నీలి చిత్రకారుడు - చీకటి మేధావులు - బ్లాగు జోకర్లు
ఈమధ్య ఎమీ తోచక అవి ఇవి బ్లాగులు కెలుక్కుంటుంటే "అన్నాహజారే దృష్టిలో 'గొడ్రాలు' చులకన " అన్న శీర్షిక కనిపిస్తే ఏమిటా అని తొంగిచూసాను. టపా రాసింది మన 'విష'శేఖర్ , కామెంట్లు పెట్టింది ప్రముఖ ఇ'స్త్రీవాది ప్రవీణ్ ఖర్మ. మాంఛి డెడ్లీ కాంబినేషన్ :-) ఆ క్రింద ఎవరో నాగార్జున అన్నతను మొత్తం టపాకి ఒకే ఒక్క వ్యాక్యంతో సమాధానం చెప్పి వాళ్ళ గాలి తీసేసాడు... పాపం :( . అయితే ఆ టపా చదివాక నాకు పాత విషయం ఒకటి గుర్తొచ్చింది. దాని గురించే అలొచిస్తూంటే వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఆ బ్లాగు లోనే "బూతు బొమ్మలు, మత సంస్థలు" అని ఇంకో టపా కనిపించింది. ఇదేదో మనం ప్రస్తుతం అలోచించే దానికి సంబంధించిన టపా లా ఉంది , ఈ విషయంలో మన ఇ'స్త్రీవాదులు ఎలా స్పందించి ఉంటారు అని ఆసక్తిగా చూసాను. ఈసారి కూడా కామెంట్ పెట్టింది ప్రవీణ్ ఖర్మ, పోస్ట్ రాసింది 'విష'శేఖర్. అయితే సాధారణంగా 'విష'శేఖర్ రాసిన దానికి ప్రవీణ్ ఖర్మ కామెంట్ పెడితే ఈసారి ప్రవీణ్ ఖర్మ కామెంట్ కి 'విష'శేఖర్ పోస్ట్ రాసాడు. ప్రవీణ్ కామెంట్లను అర్ధం చేసుకునే శాల్తి ఈ ప్రపంచం లో ఒకటుందే అని కాసేపు నా మైండ్ బ్లాక్ అయ్యింది. మనందరం ఊహించినట్టే ఆ పోస్ట్ కూడా హిందూ మతం మీద దుమ్మెత్తి పోయడానికే కేటాయించారు కానీ ఆ బూతు బొమ్మలు గీసిన సదరు నీలి చిత్రకారుడుని పల్లెత్తు మాట అనడానికి వాళ్లకి మనసొప్పలేదు పాపం.
ఆ క్లౌన్ల కామెడి చూసి కాసేపు నవ్వుకుని బయటకు వచ్చాక "ఏం.ఎఫ్. హుస్సేన్ మతం రాజకీయం" అంటూ ఇంకో పోస్ట్ కనిపించింది. ఎవరో చీకట్లో కొట్టుమిట్టాడుతున్న మేధావి వర్గం రాసిన సీరియస్ పోస్ట్. ఈ మేధావి వర్గం ఆంటే ఎవరబ్బా అని ముందు మీకు సందేహం రావొచ్చు. ఒకప్పుడు సీనియర్ మోస్ట్ బ్లాగర్ ఒకాయన మనలాంటొళ్ళకి ఇలాంటి కంఫ్యూజన్స్ వస్తున్నాయని అసలు మన దేశం లో మేధావి గా చెలామణి అవ్వాలంటే ఏం లక్షణాలు ఉండాలో అని ఆయన బ్లాగ్ లో వివరించారు. మీ కోసం అవి ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాను చూడండి.
ఆ క్లౌన్ల కామెడి చూసి కాసేపు నవ్వుకుని బయటకు వచ్చాక "ఏం.ఎఫ్. హుస్సేన్ మతం రాజకీయం" అంటూ ఇంకో పోస్ట్ కనిపించింది. ఎవరో చీకట్లో కొట్టుమిట్టాడుతున్న మేధావి వర్గం రాసిన సీరియస్ పోస్ట్. ఈ మేధావి వర్గం ఆంటే ఎవరబ్బా అని ముందు మీకు సందేహం రావొచ్చు. ఒకప్పుడు సీనియర్ మోస్ట్ బ్లాగర్ ఒకాయన మనలాంటొళ్ళకి ఇలాంటి కంఫ్యూజన్స్ వస్తున్నాయని అసలు మన దేశం లో మేధావి గా చెలామణి అవ్వాలంటే ఏం లక్షణాలు ఉండాలో అని ఆయన బ్లాగ్ లో వివరించారు. మీ కోసం అవి ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాను చూడండి.
{
మన దేశం లో మేదావి అంటే:
- దేవుణ్ణి నమ్మకూడదు
- కమ్యూనిస్టు అయ్యి ఉండాలి. లేదా అధమం, కమ్యూనిస్టు అభిమాని అయ్యి ఉండాలి.
- ఏదన్నా పుచ్చు యూనివర్సిటీలో పని చెయ్యని ప్రొఫెసర్ అయ్యి ఉండాలి.
- పక్క హేటువాది అయ్యి ఉండాలి.
- అతితెలివి చూపిస్తూ పిడివాదం చేస్తూ ఉండాలి.
- ఉరి శిక్ష రద్దు చెయ్యాలి అని అప్పుడప్పుడూ కేకలు వేస్తూ ఉండాలి.
- ఎక్కడ ఆవకాశం దొరికితే అక్కడ హిందూ మతం గురించి దుమ్మెత్తి పోస్తూ ఉండాలి.
- మానవ హక్కుల గురించి గంభీరంగా మాట్లాడగలగాలి (అవసరమైనప్పుడు, పైనించి వచ్చిన ఆదేశాల ప్రకారం. మళ్ళి అందరి సామాన్య మానవుల గురించిన హక్కుల గురించి మాట్లాడితే మేధావితనం ఎగిరిపోతుంది!)
- అందరూ అవునంటే కాదనాలి. కాదంటే అవుననాలి.
- శత్రు దేశాల సరిహద్దులకి వెళ్లి ఆ కంచే మీదగా వాళ్లకి గులాబీ పూలు ఇస్తూ ఉండాలి. అప్పుడప్పుడూ కొవ్వొత్తులు పట్టుకు తిరగాలి, ఎందుకో మరి తెలియదు.
ఇవన్ని ఉన్నవాళ్ళే మేధావులు. ఈ లక్షణాలు లేనివాళ్ళను మేధావులు అనరు.
}
అలా వీటిలో కొన్ని అయినా ఫాలో అయిపోయి మేధావిలా పేరు తెచ్చేసుకోవడానికి కొంతమంది మెదడనే తమ దీపం ఆర్పేసుకుని చీకట్లో ప్రయత్నిస్తూ ఉంటారు. పైన నేను చెప్పిన పిల్ల మేధావి బహుశా అదే కోవకి చెందిన వాడు అయిఉంటాడు.
అసలు ఈ చర్చలకి మూలమయిన శ్రీ శ్రీ శ్రీ ఏం.ఎఫ్. హుస్సేన్ గారి విషయానికొద్దాం. చనిపోయిన వారి గురించి మళ్ళీ ఇప్పుడెందుకు అని మనలో చాలామంది అభ్యంతరం పెడతారు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి వాడయినా సరే చనిపోయాక అతని గురించి ఏమీ అనకూడదు అన్నది మనలో కొందరు చూపించే అతిమంచితనాల్లో ఒకటి. అదే నియమం అనుసరించాలనుకోంటే మనం దీపావళి, దసరా లాంటి పండగలే చేసుకోకూడదు. ఒక మంచివాడు చనిపోయాక కొన్ని తరాల పాటు అతని గుణగణాల గురించి, గొప్పదనం గురించి ఎలా చెప్పుకుంటారో అలాగే ఒక రాక్షసుడు చనిపోయాక అతని దుర్మార్గ చర్యల గురించి, అతను ఎంతమందిని ఎలా హింసించాడు అన్నదాని గురించి కూడా అదే విధం గా కొన్ని తరాల పాటు చెప్పుకుంటారు మరి. ఎవరూ చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆ దుర్మార్గ చర్యల వల్ల గాయపడిన వాళ్ళు మాత్రం మర్చిపోలేరు. ఉదాహరణకి హిట్లర్ ఒక గొప్ప మనిషి , ప్రపంచం ఆయన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు అని ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి మనలాంటి వాళ్ళం అదొక మామూలు వార్త గా చదివి వదిలేయచ్చు. కానీ హిట్లర్ చేతిలో అనేక అవమానాలు గురైన యూదులు మాత్రం అలా వదిలేయ్యరు కదా. అలానే ఈ ఘనత వహించిన మహా నీలి కళాకారుడు చేసిన గొప్ప గొప్ప సంస్కారహీన పనులు కూడా మనం చెప్పుకోవాలి.
నా చిన్నప్పుడు ఒక సామెత వినేవాడిని. ఒక బిచ్చగాడు ఒక ఇంటావిడని ఇంకో ఇంటావిడ తో పోల్చి ఇలా తిట్టుకుంటూ ఉంటాడు... " రోజు పెట్టనామే ఎలాగూ పెట్టలేదు.. రోజు పెట్టే దానికేమోచ్చింది మాయరోగం" అని. ఆంటే రోజు బిచ్చం పెట్టని ఇంటావిడని "ఆమె" అని మర్యాదగా సంభొదిస్తాడు. రోజు బిచ్చం వేస్తూ ఒక్కరోజు వెయ్యనందుకు ఈవిడను అది ఇది అని మర్యాదలేకుండా తిడుతూ ఉంటాడన్నమాట. అలాగే మన కమ్యూనికృస్టులకి కూడా "ఫలానా మతం వాళ్ళు... వాళ్ళ మతాన్ని ఆంటే ఎప్పుడూ ఊరుకొలేదు... కానీ ప్రతీసారి నోరు మూసుకుని కూర్చునే మీరెందు ఈ సారి లేస్తున్నారు అన్నది" వారి వాదన. ఎప్పుడో 70's లో వేసిన బూతు బొమ్మలకి ఇప్పుడు గొడవెందుకు అన్నది వీరి గ్రేట్ లాజిక్. " సంఘం లో ఒక సెక్షన్ వాళ్ళు నిరసన తెలిపితే అది వాళ్ళ మనోభావాలు గాయపడినందుకు వారి ప్రతి చర్య , అదే ఇంకో సెక్షన్ వాళ్ళు నిరసన తెలిపితే అది మత అతివాదం " ఇది మన దేశం లో కమ్యూనికృస్టులు , కుహానా మేధావులు, బ్లాగు చిల్లర గాళ్ళు చేసే వితండ మార్తాండ వాదన. వీళ్ళందరికీ ఈ బ్లాగ్ ముఖం గా ఒక చిన్న ప్రకటన
"అవమానం జరిగినప్పుడు నోరేత్తకపోవడం తప్పే... అది మా చేతకానితనమే.. ఇంకెప్పుడు ఆ తప్పు జరగనీకుండా చూసుకుంటాం అని సదరు కమ్యూనికృస్టులకి, కుహానా మేధావులకి సవినియంగా మనవి చేసుకుంటున్నాను. మీకై పుట్టి మీకోసం నడపబడుతూ కోట్లమంది అమాయక యువకులను ఇన్నాళ్ళు తప్పుదారి పట్టిస్తూ , మా మద్య కులమత చిచ్చు పెడుతూ , మా వేళ్ళలో మా కళ్ళనే పొడుస్తూ వచ్చిన మీ biased మీడియా పని అయిపొయింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో వచ్చింది. ఇక మీ ఆటలు సాగవు అని కూడా తెలియచేసుకుంటున్నాను".
అసలు ఈ చర్చలకి మూలమయిన శ్రీ శ్రీ శ్రీ ఏం.ఎఫ్. హుస్సేన్ గారి విషయానికొద్దాం. చనిపోయిన వారి గురించి మళ్ళీ ఇప్పుడెందుకు అని మనలో చాలామంది అభ్యంతరం పెడతారు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి వాడయినా సరే చనిపోయాక అతని గురించి ఏమీ అనకూడదు అన్నది మనలో కొందరు చూపించే అతిమంచితనాల్లో ఒకటి. అదే నియమం అనుసరించాలనుకోంటే మనం దీపావళి, దసరా లాంటి పండగలే చేసుకోకూడదు. ఒక మంచివాడు చనిపోయాక కొన్ని తరాల పాటు అతని గుణగణాల గురించి, గొప్పదనం గురించి ఎలా చెప్పుకుంటారో అలాగే ఒక రాక్షసుడు చనిపోయాక అతని దుర్మార్గ చర్యల గురించి, అతను ఎంతమందిని ఎలా హింసించాడు అన్నదాని గురించి కూడా అదే విధం గా కొన్ని తరాల పాటు చెప్పుకుంటారు మరి. ఎవరూ చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆ దుర్మార్గ చర్యల వల్ల గాయపడిన వాళ్ళు మాత్రం మర్చిపోలేరు. ఉదాహరణకి హిట్లర్ ఒక గొప్ప మనిషి , ప్రపంచం ఆయన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు అని ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి మనలాంటి వాళ్ళం అదొక మామూలు వార్త గా చదివి వదిలేయచ్చు. కానీ హిట్లర్ చేతిలో అనేక అవమానాలు గురైన యూదులు మాత్రం అలా వదిలేయ్యరు కదా. అలానే ఈ ఘనత వహించిన మహా నీలి కళాకారుడు చేసిన గొప్ప గొప్ప సంస్కారహీన పనులు కూడా మనం చెప్పుకోవాలి.
నా చిన్నప్పుడు ఒక సామెత వినేవాడిని. ఒక బిచ్చగాడు ఒక ఇంటావిడని ఇంకో ఇంటావిడ తో పోల్చి ఇలా తిట్టుకుంటూ ఉంటాడు... " రోజు పెట్టనామే ఎలాగూ పెట్టలేదు.. రోజు పెట్టే దానికేమోచ్చింది మాయరోగం" అని. ఆంటే రోజు బిచ్చం పెట్టని ఇంటావిడని "ఆమె" అని మర్యాదగా సంభొదిస్తాడు. రోజు బిచ్చం వేస్తూ ఒక్కరోజు వెయ్యనందుకు ఈవిడను అది ఇది అని మర్యాదలేకుండా తిడుతూ ఉంటాడన్నమాట. అలాగే మన కమ్యూనికృస్టులకి కూడా "ఫలానా మతం వాళ్ళు... వాళ్ళ మతాన్ని ఆంటే ఎప్పుడూ ఊరుకొలేదు... కానీ ప్రతీసారి నోరు మూసుకుని కూర్చునే మీరెందు ఈ సారి లేస్తున్నారు అన్నది" వారి వాదన. ఎప్పుడో 70's లో వేసిన బూతు బొమ్మలకి ఇప్పుడు గొడవెందుకు అన్నది వీరి గ్రేట్ లాజిక్. " సంఘం లో ఒక సెక్షన్ వాళ్ళు నిరసన తెలిపితే అది వాళ్ళ మనోభావాలు గాయపడినందుకు వారి ప్రతి చర్య , అదే ఇంకో సెక్షన్ వాళ్ళు నిరసన తెలిపితే అది మత అతివాదం " ఇది మన దేశం లో కమ్యూనికృస్టులు , కుహానా మేధావులు, బ్లాగు చిల్లర గాళ్ళు చేసే వితండ మార్తాండ వాదన. వీళ్ళందరికీ ఈ బ్లాగ్ ముఖం గా ఒక చిన్న ప్రకటన
"అవమానం జరిగినప్పుడు నోరేత్తకపోవడం తప్పే... అది మా చేతకానితనమే.. ఇంకెప్పుడు ఆ తప్పు జరగనీకుండా చూసుకుంటాం అని సదరు కమ్యూనికృస్టులకి, కుహానా మేధావులకి సవినియంగా మనవి చేసుకుంటున్నాను. మీకై పుట్టి మీకోసం నడపబడుతూ కోట్లమంది అమాయక యువకులను ఇన్నాళ్ళు తప్పుదారి పట్టిస్తూ , మా మద్య కులమత చిచ్చు పెడుతూ , మా వేళ్ళలో మా కళ్ళనే పొడుస్తూ వచ్చిన మీ biased మీడియా పని అయిపొయింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో వచ్చింది. ఇక మీ ఆటలు సాగవు అని కూడా తెలియచేసుకుంటున్నాను".
ఇక ఏం.ఎఫ్. హుస్సేన్ గారు... ఒకప్పుడు వీరు మనలాంటి భారతీయుడు. దేశం గర్వించదగ్గ ఒకానొక కళాకారుడు. ఈ భరతమాత కన్న ముద్దుబిడ్డ. కన్నభూమిని జన్మనిచ్చిన తల్లి తో సమానంగా పూజిస్తూ ఎంతో గౌరవంగా చూసుకునే ఈ గడ్డమీద పుట్టిన మన సోదరుడు. ఎప్పుడో 19 వ శతాబ్దం లో మన దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశ ప్రజలందరిలోనూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన 'భారత్ మాతాకీ జై' అన్న అత్యంత శక్తివంతమయిన నినాదం ఈనాటికీ భారతదేశ సరిహద్దులు కాపాడే సైన్యంతో సహా సాధారణ పౌరులైన మనందిరిలో కూడా అదే స్ఫూర్తిని, దేశ భక్తిని నింపుతూ (మన సమాజంలో) ప్రబలంగా కొనసాగుతోంది. భరతమాత ఆంటే మన దేశ గౌరవం, మన గౌరవం. ఇక మన హుస్సేన్ గారికి తమ సొంత తల్లో లేక సవతి తల్లో కానీ ఆయనకి తన తల్లి ఆంటే ప్రాణం. నిండు దుస్తులతో హుందాగా ఉండే ఒక పైంటింగ్ కూడా వేసేసారు ఆయన. అలాంటి ఒక కొడుకుకి తోటి భారతీయ సోదరులు కన్నతల్లి లా గౌరవిస్తున్న భరతమాత ఆంటే ఎందుకో చిన్న చూపు ఏర్పడింది. బహుశా భరతమాత ధరించిన చీర రంగు చూసి అయి ఉండొచ్చు. తన కులం, మతం పక్కన పెట్టినా, ఒక భారతీయుడిగా కనీస మర్యాద మర్చిపోయి భరతమాతను నగ్నంగా చిత్రీకరించి తమ అమోఘమయిన కళను బయట పెట్టుకున్నాడు. కుహానా మేధావులంతా చప్పట్లు చరిచారు. వీడు గీసిన చిత్రం కొన్నాళ్ళకి " నగ్న భరతమాత" ఆన్న పేరుతొ బహిరంగవేలంలో అమ్మకానికి పెట్టినప్పుడు మనసు రగిలిపోవడానికి కేవలం హిందువై మాత్రమే ఉండాలా అన్నది నాకు ఎప్పటినుండో ఉన్న ప్రశ్న. భారతీయులయిన క్రిస్టియన్, ముస్లిం సోదరులకు కోపం రాదా. ఇందులో మత ప్రసక్తి ఎక్కడిది ? ఇదేనా స్త్రీలకి మనమిచ్చే గౌరవం ? ఇదేనా దేశానికి ఇచ్చే గౌరవం ? ఇదేనా మన దేశ భక్తీ ? ఈ సమాజంలో ఎవరయినా ఎదుటివారిని మాటలద్వారా అత్యంత ఎక్కువగా భాదపెట్టాలనుకున్నప్పుడు టార్గెట్ చేసిది వారి తల్లిని. ఎందుకంటే ప్రపంచంలో ఏవ్యక్తి అయినా తమని తిడితే దులిపేసుకొగలరేమో కానీ తల్లిని అవమానిస్తే మనసు గాయపడకుండా ఉండదు. తల్లిలా గౌరవిస్తున్న దేశాన్ని కించపరిచినా కలిగేది కూడా అటువంటి బాధే కదా. భరతమాతని కించపరుస్తూ ఏం చర్య చేపట్టినా కుల మత ప్రసక్తి లేకుండా ఏ భారతీయుడికయినా బాధ, కోపం కలగడం సహజం కాదా ? ముంబై దాడులతో దెబ్బతిన్న మన దేశాన్ని తన కళలో చూపించడానికి "రేప్ అఫ్ ఇండియా" అని రేప్ కి గురికాబడ్డ భరతమాతని గీసి పారేసాడు. అసలు ఈ ముసలి నక్కకి ఇటువంటి క్రూరమయిన , నీచమయిన ఆలోచనలు ఎలా వచ్చాయో అర్ధం కాదు. ఈ నీచుడు వేసిన దరిద్రాన్ని అమోఘమయిన కళగా ఆరాధించే వారి మానసిక పరిస్తితిని అనుమానించాల్సిందే.
ఇక ఈ gymnomanic తన తల్లి బొమ్మ గీసుకున్నాడు... కూతురు బొమ్మా పూర్తి బట్టలతో హుందాగా బహు బాగా గీసుకున్నాడు... దురదృస్టవశాత్తు ఈ మహానుభావుడికి తన హిందూ సొదరులు అత్యంత భక్తితొ పూజించే దేవతలు ఒక్కళ్ళలొ కూడా ఒక చెల్లి, తల్లి కనిపించలేదు. అది నిజంగా మన దురదృస్టమే. అతనికి జన్మనిచ్చిన ఈ దేశం మీదయినా, తొటి సొదరుల నమ్మకాలమీదన్నా ఏ మాత్రం కనీస గౌరవం ఉండి ఉంటే ఇంత రాద్దంతం జరిగి ఉండేదు కాదు. ఎం.ఎఫ్. హుస్సేన్ ని కూడా ఎంతొ మంది ముస్లిం కళాకారులని అభిమానించినట్టు ఈ దేశ ప్రజలు నెత్తిన పెట్టుకునే వారు. ఒక బిస్మిల్లా ఖాన్, ఒక జకీర్ హుస్సేన్ లా అత్యంత గౌరవం పొందగలిగేవాడు. అసలు అంతెందుకు ఈ ఎం.ఎఫ్. హుస్సేన్ వికృత చర్యలు చూసి అసహ్యించుకునే ప్రజల్లొ అత్యధికులు తమ జీవితానికి రొల్ మోడల్ గా స్వీకరించిన అబ్దుల్ కలాం కూడా ముసల్మానే. ఈ కుహాన మేధావులు గమనించాల్సింది "ఈ దేశ ప్రజలు చూసేది వ్యక్తి మతం కాదు కేవలం వారి సంస్కారం మాత్రమే".
మతాన్ని చూసి పాకిస్తాన్ని ద్వేషిస్తున్నారంటూ కారుకూతలు కూసే జొకర్లకు ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. ప్రపంచవ్యాప్తంగా 51 ముస్లిం డామినేటేడ్ దేశాలు ఉన్నాయి. అందులొ కేవలం పాకిస్తాన్ ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నాం ? కేవలం మత ప్రాతిపదకన అయితే మిగతా 50 దేశాలను అదే విధంగా ద్వేషించాలి కదా? ఈ ప్రశ్నకు మీదగ్గర సమాధానం దొరకితే కసబ్ కి ఎందుకు ఉరిశిక్ష అమలు పరచాలొ తెలుస్తుంది. అయినా మీలా చైనా చంక నాకే వాళ్ళకి ఇవేం అర్ధం కావులెండి.
ఇక మన చీకటి మేధావివర్గం వాదించే ఇంకొక పనికిమాలిన పదం "ఫ్రీడం అఫ్ ఆర్ట్ ". ఉదాహరణకి ఒక కాలేజిలో ఒక కుర్రాడు తన తోటి విద్యార్ధినిని నగ్నంగా ఒక చిత్రం గీసేసి ఇది ఫ్రీడం ఆఫ్ ఆర్టు ఆంటే ఊరుకుంటారా. పోనీ ఒక పబ్లిక్ ఫిగర్ ఆయిన ఒక మహిళా నాయకురాలిని గీస్తే ఊరుకుంటారా ? ఉహు పోనీ ప్రధాన మంత్రిని , మాజీ ప్రధాన మంత్రిని ?? అది కూడా ఫ్రీడం ఆఫ్ ఆర్ట్ కాదన్నమాట. పోనీ మహాత్మా గాంధిని తల లేకుండా గీస్తే ? అది ఓకే అనుకుంటా... ఎందుకంటే ఎదురు అడగడానికి , కేసు వెయ్యడానికి ఆయన ఇప్పుడు లేరు కదా.. అందుకే మన హుస్సేన్ అంత ఈజీగా ఆయనకి తన చిత్రం లో శిరచ్ఛేదనం చేసేసాడు. ఈ సదరు కామెడి హుస్సేన్ ఒకానొక ఇంటర్వ్యూలొ హిట్లర్ ని చిన్నచూపు చూడటానికి కావాలని హిట్లర్ ని నగ్నంగా చిత్రీకరించానని చెప్పాడట. ఆంటే ఈయన దృష్టిలో నగ్నంగా చిత్రీకరించడం ఆంటే అవమానించడమనే కదా.. మరి హిందూదేవతల్ని నగ్నంగా గీసినప్పుడు అదే ఉద్దేశ్యమా ? అవునుమరి రాముడు ఏ ఇంజనీరింగ్ లో చదివాడు, పట్టా ఉందా, రాముడు తాగుబోతు కాదా ఆన్న రాజకీయ నాయకుల్నే మనం వదిలేసాం... మరి పాపం రాముడు, శివుడు ఏ న్యాయశాస్త్ర పట్టాలు తీసుకున్నారని ఈ హుస్సేన్ మీద కేసులు పెట్టగలరు...అందుకే అనుకుంటా హుస్సేన్ కి అంత బరి తెగింపు. ఈ చీకటి మేధావులకి ఒక ప్రశ్న... ఇప్పుడు ఒక హిందూ కళాకారుడు ఏ మహ్మద్ ప్రవక్తదో , జీసస్ దో అభ్యంతరకరం గా బొమ్మలు గీస్తే అది ఫ్రీడం ఆఫ్ ఆర్ట్ గానే వస్తుందా.. అప్పుడు ఆ హిందూ కళాకారుడిని మీరు ఇలాగే వెనకేసుకోస్తారా ?
ఒక ముస్లిం వనితను గీసినప్పుడు పూర్తి బట్టలతో... సీతాదేవిని గీసినప్పుడు పూర్తి నగ్నంగా ...
ఒకే చిత్రం లో ఒక ముస్లిం రాజు, ఒక బ్రాహ్మణుడు ఉంటే... ముస్లిం రాజు పూర్తి బట్టలతో కత్తి పట్టుకుని , బ్రాహ్మణుడు మాత్రం పూర్తి నగ్నంగా తలవంచుకుని
తన తల్లి పూర్తి బట్టలతో... లక్ష్మీదేవి నగ్నంగా వినాయకుడి మీద కూర్చున్నట్టు..
ప్రవక్త కూతురు పూర్తి బట్టలతో హుందాగా... సరస్వతి దేవి నగ్నంగా...
ముస్లిం కళాకారులు పూర్తి బట్టలతో... భరతమాత నగ్నంగా...
నగ్నంగా మాత్రమే కాదు.. తనలోని విశృంఖల వికార ఆలోచనలను అత్యంత హేయంగా హిందు దేవతల మీద ప్రయోగించిన సెక్స్ మేనియాక్ వీడు.
ఒక్క ముస్లిం వ్యక్తి నయినా నగ్నంగా గీసాడా.. ఒక్క హిందూ దేవతనయినా వదలి పెట్టాడా... ఇదేనా కళంటే ? వీడికా మనం గౌరవం ఇవ్వాలి. కళ అనేది ప్రజలని రంజింప చేసేది. వారి మనొభావాలతొ ఆడుకునేది కాదు. వీడు పికాసో ఆఫ్ ఇండియా కాదు.. పెర్వేర్ట్ ఆఫ్ ఇండియా. a disgrace to whole India art community.
వీడి పాపం పండిందో లేక వీడి నికృష్ట చర్యలకు ఇక సహించేది లేదనుకున్నారో కానీ మొత్తంమీద వీడి మీద నాన్ బెయిలబల్ వారంట్ ఇష్యూ అయ్యింది. న్యాయస్తానాన్నిఎదురుకోలేని కొంతమంది కరుడుకట్టిన నేరస్తుల లాగ... ఈ వీరుడు కూడా దేశం వదిలి పారిపోయాడు. కొంతమంది చీకటి మేధావులు చెబుతున్నట్టు వీడు ఇక్కడ వాడికి ఎదురయ్యే బెదిరింపులకి పారిపోయి వెళ్ళలేదు... 2006 లో వీడు ఇచ్చిన ఈ " matters are so legally complicated that I have been advised not to return home " స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ న్యాయస్తానం లో విచారణ ఎదుర్కోలేక పారిపోయాడని క్లియర్ గా తెలుస్తుంది.
భరతమాతను నగ్నంగా, రేప్ చెయ్యబడ్డ స్త్రీ గా గీసిన ఈ పర్వేర్ట్ కి భారతరత్న ఇవ్వాలని , ఈరోజు మనందరం పూజించే దేవుళ్ళకి ఒక పూజ్యనీయమయిన రూపం ఇచ్చిన రవివర్మ అనే చిత్రకారుడి పేరిట ఇస్తున్న అవార్డ్ ని అదే దేవుళ్ళకి అత్యంత హేయంగా గీసిన వీడికి ఇవ్వాలనడం కేవలం మనదేశం లో మాత్రమే జరుగుతుంది. ఆ రవి వర్మ ఆత్మ అంటూ ఇంకా ఉండుంటే ఈ వార్తా చదివి ఎంత కుమిలిపోయేదో.
ఈ కుహానా మేధావులు వల్లించే విశాల దృక్పదం వారి స్వంత మనుషుల మీద లేక కుటుంబ సభ్యుల మీదో ఏదయినా అన్యాయం జరిగితే ఉంటుందటారా (వారి కుటుంభ సబ్యులకి క్షమాపణలు తో). మరి తన కన్నా, కుటుంబం కన్నా ఎక్కువ గా ప్రేమించే తన సంస్కృతీ ని, దేశాన్ని ఎవడో ఉచ్ఛనీచాలు మరచిన కాముకి అసభ్యం గా కించపరుస్తూ ఉంటే అదే విశాల దృక్పదం తో చూస్తూ ఊరుకోవాలా.. ఇది విశాలదృక్పదమా లేక చేతకాని తనమా. ఈ దేశంలో మెజారిటీ మతానికి చెందినంత మాత్రాన హిందువులకి చీము నెత్తురు లేకుండా పోతుందా. వోట్ బ్యాంక్ రాజకీయాలు. వాటికన్ నుండి పోటేత్తుతున్న డబ్బుతో చెలరేగిపోతున్న కొన్ని మిషనరీలు , దేశాన్నిపట్టి పీడిస్తున్న అత్యంత దరిద్రమయిన రోగాలలో ఒకటయిన మన మీడియా, వారు క్రియేట్ చేసే కుహానా మేధావులు, వీడిలాంటి వెధవలు కలసి మన దేశాన్ని అల్లకల్లోలం చెయ్యడానికే కంకణం కట్టుకున్నారు.
సభ్యసమాజంలో నివసించే ప్రతి మనిషి తన వ్యక్తిగత స్వేచ్చకి (personal freedom ) సంఘ బాధ్యతకు (social responsibility) కి సరి ఆయిన బాలన్స్ మైంటైన్ చేస్తేనే అతనికి సమాజం లో గౌరవం దక్కేది. ఫ్రీడం ఉంది కదా అని సోషల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి అడ్డు అదుపు లేని ఉన్మాదిగా ప్రవర్తిస్తే, వాళ్ళు ఎంత ప్రతిభావంతులయినా కూడా వారికి కనీస గౌరవం కూడా దక్కదు. అలా తనకి దక్కిన అంతులేని స్వేచ్చని తన విపరీత బుద్దితో , చుట్టూ ఉన్న సంఘ బాద్యత మరిచి, బరి తెగించి, ఒక వర్గం వారిని తన విపరీత చర్యల ద్వారా కించపరచడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న ఈ కిరాతకుడికి చివరకు మిగిలింది.. దేశం యావత్తు ఖాండ్రించి తన మీద ఉమ్మేయ్యడం, కోర్టు కేసులు, వీటన్నిటిని ఎదుర్కోలేక పారిపోయి పరాయి దేశం లో దాక్కుని, చివరకు అక్కడే చావడం.
ఇక్కడ ఇచ్చిన లింక్ లో వీడు ప్రపంచానికి చూపించిన దరిద్ర నీచ నికృష్ట కళ ఉంది. ఇది చూసి మీరు బాధ పడొచ్చు. ఇలాంటివి పనికట్టుకుని మీకు చూపించినందుకు నన్ను తిట్టుకోవచ్చు. కానీ వీడు ఎటువంటి వాడో అందరికీ తెలియాలి. మీ మనసులో ఏ మూలయినా వీడి మీద కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే ఇవి చూస్తే మీకే అర్ధం అవుతుంది. వీడు ఎటువంటి వెధవో తెలియనివారు ఎవరయినా ఉంటే వారికి చెప్పాల్సిన బాధ్యత మనందరిది. భారతీయ కళారంగానికే కాదు.. దేశానికే వీడో మాయని మచ్చ.
WOW!!!!
ReplyDeleteTake a bow my friend.. this is one of THE BEST Articles I read in the recent past.. YOU ROCK!!
Excellent...sir..
ReplyDeleteనిప్పురవ్వ కాదు మాష్టారూ.. అగ్గిబరాట మీరు
Very nice article.
ReplyDeleteGreat post... ప్రవక్త బొమ్మ గీసినందుకే ఫత్వా జారి అయింది... ఇదంతా మన చేతగాని తనమే. హిందువులంతా ధైర్యంగా తమ గురించి తాము పోరాడే స్తితికి ఎప్పుడు వస్తారో...
ReplyDeleteBan all the art work of Maqbul Fida Hussain in the world
ReplyDeletePrasad
Detailed post. But What can be done now?
ReplyDeleteదేశానికి మచ్చో, మరకో... భూమ్మీదికొచ్చాడు, చచ్చాడ. ఇప్పుడు చేసేది ఏంటి?
మొదటిగా మీకు అభినందనలు.ఇంతచక్కగా విశ్లేషణాత్మకంగా పెద్ద టపా వ్రాయడానికి మీరు ఎంత ఆలోచించివుంటారు,శ్రమించి ఉంటారు అని తలుచుకుంటే మీ మీద చాలా గౌరవం కలుగుతుంది. మీరు వ్రాసింది 100% సరైయినదే. అదేమీ దౌర్భాగ్యమో మెజారిటీ హిందువులకి హక్కులు లేవు,సెంటిమెంట్లు లేవు,భక్తితో ఉండటం మతతత్వవాదం.మైనారిటీ వాళ్ళు ఏమి చేసినా,గీసినా,రాసినా సమర్ధనీయం. ప్రపంచములో ఒక్క మనదేశములోనే ఇలాంటి దరిద్రపు పరిస్థితి.
ReplyDeleteనేనోకమారు నా స్నేహితునితో కలసి బంజారాహిల్స్ లోఉన్న మెంటల్ ఫకీర్ హు'సిన్' (M F Hus'sin')ఆర్ట్(?)గ్యాలరీకి వెళ్లి డబ్బులు కట్టి ఎంట్రీ టికెట్ తీసుకుంటే,మా చొక్కా చేతికి స్టిక్కర్ అంటిన్చుకోవాలంటా, తిరిగి వేల్లెంతవరకు ఉంచుకోవాలంట.ఎంత అహంకారమో చూడండి.నేను గట్టిగా తగులుకున్నాను, మేము ఇక్కడ డబ్బులు కట్టి మీ గ్యాలరీలో నేరస్తులమాదిరిగా స్టిక్కర్లతో తిరుగం అని అరుస్తే అప్పుడు సరే స్టిక్కరు అవసరం లేదు చూడండి అన్నాడు అక్కడి గేటుకీపరు.చూసారా ఇక్కడ పుట్టి,పెరిగి(ఖర్మకొద్దీ మన హైదరాబాదులో),ఇక్కడ కళాకారుడిగా పేరు తెచ్చుకుని,ఇక్కడ డబ్బులు సంపాదించుకుని,ఇక్కడి ప్రజలు తన ఆర్టు గ్యాలరీకి డబ్బులు కట్టి చూడటానికి వస్తే చేతికి స్టిక్కర్లు. ఇది నేనేదో నాకు వ్యక్తిగతంగా జరిగిన అవమానంగా చూసి విద్వేషముతో వ్రాయడం లేదు.ఇందులో ఆసక్తికరమైన సంగతేమిటంటే మాముందు ఉన్న ముస్లిం సందర్శకులకి స్టిక్కర్లు లేవు! నేను వారిని అడిగా మీకు చేతికి స్టిక్కర్ వేస్తామనలేదా అని వాళ్ళు అదేమీ లేదే అని అన్నారు. ఇప్పుడు చెప్పండి మన రక్తం మరగాదా,కోపం రాదా? కారణం మేము హిందువులం కాబట్టి మాకు స్టిక్కర్లు. ఇలాంటి mother fuxxxr గాడి గ్యాలరీకి వెళ్లినందుకు నేను చాలా రోజులు బాధపడ్డాను. పిరికిపంద,దేశద్రోహి చివరికి అనామకంగా చచ్చి కూడా చివరికి ఇలా ఇక్కడ తలుచుకోబడటమే పాపం. ఇలాంటి లుచ్చా గురించి ఎక్కువ చర్చ అనవసరం.
నేనుకూడా కార్తీక్ గారిలా...WOW!!!!
Take a bow my friend.. this is one of THE BEST Articles I read in the recent past.. YOU ROCK!!
దీని మీద నేను కూడా రాయాలనుకుని కాస్త రీసెర్చీ(అదే గూగులు సెర్చి) చేశా. ఈలోగా మీరేశారు. అసలు హుస్సేన్ అనే మహానుభావుడు ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలీదు. అందరూ ఆర్టు లవర్లు కాదు కదా.
ReplyDeleteఅతను గీకిన బొమ్మల గురించి కూడా చాలా మందికి తెలీక పోవచ్చు. అలాంటప్పుడు, అప్పుడెప్పుడో గీకితే ఇప్పుడు తిట్టడం ఎందుకు అనే ప్రశ్న ఉన్న ఔచిత్యం ఎంత? దాని గురించి ప్రజలకు తెలిసే కొద్దీ, అందులోని భావాలు వారికి అర్థమయ్యే కొద్దీ నిరసన జ్వాలలు పెరుగుతాయి అంతే.
Visekhar! హ హ హ A loser in life and wants everyone to be like him. తన జీవితం చంక నాకిపోయిందని, మిగతా వాళ్ళందర్నీ కూడా "మీరేదో కోల్పోతున్నారూ, మీరూ నాలాగే తయారవ్వండీ, అపుడు కానీ మీకు జీవితం జీవించటం తెలవదు" అని బోధించే తత్వవేత్తలు తెలుగు బ్లాగులోకంలో విశేకరే కాకుండా ఇంకా వేరే సబ్జక్టుల గురించి రాసే incompetent folks and perverts ఉన్నారు.
ReplyDeleteబై ద వే, Very Persuasive and well written. ఈ సబ్జక్టు గురించి, ఇంత కోఆర్డినేటెడ్ గా, క్రోడికరించి, సూటిగా ఆలోచించేలాగా రాసిన ఆర్టికల్ చదవడం, తెలుగు బ్లాగుల్లో చదవడం నేనిదే మొదలు.
చాలా సార్లు నేను కూడా ఆయనొక ఆర్టిస్టు, Let us give him a pass అని అనుకున్నవాణ్ణే. కాని మీర్రాసింది ఒక్కసారి ఆలోచింపచేసిన మాట వాస్తవం.
అన్నా హజారే గారి మీద చేసిన అరోపణలకు, పాకిస్తానులోని వారు మన రక్త సంబందీకులే అయినా వారిని ద్వేషించడానికి కారణం మతమే అన్న వాదనలకు నాకు తోచిన సమాధానాలు నేను రాశాను. ఒకసారి వీలైతే ఒక లుక్కేయండి.
ReplyDeleteఅన్నా హజారేపై ఆరోపణలు సమంజసమైనవేనా..!!
అన్నా హజారే పై మీడియా పక్షపాత వైఖరికి సాక్షమిదిగో..!!
రక్త సంబంధాలు, పాకిస్తాన్ – నా సందేహాలూ, ఆలోచనలు..!!
సూపర్... ఆ చెత్త నాకొడుకొని సపోర్ట్ చేసేవాళ్ళందర్నీ నగ్నంగా గీసి పారేసి గోడలమీద అతికించేసి ఆ పోస్టర్లని బజార్లో పావలాకో, పది పైసలకో వేలం వెయ్యాలి. :-)
ReplyDeleteThat's a straightforward and a very comprehensive article!
ReplyDeleteThanks for giving us (people like me who don't know much before) a more clear picture of his idiocity.
I really appreciate your time and efforts to come up with such an educative post.
Wish to see more of you Sir!
-Radha
ఫస్ట్ మీరు ఆర్టికల్ని స్టార్ట్ చేసిన విధం నాకు బాగా నచ్చింది. 'మేతావులెలా' వుండాలో విశ్లేషించారే అదీ బావుంది. టోటల్ గా మీరు ఎం. ఎఫ్ మీద లాండయిన విధానికి స్టార్టింగ్ ఎందుకో మీరు స్ట్రైట్ లైన్ తీసుకోలేదని అనిపించింది. మీ ఆర్టికల్లో మీ ఆవేదన అర్ధం చేసుకోదగినది. ఇది వాస్తవం. 'ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్' గా మీరు హుస్సేన్ కథనంలోకి వెళ్లాల్సి వచ్చిందా? అర్ధం కాలేదు. ఎనీహౌ బెస్టాఫ్ లక్. మీరు ఫలానా అని తెలిసేలా రాసినట్టు కనిపించింది. మీ ఉద్ధేశం అదే అయితే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ, కులమతవర్గవిభేదాలకు అతీతంగా వుండటం ఇష్టపడుతున్నట్టైతే.. మీరు కాస్త మీ రైటింగ్ స్టైల్ ఛేంజ్ చేసుకోవాలి. ఇది నా సూచన. గుడ్ కీపిటప్. మీకు నా అభినందనలు!!! ఈ సూచన ఎందుకు చేస్తున్నానంటే.. భారతమాత బట్టలూడదీయడాన్ని హిందువులే బాధపడాల్సిన అవసరం లేదు. అన్నారు అందుకని ఈ సలహా. ఓకే.
ReplyDeleteExcellent. Very well written !!!
ReplyDelete"అయినా మీలా చైనా చంక నాకే వాళ్ళకి ఇవేం అర్ధం కావులెండి. "
ReplyDeleteభలేవారు. వీళ్ళకు చంకలు దొరకుతాయా? చాలా ఎత్తేమో కదా... తక్కువ ఎత్తులో అందుబాటులో వున్నవాటితో సరిపెట్టుకుంటున్నారు.
excellent brother.
ReplyDeleteమాస్టారు.....ఈ మధ్య కాలం లో ఇంత అద్భుతమైన పోస్ట్ చదవలేదు......ఇరగ దీసారంతే...
ReplyDeleteవేసుకోండి నాలుగు వీర తాళ్ళు..................
http://sureshkadiri.blogspot.com/2011/12/blog-post_26.html
ReplyDeleteఆ కదిరి కుర్రోడు మొహమాటపడి డైరెక్టు గా అనలేకపోయ్యాడు గానీ, ఆ మరుసటి రోజేసిన కథకి అర్థమేటంటే, "వొరే యువర్ గాడ్, ఇక మూసుకొని పోమ్మా" అని!
Avi paintings aa? Thuuu!!
ReplyDelete"..వితండ మార్తాండ వాదన..."
ReplyDeleteI think in Mamchu Pallaki blog I had written my version of so called MEDHAVI. Thanks for repeating it here.
"...వితండ మార్తాండ వాదన..."
ReplyDeleteYou have coined an excellent and useful phrase which just depicts the present atmosphere in our Society.
Medhavi definition is here.
ReplyDeletehttp://kasturimuralikrishna.com/?p=1286
ఈ మాత్రం చెప్పడానికి అజ్ఞాతగా ఎందుకండీ ఎనానిమస్‌గారూ
ReplyDeleteశివరామప్రసాదు గారూ,
ReplyDeleteఇప్పుడే ఆ పై లింకుకి వెళ్ళీ చూసానూ.
హబ్బ, ఎంత బాగా సమ్ అప్ చేసారండీ, మేధావి నిర్వచనాన్ని.
Loved it :-)
హాట్సాఫ్ నిప్పురవ్వ గారు.అదిరింది మీపొస్ట్.స్సుప్పెర్బ్.ఈ వెధవ నా కొ....ఒక ఆర్టిస్ట్, వీడికొక ఫాలోఇంగ్.మన దేవతలమీద వేసిన పెయింటంగ్స్ చూసినపుడే రక్తం సల సల కాగింది.కాని ఎమీ చేయలేకపొయాము .ఇదే రివర్స్లో జరిగుంటే ఎంత కల్లోలం జరిగుండేదో!
ReplyDeleteమనం సిగ్గులేని వాల్లం,చేతకానివాల్లం.మన పాలకులు మరీ chetakaavivallu. ఇలాంటివన్ని చూసి చూసి ఎమీ చేయలేక నేను కూడా manaumu emee cheyalemaa...? అనే
ఓ బ్లాగును పెట్టాను,చదివి మీ అభిప్రాయాలను post cheyagalaru
హాట్సాఫ్ నిప్పురవ్వ గారు.అదిరింది మీపొస్ట్.స్సుప్పెర్బ్.ఈ వెధవ నా కొ....ఒక ఆర్టిస్ట్, వీడికొక ఫాలోఇంగ్.మన దేవతలమీద వేసిన పెయింటంగ్స్ చూసినపుడే రక్తం సల సల కాగింది.కాని ఎమీ చేయలేకపొయాము .ఇదే రివర్స్లో జరిగుంటే ఎంత కల్లోలం జరిగుండేదో!
ReplyDeleteమనం సిగ్గులేని వాల్లం,చేతకానివాల్లం.మన పాలకులు మరీ chetakaanivaallu..
ఇలాంటివన్ని చూసి చూసి ఎమీ చేయలేక నేను కూడా manamu emee cheyalemaa...? అనేఓ బ్లాగును పెట్టాను,చదివి మీ అభిప్రాయాలను post cheyagalaru .