(కౌరవ సభ)
దుర్యోధనుడు: పరలోకవాసులారా! రండి, సుస్వాగతం - ఆశీనులుకండి
అమర్: పరలోకం అంటాడేమిటండీ?
రెహ్మాన్: టైం మెషీన్ అంటే అర్ధం కాదని నేనేఅలా చెప్పమని ద్వారం దగ్గర భటులతో చెప్పా
ఒబామా: కృతజ్ఞులము
ఆంథోనీ: దుర్యోధనుడేమిటండీ చాలా హుందాగా ఉన్నాడు. మన ఎంటీఆర్‌లా హెంతమాఠ, క్షత్రీయ పరీక్ష అంటూ ఓవరేక్టింగ్ చెయ్యకుండా?
రెహ్మాన్: అయ్యా ఈయన అసలు దుర్యోధనుడు, పావలాకి రెండురూపాయల నటన చేసే తెలుగు నటుడు కాదు. మీ సందేహాలని కాస్త మీతోనే కాసేపు అట్టేబెట్టుకోండి ప్లీజ్!
దుర్యోధనుడు: యుధ్ధము భీకరముగా సాగుచున్నది. కౌరవులు హతులగుచున్నారు. ఏమిచెయ్యవలెనో తెలియట్లేదు. మీరెమన్న సలహా ఇవ్వగలరా?
ఒబామా (స్వగతం): సరిపోయింది. వీల్లదగ్గర నేనేదో నేర్చుకుందామని వస్తే, వీళ్ళే నన్ను సలహా అడుగుతున్నారేమిటి?
(బయటకు): తప్పకుండా సుయోధనా. కానీ దానికన్నా ముందు మీరు మాకు ఈ యుధ్ధం గురించిన విషయాలను ఎత్తులను సంపూర్ణంగా వివరించాలి.
సుయోధనుడు: తప్పకుండ. శకుని మామా! మొదలు పెట్టండి
(శకుని భారతాన్ని మొత్తం వివరిస్తాడు)
ఒబామా: (స్వగతం) అమ్మో! ఇన్ని ఎత్తులూ జిత్తులూ ఉన్నాయా దీనిలో. వెనక్కి వెళ్ళిన వెంటనే ఒసామా ని చిత్తుచెయ్యడానికి సరిపోయే ట్రిక్కులివి
(బయటకు): అంతా బాగానే ఉంది గానీ శకునిగారూ, ఇటువైపు వందమంది ఎందుకున్నారో అర్థం కావట్లేదు
శకుని: ఏం? అయిదుగురి కన్నా వంద మంది బలవంతులు కారా?
ఒబామా: కానేకారు. దీనికోసం మీరు మా కాలాంలో .. క్షమించాలి .. మా లోకంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఇంకా ప్రాసెస్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలి.
శకుని: అలాగా? చెప్పండి.
ఒబామా: మా మొదటిసూత్రం. అయిదుగురు వ్రాయాల్సిన ప్రోగ్రేములో ...
రెహ్మాన్: ఒబామా గారు! మామూలు భాష .. మామూలు భాష!
ఒబామా: సరే! అయిదుగురు చెయ్యాల్సిన పనిని Yఆభై మందికి అప్పగిస్తే పని తొందరగా జరగడం మాట అటుంచి అసలు పనే జరగకపోవచ్చు అని సూత్రం
శకుని: ఎందుకలా?
ఒబామా: మిగతా నలభై అయిదుగురు పని నేర్చుకుని, అర్ధం చేసుకుని మిగాతావారికి సహకరించేలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.
శకుని (అలోచిస్తు): నిజమే!
ఒబామా: అలాగే మీ సైన్యం పడుతున్న ప్రయాసలో వ్యర్ధాన్ని అరికట్టాలి
శకుని: అదెలా?
ఒబామా: దీనికి మా లోకంలో సిక్స్ సిగ్మా అనే విరుగుడు వాడతాం.
శకుని: ఇదేదో బాగుంది - చెప్పండి.
ఒబామా: ఏమీలేదు శకునిగారూ! మీరు పదిమంది మంది సైనికులని మనిషికి రెండు చొప్పున ఇరవై రాళ్ళు మొయ్యమన్నారనుకోంది - అందులో అయిదుగురు ఒక రాయి చొప్పున మరో అయిదుగురు మూడు రాళ్ళ చొప్పునా మోశారనుకోండి - మీరేమంటారు?
శకుని: నా ఇరవైరాళ్ళూ నాకోచ్చేశాయిగా? సరాసరి మనిషికి రెండు
ఒబామా:కాని రిజల్టు వచ్చినా ప్రాసెస్ మటాష్ కదా?
శకుని: అంటే?
ఒబామా: క్షమించాలి. అలవాటుగా మా భాషలో మాట్లాడేశాను. మీకు కావాల్సిన పని ప్రస్తుతానికి జరిగిపోయింది సరే కానీ ఆ పదిమందిలో మీరు అనుకున్నట్టుగా ఎంతమంది సైనికులు పనిచేశారు?
శకుని (కాసేపు ఆలోచించి): అయిదుగురు ఎక్కువ, అయిదుగురు తక్కువ చేశారు. ఒక్కౠ చెప్పినట్టు చెయ్యలేదు
ఒబామా: అంతేకదా? రేపు ఖర్మకాలి మీరు మొదటి అయిదుగురిని రాళు మోసేపనిలో, మిగిలిన అయిదుగురినీ గుర్రాలని పరిగెత్తించే పనిలోను పెట్టారనుకోండి - మీకు ఇబ్బందే కదా?
శకుని: అవును సుమీ! నాకు తట్టనేలేదు
ఒబామా: ఎందుకంటే మీరు తీసుకునే సరాసరి లెక్కలు నిజాని కప్పేస్తాయి. అందుకే ఇలాంటివాటిట్లో మా భాషాలో స్టాండర్డ్ డీవియేషన్ ని వాడతాం. అంటే మీ భాషలో విచలనం లేదా వ్యతిక్రమం అన్నమాట.
శకుని: ఓహో
ఒబామా: ఇప్పుడు మీరు ఇరవై రాళ్ళు మొయ్యమన్న చోట పద్దెనిమిది వచ్చినా చాలు లెకపోతే ఇరవై రెండు రాగానే ఆపెయ్యండి అన్నారనుక్కోండి - మీరు కాస్త సడలింపు ఇచ్చి దానికి పరిమితి పెట్టారన్నమాట.
మీ సైనికుల వ్యతిక్రమం పరిమితికి సమానమైతే దానిని వన్ సిగ్మా అంటాం - అందులో సగమయితే టూ సిగ్మా అంటాం - అలాగే వ్యతిక్రమం గనక పరిమితిలో ఆరవ వంతు ఉన్నట్టయితే దానిని సిక్స్ సిగ్మా అంటాం
ఏంథోనీ: ఈయన చెప్పేది ఒక్క ముక్క కూడా అర్ధం కాల్వట్లేదు
అమర్: నాకూ అంతే
రెహ్మాన్: ఇష్ ఇష్
ఒబామా: సరే ఇప్పుడు మీరు చెయ్యాల్సిన పని వెంటనే యాభై మంది కౌరవ సోదరులని లేఆఫ్ చెయ్యడం.
శకుని: అంటే?
ఒబామా: యుధ్ధం లోంచి తప్పించడం. దీనివల్ల మీకు ఖర్చు తగ్గుతుంది - దక్షత, ఫలోత్పాదక శక్తి పెరుగుతాయి
శకుని: బాగు బాగు - అలాగే చేద్దాం
( దూరంగా పాండవ శిబిరంలో)
ధర్మరాజు: కృష్ణా! ఎవరో పరలోకవాసులు దుర్యోధనునికి సహాయము చేసున్నారని వేగుల కబురు
కృష్ణుడు: భయపడకి యుధిష్టిరా - వారు ఇక్కడికి కూడా వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. భవిష్య భూలోక వాసుల్లారా! రండి. సుస్వాగతం
అందరూ: నమో కృష్ణ, నమోన్నమ:
కృష్ణుడు: ఏమిటి ఒబామా గారూ! ఏలా ఉంది దుర్యోధనుల వారి ఆతిధ్యం
ధర్మరాజు: మీరు అన్యాయానికి అలా చేయూతనివ్వడం బాలేదు
ఒబామా: కావాలంటే మీకు కూడా సహాయం చేస్తాం
ధర్మరాజు: అదెలా సాధ్యం?
ఒబామా: ఎందుకు కాదు? మీ తరువాయి కాలంలో ఇటు భారత దేశానికి, వారి బధ్ధ శత్రువయిన పాకిస్తానుకి ఒకే సమయంలో సహాయం చేస్తున్నాం కదా - అలాగే
అక్బర్: పాకిస్తాన్ అంటే పవిత్రమైన స్థానం అని - అది మన కర్మ భూమికి శత్రువా?
ఏంథోనీ: అది పేరుకే పాకిస్తానండి. అవన్నీ మీకు చెప్పినా అర్ధం కావు. ఒబామా గారూ మీరు కానివ్వండి.
ఒబామా: కనుక మీకూ కౌరవులకీ ఏకకాలంలో సహాయం చెయ్యడం మాకు ఇబ్బంది కాదు.
కృష్ణుడు: మీ కాలమునుండీ ఇప్పటికే మాకు సహాయమందుచున్నది
ఒబామా: అదెలా?
కృష్ణుడు: మీ కాలపు తంతి రహిత దూరవాణి పరికరం ద్వారా ఒసామా బిన్ లాడెన్ అనునతడు మా అభిమన్య పుత్రునికి సహాయం చేయుచున్నాడు
ఒబామా: ఏంటీ? సెల్‌ఫొనులో ఒసామా అభిమన్యుడికి ట్రైనింగ్ ఇస్తున్నాడా? ఇంపాసిబుల్!!
రెహ్మాన్: అంటే అభిమన్యుడు పాండవుల ఆత్మాహుతిదళం నాయకుడన్నమాట
అమర్: అందుకే పద్మ్యవ్యూహంలోకి ఒక్కడు వెళ్ళి చంపగలిగిన వారిని చంపి తనూకూడా ఆహుతయ్యడు
ఏంథోనీ: అభిమన్యుడి మరణం వెనక ఇంత కధ ఉందన్న మాట
ధర్మరాజు: ఇక మీరందరూ విశ్రాంతి తీసుకోండి. రేపు మాట్లాడదాం. భటులారా! వీరికి విశ్రాంతి మందిరం చూపించండి
(వాళ్ళు వెళ్ళగానే)
కృష్ణా! వేగులు తెచ్చిన మరోవార్త! విరు కౌరవులకి చేసిన సహాయం పాండవుల పాలిట శాపమయ్యింది. వీరు ఇక్కడ ఉంటే ప్రమాదకరం. వేంటనే పంపించి వేయ్యాలి. ఏదయినా ఉపాయం చెప్పు.
కృష్ణుడు: ఏదీ ఆ దూరవాణిని ఒక సారి తెప్పించు. వారి కాలంలో హిల్లరీ అనే మహిళ ఉంది - ఆమేతో మాట్లాలి
(అర్ధరాత్రి అమర్‌కింగ్ కి ఫోన్ - ప్యార్ కియా తో డర్నా క్యా రింగ్ టోను)
అమర్: అబ్బబ్బబ్బా! మర్చిపోయి సెల్‌ఫోన్ జేబులో పెట్టుకొచ్చా. చంపేస్తున్నారు - హలో ఎవరది - బైడెన్ గారూ! మీరా? ఏమిటి విషయాలు?
(మొహం రంగులు మారుతుంది)
ఒబామా గారూ! నిద్రలేవండి - మీ కొంప మునగబోతోంది.
ఒబామా: ఏమయిందండీ?
అమర్: జగన్నాటక సూత్రధారితో పెట్టుకున్నాం - మీ మీదా, బైడెన్ గారి మీదా, హిల్లరీ ఇంపీచ్మెంట్ పెట్టబోతొంది ట. ఇప్పుడె ఫోన్.
ఒబామా: అయితే ఏంచెయ్యాలి?
అమర్: వెంటనే వెనక్కు వెళ్ళి దానిని ఆపాలి. లెఖపొటె భారతం సంగతి దేవుడెరుగు. మీ పదవి ఊడిపోతుంది.
ఒబామా: అమ్మో - అయితే అందరూ లేవండి. నేర్చుకోవాల్సినది నేర్చేసుకున్నాం! అక్బర్ గారు కూడ కుక్కని వదిలేశారు. ఇక ఆయనని ఆయన కాలంలో దింపేసి మనం వెళ్ళిపోదాం. పదండి.
(టైం మెషీన్లో వెళ్ళిపోతున్నవారిని చిద్విలాసంతో తిలకిస్తున్న శ్రీకృష్ణునితో తో తెర పడుతుంది)
*************** అయిపోయింది ***************
Hi Rowdy,
ReplyDeleteFirst half is repeated. I think you have pasted twice :)
Corrected it, Thanks
ReplyDeleteటపా బాగుందండి! అయితే మానవబాంబులు, మన మహా భారతంలోనే ఉన్నాయంటారు!
ReplyDeleteబాగుంది. అక్కడకొచ్చారుగా!
ReplyDelete