Jun 6, 2009

ఒబామహాభారతం - లఘు నాటిక - అయిదవభాగం

ఒబామా: భారతం వచ్చేసిందండీ. దిగండి
అమర్: నిజంగా భారతమే కదా, ఎందుకైనా మంచిది ఒక సారి చెక్ చేసుకోండి
ఒబామా: 100% పక్కా అండీ
ఏంథోనీ: కొంచం ధైర్యం చెయ్యండి అమర్ కింగ్ గారూ - మీకెలాగూ తెలివిలేదు కాబట్టీ మీరు ధైర్యవంతులే
అమర్: ధైర్యవంతుడంటే తెలివిలేనివాడా? ఎవరు చెప్పారు?
ఏంథోనీ: ఒకరు చెప్పాలా? మీరు స్టాలిన్ మతిలేని వ్రాతలు చెదివినట్టులేదు
అమర్: స్టాలిన్ మతిలేని వాడా?
ఏంథోనీ: స్టాలిన్ గురించి అర్థం కావాలంటే మీ సెర్వర్ స్పేసు బేండ్ విడ్త్ సరిపోవు
అమర్: స్టాలిన్ కీ బేండ్ విడ్త్ కీ ఏమిటి సంబంధం?
ఏంథోనీ: కామెంట్లగురించి పట్టించుకునేవాడు విప్లవకారుడు కాలేడు
అమర్: ఒక్క ముక్క అర్ధం అయితే నీ ఎడంకాలి చెప్పుతో కొట్టు
ఏంథోనీ: చెప్పుల కార్మికులని అవమానించద్దు. వారి ద్వారానే విప్లవం వస్తుంది
అక్బర్: నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు.
ఏంథోనీ: నీలా గడ్డం పెంచినవారందరూ సన్యాసులే
ఒబామా: ఇంతకీ మీరు దేనిగురించి మాట్లాడుతున్నారు ఏంథోనీ గారు?
ఏంథోని: పెట్టుబడిదారీ వ్యతిరేక ప్రాలిటేరియన్ వ్యవస్థ లో విమెన్ లిబరేషన్ కు కారణభూడయిన ఒసామా సద్దాం గురించి.
ఒబామా: ఒసామా సద్దామా? ఆయనెవడు?
ఏంథోనీ: నువ్వూ మఠంలో సన్యాసివేనా? వీ యన్ సీ ప్లేయర్ రిమోట్ డెస్క్‌టాప్ అంటే ఏమిటో తెలుసా నీకు?
రెహ్మాన్: అయ్యా ఏంథోనీ గారూ - ఒక వాక్యానికి దాని తరవాత దానికి సంబంధంలేకుండా ఉండే తెలుగు సినిమాపాటలా మాట్లాడుతున్నారు - కొంపదీసి మీ ముద్దు పేరు పక్షిరాజా?
ఏంథోనీ: పక్షికాదు, గ్రాంధిక భాషలో మార్తాండం అని పిలవచ్చు
మిగిలినవారు: హమ్మయ్య! విషయం ఇప్పుడర్ధమయ్యింది. ఎవరైనా ఆయన మొహం మీద కాస్త గోలిసోడా కొట్టండి
అక్బర్: గోలీసోడా వద్దు - పెప్సీనో కోకో కొట్టండి
ఒబామా: అక్బర్ గారూ, మీకివన్నీ ఎలా తెలుసు?
అక్బర్: రామాయణం నుండి భారతం దాకా సాగిన ఈ ప్రయాణంలో మీ మాటలు విని చాలా తెలుసుకున్నా లేండి. అందులో ఇదెఒకటి
అమర్: వాహ్ అయితే ఇప్పుడు మీరు మాడర్న్ అక్బర్ అన్నమాట
అక్బర్: అవును. నేనిప్పుడు జోధా అక్బర్ హ్రుతిక్ని - నా నాయిక ఐశ్వర్య
అమర్: చాలు. ఇక ఆపండి .. ఆపండి .. ఆపండి .. ఆపండి .. ఆపండి ...
ఒమాబా: ఏమయ్యిందండీ?
అమర్: మా ఐశ్వర్య బేటి మా అభిషేక్ బేటాకే నాయకి. వేరెవరికీ కాదు, కాబోదు. అన్నట్టు వెనక్కి వెళ్ళాక గుర్తు చెయ్యండి. ఆమెకి చెప్పులు కొనడానికి వెళ్ళాలి
రెహ్మాన్: సరే సరే దఅందరూ దిగండి. ఏంథోనీ గారికి పూనకం తగ్గి తెలివొచ్చిందా?

(అంతా భూమిమీద)

ఏంథోనీ: అమర్ గారూ, ఇవేవీ మన బీ ఆర్ చోప్రా మహాభారత్ సీరియల్ లో చూపించినట్టు లేవే? ఇక్కడ ఆడవాళ్ళు కూడా నిండుగా కప్పుకుని ఉన్నారు. అందులో చూపించినట్టు చాలీచాలని బట్టలేసుకుని లేరే?
అమర్: ఏహే! మాట్లాడకుండా నడవండి. అరే అటు చూడండి - ఆగుడేదో విచిత్రంగా ఉంది?
(పక్కన పోయే దానయ్యని పిలిచి)
బాబూ! ఈ దేశానికి రాజెవరు?
దానయ్య (ఎగాదిగా చూసి): నాకు తెలిసినప్పుడు నీకు చెప్తాలే.
అమర్: సరే సరే, ఆ గుడి విచిత్రంగా ఉంది - ఎవరిది?
దానయ్య: ఇక్కడ పక్షి రూపంలో ఉండే ఓ రాక్షసుడు తన అరుపులు గావు కేకలతో జనాలని బెదరగొడుతూ ఉండేవాడు. మహిళలు చిన్నపిల్లలు దడుచుకునేవాళ్ళు
అమర్: ఓహో తరవాత?
దానయ్య: ఆ రాక్షసుడి బాధ పడలేక కొంతమంది లుంఢినీ నగర పురజనులా ఆరాధ్య దైవం కోసం తపస్సు చేశారు?
అమర్: లుంఢినీ నగరమేమిటండీ?
రెహ్మాన్: అదేనండి - ఇప్పటి లండన్.
అమర్: ఓహో
దానయ్య: వీరీమీద దయతలచి ఆయన ఏకలింగావతారం ఎత్తి ఆ రాక్షసుడి పీచమణచాడు. అయినా కృతజ్ఞతలేని వీళ్ళ నాయకుడొకడు ఇక్కడ ఉన్న సందులు మలుపులు కూడళ్ళు అన్నీ తనవేనన్న ధీమాతో మేలుచేసినవాడిని కూడా బహిష్కరించాడు. కాని ఆ మేలు మరిచిపోలేని కొందరు కట్టించిన ఆలయమే ఈ ఏకలింగేశ్వరాలయం.
అమర్: చాలా కధ ఉందే. ఇంతకీ ఆ రాక్షస పరాభవం ఏలా జరిగింది?
దానయ్య: అబ్బో అదో వీనులవిందయిన ప్రహసనం. ఆ రాక్షసుడూ రోజుకి నాలుగుసార్లు అరుపులు గావుకేకలు పెట్టెవాడు "స్టాలించ మావోచ సద్దాంచ" అంటూ - ఆ అరుపులకర్ధం ఇప్పటికీ ఎవరికీ తెలియదు
అమర్: మాకు తెలుసు లేండి. మీరు కానివ్వండి.
దానయ్య: మన ఏకలింగేశ్వరుడు గంటకొకసారి కేకలు మొదలు పెట్టాడు - ఈ కేకలు భరించలేక ఏదిరించే తెలివి ధైర్యం లేక మార్తాండాసురుడు పలాయనం చిత్తగించాడు.
అక్బర్: ఆహా ఓహో. "గాలీ క జవాబ్ గాలీ సే దియా"
అమర్: అది మా లాల్ బహాదుర్ శాస్త్రి గారి లైన్. కాపీ కొట్టావంటే చంపుతా.
దానయ్య: ఏమంటున్నారూ?
అమర్: అయ్యో మిమ్మల్ని కాదు లెండి - మీరు వెళ్ళి రండి.

(అందరూ మళ్ళీ నడుస్తూ)

ఏంథోనీ: అయ్యా! ద్రౌపది నిజంగానే అయిదుగురు భర్తలున్నరంటారా? ఆ అన్యాయాన్ని ప్రశ్నించే స్త్రీవాదులు ఈ కాలంలో లేరా?
రెహ్మాన్: బాగుంది - భారతంలో ఫెమినిష్టులు - ఇదేదో మన చెంగనాయకమ్మగారి నవలలా ఉందే
ఏంథోనీ: మీరో సుప్రసిధ్ధ రచయిత్రిని అవమానిస్తున్నారు
రెహ్మాన్: అయ్యో! ఆవిడగురించి కాదండీ నేననేది. ఆవిడ అభిమాని, చెంగ ప్రవీణురాలు అయిన చెంగనాయకమ్మగారి గురించి.
ఏంథోనీ: "చెంగ" అంటే?
రెహ్మాన్: అడిగారూ? ఒక సారి తెలుగు ప్రమాదవనం బ్లాగులో రెండో ప్రమాదసూచిక చూడండి. మీకోసం మళ్ళీ టూకీగా ఇక్కడ:

తమ పనులు మానుకుని ప్రక్కవారి పనులు చేసిపెట్టడాన్ని "చెంగ" అని నిర్వచిస్తాం. ఈ చెంగ చేసిన వాడికి లాభమేమి ఉండదు - చేయించుకున్నవాడికి కూడా పెద్దగా లాభం ఉండదు.

ఉదాహరణకి - మీరు ఆవురావురుమంటూ కాలేజిలో కేంటీన్ కి వెళ్తుంటారు. ఈ లోగా ఎవరో అమ్మయి ఎదురుపడి "నాకు అర్జెంటు పనుంది. ఈ పుస్తకాలు లైబ్రరీలో ఇచ్చెయ్యరూ, ప్లీస్?" అంటుంది. వెంటనే మీరు అక్కడికి వెళ్ళి అరగంట క్యూ లో నిలబడి, మీ డబ్బులతో ఫైన్ కూడా కట్టి కేంటిన్ కి తిరిగొచ్చేటప్పటికి, ఆమె తన బాయ్ ఫ్రెండ్ తొ కాఫీ తాగుతూ "థేంక్యూ అన్నయ్యా!" అంటుంది. దీనివల్ల మీకొరిగినదేమీ లేదు, ఆ అమ్మాయికి పెద్దగా లాభమేమీ లేదు, మీ సమయం మాత్రం వృధా. ఇది చెంగలలో అతి సాధారణ చెంగ.


చెంగలు నానావిధాలు:

* పాకిస్తాన్ కోసం ఎవడొ ఆఫ్రికా వాడు కాష్మీరంటే ఏమిటో తెలియకపోయినా వచ్చి చస్తున్నాడు చూడు - దాని వల్ల వాడికి గాని వాడి కుటుంబానికి గాని ఏమి లాభం లేదు. ఎందుకూ చాలని కొంత డబ్బు తప్ప! దీనిని జిహాదీ చెంగ అంటాం!

* మందుకొట్టి పిచ్చిగంతులేస్తున్న ఆడపిల్లల్ని చావగొట్టిన వాళ్లది - సాంస్కృతిక చెంగ - దీనివల్ల ఆ పిల్లలు మారలేదు సరికదా .. వాళ్ళ లోదుస్తులు వీళ్ళకి పంపిస్తున్నారు. "ఉన్నిబట్టలేసుకోవే తల్లీ!" అంటే ఉన్న బట్టలు కూడా ఊడబీక్కున్న బాపతు!

* ఇక ప్రతీదానికీ ప్రభువు కాపాడును అని చెప్పి డబ్బులిచ్చి మరీ మతం మార్పిస్తారే - అది మతమార్పిడి చెంగ. వీళ్ళ డబ్బులయిపోయిన వెంటనే వేరే మతం వాళ్ళూ డబ్బులిచ్చి 'రీ కన్వర్ట్' చెయ్యరూ?

* నీకు నువ్వే చేసుకునే చెంగ (నీ గురించి నువ్వే గొప్పగా బ్లాగుల్లో వ్రాసుకోవటమన్నమాట) స్వచెంగ

* పక్కవాడికి చేసే చెంగ - పరచెంగ ("ఆహా! ఓహో! ఎక్కడికో వెళ్ళిపొయారు సార్ మీరు! మీరు " అంటూ)

* వాడు నీకు నువ్వు వాడికీ చేసేది - పరస్పర చెంగ (ఒకళ్లకొకళ్ళు పొగడ్త కామెంట్లు వ్రాసుకోవటమన్నమాట)

* సూడో చెంగ: అమేరికా వాడు పాకిస్తాన్ కి చెంగ చేస్తున్నట్టు కనిపించినా ఎక్కడ నొక్కెయ్యాలో అక్కడ తొక్కేస్తాడు. ఇది సూడో చెంగ!

* సాముహిక చెంగ: ఇది ఒక సమూహం కలిసి ఒకరికో ఇద్దరికో చేసే చెంగ.

* రాజకీయ చెంగ: అమ్మో! దీని రేంజ్ చాలా ఎక్కువ - మచ్చుకో రెండు ఉదాహరణలు:

******** ఎవడో పెద్ద లీడర్ వచ్చి స్పీచ్ ఇస్తుంటే ఫోటో కోసమ్ పక్క నిలబడి, ఆయనకి సేవలు చేసి, స్టేజ్ ఎక్కి చేతులు ఊపి చేసే చెంగ - తీరా టికెట్ వచ్చేది నీ విరోధికి!
******** భూఆక్రమణ అంటూ పేదలని ఆకట్టుకోడానికి చేసే చెంగ - ఇంతా చేసి ఓట్లు పడేది పొత్తు పెట్టుకున్న చెంగబాబునాయుడికో లేక చెంగశేఖరరావుకో!

*ఇలాంటివే ఫలానా హీరో అభిమాన 'చెంగాలు' కూడా!

* ఎవడో నీకు చెంగ చేస్తే నువ్వు ముగ్గురికి చెంగ చెయ్యటం - "పే ఇట్ ఫోర్వర్డ్" లేక "స్టాలిన్" చెంగ

* ఎవడో నీకు చెంగ చెయ్యటానికొస్తే నువ్వే వాడికి చెంగ చెయ్యటం - రివర్స్ చెంగ

* అవసరమున్నా లేకపోయినా పక్కవాళ్ళని కెలకడం - రౌడీ చెంగ!

చెప్పాలంటే చాలాఉంది గానీ ఇప్పుడు కుదరదు. కావాలంటే ఆ పోశ్తు చదువుకోండి. ఈ లింకులో కిందనుండి రెండో పోస్టు


http://pramaadavanam.blogspot.com/


ఏంథోనీ: ఓహో - సరే సరే! కానీ ఇక్కడ స్త్రీవాదుల సంగతి ఏంటి? ఈ కాలంలో ఫెమినిష్టు చెంగలు లేరా?

అమర్: ఈ కాలం వాళ్ళకి మనవాళ్ళలా పైత్యంలేదండీ. స్త్రీహక్కుల కోసం పోరాడెవారున్నారు గానీ, మగవాడూ సిగరెట్లు తాగితే మనమూ తాగాలి, వాడు మందుకొడితే మనమూ కొట్టాలి, పైటను తగలెయ్యాలి, చీరలను చింపుకోవాలి, పబ్బులను నింపెయ్యాలి, ఇడెమిటని అడిగితే సెక్షం 498A పెట్టి అరెస్టు చెయ్యాలనే విపరీత పోకడలు లేవు

ఏంథోనీ: 498A మహిళలకోసమే కదా

అమర్: అవును కానీ అలాంటి చటాలని మిస్‌యూజ్ చేస్తున్నారని కోర్టులేగొగ్గోలు పెడుతున్నయి కదా. దీనికి తోడు మగ ఫెమినిష్టులు. పైకి చెప్పేవి స్త్రీ జనోధ్ధారణ కబుర్లు. కాని అసలు రహస్యం ఏమిటంటె స్త్రీవాదం పేరుతో రేడికల్ ఫెమినిష్టులకి చేరువై "కావాల్సినది సాధించుకోవడం" - ఆ తరవాత టాటా బైబై అన్నమాట

ఏంథోనీ: అమ్మో. చాలా రాజకీయమే. రెహ్మాన్ గారూ, మీ ట్యూనులో మన రెడికల్ ఫెమినిష్టు అక్కల మీద పాట ఒకటి పాడకూడదూ?

రెహ్మాన్: సరే! ప్రేమదేశం "ముస్తఫా ముస్తఫా" బాణీలో

పల్లవి:

అక్కయా అక్కయ్యా డోంట్ హేట్ మేల్స్ అక్కయ్యా
పురుషుని ద్వేషించకే అక్కయ్యా
అండర్స్టేండ్ అండర్స్టేండ్ అర్ధం చేసుకో అక్కయ్యా
పురుషుడు నీ నేస్తమే అక్కయ్యా

అక్కయా అక్కయ్యా డోంట్ హేట్ మేల్స్ అక్కయ్యా
పురుషుని ద్వేషించకే అక్కయ్యా
అండర్స్టేండ్ అండర్స్టేండ్ అర్ధం చేసుకో అక్కయ్యా
పురుషుడు నీ నేస్తమే అక్కయ్యా

చరణం:

నిన్ను పొగిడితే కాకారాయుడు, లేకుంటే ఎం.సీ.పీ.
నువ్వేరైటంటే వెధవ, తప్పంటే అహంకారి
నీకేసీ చూస్తుంటే "నాట్ ఏ జెంటిల్ మేన్"
నీకేసీ చూడకపోతే "నాట్ ఎట్ ఆల్ ఏ మేన్"

అద్దంలో చూసుకునీ నువ్వే భయపడుతుంటే
"ఒహో ఐశ్వర్యా" అంటే ఎందుకు కోపం?

ఆ చెంగారాయుడినీ అన్ని హింసలు పెట్టడం
ఇదేనా నీ ఇస్త్రీవాద ధర్మం?

ఒహో హో హో హో హో ఓ హో హో హో హో
ఓ హో హో హో హో హో హో హో

అక్కయా అక్కయ్యా డోంట్ హేట్ మేల్స్ అక్కయ్యా
పురుషుని ద్వేషించకే అక్కయ్యా
అండర్స్టేండ్ అండర్స్టేండ్ అర్ధం చేసుకో అక్కయ్యా
పురుషుడు నీ నేస్తమే అక్కయ్యా

ఒబామా: సరే సరే! తొందరగా నడవండి. కౌరవులని పాండవులని కలవాలి

(ముగింపు వచ్చే టపాలో)

5 comments:

  1. చెంగనాయకమ్మ, చెంగబాబునాయుడు.. చెంగశేఖరరావు

    LOL! चेंगा है भायी :)

    "నీకేసీ చూస్తుంటే "నాట్ ఏ జెంటిల్ మేన్"
    నీకేసీ చూడకపోతే "నాట్ ఎట్ ఆల్ ఏ మేన్"

    ROFL!! Dude, those two lines are here to stay :P

    ReplyDelete
  2. Hehe Thx .. but those lines aint mine .. read them somewhere and just fit them into the parody :))

    ReplyDelete
  3. అదరగొట్టారు రౌడీ గారు. you are the best :)
    >>
    ఏంథోనీ: స్టాలిన్ గురించి అర్థం కావాలంటే మీ సెర్వర్ స్పేసు బేండ్ విడ్త్ సరిపోవు
    ఏంథోనీ: కామెంట్లగురించి పట్టించుకునేవాడు విప్లవకారుడు కాలేడు
    ఏంథోనీ: నువ్వూ మఠంలో సన్యాసివేనా? వీ యన్ సీ ప్లేయర్ రిమోట్ డెస్క్‌టాప్ అంటే ఏమిటో తెలుసా నీకు?
    రెహ్మాన్: అయ్యా ఏంథోనీ గారూ - ఒక వాక్యానికి దాని తరవాత దానికి సంబంధంలేకుండా ఉండే తెలుగు సినిమాపాటలా మాట్లాడుతున్నారు - కొంపదీసి మీ ముద్దు పేరు పక్షిరాజా?
    <<
    ఇవి టూ మచ్!! ఈ ఏంథోనిలా తలా తోకా లేకుండా మాట్లాడేవాడిని ఎక్కడో చూసానే.. ఎక్కడబ్బా??!!

    రెహ్మాన్: బాగుంది - భారతంలో ఫెమినిష్టులు - ఇదేదో మన చెంగనాయకమ్మగారి నవలలా ఉందే

    హ హ్హ హ్హా

    ReplyDelete