Feb 22, 2009

మూడవ నెంబరు ప్రమాద సూచిక - తుంటర్వ్యూ : రవిగారి రాగలీలలు

ప్రమాదవనానికి విచ్చేసిన వీక్షకులకు మళ్ళీ స్వాగతం. ఈ సారి మా గెస్ట్ హోస్టెస్ టెక్సస్ (పోని ఠెక్సస్ అనుకోండి) తింగరబుచ్చిగారు.

మలక్పేట్ రౌడీ: నమస్తే టెక్సస్ తింగరబుచ్చిగారూ! పాదాభివందనం! మీ పేరు వెనకాల కథ?

తింగరబుచ్చి: అబ్బే! పెద్ద కథేంలేదండీ! నాది ఠెక్సస్. ఏదో బుష్ మీద అభిమానం తో ఆడపిల్లనైనా సరే "టింగురంగా బుష్" అని పునర్నామకరణం చేశారు. అది కాస్తా ఇండియనైజ్ అయ్యి తింగరబుచ్చిగా రూపాంతరం చెందింది.

మలక్పేట్ రౌడీ: సరే! మన కార్యక్రమం లోకి దూకేద్దాం!!

తింగరబుచ్చి: ఈ నాటి మన ముఖ్య అతిధి రవిగారు !!!

నమస్తే రవిగాడూ, సారీ రవిగారూ, సారీ రవిగారుగాడూ, సారి రవిగాడుగారూ ... సర్లేండి ఏదో ఒకటి .. ! కుశలమా?

రవిగారు: ఏం కుశలమోనండీ! ఆ బ్లాగ్లోక కౌరవులతో ఈ పాండవుల బ్లాగ్యుద్ధం సాగినంతకాలం ఏమి చెప్పలేం!

తింగరబుచ్చి సరే, ఇక e-ష్టావధానం
1. మీ సెల్ఫ్ డబ్బా ప్లీస్?
రవిగారు: కవిత్వం లో భావుకుడిని, కోపం లో గంధకపుపొడిని, కుట్రలు బయటపెట్టడం లో అమ్మవడిని వెరసి రవిగారిని !

2: మీరు పుట్టినప్పుడు "అమ్మా అమ్మా" అని కాకుండా "అమ్మాయ్ అమ్మాయ్" అని ఏడ్చారని భోగట్టా. దానికి మీరేమంటారు?

రవిగారు: ఇదంతా నామీద జరిగిన విదేశీ కుట్ర. పుట్టక ముందు విదేసి పర్యటనకేళ్ళి, వచ్చేలోగా ఇలా ప్రచారం జరిగింది.
అసలు నేరం నాది కాదు. ఆ నర్సుది. పుట్టగానే నా బుగ్గ గిల్లితే "అమ్మోయ్ అమ్మోయ్" అని ఏడిస్తే గిట్టని వాళ్ళు "అమ్మాయ్ అమ్మాయ్" అన్నానని ప్రచారం చేశారు.

3: ఇప్పుడు జరుగుతున్న బ్లాగు గొడవలపై మీ వ్యూపాయింట్?
రవిగారు: వెనకటికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలొ కోరుకోరా భక్తా అంటే మా మేన మామ చెవిలో వెంట్రుకలు మొలిపించు తత్తిమాది నే చూసుకుంటాను అన్నట్టుంది ఇది. మనం ఏం రాసినా బూతులని ప్రచారం చేసి జనాలని ఉస్కోమనిపించి గాలి పోగుజేసుకుని గొడవ చెయ్యడం తప్పా ఇక్కడ గొడవలు జరిగే పెద్ద విషయమేమీ లేదు. ఇక్కడి బ్లాగర్లను బ్లాగించి బాధించడమే ఆ గేంగ్ ఉద్దేశ్యం.

4: మీరెక్కడికెడితే అక్కడ గొడవలని జనాలు ఉవాచ. మరి మీరో?
రవిగారు: ఏమిటోనండీ, చిన్నప్పటినుండీ నాకు మబ్బు రామయ్యలా ఉండటం అలవాటు లేదు. ఎక్కడికి వెళ్ళినా పార్టిసిపేట్ చెయ్యడం, తోచింది తప్పని మొహం మీదే చెప్పడం, భట్రాజు పొగడ్తలు పొఘడకపోవడం, చెంగ చెయ్యకపోవడం అలవాటు. హీ హలవాట్లే ఘొడవలకి హసలు కారణాలు. అయ్యో ఇదేంటి ఎన్. టీ. ఆర్. స్టైల్ దైలాగులొస్తున్నాయ్?

5: ఈ ప్రశ్న రౌడి గారికి: "రవిగారు" - ఫుల్ ఫార్మ్ ప్లీస్?

మలక్పేట్ రౌడీ:

' ర ' మ్యమైన ప్రదేశములో
' వి ' కసించే తామరలకు
' గా ' రముతో కాంతినిచ్చే
' రు ' ధిరవర్ణ సూర్యుడు

6: రవిగారూ, ఇంతకీ మీ వయస్సు ఎంతో చెప్పారు కాదు

రవిగారు: అంతర్జాలంలో వయస్సు ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. మగవాళ్ళందరికి - 27, న్యూయోర్క్, ఆడవాళ్ళకి 25 శేన్ ఫ్రేన్సిస్కో - అంతేగా?

7: ఇంతకీ మీకేదిష్టం? సున్నుండలా? రవ్వలడ్లా?

రవిగారు: అమ్మో దీనిగురించి మాట్లాడి ఇంకో వివాదం సృష్టించదలచుకోలేదు. నన్నొదిలేయ్ తింగరితల్లోయ్!!

8: సరే - ఆఖరి ప్రశ్న: మిమ్మల్ని బ్లాగు జడ్జిగా పెడితే ఏ బ్లాగులకి బహుమతులిస్తారు?

* అత్యుత్తమ చెంగ బ్లాగు:
* అత్యుత్తమ చెత్త బ్లాగు:
* అత్యుత్తమ బూతు బ్లాగు:
* అత్త్యుత్తమ కెలుకుడు బ్లాగు:
* అత్యుత్తమ వివాదాస్పద బ్లాగు:
* అత్యుత్తమ వినోదాత్మక బ్లాగు:
* అత్యుత్తమ అర్ధరహిత బ్లాగు:
* అత్యుత్తమ గోల బ్లాగు:
* అత్యుత్తమ అమ్మలక్కల బ్లాగు:
* అత్యుత్తమ నాన్నలన్నల బ్లాగు:

రవిగారు: ???????????

తింగరబుచ్చి: మీకు కష్టమయితే ఒక లైఫ్ లైన్ వాడుకోవచ్చు - ఫోన్ ఎ ఫ్రెండ్...

రవిగారు: సరే! వాడుకుంటా..

తింగరబుచ్చి: ఎవరికి ఫోన్ చెయ్యమంటారు?

రవిగారు: ఆ నలుగురికీ :))

తింగరబుచ్చి: ఆ నలుగురూ లైన్లోకి వచ్చారు.

రవిగారు: అయినా ఎందుకు లేండి, ఏదో గొడవయ్యేలాఉంది. నేను సమాధానం చెప్పను. నిర్ణయాన్ని మన వీక్షకులకే వదిలేద్దాం. చూద్దాం వాళ్ళేమంటారొ కామెంట్లలో.

తింగరబుచ్చి: సరే - ఇప్పుడు ఉత్తమ బ్లాగ్ డైలాగ్ పోటీ కి వచ్చేద్దాం. వీక్షకులు మాకు ఫోన్లు చేసి చెప్పిన వాటిత్లో ఉత్తమమైనదానిని ఉత్తమ డైలాగ్ / మొనొలాగ్ గా ప్రకటిస్తాం.

ముందుగా ఫోన్ చేస్తోంది - ఒమేగా స్టార్ సిరంజిగారు: "థాంక్స్ చెప్పద్దు - నీకెవడయినా కామెంట్ వ్రాస్తే నువ్వు మరో ముగ్గురికి వ్రాయి"

తరువాత ఫోన్: బోల్డ్ స్టార్ గోలయ్య గారు: "నేను బ్లాగు తెరిస్తే ఆ బ్రౌజర్ లోంచి వచ్చే క్లిక్కు శబ్దానికే చచ్చిపోతావ్రా నువ్వు!"

తర్వాత: జూనియర్ MTR గారు:

మలక్పేట్ రౌడి: జూనియర్ ఎం. టీ. ఆరా? అంటే ఉప్పు ఫేక్టరీ యజమాని కుమారుడా?

తింగరబుచ్చి: అబ్బా! ఈయన పెద్ద నటుడండీ. ముందు చెప్పేది వినండి.

జూనియర్ MTR: నువ్వు లాగూలు కట్టిన వయస్సులోనే నాకు బ్లాగులు రాయడం నేర్పాడ్రా మా తాత!

తింగరబుచ్చి: తర్వాత ఫోన్: ఇదేమిటండి? కంట్రీ కోడ్ "-1" అని వస్తోంది?

మలక్పేట్ రౌడి: అది పైలోకాన్నించి అయ్యుండచ్చు. ఎవరో చూద్దాం . అహో! సీనియర్ ఎం. టీ. ఆర్. గారు.

సీనియర్ MTR: (నేరెళ్ళ వేణుమాధవన్ స్టైల్ లో) "ఔరా! ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సిద్ధమునధక్కరించుచూ కురుసార్వభౌముడనైన నా మానసమును సైతమాకర్షింపజేయుచున్నదే! హూ! ఇవి బ్లాగు భంజికలు. నేనెంత భ్రమపడితినీ! ఈ వి 'గ్నా' నాంధకారమున అ 'గ్నా' నాంధకారమెచటినుండి వచ్చుచున్నది? ఇది మయుని రచనా విశేషము కాదు చెంగబ్లాగునాయుని కుట్రయని అవగతమగుచున్నది!"

తింగరబుచ్చి: ఆహా! ఓహో!! గుక్క తిప్పుకోకుండా చెప్పేసారు. తరువాతి కాలర్ పోలిస్ స్టోరీ బోయ్ కుమార్ గారు

బోయ్ కుమార్: "కూడలిలోకి రావద్దన్నావుగా! అందుకే కూడలినే హేక్ చేశా"!

చివరగా శ్రవణ్ కల్యాణం గారు: "నువ్వు గుడుంబా సత్తివో బ్లాగుల్లో కత్తివో నాకనవసరం. నేను మాత్రం సిద్ధూ సిద్ధార్ధ్ రాయ్"

తింగరబుచ్చి: రౌడీ గారూ! జడ్జ్మెంట్ టైం.

మలక్పేట్ రౌడీ: మళ్ళీ నిర్ణయాన్ని మన వీక్షకులకే వదిలేద్దాం. చూద్దాం వాళ్ళేమంటారొ కామెంట్లలో.

తింగరబుచ్చి: ఉండండుండండి. మరో కాల్. ఎదో ఆల్ ఇండియా కుక్కల సంఘం అంటున్నారు.

మలక్పేట్ రౌడీ: కుక్కలు ఫోన్ ఏమిటండీ? అక్కసున్న అక్కలయ్యుంటారు. సరిగా వినిపించి ఉండదు - సరిగా వినిపించి ఉండదు - అసలే మీకు కాస్త చెముడు కూడానూ.

తింగరబుచ్చి: అక్కలు కాదండీ బాబూ. కుక్కలే - మొరిగిన / మొరుగుతున్న కుక్కలంటున్నారు.

మలక్పేట్ రౌడీ: ఇదెక్కడో విన్నట్టుందే - ఆయనెవరో బ్లాగులో అన్నమాటకదూ ఇది? సరే లైన్ కలపండి.

కుక్కలు: WHO LET THE BLOGS OUT .. WOOF WOOF ..
WHO LET THE BLOGS OUT .. WOOF WOOF ..

THIS IS OUR REVENGE ON HUMANS .. WOOF .. BOOOO BOOOOO
WHO WROTE THE SONGS ON US DOGS .. WOOF .. BOOOO BOOOOO
IF YOU CAN GETAWAY WITH THAT THING ...
WE CAN ALSO DO THE SAME AND BITE BACK ...

WHO LET THE BLOGS OUT .. WOOF WOOF ..
WHO LET THE BLOGS OUT .. WOOF WOOF ..


మలక్పేట్ రౌడీ: పాటలు సరేగాని .. విషయానికి రండి.

కుక్కలు: మేము ఈ తుంటర్వ్యూ ద్వారా ఆ నలుగురికి ఒక విన్నపం చేసుకుందామనుకుంటున్నామండీ!

తింగరబుచ్చి: సరైన సమయానికే చేశారు. ఆ నలుగురూ ఇంకా లైన్లోనే ఉన్నారు. చెప్పండి.

కుక్కలు: అయ్యా / అమ్మా! మమ్మల్ని మీతో పోల్చి వారెవరో మా గౌరవాన్ని పెంచారు. మీరు మాత్రం పొరపాటున కూడా వాళ్ళని మాతో పోల్చవద్దు. మేమందరం ఆత్మ హత్యలు చేసుకోవాల్సి వస్తుంది అవమానం భరించలేక. మమ్మల్ని కనీసం ఈ కుక్క బ్రతుకన్నా బ్రతకనివ్వండి. ఇక సెలవు.

తింగరబుచ్చి: ఆ నలుగురూ! విన్నారుగా? ఈ కుక్కల మీద దయచూపండి ప్లీస్. ఇంతసేపు లైన్లో ఉన్న మీకు మా ధన్యవాదాలు. రవిగారూ, అడిగిన వెంటనే తుంటర్వ్యూ ఇచ్చిన మీకు కూడా!

తింగరబుచ్చి: రౌడీ గారూ ఇక పేరడి టైం.. ఈ సారికొక విన్నపం. పేరడిల బదులు ఒక కొత్త పాట పాడండి.

మలక్పేట్ రౌడీ: సరే! ముందుగా తెలుగు పండితులకి, తెలుగు సాహితీ ప్రియులకి క్షమాపణలు. ఇది కేవలం సరదాకోసం మాత్రమే.

ఒక తెలుగు పండితుడు విధిలేక ఓ రవితేజ సినిమాకు వ్రాసే మసాలా పాట ఇలా ఉంటుందేమో?

పల్లవి:

నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల
నీ చెంపలపై రాసేస్తా చంపకమాల
మెడ చూసి అల్లుతా మత్తెభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ
నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !

నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల
నీ చెంపలపై రాసేస్తా చంపకమాల
మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ
నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !


చరణం 1:

నీ ఆటా పాటా నాకు ఆటవెలది
నీ తలపు వలపు నాకు తేటగీతి
సింగారించిన నడుము సీసపద్యమే
కందిపోయే నీ బుగ్గ కందమేలే

నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !

చరణం 2:

నువ్వే వయ్యారం వలకబోస్తే భట్టి విక్రమార్కులూ భ ర న భ భ ర వ
నువ్వే అందాన్ని ఆరబోస్తే నల చక్రవర్తి కూడ న జ భ జ జ జ ర
నీ కాలి అందెల చప్పుళ్ళకి మారు మూల పల్లె కూడ మ స జ స త త గ
నీ వాలు కళ్ళ చూపులకేమో శతవయో వృధ్ధులూ స భ ర న మ య వ

నువ్వే గురువయితే నేనే లఘువవుతా
నువ్వే గురువయితే నేనే లఘువవుతా

నువ్వే నా తోడయితే య మా తా రా జ భా న సా ...
నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !

పల్లవి:

నీ ఊసులతో సృష్టిస్తా ఉత్పలమాల
నీ చెంపలపై రాసేస్తా చంపకమాల
మెడ చూసి అల్లుతా మత్తేభాన్ని, శిగపేరుతో కుమ్మేస్తా శార్దూలాన్నీ
నీ మొహం నుండి పుట్టిస్తా ముత్యాలసరమే ... !


రవిగారు: మలక్! వెళ్ళేముందు ఒక ప్రశ్న - ' రాగ లీలలు ' అని టైటిల్ పెట్టారు కదా - ఈ రాగ అంటే ఎవరండీ? ఎప్పుడూ కలవలేదే?

మలక్పేట్ రౌడీ: అయ్యో! అమ్మాయి కాదండి బాబూ. మీరు ఊరుకోండి. తింగరబుచ్చిగారూ మీకు ధన్యవాదాలు. వీక్షకులారా! వచ్చేవారమో, ఆ పైవారమో లేక నాలుగయిదు వారాల తరవాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవు, ధన్యవాదాలు, రవిగారికీ, తింగరిబుచ్చి గారికీ, వీక్షకులకూ పాదాభివందనాలు.

తింగరబుచ్చి: చివరగా --- రౌడీగారూ, మీ పేరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తారా?
మలక్పేట్ రౌడీ: అబ్బే ఎందుకు లెండీ!
తింగరబుచ్చి: చెప్పండి ఫరవాలేదు
మలక్పేట్ రౌడీ: వసుదేవుడండీ :))
తింగరబుచ్చి, రవిగారు: ఆ (((((( !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

15 comments:

  1. "తింగరబుచ్చి: చివరగా --- రౌడీగారూ, మీ పేరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తారా?
    మలక్పేట్ రౌడీ: అబ్బే ఎందుకు లెండీ!
    తింగరబుచ్చి: చెప్పండి ఫరవాలేదు
    మలక్పేట్ రౌడీ: వసుదేవుడండీ :))
    తింగరబుచ్చి, రవిగారు: ఆ (((((( !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!"

    Funny lines to end

    also senior MTR dialogues especially "gnaa" ..... very good

    ReplyDelete
  2. పుట్టగానే నా బుగ్గ గిల్లితే "అమ్మోయ్ అమ్మోయ్" అని ఏడిస్తే గిట్టని వాళ్ళు "అమ్మాయ్ అమ్మాయ్" అన్నానని ప్రచారం చేశారు.

    బోల్డ్ స్టార్ గోలయ్య గారు: "నేను బ్లాగు తెరిస్తే ఆ బ్రౌజర్ లోంచి వచ్చే క్లిక్కు శబ్దానికే చచ్చిపోతావ్రా నువ్వు!"

    జూనియర్ MTR: నువ్వు లాగూలు కట్టిన వయస్సులోనే నాకు బ్లాగులు రాయడం నేర్పాడ్రా మా తాత!


    సీనియర్ MTR: ఈ వి 'గ్నా' నాంధకారమున అ 'గ్నా' నాంధకారమెచటినుండి వచ్చుచున్నది?

    you have great talent Rowdy garu !!!

    ఆ పాటలో నాలుగు బూతులు చొప్పించేస్తే మాంఛి తెలుగు సినిమా పాటల రచయిత అవుతారు.. ట్రై చెయ్యండి.

    "వీక్షకులకు పాదాభివందనాలు" అంటే "అబ్బో నాక్కూడా పాదాభివందనం" అని మురిసిపోతుంటే గాడిదను చేసేసారుగా :(

    ReplyDelete
  3. Thanks Pradeep and Jeedipappu,

    That Sr MTR dialog was a variant of Nerella Venumadhavan's dialog. So he gets the real credit for that part.

    ReplyDelete
  4. నువ్వు గుడుంబా సత్తివో బ్లాగుల్లో "కత్తివో" నాకనవసరం. నేను మాత్రం సిద్ధూ సిద్ధార్ధ్ రాయ్

    good good

    ReplyDelete
  5. one more


    ' ర ' మ్యమైన ప్రదేశములో
    ' వి ' కసించే తామరలకు
    ' గా ' రముతో కాంతినిచ్చే
    ' రు ' ధిరవర్ణ సూర్యుడు

    are you pulling his leg?

    ReplyDelete
  6. LOLZ Anonymous, Thx, the first one was with due apologies to the concerned person and about the second one, shhhhhhhhhhhhhhhhhh :))

    ReplyDelete
  7. కడుపుబ్బ నవ్విస్తున్నారు .. బహుశా కొందరిని కవ్విస్తున్నారు ,,,, రవి గారి తో ముఖ పరిచయం ఉన్నా వాళ్ళకు ఈ ముఖ ముఖి చక్కగా అర్ధం అవుతుంది .... పుట్టగానే అమ్మాయి అమ్మాయి అని ఎడ్చార .. ఇంత కి ఆ రాగ ఎవరు అని అడగడం

    ReplyDelete
  8. "తింగరబుచ్చి: చివరగా --- రౌడీగారూ, మీ పేరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తారా?
    మలక్పేట్ రౌడీ: అబ్బే ఎందుకు లెండీ!
    తింగరబుచ్చి: చెప్పండి ఫరవాలేదు
    మలక్పేట్ రౌడీ: వసుదేవుడండీ :))
    తింగరబుచ్చి, రవిగారు: ఆ (((((( !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!"
    baagundi.
    godvala gurunchi kaaka vere edaina aite baagundedi.

    ReplyDelete
  9. వేరే ఏదైనా ఐతే ఇంట మంది చదవరుగా ? .. కావాలంటే న బ్లాగు చూడండి సున్నా కామెంట్లు

    ReplyDelete
  10. LOL!!!

    Don't know what this is about, nor do I care. But you are hilarious :) :)

    ReplyDelete
  11. Thanx Sakyamuni, LOL Srinivas

    Aruna garu,

    Originally, this post was not intended to refer to the fights. Twas just to pull Ravigaru's leg. We knew that repeated reference to the fights would make this boring and people would lose interest. But then a recent post in the other blog that re-ignited the fire, prompted us to respond the way we did. (Even though we had an option to ignore it, we decided we would react to that post)

    Lezz see, the next interview is a
    a very serious and a meaningful chat, away from the blog-fights. The other interviews are a few weeks/months away. But then, it depends on the other blogs and posts too.

    ReplyDelete
  12. Ayyo I thought mine would be the best Kelukudu blog ... hmmm ... should try harder then :))

    ReplyDelete
  13. For those people askin me about RG's full form:

    ' ర ' మ్యమైన ప్రదేశము = Rediff Burada .. the rest of it would be self explanatory :))

    ReplyDelete