ఈమధ్య బ్లాగుల్లో కెలుకుడుని ఖండించడం ఫ్యాషన్ అయిపొయింది కాబట్టి నేనూ ప్రమాదవనంలొ చేరి ఒక పోస్ట్ రాసేసి కెలుకుడిని ఖండిచేద్దాం అని నిర్ణయించుకున్నా ఇప్పుడు...
అప్పట్లో ఒక మంచుకురిసిన రాత్రి.... చిత్తుగా తాగిన మత్తులో ఉన్న ఒకతను ...అదే బార్లో ఇంకోమూల కూర్చుని బుద్దిగా కూల్ డ్రింకో, ఐస్ టీనో , లేక రెండూ కలుపుకునొ తాగుతున్న మలక్ దగ్గరకెళ్ళి .. ఎహే బోర్ కొడుతుంది ఎవరినన్నా 'గెలకాలి' అనబోయి... మత్తులో పొరపాటున 'కెలకాలి' అనడమే ఈ క్లే బా స పుట్టుకకి మూల కారణం అని బ్లాగ్‌చరిత్రకారులు చెప్తూఉంటారు. అయితే అతను 'గెలకాలి' అని కరెక్ట్ గానే అన్నాడని ..కానీ ఐస్‌టీ మత్తులొ ఉన్న మలక్కి 'కెలకాలి' అని వినిపించడమే అసలు కారణం అని ఇంకొ కథ ప్రచారంలొ ఉంది. ఎమయితే పెద్దగా అబ్జెక్టివ్‌లు గట్రా లేకుండానే ఆ మర్నాడే క్లె బ్లా స రూపుదిద్దుకుంది...
సంఘం పేరులోనే "కెలుకుడు" ఉంది కాబట్టి ఈ క్లె బ్లా స సభ్యులు ఎమి రాసినా అది కెలుకుడుగా అనిపించడం సహజం కదా... కానీ కెలుకుడు పదమే బూతయిపొయిన ఈ రొజుల్లొ క్లే బ్లా స సభ్యులు రాసింది ప్రతీది కేలుకుడేనా అన్న ప్రశ్న ఉదయించింది. మొన్నామద్య " బూతు అని బోర్డ్ పెట్టుకోకుండా ఎంత బూతు రాసినా పర్లేదా అధ్యక్షా" అని శరత్ గొంతు చించుకుని వాదించిన గొడవొకటి గుర్తువచ్చింది... అదే లాజిక్ ప్రకారం .... కెలుకుడు అన్న పేరు వాడకుండా ఎంత ఇండైరేక్ట్ కేలుకుడయినా కేలుకేసుకోవచ్చా అని జనానికి డౌట్ ... ఈ ప్రశ్న మలక్ ని అడిగితే ముందు కెలుకుడుని నిర్వచించమంటాడు... ఆ మనిషితో అదే చిక్కు ...
ఈ మద్య బ్ల్లాగుల్లో కొంతమందికి ఈ కెలుకుడు పని పాట లేక తీరిక ఎక్కువై చేస్తున్న గలాటా అనిపిస్తుంది ..ఇంకొంతమంది ఇదేం చెత్త అని విసుక్కుంటున్నారు, ఇంకొంతమంది ఈ పెంటకి దూరం గా ఉండండి అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు... ఇంకొంతమంది నాజుగ్గా కేలుక్కోవాలి అని అంతకన్నా నాజుగ్గా క్లాస్లు పీకుతున్నారు.... ఇంకొంతమంది కెలుకుడు ఆపండ్రా బాబోయ్ అని గావుకేకలు పెట్టేస్తున్నారు.. ఇంకొంతమని ఎప్పుడూ ఈ క్లే బా స వాళ్ళ నోటిలో నానే ఈ మార్తాండ ఎవడ్రా బాబు అని జుట్టు పీక్కుంటూ ఉంటారు.... అయితే వీరికి కెలుకుడు పేరు పెట్టుకుని కెలికే బ్లాగర్లు తప్ప వేరే బ్లాగర్లు రాసే 'చెత్త' కెలుకుడు లా అనిపించదు... మలక్ లాజిక్ లా..... తమది కెలుకుడు అని బోర్డు పెట్టుకొలేదు కాబట్టి అది కేవలం వాళ్ళ భావవ్యక్తీకరణే తప్ప అది కెలుకుడు కాదు అన్నది వీళ్ళ అభిప్రాయం...కొత్తగా వచ్చిన బ్లాగర్లు ఈ కెలుకుడు అంటే ఏమిట్రా బాబు అని ఎమీ అర్ధం కాక జుట్టు పీక్కుంటూటుంటారు... వారికి అర్ధం అయ్యేలా ఇప్పుడు నేను కెలుకుడుని పూర్తిగా నిర్వచించలేను కానీ మన సీనియర్ బ్లాగర్లు కెలుకుడుగా పేర్కొనే కొన్ని ఉదాహరణలు చూద్దాం ..
కేలుకుడుకి కేలుకుడే సమాదానం అని బలంగా నమ్మిన బ్లాగ్వీక్షణం ... బ్లాగుల్లొ ఏ మూల చీమ చిటుక్కుమన్న దానికి మలక్, తార, శీను , కార్తీక్ లే కారణం అన్నది వీరి అరొపణ... "ఎవరి కంపు వారికి ఇంపు" అన్న సిద్దాంతంతొ పెద్దన్నల ప్రొత్సాహంతొ దూసుకుపొతున్న ఈ అనాధబ్లాగు ముఖ్య ఉద్దేశ్యం ... కెలుకుడు అనుకుంటే అది మీ పొరబాటు ...అది కేవలం పోరాటం మాత్రమే
కొంతమంది కుల వ్యవస్థ పొగొట్టాలనే సదుద్దేశ్యంతో ఎప్పుడూ కులమాతాల మీద (మీదే ) రాస్తుంటారు... ఉదాహరణకి బ్రహ్మణికల్ ఆటిట్యుడ్ , బ్రహ్మల మీద కమ్మ మోడల్ ప్రయోగించాలని, పొరాటం మొదలెడితే ఎన్ని తలకాయలు తెగుతాయో లెక్క ఉండదని ... వైగైరా ...వగైరా .. ప్రశాంతమయిన నదిలా సాగుతున్న బ్లాగ్ వాతావరణం లో కులమనే రాయి విసిరేసి ఆ చెదిరిన నీటిని చూసి అనందించే భావుకులు వారు.... ఇది కేవలం వారి విశాల భావాలు చూపించడం అన్నమాట (మనం వద్దన్నా)... వీరు తోటి బ్లాగర్ని పూజలు చేసే మోసగాడు అని తిట్టినా, దేవతల నగ్న చిత్రాలు ఎత్తుకొచ్చి పెట్టినా... ఆఖరికి " నిన్నటివరకు నా దగ్గరున్న సీతక్క ఈ రొజు నీదగ్గర ఉంది ..రేపు ఎవరు వైపు మాట్లాడుతుందో " అని డైరెక్ట్ గా పేర్లు పెట్టి తిట్టినా ... ఏ విద్వేషం చిమ్మినా అది కేలికినట్టు కాదు ... అదన్న మాట... ఈ చాకులాంటి స్త్రీవాది విశాలహృదయం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ...
ఇంకొకరు రిజర్వేషన్స్ గురించి ప్రస్తావిస్తూ ... "తరతారాలుగా మా ఉద్యోగాలు , అవకాశాలు మీరు దొంగలించారు ఇప్పుడు ఎవరు కొసం ఇస్తారు...మీరు ఇవ్వకపోతే మాత్రం మేము ఊరుకుంటామా....తలకిందులుగా వేలాడతీసి కక్కిస్తాం" అని అంటారు... ఒట్టు అది కెలుకుడు కాదు... కానీ అప్పుడు ఎవరయినా...."అయ్యా తమరు అమెరికా ఎలా వెళ్ళారు... నిజంగా అన్ని ఇమ్మిగ్రేషన్ రూల్స్ పాటించే వెళ్ళారా...రేపటి తరం అమెరికన్స్ మీ పిల్లలనో వాళ్ళ పిల్లలనో అలాగే వేలాడదీసి .. మీ ముందు తరాల వాళ్ళు మా అవకాశాలు లాక్కున్నారు అందుకు మిమ్మల్ని తలకిందులుగా వేలాడదీసి కక్కిస్తాం అని అంటే" అని మనం ఈ అమ్రిష్ పురిని అడిగాం అనుకోండి ..అది కెలుకుడు అన్నమాట
పాపం కొంతమందికి కొపం వస్తే అనానిమస్ ముసుగేసోకోచ్చి తిడతారేమో కానీ ఒకరిద్దరు బ్లాగర్లు మాత్రం నచ్చనివాళ్ళని డైరెక్ట్ బూతులు తిట్టేస్తారు.... బూతులు తిట్టడం ఆధునికతకి చిహ్నమనొ లేక ఆడమగ సమానత్వం సాధించడం వల్ల వచ్చిన హక్కు అనో భ్రమలో ఉంటారు... ఈ అడ్డగొలు సుబ్బమ్మలని ఎవరన్నా " ఎమ్మా అదేం పని ..అలా బూతులు తిట్తోచ్చా అంటే" అది కరక్ట్ గా కెలుకుడు పెంట అయిపోద్ది అన్నమాట ..
ఇంకొరు ... నచ్చని హీరోల మీద లేక ఒక కులంకి సంబందించిన హీరోల మీద వుండే నాస్టీ జోకులన్నీ ఎత్తుకొచ్చి బ్లాగులో పెట్టుకుంటారు... అది భావ వ్యక్తీకరణ స్వేచ్చ. అది అందరూ ఎక్సెప్ట్ చెయ్యాలి. కానీ అది చూసి ఎవరికన్నా మండి ఎదురుతిడితే అది సడన్ గా కెలుకుడు కింద కనిపిస్తుంది.... ఇలాంటి వారిని ఎక్కువ అడిగితే చెప్పుదెబ్బలు కొట్టేస్తారు...
కొంతమంది ... ఆంధ్రా నాయకులు అందరిని హొల్‌సెల్ గా వెదవలు అంటే... ఇంకొంతమంది కే సి ఆర్ చూపిస్తూ మొత్తం తెలంగాణాని అవమానపరుస్తూ ఉంటారు ...వీళ్ళు ఈ మద్య బ్లాగ్ లోకం లో అడుగడుక్కి కనిపిస్తారు.... వీరు రాసే ఏది కెలుకుడు కాదు... జాతి పొరాటం అన్నమాట .. ఇది ఎవరికీ చిరాకు తెప్పించదు..
కొంతమంది ... ప్రపంచంలో ఎక్కడ ఆడవాళ్ళ మీద దౌర్జన్యం జరిగినా దానికి మొత్తం మగజాతే కారణం అని అందరిని కలిపి తిట్టేస్తూ ఉంటారు... కానీ ఈ మహిళామణులకి ఈ బ్లాగ్లోకంలోనే ఎక్కడన్నా ఆడవాళ్ళ మీద ఎవరన్నా చెడుగా రాస్తే ఖండించే తీరిక ఉండదు... వీళ్ళని చూసి మొత్తం మగవాళ్ళ తరపు వకాల్తా తీసుకొని ఇంకొంతమంది వాళ్ళతో వాదించేస్తూ అవేశపడిపొతూ ఉంటారు... ఈ పల్లిగూడెం జనాలతో ఎక్కువ మాట్లాడితే మనమంతా కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి పొతే అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంటారు... ఈ చర్చల్లో ఒకరినొకరు తిట్టుకుని అలసిపోయి వదిలెయ్యడం తప్ప ... ఇంతవరకు ఎవరి అభిప్రాయాలు కొద్దిగా కూడా బెసగలేదు.... వీళ్ళ చర్చ (?) వల్ల బ్లాగ్లోకానికి ఒరిగింది ఏమీ లేదు...అయితే వీళ్ళది అస్సలు కెలుకుడు కాదు... కేవలం చర్చ...
ఇంకొంతమందికి కలర్ లీడరమ్మ, బలం తప్ప మిగతావారు మనుష్యులు కాదు... సర్లెండి వాళ్ల ఇష్టం వారిది... అయితే వీరికి మిగతా నాయకుల్ని , రచయతలని విమర్శించే హక్కు ఇలా ఉంది అనుకుంటున్నారో అలాగే మిగతావారికి ఈ లీడరమ్మ , బలం ని అనే హక్కు ఉంటుంది కదా... అక్కడే వాళ్ళలో తేడా కనిపిస్తుంది... వారికి నచ్చిన వాళ్ళు అందరికి నచ్చాలనుకుంటారు... విమర్శిస్తే తట్టుకోలేరు .. గొడవకి దిగుతారు... అప్పుడే సడన్ గా ఎదుటి వారు వాదించేది కెలుకుడులా కనిపిస్తూ ఉంటుంది... అది వారి ఉద్దేశ్యం లొ కెలుకుడు అంటే
ఇంకొంతమంది మన రాస్ట్రం లొ టమోటా రెట్లు పడిపోవడం నుండి ... అన్నల ఎన్కౌంటర్ వరకు అన్నిటికి అమెరికా కారణం అని అంటుంటారు... కాదని మీరు చెప్పడానికి ప్రయత్నిస్తే అది కెలుకుడు కింద లెక్క ....
మరికొందరు.... ఒక ఇద్దరు మద్య గొడవ జరిగితే ... తప్పు ఎవరి వైపు వుంది అన్నది ఆలోచించకుండా కేవలం అందులో ఎవరు మైనారిటి అయితే వారికి సపోర్ట్ చేసే గుంపు ఒకటి ఉంటుంది... కసబ్, అఫ్జల్ గురుని క్షమించమని , పాకిస్తాన్ ప్రేమించమని, కాశ్మీర్ ని వదిలెయ్యమని, టిబెట్ ని కెలకోద్దని... ఇలా అన్నమాట... వీరి మాటలు నచ్చక ఎవడన్నా గట్టిగా ఎదురు మాట్లాడితే అది కెలుకుడు ... వాళ్ళు ముందు రాసింది కేవలం వాళ్ళు అభిప్రాయం వ్యక్తపరిచినట్టు అన్నమాట...
ఒకరు రామోజీరావును కెలికితే ... ఇంకొరు సత్య సాయిబాబా ని, ఒకరు జాతకాల శర్మని కెలికితే ఇంకొకరూ షిర్డీ సాయి బాబాని కెలుకుతూ ఉంటారు ... వీటిలో కొందరు చెప్పేవి కెలుకుడు కాదు... కేవలం నాజుగ్గా అభిప్రాయం వ్యక్తపరచడం ...మిగతా వారు మాత్రం కేలికినట్టు అన్నమాట .
ఇంకొంతమంది బ్లాగుల్లో ఎవరు ఎవర్ని కేలుక్కున్నా తననే కెలికారన్న ఒకరకమయిన వ్యాదితో బాదపడుతూ ఉంటారు ... ఆ భాదలొ వాళ్ళు మాత్రం అస్సలు సంబంధం లేనివారిని కూడా కెలికి పడేస్తూ ఉంటారు... అయితే అది కూడా కెలుకుడు కాదు...కేవలం బాద వ్యక్తపరచడం ...
మేజారిటి బ్లాగర్లకి నచ్చే కొన్ని కెలుకుడులు కూడా ఉంటాయి...ఎవడన్నా కే ఏ పాల్ నో, ఓంకార్ ని బూతులు తిడితే అది అందరి ఆమోదం పొందుతుంది... ఎం పాపం అతన్నీ నాజుగ్గా విమర్శించొచ్చు కదా... అతను చేసిన పనులు నచ్చనంత మాత్రాన అలా నొటికి ఏదివస్తే అది తిడతారా... అదే బ్లాగుల్లొ ఎవరయినా అలా ప్రవర్తిస్తే అలా ఎందుకు తిట్టకూడదు... ఆ ఓంకార్ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఈ తిట్లు చూసి బాదపడరా ... ఓంకార్ ని దరిద్రుడు అన్నా, అల్లు అర్జున్ని చేక్కమొహం గాడన్నా...చెల్లుద్దా? ... సర్లెండి ఎవరు ఎమి అనుకున్నా ఇది మాత్రం బ్లాగ్లొకం లొ ఇది కెలుకుడు కాదు ...
అదీ కొత్తగా వచ్చిన తమ్ముళ్ళూ ....చెల్లెల్లూ.... బ్లాగ్ ప్రపంచం లో ఇప్పటివరకు నిర్వచించిన కొన్ని కెలుకుడు ఉదాహరణలు ...మరి మీరు కేలకాలంటే కెలుకుడుగాళ్ళం అని ముసుగేసుకోకుండా ఏదయినా కేలికేయోచ్చు... లేదు " ఛి ఛి ..ఏదో సాద్దిద్దామని బ్లాగ్లోకం లోకి వస్తే ఇక్కడ ఈ క్లే బ్లా స వాళ్ళు ఉన్నారే " అని ధుమధుమలాడితే మీకు పెద్దమనిషి హోదా గారెంటీ .. కావాలంటే "వారాంతం"లో చూస్తూ ఉండండి ....
సరే ఇవన్ని పక్కన పెట్టి ... నేను చెప్పేది కాస్త ఆలోచించండి.
మనం ఒక సారి బయట ప్రపంచాన్ని కెలుకుడు కళ్ళతొ చూస్తే.... ఎన్ని కనిపిస్తాయో..... ఒక చానల్ ని ఇంకో చానల్, ఒక దిన పత్రిక ని ఇంకో దినపత్రిక, ఒక రాస్ట్రాన్ని ఇంకో రాస్ట్రం, ఒక దేశాన్ని ఇంకో దేశం .. ఒక నాయకుడిని ఇంకో నాయకుడు.. ఒక హీరోని ఇంకో హీరో (లేక వాళ్ళ అభిమానులు) .. ఒక కంపెనీ వాడిని ఇంకోడు (కోక్ ని పెప్సి కేలికినట్టు )..ఒక ఉద్యొగస్తుడిని ఇంకో ఉద్యొగస్తుడు .. ఇలా ఏరంగంలో చూసినా కెలుకుడు కనిపిస్తుంది.. అయితే వారెవరు కెలుకుడు అని పేరు పెట్టుకోరు....:-)
ఇన్నిరకాల మనస్తత్వాలు, రకరకాల అభిప్రాయాలు ఉన్న బ్లాగ్లొకం అనే ఈ ముసుగు ప్రపంచం లో కూడా ఏ ఇద్దరి అభిప్రాయాలు పూర్తిగా కలవ్వు కదా . బయట ప్రపంచం లానే ఇక్కడ కూడా ఒకర్ని ఒకరు కేలుక్కోవడం చాలా సహజం ... బయట అయితే ఎదురుగా విమర్శించడానికి మొహమాటం అడ్డొచ్చి పక్కోడి దగ్గర తిడతారు... ఇక్కడయితే ముసుగేసుకోచ్చి తిడతారు అంతే తేడా....
కొంతమంది వాళ్ళది కెలుకుడు అని తెలీక...ఇంకొంతమంది అసూయతో ..మరికొందరు విద్వేషంతో ..కొంతమంది హక్కుల పేరుతొ ..కొంతమంది ఈగోతో ..కారణం ఏదయితే బయట ప్రపంచం లానే ఈ బ్లాగులొకం లొ కూడా కెలుకుడు అన్నది అనంతంగా సాగిపోతూ ఉంటుంది... పాత బ్లాగ్ తరం పొయి కొత్త బ్లాగ్ తరం వచ్చినా ఎదొ ఒక రూపంలొ ఈ కెలుకుడు సాగుతూంటుంది.
అందుకని...కెలుకుడుని బ్లాగ్జీవితం లో ఒక బాగంలా స్వీకరించండి ... అప్పుడు ఏ సమస్య ఉండదు... మీరూ తెలిసో తెలీకుండానో ఎంతమంది కేలుకుతున్నారో ఆలోచించండి ... మీ రాతల వాళ్ల ఏ ఒక్కరు బాదపడినా వారికి సమయం వచ్చినప్పుడు తిరిగి కెలుకుతాడు అన్న స్పృహ ఉంటే కెలుకుడు బూతులా కనిపించదు...
సె'లవ్'