Dec 21, 2009

ఫెమినిస్ట్ అంటే ?

ఈ మధ్య ఎక్కువగా వింటున్నాను ఈ మాట. అసలు ఫెమినిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందామని బయల్దేరాను. ముందుగా నాకు బాగా పరిచయం ఉన్న మా ఒంగోలు మిత్రుడు తారసపడ్డాడు. "అంటే ఆడ లేక మగా?" అయన ఎదురు ప్రశ్న వేసాడు "మగ ఫెమినిస్టు గురించే" అని చెప్పా " ఆనందం సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం టైపు వ్యక్తులు అట ఉదాహరణ : కింది వీడియో చూడగలరు

http://www.youtube.com/watch?v=FIlF_Z-5b84


అంటే ఎప్పుడూ అమ్మాయిల భజన చేసేవారే ఫెమినిస్టులా ...హ్మ్ సరే అని చేపి ముందుకి కదిలా మరొకాయన తగిలాడు. ఆయన్నీ అదే ప్రశ్న వేసా. స్త్రీ వాదం ముసుగులో అమ్మాయిలకి దగ్గర అయ్యే ప్రయత్నం చేసే వారే ఫెమినిస్ట్లు అన్నాడాయన . ఓహో సరే అని ఇంకొంచం ముందుకి కదిలా ఒక టీనేజర్ తగిలాడు . చాట్ లో మనం ఎంత మొత్తుకున్నా సమాధానం ఇవ్వరు . అదే అమ్మాయి ఐ.డి. లో రాగానే కట్ల కుక్కల్లా హాయ్ హాయ్ హాయ్ అంటూ తగులుకుంటారు వారే అన్నాడు వాడు. సరే అని ఒక పెద్దాయన దగ్గరకెల్లా అయన వయసు అరవై సంవత్సరాలు ఆయన చెప్పిన సమాధానాలు.

మేల్ ఫెమినిస్టులు రెండు రకాలు ఒకటి నక్క రెండు తోడేలు అంట . బాప్ రే అవునా అన్నా. అవును బాబు మొదటి రకం నక్క , అంటే నక్క ఏ సింహమో , పులో వేటాడి వదిలేసిన జీవిని పులి వదిలేశాక మిగతాది పీక్కు తిందామని చేరుతుంది కదా. అలాగే ఎవడో మోసం చేసిన అమ్మాయిని మంచి చేస్కుని ఆమెకి న్యాయం చేస్తాను అని చెప్పి నెమ్మదిగా దార్లోకి తెచ్చుకుందాం అని నక్క లాగ ఎదురు చూస్తారు. ఇంకా రెండో రకం తోడేలు వీరు ఎదురింటి బాబాయ్ గారు పక్కింటి తాతయ్య గారు ఇలా మంచి వరసల తో మంచి చేసుకుని అదను కోసం ఎదురు చూసే బాచ్ అంట. ఏమో నాకైతే ఏమని తెలవదు. కానీ వెళ్ళు చెప్పింది కాకుండా ఇంకా ఏమన్నా ఉందా ఫెమినిస్టు అంటే ఏంటి? మీకు తెలిస్తేచెప్పగలరు

7 comments:

  1. ayya malak gaaru ... meeru inkokarni marchipoyaru ... aa type maarthanda type .

    ;-) hope you understand :-)

    ReplyDelete
  2. Another type, akka akka ani chokka vippe rakam

    ReplyDelete
  3. తమ్ముడు కన్నీళ్లు పెడితే చాలు కారణం అవసరం లేకుండానే ఓదార్చే వల్లే నిజమైన అక్కలు

    ReplyDelete
  4. Well .. it aint me who posted this. Its Sreenivas

    ReplyDelete
  5. మేల్ ఫెమినిస్ట్ లు మరీ దారునమండీ బాబు. నిజానికి స్త్రీవాదులైన స్త్రీలు తమకు కలిగిన కష్టాల వలనో లేక మరో స్త్రీ కష్టం తనకు వస్తే ఎలావుంటుందోనని తలుచుకోవడం వలననో కొంచెం కోపంగా కాస్త ఘాటుగా స్పందిన్స్తారు. కానీ మన మగ స్త్రీవాదులు మాత్రం ఫలానా పనిచేయడం 'ఆదర్షం' అనుకొని కమిట్ అవ్వడం వలన దాన్ని కాదంటే తెగ ఇదైపోతారు. అప్పుడు వీల్ల రియాక్షను ఓవరాక్షను గా మరుతుంటుంది. ఇదంతా తమలో లేని భావోద్వేగాలను కృత్రిమంగా తెచ్చిపెట్టుకుని అదే 'ఆదర్షం' అనుకోవడం వలన జరిగే అనర్థం.

    ReplyDelete
  6. ఫెమినిస్ట్ అంటే కూడా తెలియదా? ఫెమేలిష్టులు (ఫెమేల్ + ఇష్టులు 'సువర్ణ' దీర్ఘ సంధి!)

    ReplyDelete
  7. naakuu teliyadu inta kaalam, pheminist ante, edo bhagavantudini nammani batch emo anukunna

    ReplyDelete