Jun 21, 2009

బోడిబాబు లవ్వు కధ - రెండవభాగం - రచయిత్రి: కొరివిదెయ్యం

అలా పరిగెత్తిన చిత్రాంగి మల్లి, వాల్లింటికి వెళ్ళేదాక ఆపలేదు పరుగు. అది చూసిన బుర్ర మీసాలాయన "మళ్ళి ఆ "వాచీ మేను" కథ చెప్పినాడా అమ్మీ...ఎన్ని సార్లు జెప్పాల్నా నీకు ఆడిని ఇడ్సు అని...నువ్వు ఇంటేనా..." అని మండి పడ్డాడు. "నీకెన్ని సార్లు చెప్పాల నాయనా మన పని అయ్యెడి దాకా కాస్త ఓపిక పట్టాల...నీ మీద ఆన.. ఇట్లా స్క్రిప్టుల పేర్లతో నన్ను సంపుతున్నాడు ఇప్పుడు...నాకు అన్ని కలిసి వస్తే పగ తీర్చుకుంటా...అయ్యతోడు..వాడిని పొడుగ్గా నరుకుతా (****అమ్మ తోడు అడ్డం గా నరుకుటా అని అనేదేమో కాని జూనియర్ NTR already అనేసాడు కదా అని different గా dialogue ని, ఇలా మార్చిందన్న మాట*** )" అని కసిగా సమాధానం ఇచ్చిన చిత్రాంగిని , అమ్మ పక్షి నోట్లో పురుగుగుని పిల్ల పక్షి లాక్కుని తింటున్నప్పుడు పొంగి పోయే టైపులో , Diabetes వల్ల కంటిపొర వచ్చిన కళ్ళతో చూసుకు మురిసిపోయాడు ఆ ముసలాయన. ఇంతలో ఏదో గుర్తొచ్చిన దానిలా చిత్రాంగి " నాయనోయ్ కడుపులో తిప్పేసరికి పరిగెత్తుకు వచ్చినా గాని, కంప్యూటరు క్లాసు fees , నీ గంఠ సుట్టలకి డబ్బులు బోడి బాబుని అడగటం మర్చేపోతి ...ఇప్పుడే పట్టుకొస్తా ఉండు" అని బోడి బాబు ఇంటికి పయనమయ్యింది. రబ్బరు చెప్పుల అడుగులకి , రోడ్డు మీద కారుతున్న నీళ్ళు, వేసే అడుగులకి లయ గా , తెల్ల పాంటు నిండా ఆకాశం లో నక్షత్రాలకి మల్లే చిత్రాంగి వెనక భాగం అంతా పడ్డాయి ( పడ్డ నీళ్ళు మంచివా ?? మురుగువా అనే విషయం నాకు తెలీదు...పాఠకుల creativity కే వదిలేస్తున్న).అలా చక చకా నడిచి వెళ్ళిన చిత్రాంగి బోడి బాబు ఇంటి బయట అరుగుల మీద కూర్చుని చిన్న పిల్లల దగ్గర జీళ్లు లాక్కు తింటున్న రాములమ్మ తారసపడింది. (చెప్పటం మరిచా..బోడి బాబు చెల్లి పేరు రాములమ్మ...మన కథలో కీలక "బొచ్చెధారిణి"******అంటే అడుక్కునే వాడికి బొచ్చె ఎంత important ఓ ఈ కథకి రాములమ్మ అంత important అన్న మాట******)

చిత్రాంగిని చూస్తునే "ఏంటొదినా, గాడిదల మైదానం లో పాట విన్నాక కూడా వచ్చావు? ఏదైనా మర్చిపోయావా?? అయినా ఇవన్ని నాకెందుకు గాని మా బండోడు (బోడి బాబు ముద్దు పేరు అన్నమాట) వంటింట్లో రాళ్ళల్లో బియ్యం వేరుతున్నాడు వెళ్లు " అని గుక్క తిప్పుకోకుండా చెప్పి , చీమిడి ముక్కు పిల్లల దగ్గర జీళ్ళు లాక్కు తినటం లో మునిగిపోయింది. చిత్రాంగి కి జీళ్ళు చూసి నోరు ఊరినా, తనని తాను control చేసుకుని వచ్చిన పని జరగాలి అన్న పట్టుదలతో వంటింటి వైపు సాగింది. రాళ్ళల్లో నుండి బియ్యం శ్రద్దగా ఏరిపారేస్తున్న బోడి బాబు చిత్రాంగి అడుగుల సవ్వడికి తల పైకెత్తి ఆనందం గా బొగ్గు పెట్టి బాగా రుద్ది తెల్ల బడేసిన పళ్ళన్ని ఇకిళించి, " రా చిత్తూ..రా...ఇదిగో అలా ఆ గడ్డి మోపు మీద కూర్చో ...ఏం తీసుకుంటావు?? మజ్జిగా...మిల్కా??" అన్నాడు. "మీ ఇంట్లో మజ్జిగకి పులుపెక్కువ, మిల్కు లో నీళ్ళెక్కువ..అవేమి ఒద్దు గానీ...ఒక ముఖ్యమైన విషయం ఇందాక నీ పాట 'భీతి' లో చెప్పటం మరిచా...మరేమో ..మరేమో..." అని తడబడుతున్న చిత్రాంగిని.." చెప్పు చిత్తూ..చెప్పు..ఆగి పోయావే...నేనెప్పుడూ నీతో ఉండే ఫీలింగు వచ్చే లా నా చిరిగిన చొక్కా కావాలా...లేక నా చెమట తో తడిచిన నా కర్చీఫు కావాలా...మొహమాటం లేకుండా అడుగు" అన్నాడు. చిరాగ్గా ఒక్క చూపు చూసి చిత్రాంగి "ఇదిగో బోడి బాబు వింటున్నా కదా అని నీ కవితా పిచాచం పేరుతో అడ్డమైన చెత్త రాతలన్నీ నాపై ప్రయోగించకు....అలాంటిదేం లేదుగాని ఒవరాక్షను ఆపి నే చెప్పేది విను . నాకు అర్జంటుగా డబ్బులు కావాలి...రేపు కంప్యూటరు క్లాసుకి కట్టాలి ..మా నాన్న చుట్టలు కూడా అయిపోవస్తున్నాయి. వీటన్నింటికి డబ్బులిస్తే నే ఇంటికెల్లిపోతా" అన్నది ఓస్ అంతేనా...ఇదిగో వంట అవ్వం గానే అలా వెళ్ళి డబ్బులు పట్టుకొస్తా అని బోడి బాబు మాట పూర్తవ్వక ముందే చిత్రాంగి అనుమానం గా..."డబ్బులు పెద రెడ్డి ని అడిగి తెస్తావా" అని ఆరా తీసింది. "ఇలాంటి చిన్నా చితకా వాటికి పెద రెడ్డిని డబ్బులు అడగను . ఆయనకి body guard గా ఉండేది ఎన్నడైనా ఆయన్ని CM గా చూడాలన్న ఆశ తో. ఇక డబ్బులంటావా...దున్నపోతు మీద ఎక్కి ఆగకుండా నాలుగు రాత్రులు ఐదు పగల్లు స్వారీ చేస్తే వెయ్యి రూపాయలిస్తారంట (మగ మహారాజు సినిమాలో చిరంజీవి సైకిలు తొక్కినట్టన్నమాట). మా కొట్టం లో కాలిరిగిన దున్నపోతుని తీసుకెళ్ళి ఆ పోటీల్లో పాల్గొంట.నీ మీద నాకున్న ప్రేమ స్వచ్చమైనది , తప్పకునండా నేనే గెలుస్తా.. ఆ వచ్చే డబ్బులు సరిపోవని నాకు తెలుసు అందుకనే అదయ్యాక అటునుండి ఆసుపత్రికెళ్లి రక్తాన్ని డబ్బులకి దానం ఇచ్చి డబ్బులు తెస్తా".అన్నాడు. అనుమానం చిత్రాంగి కవలపిల్లలు గా పెరిగారు కాబట్టి మల్లి అనుమానం ముందుకి అడుగేసి, "రక్తమా?? దానమా ?? ఎవరిదీ?? నీ రక్తమా లేక దున్నపోతుదా?? " అని పలికేలా చేసింది. Alluminium బిందెలో కంకర రాళ్ళేసినట్టు బోడి బబు గట్టిగా నవ్వి."చిత్తూ..నువ్వు భలే చమత్కారివే...దున్నపోతు బ్లడ్డు ఇస్తే దానికే లవ్వు పాయిన్ట్లు వేస్తావని ఈ సారికి నా బ్లడ్డే ఇద్దామని అనుకుంటున్నా " అంటునే జేబులో ఉన్న పది రూపాయల కాగితం తీసి.." దీన్ని పట్టుకెల్లు ప్రస్తుతానికి ..నీకు ఒక బిర్యాని పొట్లం మీ నాన్నకి బీడీలు వస్తాయి...ఇవాలటికి వీటితో సరిపెట్టు..రేపటికి ఇంకేదైనా arrangement చేస్తాను. నా తేనె గుండే ( My sweet heart ).., ఇంక ఇంటికెల్లి నా గురించి కలలు కంటూ బబ్బో మల్లి పొద్దున్నే కంప్యూటరు క్లాసు కి వెళ్ళాలి.పద గుమ్మం దాకా దింపి వస్తా." అని చేతిలో ఉన్న చాటని పక్కన పెట్టి, కట్టుకున్న గళ్ళ లుంగీ సరిచేసుకుని చిత్రాంగి చేయి పట్టుకుని సాగనంపటానికి వచ్చాఢు.

వదిలేస్తే ఎక్కడ తుర్రుమంటుందో అన్నట్టుగా గట్టిగా బోడిబాబు చిత్రాంగి చేయి పట్టుకుంటే, ఇదో యెదవ గోల చెమటైనా తుడుచుకుని పట్టుకు చావడు అని మనసులో తిట్టుకుంటూ , ఈ శిక్ష ఇంకెన్నాల్లో దేవుడా అని అనుకుంటుంది చిత్రాంగి .లా చేతిలో చెయ్యేసుకుంటూ వస్తున్న అన్నా (కాబోయే) వదినని చూసిన రాములమ్మ మెలికలు తిరిగిపోయింది. అది చూసిన బోడిబాబు "రమ్మూ..ఈ ట్విస్టు డాన్సు వీధిలో చేయొద్దమ్మా. జనాలకి గుండెపోటొస్తుందని చెప్తున్నారు. ఇంక పిల్లల దగ్గర జీల్లు తిన్నది చాలు.మీ వదినకి bye bye చెప్పాలి గాని నువ్వింట్లోకెల్లి టీవీలో 'కన్నీళ్ళమయం' సీరియలు చూసుకో " అని తరిమేసాడు. గాల్లో చేయి ఊపడానికి చిత్రాంగి చేయిని బోడిబాబువదిలిందే అదనుగా... వెనక్కి తిరిగి చూడకుండా చిత్రాంగి దౌడే దౌడు. చేయ్యి గట్టిగా ఊపితే , చిత్తూ పై ప్రేమతో ధ్వని సంకేతాలు పుట్టి (మన హీరోకి creativity ఎక్కువ కదా అందుకని) వెనక్కి తిరిగి చూస్తుందేమో అని , జారిపోయిన లుంగీని కూడా లెక్కచెయకుండా, ఆశగా ఊపుతున్నాడు. లుంగీ కిందకి జారి expose అయిన బోడిబాబు కాళ్ళని అక్కడే తిరుగుతున్న వీధి కుక్క ఒకటి Current పోలనుకుని కాలెత్తి తన పని కానించేసుకున్నాక గాని, ఆ తడికి ఈ లోకం లో పడలేదు బోడి బాబు. లుంగి సర్దుకుని, చేయవలసిన పనులన్నీ ఒక్కోటి మెదడులోనె లిస్టు వేసుకుంటు ఇంట్లోకి వెల్లాడు. ఇంట్లో వాళ్ళకి దున్నపోతు పోటీ విషయం చెబితే ఫీలవుతారని, అలాగని చెప్పకపోతే పబ్లిసిటీ ఉండదని...ఇప్పుడెలా?? ఎంచేద్దాం?? లాంటి ఆలోచనలతో కాసేపు ఉడికిన పప్పుని, సగానికి విరిగిన పప్పు గుత్తి తో రుద్ది , పందెం విషయం రమ్మూ కి చెప్పాడు. విషయం విన్న రమ్మూ చెమ్మగిల్లిన కళ్ళతో ( అంటే టనను టాను చెంపమీద గిల్లుకుని ఇదే చెమ్మగిల్లఠం అంటే అనుకున్నదన్నమాట) అన్నా నువ్వు మనిషివి కాదు...వదిన పాలిట కల్పవృక్షానివి నీ డెషన్ ( రమ్మూ భాషలో Decision అని అర్ధం) ఏదైనా, నీ వెన్నంటి మేముంటాం అని encourage చేసింది

ఎన్నడూ లేనిది, రమ్మూ పొద్దుటే లేచి పూజ గది శుభ్రం చేసి, బోడి బాబు కి ఎడురెల్లి హారతి పళ్ళెం తో నిలబడింది.
"ఆ దైవమే నా అన్నగా...ఈ దీపమే నీకొసమే..నువు గెలిచే రావాలని "
అని ఆవేశం గా పాట ఎత్తుకుంది. పాట విన్న బోడి బాబు కళ్ళెంబఢి మునిసిపాలిటీ కుళాయి నుండి పడ్డట్టు మూడు పేద్ద కన్నీటి చుక్కలు బొట బొటా జారాయి. "అదేంటిరా బండోడా...పొగకి తట్టుకోలేక ఏడుస్తున్నావా?? ఏం చేయను హారతి కి కర్పూరం కనిపించలేదు అందుకని పిడక ముక్క పెట్టా, అందుకే ఇలా పొగ సూరింది." అని నొచ్చుకున్నది. మాట పూర్తయ్యే లోపే బోడి బాబు " రమ్మూ...కర్పూరం తో హారతా లేక పిఢకతోనా కాడమ్మా ముఖ్యం , నీ ప్రేమ నన్ను ఎక్కడికో తీసుకెల్లి పడేసింది. అన్నింటికన్నా, కర్పూరం బదులు పిడక వాడాలన్న నీ సమయస్ఫూర్తి నచ్చింది. ఇక నువ్వు ఎదురొస్తే నే పందానికి వెళ్ళొస్తానమ్మా" అన్నాడు. ఆ మాటతో రమ్మూ....సినిమా చెల్లి లాగా..బోడి బాబు కాళ్లకి వంగి నమస్కారం చేసి, " అన్నా...నువ్వు తప్పకుండా గెలుస్తావు...నేను పొద్దున లేచి చేసిన ఈ పూజ వ్యర్దం అయిపోదు. ధైర్యంగా వెళ్ళు రా బండోడా..దున్నపోతు ఎక్కి ఆ పందెం గెలిచి రా. వాల్లు నీకు బహుమతిగా ఇచ్చిన డబ్బు వదినకి , దున్నపోతు మెడలొ వేసిన రిబ్బను దండలు నా జెడలకి తీసుకు రా. మా గురించి నువ్వు worry అవ్వొద్దు నువ్వొచ్చేదాకా అన్న పానీయాలన్నీ పక్కింటినుండి తెచ్చుకు తింటాం" . అని దైర్యం చెప్పి సాగనంపింది . ఆ మాత్రం encouragement ఉంటే చాలన్నట్టు ఒంటి కాలు దున్నపోతుని ఎక్కి ..రంగ..సారీ ...రణస్థలానికి చేరుకున్నాడు బోడి బాబు. పోటీలకి రిజిస్ట్రేషను గట్రా కానించి, జేబులోనుండి ఒక క్యాసెట్టు తీసి పక్కనున్నTape recorder లో వేసుకున్నాడు. ఎవరిమీదా ఆధారపడే మనస్థత్వం కాదు , అన్నీ నేనే చేసుకుంటాను/చూసుకుంటాను అందుకనే తానే స్వయం గా రాసి పాడుకున్నాడు కూడా. ఇదే self encouragement అంటే.
********************************************************************************************

ఈ దారి మట్టి దారి
చెసెయ్యి దున్న స్వారీ
చిత్రాంగి పీసుకే ఎక్కెయ్యి దున్నపోతు
నువ్వు ఎక్కి తొక్కెయ్యి దున్నపోతు

దున్ననే కారుగా...దాని కొమ్ములె స్టీరింగుగా
ముందుకే సాగించు నీ దున్న రథం
గుంటలెన్ని ఉన్నా..దాటుతుంది నీ దున్నా
దున్న రేసుల గెలుపే దీక్షగా సాగిపొమ్ము ముందు ముందుకి.....


ఇలా సాగుతున్న పాట విని చుట్టూ మూగిన ఓ పదిమంది జనాలు కూడా చెల్లా చెదురైపోయారు.
****************************************************************************************************

రచయిత్రి మాట : నేను టైపు చేస్తుంటే నా వెనకనుండి కథ చదివిన వాళ్ళల్లో ఒకళ్ళు ఫిట్స్ వచ్చినట్టు గిల గిలా కొట్టుకుంటున్నారు...చేతికి తాళం చెవి గుత్తి అందించి మల్లి వచ్చే వారం మిగితాది పోస్టుతా...అంతవరకి "కెలవ్"

No comments:

Post a Comment