Mar 5, 2010

ఇందుకే మనల్ని గొర్రెల మంద అన్నారు

మనవాళ్ళు ఉత్త వెధవాయిలోయి అన్నాడు గిరీశం . అయన అలా అన్నదానికి లక్ష తొంభై కారణాలు ఉన్నాయి . నాకూ కొని కారణాలు కనిపించాయి . వాటిల్లో ఒకటి మనోళ్ళ గొర్రె దాటు సామెత. సిరివెన్నెల గారు అన్నట్టు గొర్రెదాటు మందకి విజ్ఞాన బోధ దేనికి అని. అసలు కొన్ని విషయాలలో మన వాళ్ళ తొందర చిరాకు దొబ్బిస్తుంది.

అసలీ ఉపోద్ఘాతమంతా దేనికయ్య అంటే ఒకసారి ఒక పెద్దాయన ఏడో ధ్యాసలో ఉంది ఏదో అన్నాడు ... దానికి కాలిన ఒక పిల్లాడు తీవ్రంగా ప్రతిస్పందించాడు. అసలా కుర్రాడు ఎందుకు స్పందిన్చాడో .... ఏంటో కూడా తెలీకుండా మనోళ్ళు పొలోమంటూ వెళ్లి ...ఆ విధంగా నొక్కి వక్కాణించారు. తర్వాత సదరు పెద్దాయన అసలు విషయం అంతా వివరించాక .. అయ్యో నేను మీరనుకోలేదండి ..... అసలు విషయం తెలీక ఏదో జరిగింది అనుకున్నానండీ ..... అని దీర్ఘాలు తీశారు .

తాజాగా మళ్లీ ఒక చిన్న వివాదం .... ఒకరు కాస్త తీవ్రంగా తొందర పడ్డారు మళ్లీ మనోళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నొక్కి వక్కాణించడం లో తమ ప్రతిభ చూపారు. మళ్లీ రేపు క్షమాపణల పర్వం కొనసాగుతుంది లెండి. అది వేరే విషయం.

అసలు ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి మనం అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవడం మన బాధ్యత. తర్వాత విశ్లేషించుకుని మనిషిలా తగిన విధంగా స్పందించడం ధర్మం. కానీ ఇక్కడ జరుగుతునదేంటి ? పొలోమంటూ ఒకళ్ళ వెనక ఒకళ్ళు కక్కుర్తి పడే ముందు అసలు విషయం గమనించరా?

అసలు దేశంలో వంద రకాల సమస్యలు ఉన్నాయి ..... వాటిని అసలు పట్టించుకోని వారు ... వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వేలు పెట్టి .... కెలికి మళ్లా వేలు నలిగింది అని ఏడుస్తుంటే ...... చేతనైతే అది తప్పు అని చెప్పాలి ..... అంతే గాని ముందు వెనక చూడకుండా ఏక పక్షంగా నీది గోల్డ్ హార్ట్ అని , వాళ్ళకే మైండ్ స్వేల్లింగ్ అని , ఒకరైతే గీతలో శ్రీకృష్ణ పరమాత్మని బ్లాగుల్లోకి తెచ్చాడు . అసలు టాపిక్ అంతా సమాజ సేవ గురించే అయితే సదరు తోపులు నాకెక్కడా తగల్లేదే?

పెద్దలని గౌరవించడం చేతకాని వాడు నా దృష్టిలో ____________ తో సమానం . ఖాళీలు కామెంట్లలో మనోళ్ళు పూరించవలసిందిగా ప్రార్ధన.

21 comments:

  1. మొదటిది తెలుసు .. రెండొది లేటెస్ట్ ది ఎక్కడ ???

    ReplyDelete
  2. నాగా ని అడుగు మంచు మనోడు మొదటినుండి గోడ మేడ పిల్లిలా ఫాలో అవ్తున్నాడు

    ReplyDelete
  3. naakeam artham kaaleadu.. ideado mee mee discussion laa undi... konchem address links iste.. follow aitaa...

    ReplyDelete
  4. నాక్కూడా ఏమీ అర్ధం కాలేదు!

    ReplyDelete
  5. కూడలి లో ఈ పోస్టు దాటి పది టపా లు కిందికి 'యాత్ర' చేయండి

    ReplyDelete
  6. మాకు వయస్సు అంత ముఖ్యం కాదు, మనస్సు ముఖ్యం - ఎందుకంటే మేము గొర్రెలం కదా :))

    ReplyDelete
  7. నాకు తెలుసు కాని నేను చెప్పను. ఎందుకు అంటే రాజాం లొ నేను లోయలో లో జారి పొకుండా జలపాతం ఫొటో తీసినప్పుడు బకింగ్ హాం కాలువ గుండా వెళ్తున్న విమానం నుంచి మవో నాకు చెప్పాడు చెప్పొద్దు అని ...

    ReplyDelete
  8. (భుజాలు తడుముకుంటూ..) భగద్గీతా..!! ఈ పదం నేను రీసెంటుగా వాడినట్లు గుర్తు..కొంపదీసి రౌడీగారు తన కెలుకుడును నామీద ప్రయోగించలేదుకదా...

    ReplyDelete
  9. బాబోయ్, ఈ టపా వ్రాసింది నేను కాదు. శ్రీనివాస్. అసలు ఈ గొడవ గురించే నాకు తెలియదు.

    ReplyDelete
  10. @ ఆకాశరామన్న
    మిమ్మల్ని కాదండీ వికటకవి శ్రీనివాస్ అన్నది. పొలిమెట్ల గారిని అన్నారు.

    http://swapna-kalalaprapancham.blogspot.com/2010/03/blog-post.html

    ReplyDelete
  11. Nenu kaadu... mee group lo nenu lenu... asalu ee post chadivaaka.. chee manam antoo chadive vaarini kooDaa kalipeaSaaDani pistoandi... nuvvu gorre... nee taata muttaatala muttaatala kooda gorre le..

    ReplyDelete
  12. బ్లాగుల్లో జాతిద్రోహులతో జాగ్రత్త!

    http://panashaalaa.blogspot.com/2010/03/blog-post_05.html

    ReplyDelete
  13. @ నత్తి
    Welcome back to Paanashaala :)

    మీ బ్లాగులో వ్యాఖ్యలు వేయడానికి వీలు కావడం లేదు. ఒకసారి చూడండి.

    ReplyDelete
  14. శరత్ గారు,
    ఓహ్! నన్ను కాదన్న మాట. లంకె ఇచ్చి సందేహ నివృత్తి చేసినదుకు మీకు కృతఙ్ఞతలు, అనవసరంగా రౌడీ గారిని అనుమానించి నందుకు ఆయనకు క్షమాపనలు... :)

    ఏది ఏమైనా భుజాలు తడుముకునే రోగం మా చెడ్డది సుమీ..!!

    ReplyDelete
  15. Sharat gaaru, ippudu pani chestunnaayi chudandi

    Sutti Naresh

    ReplyDelete
  16. శ్రీనివాస్ గారు!
    మీ బ్లాగ్ లో సహాయ పౌండేషన్ గురించి చదివి ఆ ఏడుకొండల పైన ఉండాల్సిన శ్రీనివాసుడే మిమ్మల్ని పంపించి ఉంటాడనిపించేది .
    స్వప్న గారి లా ఉచిత సలహాలు మీకు కూడా ఇచ్చి చీవాట్లు వేయించుకోవాలని కాదు . కాని ఎవరో ఇద్దరి బ్లాగర్స్ మద్య వివాదన్ని మీరు పని కట్టుకొని వ్రాయటం నచ్చలేదు . ఈ మద్య మీ కెలుకుడు post లు చూస్తుంటే లేడీస్ మీద కోపం కనిపిస్తుంది . అలాగని నేను స్త్రీ వాదినో న్యాయ వాదినో అనుకోకండి .
    బహుసా ఇది మీ వ్యక్తిగతం అనుకోండి కాని మీ వ్యక్తిత్వానికి match అవడం లేదు నా దృష్టిలో..... అందుకే చెప్పాను మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు . . మీరు మంచితనంలో అబ్బాయిల కి ఆంధ్రా ఐడియల్ గానే కాదు బ్లాగర్స్ కి ఐడియల్ అవుతారని కోరుకుంటూ


    ఇట్లు మీ అభిమాని
    ఓ అమ్మాయి

    ReplyDelete
  17. నా అభిమాని ఓ అమ్మాయి గారు .. ఈ మధ్య నా కెలుకుడు పోస్ట్ లు అమ్మాయిల మీద కోపాన్ని చూపిస్తుందని చాలా మంది చెప్పారు . సో ఒకసారి నేను పునఃపరిశీలన జరుపుకుంటా .. ధన్యవాదాలు మీ సలహా కి.

    ReplyDelete
  18. DINGDONG .. Censorship activated .. Beep Beep Beep ...

    Four comments deleted!

    ReplyDelete
  19. >>abbbba nijamga gorantha kondantha chestaru ee aadavallu.

    ani ee post (http://swapna-kalalaprapancham.blogspot.com/2010/03/blog-post.html) lo swapna comment !

    ante mari tanu ???

    ReplyDelete
  20. >> ఒకసారి ఒక పెద్దాయన ఏడో ధ్యాసలో ఉంది ఏదో అన్నాడు ... దానికి కాలిన ఒక పిల్లాడు తీవ్రంగా ప్రతిస్పందించాడు.

    who's this ? can you plz give me about this event ?

    ReplyDelete
  21. can you plz give me *link abt this event ?

    ReplyDelete