"నిజం చెప్పు" గద్దించాడు కాపరి ...
"అయ్ బాబోయ్ నాకేం తెలియదు. ఆ చెట్టు మీద ఎవరికీ తెలియకుండా దాక్కున్న మరో ఎఱ్ఱ కాకి ఎం చెప్పమంటే అది చెప్పాను" అని జారుకుంది గుంటనక్క ...
కాపరి ఆ కాకి మీద ప్రశ్నల వర్షం కురిపించాడు.
"మొదటి ఎఱ్ఱ కాకి ఏమంది?"
“కమ్యూనిజం ఆచరణ లో విఫలమైతే అయిందేమో గానీ, సిధ్ధాంతం మంచిదేనట”, అంది రెండవ ఎఱ్ఱ కాకి
నిజం చెప్పకపోతే ఆ గుంటనక్కకు పట్టిన గతే నీకు పడుతుంది, బెదిరించాడు కాపరి ...
"కమ్యూనిష్టులు కానివారిని బూతులు తిట్టింది" అసలు సంగతి చెప్పింది కాకి
"మరి దానికి ఇంత బిల్డప్పు ఎందులు?"
"అసలే కమ్యూనిష్టులంటే చాలు జనాలు కాండ్రించి ఉమ్మేస్తున్నారు మొహం మీద. ఏదో కాస్త ఇమేజ్ కాపాడూకోవటానికి చెప్పిన అబద్ధం" ఒప్పేసుకుంది కాకి
"అవునా మరి ఇంకేమంది?"
“మన వేదాలలో మంచీ చెడూ రెండూ ఉన్నాయట! వర్ణ వ్యవస్థ వేదాల వలనే వచ్చిందట! ఈ విషయాలని వీళ్ళ ముత్తాత నిరూపించాడట. ఇప్పుడు మళ్ళీ చర్చ అనవసరం అంటూ, కావాలంటే ఇంటర్నెట్లో చూసుకోమని వేదాల ఇంగ్లీషు తర్జుమా కి లింకులు కూడా ఇచ్చింది!”, హెడ్ కాకి అరిచింది.
"అవునా? అయితే కమ్యూనిజంలో మాత్రం మంచీ చెడూ లేవన్నమాట"
"ఇమేజ్ గురువుగారూ, ఇమేజ్. వేదాలంటే పాతుకుపోయి ఉన్నాయి. కమ్యూనిష్టులంటే తెలుగు బ్లాగుల్లో యువర్ గాడ్ కన్నా హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నారు. రెండిటికీ పోలిక పెట్తలేం కదా?" అంది కాకి
"ఆహా! లెస్స బలికితివి" ఇంకేమనాలో పాపం ఆ కాపరికి అర్థం కలేదు.
"వైమానిక శాస్త్రం ఫెయిల్ అని కూడ అంది"
"అసలు వైమానిక శాస్త్రం ఎక్కడ దొరికిందో తెలుసా?"
"తెలుసు ఎవరో సుబ్బరాయ శాస్త్రిగారి ద్వారా చెప్పబడింది"
"మరి ఏ త్రవ్వకాల్లో దొరికింది?"
"ఏమో!" నీళ్ళూ నమిలింది కాకి
"విమానాలు త్రవ్వకాల్లో బయటపడాలి, మరి వేదాలు కాకపోయినా వేదాలకు సంబంధించిన ఆధారాలు?"
"ఆయన చెప్పాడుగా?"
"అంటే ఆ మోడల్ ఫెయిల్ అయ్యింది అని ఎవరో అన్నారు కాబట్టి అది వేదకాలం నాటి మోడల్ అని డీసైడ్ చేసేశారన్నమాట. ప్రతీదానికీ ప్రూఫులడిగేవారు మరి దీనికెందుకడగలేదో? మీ వాదనకి సరిపోయిందనేనా? సరే ఇంకేమందో ఏడు" అన్నడు కాపరి కాస్తంత అసహనంగా
వేరే కులాలవాళ్లని బూతులు తిట్టింది. “ఇది దళితులను అంటరాని వారి గా చూడటం అమానవీయం అంది అని కవర్ చేసా" ఒప్పేసుకుంది మళ్ళీ ఎఱ్ఱ కాకి.
"ఇంకా?"
"ఒక్ ముసుగేసుకుని ఆంధ్రా వాళ్ళనీ, మరొక ముసుగులో తెలంగాణా వాళ్ళనీ తిట్టింది"
"అసలిలాంటి కాకిని కవర్ చెయ్యాల్సిన అవసరమేమొచ్చింది?" గద్దించాడు కాపరి
"కమ్యూనిష్టు అనుబంధంతోటి" చెప్పుకొచ్చింది కాకి, "నాకు కమ్యూనిజమంటే ఎందుకిష్టమమే ... " అని మొదలెట్టింది
రాష్ట్రం లో తె దే పా, కాంగ్రెస్ ఉన్నాయి. వాటి సిధ్ధాంతాల గురించి ఎవరూ చర్చ చేయరు. ఎందుకంటే వాటికి అంత సీన్ లేదని కదా?
"అవునా? మరి అవే పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎమయ్యాయి దాని సిధ్ధాంతాలు?" చిరాగ్గా అడిగాడు గొఱ్ఱెల కాపరి
"సరే అది వదిలేద్దాం. సైధ్ధాంతిక నిబధ్ధత ఉండి వంశ పారంపర్యం గా నడవని పార్టీలు ఇవి" అంది కాకి.
"ఎక్కడ? క్యూబాలోనా లేక ఉత్తర కొరియాలోనా?" నవ్వాగలేదు కాపరికి
"సమిష్టి నిర్ణయాలు ఇంకా జరుగుతున్న పార్టీలు ఇవి (ఒక్క భా జ పా మినహ)" చెప్పుకుపోతోంది కాకి
"ఓహో అందుకేనా? మేంఉ ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుంటామంటే తెదెపాతో పెట్టుకోమని మా మా అధిష్టానం బలవంత పెట్టింది. మాకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్చలేకుండ చేసింది అని మీ కమ్యూనిష్టు రాష్ట్రనేతలు మొన్ననే వాపోయారు?" అన్నాడూ నవ్వుతూనే కాపరి
"నాయకులు నిరాడంబరం గా ఉండి, కొద్దో గొప్పో ఆశయాలను పాటిస్తున్న పార్టీలు కూడా ఇవే!"
"మమతా బెనర్జీ, లాలూ యాదవ్ కన్నా నిరాడంబరులా ఏం?"
"కుల మతాలకు మేము అతీతము అని కనీసం పైకి చెప్పే పార్టీలు కూడా ఇవి"
"అవునా. అందుకే మరి మదర్ తెరీసాని పల్లెత్తు మాట అనకుండా సత్య సాయిబాబా మీద పాటలు కట్టి పాడిన పార్టిలు మీవి. నిజంగా కులమతాలకు అతీతమే. మత తత్వ పార్టీలతో కూడా పొత్తు అబద్ధం కదా" రెట్టించాడు కాప్రి కాస్త వెటకారంగా
"రాఘవులు తన కూతురిని ముస్లిం కిచ్చి పెళ్ళి చేశాడు"
"అబ్బా ఛా! మరి చిరంజీవి కూడ తన కొడుకుని వేరే కులం అమ్మాయికిచ్చి పెళ్ళి చెయ్యలేదా? తన బావమరిది విషయంలో కూడ అంటెగా? అయినా ఆ అమ్మాయి తన పెళ్ళి తను చేసుకుంది, ఈయన చేసేదేమిటి గాడిద గుడ్డు"
"అలా అనద్దు. తను అడ్డం చెబితే పెళ్ళి జరిగేదా?"
"ఆహా! ఇప్పుడు కమ్యూనిష్టువనిపించావ్. అంటే మీ కమ్యూనిష్టులు తమ పిల్లలకు తమ నిర్ణయాలు తాము తీసుకునే స్వేచ్చ ఇవ్వరనే సత్యాన్ని చెప్పకుండానే చెప్పేశావ్" అన్నాడు కాపరి
"సరే అవన్నీ వదిలేద్దాం. అసలు ఇప్పుడు జరిగేవన్నీ మార్క్సు ఎప్పుడో మేనిఫెస్టోలో చెప్పాడు"
"ఏమని చెప్పాడేమిటి?"
"అన్నీను. రోజుకి 16 గంటలు పని చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సహా"
"16 గంటలు పని చేస్తారా?"
"అవును 16 గంటలు ఆఫీసులో ఉంటారు"
"అందులో ఎన్ని గంటలు గ్రేట్ ఆంధ్రా చూస్తారు. ఎన్ని సార్లు క్రిక్ ఇంఫో సైటు రెఫ్రెష్ చేస్తారు? ఏసీ కోసం ఎంత సేపు గడుపుతారు. రెండు గంటల్లో అయే పనికి పది గంటల ఎస్టీమేట్ ఎన్ని సర్లు ఇస్తారు?" ప్రశ్నలు సంధించాడు చిరాకు తారస్థాయికి చేరిన కాపరి
"ఇలా అయితే నేను మాట్లాడనంతే!" మౌన వ్రతం మొదలెట్టిందా ఎఱ్ఱ కాకి.