Feb 16, 2009

రెండవ నంబరు ప్రమాద సూచిక - చెంఘీజ్ ఖాన్ చెంగాయిజం

మలక్పేట్ రౌడీ: మా ప్రమాదవనం లోకి మళ్ళీ తొంగి చూస్తున్న వీక్షకులందరికీ నమస్సులు. పోయిన వారం ఇంటర్వ్యూ సందర్భంగా పూలూ, రాళ్ళూ జల్లిన, జల్లుతున్న, జల్లబోతున్న, జల్లే ఉద్దేశ్యం లేని వాళ్ళందరికీ కృతజ్ఞతలు.

ఈ వారం మన గెస్ట్ హోస్ట్ - ఆరిజోనా అక్కుపక్షి గారు. నమస్తే అక్కుపక్షి గారూ! అలవాట్లో పొరపాటుగా అడిగే ప్రశ్న - మీకీపేరు ఎలా వచ్చిందో కాస్త చెప్తారా? మీ వాళ్ళు పెట్టిందా లేక మీరు పుట్టించుకున్నదా?

అక్కుపక్షి: నమస్తే రౌడి గారూ! మా నాన్నగారు అక్కినేని అభిమాని లేండి. ఆయనో బర్డ్ వాచర్ కూడా. సో అదీ ఇదీ కలిపి అక్కుపక్షి అని పేరు పెట్టారు.

మలక్పేట్ రౌడీ: ఏమిటండీ కొంచం కోపంగా ఉన్నట్టునారు? ఎవరిమీద?

అక్కుపక్షి: మీమీదే!!

మలక్పేట్ రౌడీ: అయ్యో! ఎందుకండీ?

అక్కుపక్షి: నాకన్నా ముందు ఆ పిట్సుబర్గు పిచ్చమ్మని పిలుస్తారా!

మలక్పేట్ రౌడీ: మీరిద్దరూ మాంచి ఫ్రెండ్సే కదా?

అక్కుపక్షి: అది ఒకప్పుడు. మొన్న సూపర్ బౌల్ జరిగినప్పటినించీ విడిపోయాం. అదికూడా ఆ పిట్స్ బర్గ్ స్టీలర్స్ కేవలం ముప్పై అయిదు సెకండ్లు మిగిలి ఉండగా టచ్ డవున్ చెయ్యడం చాలా బాధగా ఉంది.

మలక్పేట్ రౌడీ: ఓటమి గెలుపులు మన బ్లాగు గొడవల్లానే దైవాధీనములండీ! కాస్త కోపం తగ్గించుకుని ప్రోగ్రేం మొదలుపెడతారా?

అక్కుపక్షి: సరే! సరే!! ఇవాళ నాతోపాటు వచ్చిన రెండవ ఘోస్టు - అదేనండీ గెస్ట్ హోస్ట్, మన రెండో అతిధి "దయ్యాల ప్లీడరు" గారు

మలక్పేట్ రౌడీ: దయ్యాల ప్లీడరా?

అక్కుపక్షి: అంటే డెవిల్స్ ఎడ్వోకేట్. మన ప్రోగ్రేంలో అంశాలకి రంధ్రాన్వేషణ చేస్తారన్నమాట! నమస్తే దయ్యాల ప్లీడరుగారూ!

దయ్యాలప్లీడరు: నమస్తే!

అక్కుపక్షి: ఇక మన ముఖ్య అతిధి చెంగోద్దండుడు శ్రీ శ్రీ శ్రీ చెంగల్పట్టు చెంఘిజ్ ఖాన్ గారు. నమస్కారమండీ! ఇదిగో మీ హాట్ సీట్!

చెంఘిజ్ ఖాన్: నమస్కారం. ఏంటీ? హాట్ సీట్ అంటే కుంపటా?

అక్కుపక్షి: పోయినసారి కుర్చీ క్రింద కుంపటి పెడితే బొగ్గులు చల్లబడిపోయాయని ఈసారి తిన్నగా కుంపటిమీదే కూర్చోబెట్టే ఏర్పాటుచేశాం. కష్టమా?

చెంఘిజ్ ఖాన్: (స్వగతం: అబ్బే! హంసతూలికాతల్పమంత సుఖంగా ఉంటుందేం? బుద్ధుండాలి అడగడానికి!) ఫరవాలేదు లేండి. నేను 'చెంగయోగ' సాధకుడిని. కూర్చోగలను.

అక్కుపక్షి: మీ గురించి ఇక్కడెవ్వరికీ తెలియదు - కాస్త సెల్ఫ్ డబ్బా కొట్టుకోండీ ప్లీస్!

చెంఘిజ్ ఖాన్: నా గురించి క్లుప్తంగా చెప్పాలంటే - చెంగల్పట్టు ఆశ్రమ ప్రతినిధిని, రెవరెండ్ జాన్ చెంగలరావు, చెంగేశ్వర స్వామీజీ, చెంగాయ్ ల్లామా, ఈమాం చెంగుల్లా ల శిష్యుడిని. మా చెంగలసంఘం వారు మూడేళ్ళక్రితం నా చెంగలకి మెచ్చి "చెంగ్ కమేండ్.మెంట్స్" ఉపదేశించి "చెంగోద్దండ" బిరుదు ప్రదానం చేశారు.

అక్కుపక్షి: భేష్! ఇక మీ ఉపన్యాసం మొదలెడతారా?

చెంఘిజ్ ఖాన్: తప్పకుండా! అందరికీ మళ్ళీ నమస్కారం. ఈ ఉపన్యాసంలో ముందుగా మనం "చెంగ" అంటే ఏమిటో నేర్చుకుందాం. తరవాత చెంగలలో రకాలను, వాటి విశిష్టతలను తెలుసుకుందాం!

తమ పనులు మానుకుని ప్రక్కవారి పనులు చేసిపెట్టడాన్ని "చెంగ" అని నిర్వచిస్తాం. ఈ చెంగ చేసిన వాడికి లాభమేమి ఉండదు - చేయించుకున్నవాడికి కూడా పెద్దగా లాభం ఉండదు.

ఉదాహరణకి - మీరు ఆవురావురుమంటూ కాలేజిలో కేంటీన్ కి వెళ్తుంటారు. ఈ లోగా ఎవరో అమ్మయి ఎదురుపడి "నాకు అర్జెంటు పనుంది. ఈ పుస్తకాలు లైబ్రరీలో ఇచ్చెయ్యరూ, ప్లీస్?" అంటుంది. వెంటనే మీరు అక్కడికి వెళ్ళి అరగంట క్యూ లో నిలబడి, మీ డబ్బులతో ఫైన్ కూడా కట్టి కేంటిన్ కి తిరిగొచ్చేటప్పటికి, ఆమె తన బాయ్ ఫ్రెండ్ తొ కాఫీ తాగుతూ "థేంక్యూ అన్నయ్యా!" అంటుంది. దీనివల్ల మీకొరిగినదేమీ లేదు, ఆ అమ్మాయికి పెద్దగా లాభమేమీ లేదు, మీ సమయం మాత్రం వృధా. ఇది చెంగలలో అతి సాధారణ చెంగ.

మరొక ఉదాహరణ - ఆయనెవరో రవిగారని ఏమీ తోచక బ్లాగులకొచ్చి, ఎవరినో కెలికి గొడవపెట్టుకుంటే, ఆ గొడవ గురించి యాహూ లో విని ఈ రౌడీ గారు పరిగెత్తుకొచ్చి బ్లాగులు తెరిచి చెంగ చేశారే - సైబర్ చెంగ అనబడే ఇది ఇంటర్నెట్ లో చాలా కామన్.

మలక్పేట్ రౌడీ: నేను రవిగారికోసమే వచ్చానని ఎవరన్నారు? నేనొచ్చింది జనాలని కెలికిపోడానికి. లాంగ్ టెర్మ్ ఆబ్జెక్టివ్స్ ఏమి నాకు లేవిక్కడ. (స్వగతం: ఇక్కడ కాబట్టి బ్రతికిపోయావ్. ఈ దుష్ప్రచారం బయట చేసుంటే నీ సంగతి అక్కడే తేల్చేవాడిని)

చెంఘిజ్ ఖాన్: ఏమో! జనాలు చెవులు కొరుక్కుంటూ పొరపాటున నాది కూడా కొరికేశారు. ఇప్పుడే రేబీస్ ఇంజెక్షన్ చేయించుకుని వస్తున్నా!

దయ్యాలప్లీడరు: అయ్యా! నాదొక సందేహం - ఈ అన్నదానాలు, రక్తదానాలు చేసేవాళ్ళు కూడా చెంగలే అంటారా?

చెంఘిజ్ ఖాన్: అయ్యో! తప్పు తప్పు. అన్నదానం వల్ల నలుగురికి తిండి, రక్తదానం వల్ల నలుగురికి జీవితం లభిస్తాయి. అది చెంగ కాదు. కానీ హైదరాబాద్ లో ఇరవైమంది నిలోఫర్ లో రక్తదానం చేస్తే ఆ రోజు చెన్నై లో ఉన్న రౌడీ గారు "ఇది మా ('నా' అని చదువుకోవాలి) గ్రూప్ ఘనతే" అని వెబ్ సైట్ లో పెట్టుకున్నారు చూడండీ - అదీ చెంగ అంటే!

మలక్పేట్ రౌడీ: హ హ హా హా హా హా (హిపోక్రిటికల్ స్వగతం: మళ్ళీ నామీద జోకా? ఖానూ! నీకు మూడింది రోయ్!)

చెంఘిజ్ ఖాన్: ఇలాంటిదే మన పుస్తక దాన చెంగ కూడా!

అక్కుపక్షి: హి హీ హీ హీ హీ హీ హీ హీ!!!!!!!!!!!!

చెంఘిజ్ ఖాన్: ఏమిటా వెకిలినవ్వు? పార్టీలలో, సభలలో సమయం సందర్భం లేని తెలుగు సినీమా హీరోయిన్ నవ్వులా?

మలక్పేట్ రౌడీ: అయ్యా! ఆమెనేమీ అనద్దు. అలిగి బ్లాగ్ మూసేస్తుంది. చెంగరాయుళ్ళందరూ మనమీద యుద్ధానికొస్తారు. పైగా ఈమె "చెంగ్ ఫూ" చాంపియన్.

అక్కుపక్షి (మలక్పేట్ రౌడీ చెవిలో): టూ లేట్. ఈ ఖాన్ నీమీద, నామీద కూడా రాళ్ళేస్తున్నాడు. ఈ షో అయ్యాక వీడి పని పడతా!

చెంఘిజ్ ఖాన్: సరే! ఇంక చెంగలలో రకాల గురించి తెలుసుకుందాం!


చెంగలు ముఖ్యంగా రెండు రకాలు - సంకల్పిత చెంగ, అసంకల్పిత చెంగ అని. సంకల్పిత చెంగ అంటే తెలిసి చేసేది ... ఉదాహరణకి మన బ్లాగ్లోకం లో ఇద్దరు ముగ్గురి మీద జరిగిన దాడిని ఇంటర్నేషనల్ ప్రాబ్లం చేశారే, పైగా ఎక్కడో ఒక మూల ఉన్న బూతుల బ్లాగుని అందరికీ చూపించి "కుట్రో కుట్ర - ఆడవాళ్ళని బ్లాగుల్లోంచి వెలివెయ్యడానికి ఒసామా బిన్ లాడెన్ నియమించిన వ్యక్తుల కుట్ర" అని తక్కిన ఆడవాళ్ళే నవ్వుకునేలా రోజుకోసారి అరుస్తున్నారే, అది సంకల్పిత చెంగ.

ఈ అరుపుల వల్ల ఆ స్త్రీలకేమన్నా మేలు జరిగిందా? దేవుడికే ఎరుక. ఎక్కువ లాభం ఎవరికి? ఆ బూతు బ్లాగ్ వ్రాసినవాడికి పిచ్చ పబ్లిసిటీ. ఒకప్పుడు అనామకుడు - ఇప్పుడు బ్లాగరందరికీ తెలుసు. చివరికి వీళ్ళంతా చెంగ చేసిందెవరికి? ఆ బూతులరాయుడికి. ఇది అసంకల్పిత చెంగ.

చాలా సంకల్పిత చెంగలకీ సాధారణంగా అసంకల్పిత చెంగలుంటాయ్. ఇదాంతా మేక్రో స్కేలులో.

ఇక మైక్రో స్కేలుకొస్తే - చెంగలు నానావిధాలు:

* పాకిస్తాన్ కోసం ఎవడొ ఆఫ్రికా వాడు కాష్మీరంటే ఏమిటో తెలియకపోయినా వచ్చి చస్తున్నాడు చూడు - దాని వల్ల వాడికి గాని వాడి కుటుంబానికి గాని ఏమి లాభం లేదు. ఎందుకూ చాలని కొంత డబ్బు తప్ప! దీనిని జిహాదీ చెంగ అంటాం!

* మందుకొట్టి పిచ్చిగంతులేస్తున్న ఆడపిల్లల్ని చావగొట్టిన వాళ్లది - సాంస్కృతిక చెంగ - దీనివల్ల ఆ పిల్లలు మారలేదు సరికదా .. వాళ్ళ లోదుస్తులు వీళ్ళకి పంపిస్తున్నారు. "ఉన్నిబట్టలేసుకోవే తల్లీ!" అంటే ఉన్న బట్టలు కూడా ఊడబీక్కున్న బాపతు!

* ఇక ప్రతీదానికీ ప్రభువు కాపాడును అని చెప్పి డబ్బులిచ్చి మరీ మతం మార్పిస్తారే - అది మతమార్పిడి చెంగ. వీళ్ళ డబ్బులయిపోయిన వెంటనే వేరే మతం వాళ్ళూ డబ్బులిచ్చి 'రీ కన్వర్ట్' చెయ్యరూ?

* నీకు నువ్వే చేసుకునే చెంగ (నీ గురించి నువ్వే గొప్పగా బ్లాగుల్లో వ్రాసుకోవటమన్నమాట) స్వచెంగ - ఇందులో "ఇంటర్వ్యూలు చేసే స్థితిలో ఉన్నా!" అనే రవిగారిది ప్రత్యక్ష స్వచెంగ, డబ్బా కొడుతున్నట్టు తెలియకుండా డబ్బాలు కొట్టుకునే రౌడీ గారిది పరోక్ష స్వచెంగ.

* పక్కవాడికి చేసే చెంగ - పరచెంగ ("ఆహా! ఓహో! ఎక్కడికో వెళ్ళిపొయారు సార్ మీరు! మీరు " అంటూ)

* వాడు నీకు నువ్వు వాడికీ చేసేది - పరస్పర చెంగ (ఒకళ్లకొకళ్ళు పొగడ్త కామెంట్లు వ్రాసుకోవటమన్నమాట)

* సూడో చెంగ: అమేరికా వాడు పాకిస్తాన్ కి చెంగ చేస్తున్నట్టు కనిపించినా ఎక్కడ నొక్కెయ్యాలో అక్కడ తొక్కేస్తాడు. ఇది సూడో చెంగ!

* సాముహిక చెంగ: ఇది ఒక సమూహం కలిసి ఒకరికో ఇద్దరికో చేసే చెంగ. మన ఆలిబాబా .. కాదు కాదు ఖాళీ బ్లాగర్ నలభై చెంగలు. ఆయనెవరో అన్నాడు చూడండి - నేను స్లం డాగ్ చూడలేదు - అయినా దాన్ని విమర్శిస్తాను అని, అలాగే ఈ చెంగలు కూడా - స్లం బ్లాగు నేను చదవలేదు, అయినా సరే ఆయన ఎవరో చెప్పారు కాబట్టి ఖండిస్తున్నా అని.

* రాజకీయ చెంగ: అమ్మో! దీని రేంజ్ చాలా ఎక్కువ - మచ్చుకో రెండు ఉదాహరణలు:

******** ఎవడో పెద్ద లీడర్ వచ్చి స్పీచ్ ఇస్తుంటే ఫోటో కోసమ్ పక్క నిలబడి, ఆయనకి సేవలు చేసి, స్టేజ్ ఎక్కి చేతులు ఊపి చేసే చెంగ - తీరా టికెట్ వచ్చేది నీ విరోధికి!
******** భూఆక్రమణ అంటూ పేదలని ఆకట్టుకోడానికి చేసే చెంగ - ఇంతా చేసి ఓట్లు పడేది పొత్తు పెట్టుకున్న చెంగబాబునాయుడికో లేక చెంగశేఖరరావుకో!

*ఇలాంటివే ఫలానా హీరో అభిమాన 'చెంగాలు' కూడా!

* ఎవడో నీకు చెంగ చేస్తే నువ్వు ముగ్గురికి చెంగ చెయ్యటం - "పే ఇట్ ఫోర్వర్డ్" లేక "స్టాలిన్" చెంగ

* ఎవడో నీకు చెంగ చెయ్యటానికొస్తే నువ్వే వాడికి చెంగ చెయ్యటం - రివర్స్ చెంగ

* పొద్దస్తమానం పక్కవాళ్ళమీద పడి ఏడిచే చెంగ్ 'క్రై బేబీ చెంగ' - దీనిని "సీ బీ సీ" అని కూడా అంటాం

* తమ సొంత బ్లాగులకన్నా ప్రక్కనున్న ఆడవాళ్ళ బ్లాగుల్లో ఉన్న తడి తువాళ్ళ మీద ఎక్కువ ఇంటరెస్ట్ చూపించే మగవాళ్ళ చెంగని "స్త్రీవాద పురుష బ్లాగు చెంగ" లేదా "ఎస్ పీ బీ సీ " అంటాం.

* అవసరమున్నా లేకపోయినా పక్కవాళ్ళని కెలకడం - రౌడీ చెంగ!

* ఈ రవిగారు చూడండి: ఈ - తెలుగు మీటింగ్ అంటూ వెళ్ళి అక్కడేమీ చెయ్యకపోయినా ఏవో రవ్వలడ్లు తిని వచ్చారు. దీనిని "షొ-ఆఫ్" చెంగ అంటాం. పాపం ఈ - తెలుగు కోసం కష్టపడేది ఒకళ్ళు - బజ్జీలు తినేది వేరోకళ్ళు!

* అలాగీ అడిగినవాళ్ళకి అడగనివాళ్ళకి టెంప్లేట్లు చేస్తే - దాని పేరు టెంప్లేట్ చెంగ - చేసిన వాళ్ళకి ఒరిగేది ఏమి ఉండదు - చేయించుకున్నవాళ్ళకి కూడా అయ్యో పాపం వీళ్ళు తమ పనులు మానుకుని మనకేదో చేసిచ్చారే అన్న ఫీలింగ్ ఉండదు, పైగా టెంప్లేట్ పోతే చేసిచ్చిన వాళ్ల మీద అనుమానాలు!

* వీటన్నిటికన్నా వెరైటీ చెంగ ఇంకొకటుండండోయ్ - ఇందాక చెప్పినట్టు కుట్ర చెంగ. కొంతమంది మీద జరిగిన దాడిని "తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద" జరిగే విదేశీ కుట్రగా వర్ణించటం. ఇంతా చేసి జరిగింది ఒకరిద్దరు మరొకరిద్దర్ని తిట్టడం. తిట్టబడిన వాళ్ళు తెలుగుకు ఎదో సేవ చేస్తున్నట్టు, వాళ్ళు బ్లాగులు వ్రాయకపొతే తెలుగు భాష బ్రతకనట్టు బిల్డప్పు. తెలుగు భాష మాట్లాడే పదిహేను కోట్లమందికి మనం మనం వ్రాసే పదిహేనువందల బ్లాగులే దిక్కా? లక్షవ వంతు కూడా లేవు ఈ బ్లాగులు తెలుగు ప్రపంచంలో! తెలుగు మనకన్నా ముందే ఉంది - మన తరవాత కూడా ఉంటుంది. మనమటుకు మనం చేయగలిగిన ఉడతాభక్తి సేవ చేస్తే చాలు - బ్లాగుల ద్వారా తెలుగు భాషని బ్రతికించేస్తున్నామని బిల్డప్పులివ్వకుండా. ఆదికవి నన్నయే ఇలాంటి గాలి కబుర్లేనాడూ చెప్పలేదు. తన గురించి గొప్పలు చెప్పుకునేవాడిగా పేరుబడ్డ శ్రీనాధ కవిసార్వభౌముడు కూడా ఈ రేంజ్ లో ప్రగల్భాలు పలకలేదు. ఇక మనమెంత?

దయ్యాల ప్లీడర్: అసలు తెలుగు భాష ఎలా నష్టపోతోంది?

చెంఘిజ్ ఖాన్: ప్రస్తుత పరిస్థితులలో ప్రముఖ పుస్తకాలన్నీ ఆంగ్లభాషలోనే ఉన్నాయి. దానివల్ల తెలుగు మాధ్యమం లో పెద్ద చదువులు కష్టమవుతోంది. తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న బ్లాగర్లలో కనీసం పది మంది ఆ పుస్తకాలని తెలుగులోకి అనువదిస్తే - ముఖ్యంగా సైన్సు పుస్తకాలని - భాషకి అంతో ఇంతో మేలు జరుగుతుంది.

మలక్పేట్ రౌడీ: నిజమే! శామ్ పిట్రోడా నాయకత్వంలో నడుస్తున్న నేషనల్ నాలెడ్జి కమీషన్ తన వంతు సహాయాన్నందిస్తుంది. ఆ విషయం ఆయనే ఆ మధ్య చికాగో లో చెప్పారు. అలా అని ఎవరూ చెయ్యట్లేదు అని కూడా అనకూడదు. వివేన్ గారు, శ్రీధర్ గారు, మహీ గ్రాఫిక్స్ వారు వ్రాస్తోంది తెలుగులోనే కదా!

దయ్యాల ప్లీడర్: మిగతా వాళ్ళకి సలహాలిచ్చేబదులు ఆ పని మీరే ఎందుకు చెయ్యకూడదు చెంఘిజ్ ఖాన్ గారూ?

చెంఘిజ్ ఖాన్: (రాజేంద్రప్రసాద్ స్టైల్ లో): ఎక్స్పెక్ట్ చేసా .. ఇలాంటిదేదో అడుగుతారని ఎక్స్పెక్ట్ చేసా. నా మటుకూ నేను అజైల్, స్క్రమ్, సిక్స్ సిగ్మా మీద పుస్తకాలు వ్రాస్తున్నా - ప్రస్తుతానికి పబ్లిషర్ వేటలో ఉన్నా!

అక్కుపక్షి: సుత్తాపండెహే! ఈ చెంగాయణం లో పబ్లిషర్ల వేటేమిటి?

మలక్పేట్ రౌడీ: సరే, చెంఘిజ్ ఖాన్ గారూ! మీరు కానివ్వండి.

చెంఘిజ్ ఖాన్: ఇకపొతే మిగిలినది ఇంటలెక్ట్యువల్ చెంగ. ఏదైనా జరిగితే చాలు దాని కూపీ లాగడమన్నమాట. ఎవడో బ్లాగులో ఏదో రాస్తే దాని జాగ్రఫీ, హిస్టరీ, సివిక్సు కలిపి డిసెక్టు చేసే అతిమేధావి వర్గం దానిగురించి అరా తీసి, రాసిన వాడెక్కడివాడు, ఎందుకొచ్చాడు, దీనివల్ల వాడికేమి లాభం అంటూ ఒక ఉచిత ఎనాలిసిస్ పడేస్తూ ఉంటారుగా - ఇంతచేసినా అది ఎవ్వడికి పనికొచ్చి చావదు. అదీ మన ఇంటలెక్ట్యువల్ చెంగ.

అక్కుపక్షి: అయితే ఈ చెంగాయిజం ఎక్కడపడితే అక్కడే ఉంటుందంటారు.

చెంఘిజ్ ఖాన్: నిస్సందేహంగా! చెంగ మహాకవి శ్రీచెంగం శ్రీనివాసరావుగారు అనలేదా - "చెంగాయిజం లేని చోటు భూస్థలమంతా వెదికిన దొరకదు" అని?

చివరగా ఒక ముఖ్యమైన విషయం. చెంగ్ కమాండ్.మెంట్స్ కేవలం కాబొయే చెంగోద్దండులకే చెవిలో ఉపదేశిస్తారు. కానీ చెంగలలో కాస్త ఆధునిక భావాలు కల విప్లవ చెంగనైన నేను వీటిని మీతో పంచుకుంటున్నా!

* Thou Shalt have no Gurus before “SarvaCHENGAchaalak”
* Thou Shalt not make unto thee any Chengraven image
* Thou shalt not take the name of the Chengoddamdas in vain
* Remember the World Chenga Day, and Keep it Chengly
* Honor thy Chengas
* Thou shalt not remain a non-Chenga
* Thou shalt not expect any benefit from your Chengaistic Activities "
* Thou shalt not leave an opportunity to do Chenga service"
* Thou shalt not bear false witness against thy fellow Changa"
* Thou shalt not covet thy Chenga’s house, nor anything that is thy Chenga's."

చెప్పాలంటే ఇంకా చాలా ఉంది గాని, సమయాభారం వల్ల ముగిస్తున్నా! ధన్యవాదాలు అందరికీ - ఓపిగ్గా విన్నందుకు !

అక్కుపక్షి: ఇంత "చెంగాలమైన" ఉపన్యాసం ఇచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు చెంఘిజ్ ఖాన్ గారూ. దయ్యాల ప్లీడర్ గారూ, మీకు కూడా ధన్యవాదాలు. రౌడీ గారూ! ఇప్పుడు పేరడీ టైమ్!!

మలక్పేట్ రౌడీ: "బొంబాయి" సినీమాలో "హమ్మ హమ్మ" పాట ట్యూన్ లో:


Audio File:
-----------


http://www.esnips.com/doc/10bfe0b7-1373-40d4-922e-351594da14db/tbc2


Get this widget | Track details | eSnips Social DNA




బ్లాగ్లోకంలోకీ, నేనిపుడే వచ్చానే
వస్తూనే
బ్లాగులు కొత్తవి తెరిచీ .. చెంగే చేశానే ..
చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ... హే చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...

సీనియర్ బ్లాగర్ల, వీపంతా గోకానే ప్రమాదవనంలో అందరి పైన రాళ్ళే వేశానే
చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ... హే చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...

చరణం
:
రవిగారి బ్లాగ్ లోన టెంప్లేట్లు అన్నీ మాయమయ్యేనేందుకో...
సున్నుండలనబడే రవ్వలడ్లు తిన్నా తిరిగిరాలేదెందుకో...
కాగడావి
బ్లాగులేవి కూడలిలో లేవెందుకో
బూతు పురాణం, చెత్త భారతం, రాసి పెట్టినందుకో ...
చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...హే చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...

చరణం:
ఇద్దరిముగ్గురిమీద జరిగినa దాడి బ్లోఅప్ అయ్యేనమ్మడూ,
ఆడవాళ్ళపై
అహేతుకమంటూ పబ్లిసిటీ తమ్ముడూ
తక్కిన స్త్రీలకు సీనులన్నీ వెగటు పుట్టించేనిప్పుడూ
మహిళలే
మహిళా గేంగులనింత ఛీకొట్టలేదెన్నడూ!!!!!
చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ... హే చెంగ .. చెంగ .. చెంగ చెంగ చెంగ ...

చెంఘిజ్ ఖాన్: రౌడీ గారూ! మీతో పోట్లాడాలనుకునేవాళ్ళకి ఒక సూచన - మీరేమి అనుకోనంటే ..

మలక్పేట్ రౌడీ: తప్పకుండా! చెప్పండి!!

చెంగిజ్ ఖాన్: ఎవరో చెప్పిన్నట్టు - ఒక పందితో బురదలో పోట్లాడేవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం: కొత్త వాళ్ళకి మొదట్లో బాగానే ఉంటుంది. కాని తర్వాత అర్ధమయ్యేదేమిటంటే ఆ గొడవలో బురద మీకంటుకుటుంది - కానీ పంది మాత్రం ఎంజాయ్ చేస్తుంది - బురదలో పొర్లడం దానికలవాటే కదా! :))

మలక్పేట్
రౌడీ: హా హా హ్హ

చెంఘిజ్ ఖాన్: మీ మనసును కష్టపెట్టుంటే క్షమించండి

మలక్పేట్ రౌడీ: అబ్బే అదేం లేదండీ. మిగతా వాళ్ళ మీద రాళ్ళేస్తున్నప్పుడు నా మీద వచ్చే జోకుల్ని కూడా ఎంజాయ్ చెయ్యాలి కదా?

చెంఘిజ్ ఖాన్: మీరనవసరంగా ఆవేశపడుతున్నారు రౌడీ గారూ! నేను క్షమాపణ చెప్పింది ఆ పందులకి, మీతో పోల్చినందుకు

మలక్పేట్ రౌడీ: హా హా హా హా హా హా హా! (స్వగతం: ఖానూ! ఇంక నిన్ను ఉపేక్షించి లాభంలేదు - నీ సంగతి తేలుస్తా) ధన్యవాదాలండీ. మా అక్కుపక్షి మిమ్మల్ని తలుపు బయటదాకా దింపుతుంది.

(అక్కుపక్షి చెవిలో): బయటకెళ్ళినవెంటనే నీ "చెంగ్ ఫూ" ప్రతాపం వాడిమీద చూపించు. వెధవ! వాడి పాడె వాడే కట్టుకోవాలి. మనల్ని విమర్శించినవాడెవ్వడూ ఈ బ్లాగ్లోకంలో మిగలడానికి వీల్లేదు. ప్లీడర్ వెళ్ళిపోయాడుగా, నువ్వెళ్ళేడప్పుడు తలుపెయ్యి.

******* క్లిక్ క్లిక్ *********

మలక్పేట్ రౌడీ: వేశావా? సరే ...

ఇందుమూలముగా యావద్బ్లాగర్లకూ .... ఈ చెంఘిజ్ ఖాన్ గారి కాలో చెయ్యో విరిగిన ఎడల, లేక తల పగిలిన ఎడల, లేక ఆయన పాడె ఆయనే ఇక ముందు కట్టుకున్న ఎడల, లేక 2007 లోనే తన శ్రేయోభిలాషులతో కట్టించుకున్న ఎడల బాధ్యత మాది కాదనియు, మమ్ములను బాధ్యులను చేసిన ఎడల మా బ్లాగ్ పర్మిషనులు మార్చివేయుదమనియు, లేదా బ్లాగులు మూసివేయుదమనియూ, పిదప మా మూడువందల భజన భట్రాజు చెంగల బ్లాగ్ధాటితో విషయమును పాకిస్తానీ కుట్రగా మార్చి ప్రక్కదోవ పట్టించెదమనియూ తెలియజేయడమైనది.

అందరికీ ధన్యవాదాలు. మీలో ఇంకా ఓపిక మిగిలుంటే మళ్ళీ వచ్చే వారం కలుద్దాం - రవిగారి చెంగ .. సారీ ... ఇంటర్వ్యూ లో !


18 comments:

  1. The date pertaining to the previous post got messed up .. So I am re-posting it here ..

    These were the comments posted earlier.. Thanks Aruna, Jedipappu, Kiran and the two anonymous posters!



    _____________________________________

    5 Comments
    Close this window Jump to comment form

    Blogger Aruna said...

    కళ్ళు తిరుగుతున్నాయి. తల చుట్టూ చెంగ అనే పదాలు తప్ప వేరే ఏమీ కనిపించట్లేదు. మోతాదు మించినట్టు వుంది. చెంగ అనే పదాన్ని ప్రతీ వాక్యం లోనూ వుపయోగించకుండా వుంటే బాగుండేది.

    February 15, 2009 9:07 PM
    Delete
    Anonymous Anonymous said...

    కురు చెంగేశునుకి తనవారెవరూ లేని, బాగా సంపాదిస్తూ కాస్త యౌవ్వనవతియైన సింగిల్ గా ఉండే లేడీ తో ఫ్రెండ్శిప్పంటే చెంగో చెంగంట! తరచు శిష్యులతో ఆ మాట చెంగుతుంటాడు!

    February 15, 2009 9:12 PM
    Delete
    Blogger జీడిపప్పు said...

    బాబోయ్!!! ఈ టైపు పోస్టు ఇంత వరకు చూడలేదు. hats off to your talent. ఇంకాస్త precise గా రాసి ఉంటే బాగుండేది. అక్కడక్కడా బాగా సాగదీసారు. హమ్మ హమ్మ సాంగ్ - కెవ్‌వ్‌వ్‌వ్ కేక :rofl
    నాకు నచ్చిన హైలైట్స్:
    అక్కుపక్షి: అది ఒకప్పుడు. మొన్న సూపర్ బౌల్ జరిగినప్పటినించీ విడిపోయాం.
    చెంఘిజ్ ఖాన్: ఏమిటా వెకిలినవ్వు? పార్టీలలో, సభలలో సమయం సందర్భం లేని తెలుగు సినీమా హీరోయిన్ నవ్వులా?
    చెంగలు ముఖ్యంగా రెండు రకాలు - సంకల్పిత చెంగ, అసంకల్పిత చెంగ అని.
    తెలుగు భాష మాట్లాడే పదిహేను కోట్లమందికి మనం మనం వ్రాసే పదిహేనువందల బ్లాగులే దిక్కా? లక్షవ వంతు కూడా లేవు ఈ బ్లాగులు తెలుగు ప్రపంచంలో! మనమటుకు మనం చేయగలిగిన ఉడతాభక్తి సేవ చేస్తే చాలు - బ్లాగుల ద్వారా తెలుగు భాషని బ్రతికించేస్తున్నామని బిల్డప్పులివ్వకుండా.
    చెంఘిజ్ ఖాన్: (రాజేంద్రప్రసాద్ స్టైల్ లో): ఎక్స్పెక్ట్ చేసా .. ఇలాంటిదేదో అడుగుతారని ఎక్స్పెక్ట్ చేసా. నా మటుకూ నేను అజైల్, స్క్రమ్, సిక్స్ సిగ్మా మీద పుస్తకాలు వ్రాస్తున్నా -
    బురద మీకంటుకుటుంది - కానీ పంది మాత్రం ఎంజాయ్ చేస్తుంది
    చెంఘిజ్ ఖాన్: మీరనవసరంగా ఆవేశపడుతున్నారు రౌడీ గారూ! నేను క్షమాపణ చెప్పింది ఆ పందులకి, మీతో పోల్చినందుకు

    February 15, 2009 9:17 PM
    Delete
    Anonymous !chavakiran! said...

    8/10

    February 15, 2009 9:55 PM
    Delete
    Anonymous Anonymous said...

    ఏనాడో ఇండియాని వదిలి వెళ్ళిన కురువృద్దుడు ఇండియాలో ఏమి జరుగుచున్నదో తెలియకున్నను విన్న కన్న అని నాల్గు ముక్కలు పోగేసి అంతయునూ తనకే తెలియునన్నట్లుగా వ్రాస్తాడు ఆ చెంగాయిజం గూర్చి తెలిసీ చెప్పకపోయినచో నీ టెంప్లేట్ వేయివక్కలవును!
    -బ్లాగ్ భేతాళుడు.

    ఆడాళ్ళ బ్లాగుల్లోఅన్నింటిలో కామెంటులు వ్రాసే తొక్క పేరేమిటి?
    మొగుడిని తన్ని మొగసాలకెక్కుట అనగానేమి?
    నేను సీనియర్ నువ్వు జూనియర్ బ్లాగ్పాట రచయిత ఎవరు?
    ఈ ప్రశ్నలకు సమాధానములు తెలిసి చెప్పకపోయినచో జరుగునది డిట్టోయే.

    February 15, 2009 10:19 PM

    ReplyDelete
  2. chala bagundi,....maa chittoor zilla lo pora chenga antaru...chala bagundi..please continue--
    munikishnaa

    ReplyDelete
  3. ఈ రౌడీ ఇంతకుముందు డైమండ్‌పార్క్ రౌడీ నా?

    ReplyDelete
  4. చేత బ్లాగు ముద్ద చెంగల్వ కామెంట్ దండ
    చంగారు మొలతాడు చెంగు చుట్టి
    చెంగెత్తు సరి బ్లాగు చెంగులు
    చిన్ని రౌడీ నిన్ను చేరి చెన్గుదు

    ReplyDelete
  5. అరుణగారు కరెక్ట్.. బుర్ర చుట్టూ చెంగ చెంగ అని తిరుగుతోంది ! మీ కెలికిపికేషన్ సూపర్ మేష్టారూ...

    ReplyDelete
  6. నాయనా చెంగాల్రాయా, తప్పు తప్పు చెంగుల రాయా
    ఇంటర్వ్యు బ్రమ్మ ని నన్నొదిలేసి, రవిగారితో ఇంటర్వ్యు ఎస్తావా. చెప్తా నీ సంగతి. "దండ కారణ్యంలో-కొండ కోతి" అనే పేరుతొ నేనే నీ ఇంటర్వ్యు ఏస్తా. హ హ్హ హ్హ.. ఓ.కే. తమ్ముడూ నీ ఇంటర్వ్యు బాగా చడువుకున్నోల్లకి నచ్చుద్ది . నా లాంటి పల్లె టూరోడికి అంత నచ్చదు. మనకి కొంచం రఫ్ఫ్ ఆడిస్తేగాని నచ్చదు. ఆడియో పార్టు సూపర్ తమ్ముడూ. వాయిస్ నీదేనా? నీ దానికి నా పేరడీ కాంప్లిమెంట్ అందుకో...

    చెంగావి రంగు చీర కట్టుకున్న రౌడీది
    దాని జిమ్మ దియ్య దాని జిమ్మ దియ్య
    అందమంతా చెంగులోనే ఉన్నది. | చెంగావి రంగుచీర|

    మెరుపల్లె వచ్చింది బ్లాగుల్లోకి
    అబ్బో ఇంటర్వ్యు వచ్చింది చెంగు గాడికి
    చెంగు చాటు తొలిగింది చెంగమ్మకి
    చెంగు చెంగు మని ఎగురుతూ
    చేరింది నీ చెంతకి
    సరి సరి సరి సరి... కిరి కిరి కిరి కిరి | చెంగావి రంగు చీర|

    ReplyDelete
  7. అయ్యో అయ్యో అయ్యయ్యో

    ReplyDelete
  8. అది తిట్టా? పొగడ్తా? చెంగయ్యగారూ :)) ఏదయినా థాంక్స్!

    ReplyDelete
  9. హిహిహి...అహహహహ్హహ్హ...ఓహొహొహ్హొ...!
    Hilarious...!!

    ఒంటెత్తు పోకడలు పోతున్న కొంతమంది సోకాల్డీస్ ని తీర్చిదిద్దుతున్న విధానం అద్భుతం.

    ఈ సందర్బంగా నా అనుభవాలు కూడ సంక్షిప్తంగా...,
    కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2006-2007 సం|| కాలంలో..., "అనానిమసురులు" పేరుతో న భూతో... అన్న విధంగా అతి గొప్ప (ఛండాలమైన అని చదువుకోగలరు) వివాదం జరిగిన విషయం ఇక్కడ చాల మందికి తెలుసు. ఆసందర్భంలో Anonymous వ్యాఖ్యలు "దేశద్రోహం" లాంటి తీవ్రమైన నేరాలని..., ASP rank పోలీస్ అధికారి ఈ పని మీదే ప్రత్యేకంగా నియమితులయ్యారని..,కటకటాల వెనక్కి తోయించడం మాకు వెన్న తో పెట్టిన విద్యనిన్నీ.., ఈ విధంగా వాళ్ల ఆధిపత్యాన్నేదో సవాలు చేస్తున్నారన్న కోణం లో విపరీతం గా స్పందించారు. ఆ విధమైన చర్చ జరుగుతున్న సమయంలో నేను "Anonymous వ్యాఖ్య లన్నింటిని ఒకే గాటన కట్టటం సరికాదు..., moderation పెట్టుకుని సరికాని వ్యాఖ్యలని publish చేయొద్దు, సరియైన Anonymous వ్యాఖ్య లని publish చేయొచ్చు కదా" అంటే "ఠాట్... బ్లాగు పెట్టుకోని చవటాయిలు దద్దమ్మలు వ్యాఖ్య లు రాసే అర్హత లేదు " అనే విధం గా స్పందించారు అప్పటి ఒంటెత్తుపోకడలు.
    అప్పుడు ఇప్పుడు దాదాపు గా ఒకటే రకం గా ఉన్నారనుకోండి, అది వేరే విషయం.
    Anonymous విషయంలో ఎదవ ఏడుపులు ఏడవకుండా ఎవడి జాగ్రత్త లు వాడు తీసుకునే స్థాయి కి ఎప్పుడు చేరుకుంటారో. మొన్నీమధ్య Web Security గురించి ఎవరో ఒకాయన సాధికారికంగా చెప్తే.., ఠాఠ్... అంటూ బయలుదేరుతుందొకామె, ఎందుకంటే పైనెవరో అన్నట్లు "సీనియర్" అని కావచ్చు.

    అయినా మన తలుపులు (మనస్సు) తెరచి పెట్టుకుని మంచి గాలి(విషయం) వస్తే ఆస్వాదించటం(నేర్చుకోవటం) చెడు గాలి వచ్చినపుడు తలుపులు మూసుకోవటం అలవాటు చేసుకోవాలి గానీ ప్రతిసారీ ఎవడిమీదో పడి ఏడవటం ఏంటండీ..! పొద్దున లేస్తే ఎంతమంది Anonymous లతో మనం deal చేయటం లేదండీ నిజ జీవితంలో.., అందరినీ nameplate నుదుట పెట్టుకోమని ఆడుగుతామా..!?

    Final గా చెప్పదలచుకున్న దేంటంటే.., కొంత మంది తమ విలువైన సమయాన్ని వెచ్చించి అనేక రూపాల్లో తెలుగు వ్యాప్తి కి కృషి చేస్తున్నారు.., (చావా కిరణ్, తాడేపల్లి, వీవెన్, చదువరి, శ్రీధర్ మొదలగువారు) వారికి నా మనఃస్పూర్తి అభినందనలు. వీళ్ళందరికీ నా విన్నపమేమంటే ఏదైనా పనికి బయలు దేరేటప్పుడు పైన చెప్పిన "పిల్లుల్ని" సంక లో పెట్టుకుని వెళ్ళవద్దని. ఒకవేళ ఆ "పిల్లి" తప్పని సరియైతే కొంత శిక్షణ అవసరమని నా అభిప్రాయం (Etiqutte విషయంలో..,)

    మీబ్లాగు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది కాబట్టి.., అందరికీ ఇంకొక విన్నపమేమంటే వ్యాఖ్య గాని టపా వ్రాస్తున్నపుడు కోపంతో నో ఎదుటివాళ్ళని offend చేసేదో అయితే.., అప్పటికి వ్రాసి publish చేయకుండా కొంత సమయం వేచి చూసి ఇంకా మీ అభిప్రాయం మారనట్లయితే అప్పుడు publish చేయండి. దీనివల్ల కొంతవరకు మీ వ్యక్తిత్వ హననం జరగకుండా నివారించవచ్చు.

    Disclaimer: ౧. నేను ఈ వ్యాఖ్య వ్రాయాటానికి నా ప్రధాన అర్హత మీ అందరి బ్లాగులు అప్పుడప్పుడూ సమయం దొరికినప్పుడల్లా చదవటమే..!
    ౨. ఈ వ్యాఖ్య " బ్లాగు లేనివారు వ్యాఖ్యానించ నర్హత లేదు" అన్న వారికి వర్తంచదనిన్నీ వారు చేసే నానా యాగీ కి నాకు సంబంధం లేదనిన్నీ ఇందుమూలంగా ప్రకటించటమైనది.
    ౩. నా వ్యాఖ్యలు ఇంతవరకు నాపేరుతో తప్ప Anonymous ప్రకటించలేదనిన్నీ,
    ౪. గత 20 నిమిషాలుగా నాసమయాన్ని వెచ్చించి ఈ వ్యాఖ్య వ్రాయటానికి కారణం నాకు సమయముండటమే తప్పు వేరు ఉద్దేశ దురుద్దేశాలు లేవని కూడ ఇందుమూలంగా ప్రకటించటమైనది.

    ReplyDelete
  10. Thanx Malleswar, So the allegations of so many people about the bullying tactics of a select few bloggers are turning out to be true. I was lil apprehensive before posting this one - I was wondering whether I was dragging it too far .. but now I am sure I was not.

    ReplyDelete
  11. తమ సొంత బ్లాగులకన్నా ప్రక్కనున్న ఆడవాళ్ళ బ్లాగుల్లో ఉన్న తడి తువాళ్ళ మీద ఎక్కువ ఇంటరెస్ట్ చూపించే మగవాళ్ళ చెంగని "స్త్రీవాద పురుష బ్లాగు చెంగ" లేదా "ఎస్ పీ బీ సీ " అంటాం.



    * మందుకొట్టి పిచ్చిగంతులేస్తున్న ఆడపిల్లల్ని చావగొట్టిన వాళ్లది - సాంస్కృతిక చెంగ - దీనివల్ల ఆ పిల్లలు మారలేదు సరికదా .. వాళ్ళ లోదుస్తులు వీళ్ళకి పంపిస్తున్నారు. "ఉన్నిబట్టలేసుకోవే తల్లీ!" అంటే ఉన్న బట్టలు కూడా ఊడబీక్కున్న బాపతు!



    ROFL ROFL

    ReplyDelete
  12. రౌడీ గారు ఇదంతా చదువుతుంటే ఎక్కడో ఇంతకుముందు మాట్లాడినట్లనిపిస్తుంది.. మీరు యహూ హిందూయిజం చాట్ రూం లో ఎప్పుడన్నా చాట్ చేసారా? ఓ రెండు సంవత్సరాల క్రిందట? "కమీనా ఖాన్" అనే ఐడీ తో??

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. ఇక్కడ బ్లాగుల్లోనూ చాలామంది ఉన్నారు స్పామర్స్ :)

    అభ్యుదయం స్పామ్
    కులం, మతం స్పామ్, హేతువాద ఛాందసవాద, సెక్యులర్ స్పామ్....

    సీనియర్ జూనియర్ బ్లాగర్ స్పామ్.... :)

    ReplyDelete
  15. OOPS never mind that comment deletion .. my daughter was playing around

    ReplyDelete