"ఏరా పిల్లలూ! అంతా సెట్టయ్యారా?"
"ఏం సెట్టో ఏమో సార్! ఎక్కడేసిన గొంగళక్కడే ఉంది."
"ఏవైందయ్యా?"
"చూడండి సార్! ఎలా కొట్టుకుంటున్నారో!"
"ఆ(! చూస్తున్నా!"
"మేషారూ! వచ్చేసా!!"
"ఎవరయ్యా నువ్వు? ఎప్పుడూ చూళ్ళేదూ?"
"నాపేరు వరుణ్ సార్. 2010 నించీ ఉన్నా, కానీ క్లేసు బయట ఉండి పాఠాలు నేర్చుకున్నా!"
"అబ్బో! ఏకలవ్య శిష్యుడివన్నమాట. సరే, కూర్చో!"
"సార్! నాకో సందేహం!"
"ఏంటి జిలేబీ?"
"అసలు ఏకలవ్యుడంటే ఎవరు సార్? ఒక్కరికే 'లవ్యూ' చెప్పేవాడా?"
"అబ్బా! అసలు ..."
"మీరుండండి సార్. ఈ జిలేబీ పని నేను పడతా!"
"నువ్వెవరు బాబూ?"
"నా పేరు చిరంజీవి సార్!"
"ఓహో! తమ్ముడూ, లెట్స్ డూ కుమ్ముడూ అని ఇందాక 150 సార్లు పాడి 150 బ్లాగుల్లో కామెంట్లు పెట్టింది నువ్వేనా?"
"మరే!"
"అబ్బో, ఎంత సిగ్గో, చాల్ చాల్లేగానీ కూర్చో!"
"సార్! సార్!"
"ఏంటయ్యా అనామకం?"
"గ గా గి గీ గు గూ"
"ఆపేయ్! ఆ తరవాత అక్షరం పలకద్దు!"
"అబ్బా మేష్టారూ! అదేనండీ అసలు రహస్యం. మన మేగాస్టారుకి జిలేబీ మీద ఉన్న లవ్వు ఈ విధంగా తిట్లరూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడని నాకో పెద్ద డౌటానుమానమండీ!"
"నీ మొహం. ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటూంటే లవ్వేంటీ? అయినా దీనికీ ఆ 'గ' గుణింతానికీ సంబంధమేంటీ?"
"మరేమో .. ఆ రౌడీగాడు జీలేబీని 'జీలేబీ సార్!' అంటాడండీ. ఆ శాల్తీ ఏమో సారో మేడమో తెలియకుండా మొహం మీద ముసుగేసుకుందండీ. ఒక వేళ ఆడలేడీ కాకుండా మగజెంట్ అయితే మనం చదవాల్సింది గ గుణింతం సెక్షన్ 377 కదండీ?"
"ఏడిసినట్టుంది నువ్వూ నీ తొక్కలో లాజిక్కూనూ! ఏమయ్యా రౌడీ, ఏమిటీ గోల?"
"నాకేం తెలియదు, నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండీ సార్!"
"సార్! ఈ క్లాస్ రూముకి పట్టిన చీడ ఈ అపర లిబరల్ రౌడీగాడూ, ఆ అపర కన్సర్వేటివ్ హరిబాబూనూ! వీళ్ళవల్ల ఎంతమంది క్లేసు విడిచి పారిపోయారో!"
"ఎవరయ్యా మాట్లాడుతోందీ?"
"తెలియదు సార్! ఎవడో వెనక బెంచీ పోరగాడు!"
"ఫట్ ఫట్ ఫట్"
"ఏంటయ్యా ఆ శబ్దం?"
"సార్! రౌడీగాడు చొక్కా చింపుకుంటున్నాడండీ!"
"ఏమయ్యా రౌడీ నీకిదేం వెఱ్ఱి?"
"వెఱ్ఱికాదు సార్! జనాలని ఇక్కడనుండి వెళ్ళగొట్టగలిగే శక్తీ, సత్తా, సీనూ, దృశ్యం నాకున్నాయని తెలియగానే నా ఛాతీ మోదీగారి 56 అంగుళాల ఛాతీలాగా పొంగిపోయి చొక్కా చిరిగిపోయిందండీ!"
"అఘోరించావులే!"
"ఇంతకీ ఆ జనాలు పారిపోలేదండీ. ఈ క్లేసంటే బోర్ కొట్టీ ఫేస్‌బుక్ లోకెళ్ళిపోయారంతే!"
"నా క్లేసుని బోరంటావా? ఛంపేస్తా! బస్తీమే సవాల్!"
"ఎవరదీ? సవాల్ అన్నది? నేను కూడా విసరనా ఒక ఛాలెంజ్?"
"హమ్మయా! హరిబాబూ! సవాల్ అనగానే నిద్ర లేచినట్టున్నావుగా?"
"సార్! మీరేమనుకోకపోతే నాదో చిన్న సలహా. ఈ క్లేసులో ఇలాంటి చర్చలు మంచివి కావు సార్. అనవసరమైన బూతులు దొర్లుతాయి!"
"సరేనయ్యా శ్యామలరావ్! కాసేపట్లో ఆపేద్దాంలే!"
"ఒరేయ్! నీ యెంకమ్మా!!"
"పోరా! నీ సుబ్బమ్మా!"
"ఏంటర్రా? ఏం జరుగుతోందిక్కడా?"
"ఏమీ లేదు సార్! ఆ వరుణ్ కుమారూ, చిరంజీవీ ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటున్నారంతే"
"ఎవరక్కడ? ఆ వరుణ్ కుమార్ పుస్తకాలు క్లేస్ బయటకు విసెరెయ్యండ్రా!"
"అలాగే సార్!"
"హమ్మయ్యా!"
"సార్! సార్!! సార్!!!
"ఇప్పుడేమయిందయ్యా చౌదరీ?"
"సార్! ఆ రౌడీగాడు వరుణ్ పుస్తకాల్తో పాటు నా పుస్తకం కూడా విసిరేశాడు సార్!"
"ఏమయ్యా రౌడీ! ఏం పోయేకాలం నీకు?"
"అది టెంపరరీగానే సార్. ఒక సారి నాతో మాట్లాడితే వాటిని మళ్ళీ తీసుకొస్తా. ఇంకా మాట్లాడలేదు మరి! అన్నట్టు ఇక్కడ విసిరేసే బాధ్యత నా ఒక్కడిదే కాదు సార్. నేను టీములోని ఒక మెంబర్ని మాత్రమే"
"ఇదేం తలనెప్పిరా బాబోయ్! సరేగానీ జనాల గుంపులు పెద్దగా కనబడట్లేదేం?"
"పద్మార్పిత ఈ మధ్య తన రసరమ్య శృంగారభరిత ప్రేమకవితలు తగ్గించింది సార్!"
"ఓహొ!"
"సార్! నా బెంచిలో జనాలిలా కొట్టుకోవడం నాకిష్టం లేదు. ఈ బెంచి మీదకి ఇంకెవర్నీ రానివ్వదల్చుకోలేదు!"
"సరే కొండలరావ్! నీ ఇష్టం!"
"సార్ ఇదన్యాయం!"
"మళ్ళీ ఏమిటయ్యా హరిబాబూ?"
"బెంచి క్లీన్ చేస్తే మొత్తం క్లీన్ చెయ్యాలి గానీ సగం సగం క్లీన్ చేస్తే ఎలా సార్? దానివల్ల ఆ చౌద్రీ భాయ్ హీరో, నేను విలనూ అయిపోయాం!'
"ఖర్మ! బాబూ కొండలరావ్! ఆ సంగతేంటో కాస్త చూడు!"
"అసలే దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. తెలంగాణా చిత్రం చాలా అస్పష్ట స్పష్టంగా ఉంది!"
"ఎవరదీ? ఓహో భండారు శ్రీనివాసరావా? నీ చుట్టూ కూడా చిన్నపాటి సమూహముందిగా?"
"సార్! నాదో సలహా!"
"చెప్పవయ్యా విన్నకోట నరసింహారావ్!"
"ఏమీ లేదుసార్! మన క్లేసురూముల్లో బెంచీలమీదా ఫేనుల మీదా ఆ రాజకీయనాయకుల పేర్లు తీసేస్తే ఇక్కడ జరుగుతున్న తమాషాకి ఫుల్-స్టాప్ పడుతుంది!"
"అవునా? సరే, ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాం!"
"సార్! ఇది నమ్మడానికి జనాలు చెవిలో పువ్వులు పెట్టుకున్నారనుకుంటున్నారా?"
"ఎవరయ్యా అదీ? ఓ! జై గొట్టిముక్కలా? ఏమిటయ్యా నీ బాధ?"
"గత సంవత్సరం మీ మద్దతు లేకుండా ఈ బెంచీల మీద ఫేన్ల మీద ఆ పేర్లుపడెవే కావు. ఇవన్నీ ఎందుకని జనాలు మిమ్మల్ని నిలదీస్తుంటే మీరు నేరాన్ని ప్రిన్సిపాల్‌గారిమీదకు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు!"
"అది కాదయ్యా! అసలు నేను చెప్పేదేమిటంటే ..."
"సొమ్ములు ఉండెడి క్లాసుల
దుమ్మును దులిపేటి సారు దూసుకురాగా
కొమ్ములు తిరిగిన కుంకలు
గమ్మున పడిచచ్చె నేడు గదనె జిలేబీ!"
"అయ్యబాబోయ్! జిలేబీ పద్యవిహారం. లగెత్తండ్రోయ్!"
"సరే పారిపోదాంగానీ, క్లేసులో ఉండే సొమ్ములేంటీ?"
"నీ బొంద. విశాఖ మాండలికంలో పశువుల్ని సొమ్ములంటారు!"
"ఆ(!!"
(సశేషం!)