"ఒరేయ్! ఆ రాజుగాడి మీద కంప్లైంట్ ఇవ్వాలి"
"ఎందుకటా?"
"చూడలేదా? సుధామూర్తిని సమర్ధిస్తూ పోస్ట్ పెట్టాడు"
"పెట్టుకోనీ, అది వాడిష్టం, నీకేం దురదా?"
"అలా అంటావేంట్రా? మన ఆదర్శాలకి వ్యతిరేకం కదా? మనం దానిని తీవ్రంగా వ్యతిరేకించాలి, మరొక్కసారి వాడామాట అనకుండా"
"ఓ అలావచ్చావా! మన వ్యతిరేకులకి భావప్రకటనాస్వేచ్ఛ ఉండకూడదన్నమాట!"
"అంటే ..."
"మనది శృంగారం, వాడిది వ్యభిచారం!"
"నోర్ముయ్! ఇంతకీ కంప్లైంట్ ఇస్తావా లేదా?"
"ఏమనివ్వాలీ? ఎవరికివ్వాలి?"
"జాగ్రత్తగా విను. వాడు ఉండేది మీ అమేరికాలోనే. సుధామూర్తి బేపనది కాబట్టీ, తనని సపోర్ట్ చేసినవాడు రేసిస్టు అని వాడు పనిచేసే కంపెనీలో ఫిర్యాదు చెయ్యాలి"
"ఆగరా బాబూ! ఇలాంటి పని ఇదివరకూ మన గ్రామకరణానికి వ్యతిరేకంగా సూతశౌనకాది మహిళామణులు చేస్తే తుస్సుమంది గుర్తులేదా?"
"గుర్తుంది. అందుకే ఈసారి స్ట్రేటజీ మార్చాలి. వాడెక్కడ పనిచేస్తున్నాడో కనిపెట్టి ఒక తెల్లాడిచేతో నల్లాడిచేతో కంప్లైంట్ ఇప్పిస్తే సరి"
"ఒరేయ్ ఒరేయ్! తెల్లాడు నల్లాడు అంటున్నావ్, నువ్వే పెద్ద రేసిస్టువి"
"నిన్నూ..."
"ఓకే! ఓకే! నువ్వు చేస్తే కడుపుమండినవాడి బాధా, పక్కవాడు చేస్తే కడుపునిండినవాడి బలుపూనూ.. అంతేనా?"
"అంతేగా మరి, హీ! హీ!!"
"ఆ కడుపు నిండిన-మండిన లాజిక్కుకీ, శృంగార-వ్యభిచార లాజిక్కుకీ ఆట్టే తేడా లేదులే"
"ఎహే! ఇంతకీ నా పని చేస్తావా లేదా?
"చేస్తారా బాబూ! చేస్తా! తప్పుతుందా?"
రెండ్రోజుల తరవాత
_______________
"ఏమైంద్రా? కంప్లైంట్ ఇప్పించావా?"
"ఆహా! ఇప్పించా"
"ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారూ?"
"గట్టిగా నవ్వి, పొమ్మన్నారట!"
"అదేంట్రా? సరే, ఇదేదో నేనే చూస్కుంటా. ఇంతకీ వాడు పనిచేసే కంపెనీ పేరేంటి?"
"ఇన్‌ఫోసిస్ అమేరికా!"
"ఆ( ?"
"ఆ( !"