Feb 24, 2010

అక్కయ్య గారు రూటు మార్చారోచ్!

పాపం పవన్ తో పప్పులుడకడం లేదని అక్కయ్యగారు లేటుగా లేటెస్టుగా రూటు మార్చేశారు. కావాలంటే ఈ స్క్రీన్ షాట్ మీరే చూడండి ...







*************************************************************





ఇది చూస్తూంటే నా సెంట్రల్ యూనివర్సిటీ రోజులు గుర్తొస్తున్నాయి. నేను జాయిన్ అయిన కొత్తల్లో ఒక అమ్మాయి ఆత్మ హత్య చేసుకుంది - కారణం - తన బాయ్ ఫ్రెండు మోసం చేసాడని - దానికి కారణం? అతను అగ్రవర్ణం, ఆమె దళితురాలు. సంబంధం పెట్టుకునేదాకా ఓకే గానీ పెళ్ళిమాత్రం కదరదన్నాడు. దానితో ఆ అవమానం భరించలేక తన రూములోనే ఉరేసుకుంది. యూనివర్సిటీలో చాలా పెద్ద గొడవే జరిగింది. దళిత సంఘాల వాళ్ళొక రేలీ నిర్వహించారు. కులం కారణంగా మొదలై, కులమే మూలంగా ఉన్న గొడవ రేడీకల్ ఫెమిష్టుల చేతుల్లో పడింది. ఇంకనేం? మగవాళ్ళంతా భూతాలు, ఆడవాళ్ళు దేవతలు అని గొడవ మొదలు పెట్టారు. పోస్టర్లు అంటించడం మొదలు పెట్టారు - ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఒక అలవాటు ఉండేది లేండి - శుభ్రంగా ఉన్న గోడల్ని చూస్తే కుళ్ళు, అందుకే పోస్టర్లంటించుకునే వాళ్ళు ... కత్తితో కాదురా ... పోస్టర్ తో చంపేస్తా" అనే సీనన్నమాట

ఇదంతా చూస్తున్న ఒక గుంపుకి చిరాకేసింది. అసలు గొడవేమిటి, వీళ్ళు వేస్తున్న తింగరబుచ్చి వేషాలేమిటి అని. వెంటనే వాళ్ళోక పోస్టర్ వేసారు .. దాని సారాంశం:


ఆ అమ్మాయి - ఆత్మ హత్య చేవ్సుకుందంటే తప్పెవరిది?

... మోసం చేసిన ప్రియుడిదా?
... గుడ్డిగా నమ్మిన తనదా?
... తన బాధని చెప్పుకోడానికి అవకాశం ఇవ్వని తల్లిదండ్రులదా?
... గర్భవతి అనగానే చీదరింపుగా చూసిన ఆమె స్నేహితులదా?
... కులాల మధ్య తారతమ్యం సృష్టించిన మన సమాజానిదా?
... అసలు విషయం మర్చిపోయి పోస్టర్లతో కొట్టుకుంటున్న నీదీ, నాదీనా? అని

ఆ పోస్టరు సూపర్ హిట్టయి కూర్చుంది ... ఆ పోస్టరుతోనే ఒక క్లబ్బు పుట్టింది ... బెర్మ్యూడా క్లబ్! - HCU Bermuda Club!

కట్ చేస్తే ...

E అంటే ఈ వీ ఆర్ సీ మోహనరెడ్డి
R అంటే రాజశేఖర్
M అంటే మూసత్ సుబ్రహ్మణ్యం
U అంటే యూ వీ రమణయ్య
D అంటే డేవిడ్, దత్తు, దాసు
A అంటే అరుణ్ కుమార్

వీరందరూ ఒకే రూములో కూర్చునే రీసెర్చి స్కాలర్లన్నమాట. పాపం వాళ్ళ ప్రమేయం లేకుండానే లాగబడ్డారు .. అదే గ్రూపుకి చెందిన 'బీ' అనే వాడి వల్ల. ఆ "B" ఎవరో మీకు చెప్పక్కరలేదనుకుంటా.. అదీ సంగతి :))

మళ్ళీ కట్ చేస్తే ...

యూనివర్సిటీ కల్చరల్ ఫెస్టివల్ సుకూన్ ... కొత్తగా వచ్చిన ఈ క్లబ్బు స్టేజ్ షో ఒకటీ చేసింది - దానిలో ప్రత్యేకత, జనాలకి కుళ్ళీన టోమేటోలు ఇవ్వడం. కామేడీషో కి ఎవడికీ నవ్వురాకపోయినా, కామేడీ చేసిన వాడిని ఎవడైనా టొమేటో తో కొడితే జనాలు నవ్వుతారు కదా .. అదన్నమాట ... ఆ షో కూడా సూపర్ హిట్. ఇంతకీ దాని పేరు తెలుసా? Ace Whole Show!
దానిలో ప్రత్యేక ఆకర్షణా పేరడీలూ .. ప్రమాదవనంలో అక్కయ్యా అక్కయ్యా పేరడి అలాంటి షో నుండీ వచ్చిందే.

ఈలోగా రేడీకల్ ఫెమినిష్టుల పోస్టర్లు ఎక్కువయ్యాయి .. మన వాళ్ళు కూడా పోటీగా వెయ్యడం మొదలు పెట్టారు ( పెట్టాడు అనాలి .. హీ హీ హీ) .. వాళ్ళు పెట్టీన ప్రతీ పోస్టర్కీ కామెడీగా రెస్పాన్స్ వచ్చేది .. దీని వల్ల క్లబ్బరులు చేసిన పనేమిటంటే, వారికి తెలియకుండానే ఫెమినిష్టులని నీరుగార్చడం. వారి ప్రతీ పోస్టర్నీ కామేడి చేసి ...

వారికి చైర్రెత్తుకొచ్చి .. నాటు పోస్టర్లు వయ్యడం మొదలు పెట్టారు .. మచ్చుకి ...

What if the man starts menstruating?

Govt is Male Chauvinist .. those three days will be holidays
Males will be males only for 3 days
3 days a mont will be spent on religious undertakings

etc


మనవాళ్ళు కూడా దేశముదుర్లేగా .. దానికి కూడా రెస్పాన్స్ ఇచ్చారు ...

Our INDECENT answer to your INDECENT question

What if the male starts menstruating?

A: Even the Sanitary Napkin says "GIVE ME REDDDDDDDDDDDDDDDDD" ... Eveready!!!


పాపం రేడికల్ ఫెమిష్టు పని కుడితిలో పడ్డ ఎలకలా తయారయ్యింది. ఒక గుంపుని పోగేసుకుని ఈ క్లబ్బుకి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు, అంతా అగ్రవర్ణాల సాంస్కృతిక వాదులని. The more they talked about the club, the more famous it became. అప్పటికే పాప్యులర్ అయిన క్లబ్బు ఒకేసారి 175 మంది మద్దతుదార్లని సమకూర్చుకుంది. దానితో Bermuda క్లబ్బర్లకి కొత్త సమస్య వచ్చింది - ఎలక్షన్లలో పోటీచేసే వాళ్ళు మద్దతు అడగడం. అసలు క్లబ్బుకి పేరు రావడానికి కారణం, రాజకీయాలకి, కులమతాలకి అతీతంగా పని చెయ్యడం. వాళ్ళని వదిలించుకునే సరికి తల ప్రాణం తోకకొచ్చింది. అలగే రాత్రి పూడా క్రికెట్ కప్ పోటీని మొదలు పెట్టిన ఘనత కూడా క్లబ్బుదే .. ఆ తరవాత నా వింగ్ మేట్, దురదృష్టవశాత్తూ గుండేపోటుతో మరణీంచిన నారాయణరెడ్డి పేరు పెట్టారు దానికి.

ఈలోగా మరో గడవ - 1995 ఆగస్టు పదిహేనో తారీకు నాడు కేంపస్ లో ఒక విద్యార్ధిని అత్యాచారానికి గురైంది. దానికి పాల్పడ్డవారు కేంపస్ బయనుండి గేదెల్ని తోలుకొచ్చి మేపుకునే వారు. కాని ఈ రేడికల్ ఫెమినిష్టులు ఆ నేరాన్ని మగ విద్యార్ధుల మీదకి తోసేశారు. దానితో అబ్బాయిలకీ మిగతా అమ్మాయిలకీ కూడా చిరాకేసింది. ఎవడో బయటవాడు చేసిన దానికి కేంపస్ లో అబ్బాయిలని ఎందుకు నిందిస్తున్నారని సణగడం మొదలు పెట్టారు.( అసలు అర్ధరాత్రి 12 గంటలకి ఆడపిల్లలు ఆరోజుల్లో వంటరిగా తిరగగలిగినది రాష్ట్రం మొత్తం మీడ ఒక సెంట్రల్ యూనివర్సిటీలోనే. )

ఈలోగా ఒక గ్రూపు వాళ్ళు ఆ అమ్మాయికి నష్ట పరిహారం ఇవ్వాలని డెమేండ్ చేశారు. దానితో కొంతమంది అమ్మాయిలు రెచ్చిపోయి "అయితే మామీద కూడ అత్యాచారాలు చెయ్యండి, మాకు కూడా నష్టపరిహారం ఇవ్వండి" అని కేక్లెయ్యడం మొదలు పెట్టారు. దానితో కోపగించుకున్న ఒక వ్యక్తి "మీకంత సీను లేదు. మీమొహాలని చూసినవాడెవ్వడూ మీదగ్గరికి కూడా రాడు" అని ఒక కుళ్ళు జోకేశాడు. ఏమి జరుగుతోందో అర్ధమయ్యేలోగానే విషయం పక్కదారి పట్టి, నానా గొడవా అయ్యింది. ఒక మగ ఫెమినిష్టు ప్రొఫెసర్ ALL MALES ARE BAS***** అనే స్థాయి దాకా వెళ్ళాడు. ఇక మగవాళ్ళు రంగంలోకి దిగారు. క్లబ్బు పాప్యులారిటీ విస్తరించింది. ఆ క్లబ్బులో ఈ ఫెమిష్టులతో చిర్రెత్తిన అమ్మయిలు చేరడం మొదలు పెట్టారు. ఇక పండగే పండగ. ఇంతాచేసి ఆ నేరం చేసిన వాడిని పట్టూకుని ఒరేయ్ నీకంత ధైర్యం ఎలా వచ్చిందిరా అంటే, "పీకాక్ లేక్ దగ్గర పట్టపగలు ఫలానా వారిద్దరి కేళీ విలాసం చూసాను" అన్నాడూ. ఇంతకీ వారిద్దరూ ఎవరు? స్త్రీ వాదం పేరుతో విశృంఖల శృంగారాన్నికి పాల్బడ్డ ఒక మగ, ఒక ఆడ ఫెమిసిష్టులు .. గతుక్కుమన్నారు ..

కేంపస్ లో ఇలాంటివేమిటా అనుకుంటున్నారా? అప్పట్లో ఇవన్నీ మమూలే లెండి. నేచర్ క్లబ్, ఎడ్వంచర్ క్లబ్ మెంబర్లుగా ఉండే మేము కేంపస్ లో చాల Trekking చేసేవాళ్ళం. ఒకసారయితే దాదాపు 25 కిలోమీటర్ల పొడవున్న ప్రహరీగోడ మొత్తం నడిచొచాం కూడా. వెన్నెల రాత్రుల్లో Mushroom రాక్ అనే చోటికి వెళ్ళడం చాలా ఇష్టం మాకు. ఒక అయిదారుగురికి తకువ కాకుండా వెళ్ళేవాళ్ళం.

అమ్మయిలతో కలిసి వెళ్ళినప్పుదు ఫరవాలేదు గానీ, అబ్బాయిల గుంపుతో వెళ్ళినప్పుడు మాత్రం భయపడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఒకొక్కరోజు దారిపొడుగునా 'వస్త్రాపహరణం' సీనులే .. అసలే అబ్బాయిల గుంపు .. కొంపదీసి ఆ అమ్మాయి అబ్బాయి, మేమేదో సామూహికంగా చెయ్యబోయామని గొడవ చేస్తే? అరిటాకు ముల్లుమీద పడ్డా, ముల్లు అరిటాకుమీద పడ్డా, జనాలు తిట్టేది ముల్లునే కదా?

ఈ పిడకలవేట సరే గానీ, తరవాత వాళ్ళంతా కలిసి స్ట్యూడెంట్ యూనియన్ ఎలక్షన్లలో అమ్మయిలకి రిజర్వేషన్ కావాలి అని గొడవ పెట్టారు. క్లబ్బు రాయుళ్ళకి తిక్కరేగింది .. బుధ్ధుందా లేదా? యూనివర్సిటీ పక్క పల్లేటూళ్ళో అయిటే మద్దతిస్తాం, మన కేంపస్ లో ఎందుకు దండగ అని వ్యతిరేకించారు. అప్పట్లో ఆ పని జరగలేదు. ఇప్పటి పరిస్థితి ఏమిటో తెలియదు. "అమ్మాయిలు గెలిచే సీను లేదో" అని చెప్పి గోల చెశారు. Bermuda క్లబ్బు రాయుళ్ళు వాళ్ళలో ఒక అమ్మాయిని నిలబెట్టారు - ఆ అమ్మాయి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది, as a cultural secretary. పాపం ఫెమినిష్టుల నోళ్ళు మళ్ళీ మూతపడ్డాయి.

ఇలా చెప్పాలంటే చాలా చాలా ఉంది లేంది. కానీ మేమంతా కేంపస్ వదిలేసిన తరవాత, "రేడీకల్ ఫెమినిష్టు వ్యతిరేక" గుంపు నుండి క్లబ్ "స్త్రీ ద్వేష సంఘం" గా మారిందని విన్నా. అలా మారిన ఏ గుంపైనా పతనమవ్వడం ఖాయం - ఆ క్లబ్బుకి కుడా అదే గతి పట్టిందని లేటెస్ట్ న్యూసు. ఇక వారికీ, పురష ద్వేషులైన రేడీకల్ ఫెమినిష్టులకి తేడా ఏముంది?

ఎందుకో మన అక్కయగారి స్క్రీన్ షాట్ట్ చూసాక ఈ ఫ్లేష్ బేక్ అంతా బుర్రలో తిరింగింది. క్లుప్తంగా వ్రాసి పారేశా :)) Shall write about this in detail later.

Feb 20, 2010

"కేరడీ" - మరో మరో కెలుకుడు పేరడీ - "బ్లాగుల్లో కొచ్చి చూడరో"

.
.
.
.
.
.

"ప్రేమంటే ఇదేరా" - "బొంబాయి బొమ్మ సూడరో" పాటకి నా "కేరడీ"





బ్లాగుల్లో కొచ్చి చూడరో నీ సిగతరగా నీ మెదడు కుళ్ళిపోవురో
ఒక్క పోస్టు చదివి చూడరో నీ సిగతరగా ఎర్రగడ్డకి పారిపోనురో


చరణం:

వస్తునే వెల్కం చెబుతా
నీకు టెంప్లేట్ చేసిపెడతా
వందకి పైగా కామంట్లే పెట్టిస్తా
కాగడా పేరడీ వ్రాయించేస్తా

కెబ్లాసలో వచ్చి చేరవోయ్ నీ సిగతరగా కెలుకుడంతా నేర్పుతామురోయ్
నీకన్న తోపు ఎవ్వడొయ్, నీసిగతరగా ఎదుతొస్తే కాలులాగవోయ్


చరణం:

అక్కల వంటలు తినిపిస్తా
కడుపులో మొత్తం దేవిస్తా
మార్తండం బ్లాగు కధలన్నీ చదివిస్తా
పొద్దున తిన్నది కక్కించేస్తా

కూడలిలో వెతికి చూడకోయ్ నీ సిగతరగ ప్రపీసస కానరాదురోయ్
ఇంకానీ కోపికుందటొయ్ నీ సిగతరగా పరమవీర చక్ర నువ్వేనోయ్

ఈ పేరడీ ఆడియో వినే గుండెధైర్యం ఉన్నవాళ్ళు క్రింది బొమ్మలోని లింకును క్లిక్కండి


BLOGULLO
BLOGULLO.wav
Hosted by eSnips



If you have problems accessing the wav file then you may play a relatively low quality MP3 file here

Get this widget | Track details | eSnips Social DNA

.
.
.
.

Feb 18, 2010

త్వరలో

ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా ..... మీకందరికీ తెలుసు ఒకప్పుడు చంద్రబాబు గారు రామోజీ , రాధాకృష్ణ భుజాల మీద తుపాకి పెట్టి కాంగ్రెస్ ని కాల్చేవారని ఒక విమర్సః ఉంది. అర్ధం కాలేదా ...... చంద్రబాబు నాయుడు తను చెప్పాలనుకుంది ఈనాడు ,ఆంధ్ర జ్యోతి పేపర్ల ద్వారా చెప్పేవాడని ..... అంటే ఎదురు కాల్పుల్లో పోతే వారు పోతారుకాని ఈయన కాదు.


అలాగే మన బ్లాగ్లోకంలో ఉన్న చంద్రబాబు వారసులేవరో వారి దెబ్బకి బకారాలైన మూడు కుక్కల గురించి మీకు తెలుసుకోవాలని ఉందా అయితే కిందకి స్క్రోల్ చేయండి
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

సగం దూరం వచ్చారు ఇంకాస్త కిందకి వెళ్ళండి
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
మలక్ పేట్ రౌడీ తరువాత పోస్టు కోసం వెయిట్ చేయండి .

Feb 14, 2010

వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి General Knowledge in Telugu on current Events: కాగడా (Kagada)

(సీ సీ కే రావు గారికి క్షమాపణలతో)


కాగడా వార్తల్లోకి రావడానికి కారణం -- కాగడా మీద ఎదురుదాడి జరిగింది

కాగడా బ్లాగు ఏ సంవత్సరములో మొదలయ్యింది - 2009

కాగడా ప్రవృత్తి - "పరిశుధ్ధమైన" భాషలో పేరడీలు వ్రాయడం

కాగడా కేసులో అనుమానితులు - మలక్, రవిగారు, పవన్

కాగడా కేసులో ప్రధాన నిందితుడు - పవన్

కాగడా బ్లాగంత వివాదాస్పదమైన మరో బ్లాగు - ధూం

కాగడాకి, ధూం కి సారూప్యములు- బ్లాగక్క తో శతృత్వం

కాగడా బ్లాగుని ఇటీవల తొలగించిన ఎగ్రిగేటర్ - హారం

ఇతరవివరాలకి హారమో కూడలో చూడండి

పదవ నెంబరు ప్రమాద సూచిక: అలాస్కా అచ్చమ్మ కబుర్లు

.
.
.
.

మలక్పేట్ రౌడీ: ప్రమాదవనంలోకి కొంత ఉత్సుకతతో, మరికొంత అనుమానంతో భయం భయంగా తొంగి చూస్తున్న వీక్షకమహాశయులకు కెలికాస్కారం. ఈసారి ముందుగా మనం స్వాగతం చెబుతోంది అలాస్కా అచ్చమ్మ గారికి, అచ్చమ్మ గారూ నమస్తే!

అచ్చమ్మ: నమస్తే రౌడీ అన్నా! ఏంటి ఇవాళ నన్ను ముందు పిలిచావు? నీ ఘోస్టు ఎక్కడ?

రౌడీ: అదే ట్విస్టు ఇక్కడ. నిన్ను పిలిచింది ఇది హోస్టు చెయ్యడానికి

అచ్చమ్మ: ఓర్నీ, నన్ను ఇంటర్వ్యూ చేస్తావనుకుని పట్టు చీర, రే బేన్ గ్లేసులు, వంటినిండా నగలూ దిగేసుకునొచ్చాకదయ్యా? ఇప్పుడూ నా మీద ఫోకస్ లేకపోతే ఏలా?

రౌడీ: ఫోకస్ నీమీద ఉంచుకోగల కేపేసిటీ నీకుందని తెలుసులే. ఇక మొదలెడదామా?

అచ్చమ్మ: ఏమిటి మొదలెట్టేది? గెస్టెవరు ఇవాళ?

రౌడీ: ఇవాళ మనకి గెస్టులు అంచెలంచెలుగా వస్తూంటారు - ఇవిగో స్క్రిప్టు పేపర్లు - ఇక మొదలెట్టు . ఈసారి తుంటర్వ్యూ కాస్త సీరియస్. హాస్యం పాలు తక్కువ. సమయాభావం వల్ల కాస్త అతుకుల బొంతలా తయారయ్యింది.



అచ్చమ్మ: సరే సరే. మన మొదటి గెస్టు - కనేటికట్ కాగడా మొగుడక్కయ్య. మొగుడక్కయ్యగారూ నమస్తే

మొగుడక్కయ్య: నమస్తే నమస్తే.

అచ్చమ్మ: ముందుగా, మీ పేరు వెనక రహస్యం చెప్తారా?

మొగుడక్కయ్య: నాకీపేరు పెట్టిన రౌడీనే అడుగు

అచ్చమ్మ: రౌడీ?

రౌడీ: అబ్బే అదేమీ లేదు. బ్లాగుల్లో అక్క, కాగడాకి మొగుడు కదా, అందుకే రెండూ కలిపా. ఏలా ఉంది మన క్రియేటివిటీ?

అచ్చమ్మ: ఏడ్చినట్టుంది. నువ్వూ నీ కుళ్ళుజోకూను. సరే మొగుడక్కా, ఒక మూడూ రోజులపాటు హడావిడి చేశావ్ కదా, నువ్వు సాధించినదేమిటి?

మొగుడక్కయ్య: కాగడా హారం తెంపేశానుగా! అంతకన్నా విజయం ఏమికావాలి

అచ్చమ్మ: ఓహో, మరి పవన్ని బక్రా చేసిందెందుకు?

మొగుడక్కయ్య: పవనే కాగడా, కాగడానే పవన్. ఇద్దరి టైం జోను ఒకటే, ఇద్దరూ ఒకేరోజు బ్లాగులు తెరిచారు

రౌడీ: అమ్మా, తల్లీ, కాగడ ఏడాది క్రితమే బ్లాగుల్లోకొచ్చాడు. కొంతకాలం బ్లాగ్ మూసేసి మళ్ళీ రీఓపెన్ చెశాదు.

మొగుడక్కయ్య: అంత లేదు. నీకేమి తెలియదు గానీ కాస్త తగ్గు

అచ్చమ్మ: మరి మంచుపల్లకిని ఇరికించిందెందుకూ?

రౌడీ: వీళ్ళిద్దరూ మహిళామండలికి వ్యతిరేకంగా ఏదో గోల చేశారు అదీ కచ్చ ..

(బేక్ గ్రౌండ్ లో ఇత్తడి కంఠం - ఇనుముకెక్కువ, కంచుకు తక్కువ)

స్టేలిన్ మావో జిందాబాద్. స్త్రీలందరికీ విరోచనం .. సోరీ .. విమోచనం కావాలి ... స్టేలిన్ మావో జిందాబాద్ .. జిందాబాద్ .. జిందాబాద్ ..

అచ్చమ్మ: వీక్షకులారా, ఈయనే మన రెండో గెస్టు - రాజాధి రాజ, రాజ మార్తాండ, ప్రవతార బిరుదాంకిత, స్త్రీ విమోచన సాధక, వదినవాంఛక డాక్టర్ ప్రనా! ప్రనా గారూ, నమస్తే.

ప్రనా: నమస్తే అన్నది సంస్కృతపదం, హిందువులకి గౌరవ సూచకం - నేను నాస్తికుడిని అందుకే మీకు తిరిగి చెప్పను

అచ్చమ్మ: సరే ప్రనా గారూ, మీరు మీ కధల వల్ల బ్లాగుల్లో చాలా పాప్యులర్ అయ్యారని వినికిడి - ఏవీ మచ్చుకి రెండు కాన్సెప్ట్లు చెప్తారా?

ప్రనా: తప్పకుండా! నా కధల్లో రెండు తప్పనిసరిగా ఉండాలి. ఒకటి - విలన్ పేరు భరద్వాజ, రెండు - వదినా మరుదుల మధ్య ప్రేమ సందేశం

మొగుడక్కయ్య: తల్లిలాంటి వదినతో ప్రేమకలాపాలేమిట్రా త్రాష్టుడా? ఎక్కువ మాట్లాడితే తిట్ల డండకం చదువుతా జాగ్రత్త. లేకపోతే అచ్చమ్మ బ్లాగులో వంటలన్నీ తినిపిస్తా. చచ్చూరుకుంటావ్

అచ్చమ్మ: మొగుడక్కా, శాంతించు. అసలే వంటల జ్యోతిని మెంటల్ జ్యోతి చేశాడు. ఇక నిన్నేం చేస్తాడో.

మొగుడక్కయ్య: నా స్ట్రేటజీముందు వీడెంత?

అచ్చమ్మ: సరేగానీ మొగుడక్కా, ఒక విషయం చెప్పు - నీ వెనకాల ఉన్న లేడీస్ గేంగ్ ఎవరు?

మొగుడక్కయ్య: నా వెనకాలెవ్వరూ లేరు నేను నేనే. నువ్వు నీ జంధ్యాల తిట్ల డండకం వినిపించినా సరే, నా సమాధానం ఇదే.

అచ్చమ్మ: మరి వంటలు మానేసి పెంటల మీద పడ్డావెందుకు?

మొగుడక్కయ్య: వంటల స్పెషలిష్టువి నీకు తెలియదా?

ప్రనా: ఆగండాగండి. ఇంతకీ మీ ఇద్దరిలో బ్లాగక్క ఎవరు? నాకిద్దరూ ఒకేలా కనిపిస్తున్నారు

అచ్చమ్మ: అసలు కనిపిస్తున్నందుకు సంతోషించండి. మొగుడక్క బూతుల బ్లాగుకి కారణాలు ఇవీ అని జనాలు చెవులూ ముక్కులూ కొరుక్కుంటున్నారు

1. కాగడ మీద కచ్చ .. కాగడా ఎవరో తెలియక - తెలిసినవారిమీద దాడి - ఎదురుదాడి చేశామన్న తుత్తి కోసం
2. కాగడానే కాగడా మొగుడి అవతారం ఎత్తడం - తన టీ ఆర్ పీ రేటింగులు పెంచుకోవడం కోసం
3. ఎవరెవరో తెలియని కంఫ్యూషన్
4. మిగతావారి మీద ఉన్న వేరే కచ్చని ఈ విధంగా తీర్చుకోవడం
5. పైవన్నీ
6. శ్రీనివాస్ చెప్పిన కారణాలు

Viewers, మీకు తోచిన సమధానాన్ని కామెంటండి. ప్రైజ్ - మొగుడక్క బ్లాగులోకి ఉచిత ప్రవేశం.

అరే మన తరువాయి గెస్ట్ వచ్చేశారు, టెన్నెసీ తాతారావు గారూ, నమస్తే.

టెన్నెసీ తాతారావు: నమస్తే

అచ్చమ్మ: వీరి బధ్ధ విరోధి కొలంబస్ కోదండం గారికి కూడ స్వాగతం

కొలంబస్ కోదండం: నమస్తే.

అచ్చమ్మ: తాతారావుగరొక సమైక్యవాది, కోదండంగారేమో ఒక వేర్పాటువాది. ఇప్పుడు వీరిద్దరూ కొట్టుకుంటారు - తూచ్ - చర్చించుకుంటారు. అన్నట్టు వీరిద్దరికీ చిన్నపేర్లంటే ఇష్టమండోఇ - అందుకే తాతారవు గారిని "తా", కోదండం గారిని "కొ" అని పిలుద్దాం.

తా: ఏమిటండీ అసలు? అతి తక్కువ శాతమున్న ఆంధ్రులు తెలంగాణావారిని దోచేస్తున్నారంటే నమ్మకంగా ఉందా? దోపిడీ నెపంతో ఆంధ్రులపై ద్వేషం వెళ్ళగక్కుతున్నారు. నేనడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా?

కో: ఏమీ కాదు. కావాలంటే మీప్రశ్నలన్నిటీకీ సమాధానం ఈ లింకుల్లో ఉంది చూడండి

తా: అరే! నేను ప్రశ్నలడగకుండానే సమాధానం ఉందంటారేమిటి?

కో: మీరడిగే ప్రశ్నలు నాకు ముందే తెలుసుగా

తా: మీ తెలంగాణావారందరూ తాగుబోతులు. బధ్ధకస్తులు. దగుల్బాజీలు.

అచ్చమ్మ: తా గారూ, మీ ఆరోపణలకి ఆధారం ఏమిటి? లెక్కలేమన్నా ఉన్నాయా?

తా: నా లెక్కలు నావి నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు

కో: చూసారా? ఇదీ ఆయన వరస. Hyd లో తెలంగాణేతరులు ఎక్కువున్నారు. వారే తాగుతున్నారు. తెలంగాణవారు పాలు తప్ప ఇంకేమీ తాగరు.

తా: అబ్బా, ఛా?

కో: మరే, కావాలంటే లెక్కలు చూడండి. స్థానికులెంతమందో స్థానికేతరులంతమందో తెలుసుకుని మాట్లాడండి

రౌడీ: అంటే స్థానికులకంటే స్థానికేతరులే ఎక్కువంటున్నారా?

కో: (స్వగతం) అమ్మో, పెద్ద చిక్కొచ్చిపడింది. స్థానికేతరులెక్కువ అంటే, ఒక ఇబ్బంది లెకపోతే తా గారి లెక్కల్ని ఒప్పుకోవాల్సి వస్తుంది - ఇప్పుడెలా? )

అబ్బే నేనలా అనలేదు. స్థానికుల స్థానికేతరుల లెక్కలని పరిగణలోకి తీసుకోమన్నాను అంతే.

రౌడీ: సరే, తా గారూ, కో గారూ, మీ పోరాటం కేవలం హైదరాబాదు కోసమని ఆరోపణ. ఏమమటారు

తా: అబధ్ధం. నాకు కావాల్సింది సమైక్యాంధ్ర.

కో: ముమ్మాటికి తప్పు. మాకు కావాల్సింది మొత్తం తెలంగాణా.

రౌడీ: సరే, తా గారూ తెలంగాణానుండి హైదరాబాద్ ని విడగొడితే, మీరు తెలంగాణా కి మధ్ధతిస్తారా?

తా: కష్టమే గానీ సర్దుకుపోతాం

రౌడీ: కో గారూ, హైదరాబాద్ లేకపోతే తెలంగాణా కి వారొప్పుకుంటున్నారు, మీరేమంటారు?

కో: హైదరాబద్ లేని తెలంగాణ మాకొద్దు.

రౌడీ: అదేమిటండీ? హైదరాబాద్ అంటే ఒకటో రెండో జిల్లాలేగా? ఈ గొడవ తేలేదాకా దానిని పక్కన పెట్టి మిగతా తెలంగాణా తీసుకోవచ్చుగా? మిగిలిన జిల్లాలు జిల్లలు కావా? మిగిలిన వారు మనుషులు కారా?

కో: హైదరాబాద్ తెలంగాణా లో అంతర్భాగం. అది లేని తెలంగణా మాకొద్దు

రౌడీ: మరి కర్నాటకకి, మహరాష్ట్రకి జిల్లాలని వదులుకున్నారుగా?

తా: విడిపోయిన రాష్ట్రాలకెప్పుడూ రాజధాని దక్కలేదు

రౌడీ: అంటే మీ ఇద్దరికీ సమైక్యాంధ్ర, తెలంగాణాల మీద ప్రేమ కన్నా హైదరాబాద్ భూములమీద మమకారం ఎక్కువ. తమ ఆస్థులు ఎక్కడపోతాయో అని తా గారు, రియల్ ఎస్టేట్ చీప్ గా కొట్టెయ్యచ్చని కో గారు .. అంతేగా?

నిజంగా సమైక్యాంధ్ర మీద ప్రేముంటే తా గారు హైదరబాద్ ని విడగొట్టడానికి ఒప్పుకునేవారు కాదు. అలగే కో గారికి తెలంగాణా మీద ప్రేముంటే ముందు హైదరాబాద్ ని పక్కన పెట్టి మిగిలిన జిల్లాలని సాధించుకునేవారు. తరవాత హైదరబాద్ గురించి పోరాడేవారు. తొమ్మిది జిల్లాల పోరాటం ఒకటిన్నర జిల్లాలకి పరిమితమయ్యేది.

తా గారికి హైదరాబాద్ తప్ప తెలంగాణా అక్కరలేదు, కో గారికి హైదరాబాద్ తప్ప తెలంగాణాలో మిగిలిన జిల్లాలు అక్కరలేదు. ఇంతా చేసి వెర్రి వెధవలయ్యింది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మెహ్బూబ్నగర్ ప్రజలేగా?

వేర్పాటువాదులు సమైక్యవాదులు కలిపి కోస్తోంది "కో" "తా" - కోతలే!

తమిళనాడు నుండి విడిపోవడానికి "ఊ" కొట్టిన వారు తెలంగాణా విడిపోడానికి "ఊహూ"!

తెలంగాణా విడిపోవడానికి "ఊ" కొడుతున్న తెలగాణ్యులు హైదరాబాద్ విడిపోడానికి "ఊహూ"!!



అచ్చమ్మ: నాయనా రౌడీ, నీ సుత్తాపెహే. ఛాన్సు దొరికింది కదా అని స్పీచ్లిస్తున్నావ్.

(ఇంతలో ఏదో పైనుండీ "ధబేల్" మంటూ క్రింద పడ్డ శబ్దం)

అచ్చమ్మ: ఇతనెవరు? పక్క ద్వారాల్లోంచి రాకుండా పైనుండి కప్పు చీల్చుకుని మరీ వచ్చాడు?

రౌడీ: ఇతనే మన బ్లాగుల్లోనున్న ఏకైక డిఫెక్టివ్... సోరీ... డిటెక్టివ్ వికటకవి రాజేష్.

అచ్చమ్మ: అబ్బో, ఏమేమి అపరాధ పరిశొధనలు చేశాడేమిటి?

రౌడీ: చాలా ఉన్నాయ్:

* తాడేపల్లి గారే ధూము, దుర్గేశ్వర గారే కాగడా అని, సెన్సేషన్ క్రియేట్ చేసి పాదరక్షాఘాతాలు, అదే చెప్పు దెబ్బలు తిన్నాడు

* మలక్ ఏకలింగం ఒకరే అని తేల్చేశాడు

* పైత్యావలోకనం బ్లాగును హేక్ చేసింది పెట్టుబడి దారు జార్జ్ బుష్ అని కనిపెట్టాడు

* ప్ర నా కి వ్యతిరేకంగా ఒబామా, సీ ఐ యే, బ్రిటిష్ ప్రభుత్వం పన్నిన కుట్రని విఫలం చేశాదు.

* ఇప్పుడు కొత్తగా వచ్చిన బోడిలింగం బ్లాగును పట్టుకోబోతున్నాడు


అచ్చమ్మ: అలాగా! స్వాగతం డిటెక్టివ్ రాజేష్ గారూ! ఈ బోడిలింగ రహస్యాన్ని ఎలా ఛేదించబోతున్నారు?

రాజేష్: ఇది నా ఎడమ చేతి పని. కాగడా మొగుడి లిస్టులో ఏకలింగం పేరు లేదు అన్న వాదనని పట్టుకుని ముందు జాగ్రత్త గా ఈ సారి పకడ్బందీ ప్రణాళిక తొ ఈ బ్లాగు పెట్టారు.

అచ్చమ్మ: కొంపదీసి కోడిహళ్ళి మురళీమోహన్ గారో, ఆచార్య ఫణీంద్రగారో ఈ పని చేశారని తేల్చరుకదా?

రాజేష్: అరే! నేను అదే రూట్లో ఆలోచిస్తున్నా. మీరెలా కనిపెట్టేశారు.

అచ్చమ్మ: తమ ఘన చరిత్ర చూసి.

రాజేష్: థేంక్యూ, థేంక్యూ.

అచ్చమ్మ: (స్వగతం: ఒరేయ్ వెధవాయ్, నేను నిన్ను పొగడలేదు, తిట్టాన్రా) దీని తరవాత ఏం పరిశొధన చెయ్యబోతున్నారు?

ప్రనా: ఏహే, ఇదంతా ఎందుకు? బోడిలింగం వదిన పేరు చెప్పు, బోడిలింగమేవరో నేను క్షణాలలో చెప్తా

అచ్చమ్మ: అబ్బా ప్రనా! మీరుండండి. రాజేష్, మీరు చెప్పండి

రాజేష్: చాలా ఉన్నాయండీ, ముఖ్యమైనది మార్తాండ జన్మ రహస్యం

అచ్చమ్మ: అలాగా? దాని గురించి కాస్త విశదీకరిస్తారా?

రాజేష్: తప్పకుండా. మార్తాండుడు పుట్టే సమయంలో బ్రహ్మ దేవుడు స్టేలిన్ మావోల సినిమాలు చూస్తున్నాడా, లేక రంగనాయకమ్మ, చలం నవలలు చదువుతున్నాడా అన్న దిశలో పరిశొధన సాగిస్తాను. దానిని బట్టీ మనకి చాలా విషయాలు తెలుస్తాయ్.

ప్రనా: నేనొప్పుకోను. వారిద్దరూ నాకే స్వంతం.

అచ్చమ్మ: ఏమిటది? ఇద్దరు హీరోయిన్లున్న హీరో డైలాగులా?

ప్రనా: సారీ సారీ, వారిద్దరి పరిజ్ఞానం నాకే స్వంతం. బ్రహ్మదేవుడు చదవడానికి వీల్లేదు. లేక పోతే బ్రహ్మదేవుడి వదిన మీద కొత్త జిగురు - అంటుకుంటే వదలదు - అనే కధ వ్రాసి బ్రహ్మదేవుడిని ఓడిస్తా.

అచ్చమ్మ: కధ వ్రాసి బ్రహ్మదేవుడిని ఓడిస్తారా? మీరు నాస్తికులేమో కదా?

ప్రనా: ఉబుంటూ తెలిసినవారికి ఇది చాలా తేలిక. సహాయం కావాల్సిన వారు నాకు ఫోన్ చేస్తే నేను సహాయం చెయ్యగలను

అచ్చమ్మ: ఉబుంటూకి బ్రహ్మదేవుడికి ఏమిటి సంబంధం?

ప్రనా: విలన్ భరద్వాజ్ కాబట్టీ!

అచ్చమ్మ: ఒక విషయానికి, తరవాత దానికి సంబంధంలేకుండా మాట్లాడుతున్నారేంటి?

ప్రనా: కావాలంటే నా లింకులు చూడండి. లండన్ లో "జూనియర్ డాక్టర్" మాటలు మీరు వినాలి

అచ్చమ్మ: లండన్ లో జూనియర్ డాక్టర్లు ఉంటారా?

ప్రనా: లియో టాల్స్టాయ్ కధలు చదివిన హేతువాదులు ఇలాంటి ప్రశ్నలడగరు

అచ్చమ్మ: రౌడీ, నాకు పిచ్చెక్కుతోంది. టాపిక్ మారుస్తున్నా - ఇప్పుడు సమస్యాపూరణం

రౌడీ: చచ్చితిని. రవిగారు, జ్యోతి అని కాకుండా కాస్త మంచిది ఇవ్వు

అచ్చమ్మ: సరే, సరే .. ఈ సారి సమస్య .. "కాగడాకు పవను మిత్రుడగును" - పద్యం ఛందోబధ్ధంగా ఉండక్కరలేదు - కాస్త పద్యంలా వినబడితే చాలు.

రౌడీ: మళ్ళీ నన్ను ఈ వివాదంలోకి లాగాలని చూస్తున్నావా?

సరే, వివాదంతో సంబంధంలేకుండా చెప్తా ...






శాస్త్రవేత్తలు చెప్పె నగ్నిదేవునకెపుడు
ఆక్సిజన్ను ప్రాణప్రదము గాన
ప్రాణవాయువుతోడ కణకణా మండేటి
కాగడాకు పవను మిత్రుడగును


(శాస్త్రవేత్తలు చెప్పినట్టు మంటకి ఆక్సిజన్ ప్రాణప్రదం కాబట్టీ, దానితో మండే కాగడాకి పవనుడు, అంటే వాయుదేవుడు, మిత్రుడు అని భావము)


అచ్చమ్మ: సరే, ఇక పేరడీ టైం - రౌడీ, పేరడీ వదులు:

రౌడీ: ( పాతాళ భైరవి - కలవరమాయే మదిలో ట్యూనులో)


కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో
హారంలో ఇది సంచలనమాయే
బ్లాగర్లంతా సతమతమాయే

కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో


చరణం:

కాగడాకే మొగుడిని అంటూ
కొత్తవతారం వచ్చింది
కాగడాకే మొగుడిని అంటూ
కొత్తవతారం వచ్చింది
ఉరిమి ఉరిమి మంగళమైన
పవను మీద పడెనయ్యయ్యో

కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో


చరణం:

ఎంకికి పెళ్ళే సుబ్బి చావని
బ్లాగ్లోకం కోడై కూసింది
ఎంకికి పెళ్ళే సుబ్బి చావని
బ్లాగ్లోకం కోడై కూసింది
కాగడానే పవనుడంటూ
సడేమియా సందడిలో


కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో
హారంలో ఇది సంచలనమాయే
బ్లాగర్లంతా సతమతమాయే

కలకలమాయే గదిలో ఈ గదిలో
కలకలమాయే గదిలో బ్లాగ్గదిలో


అచ్చమ్మ, రౌడీ: గెస్టులకి ధన్యవాదాలు. ఇంతసేపూ ఈ సుత్తిని ఓపికతో వీక్షించిన వీక్షకులకి కూడా. సమయాభావంవల్ల దీనిని పూర్తిగా వ్రాయలేకపోయాం. వచ్చే తుంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకూ కెలవ్.

.
.
.
.

Feb 10, 2010

ఈ కెలుకుడు బ్లాగు పెట్టి ఏడాదయిన సందర్భంలో అలాస్కా అచ్చమ్మ గారి తుంటర్వ్యూ - త్వరలో ..

  




తరువాయి ప్రమాదసూచిక కోసం చూస్తునే ఉండండి :))


PS: ఈ మధ్య కాలంలో ( అంటే అక్టోబర్ 2009 ) నుండీ కెలకడానికి సరియైనవారులేక ఈ బ్లాగు మూతపడుతుందేమోననే భయంతో ఉన్న మాకు కెలికే అవకాశం కల్పించిన శ్రీమతి కాగడామొగుడక్కయ్యగారికి కృతజ్ఞతలు :))

.
.
.
.

కెబ్లాస ఎన్నికలు

ప్రియమైన బ్లాగురాలా కెబ్లాస ఎన్నికల నామినేషన్ లలో మంచు పల్లకి , నాగ ప్రసాద్ గార్లు మాత్రమే చివరాఖరు వరకు నిలిచినప్పటికీ .. గత రెండు రోజుల్లో బాగా పాపులర్ అయిన కత పవన్ కుమార్ నాయుడు అనూహ్యంగా ముందుకు రావడంతో ఈ ముగ్గురి మద్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంది.

కెబ్లాస అధ్యకుని గా మీ వోటు ఎవరికి

అ ) నాగప్రసాద్

ఆ) మంచు పల్లకీ

ఇ ) కత పవన్ కుమార్ నాయుడు
అధ్యక్ష ఎన్నికలకు వోటింగ్ ముగిసే సమయం గురువారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఏడు గంటలు.

వోట్లు ఎక్కువగా పడ్డవారినే ఎన్నుకునే అధికారం మలక్ ఇంకా శరత్ లకు ఉంది.

గమనిక : ఒకరు ఒక వోటు వేయవలయును .... అనామకుల వోట్లు చెల్లవు

Feb 6, 2010

యేమని పిలుస్తాడు

కజిరేసన్ ఒక మలయాళీ అతను అర్జంట్ పణి మీద బెస్ ఎగ్గి హాయిదరాబాద్ వచ్చాడు. అక్కడ కనపడ్డ కేసిఆర్ కి హలో చెప్పాడు . వెంటనే టిఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. గుయ్యో మొర్రో అనుకుంటూ బంజారాహిల్ల్స్ వచ్చిన కజిరేసన్ కి అక్కడ కెవిపి రామచంద్రరావ్ కనిపించారు . వెంటనే ఆయన్నే పలకరించిన కజిరేసన్ ని వంచి వంచి గుద్దారు కెవిపి.

ఇంతకి కజిరేసన్ కేసిఆర్ ని కెవిపి ని యేమని పిలిచాడు ????? సరైన సమాధానం రాసిన వారికీ మార్తాండ కొత్త కధలో మెయిన్ కారెక్టర్ ఇప్పించ బడును.

గమనిక : శరత్ ని క్లూ అడక్కూడదు.