Apr 23, 2009

ఆరవ నెంబరు ప్రమాద సూచిక - ప్రమాదవనం వాణిజ్య ప్రకటనలు

వీక్షకులకు మళ్ళీ నమస్కారం - చాలాకాలం తరవాత కలిశాం కదా?

మన తెలుగు బ్లాగుల పాపులారిటీ తగ్గిపోతొందని భావించి ఏమైనా వాణిజ్య ప్రకటనలు ఇప్పిస్తే హిట్లు పెరుగుతాయన్న ఉద్దేశ్యంతో ఈ మధ్య మేము కొంతమంది ప్రకటనదారులని సందర్శించడం జరిగింది. ఇవిగో వారు సూచించిన ప్రకటనలు:

_________________________________________________________________________


బ్రూ:

బ్లాగు చాలా వేడిగా ఉంది - చాలా ఘాటుగా ఉంది - ఇదే బ్లాగు?

ఇది మన శ్రీకాకుళం మార్తాండ బ్లాగు

అచ్చం నా రేడికల్ బ్లాగులానే ఉంది

అంతే గాదు ఈ బ్లాగు డైనమిక్ కూడా - రోజుకి వంద టపాలతో

_________________________________________________________________

చార్మినార్ రేకులు:


ఏంటి ధూమయ్యా అంత దీర్ఘంగా అలోచిస్తున్నావ్?

ఆ ఏమీ లేదు నా పక్కవాడి బ్లాగుని ఎలా కెలుకుదామా అని

ఇందులో ఆలొచించడానికేముంది? ఈ తెలుగు అనో రమణారెడ్డి అనో ఆరోపణలు చేసెయ్యి - మా నాన్నగారు కెలికిన బ్లాగు నిన్ననే మూతపడింది


__________________________________________________________________


గంగా వాటర్ ఫిల్టర్:

హద్దులేని శృంగారం
మీకెంతో హానికరం
శరత్ బ్లాగులో ఫిల్టర్
కాపాడును మీ ఆరోగ్యం

___________________________________________________________________

3 రోసెస్:

చాలు - ఇక ఆపండి!

ఈ బ్లాగులో వంటలు లేవు
వంటలుంటే పాటలు లేవు
పాటలుంటే పోట్లాటలు లేవు

ఈ మూడూ గుణాలు కలిగిన బ్లాగేమన్నా ఉందా?

మూడు గుణాల జ్యోతి బ్లాగ్!!!!

____________________________________________________________________

కోరొమాండల్ గ్రోమోర్:

బ్లాగుకు సేవ - లేనిది రొక్కం: కూడలి

_____________________________________________________________________

వుడ్‌వార్డ్స్ గ్రైప్ వాటర్:

ఏమిటీ సంగతీ?
ఆవిడ ఏడ్చింది
కాగడా బ్లాగు తీసెయ్యమని గూగుల్ వాళ్ళకి చెప్పు. చిన్నప్పుడు నీ బ్లాగుమీద కూడ ఇలాగే కంప్లైంట్ ఇచ్చా

______________________________________________________________________

నిర్మా:

వాషింగ్ పౌడర్ నిర్మా
తిట్ల కాగడా శర్మ
బ్లాగుల లోనీ మురికీ
అతనికే కనిపించింది
అందరినీ ఉతికి ఉతికి
తనకే ఎసరయ్యింది
ఎవరో కర్త, ఏమిటొ కర్మా ..
వాషింగ్ పౌడర్ నిర్మా

_______________________________________________________________________

కోల్గేట్ పళ్ళపొడి:

కర్కశంగా గరుకుగా ఉండే బ్లాగులు మీ మెదళ్ళకి హాని కలిగించవచ్చు - కానీ రెండు రెళ్ళు ఆరు బ్లాగ్ -

అందరినీ నవ్విస్తుంది
నేల మీద దొర్లిస్తుంది
తోటరాముడు రాస్తుండే
రెండు రెళ్ళు ఆరు బ్లాగ్
ఆహా రెండు రెళ్ళు ఆరు బ్లాగ్ !!!

16 comments:

  1. Awesome creativity Rowdy gaaru. కొన్నింటితోనే ముగించేసారు!!

    ReplyDelete
  2. Nice. మరి కొన్ని వ్యాపార ప్రకటనలు వినాలని వుంది.

    ReplyDelete
  3. ఎంచక్కా మరికొన్ని వ్యాపార ప్రకటనలు వ్రాయకూడదూ!

    ReplyDelete
  4. సూపర్.. కెల్కిటివీటీ అదుర్స్..

    ReplyDelete
  5. ongolu seenu blog marchinanduku nirasana galam vipputunnanu

    ReplyDelete
  6. ongolu seenu blog marchinanduku nirasana galam vipputunnanu

    ReplyDelete
  7. నేనొప్పుకోను.. నా బ్లాగులో మూడు గుణాలేనా?? ఏదైనా సూపర్ బజార్ లేదా mixed fruit jam లేదా అడవిరాముడు సినిమాలో రాజబాబు చేసే వంటకం లాటి ప్రాడక్ట్ చూడండి. సరిగ్గా సరిపోతుంది.

    ReplyDelete
  8. We want some more information. Nice kelkified.

    ReplyDelete
  9. జ్యోతిగారి కామెంట్ నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు కానీ మీ పోస్ట్ మటుకు కత్తి, కేక (ఇలాంటివే మరికొన్ని వాడుకలో ఏవైనా ఉంటే అవీ) :)))))))))))))))

    ROFL, really.

    ఇన్ని సూచికలు ఎప్పుడొచ్చాయి అసలు?

    ReplyDelete
  10. ఏమిటీ సంగతీ?
    ఆవిడ ఏడ్చింది
    కాగడా బ్లాగు తీసెయ్యమని గూగుల్ వాళ్ళకి చెప్పు. చిన్నప్పుడు నీ బ్లాగుమీద కూడ ఇలాగే కంప్లైంట్ ఇచ్చా

    ReplyDelete
  11. బాగుంది బాసూ :-)

    ReplyDelete