Feb 24, 2010

అక్కయ్య గారు రూటు మార్చారోచ్!

పాపం పవన్ తో పప్పులుడకడం లేదని అక్కయ్యగారు లేటుగా లేటెస్టుగా రూటు మార్చేశారు. కావాలంటే ఈ స్క్రీన్ షాట్ మీరే చూడండి ...







*************************************************************





ఇది చూస్తూంటే నా సెంట్రల్ యూనివర్సిటీ రోజులు గుర్తొస్తున్నాయి. నేను జాయిన్ అయిన కొత్తల్లో ఒక అమ్మాయి ఆత్మ హత్య చేసుకుంది - కారణం - తన బాయ్ ఫ్రెండు మోసం చేసాడని - దానికి కారణం? అతను అగ్రవర్ణం, ఆమె దళితురాలు. సంబంధం పెట్టుకునేదాకా ఓకే గానీ పెళ్ళిమాత్రం కదరదన్నాడు. దానితో ఆ అవమానం భరించలేక తన రూములోనే ఉరేసుకుంది. యూనివర్సిటీలో చాలా పెద్ద గొడవే జరిగింది. దళిత సంఘాల వాళ్ళొక రేలీ నిర్వహించారు. కులం కారణంగా మొదలై, కులమే మూలంగా ఉన్న గొడవ రేడీకల్ ఫెమిష్టుల చేతుల్లో పడింది. ఇంకనేం? మగవాళ్ళంతా భూతాలు, ఆడవాళ్ళు దేవతలు అని గొడవ మొదలు పెట్టారు. పోస్టర్లు అంటించడం మొదలు పెట్టారు - ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఒక అలవాటు ఉండేది లేండి - శుభ్రంగా ఉన్న గోడల్ని చూస్తే కుళ్ళు, అందుకే పోస్టర్లంటించుకునే వాళ్ళు ... కత్తితో కాదురా ... పోస్టర్ తో చంపేస్తా" అనే సీనన్నమాట

ఇదంతా చూస్తున్న ఒక గుంపుకి చిరాకేసింది. అసలు గొడవేమిటి, వీళ్ళు వేస్తున్న తింగరబుచ్చి వేషాలేమిటి అని. వెంటనే వాళ్ళోక పోస్టర్ వేసారు .. దాని సారాంశం:


ఆ అమ్మాయి - ఆత్మ హత్య చేవ్సుకుందంటే తప్పెవరిది?

... మోసం చేసిన ప్రియుడిదా?
... గుడ్డిగా నమ్మిన తనదా?
... తన బాధని చెప్పుకోడానికి అవకాశం ఇవ్వని తల్లిదండ్రులదా?
... గర్భవతి అనగానే చీదరింపుగా చూసిన ఆమె స్నేహితులదా?
... కులాల మధ్య తారతమ్యం సృష్టించిన మన సమాజానిదా?
... అసలు విషయం మర్చిపోయి పోస్టర్లతో కొట్టుకుంటున్న నీదీ, నాదీనా? అని

ఆ పోస్టరు సూపర్ హిట్టయి కూర్చుంది ... ఆ పోస్టరుతోనే ఒక క్లబ్బు పుట్టింది ... బెర్మ్యూడా క్లబ్! - HCU Bermuda Club!

కట్ చేస్తే ...

E అంటే ఈ వీ ఆర్ సీ మోహనరెడ్డి
R అంటే రాజశేఖర్
M అంటే మూసత్ సుబ్రహ్మణ్యం
U అంటే యూ వీ రమణయ్య
D అంటే డేవిడ్, దత్తు, దాసు
A అంటే అరుణ్ కుమార్

వీరందరూ ఒకే రూములో కూర్చునే రీసెర్చి స్కాలర్లన్నమాట. పాపం వాళ్ళ ప్రమేయం లేకుండానే లాగబడ్డారు .. అదే గ్రూపుకి చెందిన 'బీ' అనే వాడి వల్ల. ఆ "B" ఎవరో మీకు చెప్పక్కరలేదనుకుంటా.. అదీ సంగతి :))

మళ్ళీ కట్ చేస్తే ...

యూనివర్సిటీ కల్చరల్ ఫెస్టివల్ సుకూన్ ... కొత్తగా వచ్చిన ఈ క్లబ్బు స్టేజ్ షో ఒకటీ చేసింది - దానిలో ప్రత్యేకత, జనాలకి కుళ్ళీన టోమేటోలు ఇవ్వడం. కామేడీషో కి ఎవడికీ నవ్వురాకపోయినా, కామేడీ చేసిన వాడిని ఎవడైనా టొమేటో తో కొడితే జనాలు నవ్వుతారు కదా .. అదన్నమాట ... ఆ షో కూడా సూపర్ హిట్. ఇంతకీ దాని పేరు తెలుసా? Ace Whole Show!
దానిలో ప్రత్యేక ఆకర్షణా పేరడీలూ .. ప్రమాదవనంలో అక్కయ్యా అక్కయ్యా పేరడి అలాంటి షో నుండీ వచ్చిందే.

ఈలోగా రేడీకల్ ఫెమినిష్టుల పోస్టర్లు ఎక్కువయ్యాయి .. మన వాళ్ళు కూడా పోటీగా వెయ్యడం మొదలు పెట్టారు ( పెట్టాడు అనాలి .. హీ హీ హీ) .. వాళ్ళు పెట్టీన ప్రతీ పోస్టర్కీ కామెడీగా రెస్పాన్స్ వచ్చేది .. దీని వల్ల క్లబ్బరులు చేసిన పనేమిటంటే, వారికి తెలియకుండానే ఫెమినిష్టులని నీరుగార్చడం. వారి ప్రతీ పోస్టర్నీ కామేడి చేసి ...

వారికి చైర్రెత్తుకొచ్చి .. నాటు పోస్టర్లు వయ్యడం మొదలు పెట్టారు .. మచ్చుకి ...

What if the man starts menstruating?

Govt is Male Chauvinist .. those three days will be holidays
Males will be males only for 3 days
3 days a mont will be spent on religious undertakings

etc


మనవాళ్ళు కూడా దేశముదుర్లేగా .. దానికి కూడా రెస్పాన్స్ ఇచ్చారు ...

Our INDECENT answer to your INDECENT question

What if the male starts menstruating?

A: Even the Sanitary Napkin says "GIVE ME REDDDDDDDDDDDDDDDDD" ... Eveready!!!


పాపం రేడికల్ ఫెమిష్టు పని కుడితిలో పడ్డ ఎలకలా తయారయ్యింది. ఒక గుంపుని పోగేసుకుని ఈ క్లబ్బుకి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు, అంతా అగ్రవర్ణాల సాంస్కృతిక వాదులని. The more they talked about the club, the more famous it became. అప్పటికే పాప్యులర్ అయిన క్లబ్బు ఒకేసారి 175 మంది మద్దతుదార్లని సమకూర్చుకుంది. దానితో Bermuda క్లబ్బర్లకి కొత్త సమస్య వచ్చింది - ఎలక్షన్లలో పోటీచేసే వాళ్ళు మద్దతు అడగడం. అసలు క్లబ్బుకి పేరు రావడానికి కారణం, రాజకీయాలకి, కులమతాలకి అతీతంగా పని చెయ్యడం. వాళ్ళని వదిలించుకునే సరికి తల ప్రాణం తోకకొచ్చింది. అలగే రాత్రి పూడా క్రికెట్ కప్ పోటీని మొదలు పెట్టిన ఘనత కూడా క్లబ్బుదే .. ఆ తరవాత నా వింగ్ మేట్, దురదృష్టవశాత్తూ గుండేపోటుతో మరణీంచిన నారాయణరెడ్డి పేరు పెట్టారు దానికి.

ఈలోగా మరో గడవ - 1995 ఆగస్టు పదిహేనో తారీకు నాడు కేంపస్ లో ఒక విద్యార్ధిని అత్యాచారానికి గురైంది. దానికి పాల్పడ్డవారు కేంపస్ బయనుండి గేదెల్ని తోలుకొచ్చి మేపుకునే వారు. కాని ఈ రేడికల్ ఫెమినిష్టులు ఆ నేరాన్ని మగ విద్యార్ధుల మీదకి తోసేశారు. దానితో అబ్బాయిలకీ మిగతా అమ్మాయిలకీ కూడా చిరాకేసింది. ఎవడో బయటవాడు చేసిన దానికి కేంపస్ లో అబ్బాయిలని ఎందుకు నిందిస్తున్నారని సణగడం మొదలు పెట్టారు.( అసలు అర్ధరాత్రి 12 గంటలకి ఆడపిల్లలు ఆరోజుల్లో వంటరిగా తిరగగలిగినది రాష్ట్రం మొత్తం మీడ ఒక సెంట్రల్ యూనివర్సిటీలోనే. )

ఈలోగా ఒక గ్రూపు వాళ్ళు ఆ అమ్మాయికి నష్ట పరిహారం ఇవ్వాలని డెమేండ్ చేశారు. దానితో కొంతమంది అమ్మాయిలు రెచ్చిపోయి "అయితే మామీద కూడ అత్యాచారాలు చెయ్యండి, మాకు కూడా నష్టపరిహారం ఇవ్వండి" అని కేక్లెయ్యడం మొదలు పెట్టారు. దానితో కోపగించుకున్న ఒక వ్యక్తి "మీకంత సీను లేదు. మీమొహాలని చూసినవాడెవ్వడూ మీదగ్గరికి కూడా రాడు" అని ఒక కుళ్ళు జోకేశాడు. ఏమి జరుగుతోందో అర్ధమయ్యేలోగానే విషయం పక్కదారి పట్టి, నానా గొడవా అయ్యింది. ఒక మగ ఫెమినిష్టు ప్రొఫెసర్ ALL MALES ARE BAS***** అనే స్థాయి దాకా వెళ్ళాడు. ఇక మగవాళ్ళు రంగంలోకి దిగారు. క్లబ్బు పాప్యులారిటీ విస్తరించింది. ఆ క్లబ్బులో ఈ ఫెమిష్టులతో చిర్రెత్తిన అమ్మయిలు చేరడం మొదలు పెట్టారు. ఇక పండగే పండగ. ఇంతాచేసి ఆ నేరం చేసిన వాడిని పట్టూకుని ఒరేయ్ నీకంత ధైర్యం ఎలా వచ్చిందిరా అంటే, "పీకాక్ లేక్ దగ్గర పట్టపగలు ఫలానా వారిద్దరి కేళీ విలాసం చూసాను" అన్నాడూ. ఇంతకీ వారిద్దరూ ఎవరు? స్త్రీ వాదం పేరుతో విశృంఖల శృంగారాన్నికి పాల్బడ్డ ఒక మగ, ఒక ఆడ ఫెమిసిష్టులు .. గతుక్కుమన్నారు ..

కేంపస్ లో ఇలాంటివేమిటా అనుకుంటున్నారా? అప్పట్లో ఇవన్నీ మమూలే లెండి. నేచర్ క్లబ్, ఎడ్వంచర్ క్లబ్ మెంబర్లుగా ఉండే మేము కేంపస్ లో చాల Trekking చేసేవాళ్ళం. ఒకసారయితే దాదాపు 25 కిలోమీటర్ల పొడవున్న ప్రహరీగోడ మొత్తం నడిచొచాం కూడా. వెన్నెల రాత్రుల్లో Mushroom రాక్ అనే చోటికి వెళ్ళడం చాలా ఇష్టం మాకు. ఒక అయిదారుగురికి తకువ కాకుండా వెళ్ళేవాళ్ళం.

అమ్మయిలతో కలిసి వెళ్ళినప్పుదు ఫరవాలేదు గానీ, అబ్బాయిల గుంపుతో వెళ్ళినప్పుడు మాత్రం భయపడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఒకొక్కరోజు దారిపొడుగునా 'వస్త్రాపహరణం' సీనులే .. అసలే అబ్బాయిల గుంపు .. కొంపదీసి ఆ అమ్మాయి అబ్బాయి, మేమేదో సామూహికంగా చెయ్యబోయామని గొడవ చేస్తే? అరిటాకు ముల్లుమీద పడ్డా, ముల్లు అరిటాకుమీద పడ్డా, జనాలు తిట్టేది ముల్లునే కదా?

ఈ పిడకలవేట సరే గానీ, తరవాత వాళ్ళంతా కలిసి స్ట్యూడెంట్ యూనియన్ ఎలక్షన్లలో అమ్మయిలకి రిజర్వేషన్ కావాలి అని గొడవ పెట్టారు. క్లబ్బు రాయుళ్ళకి తిక్కరేగింది .. బుధ్ధుందా లేదా? యూనివర్సిటీ పక్క పల్లేటూళ్ళో అయిటే మద్దతిస్తాం, మన కేంపస్ లో ఎందుకు దండగ అని వ్యతిరేకించారు. అప్పట్లో ఆ పని జరగలేదు. ఇప్పటి పరిస్థితి ఏమిటో తెలియదు. "అమ్మాయిలు గెలిచే సీను లేదో" అని చెప్పి గోల చెశారు. Bermuda క్లబ్బు రాయుళ్ళు వాళ్ళలో ఒక అమ్మాయిని నిలబెట్టారు - ఆ అమ్మాయి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది, as a cultural secretary. పాపం ఫెమినిష్టుల నోళ్ళు మళ్ళీ మూతపడ్డాయి.

ఇలా చెప్పాలంటే చాలా చాలా ఉంది లేంది. కానీ మేమంతా కేంపస్ వదిలేసిన తరవాత, "రేడీకల్ ఫెమినిష్టు వ్యతిరేక" గుంపు నుండి క్లబ్ "స్త్రీ ద్వేష సంఘం" గా మారిందని విన్నా. అలా మారిన ఏ గుంపైనా పతనమవ్వడం ఖాయం - ఆ క్లబ్బుకి కుడా అదే గతి పట్టిందని లేటెస్ట్ న్యూసు. ఇక వారికీ, పురష ద్వేషులైన రేడీకల్ ఫెమినిష్టులకి తేడా ఏముంది?

ఎందుకో మన అక్కయగారి స్క్రీన్ షాట్ట్ చూసాక ఈ ఫ్లేష్ బేక్ అంతా బుర్రలో తిరింగింది. క్లుప్తంగా వ్రాసి పారేశా :)) Shall write about this in detail later.

21 comments:

  1. Very interesting and Good :)--- Ravi Abburi

    ReplyDelete
  2. ఇంత వివరంగా రాసి ఇంకా వివరంగా ఎప్పుడో రాస్తానంటారేమిటండీ, మొత్తానికి ఇదన్న మాట మీ బాక్ గ్రౌండ్ స్టోరీ.
    మీరు చెప్పిన రాడికల్ ఫెమినిస్త్ళుల గ్రూప్ లో కొన్ని పేర్లు చెప్పగలరా? వూరికె తెలుసుకుందామని. అలాగే మీరు సెంట్రల్ యూనివర్సిటీ లో చదివిన పీరియడ్ కూడా. ఈ రెండు చెపితే మీరు చెప్పిన దానికి ఇంకొంచెం సమగ్రత వస్తుంది.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. హ్మ్మ్మ్...క్లుప్తంగా రాసారా? :-) మా బాబే. 20 మార్కుల ప్రశ్నకు ఎన్ని అడిషనల్ పేపర్స్ తీసుకునేవాళ్ళేంటీ?

    మీ కాలేజీ నేపధ్యం చూస్తే కుళ్ళుగా ఉంది. నేనేంటో క్లాసు రూము, పుస్తాకాల బతుకే అయిపోయింది.


    ".( అసలు అర్ధరాత్రి 12 గంటలకి ఆడపిల్లలు ఆరోజుల్లో వంటరిగా తిరగగలిగినది రాష్ట్రం మొత్తం మీడ ఒక సెంట్రల్ యూనివర్సిటీలోనే"

    నేనొప్పుకోను..మా ఆర్ యి సి కాంపస్ కూడా అంతే. కాక పోతే అర్ధ రాత్రి ఎవరూ పెద్దగా తిరక్క పొయేవాళ్ళు లెండి.

    కాపోతె సాయంకాలాలు, చీకటి పడ్డాక చాలా సేపు, లేడీస్ హాస్టల్ చూట్టూ, ఆ గార్డెన్స్ లో తెగ జంటలు కనపడేవి. మా రూమ్మేట్స్ కొద్ది మంది పొద్దున్నే లేచి జాగింగ్ కి వెళ్ళే వాళ్ళు కొంత మంది అమ్మాయిలు అదే టైం లో వాకింగ్ కెళ్తారని. పాపం ఒక్కడికీ వర్కవుట్ అవలా. నాకీ ప్రాబ్లంస్ ఉండేవి కాదు లెండి, మనల్ని పొద్దున్నే ఎవ్వడైనా లేపితే, లేపిన వాళ్ళు మసయి పోవాల్సిందే ఇప్పటికీ :-).

    ఇంకా రాయండి చదువుతాం. ఇంతకీ ఆ పైన ఈ మెయిల్ గొడవేంటి. సారీ, మీ బ్లాగు చూస్తూంటాను కాని, ప్రతి డిటేయిల్ ఫాలో అవలేదు.

    ReplyDelete
  5. "క్లుప్తంగా వ్రాసి పారేశా" వో మీ వూరిలో దీనిని క్లుప్తం గా అంటారా? ;-) i c

    ReplyDelete
  6. రవి, థేంక్ యూ,

    కల్పన గారూ, పేర్లు కొంచం మార్చి చెప్తా ..

    ఊర్మిలా, ఇందూ, భయశ్రీ, రవీణ, శ్రీ మిధ్య, మందిర మున్నగువారు ( "లా", "ణ" లలో అచ్చు తప్పులు లేవు)

    కుమార్ గారూ, కుమార్ గారూ నాలుగేళ్ళు నడిచిన దానిని నాలుగు ముక్కల్లో చెప్పాలంటే కష్టమే కదా

    ఇక మెయిల్ సంగతి,

    ఎవరో నన్ను స్త్రీ ద్వేషిగా ప్రచారం చెయ్యడానికి కంకణం కట్టుకున్నారు. కానివ్వండి. అది మనకే మంచింది. పురుషుల సపోర్ట్ అంటా మనకే. దీనికి కారణం ఓ ఏడాది క్రితం కొంతమందితో నా పోట్లాటలు, అంతకన్నా ఏమీ లేదు లేండి. వాళ్ళా మొహాలు నే చూడను , నా మొహం వాళ్ళూ చూడరు. ఇదంతా ఏదో ఏదో టైంపాస్ కి, అంతే!

    ReplyDelete
  7. ఔను భావనగారూ,

    మొత్తం వ్రాయాలంటే ఒక పేద్ద సీరియల్ ఔతుంది

    ReplyDelete
  8. Kalpana garu,

    If I think they were all associated with that brainless group AIDSO (Or was it AIDWA? Not sure)

    ReplyDelete
  9. స్క్రీన్ షాట్ ఏమో గానీ అసలీ యూనివర్సిటీ ఎపిసోడ్ అంతా ఇలా బ్లాగులో రాయడమేమిటి? రైట్స్, సినాప్సిస్ నాకిస్తే నేనో సీరియల్ రాసి ఉండేదాన్ని కదా! ప్రతి వారం పాఠకులు ఎదురు చూపులతో చచ్చేలా చేసుండచ్చు...అంత సస్పెన్సు, ఫన్,అన్నీ ఉన్నాయి దీంట్లో! వేస్టు చేసేశారు మొత్తం!

    అవునూ,కుమార్ అడిగినట్లు 20 మార్కుల కొశ్చెన్ కి ఎన్ని ఎడిషనల్స్ తీసుకునే వాళ్ళో?

    ReplyDelete
  10. LOl Sujatha garu

    You can still go ahead with the Serial. There are lots of things that I haven't revealed yet :))

    ReplyDelete
  11. My highest, in terms of additionals was 18 I think

    ReplyDelete
  12. అడిషనల్స్ సరే మార్కులు???
    :)))

    ReplyDelete
  13. హమ్మా-ఇదన్నమాట రౌడీగారి బాగ్రౌండ్-ఏదో సరదాకి రౌడీ అని పేరు పెట్టుకున్నారనుకున్నాను.ఐతే మీకు ఈ ప్రహసనాల్లో సంధ్య తో వాదించాలిసివచ్చిందా? ఇంతకుముందెప్పుడో మీ బ్లాగులోనే చదివిన గుర్తు సంధ్య గురుంచి.

    ReplyDelete
  14. LOL Jeevani, thats a Secret. Happy B'day by the way!


    Sunita garu yes. But more than face-to-face thing it was more of a poster war!

    ReplyDelete
  15. అరిటాకు ముల్లుమీద పడ్డా, ముల్లు అరిటాకుమీద పడ్డా, జనాలు తిట్టేది ముల్లునే కదా?

    hahahahahahahahahahahahaha :)))

    నేను ఏవరో అనుకోని ఏవరో నేను అనుకోని నేను ఏవరో ఒక్కరేనని అనుకున్నారంట....అందుకే నా బ్లాగు ల్లో ఏ బ్లాగరు దైర్యంగా కామేంట్ రాయలేక పోతున్నారంటా ..నేను ఆ mails రాసి న వారికి ఒక్కటే చేపుతున్నాను నా బ్లాగుకి అడవారి కామేంట్స్ కాని క్లిక్స్ కాని అవసరం లేదు..అందరు చదివి కామెంట్ లు రాసేంత గోప్ప వ్రతను కుడా కాను ఏదో తోక్కలో పోస్ట్ లు రాస్తుంటాను మా నాగా,శరత్, కార్తిక్ లాంటి వారు చదివి కామెంట్ రాస్తారు అది చాలు అంతే కాని అందరి కామేంట్ లు అహ ఒహో లు మనకు అవసరం లేదు...కాని ఒక్క విషయాం నాకు mails చేసింది అడవారైతే మాత్రం ....వారికి ఎంత పవర్ ఉన్నా పేరు ఉన్నా కుడా భయం లేదు..నేను చాలా ప్రర్సనల్ గా తీసుకున్నాను.నేను కేలకడానికి ఏన్ని దారులున్నా వేతికి మరి కేలుకుతా.అమ్మనా బుతులు తిట్టి ఐస్ పేడితే ఉరుకునే అంత అల్ ఫా గాడిని మాత్రం కాదు..ఏవరో ఏవరినో ఏదో ఏందుకో అంటే నా పేరుని బ్లాగు ని బైటికి లాగడం నాకో ఏక్కడో కాలింది...నాకు ఒపిక ఉన్నంత వరకు నేను వేతకడం మాత్రం అపను....నాకు ఏ అడవారితో శతృత్వం లేదు ఇక్కడ అలాగే వారి మంచితనము నాకు అవసరం లేదు.

    నేను పవన్ .......కత పవన్ కుమార్ నాయుడు అది తేలుసుకుంటే చాలు.

    ReplyDelete
  16. అడవారో మగవారో...నాకు ఏ సోరి పురి లు అవసరం లేదు...ఏటువంటి పరిస్ధితులలో లైట్ తిసుకునే సమస్య లేదు.....దయచేసి మీ వివరాలు మాత్రం నాకు తెలియజేయ వద్దు తేలుసుకోని ఉరుకునేంత మనస్సు నాకు లేదు...ఏవరో ఏదో అంటే నా పేరు మీద బ్లాగులు రాసి మైల్స్ చేసి...కామెంట్స్ రాసారు.. మీరనుకున్న వ్యక్తి నేను కాదు అని చాలా వివరంగా చేప్పాను.ఇప్పటి వరకు ఏవరు పికకుండ పోవచు అలాగని పికేవాడు లేడనుకోవద్దు.....
    కత పవన్

    ReplyDelete
  17. భయశ్రీ - ROTFL

    ReplyDelete
  18. @ పవన్
    నువ్వు కూడా తొడకొడుతున్నావన్నమాట. రౌడీకి కూడా అలాగే కొట్టుకొని కొట్టుకొని వాచిపోయింది :)

    ReplyDelete
  19. @ పవన్
    నువ్వు కూడా తొడకొడుతున్నావన్నమాట. రౌడీకి కూడా అలాగే కొట్టుకొని కొట్టుకొని వాచిపోయింది :)

    శరత్ గారు
    హ హ హ హ హ:))
    పోద్దున సిన్న ఏన్ టిఅర్ ఆది సినిమా చూసా ఇంతలో మలక్ గారి పోస్ట్ అవేశం లో అలా రాసా...మళ్ళి తోడ కోట్టమంటారా హిహిహిహి

    ReplyDelete
  20. హమ్మ రౌడీ నువ్వు సామన్యుడివి కావు నాయనోయ్.శానా చరిత్రుంది నీకు ఆహా...
    "A: Even the Sanitary Napkin says "GIVE ME REDDDDDDDDDDDDDDDDD" ... Eveready!!!"
    హ్హహ్హహ్హ అద్దిరంది తమ్ముడూ.

    ReplyDelete