మలక్పేట్ రౌడీ:
'ప్రమాద'వనం లొకి తొంగి చూసే వీక్షకులందరికి నమస్కారం, మరీ అమేరికనైజ్డ్ అయిన వాళ్ళందరికి హెల్లోలు, 'యో' 'యో' లు. బ్లాగర్లలో మహా బ్లాగర్లు వేరయా (మహిళా బ్లాగర్లు కూడా వేరయా) అని ఎవరొ వెబ్బర్ అంటేను అలాంటి మహా బ్లాగర్లని , మహా వెబ్బర్లని గుర్తించదలచి మా 'ప్రమాద'వనం లొకి ఆహ్వానించి పిచ్చ'పార్టీ' జరిపించాలని నిర్ణయించాం.అందరికీ ఇక్కడ పెద్ద పీఠం వేస్తూ మా ఈ కుంపటి తొ వేడి చేసిన కుర్చీ పై కూర్చోబెట్టి నిప్పుల వేడి కన్నా వాడిగా ఉండే ప్రశ్నలతో విసిగిద్దామని డిసైడ్ చేసాం!
మన ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని హోస్టు చేసేది (అంటే "గెస్ట్ హోస్టెస్" అన్నమాట) కేరోలైనా కేకాక్షి గారు.
కేకాక్షి గారూ! నమస్కారం!! మీ పేరుకి అర్థం? మీ కళ్ళని చూసి జనాలు కేకలు పెట్టి పారిపోతారా? లేక, మీ కళ్ళే "కేకా"? లేక మీవి కేకి(నెమలి) కళ్ళా?
కేకాక్షి: నమస్తే రౌడీ గారూ. అది మీరే కనుక్కోండి.
మలక్పేట్ రౌడీ: హా! హా!! హా!!! సరే వదిలెయ్యండి. ఓవర్ టు యూ!"
కేకాక్షి: అందరికీ నమస్కారం. హాట్ సీట్ కోసం కరెంటుతొ కుర్చీని వేడి చేద్దామని నేనంటే ఈ రౌడీ గారే షాకు కొడుతుందని వద్దన్నారు. ఈ సారికి బొగ్గుల కుంపటి తొ కానిద్దాం మా హాట్ సీట్ ని...
మా ఈ కార్యక్రమం పేరు e-ష్టావధానం. 8 ప్రశ్నలు ఉంటాయి...
మా మొట్టమొదటి కాల్చే కార్యక్రమంలోకి 'పిట్స్ బర్గ్ పిచ్చమ్మ' గారిని ఆహ్వానిస్తున్నాం. ఈవిడ గురించి పరిచయం చేయటానికి ఏదైనా చెప్పాలనే ఉంది...కాని నాకు ఈవిడ ఒక ముదురు వెబ్బర్ అని మాత్రమే తెలుసు. మిగితావి ఆవిడనే అడుగుదాం!
కేకాక్షి: పిచ్చమ్మ గారూ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీరు ఏం పని చేస్తూంటారు?
పిచ్చమ్మ: మాది చాల పెద్ద కుటుంబంఅండీ. ఒక అమ్మ నాన్న మరి నేను. పెళ్ళయ్యాక మా ఆయన. ఎవరూ పెద్దగా అయినా చిన్నగా అయినా ఏమీ పని చెయరు. తిని కోర్చుని బోర్ గా అనిపిస్తే టీవీ సీరియల్స్ లాంటివి చూస్తూంటాము.
కేకాక్షి: మీకు చాటింగ్ బ్లాగింగ్ ఎప్పటినుంది అలవాటు? అసలు బ్లాగింగ్ చెయ్యాలని ఎందుకు అనిపించింది?
పిచ్చమ్మ: మా వారు పేకాటకెళ్ళాక అలవాటుగా టీవీ చూద్దాం అని పెడితే తెలుగు ఏంకర్లు అందరూ ఇంగ్లీషులో మాట్లాడేవారే - కొన్నాళ్ళు డిక్షనరీ వాడాను గానీ కష్టంగా అనిపించి టైంపాస్ కోసం నెట్లో చాటింగ్ మొదలుపెట్టా. అక్కడ నా 'మనోభావాలు' మొహమాటం లేకుండా చెప్పటం వల్ల, కుళ్ళుతో యూజర్లు ఇగ్నోర్ చేసేవారు. ఎంత చెత్త వ్రాసినా ఒపిగ్గా చదివి శభాష్ అనేవాళ్ళు బ్లాగుల్లో ఉంటారని తెలిసి పరిగెత్తుకొచ్చేసా!
కేకాక్షి: యువతరానికి ఒక అనుభవమున్న అంతర్జాల సంచారిణిగా మీరిచ్చే సలహా?
పిచ్చమ్మ: నేను సలహాలు ఇచ్చేంత గొప్పదానిని కాను లెండి. కాని అనుభవం తో చెప్తున్నా - ప్రొపైల్ లో ఐశ్వర్యా రాయ్ ఫొటో పెట్టుకోండి - మీకు హిట్లే హిట్లు. అశ్లీలమైన ఫొటో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎవరన్నా ఏమన్నా అంటే ఎం ఎఫ్ హుస్సేన్ కళ్ళజోడు పెట్టుకుని చూడమని చెప్పండి.
మలక్పేట్ రౌడీ (కల్పించుకుంటూ)..... కాని ఆయన్ని విమర్శిస్తే కమ్యూనిష్టులు ఇతర ఉదారవాదులు గొడవ చెయ్యరూ? ఆయన వాళ్ళ దేముడు కదా?
పిచ్చమ్మ: నిజమేనండోయ్. సరే ఆయన విషయం వద్దు గాని ఈ పని చెయ్యండి. ఎవడో ఒక అనామక బూతులరాయుడితో గొడవ పెట్టుకోండి. వాడు కాస్తా మిమ్మల్ని తిట్టిపోస్తాడు. నేరం ఘోరం అంటూ గొడవ చెయ్యండి. స్నేహితులకి చూపించండి. అవసరమయితే బ్లాగు తీసెయ్యండి. మీ అభిమానులు నానా గొడవా చేసాక మళ్ళీ తెరవండి. మీకు హిట్లే హిట్లు. ఉచిత పబ్లిసిటీ. మీరు ఆడ బ్లాగర్ అయితే ఇంకా మంచిది. "అబలలపై అమానుషం" అని ఒక హెడ్ లైన్ కూడా పెట్టుకోవచ్చు!
మలక్పేట్ రౌడీ (మళ్ళీ కల్పించుకుంటూ)..... కాని బ్లాగ్ డిలీట్ చేస్తే మళ్ళీ అన్నీ వ్రాయాలి కదా?
పిచ్చమ్మ: బుఱ్ఱతక్కువ రౌడీ గారూ - డిలీట్ ఎవరు చెయ్యమన్నారు? పర్మిషన్ "సెలక్టెడ్ యూజర్స్" కి మాత్రమే ఇచ్చి ఆ లిస్టు ఖాళీగా ఉంచితే సరి. డేటా పోదు, బ్లాగు ఓపెన్ అవ్వదు. మీరు డిలీట్ చేశారని అందరూ అనుకుంటారు. ఇక సానుభూతే సానుభూతి !
మలక్పేట్ రౌడీ: ..... అమ్మో - పిచ్చమ్మ రాజకీయం !!!!! ఎప్పటిదో బాల్ ఠాకరే గారి రాజీనామా డ్రామా గుర్తొస్తోంది.
పిచ్చమ్మ: నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా! తెలుగుపీపుల్ డాట్ కాం సైట్ లో ఎడ్మిన్ తో మీరు గొడవపడి "నేనింక ఇక్కడికి రాను" అని ప్రతిజ్ణ చేసినప్పుడు మీ స్నేహితులందరూ గొడవచేసి పంతం నెగ్గిచ్చుకోలేదా? అది రాజకీయమని మీరే ఒప్పుకున్నారుగా?
మలక్పేట్ రౌడీ: ష్ ష్ ష్
పిచ్చమ్మ: అదే మరి! చివరికి ఆ ఎడ్మిన్ మీ క్లోస్ ఫ్రెండ్ అని తెలిశాక మింగలేక కక్కలేక మిరు పడ్డ అవస్త చూస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. తెలియక చేసింది కాబట్టి వ్యక్తిగతంగా గొడవ జరగలేదు - అది వేరే సంగతి!
కేకాక్షి: సరే సరే! ... మీకు నచ్చిన బ్లాగు
పిచ్చమ్మ: నాదే. ఏది పడితే అది బరుక్కోవచ్చు. ఏవరైనా విమర్శిస్తే ఆ కామెంటు తీసెయ్యచ్చు. నా భజనపరుల చేత వారిని తిట్టించచ్చు. లేకపోతే నా పోస్టు నేనే తీసేసుకుని ఎవరో కుళ్ళుమోతు కొండముచ్చు నా పోస్టులు టెంప్లేటులు తీసేసాడని గొడవ చెయ్యచ్చు - ఇంకా చాలా చాలా ..
కేకాక్షి: ఎవరయినా మీ బ్లాగ్ కి వచ్చి మీ రచనలు చెత్త, కాపీ అంటే ఎలా రియాక్టౌతారు?
పిచ్చమ్మ: నేనేమీ రియాక్ట్ అవ్వనండీ. కానీ ఆ మాట అన్నవాడు బ్లాగ్లోకం లో మిగలడు
కేకాక్షి: మీ ఆయన మరో మగవాడిని ఇంటికి తీసుకొచ్చి ప్రేమిస్తున్నాను అంటే మీరేమంటారు?
పిచ్చమ్మ: ఏమంటాను? ఏమీ అనను - పాత మనోజ్ కుమార్ పాట ఒకటి ప్లే చేస్తాను -
"బస్ యహీ అప్రాధ్ మై( హర్ బార్ కర్తా హూ (
ఆద్మీ హు ( ఆద్మీ సే ప్యార్ కర్తా హూ ("
కేకాక్షి: ఇప్పుడు ఇంటర్వ్యూ లో ట్విస్ట్. మిగతా రెండు ప్రశ్నలూ రౌడీ గారికి!
మలక్పేట్ రౌడీ: ఇది అన్యాయం అక్రమం. నా బ్లాగు మూసేస్తా. నా టెంప్లేట్ మీరే మార్చారని గొడవ చేస్తా!
కేకాక్షి: ఆ పప్పులేం ఉడకవుగానీ ... శ్రద్ధగా వినండి
మలక్పేట్ రౌడీ: హతోస్మి!
కేకాక్షి: ఇదొక సమస్యాపూరణం
మలక్పేట్ రౌడీ: అమ్మో నా వల్ల కాదు!
కేకాక్షి: మరి మీ అమ్మగారు భోజరాజీయం లో పీ హెచ్ డీ, గోల్డ్ మెడల్ అని తెలుగుపీపుల్ డాట్ కాం లో మీరే గొప్పగా చెప్పుకున్నారుగా?
మలక్పేట్ రౌడీ: "పండితపుత్ర" సామెత వినలేదా? ఇప్పటికీ మా అమ్మ అంటుంది "ఒరేయ్! నువ్వు నన్ను పండితురాలిని చేశావురా!" అని ..
కేకాక్షి: (స్వగతం): కుళ్ళిందిలే - జోకు!
మలక్పేట్ రౌడీ: ఏమిటీ సణుక్కొంటున్నారు?
కేకాక్షి: అబ్బే ఏమీ లేదు - జోకు పేలింది అనుకుంటున్నా - అంతే! అంతే!!
సరే సమస్యకొద్దాం - మీకు నాలుగవ పాదం ఇస్తున్నా. పద్యం ఛందోబధ్ధంగా ఉండనక్కరలేదు - వినండి ..
"రవిగారి కరమున జ్యోతి భగభగ మండెన్"
మలక్పేట్ రౌడీ: ఏంటండోయ్ - ఈ బ్లాగులసీమ ఫేక్షన్ / ముఠా తగాదాల్లో నన్ను ఇరికిస్తున్నారా? నేనొప్పుకోను!
కేకాక్షి: అబ్బే! లేదు లేదు ... తెలుగు బ్లాగులతో సంబంధం లేకుండా చెప్పాలి!
మలక్పేట్ రౌడీ: అయితే ఓకే!! వినండి!!!
"అరవిందుడు వెలిగించిన దీపంబును
వచ్చి గాలి కదిలింపంగా
పడిపోయెను వత్తి భా
రవిగారి కరమున జ్యోతి భగభగ మండెన్"
(అల్లు అరవింద్ ఏదో సభలో దీపం వెలిగిస్తే అది గాలివాటుకు ప్రక్కనే ఉన్న భాస్కరభట్ల రవికుమార్ (భారవి) గారి చేతిలో పడింది అని భావము)
కేకాక్షి: ఈ బ్లాగవతం మీద ఒక పేరడీ ప్లీజ్!
మలక్పేట్ రౌడీ: (టక్కరి దొంగ - "నలుగురికి నచ్చినది" పాటకి అనుగుణం గా)
నలుగురికి నచ్చిన బ్లాగ్ నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ చూడని బ్లాగ్ - ఆ బ్లాగ్నే నే వ్రాసెదరో
చదవవా దాన్నోరన్నో - అది నీ దురద్రుష్టం
చెత్తని నువ్వనుకున్నా - నా బ్లాగది నా ఇష్టం!!
బ్లాగర్లందరూ ఒకవైపూ రౌడీ ఒకవైపూ
మీరు అందరూ ఒక టైపూ - నేనింకొక టైపు!!
--------------------
నీ బ్లాగులో నువ్వు వ్రాయటం నథింగ్ స్పెషల్
అందరి బ్లాగులూ కెలికి రావడం సంథింగ్ స్పెషల్ ...
నువ్వు ఎవరికో మెయిలు ఇవ్వడం నథింగ్ స్పెషల్
అందరి మెయిల్సూ నువ్వు చదవడం సంథింగ్ స్పెషల్ ...
కాగడాని చూసి బ్లాగు ముయ్యటం నథింగ్ స్పెషల్
కాగడాని చూసి బ్లాగు ముయ్యటం నథింగ్ స్పెషల్
నిన్ను చూసి తను డోక్కోవడం సంథింగ్ స్పెషల్!!!!!!!!! ...
నలుగురికి నచ్చిన బ్లాగ్ నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ చూడని బ్లాగ్ - ఆ బ్లాగ్నే నే వ్రాసెదరో
మలక్పేట్ రౌడీ మరియు కేకాక్షి: పిచ్చమ్మ గారూ - ఇంక మీ కుర్చీ కింద పెట్టిన కుంపట్లో బొగ్గులు చల్లబడ్డాయి. ఈ హాట్ సీట్ కూల్ గా మారకముందే మనమీ కార్యక్రమం ముగిద్దాం. మీ అమూల్యమైన బ్లాగ్ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు!
పిచ్చమ్మ: నాకిలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలండీ!
మలక్పేట్ రౌడీ మరియు కేకాక్షి:
శ్రోతల్లారా, పాఠకులారా, దిగాలు పడ్డ బ్లాగరులారా
పదండి ముందుకు పదండి త్రోసుకు
పోదాం పోదాం తరువాయి ఇంటర్వ్యూకి
కానీ ఆగాలి అందరం వచ్చేవారం దాకా!
:))
ReplyDeleteబావుంది మీ వ్యంగ్యం. ఆశు కవిత్వం కూడా చెప్పేస్తున్నారు!
థాంక్స్ అండీ - ఇప్పుడు నన్ను ఎంతమంది తన్నడానికొస్తారో చూడాలి :))
ReplyDeleteమంచి ప్రయత్నం.
ReplyDeleteమంచి టాలెంట్ఉంది మీలో. హాస్య/వ్యంగ్యాలను మోతాదు మించనీయకండి. తొందర్లోనే బ్లాగులోకంలో ఓ సెలెబ్రిటీనో లెజెండో అవుతారు :)
ReplyDeletePls remove word verification.
Mahesh garu and Jeedipappu garu .. thanx ... actually a friend of mine helped me draft this and another friend suggested the title. So I cant take the complete credit/brickbats for this.
ReplyDeletemeerudu pedda goppga hero ani anukottanara merru real rowdy laga oonaru
ReplyDeleteyanduju avida anti meeku anta ANGRY
ReplyDelete:)) "aavida" antey evaru ikkada? picchamma naa leka kekakshi naa?
ReplyDeleteసహాయపడిన మిత్రుల పేర్లు కూ'డా రాస్తే బాగుండేది. అరవిందుడు... పద్యం బాగుంది.
ReplyDeleteసహాయపడినవాళ్ళిద్దరూ ఆడవాళ్ళేనండీ (కానీ ఇక్కడ ఎవరికీ తెలియని వాళ్ళు) - పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు.
ReplyDeletepichamma
ReplyDeletepicchamma meeda kopam ekkada choopinchaanu? In fact we tried to make her known!
ReplyDeleteఇప్పుడే ఏమైంది? అయిదు రకాల గ్రూపుల్ని కెలికాను - నా మీద ప్రతీకార సటైర్లు వచ్చాక ఉంటుంది జనాలకి టైంపాస్ :))
ReplyDeleteమలక్ కేక, పిచ్చ కేక మీ కున్న సెన్స్ అఫ్ హుమౌర్ వున్నా బ్లాగర్స్ అంతా ఇది ఎంజాయ్ చేస్తారు. మీరు బ్లాగ్ లోకం లో త్వరలోనే సునామీ సృష్టించ బోతున్నారు . ఎంతైనా నా హస్త వాసి మంచిది. ఇలాగె నవ్వించ గలరు. ఇంతకీ నా templete మార్చడం వెనక మీ విదేశీ హస్తం లేదు కదా?
ReplyDeleteమలక్ పేట రౌడి,బాగుంది నీ వాడి
ReplyDeleteకొనసాగించు ఈ వేడి,నాకు నువ్వూ ఒక జోడీ
కొనసాగించు నీ పేరడీ,ఏ మాత్రం ఉడుక్కోడు ఈ కాగడీ ( ప్రాస కోసం అలా రాసా)
@ఎవడో ఒక అనామక బూతులరాయుడితో గొడవ పెట్టుకోండి. వాడు కాస్తా మిమ్మల్ని తిట్టిపోస్తాడు. నేరం ఘోరం అంటూ గొడవ చెయ్యండి. స్నేహితులకి చూపించండి. అవసరమయితే బ్లాగు తీసెయ్యండి. మీ అభిమానులు నానా గొడవా చేసాక మళ్ళీ తెరవండి. మీకు హిట్లే హిట్లు. ఉచిత పబ్లిసిటీ. మీరు ఆడ బ్లాగర్ అయితే ఇంకా మంచిది. "అబలలపై అమానుషం" అని ఒక హెడ్ లైన్ కూడా పెట్టుకోవచ్చు!
@కాగడాని చూసి బ్లాగు ముయ్యటం నథింగ్ స్పెషల్
నిన్ను చూసి తను డోక్కోవడం సంథింగ్ స్పెషల్!!!!!!!!! ...
హ! హ! హ!!! నవ్వ లేక చస్తున్నా నీ జోకులకి
వెల్ డన్... ఛీర్స్... కంటిన్యూ...
నినువీడని నీడను నేనే అని ఈ కాగడా ప్రతి సైట్ లో నే కామెంట్ రాసిన రెండు మూడు నిమిషాలకే తన కామెంట్ రాసి నాకే అనుమానం తెప్పిస్తున్నాడు ఈ కాగడా ఎవరన్నా నా పక్కనే వున్నాడా అని?కాస్త మీ అనుభవం తో ఈ కాగడా వేడి సెగలు నాకెంత దూరం లో వున్నాయో చూసి చెప్పకూడదు?
ReplyDeleteమునుపెన్నడూ చూడని వైవిధ్యభరితమైన వ్యంగ్యాస్త్రాలు వదుల్తున్నారు హహ ... త్వరలోన్బే బ్లాగ్లోకం లో మంచి సెలిబ్రిటి అవతారని ఆశిస్తున్న
ReplyDeleteనమస్తే రవి గారు గుర్తు పట్టారా నన్ను
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThx guys,
ReplyDeleteకాగడా! చిన్న రిక్వెస్టు - నీ ముందు మేసేజ్ తీసేసి చివరి లైన్ డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్ చెయ్యవా?
No libelous statements here ...
నీ అంతట నువ్వే తీసేస్తే ఇద్దరికీ బాగుంటుందని!
Just a request dude!
మీ పోస్ట్లులు, శైలి నాకు తెలుగుపీపుల్.కాం లో పరిచితం. నేను అప్పటిలో మీ అభిమానిని. :) బ్లాగ్లోకానికి స్వాగతం. మోతాదు మించని వ్యంగ్యం ఆమోదయోగ్యమే కాదు ఆరోగ్యకరం కూడా.
ReplyDeleteThx and Namaste - Aruna gaaru - meeru meerena? Ikkada kooda unnara? Great!
ReplyDeleteStill into Puzzles?
Malakpet Rowdy,
ReplyDeleteAsombroso senor!!
:)
Yogi,
ReplyDeleteMucho Gracias
Kagada,
ReplyDeleteYou didnt respond to my request. I'm sorry but I am editing your previous message and posting it again here ...
(Removed the last 3 words)
రవి గారు,
మన అనుబంధం ఈ నాటిదా
నీలో వేడి నేను, నాలో వాడి నీవు
అమ్మో, ఎక్కువగా నిజాలు జనాలకి చెప్పెత్తన్నాం??
రవి గారెవరో నాకు తెలీదు, నేనెవరో రవిగారికీ తెలీదు
నిజ్జం...
You may not like it but I am forced do it.
ya srinivas from onglole we had g8 fun during those rediff chaters meet thx to malak for that cohersive bonding.
ReplyDeleteఇందుగలరు అందు లేరని సందేహము వలదు రెడిఫ్ పాట చాటర్స్ ఎందెందు వెదికిన అందందే కలరు
ReplyDeleteరౌడీ తమ్ముడూ..నువ్వెవరిని విమర్శించావన్న విషయంతో నాకు పట్టింపు లేదు కానీ,నీ చాతుర్యం మాత్రం అమోఘం.నీకు,నీమిత్రులకూ కూడా అభినందనలు...
ReplyDeleteనాలో వేడి, నీలో వాడి....ఏమిటి రవి గారికీ, నీకూ "మధ్య" ఉన్న బంధం? సరే, మీ అనుబంధం ఇలా"గే" కొనసాగాలని కోరుకుంటున్నా!
ReplyDeleteరౌడీ గారూ :-)
ReplyDeleteఏదో ఒక రోజు బ్లాగుల్లోకి వస్తారనుకున్నా గానీ ఇలా ఝలక్ ఇస్తారనుకోలేదు!
మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కేక పెట్టించేలా ఉంది రౌడీ గారు!
ReplyDeleteబాబు అజ్ఞాత r అజ్ఞాతి నా మానాన్న నేను బ్లాగ్ లో పోస్ట్ రాసినా కేలుకుతారు ఏదో బూతు అంట గడతారు, పోనీ ఇలా వచ్చి ఇక్కడ కామెంట్ రాసుకుని మూసుకున్న వేరే వాళ్ళు కామెంట్ చేసినా కెలికి 'గ ' గుణింతం వల్లించుట తగునా?అసలే రౌడీ గారి కుంపటి సెగలకి కాల్తాన్డి ఇక్కడ .కాగడా మద్య నామద్య వున్న భంధం , మన ఇద్దరి మద్య వున్న భంధం కూడా ఒకటే బ్లాగ్భంధమే కాని ఇంక ఏ అక్రమ సంభందముkaadani gamanincha ప్రార్ధన .
ReplyDeleteమొదటి మూడొంతులు అదిరింది. చివరి పాతిక భాగం సోసో.. అప్పటికి నిప్పులు చల్లారి పోవటం కారణమేమో. మొత్తానికి ఓ విభిన్న యత్నం. బాగుంది.
ReplyDeleteSrinivas Pappu garu, Nishi ji, Sujata garu and Abracadabra garu,
ReplyDeleteThanx.
amdari meeda raaLLesaanu - enni malli tirigi vastaayo ani bhayam ga umdi :))
మీరు నన్ను ఎవరనుకుంటున్నారో. నేను తెలుగుపీపుల్ లో పోస్టులు ఎప్పుడూ చెయ్యలేదు కానీ రెగ్యులర్ రీడర్ ని. అరుదు గా వ్యాఖ్యానం చేసేదాన్ని jyothirmai Gosukonda ID తో. అక్కడ జరిగిన కొన్ని వివాదాల్లో మీ వివరణలు చాలావరకు బాగున్నాయి అనిపించేది. అందునా పేరు కూడా భిన్నం గా వుండటం తో మీరు గుర్తుండిపోయారు. ఒక్కసారి ఇక్కడ ప్రత్యక్షం ఐతే కొంచం ఆశ్చర్యం గా ఇంకొంచం కుతూహలం గా వుంది.
ReplyDeleteOh Sorry. TP.com lo Aruna ani veroka reader naaku telusu. Meeru aavidemo anukunna. Newayz, Thank you very much.
ReplyDelete"మొదటి మూడొంతులు అదిరింది. చివరి పాతిక భాగం సోసో.."
ReplyDeleteగిల్లుడు మొదలయ్యిందన్న మాట. మలక్ పేట గారు ఇంక కొత్తపాళీ రావడమే ఆలష్యం అంతా కాలుష్యం
Rowdy,
ReplyDeleteThanks for altering my comment.I could n't do it myself due to pressure of work in house cleaning i.e blog cleaning.I am bringing a radical shift in my blog now,since my purpose is almost fulfilled.Every one will see a clean kagada from now on.
Thats great news man! As others have already mentioned - you have a great ability in narration. Cant wait to see a clean Kagada. I will be the first visitor!
ReplyDeleteAnd yeah, whats your email id? (Its okay even if its fake)
Actually I thought you were losing the plot because of the language you were using. Your lingo gave a chance to some people to ignore the actual issues you have raised but concentrate on your language.
@శర్మ,
ReplyDeleteకాగడాలో రాడికల్ షిఫ్ట్ తేబోతున్నందుకు, క్లీ్న్ గా ఉంచబోతున్నందుకు మీకు అభినందనలు.
iragoooo iraga. please dont treat my comment as one of those comments you described in your post. post was really cool and decent.
ReplyDeleteit is nice to read
ReplyDeleteit is nice to read
ReplyDeleteit is nice to read
ReplyDeleteMalakpet rowdy
ReplyDeletevariety comedy
sunisita vaakyala vedi
vyangalato dhee!
repavu komdarilo alajadi
pattavu pathakula naadi
"bloglarla"tho tiragali sudi
undochhu edurudadi
unchali manasunu ready
Malakpet rowdy
ReplyDeletevariety comedy
sunisita vaakyala vedi
vyangalato dhee!
repavu komdarilo alajadi
pattavu pathakula naadi
"bloglarla"tho tiragali sudi
undochhu edurudadi
unchali manasunu ready