
ఆచంగ గారి బ్లాగులో చెగువేరా గారు శెలవిచ్చారు:
"నాతో పెట్టుకుంటే బ్లాగుల్లో బ్రతకలేవు సోదరా" అని ...
నాకు నిజంగా ఈ బ్లాగులు పెద్ద ఎడిక్షన్ అయ్యాయి. ఎంత వదిలించుకుందామని చూసినా వదలట్లేదు. కనుక ఈ చెగువేరాతో పెట్టుకుందామని ఉంది. చూద్దాం మనవాడికి నన్ను బ్లాగుల్లోంచి వెళ్ళగొట్టగలిగే సీనుందో లేదో. వాదించటానికి పాపం తగిన మెటీరియల్ లేకపోతే కమ్యూనిష్టు జోకర్లు ఎలాంటి బెదిరింపులకి దిగుతారనేదానికి ఇదే పెద్ద ఉదాహరణ.
ఆ ప్రయత్నంలో భాగంగా ఆచంగ గారు వ్రాసిన పోస్టులో కొంతభాగాన్ని ఇక్కడ యథాతథంగా కాపీ కొడుతున్నా. పూర్తి పోస్టు చదవాలంటే లంకె ఇదిగో:
http://krishnaveniteeram.blogspot.com/2011/10/3.html
ఇక 25 సం అధికారములో ఉండటమంటే ఒక రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చెయ్యవచ్చో ఆలోచించండి. మతతత్వవాది అని తెగ ఆడిపోసుకునే మోడీ సాధించినదాంట్లో పావుశాతం కూడా నాకు కనబడలేదు. నేడు వీళ్ళు తెగ తిట్టిపోసే మోడీ అధికారములో ఉన్న గుజరాత్, నితీశ్ అధికారములో ఉన్న బీహార్ నేడు ఫలితాలు ఎలా చూపిస్తున్నాయో మనకు అర్థము అవుతుంది. వెంటనే వీళ్ళంటారు అదంతా మీడియా పెయిడ్ న్యూస్ అని. సరే అదేవార్తో పక్కన పడేద్దాం. భారత దేశములో కళ్ళు మూసుకుని ఉద్యోగాలకు ఎగబడుతున్న నగరాలు ఏవి అంటే ఢిల్లీ, హైదరాబాద్, చంఢీగడ్, ముంబాయి, సూరత్, అహ్మదాబాదు, చెన్నై, బెంగళూరు. ఇవి కొన్నే. పసిపిల్లాడి నోటి వెంటయినా పొరపాట్న కూడా కలకత్తా పేరు రాదు. దాన్ని బట్టే అర్థమవుతున్నది కదా బెంగాలుకు కమ్యూనిస్టుల గ్రహణం పట్టి ఏ గతి పట్టిందో! పైగా ఇరవైనాలుగ్గంటలూ బి.జె.పి మాత్రమే మతతత్వ పార్టీగా వీరికళ్ళకు కనబడుతుంది. మతాన్ని రాజకీయాలకు వాడుకునే మరేపార్టీ కనిపించదు దేశములో వీరికి! దీన్ని గ్రహించే కాబోలు మలయాళీలు, బెంగాలీలు తప్పించి దేశములో వీళ్ళని మరెక్కడా పీఠం ఎక్కించలేదు. పీఠం ఎక్కించినవారి పరిస్థితేమిటో కళ్ళముందే కనబడుతున్నది. ఇక వీటి గురించి ఇలా రాస్తూపోతే ఎన్ని బ్లాగులైనా చాలవు.
చెగువేరా, ఆ పీకేదేదో ఇక్కడ కాస్త పీకు :))