పేరడీలు అందరూ రాస్తారు కానీ మన అన్నాయి పేరడీ రాస్తే ఎలా ఉంటుంది . అందులోనూ పానశాలకి రాస్తే ఇంకెలా ఉంటుంది ? అని వచ్చిన ఒక ఊహకి రూపం ఈ తవిక .
ఆమె కుమ్మేసిన రోజు
నా గాయాల్ని దాచేసుకున్నాను
ఆసుపత్రికికి పరిగెత్తాను
డాక్టర్ తో పాటు నర్సులకి ని కూడ చూపించాను
ఏసి లేని ఐసి (యు)లో ఒంటరిగా మిగిలాను
నా దగ్గర నాకే దుర్గంధం
అందంగా నా చేతికట్టు మీద "త్రాష్టుడా " అని వ్రాసాను
కట్టు కట్టిన కాంపౌండర్ ని వెదికి వెదికి " తుపుక్ " అన్నాను
ల్యాబ్ నుంచి జనరల్ వార్డ్ వరకూ చెప్పులులేకుండా నడిచాను
దారిలో పడి ఉన్న సెలైన్ సీసాలని తన్నుకున్నాను
టెస్టుల పేరుతో నా పర్సుని వచ్చినప్పుడే కాజేసిన వీళ్ళకి
ఇంకా ఏమి మింగే కోరికో?
లేదా,నిత్యరోగినైన నాలో పుట్టే రోగమో
నేనొక ఆరోగ్య దరిద్రుడిని -సమస్యే లేదు
ఇక ఆమేది, ఆమెని వదినగా ఊహించుకునేదేట్లా
ఆమె కుమ్మేసిన రోజు
నా గాయాల్ని దాచేసుకున్నాను
అసలు మీకు ఇలాంటి కేక పేరడీ లు ఎట్టా వస్తాయి బాబు..
ReplyDelete"లేదా,నిత్యరోగినైన నాలో పుట్టే రోగమో"
ఇది మాత్రం నిజం చెప్పారు.. :))
ఇంత talent ఈ బ్లాగ్లోకంలో waste అయిపోతోందేమో?
ReplyDeleteనాకు కొన్ని అనుమానాలు శ్రీనివాస్.
ReplyDelete1. ఎసి లేని ఐసియు కి ప్రాసెసర్ ఉంటుందా. అది కాలిపోతే ఎవరు రిపేర్ చేస్తారు ?
2.సెలైన్ సీసాలు ఎక్కడివి చైనావా.. అయితే వాటి మిద మావో ఆటోగ్రాఫ్ ఉంటుందా ?
౩.త్రాష్టుడా అన్న పదం భూస్వామ్య వర్గాలు తరుచుగా వాడేది కదా మరి ఆ హాస్పిటల్ పెట్టుబడి దారివర్గాల వారిదా?
సౌమ్య ఇక్కడికి వచ్చి వాఖ్య పెట్టలేదేమి
ReplyDelete:-) :-)
ReplyDeleteత్రాస్టుడా అనే పదము సాధారనముగా కొస్తా జిల్లాల బ్రాహ్మనులు వాదుతారు
ReplyDeleteఇది అక్కడ వేసిన కామెంట్.
ReplyDeleteఓపన్ మైండెడ్ నెస్ , నిజాయతీ వున్నవాడైతే ప్రచురిస్తాడని ఆశిద్దాం.
------
" హుందాగా సూర్యుడ్ని "మూర్ఖుడా" అని తిట్టాను
రంగుల లోకపు వైతాళికులకు వెతికివెతికి "థూ" అన్నాను
తూర్పునుండీ పడమరకు చెప్పులులేకుండా నడిచాను
దారిలో పడి ఉన్న కంకరరాళ్ళను మీద చల్లుకున్నాను "
ఆహా ఎంత అద్భుతంగా వుందండీ మీ కవిత! సూర్యుణ్ణి హుందాగా తిట్టడ మన్నారు, చూశారు... అది మీ అపార మేధో సంపత్తికి, తార్కాణం. ఆ సూర్యచంద్రతారార్కం మీ గొప్పతనం సూర్యుణి వెక్కిరిస్తూనే వుంటుంది. ఆ అవమాన భారంతో సూర్యుడలా దహించుకుపోతూనే వుంటాడు.
ఇక పోతే, ' చెప్పులు లేకుండా నడవడం ' - ఈ కాలంలో మీరు చెప్పుల్లేకుండా నడిచారంటే అది మీ నిరాడంబరతను సూచిస్తుంది. ఇంత గొప్పతనం మీలో వున్నా, మీ వినయం, విధేయత, హుందా తిట్టడం , వైతాళికులపై ' థూ' అని వుమ్మేయడం , ఆహా అద్భుతం, మహాద్భుతం! 'నభూతో న భవిష్యతి ' అంటే మీరు నమ్మాలి. మీరు నెట్టులోని మాణిక్యం అంటే అతిశయోక్తి కానే కాదు.:)
S gaaroo: ROFL !
ReplyDeleteMalak: You're awesome !
Hey its not me who posted it. It's Srinivas
ReplyDelete