Sep 11, 2018

బ్లాగు పాఠశాల - రెండవభాగం

"ఏరా పిల్లలూ! అంతా సెట్టయ్యారా?"
"ఏం సెట్టో ఏమో సార్! ఎక్కడేసిన గొంగళక్కడే ఉంది."
"ఏవైందయ్యా?"
"చూడండి సార్! ఎలా కొట్టుకుంటున్నారో!"
"ఆ(! చూస్తున్నా!"
"మేషారూ! వచ్చేసా!!"
"ఎవరయ్యా నువ్వు? ఎప్పుడూ చూళ్ళేదూ?"
"నాపేరు వరుణ్ సార్. 2010 నించీ ఉన్నా, కానీ క్లేసు బయట ఉండి పాఠాలు నేర్చుకున్నా!"
"అబ్బో! ఏకలవ్య శిష్యుడివన్నమాట. సరే, కూర్చో!"
"సార్! నాకో సందేహం!"
"ఏంటి జిలేబీ?"
"అసలు ఏకలవ్యుడంటే ఎవరు సార్? ఒక్కరికే 'లవ్యూ' చెప్పేవాడా?"
"అబ్బా! అసలు ..."
"మీరుండండి సార్. ఈ జిలేబీ పని నేను పడతా!"
"నువ్వెవరు బాబూ?"
"నా పేరు చిరంజీవి సార్!"
"ఓహో! తమ్ముడూ, లెట్స్ డూ కుమ్ముడూ అని ఇందాక 150 సార్లు పాడి 150 బ్లాగుల్లో కామెంట్లు పెట్టింది నువ్వేనా?"
"మరే!"
"అబ్బో, ఎంత సిగ్గో, చాల్ చాల్లేగానీ కూర్చో!"
"సార్! సార్!"
"ఏంటయ్యా అనామకం?"
"గ గా గి గీ గు గూ"
"ఆపేయ్! ఆ తరవాత అక్షరం పలకద్దు!"
"అబ్బా మేష్టారూ! అదేనండీ అసలు రహస్యం. మన మేగాస్టారుకి జిలేబీ మీద ఉన్న లవ్వు ఈ విధంగా తిట్లరూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడని నాకో పెద్ద డౌటానుమానమండీ!"
"నీ మొహం. ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటూంటే లవ్వేంటీ? అయినా దీనికీ ఆ 'గ' గుణింతానికీ సంబంధమేంటీ?"
"మరేమో .. ఆ రౌడీగాడు జీలేబీని 'జీలేబీ సార్!' అంటాడండీ. ఆ శాల్తీ ఏమో సారో మేడమో తెలియకుండా మొహం మీద ముసుగేసుకుందండీ. ఒక వేళ ఆడలేడీ కాకుండా మగజెంట్ అయితే మనం చదవాల్సింది గ గుణింతం సెక్షన్ 377 కదండీ?"
"ఏడిసినట్టుంది నువ్వూ నీ తొక్కలో లాజిక్కూనూ! ఏమయ్యా రౌడీ, ఏమిటీ గోల?"
"నాకేం తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండీ సార్!"
"సార్! ఈ క్లాస్ రూముకి పట్టిన చీడ ఈ అపర లిబరల్ రౌడీగాడూ, ఆ అపర కన్సర్వేటివ్ హరిబాబూనూ! వీళ్ళవల్ల ఎంతమంది క్లేసు విడిచి పారిపోయారో!"
"ఎవరయ్యా మాట్లాడుతోందీ?"
"తెలియదు సార్! ఎవడో వెనక బెంచీ పోరగాడు!"
"ఫట్ ఫట్ ఫట్"
"ఏంటయ్యా ఆ శబ్దం?"
"సార్! రౌడీగాడు చొక్కా చింపుకుంటున్నాడండీ!"
"ఏమయ్యా రౌడీ నీకిదేం వెఱ్ఱి?"
"వెఱ్ఱికాదు సార్! జనాలని  ఇక్కడనుండి వెళ్ళగొట్టగలిగే శక్తీ, సత్తా, సీనూ, దృశ్యం నాకున్నాయని తెలియగానే  నా ఛాతీ మోదీగారి 56 అంగుళాల ఛాతీలాగా పొంగిపోయి చొక్కా చిరిగిపోయిందండీ!"
"అఘోరించావులే!"
"ఇంతకీ ఆ జనాలు పారిపోలేదండీ. ఈ క్లేసంటే బోర్ కొట్టీ ఫేస్‌బుక్ లోకెళ్ళిపోయారంతే!"
"నా క్లేసుని బోరంటావా? ఛంపేస్తా! బస్తీమే సవాల్!"
"ఎవరదీ? సవాల్ అన్నది? నేను కూడా విసరనా ఒక ఛాలెంజ్?"
"హమ్మయా! హరిబాబూ!  సవాల్ అనగానే నిద్ర లేచినట్టున్నావుగా?" 
"సార్! మీరేమనుకోకపోతే నాదో చిన్న సలహా. ఈ క్లేసులో ఇలాంటి చర్చలు మంచివి కావు సార్. అనవసరమైన బూతులు దొర్లుతాయి!"
"సరేనయ్యా శ్యామలరావ్! కాసేపట్లో ఆపేద్దాంలే!" 
"ఒరేయ్! నీ యెంకమ్మా!!"
"పోరా! నీ సుబ్బమ్మా!"
"ఏంటర్రా? ఏం జరుగుతోందిక్కడా?"
"ఏమీ లేదు సార్! ఆ వరుణ్ కుమారూ, చిరంజీవీ ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటున్నారంతే"
"ఎవరక్కడ? ఆ వరుణ్ కుమార్ పుస్తకాలు క్లేస్ బయటకు విసెరెయ్యండ్రా!"
"అలాగే సార్!"
"హమ్మయ్యా!"
"సార్! సార్!! సార్!!!
"ఇప్పుడేమయిందయ్యా చౌదరీ?"
"సార్! ఆ రౌడీగాడు  వరుణ్ పుస్తకాల్తో పాటు నా పుస్తకం కూడా విసిరేశాడు సార్!"
"ఏమయ్యా రౌడీ! ఏం పోయేకాలం నీకు?"
"అది టెంపరరీగానే సార్. ఒక సారి నాతో మాట్లాడితే వాటిని మళ్ళీ తీసుకొస్తా. ఇంకా మాట్లాడలేదు మరి! అన్నట్టు ఇక్కడ విసిరేసే బాధ్యత నా ఒక్కడిదే కాదు సార్. నేను టీములోని ఒక మెంబర్ని మాత్రమే"
"ఇదేం తలనెప్పిరా బాబోయ్! సరేగానీ జనాల గుంపులు పెద్దగా కనబడట్లేదేం?"
"పద్మార్పిత ఈ మధ్య తన రసరమ్య శృంగారభరిత ప్రేమకవితలు తగ్గించింది సార్!"
"ఓహొ!"
"సార్! నా బెంచిలో జనాలిలా కొట్టుకోవడం నాకిష్టం లేదు. ఈ బెంచి మీదకి ఇంకెవర్నీ రానివ్వదల్చుకోలేదు!"
"సరే కొండలరావ్! నీ ఇష్టం!"
"సార్ ఇదన్యాయం!"
"మళ్ళీ ఏమిటయ్యా హరిబాబూ?"
"బెంచి  క్లీన్ చేస్తే మొత్తం క్లీన్ చెయ్యాలి గానీ సగం సగం క్లీన్ చేస్తే ఎలా సార్? దానివల్ల ఆ చౌద్రీ భాయ్ హీరో, నేను విలనూ అయిపోయాం!'
"ఖర్మ! బాబూ కొండలరావ్! ఆ సంగతేంటో కాస్త చూడు!"
"అసలే దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. తెలంగాణా చిత్రం చాలా అస్పష్ట స్పష్టంగా ఉంది!"
"ఎవరదీ? ఓహో భండారు శ్రీనివాసరావా? నీ చుట్టూ కూడా చిన్నపాటి సమూహముందిగా?"
"సార్! నాదో సలహా!"
"చెప్పవయ్యా విన్నకోట నరసింహారావ్!"
"ఏమీ లేదుసార్! మన క్లేసురూముల్లో బెంచీలమీదా ఫేనుల మీదా ఆ రాజకీయనాయకుల పేర్లు తీసేస్తే ఇక్కడ జరుగుతున్న తమాషాకి ఫుల్-స్టాప్ పడుతుంది!"
"అవునా? సరే, ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం!"
"సార్! ఇది నమ్మడానికి జనాలు చెవిలో పువ్వులు పెట్టుకున్నారనుకుంటున్నారా?"
"ఎవరయ్యా అదీ? ఓ! జై గొట్టిముక్కలా? ఏమిటయ్యా నీ బాధ?"
"గత సంవత్సరం మీ మద్దతు లేకుండా ఈ బెంచీల మీద ఫేన్ల మీద ఆ పేర్లుపడెవే కావు. ఇవన్నీ ఎందుకని జనాలు మిమ్మల్ని నిలదీస్తుంటే మీరు నేరాన్ని ప్రిన్సిపాల్‌గారిమీదకు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు!"
"అది కాదయ్యా! అసలు నేను చెప్పేదేమిటంటే ..."

"సొమ్ములు ఉండెడి క్లాసుల
దుమ్మును దులిపేటి సారు దూసుకురాగా
కొమ్ములు తిరిగిన కుంకలు
గమ్మున పడిచచ్చె నేడు గదనె జిలేబీ!" 

"అయ్యబాబోయ్! జిలేబీ పద్యవిహారం. లగెత్తండ్రోయ్!"
"సరే పారిపోదాంగానీ, క్లేసులో ఉండే సొమ్ములేంటీ?"
"నీ బొంద. విశాఖ మాండలికంలో పశువుల్ని సొమ్ములంటారు!"
"ఆ(!!"


(సశేషం!)

48 comments:
 1. పూర్తిగా దులిపేసినట్లున్నారు :)

  మా సొమ్ములు పోనాయండి
  నేనేమి చేతురో

  మొత్తం మీద ఈ మారు గణేశ నిమజ్జనం ముందే అయినట్టుంది.

  భంశు

  మా సొమ్ములు పోయే రౌ
  డీ సారూ లక్కుపేట డిక్లేర్ చేయం
  గా సభ న; నిమజ్జన మా
  యే సారీమారు మొదటనే వెనకయ్యా :)


  మోక్షము కలదా ?


  జిలేబి

  ReplyDelete


 2. మగ వాడో? ఆడమ్మో?
  గగాగి గీగుగ జిలేబి గా యున్నది గా
  భ"గ"వంతుడ! యేమిటి మా
  యగ యున్నది గా! జయంతియ? గిరీశుడకో?


  జిలేబి

  ReplyDelete
 3. I think it is not sommulu.... but Sommalu. Please check.

  ReplyDelete
  Replies
  1. Oh .. let me check. Thanks for the correction saaru

   Delete

  2. సొమ్మలు పోవు - మూర్ఛపోవు

   సొమ్ము - గోధనము

   మాలికుడు కాబట్టి సొమ్ములు పోవడమే సబబు :)


   జిలేబి

   Delete


  3. సీ. దొడ్డిపట్టుల గొప్పదొరసానుల యొడళ్లసొమ్ములు సొమ్ములు సొంపు నెఱప." అచ్చ. బాల, కాం. (ఇది రెండర్థములకు నుదాహరణము.)

   ఆంధ్ర భారతి
   జిలేబి

   Delete
  4. Oh, cool. Thanks for sharing that.

   Delete
  5. If I remember correctly,

   Ravi sastry Garu wrote a novel by name sommalu ponayamdi. In that he gave explanation for sommalu.

   Zilebi... Sommulu having both meanings is correct. But the slang word sommalu might have only one meaning.

   Anybody from uttaraandhra ?

   Delete
  6. Me... grew up at Anakapalli and Vizag.

   Delete


  7. సొమ్మలు పోనాయండి. అదండి! అది ఆరాంబవండి. జెత పోతులండి. జెనం నిలబడి సూసీవోరండి. అలాంటి సొమ్మలండి. పోనాయండి.." అంటూ మొదలుపెట్టి బోడియ్య తన కథ మొత్తం ఏకబిగిన చెబుతాడు

   నెమలికన్ను వారి బ్రీఫింగు

   http://nemalikannu.blogspot.com/2014/12/blog-post_30.html

   Delete

  8. కష్టేఫలి వారి అథార్టి :)


   https:kastephale.wordpress.com/2013/07/12/శర్మ-కాలక్షేపంకబుర్లు-బ-3/

   Delete
 4. సో, రౌడీల దెగ్గర బాగా సొమ్ములుంటాయనే మాట కరెక్టే నన్నమాట !
  ఇరగ దీసేశారు ! కుమ్మి కుదేశారు ! ఓలమ్మ తెగ బాదేశారు !

  దొడ్లో కుమ్మిచ్చుకున్న వాల్లకు కూడా మాంచి సమ్మగానే ఉండుండాలే !!
  :)

  ReplyDelete
  Replies
  1. అయ్యా! ఈ సారి మీరు తప్పించుకున్నారు. నెక్స్ట్ టైం చూస్కుందాం :P :P :P

   Delete

  2. பன்டி பை லக்காகுலு செரினட்லுகா :)

   Delete
  3. తమిళ్ తెరియాదు :(

   Delete
  4. “జిలేబి” గారూ, పోయిన వారం నేను వేరే ఒక బ్లాగ్ లో పెట్టిన “ఇది తెలుగు బ్లాగ్ అండీ.” అనే వ్యాఖ్య మీకు కూడా వర్తిస్తుంది (నా వ్యాఖ్య మీద మీరు పద్యం కట్టారు కూడా గుర్తుందా?). మీరు సుబ్రహ్మణ్య భారతి అంతటి వారే గానీ అరవంతోనూ, అరవలిపితోనూ మమ్మల్ని మాత్రం పదేపదే బాదకండి .... దయమాడి 🙁. ఆయనే అన్నట్లు మన “సుందర తెలుంగు” లో చెప్పండి, చాలు.
   ఇంతకీ పైన తమిళంలో మీరేమన్నట్లు? పొగిడారా, తిట్టారా?

   Delete
  5. మీరు సుబ్రహ్మణ్య భారతి అంతటి వారే గానీ అరవంతోనూ, అరవలిపితోనూ మమ్మల్ని మాత్రం పదేపదే బాదకండి
   __________________________________________________________________

   LOL

   Delete

  6. ఓ తమిళంలో పోయిందా బండి ? :)

   బండి పై లక్కాకులు సవారీ చేసినట్లుగా :(


   జిలేబి

   Delete


  7. సరిసరి జిలేబి నీవే
   తిరు సుబ్రహ్మణ్య భారతివి ! తమిళంబున్
   సరి,తమిళమున తెలుగును ప్ర
   చురించి సరి చంపకోయి చురకల తోడన్ :)


   జిలేబి

   Delete
  8. @ Malakpet Rowdy ...
   "నెక్స్ట్ టైం చూస్కుందాం ..."
   జెల్ల కొట్టి నందుకు జల్లి కట్టు బరిలో నించోపెడతారని
   ఊహించలేక పోయాను. ఎర్రోడిలా ఎర్ర చొక్కా ఏసుకుని
   మెళ్ళో గంట కట్టుకోవడం చాలా డేంజర్ సుమా ! ఈ సారి
   జాగ్రత్త పడతాను.

   ప్రమాదవనం స్కూల్లోనే మీరిన్ని సొమ్ములు కూడేశారంటే
   కాలేజీ, యూనివర్సిటీ లు పెడితే ఏంటా సంగతి అని ఆలోచించాను !
   బ్లాగుల్లో నర సంచారం తగ్గింది గనుక నేననుకోవడం మీ స్కూలు
   పోర/పోరి గాళ్ళే మళ్ళీ, ఏజీ, గేజీ మాఱుపు లేకుండా, ఫుల్ హాండ్స్
   షర్ట్స్, పాంట్స్ వేసుకుని కాలేజీలో, టీ షర్ట్స్, షార్ట్స్ వేసుకుని
   యూనివర్సిటీ లో ... ప్చ్ ... ఊహించుకుంటేనే - కేక ...
   ఊహించుకోండి ... :)

   ఫార్ లెఫ్ట్ కి జిలేబీ గార్ని గుర్తు పట్టాను గానీ -
   మిగిలినోళ్లు అంత చూపుకి ఆన్లేదు సర్.
   గ్రీన్ - నీహారిక గారా ... ? :)))

   అయినా ... (మాలికలో) మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళని నవ్వుల
   పాలు చెయ్యడం లో మీ తర్వాతే అని ఇప్పుడే అర్ధం అయ్యింది ...

   lol up lol up ... lollipop ... keep rocking, backing up ... :)
   you're just hilarious ... stay tuned ... :)

   Delete
  9. Thx Saaru .. you are actually beeter at this :)

   Delete
  10. ఇంకేమిటి మీరు జాగ్రత్తపడేది బండి వారూ 🙂. “హలో బ్రదర్” అనే తెలుగు చిత్రంలో అనుకుంటాను ... విలన్ కి గురువైన రాజనాల గారు హీరో గారి మిత్రుడుకి బొట్టుపెట్టి దండవేయమని (హింసించే ప్రయత్నంలో భాగంగా) తన అనుచరుడికి చెబుతాడు. హీరో గారి మరొక మిత్రుడు ఏదో అనబోతే .. నీకు కూడా బొట్టుపెట్టి దండవేసే కార్యక్రమం త్వరలోనే ఉంది తొందరపడకు అంటాడు. ఇక్కడ మీ పరిస్ధితీ అలాగే తయారయిందిగా 😀😀 ?

   Delete
  11. ఐతే తొందరపడకురా సుందర వదనా
   ముందున్నదిరా ముసళ్ల పండగా ...
   అంటారు.
   ప్చ్... కానున్నది కాక మానదు రానున్నది రాక మానదు
   చేసే వాడు చెయ్యక పోడు మోసే వాడు మొయ్యక పోడు

   భవిష్యత్తు కోసం కాపలా కాయడం తప్ప మరో ఆప్షన్ ఎక్కడబ్బా !!
   అయినా రాజీ కుదిరేట్లే - నట్లే ... గా, రౌడీ రత్తయ్య గారి దూకుడు తగ్గినట్లే ... గా ఉంది.
   (రౌడీలంతా చెడ్డవాళ్ళు కాదు)
   విష్ మీ లక్ సర్. ళోళ్ :)

   మరండీ ... మరండీ ... అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి ... __/\__ ...

   Delete
 5. For those of you getting confused between the two ids ... My mobile is logged into one id and the laptop into another...

  ReplyDelete
 6. జిలేబి అరవంలో పైకూలు. తెలుగులో ఇనప గుగ్గిళ్లు .3rd degree torture

  ReplyDelete
  Replies
  1. Hey PaiKu is a TP word. You must be one of them then ;)

   Delete
  2. What is a “TP word”?
   చెప్పడానికి ఇబ్బంది లేకపోతేనే. ఇబ్బందయితే మెల్లిగా నా చెవిలో చెప్పెయ్యండి (అనగా ... ఇమెయిల్ లో ... అని) 🙂.

   Delete
  3. Telugupeople.com లో పుట్టిన పదం సార్ అది. పుట్టించింది మంత్రవాది రాధికగారో లేక రఘోత్తమరావుగారో సరిగ్గా గుర్తులేదు

   Delete
 7. నేనేమీ భాషాశాస్త్ర పండితుడను కాను గానీ ... సొమ్ములు vs సొమ్మలు ... గురించిన నా చిన్న విశ్లేషణ 👇

  ===///===
  “ఆంధ్రభారతి” లోని నిఘంటువుల ప్రకారమయితే :-

  సొమ్ములు : మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970 Report an error about this Word-Meaning
  పశువులు; గోగణం. [శ్రీకాకుళం; విశాఖపట్టణము]
  ————
  సొమ్ములు : కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006 Report an error about this Word-Meaning
  పశువులు
  జనం గోల ఎలా ఉంది? దగ్గర నుండి వింటే సొమ్ములు సంతలా వుంది. [రాచకొండ విశ్వనాధశాస్త్రి: ఆరుసారాకథలు]
  ======

  ఇక “సొమ్మలు” అనే పదం కనిపించలేదు. దానికోసం వెదికితే ఇది మాత్రం 👇 కనిపించింది.
  సొమ్మలుపోవు permalink
  సొమ్మసిల్లు, సొమ్మసిల్లు, సొమ్మగొను, సొమ్మపోవు, సొమ్మలుపోవు : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report an error about this Word-Meaning
  somma-silu
  v.n.
  To faint, to swoon.
  మూర్ఛపోవు.
  ————-
  “సొమ్మలు” బహుశః “సొమ్మ” కు సంబంధించినదేమో?
  సొమ్మ : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report an error about this Word-Meaning
  somma
  [from Skt. శ్రమః.] n.
  1. Faintness, swoon. మూర్ఛ.
  2. Torpidity, lack of sensation, తిమురు.
  ===///===

  కాబట్టి ... పశువులు అనే అర్థంలో అయితే “సొమ్ములు” అన్న పదమే సరైనదని తోస్తోంది. స్వయంగా రావిశాస్త్రి గారే “ఆరు సారా కథలు” లో “సొమ్ములు సంత” అనే అన్నారని పైన ఉదాహరణల బట్టి తెలుస్తోంది. శాస్త్రి గారు తన మాటగా అయితే “సొమ్ములు” అన్నారనీ, కథలో పల్లెటూరి పాత్రల నోట పలికించినప్పుడు “సొమ్మలు” అని వ్రాశారనీ అనిపిస్తోంది.

  ఏతావాతా నాకు ఏమనిపిస్తోందంటే ... “సొమ్ములు” పదం పామరజనాల నోళ్ళల్లో “సొమ్మలు” గా ఉచ్చరించబడుతోందని colloquial గా. ఆ రకంగానే రావిశాస్త్రి గారు తన ఆ పుస్తకానికి పేరు అలా పెట్టారేమో అనుకోవచ్చు కదా 🤔? అంతమాత్రాన “సొమ్ములు” కరక్ట్ కాదు, “సొమ్మలు” సరైనది అని మనం తీర్మానించలేమని నా అభిప్రాయం 🙏.

  అయినా ఉత్తరాంధ్రాబిడ్డ, కెబ్లాస స్కూల్ టీచర్ అయిన “మలక్పేట రౌడీ” గారే “సొమ్ములు” అని చెప్పిన తరువాత మనకిక సందిగ్ధమేల 🙂 ?

  ReplyDelete
 8. అబద్దాలతో దళితులు, క్రైస్తవులపై హరిబాబు విషం
  http://harikaalam.blogspot.com/2018/09/blog-post_12.html

  నిజమేమిటంటే

  https://www.sakshi.com/news/national/supreme-court-hear-petition-bhima-koregaon-1116555


  24 గంటల్లో హరిబాబు క్షమాపణ చెప్పకపోతే ఈపోస్టు దేశంలోని ప్రతిదళిత సంఘానికి ఫార్వార్డ్ చెయ్యబడుతుంది

  ReplyDelete
  Replies
  1. విఘ్నాలు మొదలయ్యాయా??

   Delete
  2. దేనికి? ఈ బ్లాగే పరమ విఘ్నాల బ్లాగు :P

   Delete
  3. నేను హేవిటో అన్నది ... కెబ్లాస డ్రామాయణంలో అజ్ఞాత పిడకలవేట గురించి :P

   Delete
  4. అస్సలు కెబ్లాస క్లాసులో జరిగేదే పిడకలవేటకదా... ;P

   Delete
  5. నిజమే కదా! అదీ పాయింటే! :P

   Delete
 9. భరద్వాజ్ గారు నమస్తే.
  మీ యూట్యూబ్ ఛానెల్ చూసాను. మీ కవర్లు అన్నీ
  బాగున్నాయి. రీమిక్సింగ్స్ కూడా సో గుడ్.
  just why don't you try some of my numbers,
  written compatible to karaoke singing?
  kindly check my blog for reference.

  ReplyDelete
  Replies
  1. Sure andi ... lets connect on FB ... it would be easier to communicate

   Delete
  2. I don't watch the blogs much now a days. Just once or twice a week.

   Delete