Oct 18, 2010

చిత్రమాలిక సిద్దం!

మాలికకు అనుబంధంగా మొదలు పెట్టిన చిత్రమాలిక సైటు తెలుగు ప్రజలకు సినీవిందు పసందుగా వడ్డించేందుకు సిద్దం అయ్యింది.  ఈ సైటును మీరు ఈ క్రింద ఇచ్చిన లంకె ద్వార చూడవచ్చు..


ప్రస్తుతం ఒక బేసిక్ రూపం లో ఉన్న సైటుకు 30,60,90రోజుల పథకం ప్రకారం మరిన్ని హంగులు అందించబడతాయి.

చిత్రమాలిక స్వరూపం:

ప్రస్తుతం చిత్రమాలిక లో కేవలం రెండు వర్గములకు చెందిన వ్యాసాలు మాత్రమే ఉన్నాయి అవి:
1. టర్నింగ్ పాయింట్ - ఇందులో నటుల/నిపుణుల/పరిశ్రమ గమనాన్ని మార్చిన విషయాల గురించి సమాచారం ఉంటుంది.
2. సిని సిత్రాలు- పరిశ్రమలో జరిగిన అనేక సరదా విషయాలపై సమాచారం ఉంటుంది.

ఇవేకాక, హాస్య వల్లరి, వీడియో లైబ్రరీ మరియూ పేరడీ స్పెషల్స్ త్వరలో జత పరుస్తాము. ఎవరైనా రచయితలు మరేదైనా వర్గాలకు సంబంధించిన వ్యాసం రాసినా చిత్రమాలిక టీం దాన్ని స్వాగతిస్తుంది.

చిత్రమాలిక విశేషాలు:

1. చిత్రమాలిక అనేది సగటు ప్రేక్షకుల అభిప్రాయ మాలిక. ఒక ప్రేక్షకునిగా మీ అనుభూతులు, అభిప్రాయాలు నలుగురితో పంచుకోవడానికి ఉపయోగపడే ఒక వేదిక.
2. చిత్రమాలికలో అన్ని వ్యాసాలు తెలుగులో మాత్రమే ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ సినిమాల గురించి రాసినా కూడా తెలుగులోనే ప్రచురించబడతాయి.
3. చిత్రమాలిక టీం సభ్యులు పాల్గొనే చర్చలు,చెప్పే అభిప్రాయాలు కేవలం వాళ్ళ వ్యక్తిగతమైనవి మాత్రమే.
4. వ్యాస రచయితల అభిప్రాయాలతో చిత్రమాలిక టీం కు ఎటువంటి సంబంధం లేదు. కానీ  చిత్రమాలిక టీం ఆ వ్యాసాలను చూసి ప్రచురించదగ్గ విధంగా ఉంటేనే ప్రచురిస్తుంది. కుల,మత,రాజకీయ చర్చలకు చిత్రమాలిక వేదిక కాదన్నది మా అభిప్రాయం. అందుకే ఈ పరిశీలన.

నెనర్లు:

1. మాలిక సభ్యులందరికీ.
2. అడిగిన వెంటనే చిత్రపటం ఇచ్చిన శ్రీ చిలమకూరు విజయమోహన్ గారికి.
ప్రస్తుతం చిత్రమాలిక టీం:

1. సాంకేతిక సహకారం - విమల్ ఆత్రేయ
2. కంటెంట్ విషయాలు - ఇంద్రకంటి కార్తికేయ



అందరి సంపూర్ణ మద్దతు ఆశిస్తూ,

మీ
-కార్తీక్

8 comments:

  1. కేక !

    ఒక సినిమా సైటుకు కమర్షియల్ లుక్, యాడ్స్ వుంటేనే అందం. సేవ చేసినట్టు కాకుండా కమర్షియల్ లుక్ తీసుకురండి.

    ReplyDelete
  2. @a2z

    "ప్రస్తుతం ఒక బేసిక్ రూపం లో ఉన్న సైటుకు 30,60,90రోజుల పథకం ప్రకారం మరిన్ని హంగులు అందించబడతాయి."

    ReplyDelete
  3. మాకు కెలుకుడు టపాలు కావాలి

    ReplyDelete
  4. Apparao Sastri,
    మీరు కెలుకుడుకు బాగా అలవాటు పడ్డారు మాష్టారు.. :P

    ReplyDelete
  5. >>>మీరు కెలుకుడుకు బాగా అలవాటు పడ్డారు మాష్టారు.. :P
    అలవాటు కాదండి వ్యసనం అయిపొయింది.
    @ అజ్ఞాత : నేను నేను అంత డైరెక్ట్ గా చెప్పలేదు
    అయినా 'అర్ధం చేసుకున్న వారికి అర్ధం చేసుకున్నంత మహాదేవ' అని

    ReplyDelete
  6. Sorry guys.. no kelukudu comments too for this post... hehehe...

    ReplyDelete
  7. >>పరిశ్రమలో జరిగిన అనేక సరదా విషయాలపై సమాచారం ఉంటుంది.
    సరదాలు సరసాలు అన్నీ కావాలి
    >>>హాస్య వల్లరి, వీడియో లైబ్రరీ మరియూ పేరడీ స్పెషల్స్ త్వరలో జత పరుస్తాము
    కేవలం హాస్యానికే పెద్ద పీట వెయ్యకుండా అరిషడ్ వర్గాలని జయించలేని నాలాంటి వారికోసం నవరసాలకు స్థానం కల్పించాలని నా విన్నపం

    ReplyDelete
  8. ఇప్పుడే చూసాను బాగుంది. మీకు అభినందనలు. ఆసక్తి ఉన్నవారెవరైనా సినిమా టాపిక్స్ వ్రాయవచ్చా.

    ReplyDelete