Apr 17, 2010

ఉప్పొంగే కడలి.

మీరెప్పుడైనా టపా రాసి అది ఎప్పుడు సంకలినిలో కనబడుతుందాని ఎదురు చూసారా?

పిచ్చి ప్రశ్న... కదా?

టపా రాసిన ప్రతి ఒక్కరం చేసే పనే అది. మనం రాసింది ఎప్పుడు అగ్రిగేటర్ లో వస్తుందా అని ఎదురు చూడడం, జనాలు మనం రాసింది తొందరగా చదువితే బాగుండు అని ఆరాటపడడం, చదివిన వాళ్ళు ఏమైనా కామెంట్స్ రాసారా అని పడిగాపులు గాయడం... ఇవన్నీ బ్లాగరుగా మనకందరికీ నిత్యకృత్యాలు.

టపా రాసిన ప్రతి బ్లాగరూ మొదట చేసే పని... అది అగ్రిగేటర్లో తొందరగా కనబడితే బాగుండని కోరుకోవడం. అయితే మన ఎదురుచూపులతో సంకలినులకు సంబంధం లేదు కాబట్టి అవి తీరికగా వాటికి టైమ్ దొరికినప్పుడు మీరు రాసిన టపాలను మిగతావాళ్ళకు చేరవేస్తాయి. అంతేకాకుండా, బ్లాగర్లు భావప్రకటన స్వేచ్చకు లోబడి ఏమిరాయాలి, ఎందుకు రాయాలి, ఎలా రాయాలి అని అప్పుడప్పుడు మనకు నీతిబోధ కూడా చేసి అంతర్జాలంలో తెలుగు బ్లాగర్ల ఎదుగుబాటుకు శాయశక్తులా కృషి చేస్తుంటాయి.

అయితే...

బ్లాగు గొడవలకు అతీతంగా, తెలుగు బ్లాగరుగా మీ అభిప్రాయాలను, మీ స్వేచ్చను గౌరవిస్తూ, క్షణాల్లో మీ భావాలను అందరికీ చేరవేసే సంకలిని ఒకటి ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకునే ఉంటారు. కదా?

సరే, మరి ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు?
ఎందుకంటే...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఒక్క రెండు రోజులు ఓపిక పట్టండి మీకే తెలుస్తుంది. :)

10 comments:

  1. టెండర్ పెద్దదానికే ఏశినట్లున్నరు

    ReplyDelete
  2. కడలి దెబ్బకి జంక్షన్లు జాం అయిపొడ్డి జంక్షన్ ని తెలుగులో ఏమంటారో ?

    ReplyDelete
  3. హారం కు తోడుగా కడలిలో కూడా భావ స్వేఛ్ఛ ఉప్పొంగాలని ఆశిస్తాను.

    ReplyDelete
  4. కడలిలో పేరడీలు కల్లాస్ గా ఉంటాయని పేరడీ ప్రియులు ఉబలాటపడుతున్నారు

    ReplyDelete
  5. By the way, Thanks to Prasad Pyboyina for the creative thoughts!

    ReplyDelete
  6. కె.బ్లాగులుకు ఇహ జజ్జనక జనారె పండగే పండగ.....

    ReplyDelete
  7. కడలి పొంగే కెరటం లా లేస్తే పర్వాలేదు గాని
    క్షీర సాగర మధనం లో లక్ష్మి దేవి రాగానే
    రాక్షసులు , దేవతలు కొట్టుకునట్టు గా
    యి కడలి నిర్వాహకుల దగ్గరి కి కుడా
    ఎవరన్న జ్యోతులు వెలిగించుకుంటూ వచ్చి
    మన సంకలిని లో అమృతం వుంచి హాలాహలం
    తీసేద్దమంటే అప్పుడు తెలుస్తుంది యి కడలి పొంగే కెరటమో ?
    పడిలేచే కెరటమో?బెస్ట్ అఫ్ లక్

    ReplyDelete
  8. kadalali lo kagadaa lu untaayaa

    ReplyDelete
  9. మీ స్వేచ్చను గౌరవిస్తూ, క్షణాల్లో మీ భావాలను అందరికీ చేరవేసే సంకలిని// baavuMdi. edurucustu untam.

    ReplyDelete