Jun 24, 2009

పై.కూ. లు అనబడే పై(త్యపు) కూ(తలు) :))

ఈ మధ్య హైకుల నానీల ప్రభావం బాగానే పడింది జనాలమీద - ఆ స్ఫూర్తి తో పుట్టినవి పై.కూ.లు అనగా పైత్యపు కూతలు

( పైకూ అనే మాటకి ఆద్యులెవరో గుర్తులేకపోయినా మిత్రులు రఘోత్తమరావు, మూలా సుబ్రహ్మణ్యం లేక సాయికిరణ్‌కుమార్లలో ఒకరని మాత్రం తెలుసు )

ఆ పైకులకి వారు నిబంధనలేమి పెట్టలేదు అప్పట్లో. వాటికి నిబంధనలు పెట్టి మీముందుకు తేవడమే ఈ టపా ముఖ్యోద్దేశం:

వీటికి నిబంధనలు పెద్దగా ఏమీలేవు

(1) మొత్తం రెండు వాక్యాలుండాలి
(2) మొదటిపదంలోగానీ చివరిపదంలో గానీ ప్రాస ఉనండాలి
(3) మొదటి వాక్యానికి రెండవ వాక్యం కొనసాగింపులా ఉన్నా - ఒకాదానికి మరొకటి ఏదో విధంగా ప్రతికూలంగా ఉండాలి

అంటే ఏమీలేదండీ - ఆ కవిత ఒక్కరే చదివితే ఒక కవితలానే ఉండాలి.. కానీ ఒకొక్క వాక్యం ఒకొక్కరు చదివితే మాత్రం అది ఇద్దరి మధ్యా సంభాషణలా ఉండాలి:

ఉదాహరణకి క్రింది పైకూని చూడండి

* నీ ఇంటిపేరు కత్తి.
ఫోరాఫో! నువ్వు వేసేది సుత్తి!

ఇది మామూలుగా చదివితే ఒకరిని వ్యతిరేకించే కవితలానే ఉంటుంది - కానీ మొదటివాక్యం భాస్కర రామరాజు, రెండవది కత్తి మహేష్‌కుమార్ చదివితే?


అలాంటివే ఈ క్రిందివి కూడా:

* నీ రిజర్వేషన్ బుర్రకి లేదు లేటిట్యూడ్
అందుకే నీదో బ్రాహ్మినికల్ ఏట్టిట్యూడ్

* నీ రచనలు కొడతాయి అపభ్రంశపు కంపు
అందుకేనా నీదో ముదనష్టపు కెలుకుడు గుంపు?

* కేసేస్తా ఖబర్దార్ !
కెలికేస్తా బర్ఖుద్దార్ !!

* నువ్వు శూద్రులని దూషించావు
కానీ బ్రాహ్మణులని ద్వేషించావు

* ఒరేయ్ బూడిదా ( నా చిన్నప్పటి స్నేహితుని ఇంటిపేరు అది)
ఏంచేస్తున్నావురా గాడిదా?

* విన్నారా నా పైకూలు మొత్తం?
అమ్మో వస్తోంది మీ చెవుల్లోంచి రక్తం!




- నేను మొదలుపెట్టాను ... ముగించాల్సింది మీరే


...


UPDATE:

IT SEEMS THAT THE WORD PAIKU WAS INTRODUCED BY A FRIEND A MINE ( A MEMBER OF PRAMAADAVANAM - CHECK THE MEMBER LIST ON THE RIGHT SIDE) CALLED RADHIKA. SO THE CREDIT GOES TO HER.

23 comments:

  1. LOL...

    నిద్రొస్తుంది...
    రేపు ప్రొద్దున చూపిస్తా నా క్రియేటివిటి.

    ReplyDelete
  2. కేస్టు అన్నోది ఫేసు పేస్టు అవుద్ది
    కేసు అన్నోది నోసు పగులుద్ది

    ReplyDelete
  3. ముసుగు దొంగవి నీవు ద్రోహి కొంగవి నీవు
    మారు వేషం నాది రాజు భేషం రా అది

    ReplyDelete
  4. ప్రేమిస్తే పర్ణశాల
    దూషిస్తే చెరశాల

    ReplyDelete
  5. కెలికెడిది కూడలట కెలికించెడి వాడు ఏకలింగంబట
    వొలిచెడిది తోలు అట వొలిపించెడి వాడు కత్తి మహేశుండట

    ReplyDelete
  6. ఆసక్తికరమైన సృజనాత్మకత.

    ReplyDelete
  7. ఏమిటో ఈ కారు(పైత్యపు) కూతలు..
    బ్లాగరులకు తప్పవు ఈ వెతలు.

    ReplyDelete
  8. వాడొక శోధన,సాధన చేసిన అజ్ఞాని
    నిరంతరం ఇతరులను నిందిచే చెత్త మేధావి

    ReplyDelete
  9. ఆ టపా తెహల్కా అవుతుందని అనుకుంటె
    అయింది అది ఉస్కులకడి తుస్కుటపా

    ReplyDelete
  10. పైంట్ బ్రష్ తో కత్తి
    వేశాడు రాజు పై నిందల సుత్తి

    ReplyDelete
  11. మొట్ట మొదట గానే మద్దతునిచిన బొల్లొజు బాబా
    చూశావా సత్తి స్క్రిన్ షాట్ల గందర గోళం గలబా

    ReplyDelete
  12. Guys! Guys!!

    I love your Paikus but please dont get too personal.

    ReplyDelete
  13. Let me make one thing clear - just to counter the gossip going around - I never alleged that Mahesh or anybody manipulated the screenshots. I said "I DID IT" for fun.

    ReplyDelete
  14. ఆపకుండా కూసేవాడిదే కూడలి..
    మళ్ళీ మళ్ళీ గిల్లేవాడిదే జల్లెడ !

    ReplyDelete
  15. Malak

    http://1.bp.blogspot.com/_QBRZkIyxTH0/Sjzy8SJ1GxI/AAAAAAAAA2A/fzgTmVwJGWg/s1600-h/3.JPG

    I am talking about this screen shot. not yours. Lot of mistakes in first version.
    1. kurian@gmailc.om
    2. ramarajubhaskar@gmail.con

    ReplyDelete
  16. గొప్ప వాళ్ళ వేషాలు చూసి కాదు ఆశ్చర్య పోయింది రావు గారు
    స్క్రీన్ షాట్లు తయారు చేయటం కూడా రాని నీ ప్రతిభను చూసి మాట రాకా రాయ లేకా "!!!"

    ReplyDelete
  17. Well, a genuine question.


    Does Wordpress have any validation? I mean it could have been possible that Kurian entered a wrong email address and wordpress accepted it .. right?

    Also, I am sure Mahesh will know that he will be in trouble if he had manipulated screenshots espcially on a legal issue. So I dont think he would do it.

    All said, calling somebody names is bad and reacting to it in a naive way is bad too.

    ReplyDelete
  18. Newayz, the issue has subsided and I feel its better we bury it and move on. Whatever happens in the background, let it go on.

    ReplyDelete
  19. UPDATE:

    IT SEEMS THAT THE WORD PAIKU WAS INTRODUCED BY A FRIEND A MINE ( A MEMBER OF PRAMAADAVANAM - CHECK THE MEMBER LIST ON THE RIGHT SIDE) CALLED RADHIKA. SO THE CREDIT GOES TO HER.

    ReplyDelete
  20. పైకూ, పైత్యపు కూత. :))))))))))))))))))))))) ROFL

    కొన్ని కొన్ని చదివినప్పుడు నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు.

    ఎదురుగా తెల్లని గోడ
    పాకుతోందొక నల్లని బల్లి.

    ఇలాంటివి చదివితే ఏమనిపించాలి అసలు? నాకైతే అలాంటి రాతలు రాసేవాళ్ళకి చాకిరేవు పెట్టాలనిపిస్తుంది.

    పైకూ మటుకు కత్తి, చాకు, బాకు. రాధిక, నీ ఐడియా నిజంగా అదుర్స్. :)

    ReplyDelete
  21. pichhikutalu paikulaite
    verrikutalu vaikulu
    cheddakutalu chaikulu
    bhayankarakutalu bhaikulu

    ReplyDelete