Sep 10, 2013

రాసేది రంగనాయకమ్మ అయితే చిడతలు వాయించేది చవటాయిలని ..







రంగనాయకమ్మ చెంచాలు విషవృక్షం గురించి ముఖ్యంగా చెప్పేది విషవృక్షంలో లాజిక్ చూడమని. అది కూడా చూద్దాం!

మన సోకాల్డ్ మహారచయిత్రి మాటల్లోనే క్రింది విషయంతో మొదలుపెడదాం.

1. "ఎందుకంటే దశరధుడు కైకని పెళ్ళి చేసుకునేటప్పుడు కైక బిడ్డకే రాజ్యం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు"

2. "రాముడు అడవుల్లో ఉన్నప్పుడు.. అప్పుడు బయటపడింది ఆ విషయం"

3. "ఆ విషయం తెలిసికూడా రాముడు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాడంటే అది రాముడి కపటత్వం అవ్వదూ?"


రామాయణంలోకి వస్తే ఆయోధ్యకాండ నాలుగవ సర్గ పదిహేనవ శ్లోకంలో దశరధుడు రాముడికి పట్టాభిషేకం విషయం చెప్తాడు. అదే సర్గలో రాముడు పట్టాభిషేకానికి సిద్ధమవుతాడు. మంథర పాత్ర ఏడవ సర్గ నుండీ మొదలవుతుంది. అంటే పట్టాభిషేకానికి సిద్ధపడేసమయానికి రాముడికి దశరధుడివరాల సంగతి తెలియదనే కదా? రంనాయకమ్మ లాంటి మార్క్సిస్టులకి ఆపాటి కనీస జ్ఞానం ఉంటే ఇంకేం?

ఇక అడవుల్లో రాముడు భరతుడితో అన్న మాటలివీ:

(అయోధ్యకాండ నూట ఏడవ సర్గ నుండి)

పురా భ్రాత: పితా న: స మాతరం తె సముద్వహన్
మాతామహె సమాష్రౌశీద్ రాజ్య శుల్కం అనుత్తమం


భ్రాత:= ఓ సోదరా!
పురా= పూర్వము (చాలా రోజుల క్రితం)
సముద్వహన్= పెండ్లాడేటప్పుడు;
తె మాతరం= నీ తల్లికి;
స:= అని
న: పితా= మన తండ్రి
సమాష్రౌశీత్= ప్రమాణము చేసెను
అనుత్తమం= ప్రత్యేకమయిన
రాజ్యషుల్కం= రాజ్యశుల్కం;
మాతామహె= మీ తాతగారికి

అంటే...

"ఓ సోదరా, మన తండ్రి నీ తల్లిని పెండ్లాడేటప్పుడు మీ తాతగారికి రాజ్యశుల్కమిస్తానని ఒప్పుకున్నారు"

ఇచ్చేది ఎవరికి? కైకేయి తండ్రికి.
కైకేయి తండ్రి దానిని తీసుకున్నాడా? లేదు.
అంటే అది కైకేయి తండ్రి తీసుకునేవరకూ దశరధుడి వంశానికే చెదుతుంది. ఒకవేళ తీసుకుని ఉంటే కైకేయి సోదరుడికి చెందుతుంది తప్ప, భరతుడికి చెందదు.

దాని తరువాత రాముడు భరతుడికి దశరధుడి వరాల సంగతి చెప్తాడు.. దాని గురించి కూడా పైనే చెప్పుకున్నాం. కనుక ఇక్కడ భరతుడి హక్కు, అది రాముడికి తెలియడం అనే ప్రసక్తి రానే రాదు.

కానీ రాసేది రంగనాయకమ్మ అయితే చిడతలు వాయించేది ఆవిడ చెంచాలే కదా!

ఇక వాల్మీకి రాముడి భజన గురించి. ఒక మూల కవి ఇలా ఎందుకు రాయలేదు, అలా ఎందుకు రాశాడు అని సన్నాయి నొక్కులు నొక్కుతూనే రామయణం అనేది వాల్మీకికంటే ముందునుండే ఉందన్న వాదన ఒకటి.

పనిమనిషికి కడుపు చేసి శిష్యుడి మీద వదిలేసిన మార్క్స్ గారికి మరి ఈవిడ చేసేదేమిటో? భజన కాదూ? చెంచాగిరీ కాదూ?


2 comments:

  1. నాకొక సందేహం. దశరథుడు కైకకి ఇచ్చినవి రెండు సార్లు తను కోరిన కోరికలు తీరుస్తాననా? లేక ఆమెకు పుట్టిన వారికే రాజ్యాధికారం ఇస్తాననా? ఎందుకంటే మనం చదివే వెర్షన్లలో దశరథుడు కైక కి రెండు వరాలు ఇచ్చినట్లు ("ఇదీ" అని చెప్పకుండా ఏవైనా రెండు కోరికలు తీరుస్తానని), ఆ రెండు వరాలనే కైక భరతునికి రాజ్యము రామునికి వనవాసము రూపం లో అడిగినట్లు ఉంది. వీలైతే దశరథ-కైక సంభాషణ గురించిన భాగాన్ని చదివి వివరించగలరా?

    ReplyDelete
    Replies
    1. Surya,

      Here is the aforesaid conversation: (Ref. Valmikirmayan.net)

      स्मर राज्न् पुरा वृत्तं तस्मिन् दैवासुरे रणे |
      तत्र चाच्यावयच्छत्रुस्तव जीवतमन्तरा ||

      స్మర్ = గుర్తుంచుకో
      రాజన్ = రాజా!
      వృతం = సందర్భంలో;
      తస్మిన్ = అని;
      దైవాసురె = దేవాసురుల మధ్య
      పురా = ఇది వరకూ
      తత్ర = యుద్ధంలో
      వరన్ = వరములు
      మె = నాకు


      तत्र चापि मया देव यत्त्वं समभिरक्षितः |
      जाग्रत्या यतमानायास्ततो मे प्राददा वरौ ||

      దెవ = రాజా!
      తత్రచ = అక్కడ
      యత్ = దేనివలన
      త్వం = నీవు
      సమభిరక్షితహ్ = రక్షింపబడ్డావో
      మయా = నా ద్వారా
      తతహ్ = దానివలనే
      ప్రాదదాహ్ = నీవు ఇచ్చవు
      కామ మొహితం = మోహితుడవై
      వరదం = వరదానం చేశావు


      तौ तु दत्तौ वरौ देव निक्षेपौ मृगयाम्यहम् |
      तथैव पृथिवीपाल सकाशे सत्यसंगर ||
      దెవ = రాజా
      పృథివీపాల = పుడమిని రక్షింపువాడా
      సత్యసంగర = మాట నిలబెట్టూకునేవాడా
      అహం = నేను
      మృగయామి = వేచియున్నాను
      తౌ వరౌతు = వరములకోసం
      దత్తౌ = ఇచ్చిన
      నిక్ష్హెపౌ = నిక్షేపంగా
      తవ సకాషేవ = నీవద్ద


      तत्प्रतिश्रुत्य धर्मेण न चेद्दास्यसि मे वरम् |
      अद्यैव हि प्रहास्यामि जीवितं त्वद्विमानिता ||

      తత్ = అందువలన
      ప్రతిష్రుత్య = మాట ఇచ్చినట్లుగా
      మె = నా
      వరం = వరములు
      న దాష్యసి = నాకు ఇవ్వని ఎడల
      ధర్మెణ = నా ధర్మం ప్రకారము
      త్వద్విమానితా = నీచే త్యజింపబడినదానిగా
      ప్రహాష్యామి హి = ముగించెదను
      జీవితం = జీవితమును
      అద్యైవ = ఇప్పుడే


      -----------------------

      As you said, ఆ వరాలనే కైక భరతునికి రాజ్యము రామునికి వనవాసము రూపంలో అడిగినట్లు

      Delete