Apr 26, 2009

ఒబామహాభారతం - లఘునాటిక - నాలుగవ భాగం

(అందరూ మళ్ళీ టైం మషీన్ లో)

రెహ్మాన్: ఒబామా గారూ, ఈ సారైనా కొంచం జాగ్రత్తగా
పోనివ్వండి. పొరపాటున డైనాసోర్ల యుగానికి తీసుకెళ్ళీపోతే మన పని “జింతాత జిత చిత జింతాత థా”

ఒబామా: జింతాత అంటే?
( అందరూ జింతాత దరువెయ్యడం మొదలు పెడతారు )

ఏంథోనీ: జింతాత అంటే లాఠీ, జిత చితా అంటే ఫేసు జింతాత థా అంటే పచ్చడి పచ్చడి కింద కొట్టడం

ఒబామా: ఒక్క ముక్క అర్ధం కాలేదు

ఋఎహ్మాన్: అబ్బో అదో పెద కధ లెండి – అదంతా తరవాత చెప్తా గానీ ముందు మీరు పోనివ్వండి

ఓబామా: అలాగే అలాగే

అక్బర్: ఇదంతా సరే గాని మరి నా కుక్కో?

అమర్ కింగ్: అరే చుప్. మహాభారతంలో వదిలేద్దామనుకున్నాం గా - మళ్ళీ మాట్లాడితే నీ కుక్క చేట నిన్నే కరిపిస్తా

అక్బర్: వద్దులే

ఏంథోనీ: అయ్యా ఈ కుక్కని చూస్తుంటే అప్పుడెప్పుడో వచ్చిన తేరీ మెహెర్బానియా అనే సినిమా గుర్తొస్తోందండీ

అమర్ (డొక్కుంటూ): ఉవ్వక్ – ఊవ్వక్ థూ – ఆ దిక్కుమాలిన కుక్క సినిమాని గుర్తు తెచ్చి డొకులు తెప్పిస్తావా? నీ సంగతి తరవాత చూస్తా

(కాసేపయ్యాక)

అక్బర్: అబ్బా!!

అమర్: ఏమిటీ సంగతీ?

ఏంథోనీ: అక్బర్ ఏద్చాడు

అమర్: నడ్డి మీద రెండు తగిలించు

ఏంథోనీ: నువ్వుండవయ్యా! ఆఅయన్ని దోమ కుట్టినట్టుంది
ఒబామా: అయ్యో దోమ! అమ్మో దోమ! స్వైన్ ఫ్లూ బాబోఇ!

రెహ్మాన్: ఒబామా గారూ – ఊరుకోండి. శ్వైన్ ఫ్లూ దోమలవల్ల రాదు – అదీ కాక ఇది ఇండీయా దోమ – మెక్సికన్ ది కాదు

ఒబామా: ఏమో, అయినా ఇక్కడీకి దోమెలా వచ్చింది

ఏంథోని: అమర్ గారి ముంబాయి పర్యటన పర్యావసానం

రెహ్మాన్: ఏమిటో – ఈ దోమని చూస్తుంటే ఆ తెలుగు షార్పీ పట్నాయక్ గారి పాట వేసుకోవాలనిపిస్తోంది

అమర్: వేసుకోండి అయితే

రెహ్మాన్:

చెప్పవే ప్రేమ, చెలియ చిరునామా .. చీ చీ ..

________________________________


కుట్టకే దోమ, చెయ్యకే హంగామా

ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడూన్నా

కుట్టకే దోమ, చెయ్యకే హంగామా

ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడూన్నా

వంటింట్లో నువ్వే, నట్టింట్లో నువ్వె, పడకింట్లో నువ్వే

మా ఇల్లంతా నువ్వే .. ఒహో హో


ఇప్పుడే ఎవరినో కుట్టావనే సంగతీ

పిల్లల ఏడుపూ నాకు చెబుతున్నదీ

ఇప్పుడే ఎవరినో కుట్టావనే సంగతీ

పిల్లల ఏడుపూ నాకు చెబుతున్నదీ

మార్టీను ఎంతకొట్టినా, టార్టాయిస్ మంట పెట్టినా

మార్టీను ఎంతకొట్టినా, టార్టాయిస్ మంట పెట్టినా

చావవే నిన్ను చంపేదెలా .. ఆ .. ఆ .. ఆ .. ఆ ..

కుట్టకే ||

ఒబామా: పాటలు సరేగానీ భారతం వచ్చేసింది దిగండి


(సశేషం)

Apr 23, 2009

ఆరవ నెంబరు ప్రమాద సూచిక - ప్రమాదవనం వాణిజ్య ప్రకటనలు

వీక్షకులకు మళ్ళీ నమస్కారం - చాలాకాలం తరవాత కలిశాం కదా?

మన తెలుగు బ్లాగుల పాపులారిటీ తగ్గిపోతొందని భావించి ఏమైనా వాణిజ్య ప్రకటనలు ఇప్పిస్తే హిట్లు పెరుగుతాయన్న ఉద్దేశ్యంతో ఈ మధ్య మేము కొంతమంది ప్రకటనదారులని సందర్శించడం జరిగింది. ఇవిగో వారు సూచించిన ప్రకటనలు:

_________________________________________________________________________


బ్రూ:

బ్లాగు చాలా వేడిగా ఉంది - చాలా ఘాటుగా ఉంది - ఇదే బ్లాగు?

ఇది మన శ్రీకాకుళం మార్తాండ బ్లాగు

అచ్చం నా రేడికల్ బ్లాగులానే ఉంది

అంతే గాదు ఈ బ్లాగు డైనమిక్ కూడా - రోజుకి వంద టపాలతో

_________________________________________________________________

చార్మినార్ రేకులు:


ఏంటి ధూమయ్యా అంత దీర్ఘంగా అలోచిస్తున్నావ్?

ఆ ఏమీ లేదు నా పక్కవాడి బ్లాగుని ఎలా కెలుకుదామా అని

ఇందులో ఆలొచించడానికేముంది? ఈ తెలుగు అనో రమణారెడ్డి అనో ఆరోపణలు చేసెయ్యి - మా నాన్నగారు కెలికిన బ్లాగు నిన్ననే మూతపడింది


__________________________________________________________________


గంగా వాటర్ ఫిల్టర్:

హద్దులేని శృంగారం
మీకెంతో హానికరం
శరత్ బ్లాగులో ఫిల్టర్
కాపాడును మీ ఆరోగ్యం

___________________________________________________________________

3 రోసెస్:

చాలు - ఇక ఆపండి!

ఈ బ్లాగులో వంటలు లేవు
వంటలుంటే పాటలు లేవు
పాటలుంటే పోట్లాటలు లేవు

ఈ మూడూ గుణాలు కలిగిన బ్లాగేమన్నా ఉందా?

మూడు గుణాల జ్యోతి బ్లాగ్!!!!

____________________________________________________________________

కోరొమాండల్ గ్రోమోర్:

బ్లాగుకు సేవ - లేనిది రొక్కం: కూడలి

_____________________________________________________________________

వుడ్‌వార్డ్స్ గ్రైప్ వాటర్:

ఏమిటీ సంగతీ?
ఆవిడ ఏడ్చింది
కాగడా బ్లాగు తీసెయ్యమని గూగుల్ వాళ్ళకి చెప్పు. చిన్నప్పుడు నీ బ్లాగుమీద కూడ ఇలాగే కంప్లైంట్ ఇచ్చా

______________________________________________________________________

నిర్మా:

వాషింగ్ పౌడర్ నిర్మా
తిట్ల కాగడా శర్మ
బ్లాగుల లోనీ మురికీ
అతనికే కనిపించింది
అందరినీ ఉతికి ఉతికి
తనకే ఎసరయ్యింది
ఎవరో కర్త, ఏమిటొ కర్మా ..
వాషింగ్ పౌడర్ నిర్మా

_______________________________________________________________________

కోల్గేట్ పళ్ళపొడి:

కర్కశంగా గరుకుగా ఉండే బ్లాగులు మీ మెదళ్ళకి హాని కలిగించవచ్చు - కానీ రెండు రెళ్ళు ఆరు బ్లాగ్ -

అందరినీ నవ్విస్తుంది
నేల మీద దొర్లిస్తుంది
తోటరాముడు రాస్తుండే
రెండు రెళ్ళు ఆరు బ్లాగ్
ఆహా రెండు రెళ్ళు ఆరు బ్లాగ్ !!!