Jul 19, 2012

Continued here ..

It's almost the time Ladies and Gentlemen, Be the insecurities, Be the school teacher stories or Be the Ekalingam anecdotes .. we got them all covered for you - Stay tuned :)

Jul 16, 2012

కెబ్లాస ప్రతిజ్ఞ

Inspired by http://bhaskar321.blogspot.com/2012/07/blog-post_16.html - with due apologies to him :)



బ్లాగులే నా కలల ప్రపంచం, బ్లాగర్లందరు నా స్నేహితులు (అబ్బా, ఛా!)
నేను నా బ్లాగును ప్రేమించుచున్నాను (అంతకన్నా ఎక్కువగా కామెంట్ బాక్సులను ప్రేమిస్తున్నాను)

సుసంపన్నమైన మా గొడవల శక్తి
బహువిధమైన మా కెలుకుడు యుక్తి నాకు గర్వకారణం.

విభిన్నంగా, విలక్షణంగా, వివాదాస్పదంగా
మా బ్లాగ్ ను తీర్చిదిద్దడానికి సర్వదా నేను కృషి చేస్తాను.

గూగుల్, వర్డ ప్రెస్, అగ్రిగేటర్లు, సీనియర్ బ్లాగర్లందరిని నేను కెలుకుతాను. ప్రతి బ్లాగర్ తోను సందర్భానుచితంగా నడుచుకొంటాను.

తోటి బ్లాగుల పట్ల అనుమానంతో ఉంటానని,
చదివిన ప్రతి టపాకు వీలైనంతవరకు వాఖ్యలు చేస్తానని, ఎన్ని కష్టాలెదురైనా, ఎన్ని నష్టాలొచ్చినా అందరినీ కెలుకుతూనే వుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

తెలుగు బ్లాగుల కెలుకుడే నా ఆనందానికి మూలము.