(THIS WAS A REAL INTERVIEW AND ALL THE QUESTIONS WERE ANSWERED BY JYOTI HERSELF)
మలక్పేట్ రౌడీ: ప్రమాదవనంలోకి మళ్ళీ తొంగి చూస్తున్న వీక్షక మహాశయులకి మళ్ళీ కెలికాస్కారములు (ఇది మా కొరివి దయ్యం ట్రేడ్‌మార్కు - నేను కొట్టేశా)
ఈసారి మన ఘోస్టు ఆస్టిన్ ఆండాళ్ళమ్మ గారు. నమస్తే ఆండాళ్ళూ! ఓవర్ టు యూ!
ఆస్టిన్ ఆండాళ్ళు: నమస్తే. ఈ సారి మన గెస్టు ఒక ప్రముఖ బ్లాగర్. బ్లాగ్లోకంలో ఒక బ్రాండు, ఒక సంచలనం. చాలా వివాదాలకు కేంద్రబిందువు. మగ పురుషుల వలయంలోకి అభిమన్యురాలిలా (అభిమన్యుడికి స్త్రీలింగం లేండి) చొచ్చుకుని వచ్చిన ఒక వనిత. ప్రమాదవనంలోకి వచ్చిన ఒక ప్రమద.
మలక్‌పేట్ రౌడీ: (సణుగుతూ) గోకులంలో సీతేమి కాదూ?
ఆస్టిన్ ఆండాళ్ళు: ఏమిటా వెధవ పోలిక? ఇలాంటి తింగరి మాటలు మాట్ళాడితే నేను ఈ తుంటర్వ్యూని హోస్టుచెయ్యనంతే!
మలక్‌పేట్ రౌడీ: అమ్మా తల్లీ వద్దులే. అసలే ఆ విస్కాన్‌సిన్ విశాలాక్షి కూడ బిసీ బిసీ. నువ్వు లేక మాకిప్పుడు వేరే దిక్కు లేదు. నువ్వు కానీ ఇక!
ఆస్టిన్ ఆండాళ్ళు: సరే ఈ సారి మన గెస్టు ప్రమదావనం జ్యోతక్క. ఎంట్రీ గ్రేండ్ గా ఉండాలన్న ఉద్దేశం తో ఒక తీన్‌మార్ స్తైల్ ఇంట్రో పాటని వదుల్తున్నాం కాచుకోండి.
మలకూ, ఇహ వేస్కో!
మలక్‌పేట్ రౌడీ:
మాయదారి జ్యోతక్కో జ్యోతక్కా .. ఎన్నెన్ని బ్లాగులు రాస్తవే జ్యోతక్కా
మాయదారి జ్యోతక్కో జ్యోతక్కా .. ఎన్నెన్ని బ్లాగులు రాస్తవే జ్యోతక్కా
జ్యోతక్కో జ్యోతక్కో జ్యోతక్కో జ్యోతక్కా
నువ్వు పోస్టు రాసి గాయబు కాకే జ్యోతక్కా
జరా కామెంట్లూ చదవవే జ్యోతక్కా
నువ్వు వంటలు చెప్పీ లాగవుట్ అవ్వకే జ్యోతక్కా
జరా చేసి చూపించవే జ్యోతక్కా
మాయదారి జ్యోతక్కో జ్యోతక్కా .. ఎన్నెన్ని బ్లాగులు రాస్తవే జ్యోతక్కా
ఆస్టిన్ ఆండాళ్ళు: నమస్తే మేడం జో! ఈ తుంటర్వ్యూ కి స్వాగతం.
జ్యోతక్క: నమస్తే ఆండాళ్ళూ! నమస్తె రౌడీ అన్నా! బాగున్నవా? వదినెమ్మ, పిల్ల ఎలా ఉన్నరు? ఏంది ఏదో మాట్లాడాలె అన్నవ్? అవునూ నువ్వు ఎప్పుడూ ఎవరినో ఒకరిని కెలుకుతుంటవంట.. చదువుకునేటప్పుడు గా సెంట్రల్ యూనివర్సిటీ రేడికల్ ఫెమినిస్టు పోరీలను ఊరికే సతాయించెటోడివి . పెళ్ళైనక్క వదినెమ్మ దగ్గర నీ ఆటలు నడుస్తలేవని ఇక్కడ జనాలను కెలుకుతున్నా??
మలక్‌పేట్ రౌడీ: జ్యోతక్కోయ్ - ఇది నీ ఇంటర్వ్యూ. మేము నిన్ను ప్రశ్నలడగాలే. నువ్వేంది గిట్లా ఉల్టా ఆడుగుతున్నవ్?
జ్యోతక్క: సరే ఐతే నేను చాయ్ తెచ్చుకుని కూర్చుంటా. అడూగుండ్రీ...
ఆస్టిన్ ఆండాళ్ళు: ఇంతకీ ఈ కొత్త టెంప్లేట్ ఏమిటి రౌడీ మహాశయా?
మలక్‌పేట్ రౌడీ: ఏమి చెయ్యమంటావ్ ఆండాళ్ళూ? (శంకరాభరణం దాసు మొహం వేసుకో ఒక సారి)
ఆవిడకి నా పాత టెంప్లేట్ నచ్చలేదు. టెంప్లేట్ నచ్చితే తప్ప ఇంటర్వ్యూ ఇవ్వనని భీష్మించుకుని కూర్చుంది. సరే మారుస్తానని చెప్పి ముద్దుగా పెద్ద తుపాకీ ఉన్న 'వైల్డ్ వెస్ట్' టెంప్లేట్ పెట్టుకుందామంటే ఆ టెంప్లేట్ రంగు ఆవిడ కట్టిన చీర రంగుకి, ఆవిడ వండిన కూర రంగుకి మేచ్ అవ్వలేదుట. సరే ఆవిడనే సెలెక్ట్ చేసుకోమంటే, ఇదిగో ఈ టెంప్లేట్ చేసి పెట్టారు నాకు.
ఆస్టిన్ ఆండాళ్ళు: సరే ఈ సారి మన e-స్టావధానంలో చాలా ప్రశ్నలే ఉన్నాఇ.
1. జ్యోతక్కా! మీ సెల్ఫ్ డబ్బా ప్లీస్!
జ్యోతక్క: అబ్బా!! నా గురించి ఎవరూ మొత్తం చెప్పరు అని అనుకునేదాన్ని. నన్నే చెప్పమన్నవ్ కదా. మొదటినుండి గారంగా పెరిగాను. మొండిదాన్ని. ఇంట్లో నేనే ఎక్కువ అరిచేది. ఎవ్వడైనా తప్పు చేస్తే మరి ఊరుకోను. వాడికి మూడినట్టే. ఇక ఈ బ్లాగులల్ల కొచ్చి మస్తు పెరు తెచ్చుకున్నలే. చాల మంది పెద్దోల్లు తెలుసు. గీ లింకు సూడూ జరా
దేనిమీదైనా ఈజీగా రాసేస్తాను. అందరూ నన్ను మెచ్చుకోవాలే అని పేరు లేకుండా రాసేటోళ్లని నా బ్లాగులో రానియ్యను తెలుసా. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి గాని వద్దు నజర్ కొడ్తది. అసలే జనాలు ఏడుస్తున్నరు నామీద.
ఆండాళ్ళు: 2. మీ బ్లాగు మూడింటికి ఫేమస్ - పోట్లాటలు, పాటలు,వంటలు. వీటివల్ల మీకొచ్చిన సెలెబ్రిటీ స్టేటస్ పై మీ అభిప్రాయం?
జ్యోతక్క: ఏందమ్మోవ్ ? .. నేను గా మూడే రాయనుగా. పాటల కోసం వేరే బ్లాగుంది,వంటలకు ఉంది. ఇక కొట్లాటలంటవా. నేను కావాలని పెట్టుకోలా. ఏదైనా ఉంటే నాతో మాట్లాడమంట. ఇనరు. ఇష్టమొచ్చినట్టు రాస్తుంటరు.
ఆండాళ్ళు: 3. ముందుగా పోట్లాటల గురించి - ఒక జ్యోతితో ఒక గదిని తగలపెట్టచ్చు - అదే
ఒక కాగడాతో అయితే ఒక ఇంటినే తగలపెట్టచ్చు - కామెంట్ ప్లీశ్!
జ్యోతక్క: ఈ తగలపెట్టుడు అవి మనకెందుకమ్మా? .. ఎవరిల్లు వారు అంటించుకుంటే నేనేమీ చేయలేను మరి.
ఆండాళ్ళు: 4. పాటల గురించి - జనాలంతా మీ అభిమాన గీతం "ధూం" సినేమాలో "ధూం మచారే"
పాట అని అంటూ ఉంటారు. మీ అభిప్రాయం? అసలాపాటంటే మీకెందుకంత ఇష్టం?
జ్యోతక్క: చాలు! ఇక ఆపండి!!
మలక్పేట్ రౌడీ: అమ్మా ఆండాళ్ళూ - ఇలాంటి ప్రశ్నలడిగి జనాలని ఇబ్బంది పెట్టద్దు. కాని ఒక్క విషయం - ఇన్నాళ్ళు పద్యాలకు మాత్రమె ప్రతిపదార్ధాలు చదువుకున్నా - మొదటిసారిగా సినిమా పాటలకీ ప్రతిపదార్ధాలు చూస్తున్నా బ్లాగుల పుణ్యమా అని :))
ఆండాళ్ళు: 5. సరే సరే - ఇక వంటలు - మీరు కూరలు పచ్చళ్ళ గురించి చాలా వ్రాస్తారు గానీ 'పప్పు' గురించి అస్సలు వ్రాయరు. ఎందుకు? పప్పంటే మీకు ఇష్టంలేదా?
చా. పప్పు సూడనీకి మస్తుగుంటది కాని తిననీకి సప్పగుంటది.అందుకే అవి ఎక్కువ చేయను, రాయను. ఐనా ఇప్పుడు పప్పు ధరలు మండిపోతున్నయ్. కొనేట్టు ఉందా?
మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుందామా. ఒకటి అడుగుత చెప్పు.. 3 చీమలు పోతున్నయ్. జర దూరం పోయాక ఒక చీమ సీద పోయింది, రెండు చీమలేమో ఎడమదిక్కు పోయినయ్.ఎందుకంటవ్??సొచాయించు...
మలక్‌పేట్ రౌడీ: ఊహూ(! నాకు వెలగట్లేదు. కానీ అప్పుడెప్పుడో రవిగారి బ్లాగులో చదివినదాని బట్టీ చూస్తే ముందు చీమ కైనెటిక్ హోండా మీద వెళ్ళే ఒక రిపోర్టరు, వెనకాల రెండు చీమలూ ఆవిడ ఆచూకీ కనిబెడదామనుకున్న బ్లాగర్లు.
వీళ్ళు వెంటపడడం చూసిన ముందు చీమ, లెఫ్టు ఇండికేటరు వేసి సీధా పోయింది, మిగిల రెండు చీమలూ లేఫ్టుకి తిరిగాయ్.
కొంచం ఎక్కువయ్యిందా?
ఆండాల్లు: చాలా ఎక్కువయ్యింది. జ్యోతక్కా! మీ సమాధానం?
జ్యోతక్క: ఏం లేదమ్మా! ... ఒక చీమ ఏమో నౌకరీకి హైటెక్ సిటీ పోతుంది. ఇంకో రెండు ప్రేమల పడ్డరు, పార్కుకు పోతున్నయ్.. అంతే.. గదిసరే సడెన్ గా ఏమిటీ కంపు?
ఆండాళ్ళు: హా హా జోకు పేలింది.
మలక్‌పేట్ రౌడీ: (మళ్ళీ సణుగుతూ) కుళ్ళింది. అందుకే కంపు.
ఆండాళ్ళు: ఏయ్!
మలక్‌పేట్ రౌడీ: అమ్మో సరే సరే, నేనేమి అనను - నువ్వు కానివ్వు
ఆండాళ్ళు: మీరు భలే జోకులేస్తారు మేడం జో! మిమ్మల్ని జోకుల జ్యోతక్క అని పిలవచ్చేమో?
జ్యోతక్క: తలకాయల్లేస్తాఇ !!!
ఆండాళ్ళు: అమ్మో! వద్దు ...
6. మీ వారు ఇంట్లో లేని టైం చూసి ముగ్గురు - ఒక ముసలావిడ, ఒక మధ్యవస్కురాలైన స్త్రీ, మరో పురుషుడు మీ ఇంటికొచ్చి ముగ్గురం మీ వారిని ప్రేమిస్తున్నామని, ఎవరు సరైన జోడీయో మీరే నిర్ణయించాలని అంటే దానికి మీ రియాక్షన్?
జ్యోతక్క: నిజం చెప్పొద్దు. మా ఆయన బంగారం అనుకో. నువ్వేంది బేకార్గాళ్ల గురించి చెప్తవ్.ఐష్వర్య లేదా ష్రేయా లంటి పోరీలైతే మంచిగుంటది గాని. వీళ్లందరిని కె.బ్లా.స కి పంపిస్తా ఆటో పైసలిచ్చి.. వాళ్లే చూసుకుంటరు.
ఆండాళ్ళు: 7. మిమ్మల్నింతకీ నువ్వు అని పిలవాలా లేక మీరు అని సంబోధించాలా? ( మరీ "ఒసే జ్యోతక్కా!" అంటే బాగుండదని)
జ్యోతక్క: ఒసే అని మా ఆయనే అనడు. ఐనా నాకు తెల్వకడుగుత. మీరు అంటే నెత్తిమీద కుచ్చుల తోపీ పెట్టినట్టా. పిలిచెటోళ్లకు, పిలిపించుకునేటోళ్లకి లేని పరేషానీ ఈళ్లకెందుకో నాకు సమజ్ ఐతలేదు. మనసుల ప్రేమ ఉండాలె ఈ పిలుపులల్ల ఏముందో ఏమో. నాకైతే గార్లు, బూర్లు అస్సలు పడవు.
ఆండాళ్ళు: 8. ప్రమాదవనానికి ఇంటర్వ్యూ ఇవ్వడం పై ఎలా ఫీలవుతున్నారు?
జ్యోతక్క: మస్తుగుంది. మీ అంత మజాక్ నేను చేయలేను .
ఆండాళ్ళు: 9. మీకు కెబ్లాస ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఏం చేస్తారు?
జ్యోతక్క: సంఘాన్నే మూసేస్తా.. సొచాయించుండి మరి. లేదంటే ఏకలింగానికి ఇస్త. అన్నీ నిజాలె మాట్లాడుతడు ఆ తమ్మి.
మలక్‌పేట్ రౌడీ (స్వగతం): హమ్మ ఏకలింగం! పదవికోసం ఈ రూట్లో వచ్చావా? నీ సంగతి తరవాత చెప్తా!
ఆండాళ్ళు: 10. మేడం జో! మిమ్మల్ని శరత్, కాగడా, ధూం, రవిగారు, యోగి, మలక్‌పేట్
రౌడీలతో కలిపి అంటార్కటికాలో వదిలేస్తే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటూంది?
జ్యోతక్క: నాతో మంచిగుంటె మంచిగ ఉంట,మాట్లాడతా, ఒండి పెడతా. లేదంటే ఏమీ అనను.. రోసయ్య, రేణుక చౌదరీని పిలిచి వాళ్లను చూసుకోమంటాను. నేను నా బ్లాగులు చూసుకుంటా పకోడీలు తింటూ.
మలక్‌పేట్ రౌడీ: నేను గాని ఆవిడ స్థానంలో ఉంటే వేరేగా ఉంటుంది.
ఆండాళ్ళు: ఏమిటో అది? కుళ్ళు మరి .. సారీ సారీ... చెప్పు మరి :))
మలక్‌పేట్ రౌడీ: ఏమీలేదు. ఆపదలో ఉన్న అబల అని మార్తాండకి ఫోన్ కొడతా.. దెబ్బకి శరత్ పారిపోతాడు. అలగే యనమండ్ర నెంబరు నొక్కుతా దెబ్బకి ధూం పారిపోతాడు. నా దగ్గర ఉన్న కిచెన్ "కత్తి" ని యోగి ముందు పెడతా ... దానిని కెలకడంలో బిసీ అయిపోతాడు. రౌడీ చేత తెలుగు పద్యం సమస్యా పూరణం ఇప్పిస్తా "మంచి బుధ్ధి కలిగె మారీచునకున్" అని .. దానిని పూరించడంలో కాగడా బిజీ. టెంప్లేట్ చెంగ చేసి పెట్టనా అని రవిగారిని అడుగుతా - దెబ్బకి ఆయన పరార్!
ఇక ఈలోగా ఆపదలో ఉన్న ఆడపిల్లని రక్షించడానికి మార్తాండ వచ్చి వాలిపోతాడు. అతని కాళ్ళూ, చేతులూ కట్టేసి "టక్కరి పంది" పాట వినిపించే పని రౌడీ కి అప్పచెబుతా - రౌడీ కూడా బిసీ. ఇక నేను పకోడీలు తింటూ బ్లాగులు రాస్కుంటా
ఆండాళ్ళు: అంటార్కటికాలో ఫోనులు, బ్లాగులు?
మలక్‌పేట్ రౌడీ: చిర్రెత్తించకు. చెప్పింది విను!!
ఆండాళ్ళు: 11. సరే సరే! జ్యోతక్క గారూ! ఇంతకీ మీరు స్త్రీవాదా? కానీ మీ బ్లాగులో ఎక్కడా "అదిగో ఆ మగ చీమ ఆడ చీమని కుట్టీంది - మగజాతి ఆడ జాతిని బ్రతకనివ్వట్లేదు - మగ జాతి నశించాలి" అనే నినాదాలెక్కడా నాకు కనపడలేదే? పురుషులని అడ్డమైన తిట్లూ తిట్టి, ద్వేషించని మిమ్మల్ని స్త్రీ వాదిగా వారు ఒప్పుకోరేమో?
జ్యోతక్క: అంటే నువ్వు చెప్పేది ఏమంటవ్? గట్టిగ మాట్లాడితే స్త్రీవాడి అనా. నేను ఎప్పుడు సచ్ ఏ చెప్తా మరి. ఆడోళ్లు మొగోళ్లను సతాయిస్తరు, మొగోళ్లు ఆడోల్లను సతాయిస్తరు. ఐనా కూడా ఇద్దరూ కలిసి ఉండక తప్పదు కదా. నీకు తెలీని వేదమా ఇది .. ఇన్ని రోజులు నమ్మలేదుగాని ఆడోళ్లకి ఆడోళ్లే దుష్మన్లని తెలిసింది.. అదే మరి టోకరాలు తగిల్తేనే ఏదైనా నెత్తికెక్కేది..
ఆండాళ్ళు: మలకూ - ఇక నీ రెగ్యులర్ పేరడీ టైం - ఈ సారీ పేరడీ ఎవరి మీద?
మలక్‌పేట్ రౌడీ: ఈ సారి జ్యోతక్కమీదే - ఆవిడ వంటల మీద.. జ్యోతక్క బ్లాగు చూసి వంట చేసిన ఒక మహిళామణి పడే ఆవేదన మీరే వినండి ( గులాబీ - ఈ వేళలో నీవు స్టైల్ లో)
----------------------------
ఈ వేళలో నీవూ, ఏం తింటూ ఉంటావో
అనుకుంటూ ఉన్నాను ఈ నిమిషమూ నేను
మేడం 'జో' బ్లాగు చూసీ పచ్చళ్ళు చేశానే
నీ లంచ్ పేక్ లోన అవి కూడా వేశానే
అవి గాని తింటేనూ నువ్వేమైపోతావో
భయపడుతూ ఉన్నాను ఈ నిమిషమూ నేను
ఈ వేళలో నీవూ, ఏం తింటూ ఉంటావో
అనుకుంటూ ఉన్నాను ఈ నిమిషమూ నేను
------------------
గోంగూర పచ్చడేమో ఆవుపేడ లా ఉంటే
నాదికాదు ఆ నేరమూ ఊ ఊ ఊ
నాదికాదు ఆ నేరమూ
వంకాయ పులుసేమో కాఫ్ సిరప్ అయిపోతే
అది బ్లాగరీ ఘోరమూ
నాదికాదు ఆ నేరమూ
కడుపులో తిప్పుతుంటే, గుడగుడలు ఆగకుంటే
మాత్ర మింగలేకుంటే, టానిక్ తాగలేకుంటే
ఏ డాక్టర్ ని చూస్తావో, భయపడుతూ ఉన్నాను
ఈ వేళలో నీవూ, ఏం తింటూ ఉంటావో
అనుకుంటూ ఉన్నాను ఈ నిమిషమూ నేను
-----------------------------------------
ఆండాళ్ళు : అడిగిన వెంటనే మా ప్రమాదవనానికి విచ్చేసిన జ్యోతక్కా, నీకు థేంక్స్.
జ్యోతక్క: థేంక్స్ ఆండాళ్ళు ,రౌడీ అన్న. ఇగ నేను పోతున్న. ఇంట్ల మస్తు పనుంది. పనిమనిషి రాలేదియాల. నీతో ఇంతసేపు ముచ్చట్లేసినందుకు ఓ వంద డాలర్లు నా బ్యాంకుల ఎసెయ్. ఫుకట్ ల పని చేస్తే మంచిగుంటదా చెప్పు.
మలక్‌పేట్ రౌడీ: ఇదంతా ఓపిగ్గా చదివిన వీక్షకులకి కృతజ్ఞతలు. వచ్చే ప్రమాదసూచికలో మళ్ళీ కలుద్దాం - కెలవ్! (యోగి ట్రేడ్ మార్కు)
(THIS WAS A REAL INTERVIEW AND ALL THE QUESTIONS WERE ANSWERED BY JYOTI HERSELF)
నిజంగానే షాకిచ్చారే! ఈ షాక్ వల్ల నేను ఇంటర్వ్యూను పూర్తిగా చదవలేదు. మళ్ళీ వచ్చి చదివి, మళ్ళీ కెలుకుతా సారీ కామెంటుతా. :) అందాకా కెలవ్. (ఏంటో నాలుగు ముక్కలు చదవగానే నాక్కూడా కెలుకుడు భాష వచ్చేసింది).
ReplyDeleteనిజంగా జ్యోతి గారు ఇలాంటి ప్రశ్నలకి జవాబులిచ్చారా?
ReplyDeleteవిస్కాన్సిన్ విశాలాక్షి ఎవరు?నేను కాదు కదా?
Yes .. she answered all the questions .. We succeeded in presenting the OTHER SIDE of her!!!
ReplyDeleteOh, are you from Wisconsin? Then may be you are W.V. :))
Jus Kiddin!
అసలు ప్రశ్న మర్చినట్లున్నారు, ఆండాళ్ళుగారు! ప్రాముఖ్యత సంతరించుకొనే ప్రశ్నలనే అడగకపోతే తుంటర్వ్యూ పెరుగన్నం మానేసిన భోజనంలా ఉంది. పాటలు సేకరణ, నైమిశారణ్యం- పురాణ కాలక్షేపం అదీ సేకరణ, వంటలు హ హ ప్రత్యేకంగా చెప్పాల్సినది లేదు, పొద్దు గడి స్లిప్ప్లులు నాలుగు చెప్తే నలభై రౌడిగారే చెప్పేస్తారు. ఏ బ్లాగు సొంతంగానో.... కెలకలేదుమరి .. ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ నా సొంతం అని భ్రమ వద్దు అని సొంతంగానే సెలవిచ్చారు. జ్యోత... సారి సారి ప్రఖ్యాత బ్లాగరు. ఇందులో ఎంత హాస్యం, ఎంత వ్యంగ్యం ఉన్నా లేని ప్రాముఖ్యత ఆపాదించారు.
ReplyDeleteHmmm .. సేకరణలు మిస్స్ అయ్యామంటారా? సరే మరో సందర్భంలో అడుగుదాంలేండి. కావాలంటే పార్ట్ 2 పెట్టూకోవచ్చు :))
ReplyDeleteమార్తాండ సర్వర్ మార్చబడుతున్నది.
ReplyDeleteఇంతే సంగతులు. చిత్తగించవలయును.
Thankyou Bharadwaj,,
ReplyDeletereally i enjoyed this interview. Good songs.. Thank god u didnt try any crazy remix...
LOL...
ReplyDeleteమీ క్రియేటివిటీని క్రొత్త పుంతలు తొక్కించారు...
థాంక్స్ జ్యోతిగారు కెబ్లాసా అధ్యక్ష పదవి నాకు కట్టబెడతానన్నందుకు.
రౌడి గారు, ఇక మీకు తెలియనిది ఏముంది. మిమ్మల్ని నన్ను కేసుల్లో ఇరికించి కెబ్లాస అధ్యక్ష పదవి కొట్టేయడానికి శరత్ గారు గోతికాడ రెడీగా ఉన్నారు. మిమ్మల్ని తప్పించుకున్నా ఆయనను తప్పించుకోవడం అంత వీజీగా అయ్యేట్లు లేదు నాకు. ప్చ్...
@ మలక్..
ReplyDeleteఇన్నిరోజులు మీ బ్లాగును చూస్తే కలర్ ఫొటో చూసినట్లుండేది. కాని ఇప్పుడీ కొత్త టెంప్లెట్ చూస్తే నెగెటివ్ ను చూసినట్లుంది.
ఏటి మా కట్ట మైసమ్మ సెంటరు జ్యోతక్కేనా ఈ ఇంటర్వూ ఇచ్చింది. మలక్పేటరౌడీ .... ఈ ఇంటర్వ్యూ కోసం యెంత ముట్ట చెప్పావ్ జ్యోతక్కకి ?????? .. కె బ్లా స ఏకలింగానికి ఇవ్వడానికి ఆయనెంత ముట్ట చెప్పిండు. లెక్కల్ మొత్తం నా ముందు పెట్టుండ్రి లేకుంటే. దేత్తడి పోచమ్మ గుడి ..
ReplyDeleteఐనా నాకెందుకు లే లినక్ష్ లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కట్ అయితే నేను బిజినెస్ చేస్కుంట
కె బ్లా స లో ప్రస్తుతం అందరూ మగ మేల్సే వుండటం బావోలేదు. ఆడ లేడీస్ కూడా వుండాలి. ఆ మధ్య అమ్మ ఒడి బ్లాగుని నీహారిక కెలికారు - కలిపేసుకుందామా?
ReplyDeleteఅయ్యా ఏకలింగం గారూ,
అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాననే కదా అధ్యక్షుల వారు సిద్ధాంత కర్త పదవి నాకు విదిల్చారు. ప్రస్తుతానికి అది చాలు నాకు. అధ్యక్ష పదవికి ఎవరు కొట్టుకున్న ఫర్లేదు - నాకు ఎవరు (ముందుగా) పాదాభివందనం చేస్తారో వారికే నా సపోర్ట్.
శరత్ గారు ఓట్ వెయ్యబోయే ఆయన పేరు వసుదేవుడు కాదు కదా?
ReplyDeleteJus kiddin
@శరత్, మలక్,
ReplyDeleteమళ్లీ బ్లాగులన్నీ బోర్ కొడుతున్నయి. కెలెకడానికి కూడా ఎవరూ దొరకడం లేదు. అందుకే నా నెక్స్ట్ టపాలో మిమ్మల్నే కెలకాలని డిసైడ్‌జేసిన. wait for the weekend... :)
రౌడీ
ReplyDeleteదడిగాడు వానసి వేటువో! సరా! హమ్మా.
చక్కటి టెంప్లేట్ పెట్టారు - ఎవరికీ ఏమీ కనపడకుండా!
జ్యోతక్కతో నిజమయిన సమాధానాలు పెట్టి మంచి ఒరవడి సృష్టించారు - కెలకడంలో. వెరీ గుడ్డూనూ. పార్ట్ -2 రావాల్సిందే - సేకరణల పర్వంతో.
@ ఏకలింగం
మనలో మనం కెలికించుకుంటే బయటి వారికి పలుచనైపోమూ. సరే కానివ్వండి - మీకు అంతగా పొద్దు పోకపోతే ఏం చేస్తాం. ఎవరమో ఒకరం అందరి కాలక్షేపం కోసం త్యాగం చేయాలి కదా.
@ రౌడీ
ReplyDeleteజ్యోతక్కకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం మరిచారే! అహ ఏమీ లేదు అందరికీ వారు చెబుతుంటారు కదా అందుకనీ. వారికి అడ్వాన్సుడ్ గ్రీటింగ్స్ చెబితే ఓ పని అయిపోతుంది కదా అనీ.
@శరత్
ReplyDeleteహన్నన్న... ఎంతమాట, కెబ్లాస సిద్ధంతకర్తను పలచన చేసే మాటలు మట్లాడతామా చెప్పండి.
కొత్త సభ్యుడు, ప్రేతాత్మ (http://preathaathma.blogspot.com/)గారు మీ బ్లాగుకు దిష్టి తీస్తా అని తెగ ముచ్చటపడి పోతుండు ఆయన సరదాను ఎందుకు కాదనడమని.... అంతే.
nenu shootings valla busy ga vundadam to na blog lo e madya yemi rayaka povadam to keblasa ki chetininda pani dorakadam ledu twaralone aa lotu puriddamani alochana .antarcitica lo vedi vedi pakodilu cheyyinchukuni tine roju twaralone ravalani assistu
ReplyDeleteరవిగారూ,
ReplyDeleteమీకు పకోడీల్లేవ్.రవ్వలడ్లో సున్నుండలో అంతే!!