లైట్స్ ఆన్!
కేమెరా!!
ఏక్షన్!!!
(వైట్ హౌస్)
ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్
ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్
ఫోనులో గొంతు: ఆఫ్గన్ నుండి రీపోర్ట్ ఇప్పుడే వచ్చింది సార్. విషయం బాడ్.
మనం స్ట్రేటజీ మార్చకపోతే మటాష్!
ఒబామా: అలాగా, సరే, థాంక్స్.
మళ్ళీ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్
ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్
ఫోనులో ఆడ గొంతు: హలో యా! హవ్ ఆర్ యూ యా! దిస్ ఇస్ హిల్లరీ యా!
ఒబామా: వాట్ హేపెండ్ టూ యో లేడీ? వై ఆం ఐ హియరింగన్ ఏక్సెంట్?
హిల్లరీ: ఐ "యాం" "యిన్" "యిండియా" యా. ఎండ్ ఐ లైక్ యిండియన్ యాక్సెంట్ యూ నో
ఒబామా: అమ్మా! తల్లీ! ఇండియన్ ఏక్సెంట్ మాట్లాడింది చాలు గానీ విషయం చెప్పు!
హిల్లరీ: ఇప్పుడే అఫ్ఘాన్ రిపోర్టు వచ్చింది. పరిస్థితి బాలేదు.
ఒబామా: తెలిసింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అసలు టెర్రరిస్టులకి
ఫండింగ్ ఎలా వస్తోందొ?
హిల్లరీ: లేమేన్ చేతో వామూ చేతో మనమే ఫండింగ్ చేయించాల్సింది.
ఈపాటికి చచ్చూరుకునేవాళ్ళు.
ఒబామా: నేరం నాది కాదు. జార్జ్ బుష్ ది!
హిల్లరీ: సరే! ఇప్పుడేం చేద్దాం?
ఒబామా: ఏముందీ? స్ట్రేటజీ మార్చాలి. కొత్త పధ్ధతులు ట్రై చెయ్యాలి.
హిల్లరీ: కొత్తవాటికన్నా పాతవే బెటర్ ఏమో?
ఒబామా: అంటే?
హిల్లరీ: ఇది వరకూ సక్సెస్ అయిన ఫార్మ్యూలాలు ఉపయోగించచ్చు కదా?
ఒబామా: అర్థం కాలేదు.
హిల్లరీ: నీకోపట్టాన అర్థం కాదని నాకు తెలుసు గానీ, నేనందేది పాత కాలం
నాటి యుధ్ధ నీతులు ఉపయోగించచ్చు కదా అని
ఒబామా: గుడ్ అయిడియా. సివిల్ వార్ నీతులు ఉపయోగిద్దామా?
హిల్లరీ: నీ యెంక్ .. వద్దులే తిట్లోలొస్తున్నాయి - నేను మాట్లాడేది వేలకు
వేల ఏళ్ళ క్రితం యుధ్ధాల గురించి
ఒబామా: సరే ఇండియాలోనే ఉన్నావు కద - రామాయణ మహాభారతాలు తీసుకురా
హిల్లరీ: నాయనా, బాబూ తండ్రీ - ఇది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు.
ఒబామా: మరి?
హిల్లరీ: డా|| బ్రౌన్ తో మాట్లాడి టైం మెషీన్ తెప్పించుకో. అది తీసుకుని
భారతం టైం కి వెళ్ళి త్రిక్కులన్నీ నేర్చుకుని రా!
ఒబామా: ఇదేదో బాగానే ఉందే? నేనొక్కడనే వెళ్తే మరి కల్చర్ గేప్ ఉంటూంది కదా?
హిల్లరీ: అదీ నిజమే. ఇక్కడ అమర్ కింగ్ అని ఒక పెద్ద నెగోషియేటర్ ఉన్నాడు.
నాకు మాంచి ఫ్రెండ్. తోడు తీసుకెళ్ళు
ఒబామా: మరి అతనికి యుద్ధం, డిఫెన్స్ గురించి తెలుసా?
హిల్లరీ: అసలు తెలియదు. కానీ పనులు చక్కబెట్టుకొస్తాడు. డిఫెన్స్ కోసం
అయితే కే కే ఏంథోనీ ని కూడా తీసుకెళ్ళు. అలగే
కాస్త వినోదం కోసం ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ ని కూడా తీసుకెళ్ళు
ఒబామా: అలాగే - థేంక్యూ!! ఇప్పుడే ఈ-మెయిల్ పంపిస్తున్నా
(కంప్యూటర్ బూట్ చెయ్యడానికి ప్రయత్నించి)
ఒబామా: వాట్ ద హెక్? సప్పోర్ట్ లైన్ కి కాల్ చేస్తా
(డయల్ చేస్తున్న చప్పుడు)
ఫోన్ లో కంఠం: "మీరు డయల్ చేసిన నెంబరు మరియొకసారి సరిచూసుకొండి! ప్లీస్
చెక్ ద నంబర్ యూ హావ్ డయల్డ్)
ఒబామా: ఓరినీ! నా టెక్ సపోర్ట్ కూడా అవుట్సోర్స్ అయ్యిందా? రామ రామ!
తప్పు తప్పు .. జీసస్ జీసస్!!
(మళ్ళీ డయల్ చేస్తున్న చప్పుడు)
ఫోన్ లో కంఠం: టెక్ సపోర్ట్ - మై నేం ఈస్ రాక్ మేన్ ! హౌ కెన్ ఐ హెల్ప్ యూ?
ఒబామా: (కాసంత చిరాగ్గా) ఏమిటి నీ పేరు రాక్ మేనా? క్రేక్ మేన్ ఏమి కాదూ?
నువ్వు ఇండీయాలో ఉన్నావని తెలుసుగాని అసలు పేరు చెప్పి చావు
ఫోన్ లో కంఠం: బండయ్యండి. అయ్యగారు టీ తాగడానికెళ్ళి నన్ను కూకోబెట్టారండి.
ఒబామా: ఖర్మ. ఈ స్లండాగ్ సినిమా తీసినవాడిని షూట్ చెయ్యాలి!!
బండయ్య: ఏటనీసినారేటి? ఏటేటో తెలీకుండా అనీసినారు. రేతిరసలే వన్నం
తినకుండా మందు కొట్టీసి సెట్టు కింద తొంగున్న - ఇప్పటికీ పిచ్చిపిచ్చిగా
ఉన్నాది
ఒబామా: ఏమి అనలేదు గాని - నా కంప్యూటర్ బూట్ అవ్వట్లేదు - ఏమి చెయ్యాలో చెప్తావా?
బండయ్య: ఏటవ్వట్లేదూ?
ఒబామా: బూట్ ! బూట్!! అదే ఆన్ అవ్వట్లేదు
బండయ్య: ఓస్ ఇంతేనా! ఆన్ ఆఫ్ ' సిచ్చి ' నొక్కీసి ఆన్ సెయ్యండీ!
(టిక్ క్లిక్ )
ఒబామా: వావ్ యూ ఆర్ ఎ జీనియస్. ఆన్ అయ్యింది. కానీ ఇప్పుడూ ప్రింటర్ పని
చెయ్యట్లేదే? అసలే విండోస్ విస్తా నాది
బండయ్య: మీరేటంటున్నారో నాకు మళ్ళీ అర్థం కాలేదు. ఇక్కడ ఏది పని
చెయ్యకపోయిన ఆఫ్ సేసి ఆన్ చేసీస్తారు కదేటి? పోయినవన్నీ బేగి
యెల్లిపొచ్చీస్తాయ్
(టిక్ క్లిక్ )
ఒబామా: వావ్ - పని చేస్తోంది - థేంక్యూ థేంక్యూ బాయ్ - హమ్మయా ఈ మెయిల్
వెళ్ళిపోయింది!
( రెండవ భాగం తొందరలోనే )
:) :)
ReplyDelete"Restart" is the best method told by SW Engineers
and
"Format and Reinstall" is best method by "Admins"
రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నా
యిండియన్ యాక్సెంట్ , అమర్ సింగ్ - కేక
ReplyDeleteఇక కస్టమర్ సపోర్ట్ - ఇది త్రీ మచ్చు అండు (అండ్ కాదు!) ఫోర్ మచ్చు. రౌడీ గారు భారత దేశాన్ని అవమానిస్తున్నారు అద్యచ్చా. రౌడీ గారు డౌన్ డౌన్
వామూ అంటే, వాషింగ్టన్ మ్యూచువలా? ఒబామా తెలుగు చాలా బాగుంది... :)
ReplyDeleteహిల్లరీ వ్యాఖ్యలు చాలా బావున్నాయ్. "నీ యెంక్.." అని ఆపెయ్యటం బాగా నవ్వు తెప్పించింది నాకు .. :))
ReplyDeleteభలే రాస్తావు బాసూ
ReplyDelete