సరిహద్దు లో చైనా మరొకసారి దుస్సాహసానికి ఒడిగట్టి అత్యాధునిక ఆయుధాలతో మన భూభాగం లోకి చొచ్చుకు వస్తున్నట్టు వార్తలు వింటున్నాం. అందుకే నెటిజన్లు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు . "ఎందుకలాగా ?" అని మీరు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాయ శర్మ లా ఎక్స్ప్రెషన్ ఇచ్చి అడుగుతారని నాకు తెల్సు.
అదే మన జనాలు చైనా భూభాగం లోకి వెళ్తే చైనీయులు పిట్టల్స్ని కాల్చినట్టు కలుస్తారని మనకి తెల్సు కానీ వాళ్ళు పది కిలోమీటర్లు మన భూభాగం లోకి చొచ్చుకు వచ్చి గుడారాలు వేసుకుని కూసుంటే చర్చలకి పిలిచాం , ఖండిస్తాం , నిరశన వ్యక్తం చేస్తాం అనే మాటలు, దయచేసి వెనక్కి వెళ్ళండి అనే సందేశాలు జెండాల ద్వారా వారికీ ఇవ్వడం తప్ప చేసిందేం లేదు .
ఇక మన ప్రభుత్వ పెద్దల వైఖరికి వొళ్ళు మండి ఎవరైనా ఫేస్బుక్, ట్విట్టర్ లలో వ్యంగంగా పోస్ట్ వేస్తే ముందర్జన్టుగా వాళ్ళని అరస్ట్ చేసి కేసులు పెట్టి ఆగమాగం చేసిందాకా ఊరుకోరు కాబట్టి నెటిజన్లు భద్రం :D