............................................................................ We came,We saw,We Kelikified!!!
Jun 3, 2011
క్రికెట్ మేచ్ రెండవ ఓవర్ వీశేషాలు
మొదటి ఓవర్ అయ్యాక ప్రత్యేక ప్రతినిధి కార్తీక్ ఇలా తెలియజేస్తున్నారు.
మరుసటి ఓవర్ బౌలింగ్ తనకే ఇవ్వాలని కెప్టెన్ కేక్యూబ్ శర్మగారిని చీబోరిక డిమాండ్ చేశారు.. కానీ భోజ్ కుమార్ లాంటి ఫాస్ట్ బౌలర్ ఉండగా వేరే వాళ్ళకు ఇవ్వడానికి కేక్యూబ్ శర్మ కాస్త సంచయించారు. ఆయన చేసినదానికి అద్వానీ మళ్ళీ క్షమాపణ కోరాలని చీబోరిక గొడవ మొదలుపెట్టారు.
ఇక లాభం లేదని కేక్యూబ్ శర్మగారుతన అమ్ములపొదిలో ఉన్న అతి భయానకమైన మార్తాండస్త్రాన్ని ప్రయోగించారు..
మా: ఇండియా లాంటి సెమీ ఫ్యూడల్ దేశం లో స్త్రీలు బౌలింగ్ చెయ్యలేరనుకోవడం హాస్యాస్పదం అలాంటి వాళ్ళ నోరు మూయించడానికే నేను బౌలర్ అవతారమెత్తి ఒక స్త్రీకి 20 పరుగులు ఇచ్చాను.. నాకు ఇంకో ఓవర్ బౌలింగ్ వస్తే ఈసారి 20 కి మరో 20 ఇచ్చేస్తానని మాటిస్తున్నాను..
చీ: అద్వాని క్షమాపణ ఎందుకు కోరకూడదూ?
మా: మీరిలా డిమాండ్లు చేసి నాలోని ఎమోషనల్ దయ్యాన్ని నిద్ర లేపకండి..
చీ: అమెరికా వాళ్ళు లాడెన్ ను చంపేసినందుకు శ్రీరాముడు నాకు క్షమాపణ చెప్పాలి..
ఇదంతా చూస్తున్న బద్రికి చిరెత్తుకొచ్చింది..
బద్రి: ఇదో వదినా, రెండు నిమిషాలలో ఫీల్డింగ్ పొజిషన్ కి రాకపోతే నిన్ను చెట్టుకు కట్టేసి నవరంధ్రాలు కథ వినిపిస్తా
చీ: రాముడికి లాడెన్ కి తేడా లేదని తెలిసింది కాబట్టి నేను ఫీల్డింగ్ కి వస్తున్నా
ఇదంతా చూసిన భోజ్ కుమార్ గారు తీవ్ర మనస్తాపంతో బౌలింగ్ చెయ్యటానికి నిరాకరించారు. ఇక చేసేదేమీలేక కేక్యూబ్ శర్మ గారు చీబోరిక గారికి బౌలింగ్ ఇచ్చారు.
**************************
సత్యనారాయణ వర్మగారు బేటింగ్, చీబోరిక గారు బౌలింగ్.
చీబోరికగారు బౌల్ చెయ్యటానికి పరుగు మొదలుపెట్టారు. ఉన్నట్టుండి అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సత్యనారాయణవర్మగారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. కళ్ళు చింతనిప్పుల్లా మారాయి, ముఖము ఎర్రటి సూర్యుడిలా మారింది.
1.1 చీబోరికగారి బాల్ గుడ్ లెంగ్త్ లో పడింది అయితే ఆవేశం ఆపుకోలేని శర్మగారు దానిని బాదిన వీరబాదుడువల్ల అది లాంగ్ ఆఫ్ మీదనుండి స్టేడియం బయటకి పోయి పడింది. 6 పరుగులు
స్కోరు 26/0 1.1 ఓవర్లలో
ఉన్నట్టుండి వర్మగారికి అంతకోపం ఎందుకు వచ్చిందో తెలియక అందరూ బుఱ్ఱలు గోక్కుంటున్నారు.
1.2 రెండవబంతి ఫుల్లర్ లెంగ్త్ - ఈ సారి వర్మగారి బాదుడుకి బంతి లాంగ్ ఆన్ దాటి వెళ్ళి రౌమ్య తిందామనుకున్న కజ్జికాయలడబ్బాలో పడింది - 6 పరుగులు
స్కోరు 32/0 1.2 ఓవర్లలో
లిమిటెడ్ ఓవర్ మేచ్ లో టెస్ట్ మేచ్ ఫీల్డింగ్ పెట్టి బేటింగ్ టీమును కంఫ్యూస్ చేద్దామన్న పాచిక పారకపోవడంతో ఉత్తరాంధ్ర కేప్టెన్ డిఫెన్సివ్ ఫీల్డు మొహరించారు, వికెట్ కీపర్ తప్పా అంద్రీనీ బౌండరీ మీద నిలబెట్టి. పవర్ ప్లే లేకపోవటం ఆయనకి కలిసొచ్చింది.
స్కోరు 38/0 1.3 ఓవర్లలో
1.3 మూడవ బంతి షార్ట్ పిచ్ - ఏమాత్రం కోపం తగ్గని సర్మగారి హుక్ షాట్ కి బంతి వెళ్ళీ వెళ్ళీ ఫైన్లెగ్ బౌండరిలో ఉన్న పంచవటి గ్రూపు మీద పడింది. తమ అభిమాన బేట్స్మేన్ వీరవిహారానికి సంతోషిస్తూ అక్కడివారు పండగ చేసుకుంటున్నారు.
అయితే వర్మగారి కోపానికి కారణం వారికి కూడ అర్థం కావట్లెదు.
మేచ్ లో అంతరాయం. ఒవర్ మారినప్పుడు స్వీపర్ కవర్ స్పాటులోకి వచ్చిన మలక్ కేప్టేన్ కేక్యూబ్ శర్మ గారిదగ్గరికి వచ్చి చీబోరిక వెనకాల ఉన్న సైట్స్క్రీన్ కేసి చూపిస్తూ ఏదో చెప్తున్నారు.
ఇప్పుడు వారిద్దరూ అంపైర్లతో సంభాషిస్తున్నారు. సైట్స్క్రీన్ దగ్గరకు అంపైర్లు ఏదో సందేశం పంపించారు.
అసలక్కడ ఏమిటి జరుగుతోందనేది మరికాసేపట్లో మనకి మంచుగారిద్వారా తెలుస్తుంది.
1.4 చీబోరికగారు బౌలింగ్ మొదలుపెట్టారు, ఉన్నట్టుండి సత్యనారాయణవర్మ గారి ముఖం ప్రశాంతంగా మారిపోయింది, తరువాతి బంతిని చిరునవ్వుతో డిఫెన్స్ ఆడరు. దానిని చీబోరికగారే ఫీల్డ్ చేశారు.
1.5 ఈసారికూడ వర్మగారు చిరునవ్వుతో డిఫెన్స్. పరుగులేమీ లేవు.
1.6 ఓవర్లో ఆఖరి బంతి ఎడ్జికి తగిలి థర్డ్ మేన్ దిశగా వెళ్ళింది వికెట్కీపర్ వెళ్ళి దానిని తెచ్చేలోగా రెండు పరుగులు.
స్కోరు 40/0 రెండు ఓవర్లలో
*********************************
రెండవ ఓవర్ పై మంచుగారి ప్రత్యేక రిపోర్ట్:
రెండవ ఓవర్ లో వర్మగారి ధోరణి వెనక ఉన్న రహస్యం బహిర్గతమైంది. సైట్స్క్రీన్ దగ్గర ఉన్న ఒక నాస్తికగుంపు వారు చీబోరిక బౌలింగ్ వేసే సమయానికి సైట్స్క్రీన్ మీద ఎదో కనిపించేలా ఏర్పాట్లు చేసారని తెలుస్తోంది. వారి లక్ష్యం వర్మ గారి ఏకాగ్రతను దెబ్బతీసి ఔట్ చెయ్యటం. అయితే ఆ ఎత్తు పారక అది చివరికి మూడూ సిక్సులకు దారి తీసింది. అది గమనించిన మలక్ కేప్టెన్ కీ అంపైర్లకీ చెప్పటంతో అలాంటి పనులు నియామాలకి విరుధ్ధమని అంపైర్లు ఆ గుంపుకి సందేశం పంపటం జరిగింది. మూడు బంతుల తరవాత అది కనబడకపోయేసరికీ వర్మగారు ప్రశాంతంగా మారిపోయారు.
ఇంతకీ ఆ గుంపు వారు సైట్స్క్రీన్ మీద ఏమి చూపిస్తే సత్యనారాయణ వర్మ గారిలో ఆగ్రహం కట్టలు త్రెంచుకుందో తెలుసా? అది ఒంగోలు శ్రీను ఫోటో :))
**********************************
కామెంటరీ:
పులుసుగారు: ఈలోగా అక్కడ చీబోరిక తన కేప్టెన్ కి ఒక చాలెంజ్ విసిరారు. ఈ మేచ్ గుంటూరు టీము గెలుస్తుందని, గెలవకపోతే తనమీద విశ్వహిందూ పరిషత్ కి ఫిర్యాదు చెయ్యమనీ. గుంటూరు గెలవకపోతే చీబోరిక మీద విశ్వహిందూపరిషత్ కి ఫిర్యాదెందుకు చెయ్యాలో అర్థంకాక కేక్యూబ్ శర్మ గారు తలగోక్కుంటున్నారు. శంకర్ 1 గారూ, మీ అభిప్రాయమేమిటి?
శంకర్ 1: నాకు అర్థం కావట్లేదు పులుసుగారు అక్కడ ఏమి జరుగుతోందో. అయితే ఒక మగవాడు ఒక మహిళకి సమర్పించుకున్న 40 పరుగులనే ఒక మహిళగా మరొక పురుషుడికి సమర్పించానన్న విజయగర్వం ఆమెలో తొణికిసలాడుతోంది. మార్తాండ, చీబోరిక సమంగా 20, 20 పరుగులు గుంటూరుకి ఇచ్చారు. డిప్పారావు గారూ, మీ అభిప్రాయం ఏమిటి?
డిపారావు: శంకర్ 1 గారూ, నేను నా ప్రకటనలో కాస్త తీరికలేకుండా ఉన్నాను. తరవాత మాట్లాడతాను. శంకర్ 2 గారిని అభిప్రాయ చెప్పనివ్వండి. ఇద్దరిలో ఎవరు బాగా బౌలింగ్ చేశారు?
శంకర్ 2: ఇసక తక్కెడ పేడ తక్కెడ! ఏరాయయితేనేం?
డిప్పారావు: ఆహా శంకర్ 2 గోరో. మీరు మీ పధ్ధతిలో కొట్టినట్టుగా సమాధానం చెప్పారుగా. శంకర్ 1 గారూ, ఇక మీరు కొనసాగించండి.
శంకర్ 1: ఇప్పుడే అందిన వార్త. సత్యనారాయణ వర్మ గారు చెలరేగిఫొతున్నప్పుడు ప్రతీ షాటుకీ పెవిలియన్లో ఉన్న కవిగారు "అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంత కమ్మగా ఉందిరో యబ్బ" అని పాడటం మొదలు పెట్టారనీ, అయితే అది గమనించిన గాడేపల్లిగారు అలాంటి అసభ్యకర అభ్యంతరకరమైన పాటలు ఏ డిస్కోతెక్కులోనో లేక, జనాలడబ్బులతో రొడ్డుపక్కన వేసే వినాయక చవితి పందిళ్ళలోనో వినాలిగానీ ఇలాంటి క్రికెట్ స్టేడియాలలో పాడకూడదని మందలించినట్టుగా తెలుస్తోంది.
మిగతా విశేషాలు తరువాయి పోస్టులలో!
Subscribe to:
Post Comments (Atom)
kev keka
ReplyDeletebomma vadi baamma gaaru leraa ?
ReplyDeleteidi anyaayam, maa kaarat anyaa edi ?
ReplyDeletered shirt rangavelli ,
ReplyDeleteodipotunna team ki peru meeda archana , blogeswara
raju esu ,
ardham kaaka burra gokkune ghoram nirvahakudu,
ఇంతకీ నేను వన్నా, టూ నా? :)))))
ReplyDeleteనా వల్ల కాదు నేను ఇక నవ్వలెను
ReplyDeleteఅసలు శంకరే కాదు.:) మీరు షంకర్ కదా! అయితే గియితే శంకర్2 నాకు నచ్చాడు కాబ్టే, అది నేనేనేమో అని అనుమానం.
ReplyDeleteమలకూ, అద్వానీని పర్మనెంటుగా క్షమాపణల మంత్రిత్వశాఖకు శాశ్వత కేబినెట్ మంత్రిగా నియమించాలనే డిమాండ్ రాందేవ్ చిట్టాలో చేర్చాలి. ఏమంటావ్?
నీవేదో డెత్‌వేలీలో తపస్సు మొదలెట్టావటగా! ;) నాతో మాట మాత్రంగానైనా చెప్పలేదు, :( ... సరేలే చమించేశా, మొదటి రౌండ్లో రంభ, మేనకలొస్తే కబురెట్టు.
Snkr
:-)) Awesome.
ReplyDeleteరాముడికి లాడెన్ కి తేడా లేదని తెలిసింది కాబట్టి నేను ఫీల్డింగ్ కి వస్తున్నా
రౌమ్య తిందామనుకున్న కజ్జికాయలడబ్బాలో పడింది
అది ఒంగోలు శ్రీను ఫోటో :))
ఇసక తక్కెడ పేడ తక్కెడ! ఏరాయయితేనేం?
రొడ్డుపక్కన వేసే వినాయక చవితి పందిళ్ళలోనో వినాలిగానీ
3rd over kosam waiting
ReplyDeleteభరద్వాజ గారు,
ReplyDeleteచాలా చక్కగా మమల్ని నవ్విస్తూ వ్రాస్తున్నారు. కాకపోతే ఇక్కడ కామెంట్ పెడితే ఆ ప్రమోదవనం చెత్త వెధవలు టార్గెట్ చేస్తారేమో అనే భయంతో ఎవరూ కామెంట్ పెట్టడం లేదు కానీ అందరూ ఆస్వాదిస్తూ ఉన్నారు. మూడో ఓవర్ వ్రాసేయండి మరి.
lool వాళ్ళకంత సీన్ లేదు లెండి. వాళ్ళ ఏడుపు మాలిక మీద. వాళ్ళ నాయకుడే మాలిక కోసం ఒక సైట్ కూడా మొదలుపెట్టాడు కదా :)
ReplyDeleteభరద్వాజ గారు తార అనే యువకుడు నమ్మకముగా మాలిక లో చేరి వెన్నుపోటు పొడిచాడని విన్నాము. నిజమేనా మీరు ద్రువీకరించవలసినది గ కోరుచున్నాము.
ReplyDeleteబాబూ అజ్ఞాత: జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అనే సామెత వినలేదా? అలాగే ఇది కూడానూ.
ReplyDeleteఅలా కాదు మహాశయా అతని బారిన చాలామంది పడకుండా కాపాడిన వారు అవుతారు కదా! ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పే దౌర్భాగుడని విన్నాము. అందుకే అడుగుతున్నాము లెండి .
ReplyDelete>>>జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అనే సామెత వినలేదా? అలాగే ఇది కూడానూ
ReplyDeleteఅన్నా
నా లాంటి అజ్ఞానులకి అర్ధం అయ్యేటట్లుగా చెప్ప్పు అన్నా
>>>వాళ్ళ నాయకుడే మాలిక కోసం ఒక సైట్ కూడా మొదలుపెట్టాడు కదా :)
మలక్ అన్న ఎవురాడు ?
మలక్ అన్న ఎవురాడు ?
ReplyDelete___________________
ఇంకెవరు? మన ప్రిన్స్ ఖలేజానే :))
ADAAA , :))
ReplyDeleteఈ క్రికెట్ సిరీస్ బాగుంది
KANTINUE చేయండి
ఇక్కడ మాటలు అక్కడ చెబితే పరవాలేదు అబాయా కాని లేణి పోనివి కల్పించి చెబితేనే ఇబ్బంది.
ReplyDeleteలేణి పోనివి కల్పించి చెబితేనే ఇబ్బంది
ReplyDelete____________________________________________________________
లేనిపోనివా? ఏమున్నాయి సామీ? కాస్త ఈ చెవిన వేద్దూ. నేనయితే ఒకటే విన్నాను - నేనేదో టిచర్నని మన మౌళీ గారికి చెప్పాడని ( ఆ సంగతి ఆవిడగారే ఎవరో మహిళా బ్లాగర్ కి చెప్పిందని) - But when I asked him about it, he denied it.
ఇబ్బంది ఏముంది ?
ReplyDeleteరోటి లో తల పెట్టాక రోకలి పోటు కోసం వెయిటింగ్ చెయ్యల
బలాగు మొదలెట్టాక , గోక్కోవాలే , గోకించు కోవాలె
అసలు ఎవరెవరికి ఏమి చెప్పాడో అందరూ కలిసి ఒక పోస్టు పెట్టండన్నా. అసలు గొడవ తేలేపోతుంది కదా?
ReplyDeleteకడుపుబ్బా నవ్వే పోస్ట్ చదివి కామెంట్ పెట్టకుండా పోతున్నారు అందరూ
ReplyDeleteనేను విచారం వ్యక్తం చేస్తున్నా
ప్రమాద వనం & ప్రమోద వనం అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి ఓంకార్ గాడ్ని పెద్ద మనిసి గా కూకోపెట్టి తార గాడి బూర ( బుర్ర ) పగల కొట్టండి
taara most dangerous ata kadaa.
ReplyDelete@@ అసలు ఎవరెవరికి ఏమి చెప్పాడో అందరూ కలిసి ఒక పోస్టు పెట్టండన్నా. అసలు గొడవ తేలేపోతుంది కదా?
ReplyDeleteపవన్ ఫేక్ అని, అసలు పవన్ వాళ్ళ ఊరే ఆంధ్రాలో లేదని, పవన్ ఇంకా అతని బ్లాగులో కామెంట్స్ పెట్టె వారు అంతా ఫేక్ అని. అసలు పవన్ వెనక పెద్ద నెట్వర్క్ ఉంది అని ఇంకా చాల చాలా కల్పించి ఒక నలుగురు బ్లాగర్లకు (బ్లాగుల్లో ఫేమస్ మరియు తారకు, పవన్ కు వారు మిత్రులు) చెప్పాడు. అదే సమయంలో ఆ నలుగురు కలిసి పవన్ గురించి చాలా చెడుగా తనకే చెప్పినట్టు జిమెయిల్ చాట్ క్రియేట్ చేసుకుని అవి పవన్ కి పంపి అతని మనసు విరిచాడు. ఇది ప్రధానమైంది
కొత్తపాళీ గారిని బండబూతులు తిడుతూ తిక్కలోడు బ్లాగు పెట్టడం.
ReplyDeleteకెలుకుడు సంఘాన్ని తిడుతూ బ్లాగువీక్షణం పెట్టడం.
బ్లాగుబాబ్జి అనే బ్లాగు పెట్టి, మోహిత్ అనే పేరుతో అందరికీ పరిచయం అవడం. బ్లాగు బాబ్జి ఐడి లో చేయకూడని అడ్డమైన పనులు చేయడం.
ఒక జాతకాల శర్మ గారి మీద లైంగిక ఆరోపణలు ఉన్నట్టు అసత్యాలు ప్రచారం చేయడం.
ఇంత జరిగినా కూడా ఇప్పటికీ బ్లాగులు వదలకుండా అన్ని బ్లాగులు చదవడం , అసభ్యంగా కామెంట్లు పెట్టడం.
ఈ మాత్రం చాలా ఇంకా కొంచెం కావాలా ?
ReplyDeleteఇప్పుడు కొత్తగా బ్లాగుల్లో anti kamma movement మొదలయిందట కదా? దాని వెనుక ఉన్నది కూడా తార అనే చాలా మంది చెవులు కొరుక్కుంటు ఉన్నారు మరి....
ReplyDeleteప్రతీదానికీ తార జపం ఎందుకు? అతను తిన్ననైనవాడు కాడు. ok. మరి వినేవాళ్ళ బుద్ధి ఏమయింది?
ReplyDeleteఆ తార ఎవరో నాకు తెలుసుగా, నేను చెప్పనుగా,
ReplyDelete@మలక్ అన్న
అసలు కధ ( క్రికెట్ ) పక్కకి పోయింది
మూడో ఓవర్ రాసే మూడ్ లేదా ?