

ప్రమాదవనంలోకి తొంగి చూస్తున్న వీక్షకులకు మళ్ళీ నమస్కారం, వసుదేవుడి పాదాభివందనాలు.

ఈ సారి మన గెస్టు హోస్ట్ వాషింగ్టన్ వామనరావు గారు, ముఖ్య అతిధి సియాటిల్ సీతమ్మ గారు ... ఇద్దరికీ నమస్కారం. జంప్ అయిపోదాం కార్యక్రమంలోకి

వామనరావు: నమస్తే రౌడీగారూ ఈ వారం ఎవరిని కెలకాలి?

సీతమ్మ: సియాటిల్ నించి కష్టపడి వచ్చాను ఎవరైనా పెద్దవారిని కెలకాల్సిందే!

మలక్పేట్ రౌడీ: పెద్ద వారినా? లేక ' పొద్దు ' వారినా?

వామనరావు: అమ్మో! తిడతారేమో?

సీతమ్మ: మరేమి ఫరవాలేదు. వారి హ్రస్వ దృష్టి పదిబ్లాగులని మించి పోదులెండి. ఆ పది బ్లాగులూ లేకపొతే బ్లాగ్లోకమే లేదని వారి ఉవాచ.

వామనరావు: సరే! ఏం చేస్తాం? కానివ్వండి. అసలే చత్వారం, పైగా కళ్ళు మూసుకున్నారు. సాహితీ బ్లాగులకేసే కన్నెత్తి చూసే సీను వారికి లేదు, ఇక మన బ్లాగు కూడానా? ఇంతకీ ఎలా కెలుకుదాం?

సీతమ్మ: పొద్దులో అన్నిటికన్నా పాపులర్ ఏమిటి?

వామనరావు: గడి

సీతమ్మ: దానినే కెలికితే పోలా?

వామనరావు: అయితే ఓకే!!

సీతమ్మ: సరే! ఈ డైలాగు తరవాత డైలాగునుండీ ప్రతీ డైలాగులో ఒక పొద్దు గడీ సమాధానం దాగి ఉంటుంది. కనుక్కోండీ. ఒక 35 నిలువు, దానికి సంబంధించి అటు ఇటు ఉన్నవి తప్పా మిగాతావి సరియయినవే అని మా "అనుమానం" :)) రావుగారూ! కాస్త ఇన్వాల్వు అవ్వం'ఢీ'

------------------------

వామనరావు: అబ్బా ఉండండీ! అసలే ఈ తుంటర్వ్యూ కాస్త 'టూకీ' గా ఉండాలి అని జనాల కోరిక!

సీతమ్మ: నేనేమన్నా పారిజాతాపహరణము అనే కావ్యం వ్రాయమన్నానా?

వామనరావు: లేదనుకోండి. కానీ నేను కనీసం వేటూరిసుందరరామమూర్తి అంతటి కవిని కూడా కానే

సీతమ్మ: మీరు కవీ కాదు, రచయితా కాదు, మూడోరకం అని నాకు తెలుసులెండి.

వామనరావు: కానీ కెలుకుడంటే దోరమావి పండు తిన్నంత సులువు కాదు - చంపేస్తున్నారు కదా!

సీతమ్మ: మీరు అసురులు కారు, నేను దితి పుత్రికను కానులెండి. భయపడద్దు.


వామనరావు: మీకేం పోయింది? అసలే మా ఇంట్లో గెస్టులు. మా బావమరుదులు మల్లికా షేరావత్ కోసం సుందోపసుందులు అయిపోయారు.


సీతమ్మ: అయ్యో! మీరు మాత్రం జర భద్రం


వామనరావు: అసలే ఈ నెపము మీద మా మామగారు మా ఇంట్లో తిష్ట వేశారు.


సీతమ్మ: "తగునా యిది మామా" అని పాట అందుకోండి. పారిపోతారు.


వామనరావు: ట్రై చేశా. కాని గదిలోకెళ్ళి తలుపేసుకున్నారు.


సీతమ్మ: హమ్మా! ఎంత రాతి మనిషో కదా!


వామనరావు: "త్యాగరాజనుత" అనుకుంటూ ఒక కీర్తన కూడా మొదలెట్టా!


సీతమ్మ: గది రుసుం చెల్లించి పారిపోయారా?


వామనరావు: లేదు. కాని మా ఇంటి పులుదునా! అదే, పునాదులు కదిలిపోయాయి.


సీతమ్మ: హా హా! మీకు భలే తలంటి అయ్యిందన్నమాట


వామనరావు: ఏమిటో! పంచదార ఎక్కువ పంచక!


సీతమ్మ: పంచదారెక్కడుంది? పానకంలోనా?


వామనరావు: అబ్బా మీరుండండీ! లేకపొతే ఇదేదో పుక్కిటిపురాణము అనుకుని జనాలు వెళ్ళిపోతారు.



సీతమ్మ: అంతెగా? సరే, గొడవలతో చిరాకెత్తిన జనాలకి ఇది కాస్త ఆటవిడుపు


వామనరావు: నిజమే. కానీ ఇలాంటివాటికి కూడా మోకాలు అడ్డేవారు ఉన్నారని కొంతమంది ఉవాచ.


సీతమ్మ: అవునండోఇ. అంతర్జాలమయిపోయింది గానీ లేకుంటే ఇక్కడ కూడా గాజా స్టిప్పు లా గోడవలయ్యుండేవి.


వామనరావు: ఎప్పుడు ఏవి పేలతాయో తెలియదు. అసలే ఇక్కడ అందరికీ తల్లో పేలు


సీతమ్మ: అమ్మో. మరి తలకి కర్పూరం అదేనండీ కపురం రాస్తారా?


వామనరావు: లేదు. మా ఆవిడ మోహన రాగంలో పాట ఎత్తుకుంటే అవే చచ్చిపోతాయి.


సీతమ్మ: ఆవిడ ముసలమ్మ కదా?


వామనరావు: ఎంతమాటన్నారూ? ఇక మీ బుర్రమీద వేస్తుంది ఆదితాళము.


సీతమ్మ: బాబోయ్. వద్దులెండి. నేను ఆడ మనీషి ని.


వామనరావు: అందుకే ఇది. మగవాడయితే ధోనీ ఉతుకుడు ఉతుకుతుంది.


సీతమ్మ: వామ్మో. ఆవిడపేరు రమా దేవి కదూ?


వామనరావు: అవును. రావిచెట్టు కింద పుట్టిందిట.


సీతమ్మ: యది యేమి చిత్రము? వైద్యశాలలు లేవా?


వామనరావు: ఎందుకు లేవు? కానీ అక్కడ ఆడ నర్సులు లేక విరహజ్వాలలు చిమ్ముతున్న డాక్టర్లను చూసి భయమేసి మా మావగారు అత్తగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు అని చెప్పారు.


మలక్పేట్ రౌడీ: సరే రావుగారూ, సీతమ్మగారూ, కెలుకుడు ఇంత సమర్ధవంతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు.

సీతమ్మ, వామనరావు: ధన్యవాదాలు రౌడీగారూ!


మలక్పేట్ రౌడీ: వీక్షకులకు కూడా ధన్యవాదాలు. ఇక వెళ్ళి గడి మీద పడండి. ఇప్పటికే వచ్చేసి ఉంటె లైట్ తీసుకొండి. గడి పూరణలో ఉన్న రెండు మూడు తప్పులని మన్నిస్తారని ఆశిస్తున్నాం. నమస్తే! మళ్ళీ కలుద్దాం!!