Feb 26, 2009

నాలుగవ నెంబరు ప్రమాద 'రహిత' సూచిక - సహాయ ఫౌండేషన్

వీక్షకులకు మళ్ళీ నమస్కారం. క్రిందటి మూడు తుంటర్వ్యూలలో మేము వేసిన
రాళ్ళు చూసీ చూసీ విసుగు మొదలయ్యిందని ఒక బ్లాగర్ చెప్పకనే చెప్పారు
పోయిన వారం కామెంట్లలో. అదీకాక ఈవారం బ్లాగుల్లో కాస్త ప్రశాంతంగా ఉంది.
కనుక మా కెలుకుడు కార్యక్రమాన్ని వచ్చేవారానికో లేక ఆ పైవారాలకో (మన
రెండు గాంగుల స్పందనని బట్టి) వాయిదావేస్తున్నాం. పై బ్లాగరు తో
చెప్పినట్టుగానే కాస్తంత అర్ధవంతమైన ఇంటర్వ్యూ ప్రెజెంట్ చేసే ప్రయత్నమే
ఇది.

ముందుగా కొంచం ఫ్లాష్ బ్యాక్ (అదేనండీ మొహం మీద చక్రాలన్నమాట):

రీడిఫ్ చాట్ హైదరబాద్ రూం ఈ దశాబ్ది మొదట్లో కళకళలాడుతుందేది జనాలతొ.
అందులో ఒక డజను మందికి ఉన్నట్టుండి కలవాలనే బుద్ధి పుట్టింది. తీరా
కలిశాక మీటింగ్ & ఈటింగ్ బదులు కాస్తంత ప్రయోజనకరమైన పనులు చెయ్యచ్చు కదా
అనే బుధ్ధి పుట్టింది. వెంటనే షిఫ్ట్ (సర్వీస్ ఎండ్ హెల్ప్ ఇన్ ఫ్రీ టైం)
అనే గ్రూపు ఏర్పడడం, "మోహన్ ఫౌండేషన్" వారితో మాట్లాడటం, అవయవ దానం పై
అవగాన పెంచే కార్యక్రమాలు నిర్వహించడం వెంటవెంటనే జరిగిపోయాయి. అలాగే ఇతర
సంస్థలకు "మనిషి సాయం" అందించే సంస్థగా కూడా షిఫ్ట్ రూపుదిద్దుకుంది.
రక్తదాన శిబిరాలు, ఆడపిల్లల చదువులకు సహాయం, బీద రోగులకు సహాయం గట్రా
గట్రా జరిగాయి.

కానీ ఎంతయినా ఆంధ్రులం కదండీ? ఎక్కడికిపోతుంది ఆరంభ శూరత్వం?
ఉన్నట్టుండి చాలామంది అందుబాటులో లేకుండాపోవడంతో చాలా కార్యక్రమాలకి
పురిట్లోనే సంధి కొట్టింది. "మా తాతలు నేతులు తాగారు" అన్నరీతిలో
గొప్పలు చెప్పుకోవడం తప్ప గడచిన సంవత్సరంలో ఈ సంస్థ చేసింది శూన్యం.

ఈ సుత్తంతా ఎందుకంటే బ్యాంకులో చిన్న మొత్తంలో డబ్బు ఉండీ కూడా ( దాదాపు
35 వేల రూపాయలు) మనుషులు లేక సొమ్మసిల్లిన సంస్థ మా షిఫ్ట్. అంతకుముందే
తెలిసినా, మనుషుల విలువ నిజంగా ఏమిటో అప్పుడు మాకు తెలిసొచ్చింది -
ఎవరినడిగినా వందో వెయ్యో డొనేషన్ ఇచ్చేవాళ్ళు తప్ప వచ్చి పనిచేసేవాళ్ళు
దొరకలేదు. మాలో కొంతమంది సభ్యులు టీ మేడ్ (TMAD), తెలుగు ఫౌండేషన్ లాంటి
గ్రూపులలో చేరిపోయారు.

ఇదే సమయంలో షిఫ్ట్ సభ్యుడయిన శ్రీనివాస్ ("ఛీ! వీళ్ళింతే" అనుకున్నాడో
ఏమో) "సహాయ ఫౌండేషన్ అనే సంస్థని స్థాపించడం, వెనువెంటనే దానికి
ప్రపంచం నలుమూలలనుండి స్పందన లభించడం జరిగిపోయాయి. ఈ ఫౌండేషన్ గురించి
శ్రీనివాస్ నోటినుండే విందాం. (క్రిందటి రవిగారి ఇంటర్వ్యూ లాగానే ఈసారి
కూడా యహూ మేసెంజర్, జీ మెయిల్, స్కైప్, సైట్ స్పీడ్ ద్వారా చర్చ జరిగింది
- (అన్నట్టు స్కైప్ కన్నా సైట్ స్పీడ్ బాగుందండోయ్ .. ఒక సారి వాడి చూడండి)





నమస్తే శ్రీనివాస్!
శ్రీనివాస్: నమస్తే అన్నయ్యా!
మలక్పేట్ రౌడీ: వెయ్యాల్సిన సుత్తంతా ముందే వేసేశాం కాబట్టి ప్రోగ్రేం
లోకి జంప్ అయిపోదాం!

1. నీ గురించి కాస్త సెల్ఫ్ డబ్బా

శ్రీనివాస్: నా పేరు శ్రీనివాస్ .. సహాయ ఫౌండేషన్ ఫౌండర్ మరియు
ప్రెసిడెంట్ .... నేను వ్యాపారవేత్తను .. ....మా ఊరు ఒంగోలు

Sahaaya Blog: http://sahaayafoundation412.blogspot.com/

Sahaaya Website: http://sahaayafoundation.co.cc/



2. "సహాయా" ఏమిటి? ఏం చేస్తుంది??


శ్రీనివాస్: ఈ వీడియో మా గురించి క్లుప్తంగా చెప్తుంది









అనాధలకు వృద్దాశ్రామలలోని వృద్దులకు సహాయం చెయ్యాలనే ఉద్దేశం తో సహాయ
ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. మొదటి సంవత్సరం సహాయ మెంబర్స్ అనేక
అన్నదా శరణాలయాలు మరియు వృద్దుల శరణాలయాలు సందర్శించి వారి కనీస
అవసరాలు తీర్చడం జరిగింది తర్వాత మరుగున పడి ఉన్న అనేక శరణాలయాలు వెలుగు
లోకి తెచ్చి వాటికి అన్నిటికి సహాయ సహకారాలు అందించడం సహాయ ఫౌండేషన్ కి
కాస్త సాధ్యం గా భావించి అనేక కార్పోరేట్ కంపెనీల ను సందర్శించి
ఒక్కొక కంపెని నుండి ఒక్కొక శరనాలయమునకు దీర్ఘ కాల సహాయ సహకారాలు
అందేలా చూడడం లో సహాయ ఫౌండేషన్ చాల వరకు విజయం సాధించింది అదే
మాదిరిగా వికలాంగులు అంధులు వారి చదువు కి కావాల్సిన అన్ని రకాల సహాయ
సహకారాలు అందించడం --- అంటే అంధులకు వారి పాఠ్యమ్సాలు రికార్డు
చెయ్యడం ... వారికీ దగ్గరుండి వారు చెప్తుంటే వారి పరీక్ష లు రాసి
పెట్టడం వంటి కార్యక్రమాలు సహాయ ఫౌండేషన్ చేస్తుంది అదే మాదిరిగా సమాజం
లో సేవ చెయ్యాలని చాల మందికి ఉంటుందిఅలా చెయ్యాలనే వారికీ సమాజం లో
సరైన అవసరం ఎక్కడ ఉంది అని తెలియజేసే బాద్యత కూడా సహాయ ఫౌండేషన్
తీస్కుంది
అత్యవసర సమయాలలోనూ సమస్యాత్మక మైన హృదయ సంబంద శస్త్ర చికిత్సల సమయాలలోనూ
(ముఖ్యం గా ఏడాది లోపు చిన్నారులకు) తాజా రక్తం అనగా అప్పటికప్పుడు తాజా
గా దాత నుండి తీస్కున్న రక్తం అవసరం అవుతుంది .. ఆ సమయాలలో ఏ బ్లడ్ బాంక్
కాని ఏ వైద్యుడు కాని ఏం చేయలేని పరిస్థితి .. ఈ పరిస్థితి ని ఈ సమస్య ని
అధిగమించి అత్యవసర సమయాలలో రక్తం అందచేయాలనే ఉద్దేశం తో సహాయ ఫౌండేషన్
బ్లడ్ ఇన్ ఎమర్జెన్సీ అనే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ కార్యక్రమం లో భాగం గా రక్త దానం చేసే మంచి మనసున్న దాతల వివరాలు
తీస్కుని అత్యవసర సమయాలలో ఆ దాత ని దగ్గరుండి పేషెంట్ దగరకు తీసుకెళ్ళి
రక్తాన్ని పూర్తీ ఉచితంగా దానం చేసే లా చూడడం గత సంవత్సర కాలం గా ఎన్నో
వ్యయ ప్రయాసల కోర్చి సహాయ ఫౌండేషన్ మెంబర్స్ బ్లడ్ ఇన్ ఎమర్జెన్సీ ని
నిర్వహిస్తూ వస్తున్నారు

3. మిగతావారు ఎలా సహాయపడవచ్చు ?

మిగతా వారు సాయం చెయ్యాలంటే సహాయ ఫౌండేషన్ ని సంప్రదిస్తే వారికి ఆ సమయం
లో సహాయ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు గురించి తెలియ జేయడం
జరుగుతుంది అవసరం లో ఉన్న అనాధలకు ఆర్తులకు దాతల సహాయం నేరుగా అందేలాగా
సహాయ ఫౌండేషన్ చూస్తుంద.మనసున దాతలు స్వయం గా వారి బ్లడ్ గ్రూప్ వివరాలు
సహాయ కి మెయిల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను

4. మీకు ఇచ్చిన విరాళం గంగపాలు కదన్న గేరంటీ ఏమిటి?

సహాయ ఫౌండేషన్ విరాళాల కోసం ఎప్పుడు చూడలేదు సహాయ కి కావాల్సింది
వ్యక్తుల మద్దతు . సహాయ ఫౌండేషన్ ద్వారా అవసరం లో ఉన్న వారికి దాతల
ద్వారా సహాయం నేరుగా అందితే చాలు .

మనసులో మాట బ్లాగర్ సుజాత గారు సంప్రదించి నప్పుడు నేను ఇదే మాట వారికీ
ఇదేమాట చెప్పాను ధన వస్తు సహాయలకన్న వాలంటరీ వర్క్ చేసేవారు కావాలి .. ధన
సహాయం కన్నా కూడా మీ సాహాయం నేరుగా వారికీ చేరాలా చూస్తుంది సహాయ
ఫౌండేషన్
అంతే కాకా ఇతర దేశాల్లోని వారు విరాళం మాత్రమే ఇవ్వగల వారు సహాయ
ఫౌండేషన్ ఈ రెండు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు చూసినట్లయితే
వారికి మరో గారంటీ అవసరం లేదు ... అందులోను సహాయ ఫౌండేషన్
రిజిస్ట్రేషన్ ఐన సంస్థ ఇందులో ఉన్న కమిటీ సభ్యులందరూ బందువులు
కారు సమాజం లోని వివిధ వర్గాలైన విద్యార్ధులు వ్యాపారులు ఉద్యోగులు
మరియు రీసెర్చ్ స్కాలర్స్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. గంగపాలయ్యే
అవకాశమే లేదు

5. ఈ మధ్య నిర్వహించిన మేగా హిట్ ఈవెంట్ గురించి ...

We conducted an event with visually challenged but extremely talented musicians at Hyderabad. The event was a grand success. Here are a few videos pertaining to that



















మలక్పేట్ రౌడీ: Thank you Sreenivas and Thank you all.

7 comments:

  1. చక్కటి విషయాన్ని చెప్పారు.

    ReplyDelete
  2. Nice.
    I will pass this info to my friends. So that they can make use and give help to SAHAYA.

    ReplyDelete
  3. శ్రీనివాస్ గారు,
    మీ కార్యక్రమాలకు ధనసహాయమే కాక, మనుషుల సహాయం అవసరమైనపుడు కూడా నాకు తెలియపరచవచ్చు. కొంత సమయం మీ కార్యక్రమాలకు కేటాయించడానికి కూడా సిద్ధం!

    ReplyDelete