May 17, 2009

ప్రమాదవనానికి వంద రోజులు

ఏమిటో ఈ మధ్య బ్లాగుల్లో చాలా అసహ్యకరమైన ప్రశాంతత నెలకొని ఉంది - పెద్దగా గొడవలు లేవు, అరుపులు తిట్లు శాపనార్ధాలు కనబడటమే లేదు. ఇలా అయితే ఎలా? మన తెలుగు బ్లాగులు ఏమైపోవాలి? దీనిని మా కె.బ్లా.స (కెలుకుడు బ్లాగర్ల సంఘం) తీవ్రంగా ఆక్షేపిస్తొంది. కనుక గొడవలు యధాతధంగా సాగించవలెననియూ, బ్లాగులకు పూర్వ వైభవమును తీసుకురావలెననియూ ఈ బ్లాగు ముఖంగా యావద్బ్లాగర్లనూ మేము కోరుకుంటున్నాం.

శరత్ అన్నట్టు ఎవరి బ్లాగుల్లో వాళ్ళు బుధ్ధిగా వ్రాసుకుంటూ పోతే మజా ఏముంటుంది చెప్పండి? అందుకే మా మహాకవయిత్రి నెరజాణ అప్పలమ్మగారు అన్నారు "స్వంత బ్లాగును కొంత మానుక, పొరుగు బ్లాగును కెలికిపెట్టోయ్" అని


సరే, అసలు విషయానికి వస్తే ప్రమాదవనానికి 100 రోజులు పూర్తవుతున్నాయి. మొదటి యాభైరోజులు చాలా హుషారుగా గడిచినా తర్వాత బ్లాగుల్లో గొడవలు లేక ఈ వనం వెలవెలబోతోంది.

* ధూము తన ఇంజన్లో స్టీము తగ్గించి కందాబచ్చలి వెంటపడ్డారు

* కాగడాలో తైలం నిండుకుని బ్లాగు మూతపడింది

* రవిగారేమో "విటుడి పడక" అను "బూతులు" మానేసి ఆయన నడక "అనుభూతులు" పంచుకుంటున్నారు

* శరత్ శృంగార బ్లాగుల్లో పాలు పంచుకోవడం మానేసి సైన్యం బ్లాగులో ఆవుపాలు పంచుతున్నారు

* పెళ్ళికాని శ్రీనివాస్ తీరికూర్చుని పెళ్లి చేసుకుని ఉన్న స్వేచ్చ కాస్తా పోగొట్టుకుని బ్లాగుల్లో కనబడడం మానేశాడు

* జ్యోతిగారు, మిగతా ప్రమాదావనం బేచ్ అయితే "చాలు, మీరు ఆపండి. మేము మొదలెడతాం" అని సంఘసేవ మీద పడ్డారు

* సుజాతగారేమో నోట్లకి వోట్లకి మధ్య చిక్కుకుని 'సత్తా' చాటుకోడానికి విలవిల్లాడుతున్నారు

* "అమ్మఒడే" గాని "ఓడే అమ్మ కాదం" టూ కుట్రలని పూర్తిచేసి ఏనాలసిస్లోకి వచ్చారు ఆదిలక్ష్మి గారు

* శీతాకాలంలో హాటుగా ఘాటుగా ఉన్న మార్తాండ వేసవిలో కూల్ అయ్యాడు

* "ఆ నాలుగురేర" న్నవారు ప్రస్తుతమెందుకో అజ్ఞాతవాసం చేస్తున్నారు

* కాస్త అంతర్యానం పర్ణశాలల మధ్య జరుగుతున్నపోరాటమే కొంచం బ్లాగులకి జీవంపోస్తోంది - మధ్య మధ్యలో రానారే గారి అద్వైత సిధ్ధాంతాలతో

ఈ పరిస్థితిలో నేను కూడా ఏమి చేయలేని స్థితిలో ఉన్నా - నా స్థితికి ప్రతిబింబమే ఈ పేరడీ:

------------------------------------------

దోమనైనా కాకపోతిని మనిషి రక్తము( బీల్చగా
ధూమునైనా కాకపోతిని ఈ-తెలుగును చీల్చగా

జ్యోతినైనా కాకపోతిని పొద్దు స్లిప్పులు పెట్టగా
కాగడానే కాకపోతిని విమర్శించగ గట్టిగా

అమ్మఒడినే కాకపోతిని కుట్రలను దులిపెయ్యగా
శిరీష మార్తాండ కాకపోతిని గంటకో పోస్టెయ్యగా

నిడదవోలుని కాకపోతిని ఇంటర్వ్యూలో తిట్టగా
ముప్పాళ్ళని కాకపోతిని ఎదురుతిరిగీ మొట్టగా

_________________________________________

నేను మహేష్ కత్తినయితే "కోకు"నుదహరించనా
"ఆవకాయ" లో సాయినయితే పర్ణశాలను చించనా

ఏ2జీ డ్రీంస్ నేనే అయితే "చిరు"త పలుకులు పలకనా
జీడిపప్పుని నేనయితే చిలకమర్తిని కెలకనా?

__________________________________________


తోటరాముని కాకపోతిని అందరినీ నవ్వించగా
(రవి) గారినైనా కాకపోతిని చిలిపిగా కవ్వించగా



.

13 comments:

  1. జిందాబాద్. కెబ్లాస జిందాబాద్. రాజకీయపార్టీల భాషలో చెప్పుకోవాలంటే బ్లాగ్లోకమ్లో అశాంతి కోసం, ఆందోళనల కోసం ఎత్తుగడలు, వ్యూహాలు కెబ్లాస పన్నాల్సివుంది. (స్టెప్పులేయడం, ప్లాన్లు వేయడం పాత భాష కాదూ).

    ReplyDelete
  2. ఇపుడే కదా ఎలక్షన్లు అయినాయి. ఇక చూస్కోండి మరి.....

    ReplyDelete
  3. రౌడీ గారు,
    వోట్లు సరే గానీ నోట్లేమిటి బాబూ, నిజంగా కెలకడం కాకపోతే?
    మీ పేరడీ అద్దిరిపోయింది. మాలతి గారినీ వదల్లేదా?
    సరే ఇంకో విషయం చెప్పనా, ముప్పాళ్ళ అనే మాట రంగనాయకమ్మ గారు వదిలేసి చాలా రోజులైంది. మీ పేరడీ ఆమె చూశారంటే మీరు కెలకబడుదురు!

    All the best to the most dedicated kelikifier Sri Sri Sri malakpet rowdy .

    ReplyDelete
  4. మలక్ త్వరలోనే నిశబ్దాన్ని చేద్దిద్దాం.తుఫాన్ ముందు ప్రశాంత త అని అబిజ్న వర్గాల బొగట్ట. ఈ స్తబ్దత ఎవరి కి నచ్చటం లేదు . త్వరలోనే మీకు చేతి నిండా పని , కాష్మోరా నిద్ర లేవ బోతోందని తెలిసింది .మళ్ళి అందరికి మంచి రోజులు వచ్చి గుండె నిండా నవ్వుకుంటూ , పకోడీలు తింటూ బ్లాగుల్ని ఆస్వాదించే రోజులు వస్తాయని , అందర్నీ సమానం గా కెలికే బ్లాగ్ లోకం లో సామజిక న్యాయాన్ని ప్రతిబింబ చేసే బ్లాగ్ లోకపు ముఠా మేస్త్రి కి ముందుంది ముసళ్ళ పండగ .

    ReplyDelete
  5. ఆదిరిందయ్యా, రౌడీ పేరడీ!

    ReplyDelete
  6. ఆదిరిందయ్యా, రౌడీ పేరడీ!

    ReplyDelete
  7. amma ajnata?peradi loni garadi valla ajnatalu kuda dhyryam ga mundu ku vastunnaru .

    ReplyDelete
  8. Congratulations on your 100th day celebrations :-)

    ReplyDelete
  9. మీరేమి బాధ పడకుండ ఇక్కడ కెలుకుడు మొదలు http://www.sumamala.info/2009/05/blog-post_19.html

    ReplyDelete
  10. వేణుగోపాల్24 May, 2009 06:45

    అయ్యయ్యో శ్రీపదములు ఏమయ్యాయి. ఛాలా భ్లాగుంది.

    ReplyDelete