నేను బ్లాగ్ లోకం లోకి కొత్తగా వచ్చా ఇక్కడ చాల మంది బహుముఖ ప్రజ్ఞ శాలురు ఉన్నారని అర్ధమైంది. కనుక నన్ను గత తొమ్మిది సంవత్సరాలు గా వేధిస్తున్న ఒక్క ధర్మ సందేహాన్ని మీ ముందు ఉంచుతున్న్న సమాధానం చెప్పిన వారికీ తగు రీతిన సత్కారం ఉంటుంది.
మనం చిన్నప్పుడు నుండి ఒక మాట తరచుగా వింటుంటాం పెద్దల మాట తు.చ . తప్పక పాటించాలి అని ఆ "తు.చ. " అంటే ఏంటో ఎవరైనా చెప్పగలిగితే సంతోషం
ఈ ప్రచురణ చూసి కామెంటు చెయ్యకుండా పొయ్యారో మీ బ్లాగు ౩ ముక్కలగు గాక
శ్రీనివాస్
సంస్కృతశ్లోకాలలో చందస్సుకోసం ఈ రెండు అక్షరాలను వాడుతుంటారు.ఉదాహరణకు అనుష్టుప్ చందస్సులో శ్లోకంలోని ఒకో వాక్యంలో 16 అక్షరాలుంటాయి మొత్తంశ్లోకంలో 32 అక్షరాలుంటాయి ఆ సంఖ్య కోసం ఈ
ReplyDeleteఅక్షరాలను అవసరంకోసం వాడతారు. వీటి వాడకం వల్ల అసలు అర్థంకు ఇబ్బంది ఉండదు.ఉదాహరణకు
దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా!
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ !!
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః !
భీష్మమేవాభిరక్షన్తు భవన్తః సర్వ ఏవ హి !!
తు, చ తప్పకుండా అంటే మక్కీకి మక్కీ అని
ఇది నాకు తెలిసినది వేరే ఏమైనా అర్థం ఉందేమో మరి .
This comment has been removed by the author.
ReplyDeleteఅప్పుడప్పుడు పాదపూరణ కొఱకు వాడేవైనప్పటికి ఈ అక్షరాలు అర్థం లేనివి కావు. "చ" అంటే మరియు అని అర్థం. కానీ ఇది జాబితాకి చివఱలో వస్తుంది. తెలుగులో మాదిరి జాబితా మధ్యలో రాదు.
ReplyDeleteఉదా:- రామః లక్ష్మణశ్చ
అయోధ్యా లంకా చ
"తు" అంటే "కాని" (but)
అయితే ఇది వాక్యమధ్యంలో వస్తుంది. తెలుగులో మాదిరి వాక్యాదిలో రాదు.
ఉదా:- రావణో లంకేశ్వరః (రావణుడు లంకకధిపతి)
రామస్తు సర్వలోకేశ్వరః (కానీ రాముడో, సర్వలోకాలకూ అధిపతి)
తుది నుండి చరము వరకు అని ఎక్కడో చదివినట్లు గుర్తు. లేదంటే ఎవరైనా అనగా విన్నానో.. సరిగా గుర్తులేదు.
ReplyDeleteఎవరైనా తుమ్మినా చచ్హినా అని అర్ధం.......
ReplyDeleteఇదే fix చేసుకోండి.
గమనిక: నా బ్లాగు మొదలేపెట్టలేదు ఎక్కడ ముక్కలైపొతుందో అని చేప్పా.
taaDepalli gaaruu,chilamakuuru garuu cheppinavE mI praSnaku samaadhaanaalu.
ReplyDeletepraSnatOnE "haasyaanni" saadhiMcchaaru.
very nice!keep it!