
ప్రగతి నిరోధక ఆర్థిక పాలసీలు అని కమ్యూనిస్ట్‌లు విమర్శిస్తుంటే, వారివి ప్రగతి శీల, మిగతావారివి ప్రగతి నిరోధకాలు ఎలా అయ్యాయబ్బా అని ఎంత ఆలోచించినా భోధపడలే, అప్పుడు అసలు ఒక కమ్యూనిస్ట్ దేశ ఆర్దిక మంత్రి ఐతే ఏమి చేస్తాడు అని అలోచించాను..
కమ్యూనిస్ట్ అనగానే నాకు
నేష్‌విల్ నాయకమ్మగారు గారు (అచ్చుతప్పు కాదు - మరీ ఏకవచనం బాగుండదని రెండు బహువచనాలు పెడితే బాగుంటుందని మలక్ సలహా) Das Kapital తెలుగు అనువాదం చేతిలో పట్టుకొని, చుట్టు ఆమె శిష్యులు వారిని పూజిస్తున దృశ్యం నాకు నా కళ్ళ ముందు కదలాడుతుంది..కాబట్టి వారు దేశ ఆర్దిక మంత్రి, వారి శిష్య రత్నం ప్రధాని అన్నమాట. వారు ఇప్పుడు మన దేశ సమస్యలని ఎలా తీరుస్తారో ఒక్కోటిగా చూద్దాం.
వారు పదవిలోకి వచ్చీ రాగానే తలుపులు అన్నీ మూసేసి కుర్చుంటారాయె, అమెరికా వలస రాజ్యం ఐపోతున్నది అని.. ఇంకేముంది..(నో కేపిటల్ ఇన్‌ఫ్లోస్, నో బిజినెస్ బై అమెరికన్, & వెస్ట్రన్)
30% ఉద్యోగాలు హాంఫట్, ఒకే ఒక్క కలం పోటుతో (మరి 30% ఉద్యోగాలే విదేశీ వాణిజ్యం మీద ఆధారపడ్డాయి), ఎమ్మటే ఈ 30% ఉద్యోగుల ఖర్చు మీద ఆధారపడ్డ ఇంకో 10%, కాస్ట్ కటింగ్ అని ఇంకో 10% ఉద్యోగాలు, సగం ఉద్యోగులు, నిరుద్యోగులు ఐపోతారు, తీసి పారెయ్యకండి, ఈ నిరుద్యోగులతో చాలా ఉపయోగం ఉన్నది మరి.
మొదటగా, నేష్‌విల్ నాయకమ్మగారు గారు గొప్ప స్త్రీ వాది కదా, ఇంకేమి, దేశంలో ఉద్యోగాలు స్త్రీలకే అని డిక్లేర్ చేసి పారేస్తారు, బయట నిరుద్యోగ సమస్యని చూసి మగోళ్ళు ఊరుకోక చస్తారా, కుయ్, కయ్ అంటానికి లేదు, బయటకి వెళ్తే టీ కప్పులు కడిగే ఉద్యోగం కుడా ఉండదు మరి. -
సుశీల విరక్తి
నవలలో చెప్పింది ఇదే మార్క్స్ సిద్దాంతాలే
స్త్రీ సమస్యలకి పరిష్కారం అని.
పెట్రోలు, టెలీఫోన్లు పని చెయ్యవు కాబట్టి చక్కగా రిక్షాలకి, యడ్ల బళ్ళకీ, పావురాలకీ భలే డిమాండ్ వస్తుంది 100కి 200 తీసుకోవచ్చు -
కుల వృత్తులు నాశనం ఐపోతున్నాయి అని కమ్యూనిష్ట్‌ల గొడవ కదానిరుద్యోగులు, అంతేసి అద్దెలు ఇచ్చి, ఖర్చులు పెట్టుకొని పట్టాణాలలో ఎక్కడ ఉంటారు, పల్లెలకే తిరిగి ప్రయాణం తప్పదు -
దెబ్బకి పట్టణీకరణ సమస్యలన్నిటికీ పరిష్కారం.పల్లెలకి వెళ్ళిన నిరుద్యోగులు ఏమి చేస్తారు, తప్పదు, ఎవడి పొలం వాడే దున్నుకోవాలి, ఎవడి పంటలు వాడే పండించుకోవాలి -
దున్నే వాడిదే భూమి.మరి పొలం లేనోల్లు అంటారా అక్కడికే వస్తున్నా, పొలాలు లేకపొతే ఉన్నోడి దగ్గిర పని చేస్తారు ఏముంది, ఒక్కో రైతు దగ్గిర పది మంది ఇంజనీర్లు -
30% చదువుకున్నోళ్ళు 70% చదువుకోని వాళ్ళ మీద పెత్తనం చలాయించటం ఏమి నీతి అని అన్నారు కధా, ఇప్పుడు రివర్స్, సరైన నీతి.ఇంతమందికి జీతాలు ఇవ్వగలరా రైతులు, మహా
ఐతే తిండి పెడతారు, మరి పేద రైతులు ఇళ్ళల్లో అంతమందికి వండి వడ్డించే సదుపాయాలు ఉంటాయా? - ఇదిగో నాష్‌విల్లే నాయకమ్మ
గారు చెప్పిన
సామూహిక వంట, భోజనాలు గట్రా..అన్నీ సామూహికమే..
నిరుద్యోగులు మరి జీతాలు అడిగారు అనుకోండి, సరే జీతం ఇస్తాను కానీ కేజీ బియ్యం పదివేలు అంటారు - కాబట్టి
రైతులు తమ పంట విలువ తామే కట్టుకోవచ్చుఇంత చేసిన దాదాపు 60 కోట్ల జనాభాని పోషించగలమా? అందరికీ పొలాలు, రైతులు ఉద్యోగాలు ఇవ్వగలరా? కాబట్టి హింస ప్రజ్వరిల్లుతుంది -
కమ్యూనిస్ట్‌లకి కావలసింది అదే కదా, ఫ్రీ ఎంటర్‌టైన్మెంట్ వాళ్ళకి
ఆకలితో కొట్టుకునేవాడు, అన్నం కోసం చంపేవాడు కులం, మతం, తెలివిగలోడా, చదుకున్నోడా అని చూస్తాడా? - ఫో
సమసమాజం ఎవడు ఎవడ్ని ఐనా తన్నొచ్చు, చంపొచ్చు
.
ఈ
హింసతో దేశం మొత్తం రుధిరాభిషేకం -
వాడ వాడలా, మూల మూలలా అరుణ పతాక రెప రెపలు.
కార్మికుల సంఖ్య ఎక్కువ, యజమానుల సంఖ్య తక్కువ కానీ, యజమానుల ఆస్థి ఎక్కువ కదా, మరి ఆ సంపద కోసం అల్ప సంఖ్యాకుల యజమానులపై కార్మికుల దాడులు - ఇంకేమి
కార్మిక పాలనమరి ఒకే సారి తలుపులు ముసేస్తే, అమెరికా వాడు ఏమైపోవాలి? వాడికీ చాలా నష్టం -
కమ్యూనిష్ట్‌ల శత్రువుకి తగిన శాస్తి.అమెరికా వాడు ఇంకే చేస్తాడు, ఏ చైనా వాడ్నో, ఏ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాడినో బ్రతిమిలాడి, వాడు అడిగినంత ఇచ్చి పని చేయించుకోవాలి - ఒకే దెబ్బకి రెండు పిట్టలు, కాదు కాదు మూడు పిట్టలు,
అమెరికాకి నష్టం, చైనా కి లాభం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా లాభం కాబట్టి వీరి
సెక్యులర్ భావాలు కుడా నెరవేరుతాయి మరి.
మన హింసకి వస్తే, జనాలు తన్నుకోనీ, తన్నుకోనీ, చంపుకోనీ, చంపుకోనీ - మంచు యుగం నాటి సంస్కృతికి వెళ్ళి పోతారు కాబట్టి, ఇప్పుడు
వీరికి నచ్చినట్టు సొసైటీని డెవలప్ చేసుకోవచ్చు - మాకు ఇప్పటి వ్యవస్థ నచ్చలేదూ నచ్చలేదు అని అంటుంటారుగా.
ఇప్పుడు వీరు చక్కగా వస్తువు విలువని కొలవటానికి ప్రామాణికత శ్రమా?, మార్క్స్ చిటికెనవేలి పొడవా? మావో బట్టతల వైశాల్యమా? లెనిన్ మద్యవేలి గోరు పొడవా? ప్ర.నా. వెంట్రుకలలో పోడవైనదా? అన్ని వారిలో వారు తన్నుకోగా కోగా,.. మిగిలిన వారికి నేష్‌విల్ నాయకమ్మగారు గారు రాజీ చేసి, తన దగ్గిర ఉన్న విరిగిపోయిన స్కేల్ ని ప్రామాణికంగా నిర్ణయిస్తారు..
ఈలోపు అవసరం ఐనవి దిగిమతి కోసం ఉన్న బంగారాన్ని మొత్తం మిగతా దేశాలకి ఇచ్చేస్తాం కదా మరి - మన రూపాయి ఎవడికి కావాలి? తలుపులు మూసుకున్నాక.
బంగారం లేకపొతే డబ్బులేదు అని నాష్‌విల్లే నాయకమ్మ గారు చెప్పారు కధా, మరి డబ్బు లేకపొతే ఎవడైనా శ్రమ చేస్తాడా?
శ్రమ లేకపొతే మూడు రోజుల్లో జనాలు అందరూ చచ్చిపోతారు అని నాష్‌విల్లే నాయకమ్మ గారు చెప్పారు కదా, సో మన దేశం మూడు రోజుల్లో చరిత్రలో కలిసిపోతుంది.
అప్పుడు చక్కగా చైనా, రష్యా మన దేశాన్ని ఆక్రమించుకుంటాయి - మన దేశంలో మావో, స్టాలిన్ పాలన
అప్పుడు కమ్యూనిష్ట్‌లు కుడా చైనా ఆర్ధిక విధానాలా, రష్యా ఆర్ధిక విధానాలా అని కొట్టుకోకుండా రెండూ ఉంటాయి మన దేశంలో చక్కగా.
కొంతలో కొంత ఐనా పాకిస్తాన్, తాలిబాన్లు ఆక్రమించుకోకుండా ఉంటారా? - సెక్యులర్ భావనలు, కార్గిల్ అప్పుడు వెరే దేశం పై దాడి మంచిది కాదు అని ఖండించారుగా దానికి సరిపోతుంది.
తరువాత, భారత దేశ సమస్యలన్నిటికీ ఒకే దెబ్బకి పరిష్కరం చూపించినందుకు నాయకమ్మ గారికి నోబెల్ శాంతి (స్మశాన శాంతి, మనుషులందరూ చచ్చాక శాంతి కాక మరేటి?) నోబెల్ ఆర్ధిక శాస్త్ర బహుమతి రెండూ ఒకే ఏడాది ఇస్తారు, కానీ వారు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుస్తుంది??
చూశారా మరి, గ్లోబలైజేషన్ నిషేదించటం వలన ఎన్ని లాభాలో, ఒకే దెబ్బకి ఏ సమస్యా లేకుండా పోతుంది, దానికి తోడు, చక్కగా చైనా, రష్యా పాలనా, వారి సిద్దాంతాలు నెరవేరుతాయి..
కాబట్టి వారి విమర్శలో నిజం ఉన్నది, వారివి వారికి ప్రగతి శీల పాలసీలు, మిగతావారికి ప్రగతి నిరోధకాలు.