Jun 14, 2009

బోడిబాబు లవ్వు కధ - మొదటిభాగం - రచయిత్రి: కొరివిదెయ్యం

మా ప్రమాదవనం/కేబ్లాస కొత్త సభ్యురాలు కొరివిదయ్యంగారి కొంగ్రొత్త సీరియల్ ఇది.


-------------------------------------------------------------------------------------

ప్రేక్షక మహానుభావులందరికి కెలికి మరీ కెలికాస్కారమ్, అంటే కెలుకుఢు బ్లాగు కదండీ అందుకని నమస్కారం బదులు కెలికాస్కారం. ఈ బ్లాగులొ బ్లాగే వాళ్ళకి బొత్తిగా సెంటిమెంట్లు లేవు అన్నింటిని హాస్యాదృక్పథంతో చూస్తారు, అన్ని వ్యంగ్యాలే etc etc ... అన్న పుకార్లు వినిపించాయి. మేము అప్పుడప్పుడు చెప్పుకోలేని పరిస్థితులకి బలి అయిన వాళ్లమే అనడానికి పెద్ద ఉదాహరణ ఈ కధే.
ఈ కథ, కథనం పోస్టు చదివే వాళ్ళందరికి నాది ఒక ముందు మాట. దీన్ని మీరు ఖబఢ్దార్, జాగ్రత్త అన్న సూచనగా భావించినా ఫరవాలేదు. ఈ కథ ఒక యదార్ధ సంఘటన అని నాకు చెవుల్లోనుండి రక్తాలు వచ్చేలా చెప్పబడిన కథ. అంతలా రక్తాలు వస్తుంటే ఎలా విన్నారబ్బా అన్న అనుమానం రావటం సహజం ఎవరికైనా. ఏం చెప్పమంటారు నా కష్టాలు, అలనాటి భట్టి విక్రమార్కుడిని రోల్ మోడల్గా చేసుకుని, ఒక చేత్తో చెవులెంబడి కారుతున్న రక్తం తుడుచుకొమ్మని దూది ఇచ్చి, మరో చేత్తో పారిపోకుండా పట్టుకుని కూర్చోబెట్టి చెప్పారు. మనం నేర్చుకున్న జీవిత పాఠాలు పది మందికి చెబితే, కనీసం నలుగురికైనా కనువిప్పు కలుగుతున్దన్న ఆశతో ఇక్కడ పోస్టు చేస్తున్నాను. కథలో కొన్ని కల్పితాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ , కథ మూలాధారం, పాత్రలు, వర్ణించిన సన్నివేశాలు అన్నీ నిజాలే.
ఇక ఈ కథ చదివాక మీ కళ్లెంబడి రక్తాలు వస్తే నాది కాదు బాధ్యత అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. తీసుకోవలసిన జాగ్రత్తలు, పెట్టవలసిన డిస్క్లెయిమర్లు అన్నీ పూర్తయ్యాయి. చివరాఖరిగా పక్కన టించరు, అయోడిను, దూది, ఎమర్జెన్సీ 108 ఫొను నంబర్లు పక్కనే అందుబాటులో పెట్టుకుని కథ చదవటం మొదలు పెట్టండి.


మన కథకి హీరో బడాయి బోడి బాబు. యద్దనపూడి సులొచనరాణి వర్ణించినట్టు రింగుల జుట్టు, ఒడ్డు పొడవు ఉన్న హీరోలా కాకుండా సదరు కుటుంబానికి చెందిన శీను, వెంకి, సుబ్బారావు, రవి, రాము లాంటి యువకుడు ఈ బడాయి బోడి బాబు.(యువకుడు అంటున్నారు మరి వయసో?? అని అడక్కంఢి ..ఎంతో కొంత మీరే వేసుకోండి. అయినా ప్రేమించటానికి వయసుతో ప్రమేయం లేదని "చీనీ కం " సినిమాలో అమితాబచ్చను చెప్పకనే చెప్పారు కదా !! ). చూపులకి ఎలా ఉన్నా బడాయి బాబు తల్లో పేనులా, సోఫాలో నల్లిలా, చెక్కర డబ్బాలో చీమలా కుటుంబం లో అందరికి పంట తెగులుకి వేసే నువాక్రానులా చేదోడు వాదోడుగా ఉంటాడు. అన్ని కథల్లో ఉన్నట్టు మన బడాయి బాబుకి ఒక అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, ముఖ్యంగా అన్నయ్య అనురాగం సినిమా లో విజయనిర్మల ఓవరాక్షను మరిపించే చిట్టి చెల్లి ఉన్నారు. అమ్మకి వంటింట్లొ వంట నుండి దొడ్డి లో పాడి ఆవుల పెంట తీసే దాకా అన్ని పనుల్లో ఒక చేయి ,ఒక కాలు వేయాల్సిందే మన హీరో. అదే dedication తో అన్నయ్యకి సైకిలు చెయిను వేసి రచ్చబండలొ సొల్లెసుకొవటానికి పంపించి , తమ్ముడి చారల చొక్క, గళ్ళ పంట్లాం ఇస్త్రీ చేసి దగ్గరుండి వేయిస్తాఢు. ఇది సరిపోదన్నట్టు కాళ్ళకి తొడుక్కున్న కొత్త జోళ్లు అరిగిపోతాయేమోనని తమ్ముడిని భుజాలనెత్తుకుని రోజు 5kms నడిచెళ్ళి కాలేజీ లొ దింపి వస్తాడు. ఓహో... అయితే బడాయి బాబు వాళ్ళ నాన్న ఇంక చెల్లి మాత్రమే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారన్నమాట... అన్న conclusion కి అప్పుడే వచ్చెయ్యకండి.


వాళ్ళు ఇప్పటిదాకా మీరు చదివిన అమ్మా అన్నా తమ్ముడి పాత్రల లాగా బడాయి బాబుని బాగానే వాడుకుంటారు. ఇంటిపని వంట పని పూర్తి చేసుకున్నాక వాళ్ల నాన్న భుజానికి తుండు ఇచ్చి పొలానికి తీసుకెళ్తాడు. అక్కడ సమ్మగా నీడనిచ్చే ఒక తాటి చెట్టు కింద ఒక బెడ్ షీటు వేసి కల్లు కుండ చేతికిచ్చి బబ్బోపెడతాడు. వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పనికి రాని దుక్కి దున్ని రాళ్ళల్లో బియ్యం చెట్లు మొలిపిస్తానని ప్రతిజ్ఞ చేసాడు.ఊరి పంచాయితీ ముందు నోరు జారిన నాన్న పరువు కాపాడే ప్రయత్నం లో భాగం గా నాగలికి ఒక వైపు కాడెని తన మెడకి వేసుకుని, ఇంకో వైపు కాలికి గాయం అయిన దున్నపోతు మెడలో వేసి రోజు కనీసం నాలుగు వరసలైనా దున్నుతాడు. ఇంకా దున్నేవాడేమో గాని, ఎండకి గ్లామరు తగ్గుతుందన్న భయం తో ఆపేసి మధ్యానం పన్నెండింటికి నిద్దర లేచే చిట్టి చెల్లి గుర్తొచ్చి హడావిడిగా ఇంటికి పరిగెత్తాడు.

బోడి బాబు ఇంటికి చేరే దాకా కూఢ నులక మంచం లో గుర్రు పెట్టి పడుకున్న చెల్లిని ఒక సారి తనివితీరా చూసుకుని, మధ్యానం మండుటెండ కి ముఖం కందిపోతుందని కంబళి కప్పి పెరట్లోకి దౌడే దౌడు. ఆ దౌడుకి మీరు ఊహించే కారణాలేవి కావండీ బాబు. గన్నేరు పూల కోసం !!!!. పాండవ వనవాసం సినిమాలో సావిత్రి ఒక్కో పువ్వుని సుకుమారం గా కోసినట్టు , ఒక్కో గన్నేరు పువ్వుని కోసి పూల మాల కట్టి అవి రోజు పెట్టినట్టే ఆవిడ పడుకున్న నులక మంచం మీద ఒక మూలకి, పూలల్లో పురుగులు కుట్టకుండా జాగ్రత్తగా పెట్టి, హమ్మయ్య ఇవ్వళ్టికి చేయవలసిన ఇంటిపనులన్నీ పూర్తయ్యాయని ఆనందంగా గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి వంటింటి వైపు కదిలి వెళతాడు. మళ్ళీ దేనికో అనుకోకండి, గుక్కెడు కాఫీ నీళ్ళ కోసం. ఇది మన హీరో దినచర్య అన్నమాట. ఇక కథలోకి....


పాలు, చెక్కర లేని నీళ్ళ కాఫీ గ్లాసుని ( పాలు,చెక్కర లేవా?? ఎందుకని అడక్కండి. ఇంటి వాళ్ళ కోసం త్యాగం అన్నమాట ) తీసుకుని పెరట్లో ఎక్కడా చోటు లేనట్టు కుడితి తొట్టి పక్కన కూర్చుని పక్కనే గడ్డి నెమరేస్తున్న గేదెని చూస్తూ, నెమరేసే మెచనిస్మ్ గురించి అలోచిస్తున్న బోడి బాబుకి హఠాత్తుగా చింతలవాడ చిత్రాంగి గుర్తొచ్చింది. అసలే బాల్య వివాహం లాగా "బాల్య లవ్వు", అందులో తను సినిమాలకి స్క్రిప్టుల పేరుతో రాసే చెత్త కథలన్నీ ఓపిగ్గా వింటున్నట్టు నటిస్తుందాయే. తనకే కోపం వస్తే , అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా?? ఇక ఆలస్యం చేయకుండా కోడి జుట్టుకి ఇంత ఆముదం పట్టించి, పళ్ళు విరిగిన దువ్వెనతో బరా బరా బరికేసి , పదేళ్ల క్రితం ఊరి సాయబు దగ్గర కొన్న "డుబై సెంటు" ముక్కు మూసుకుని పసా పసా ఒళ్ళంతా కొట్టేసుకుని బుగ్గన దిష్ఠి చుక్క పెట్టుకుని బయలుడేరాడు. వరండా లో స్టాండు లేని తుప్పు పట్టిన డొక్కు సైకిలు ఎక్కి, సందులు, గొందులు, అడ్డొస్తున్న పందులని లెక్క చేయకుండా చిత్రాంగి ఇంటికి దూసుకెళ్లాడు. అలా వెళ్తున్నవాడు ఒక ఇటుక రాయి మీద కాలు పెట్టి బ్రేకు లేని సైకిలుని ఒక ఇంటి ముండు ఆపాడు. సైకిలు బెల్లుని "ట్రింగు ట్రింగుమని" రెండు సార్లు మోగించే లోపే ఇంటిముందు కూర్చున్న బుర్ర మీసాలాయన 'అమ్మీ ..సిత్రాంగీ ...మన పెద రెడ్డి కాడ పగటేల పని జేసే వాచీ మాను వచ్చిండు...తొందరగా రామ్మీ...ఏమ్ గావాల్నో సూడు " అని కేకేసాడు .పిలుపు విన్న వెంఠనే ఒక కరెంటు పోలు లా పొడవుగా ఉన్న అమ్మాయి జీన్సు పాంటు, బాయి కట్టు క్రాఫుతో కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమనిపించుకుంటూవచ్చింది. వస్తునే " నీకెన్ని సార్లు చెప్పాలి నాన్నా. ఆయన పెద రెడ్డి కి జీతం భత్యం లేని బాడీ గార్డు...వాచీ మాను కాదు. పెద రెడ్డి ఎన్నటికైనా ఛం అవుతారంట. టీ గ్లాసులో పడ్డ ఈగ లాగా మరీ తీసి పారెయ్యకు." అని బడాయి బాబు వంక చూసింది. బడాయి బాబు ఉక్రోషం తొ పిడికిలి బిగించి పక్కనే జారి పోతున్న నిక్కరుని ఎగేసుకుంటా క్రికెట్టు ఆడుకుంటున్న కుర్ర వెధవని పట్టుకుని బాదేస్తున్నాడు. "చెప్పాగా బాబూ నువ్వు గార్డువి వాచీ పెట్టుకున్నంత మాత్రాన "వాచీ మాను" వి కాదని మా నాన్నకి ఇంక కోపం తగ్గించుకో. ఆ పిల్లాఢు నీ చేయి కరిచి పారిపోకముందే వాడిని బాదటం ఆపి వదిలెయ్యి" అన్నది చిత్రాంగి. రెట్టింపు కోపంతో బడాయి బాబు "ఐ డోంట్ కేర్, నాకు జనాలతో పని లేదు. కాని నువ్వు ఇలా జార్జు బుష్ లా ఒకే మాట ఎన్ని సార్లు చెప్పినా అర్దం చేసుకోవెందుకు? మనం లవర్స్సుమి. నేను ఐదు సార్లు బెల్లు కొట్టాక బయటికి రావాలి నువు. ఇది మన లవ్వు కోడు. పో ఇంట్లోకి, నేను మళ్ళీ బెల్లు కొట్టాక రా" అన్నాడు. "కోడా , కోడి పెంటా. నువ్వు కొట్టుకొచ్చిన సెంటు వాసనకి కాలనీలో పందుల గుంపు దూరిందని చుట్టుపక్కన వాల్లంతా కర్రలు పట్టుకుని వచ్చారు. ఇక్కడి నుండి బయట పడకపోతే నీ తుప్పట్టిన సైకిలు సువ్వలకే నిన్ను కట్టేసి కొడతారు ..పద పద " అని చిరాగ్గా అన్నా మన హీరో కి ఇంకోలా అర్థం అయ్యి డాబర్ ఆమ్లా ఆయిలు రాసుకున్న చిత్రాంగి గుండు పైన నిమిరి "ఠత్స్ వ్హ్య్స్ ఈ లికెస్ యౌ సొ మచ్చ్... నా మీద నీకెందుకమ్మా అంత ప్రేమ"అని అక్కడ నుండి బయలుదేరారు ఇద్దరు. అలా నడుస్తూ ఇద్దరు ఊరవతల గాడిదలని కాసే కంచె దగ్గరికి చేరారు. జేబులో మడతలు పెట్టిన చిన్న కాయితమ్ ముక్క తీసి, ఇదిగో "చిత్తూ నీ ప్రేరణతో ఒక కొత్త సినిమా కథ రాసాను. తెలుగు సినిమా అయినా వెరైటీగా ఇంగ్లీషులో ఉంటాయి పాటలన్నీ. పూర్తి కథ వినిపించను గాని సాంపిలుగా ఈ డ్యూయెట్టు పాట పాడి మరీ వినిపిస్తా విను.

*****************************************************************

if you are in front of meeee

am looking at you like thaaaat

jivvu sound making heartooooooo

rivvu sound making ageoooooooo
marigold flower you looks like

kissess flowing and going

like deer kid "chengu..chengu" you making silly signs

cold cold way you send fire

slowly slowly you twine

on the cheek with nail corner

my shame stacks you steal
tender tenderly you smile

not there wishes you sprinkle

threading words medicine throwing you push me into drugs



పాట పూర్తయ్యాక చూస్తే వాళ్ళిద్దరి చుట్టూ గాడిదలు భయంతో పెద్దగా గాండ్రిస్తూ లక్ష్యం, మార్గం తెలియకుండా అయోమయంగా పరిగెడుతున్నాయి. బడాయి బాబు పక్కనే కూర్చున్న చిత్రాంగి కడుపులో తిప్పేస్తుంది. ఇప్పుడే వస్తా ఆగు అని వచ్చిన దారెంట పరిగెత్తటమ్ మొదలు పెట్టింది.

******************************************************************

మరి ఆ చిత్రాంగి ఎటెళ్ళిందో?? ఎందుకెళ్ళిన్దో?? అసలు తిరిగి మళ్ళీ వస్తుందా?? లాంటి రొటీను అనుమానాలు మీకు రావు. అయినా కూడ మేము టీవీ సీరియళ్ళు తీసే సుమన్ inspiration

తో , మీరు టెన్షను పడుతున్నారని ఊహించేసుకుని మళ్ళీ వచ్చే వారం కథని చొంతినుఎ చేస్తాం... అంతవరకి "కెలవ్" (శెలవ్ కి కెలుకుడు బ్లాగర్ల పర్యాయ పదం)

******************************************************************

To all those whose mind went into a zombie mode and couldnt guess the actual song...here is the original version of the song :

(((ORIGINAL SONG)))


నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

జివ్వు మంటుంది మనసు రివ్వుమంటుంది వయసు

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

జివ్వు మంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు

ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు

జింక పిల్లలా చెంగు చెంగు మని చిలిపి సైగలే చేసేవు

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

జివ్వు మంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
చల్లచల్లగ రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు

చల్లచల్లగ రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు

బుగ్గపైన కొనగోట మేటి నా సిగ్గు దొంతరౌ దోచేవు

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

జివ్వు మంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
లేతలేతగా నవ్వేవు లేని కోరికలు రువ్వేవు

లేతలేతగా నవ్వేవు లేని కోరికలు రువ్వేవు

మాటలల్లి మరు మందు జల్లి నను మత్తులోనె పడవేసేవు

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

జివ్వు మంటుంది మనసు రివ్వుమంటుంది వయసు

****************************************************************



(To be continued)

14 comments:

  1. హ.. హ.. హ..
    మళ్లీ మొదలయ్యిందీ...

    క్రొంగొత్త కాదు, కొంగ్రొత్త అని ఉండాలనుకుంటా??

    ReplyDelete
  2. oops corrected it ...

    ఇంతకీ ఏం మొదలయ్యింది?

    ReplyDelete
  3. అదే, మీ కొంగ్రొత్త సీరియల్.
    ఇందులో ఎవరిని కెలుకుతున్నారు?

    ReplyDelete
  4. అయ్యో ఈ ఎపిసోడ్ నాది కాదు - కొరివిదెయ్యానిది. ఎవరు కెలకబడుతున్నారో నాకయితే ఇంకా అర్ధం కాలేదు. ఒక రెండు మూడు ఎపిసోడ్లు చూశాక తెలుస్తుందేమో?

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. http://www.blogger.com/profile/00257566672091322114

    ReplyDelete
  7. హా...హా... హా...
    బాగుంది... మీ కొరివిదెయ్యం.

    ReplyDelete
  8. మన కథకి హీరో బడాయి బోడి బాబు. యద్దనపూడి సులొచనరాణి వర్ణించినట్టు రింగుల జుట్టు, ఒడ్డు పొడవు ఉన్న హీరోలా కాకుండా సదరు కుటుంబానికి చెందిన శీను, వెంకి, సుబ్బారావు, రవి, రాము లాంటి యువకుడు ఈ బడాయి బోడి బాబు
    -------------------------------------

    yemidi Sadaru yuvakulandaru Cnu lena :x grrrrrrrrr

    ReplyDelete
  9. మొదటి భాగం నవ్వులమయం....

    ReplyDelete
  10. "బడాయి బాబు తల్లో పేనులా, సోఫాలో నల్లిలా, చెక్కర డబ్బాలో చీమలా కుటుంబం లో అందరికి పంట తెగులుకి వేసే నువాక్రానులా చేదోడు వాదోడుగా ఉంటాడు."

    ఇక పాట సంగతి అడగొద్దు..
    "cold cold way you send fire
    slowly slowly you twine....."

    :)))))

    రౌడీ గారు, తరువాతి భాగం వీలైనంత త్వరలో పోస్టమని కాస్త మీ కొరివి దెయ్యానికి చెప్పండి.. ప్లీజ్ :-)

    ReplyDelete
  11. "బడాయి బాబు తల్లో పేనులా, సోఫాలో నల్లిలా, చెక్కర డబ్బాలో చీమలా కుటుంబం లో అందరికి పంట తెగులుకి వేసే నువాక్రానులా చేదోడు వాదోడుగా ఉంటాడు."

    ఇక పాట సంగతి అడగొద్దు..
    "cold cold way you send fire
    slowly slowly you twine....."

    :)))))

    రౌడీ గారు, తరువాతి భాగం వీలైనంత త్వరలో పోస్టమని కాస్త మీ కొరివి దెయ్యానికి చెప్పండి.. ప్లీజ్ :-)

    ReplyDelete
  12. "కెలవ్" (శెలవ్ కి కెలుకుడు బ్లాగర్ల పర్యాయ పదం)

    LOL! "కెద్దిరింది" :)

    ReplyDelete
  13. అయ్యబాబోయ్ ఒక్క టపా లో ఎన్ని సినిమాలను గుర్తు చేసేరో... ఇంతకి చెవి నుంచి రక్తం కారటం తగ్గిందా? :-) :-)

    ReplyDelete