Sep 27, 2011

పదహారవ నెంబరు ప్రమాద సూచిక: ప్రముఖ "శోష"లిష్టు భోగారావుగారి తుంటర్వ్యూ! - Special Audio at the end of the post!!

మలక్పేట్ రౌడీ: చాలాకాలం తరవాతా మళ్ళీ ప్రమాదవనం తుంటర్వ్యూ విభాగంలోకి తొంగిచూస్తున్న ప్రేక్షకులకు మళ్ళీ కెలికస్కరం. ప్రతీసారీ ఆడవాళ్ళేనా, పక్షపాతం లేకుండా కాస్త మగహోస్టులని పెట్టమని మన ఉలికిపిట్ట భీకరకాంత్ గారు కోరటంతో ఈ సారి మన ఘోస్టుగా రంగ ప్రవేశం చేస్తోంది బాల్టమోర్ బాబూరావ్ ఎన్. గారు.

రౌడీ: నమస్తే బాబూరావ్.

బాబూరావ్ ఎన్: చంపేస్తా బాబూరావ్ అని సింపుల్గా పిలిస్తే! పక్కన "ఎన్" చాలా ముఖ్యం. బాబురావ్ లేకపోయినా ఫరవాలేదుగానీ "ఎన్" మాత్రం ఉండాలి ఏమనుకుంటున్నావో!

రౌడీ: సరే బాబూరావ్ ఎన్, ఇక మొదలుపెట్టు!

బాబూరావ్ ఎన్: వీక్షకులారా ఈ సారి మన ప్రత్యేక అతిథి భోగారావు గారు. ఈయనో ప్రముఖ సోషలిష్టు - టెగ్ లైన్ "అమేరికా పై ఏడుపు" , భోగారావు గారూ స్వగతం

భోగారావ్: నాది ఏడుపు కాదు, మంట, పెట్టుబడిదారీ విధానాలపై కడుపు మంట.

బాబూరావ్ ఎన్: సరే సరే ఏదో ఒకటి. మీ గురించి కాస్త చెప్పండి.

భోగారావ్: పెద్దగా ఏమీ లేదండి. నేనొక వికార్ ని

బాబూరావ్ ఎన్: వికార్ అంటే, వికారం పుట్టిచ్చేవారా?

భోగారావ్: కాదు. వికార్ అంటే "విప్లవ కార్మిక రచయిత".

రౌడీ: విప్లవ కార్మిక రచయితా? అంటే??

భోగారావ్: మీలాంటి రౌడీలకీ పెట్టుబడిదార్లకి అర్థంకదు వ్కార్మిక విప్లవం అంటే ఏమిటో

రౌడీ: నేనడిగింది "విప్లవ కార్మిక రచయిత" గురించి

భోగారావ్: మీరడిగింది ఎవడికి కావాలి. నాకు తెలిసింది నేను చెప్తున్నా. అదే నా రీతి, నా శ్వాస, నా ఊపిరి.

రౌడీ: ఓహో, పక్కవాడు అడిగినదానికి కాక తమకు తోచింది చెప్పటమనేనా శోషలిజం అంటే, సరే సరే.

బాబూరావ్ ఎన్: నువ్వుండెహే రౌడీ. భోగారావ్ ఎలియాస్ వికార్ గారూ, మీరు కానివ్వండి.

భోగారావ్: నేను రాస్తూ ఉంటాను, వేసేస్తూ ఉంటాను.

బాబూరావ్ ఎన్: ఏమిటి రాసేది, వేసేది?

రౌడీ: కట్టు కథలూ, వాటికి ఎఱ్ఱ రంగూనూ

బాబూరావ్ ఎన్: నువ్వుండెహే, ఇక్కడ హోస్టుని నేను. అనవసరంగా మధ్యలో దూరక.

రౌడీ: సరే, నువ్వు కానీ మరి

బాబూరావ్ ఎన్: మీరు చెప్పండి భోగారావు గారూ!

భోగారావ్: నేను కథలు, కవితలు, విశ్లేషణలు రాసేస్తూ ఉంటాను. వాటిని బ్లాగులో అచ్చు వేసేస్తూ ఉంటాను.

బాబూరావ్ ఎన్: అబ్బో, చాలా ఉద్ధరిస్తున్నారన్నమాట

భోగారావ్: మరే. అసలు ఈ రౌడీలాంటి అప్రజాస్వామికి బ్లాగర్లని వ్యతిరేకిస్తూ ఉంటాను.

బాబూరావ్ ఎన్: ఆహా! ఎందుకో?

భోగారావ్: నన్ను వ్యతితేకిస్తూ రాస్తున్నందుకు

బాబూరావ్ ఎన్: అలా రాయకూడదా? మరి మీరు రాసేవి అలాంటి రాతలే కదా?

భోగారావ్: నేను రాసేది వేరు.

బాబూరావ్ ఎన్: మరి వీళ్ళూ రాసేదేంటి? మొక్కా?

భోగారావ్: జోకులొద్దు. ఇక్కడ సీరియస్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇండియాలలో ఉన్న సామాజిక వ్యవస్ధలకు ప్రజాస్వాంకి లక్షణాలు ఉన్నాయా?

రౌడీ: అబ్బే లేవు, క్యూబా, ఉత్తరకొరియా, చైనాల్లో మాత్రమే ఉన్నాయి కదా :))

(ఇంతలో ఒక అజ్ఞాత ప్రవేశం)

బాబూరావ్ ఎన్: అజ్ఞాత నువ్వెవరివి బాబూ?

అజ్ఞాత: నా పేరు రైట్ వింగ్ రాంబాబు. ఆమెజాన్ అబ్దుల్లా అని కూడ అంటారు.

బాబూరావ్ ఎన్: అదేంటి రెండు పేర్లు?

రైట్ వింగ్ రాంబాబు: ఎందుకుండకూడదూ?

భోగారావు: ఫేకు పేర్లతో తిరిగే ఇలాంటి వాళ్ళంటే నాకు మంట

అబ్దుల్లా రాంబాబు: అబ్బో, మరి, భోగారావు అనే పేరు పెట్టుకుని వికార్ అనే తప్పు పేరు చెప్పుకోవటమేమిటో?

భోగారావ్: కన్నతల్లి లాంటి జన్మభూమిని వదిలి డాలర్ల కోసం అమెరికాకు వెళతారు మీరు.

అబ్దుల్లా రాంబబు: కన్నతల్లి పాలుతాగి రొమ్ముగుద్దే నీ లాంటి నీచబుద్ధి దేశద్రోహులకన్నా మేము చాలా నయం. ఇండియా మా మీద పెట్టిన ఖర్చుకు రెట్టింపు మేము చెల్లించిన పన్నులు. నా ఇండియా జీతమంతా ప్రైవేటు సంస్థలే ఇచ్చాయి. వాటికి ఆదాయం అమేరికన్ల దగ్గరనుండీ వచ్చింది. మరి తమరు వెలగబెడుతోంది ఏంఇటి? పక్క వాడి సొమ్ముతింటూ సిగ్గులేకుండా బ్రతకడమేగా? తమకొస్తున్న జీతంలో నేను కట్టిన పన్ను కూడ ఉంది కాని నాకొచ్చేదానిలో తమరు చేసింది ఏమీ లేదు. కట్టుకథలొద్దు.

భోగారావ్: ఒక మతాన్ని నమ్ముతున్న కోట్లాదిమంది ప్రజానికాన్ని కేవలం ముస్లింలు అయినందుకు అకారణంగా ద్వేషించే వారు సోషలిజంపైనా ప్రజాస్వామ్యంపైన చర్చ చేయగల అర్హతను కలిగి ఉంటారా?

అబ్దుల్లా రాంబాబు: నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అంతకన్నా ఎక్కువ ఉన్న జనాభాని కేవలం హిందువులన్న నెపంతో ద్వేషించటం హిందువులన్న నెపంతో ద్వేషించే మీలాంటి పనికిమాలిన వాళ్ళ సంగతేంటి?


బాబూరావ్ ఎన్: అబ్దుల్లా రాంబాబు గరూ, మీ ఘాటు మరీ ఎక్కువయ్యింది గానీ, కాస్త తగ్గించండి.

అబ్దుల్లా రాంబాబు: అది నావల్ల కాదు

బాబూరావ్ ఎన్: అయితే మరో తుంటర్వ్యూలో కలుద్దాం. ఇది మీకు నప్పదు.

అబ్దుల్లా రాంబాబు: సరే వెడుతున్నా. ఈ సారి ఏకంగా బ్రహ్మాస్త్రంతోనే వాస్తా, ఈయన గారి బేంకు వివరాలతో సహా.


బాబూరావ్ ఎన్: ఒక్క నిముషం, ఎవరో ఫోను.

రౌడీ: ఎవరూ?

బాబూరావ్ ఎన్: చీకట్లో పుట్టి చీకట్లో పెరిగి, చీకటి బ్రతుకు బ్రతుకుతూ చీకటి పనులు చేసే చీకటి చిన్నయ్యత

రౌడీ: ఏంటి ఆయన బాధ?

బాబూరావ్ ఎన్: ఏమీ లేదు. వీళ్ళు చేసే పనులన్నీ బయటపెట్టేసరికీ తట్టుకోలేకపోతున్నారు. పాపం వళ్ళేదో మన ద్వందనీతిని బయట పెట్టేశారుట

రౌడీ: అవునా. మరి తిన్నగా మాట్లాడకుండా తప్పించుకుని తిరగడమెందుకో?

బాబూరావ్ ఎన్: తిన్నగా వాదనలోకి దిగితే వారి డొల్లతనం బయటపడుతుందని.

రౌడీ: ఇదివరకూ మీడీయాని హైజాక్ చేసి వారికి తోచింది రాయటం అలవాటయిపోయింది. బ్లాగుల్లో కూడా అలాగే చెయ్యచ్చనుకున్నారు. పాపం ఇక్కడ దెబ్బకి దెబ్బ పడేసరికీ తట్టుకోవటం చేతకాక విలవిల్లాడుతున్నారు.

భోగారావ్: ముస్లింలపై మారణ కాండ సాగించిన మోడీ చేసిన పనులు సరైనవేనని వాదిస్తున్నారు మీరు.

బాబూరావ్ ఎన్: మోదీ చేసిన పనులు సరయినవే అని అన్నది ఎవరు? అన్నట్టు మావో స్టేలిన్లు సాగించిన మాఱణకాండ సంగతి ఏమిటి?

భోగారావ్: దానికి ఆధారం ఏమిటి?

బాబూరావ్ ఎన్: మరి మోదీ పై మీ ఆరోపణలకు ఆధారం ఏమిటి? బాబా రాందేవ్ మందుల్లో ఎముకలపొడి కలుపుతాడు అనేదానికి నిరూపణ ఏది? మందులు మార్కెట్లోనే ఉన్నాయి కదా? ఏ కమ్యూనిష్టు మేధావిచేతో పరీక్షచేయించవచ్చు కదా?

భోగారావ్: టీవీల్లో న్యూసు

బాబూరావ్ ఎన్: అందులో మోదీ చేయించాడని ఉందా?

భోగారావు: అది మనం అర్థం చేసుకోవాలి అంతే

బాబూరావ్ ఎన్: మావో, స్టేలిన్లు చేసిన హత్యాకాండ కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి. అలాంటి హంతకుల అడుగుజడల్లో నడిచే మీకు, మోదీ ఎంత వెధవయినా సరే, విమర్శించే హక్కుందా?


భోగారావ్: మీరు ఏకాకులు

బాబూరావ్ ఎన్: తమ బొంద. కమ్యూనిష్టంటే  చాలు జనాలు చెప్పులేస్తున్నారు, మీ నీచత్వానికి తగిన బహుమతిగా. ఏకాకులెవరో జనాలకి బాగా తెలుసు.


ఫోను లైనులో: ఏ బోన్సాయ్ మొక్క కూడా, తాను బోన్సాయ్ మొక్కనని ఒప్పుకోదు. అడ్డగోలు వాదనలు చేస్తారు.

బాబూరావ్ ఎన్: సరే, మేము బోన్స్సయిలమే కావచ్చు. కానీ మీలాంటి పనికిరాని గడ్డికన్నా పొడుగ్గానే ఉంటాము. మరి పనికిమాలిన వాదనలు బ్లాగుల్లో పెట్టేవాళ్ళకి అడ్డగోలు వాదనలే సరయిన సమాధానం. తిన్నగా చర్చిద్దామంటే మీరు చేసే చీకటిపనులు బయటపడతాయని భయం, అందుకే రాళ్ళేసి పరిపోతూ ఉంతారు.

(ఫోన్ లైన్ కట్)

బాబూరావ్ ఎన్: నేను చెప్పానా లేదా? చర్చ చర్చ అని గగ్గోలు పెడతారేగానీ భారత దేశంలో ఒక్క కమ్యూనిష్టుకి కూడా ఆ ధైర్యంలేదు.

రౌడీ: ఏంటెహే తుంటర్వూ చప్పగా సాగుతోంది? జనాలకి విసుగొస్తోంది.

బాబూరావ్ ఎన్: సరే రూటు మారుద్దాం.

రౌడీ: ఏంటి మార్చేది? ఇప్పటికి ఇది సాగి సాగి కొండవీటీ చేంతాడంతయ్యింది.

బాబురావ్ ఎన్: అయితే దీనికో ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఒక పాటేసుకో మన హీరో మీద.

రౌడీ: హీరో అంటే?

బాబురావ్ ఎన్: బ్లాగుల్లో ఉన్న ఒకే ఒక్కడు

రౌడీ: జనాలకి విసుగొస్తుందేమో?

బాబురావ్ ఎన్: ఏమీ కాదు. ఎన్ని సార్లు ఎన్ని పాటలు పాడినా జనాలకి విసుగురాదు. నువ్వేస్కో ఇంక.

రౌడీ: తప్పదంటావా? సరే, ఇదిగో ఆడియో: దీనిలో ముగ్గురి భాగస్వామ్యం ఉంది - ఒంగోలు శ్రీనుది, షంకర్ది (Snkr కాని శంకర్), నాది. By the way it is from Michael Vadina Kamaraju Part 2 (Under Production) and here is the killer: ఆడియోలో నాగొంతు కాకుండా మరొక గొంతు ఉంది - అదెవరిదో చెప్పుకోండి చూద్దాం :))







The lyrics - Sung to the tune of "అమ్మాయే సన్నగా" from "ఖుషీ"


మార్తాండం తిక్కగా కామెంట్లే పెట్టగా
మతిపోయీ బ్లాగర్లే మెంటల్ కేసులయ్యారే


మన హీరో పెద్దగా రాగాలే తీయగా
పక్కనున్న గబ్బిలానికీ గర్భస్రావమయ్యేలే (Thanks Ongole for this punch line)

ఇది చూసిన ..
పక్కింటావిడ ..
ఇది చూసిన పక్కింటావిడ పొలికేకలు పెట్టెలే


మార్తాండం పెద్దగా రాగాలే తీయగా
పక్కనున్న గబ్బిలానికీ గర్భస్రావమయ్యేలే

చరణం:

ఐశ్వర్యా రాయయినా మార్తాండకి వద్దయ్యోయ్
అరవై ఏళ్ళ వదినే మనవాడికి ముద్దయ్యోయ్

ఐశ్వర్యా రాయయినా మార్తాండకి వద్దయ్యోయ్
అరవై ఏళ్ళ వదినే మనవాడికి ముద్దయ్యోయ్

ఆమె విధవయితే ఇక లేనిది హద్దేలే
వందకి రెండదొందలు మన హీరో పద్దేలే

గాలుల్లో జడివానల్లో మలక్ ప్రయాణం చేసేలే
అది చూసి మన మార్తాండం ఒక పాటే పాడేలే

ఆ పాటకి .. ఓ .. ఓ..
ఒక గాడిద .. ఆ .. ఆ..

ఆ పాటకి ఒక గాడిద తన గొంతే కలిపేలే

మార్తాండం తిక్కగా కామెంట్లే పెట్టగా
మతిపోయీ బ్లాగర్లే మెంటల్ కేసులయ్యారే


చరణం:


కాష్మోరాకి కజినే భేతాళుడికీ బ్రదరే (Thanks Shankar for the next few lines)
గుడ్లగూబకు తోడే చీక్కోలుకు ఇక చీడే

బ్లాగే కాకయితే దానరుపూ వీడేలే
పోస్టే కప్పయితే దాని బెకబెక విడేలే


నిలువెత్తు ని"కృష్ణుని" రూపం వీడి సొంతమేలే
పలికితే గందరగోళం అర్థం గార్ధభాండమేలే

వీడి స్పీచులు విన్నవారిక
తెగ మూర్ఛలు పోయేలే ...

Sep 16, 2011

తోడేళ్ళు, గుంటనక్కలు మరియు విషప్పురుగులు వెరసి కమ్యూనిష్టులు



నమస్కారం....

ముందో చిన్న కథ చెప్పుకుందాం.

అనగనగా రష్యా అనే దేశాన్ని స్టాలిన్ అనే గొప్ప మహారాజు పరిపాలించేవాడట. ఆ మహాశయుడు ఒక రోజు కొందరురాజకీయ నాయకులతో ఏదో సమావేశం ఏర్పాడు చేసాడట. ఆ సమావేశం అయ్యాక చూస్తే అతనికి అత్యంత ప్రియమయిన చుట్ట కాల్చుకునే గొట్టం (ఆంగ్లంలో పైపు అందురు) కనిపించలేదట. వెంటనే తన ముఖ్య అనుచరుడు బెరియా ని
"ఓయ్ బెరియా.. నా చుట్ట గొట్టం కనిపించడం లేదు. అది కూడా ఈ సమావేశం అయినప్పటి నుండే కనిపించడం లేదు. అందువల్ల నువ్వు ఈ సమావేశానికి హాజరయిన నాయకులందరినీ విచారించమని" ఆదేశించాడట.
ఆ తరువాతి రోజు స్టాలిన్ కు ఆ గదిలో ఒక మూలన పడి ఉన్న తన చుట్ట గొట్టం కనిపించిందట. వెంటనే మళ్ళీ బెరియాని పిలిపించి "నా చుట్ట గొట్టం దొరికేసింది. అందువల్ల ఇక ఆ విచారణ అవసరం లేదు" అని సెలవిచ్చాడట.
దానికి బెరియా "అయ్యా స్టాలిను... ఇప్పుడా చెప్పేది.. చాలా ఆలస్యం అయ్యింది.. ఇప్పటికే సగం మంది ఆ చుట్ట గొట్టం తామే దొంగతనం చేసామని ఒప్పుకున్నారు... ఒప్పుకోని మిగతా సగం మంది చచ్చారు" అని బదులిచ్చాడట.
ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రజాదారణ పొందిన ఈ పిట్టకథ చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి ఇది ఒక జోకులా నవ్వుకోవడానికి చెప్తే, ఇంకొందరు "కమ్యూనిజం ఇన్ ఎ నట్ షెల్" అని చెప్పడానికి ఇదే కథ చెప్తారు. ఈ కథలో నీతి ఏంటంటే, అధికారంలో ఉన్నవాడు ఏదన్నా శాసిస్తే మర్యాదగా ఒప్పుకో.. లేదంటే చావే.

ఇక సామాన్య ప్రజలకోసం పనిచేసేదే కమ్యూనిజం అని ఎవడన్నాడో గానీ వాడిని చక్కిలిగింతలు పెట్టి చంపెయ్యాలి. ఎందుకంటే చరిత్ర లో ఏ కమ్యూనిస్టు ప్రభుత్వం తీసుకున్నా మనం చూసేది "కష్టాలు, కన్నీళ్లు.... ఒక నియంత " అనే ట్రాజెడీ సినిమానే. ఆ కష్టాలు కన్నీళ్లు ఎవరొ శత్రుదేశాల వాళ్ళవి కాదు.. వారి సొంత దేశ ప్రజలే . ముందుగా విప్లవం రావడానికి రక్తం ఏరులై పారితే, విప్లవం తర్వాత వచ్చిన అధికారం నిలుపుకోవడానికి మళ్ళీ దేశం రక్తసంద్రం అవుతుంది.

ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం అంటారు కానీ ప్రజలకి వాళ్ళకి ఏం కావాలో చెప్పే హక్కు అస్సలు ఉండదు. టాప్ లెవెల్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం. ఎదురు తిరిగితే నరకం. ఏ దేశంలో అయితే కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంటుందో.. అంటే రష్యా తీసుకోండి, చైనా తీసుకోండి, ఉత్తర కొరియా తీసుకోండి ఎక్కడయినా సరే అక్కడ తిండికి రేషన్, బట్టలకి రేషన్, ఇంటికి రేషన్, ఆఖరికి మాట్లాడటానికి కూడా రేషన్.


అక్కడ ఎవరికి పర్సనల్ ఇష్టాలు, జీవితంలో ఎదగాలన్న కోరిక, బాగా కష్టపడితే మంచి జీవితం వస్తుందన్న ఆశ ఏమీ ఉండవు. ఆఖరికి ప్రజలు ఎంతమంది పిల్లల్ని కనాలో కూడా టాప్ లెవెల్లో ఆ గ్రూప్ అఫ్ పీపుల్ డిసైడ్ చేస్తారన్నమాట. జీవితానికి అర్థం పరమార్థం ఏమీ లేదు. ఫ్యాక్టరీలలో యంత్రాల్లాంటి జీవితం. నిజం.. మరీ యంత్రాల్లాంటి జీవితం అంటున్నానని అతిశయోక్తి అనుకోవద్దు. వాళ్ళ ఫిలాసఫీ "From each, according to his ability, to each according to his need." ఉదాహరణకి మీ దగ్గర ఒక కారు (యంత్రం) ఉందనుకోండి. మీరు ఏం చేస్తారు.. ఎంత వీలయితే అంత తక్కువ పెట్రోల్ పోసి ఎంత వీలయితే అంత ఎక్కువ దూరం తీసుకెళ్ళాలి అనుకుంటాం కదా.. అదే ఫిలాసఫీ. ఇప్పుడు అర్ధం అయ్యిందా యంత్రాల్లాంటి జీవితం అని.

ఇక కమ్యూనిస్టులకి ఇంకో ఐడియాలజి ఉంది. సంఘంలో ఏ క్లాస్లూ ఉండకూడదు. ఆడ, మగ, ధనిక, పేద, మతం, కులం ఏమీ ఉండకూడదు. బావుంది.. ఒకవేళ ఉహు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది అని ఎవరన్నా అంటే ఫలితం అన్నవారు సరాసరి దేవుడి దగ్గరకే చేరతారు. రష్యాలో కూలిన చర్చిలు, దేవుడిని నమ్మిన వారి రక్తంతో తడిసిన నేల చెప్తాయి వీరి కిరాతకాలు.

తోడేళ్ళు

అసలు సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడ కమ్యూనిజం ఉంటుందో ఆ రాజ్యం రక్తసిక్తం.. హింస, ప్రతీకారం, రాజకీయ హత్యలు, రక్తం ఏరులై పారడం అన్నది అక్కడ సర్వసాధారణం. ఆ రక్తం ఎవరిదీ... అది కూడా సామాన్య ప్రజలదే.. ఆశ్చర్యంగా ఉందా.. సరే... ఇది చూద్దాం.

తమ సొంత దేశ ప్రజలనే అత్యంత కిరాతకంగా చంపిన నరహంతకుల జాబితా ఒకటి రూపొందిస్తే ఏ నియంత పేరు మొదట ఉంటుంది చెప్పండి? హిట్లర్ అని చెప్పినవాళ్ళంతా చైనా పప్పులో కాలేసినట్టే. అత్యంత క్రూరుడు అని మనం చెప్పుకుంటున్న హిట్లర్ గ్యాస్ చాంబర్స్ లో పెట్టి, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెట్టి చంపింది ఒక కోటి పాతిక లక్షల మందిని. అయ్యబాబోయ్ అనుకుంటున్నారా.. మరి పైన చెప్పుకున్న స్టాలిన్ దానికి రెట్టింపు అంటే జస్ట్ రెండున్నర కోట్లమందిని పొట్టన పెట్టుకున్నాడు. బాబోయ్... వీడూ ఒక మనిషేనా ఆశ్చర్య పోతున్నారా.... నరహంతకుడు, క్రూరుడు, నరరూప రాక్షసుడు అని తిట్టేసుకుంటున్నారా... ఆగండాగండి.. వీడికి బాబు లాంటి వాడు ఇంకోడు ఉన్నాడు. వాడు చంపించింది ఎనిమిది కోట్లమందిని. వాడే మావో. అప్పట్లో యాభై నుండి డెబ్భై కోట్లమంది ఉన్న చైనా ప్రజల్లో ఎనిమిది కోట్లమంది వీడి చేతిలో అత్యంత క్రూరంగా చంపబడ్డారు.. అంటే చూడండి మన కమ్యూనిస్టుల ఘనచరిత్ర. ఇక చంపడం ఒక్కటే కాదు.. ప్రత్యర్థుల మీద వీరు ప్రయోగించే అత్యంత కిరాతకమయిన హింసాత్మక పద్ధతులు తెలుసుకుంటే మనం రెండు రోజులు అన్నం తినం. రాక్షసత్వం, రాజ్య కాంక్ష, క్రూరత్వం కలగలసిన ఈ తోడేళ్ళ గురించి మీకు మళ్ళీ విడిగా చెప్తాలెండి.

గుంటనక్కలు

అధికారం ఉన్న చోట రక్తం రుచి మరిగిన తోడేళ్ళలా చేలేరేగే ఎర్రపిశాచాలు మన దేశానికొచ్చేసరికి గుంటనక్కల రూపంలో ఉంటారు అన్నమాట. సుమారు వంద కోట్ల పైగా ఉన్న మన దేశ జనాభాలో పేదలు ఒక 90 కోట్లు ఉన్నారనుకుంటే మొత్తం జనాభాలో 90% పేదల కిందే లెక్క.. కానీ అందులో కమ్యూనిస్టులకి కనీసం 7% ఓట్లు కూడా కనాకష్టం. అర్థం అయింది కదా ఇక్కడ వీళ్ళ బ్రతుకు.. ఇక వీరి స్వభావం ఎలా ఉంటుందంటే.. వీరికో స్టాండ్ అంటూ ఉండదు. ఎన్నికల సమయానికి అప్పుటికి ఎవరు నెగ్గుతారనుకుంటే వారి పంచన చేరి ఆ పార్టీ వాళ్ళు వేసిన ఎంగిలి సీట్లు తీసుకుని పోటీ చేస్తారు. మన రాష్ట్రం ఉదాహరణకి తీసుకుంటే ఒక ఎలక్షన్లో బషీర్ బాగ్ కాల్పులు అని తెలుగు దేశాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పక్షాన చేరితే, ఆ తరువాత ఎలెక్షన్లో ముదిగొండ కాల్పులు చూపించి అదే తెలుగుదేశం పార్టీ పంచన చేరతారన్నమాట. ఆ తరువాత ఎన్నికల్లో మళ్ళీ ఇంకొకరి పక్కన... పక్కా అవకాశవాదులు, ఊసరవెల్లులు ఇలా ఎన్నిచెప్పుకున్నా తక్కువే. ఎలాగూ వాళ్ళు ఒంటరిగా వెళితే వాళ్లకి ఆ 7% ఓట్లు కూడా రావు కాబట్టి , ఎలాగో వాళ్ళ పార్టీ అన్నది నెట్టుకురావాలి కాబట్టి.. వాళ్ళ పంచన వీళ్ళ పంచన చేరి, ఏదో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంచెం మనకి దక్కకపోతుందా ఆన్న ఆశ. ఆఖరికి అలా విదిలించిన ఓట్లనే బలుపుగా చూపించే ప్రయత్నం చేస్తారు.

ఇక ఈ గుంట నక్కల అతి తెలివితేటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉదాహరణకి ఒక జటిల సమస్య ఉందనుకోండి. వీళ్ళు పోరాటం మొదలు పెడతారు. ఎర్ర జెండాలు వేసుకొని ఒక గుంపు బయలుదేరుతారు. పొద్దస్తమానూ అరుస్తారు. సాయింత్రానికి తట్ట బుట్ట సర్దేసి ఇంటికెళ్ళి బజ్జుంటారు. వాళ్ళ ఊరేగింపు పేపర్లో వస్తే చాలు ఇక వాళ్లకి ఆ రోజు గడచిపోయినట్టే. కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ జనాలు మర్చిపోతున్నారు అనే టైముకి మళ్ళీ ఇంకో సమస్య తీసుకుని ఇంకో రోజు కాలక్షేపం. అంతే కానీ ఏదయినా సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడటం అన్నది ఎప్పుడూ జరగదు... ఎందుకో తెలుసా.. అసలు వాళ్ళకి చిత్తశుద్ధి అన్నది ఉంటే కదా... అలాగే ఈ కుళ్ళుబోతు కమ్యూనిస్టులకి ఇంకో దుర్గుణం ఉంది. ఎవరన్నా అలా చిత్తశుద్ధితో పోరాటం చేస్తే అస్సలు తట్టుకోలేరు. మొన్న అన్న హజారే ఉద్యమంలో వీరి స్టాండ్ చూశాం కదా.

సరే కాసేపు వీరి వాదన సరే అనుకుందాం. అన్నా హజారే చేసేది సమాజంలో అసమానతలు పోగొట్టడానికి ఏమీ ఉపయోగపడదు అన్నది వీరి వాదన. సరే అప్పుడు అదే స్ఫూర్తితో ప్రకాష్ కారత్ లేక మన చికెన్ నారాయణో అసమానతలు పోగొట్టడానికి ఏం చెయ్యాలో ప్రతిపాదిస్తూ పోరాటం మొదలుపెట్టొచ్చు కదా... నిరాహార దీక్షకు దిగొచ్చు. ఉహు అలా కూర్చోవాలంటే చిత్తశుద్ధి కావాలి. ఒక రోజు హడావుడి చేసి వెళ్లి పడుకోవడానికి ఛాన్స్ ఉండదు. ప్రజల ముందు కూర్చోవాలి. అదంతా మన వల్ల కాదు. ఇక చిత్తశుద్ధితో పోరాడేవాడికి పేరొచ్చేస్తుంది.. ఇక ఏం చెయ్యాలి.. వాడిని వెనక్కి లాగాలి. అది వీరి స్టాండ్. ప్రపంచం చరిత్రలో కమ్యూనిస్టు పోరాటం హింస లేకుండా జరగలేదు. హింస వీరి ఆయుధం . హింసే వీరి ఆయుధం.

ఇక వీరి సిద్ధాంతం ప్రకారం దేవుడు లేడు. ఏదయినా హేతుబద్దంగా ఉంటేనే నమ్మాలి. సరే మరి.. ఎక్కడో హరిజనులని గుళ్ళోకి రానివ్వడం లేదని వీళ్ళు వెళ్ళి పోరాటం చేసి మరీ వాళ్ళ చేత దేవుడికి దణ్ణం పెట్టిస్తారు. ఎందుకంటే అక్కడ వారికి వాళ్ళ సిద్ధాంతం కన్నా ఏదో పోరాటం చేసి సాధించేసాం అన్నది చూపించాలి. అదే ఏ టిటిడి వాళ్ళో ఏదన్నా దళితవాడలో పూజలు పునస్కారాలు మొదలు పెడితే అప్పుడు వీరికి మళ్ళా వారి సిద్ధాంతాలు గుర్తొస్తాయి. అయినా మన పిచ్చ కానీ.. వీరికి సొంత ఆలోచన అంటూ ఎక్కడ ఉంది.. మన శ్రీకాంత్ చెప్పినట్టు వీరికి తెలిసున్నది ఆ ఆవు వ్యాసమే..

ఇక వీరి అతి తెలివితేటలు ఎక్కడ బాగా కనిపిస్తాయంటే విషం చిమ్మే ఏ ఛాన్స్ వదులుకోరు. సమాజంలో ఏ సమస్యలు లేకుండా ఉంటే వీరి చేతికి పని ఉండదు. గుజరాత్ గురించి మాట్లాడే వీరు.. సిక్కుల మీద అత్యంత పాశవికంగా హత్యకాండ జరిపిన కాంగ్రెస్స్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి వీరికి ఏ మాత్రం సిగ్గూ శరం లేనే లేదు. ఎమర్జెన్సీ సమయంలో ఎదురు మాట్లాడిన వాడిని జైల్లో పెట్టి స్వతంత్ర భారత దేశానికి చీకటి రోజులు చూపించిన అదే కాంగ్రెస్స్ అంటే ఎంత ప్రేమో.
నరేంద్ర మోడి శాంతి సామరస్యం గురించి మాట్లాడకూడదు. మరి మాట్లాడితే అది ప్రజలు నమ్మేస్తే , ప్రధానమంత్రి అయిపోతే అమ్మో ఇక వీరికి దిక్కేది? అసలు మతం, కులం పేరుతో సమస్యలు లేకపోతే వీరి పార్టీకి మనుగడ ఎలాగ.. అందుకే ఎవరు సామరస్యంగా మాట్లాడినా వీరికి ఒంటి మీద తేళ్ళు జెర్రులు పాకుతాయి. రెండు దఫాలు ఎలక్షన్లలో మోడి మెజారిటి పెరుగుతూ వస్తుందే.. ఎలాగబ్బా? అయినా.. తమ ఐడియాలజీని ప్రజల మీద రుద్దటానికి కోట్ల మందిని తెగనరికిన వారి సిద్ధాంతాల వారసులకి ప్రజల అభిప్రాయం యొక్క విలువ తెలుస్తుంది అనుకోవడం అమాయకత్వం...

'విష'ప్పురుగులు
ఇక బ్లాగుల్లో విషం చిమ్ముకుంటూ తిరిగే 'విష'ప్పురుగుల గురించి చెప్పుకుందాం. సాధారణంగా అమెరికానో, హిందు మతం మీదో విషం చిమ్ముకుంటూ రాతలు రాసే వీరు ఒక్కొకప్పుడు కాస్త జనానికి పనికొచ్చేవి రాసినా ఒక్కోసారి మరీ దిగజారిపొతారు. అలాంటి కొన్ని దిగజారుడు రాతలకి కొన్నిఉదాహరణలు చూద్దాం.

"గుజరాత్ మారణకాండకు నరేంద్ర మోడి ప్రోత్సాహించాడన్నది పచ్చి నిజం" ఇది ఒక ఎర్రాయన తీర్పు . తీర్మానం చెయ్యడానికి ఈయన పరిగణించిన అంశాలు ఏంటంటే..

>>> కాకుంటే ‘చర్యకు ప్రతి చర్య’ అని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు అర్థం ఏమిటి? >>>

" when a big tree falls, the earth shakes" అని బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చి మరీ సిక్కుల మీద హత్యాకాండను సమర్ధించుకున్న పార్టీ పంచనే చేరింది ఎవరో..
ఎందుకంటే మరి వీరి స్వప్రయోజనాల కోసం అప్పుడప్పుడూ కన్వీనియెంట్ గా కొన్ని విషయాలు మర్చిపోతుంటారు..


>>> జరిగిన ఘోరాలపై సంవత్సరాల తరబడి ఎటువంటి దర్యాప్తూ జరగకపోవడానికి కారణాలేమిటి? >>>

ప్రత్యేక సీట్‌లు, సుప్రీం కోర్టు, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పని చెయ్యవని వీరికి తెలీదా లేక విషం చిమ్మాలంటే ఇవి సెలక్టివ్ గా వదిలెయ్యాలా ?

>>> అన్ని వందలమంది చనిపోయినా దర్యాప్తులో ఎవరూ దోషులుగా తేలకపోవడం ఎలా జరిగింది? >>>

అసలు
దోషులను పట్టుకోవాలన్న చిత్తశుద్ధి వీరికి ఉంటే ఐదు సంవత్సరాలు వాళ్ళ సపొర్ట్ మీద బ్రతికిన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ఎంతసేపు. అమెరికా న్యూక్లియర్ ఒప్పందం విషయంలో క్షణంలో మద్దతు ఉపహరించిన వీరికి గుజరాత్లో జరిగిన సంఘటన మీద దర్యాప్తు వేగవంతం చెయ్యడం అంత ఉపయోగం అనిపించలేదేమో. అవును మరి ఈ కేసు త్వరగా ముగిస్తే వీరికి ఇంక పనేం మిగుల్తుంది..

>>>
మారణకాండకు సాక్ష్యాలు సమకూర్చిన పోలీసు అధికారిపై సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసు బనాయించడానికి కారణం ఏమిటి? >>>

ఏది అన్నా హజారే మీద, కేజ్రివాల్ మీద పెట్టిన కేసులు టైపా.. లేక బెంగాల్లో వీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన ప్రత్యర్ధులని తొక్కడానికి పెట్టిన దుర్మార్గపు కేసులు లాంటివా?

>>>
ఇవన్నీ నరేంద్ర మోడి దోషిత్వాన్ని తెలుపుతున్నాయా? నిర్దోషిత్వాన్ని తెలుపుతున్నాయా? దోషిత్వాన్నే తెలుపుతున్నాయి >>>

అయ్యో వీరికున్న తెలివితేటలు సుప్రీంకోర్ట్ జడ్జికి కూడా లేవే పాపం. వీరిలా అలోచించి తీర్పు చెప్పలేక పాపం కష్టపడుతున్నారు. ఇంకా కంఫ్యూజ్ అయిపోయి క్లీన్ చిట్లు ఇచ్చేస్తున్నారు. అసలు వీరినే ప్రోసిక్యూషన్ లాయర్ గా పెట్టుకుంటే ఎప్పుడో కేస్ ముగిసేది.

>>>
ఆ నిజం స్ఫటికంగా ఎంత స్పష్టంగా ఉందంటే భాజపా నాయకులు దాదాపు నిశ్చయించుకున్నారు, నరేంద్ర మోడి పై విచారణ తధ్యమని >>>

ఎంత ఘోరంగా ఉందో చూడండి.
నరేంద్ర మోడి మీద విచారణ ఇప్పుడు మొదలవ్వడం. అయినా దర్యాప్తుకు ఆదేశించేది ప్రభుత్వం కదా.. కేంద్రంలో గత ఏడేళ్ళుగా ఉన్నది కాంగ్రెస్స్ ప్రభుత్వమే కదా.. ఇప్పుడు దర్యాప్తుకి ఆదేశించడం ఏమిటి.

>>> నరేంద్ర మోడికి మద్దతుగా వచ్చే మేధావులు కూడా ‘ఇంకా అప్పటి సంగతిని పట్టుకు వేళ్ళాడతారా? గుజరాత్ లో ఆయన చేసిన అభివృద్ధిని చూడరా? అంటారు >>>

అయ్యా.. ఇలాంటిదే మారణకాండ చేపట్టిన పార్టీలతో మీరు అంటకాగుతున్నారు. అప్పుడేమయింది మీ మేధావితనం. అంటే ఎమర్జెన్సీని, సిక్కుల ఊచకోతని మర్చిపోయారా.. వదిలేశారా.. దులిపేసుకున్నారా. ఏం మీ దృష్టిలో సిక్కులు, కాశ్మీర్ పండిట్లు, కరసేవకులు మనుషులు కాదా? ఎంత దారుణం. ఎంత దగుల్బాజీతనం..

ప్రపంచ చరిత్రలో నరమేధం సృష్టించి కోట్ల మందిని చంపిన ఈ క్రూర హంతక కమ్యూనిస్టులు అహింస, ప్రజల హక్కుల గురించి మాట్లాడితే శాకాహారులే కాదు మనిషన్న ప్రతీవారు ఉరేసుకు చావాలి.

స్నేహితులారా... అదీ క్లుప్తంగా తోడేళ్ళ, గుంటనక్కల, మరియూ విషప్పురుగుల చరిత్ర. ఈ ప్రపంచంలో మానవజాతిని మొత్తం సమూలంగా నాశనం చెయ్యగల మహమ్మారులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి ఎయిడ్స్, రెండు కమ్యూనిజం. వీటికి ఎంతదూరంగా ఉంటే అంత మనకి మంచిది. మన చుట్టుపక్కల వారికి మంచిది.

చివరి మాట: నా అభిప్రాయం ప్రకారం ...
కమ్యూనిజం అన్న పదమే చెడ్డది కాదు. కమ్యూనిజం అంటే ప్రొ పీపుల్ (ప్రజల తరపున, ప్రజల సంక్షేమం కోసం) పని చేసేది అంతే. దీని అర్థం సరిగ్గా తెలుసుకున్న కమ్యూనిస్టు నాయకులు... మారుతున్న కాలానికి, పరిస్థితులకి అనుగుణంగా తమ సిద్ధాంతాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ అభివృద్ది చెందిన దేశా
ల్లో భాగమయిన వారూ ఉన్నారు...

అలాగే శతాబ్దాల క్రితం నాటి నోట్ బుక్ సి
ద్ధాంతాలని ఇప్పటికీ మక్కీకి మక్కీ అనుసరిస్తూ మూర్ఖంగా వాదించే పిడివాదులు ఉన్నారు. దురదృష్టవశాత్తూ వారు మనదేశంలో ఉన్నారు.